AP Elections 2024
-
వైఎస్ జగన్ ఓడిపోవడమేంటి?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.పవన్‌కల్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. -
జగనన్న ఎలా ఓడిపోయాడు..గోదావరిలో దూకి చస్తాం..
-
ఈవీఎం గోల్ మాల్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనుమానాలు
-
నా విజయానికి కారణం జగనన్నే..
-
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
కేంద్ర కేబినెట్ కూర్పు.. ఏపీకి ఎన్ని?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్‌తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. -
ఊహించని పరిణామం..!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాతీర్పు ఊహించని పరిణామంగా నిలిచింది. ఆయా అభ్యర్థులు గెలుపుపై విశ్వాసం, ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఈ స్థాయిలో ఓటమి చవిచూస్తామని లేదా ఆ స్థాయి మెజార్టీ సొంతం చేసుకుంటామని ఎవ్వరు కూడా అంచనాకు రాలేదు. ఎవ్వరికీ కూడా ప్రజానాడి అంతుచిక్కలేదు. తుదకు జిల్లాలోని రాజకీయ విశ్లేషకులు సైతం అనూహ్య పరిణామాన్ని అంచనా వేయలేకపోయారు. అంతెందుకు విజేతలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెరసి ఓటర్ల తీర్పుపై సమీక్ష చేసుకుంటున్నారు.ఉమ్మడి కడప జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోట. 2014, 19 సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఏనోట విన్నా మరోమారు జిల్లాలో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం అదే అంచనాతో ఉండిపోయాయి. ఫలితాలు వచ్చే కొద్ది ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ 3 సెగ్మెంట్లకు మాత్రమే పరిమితమైంది. 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందనే ధీమా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం లేదని పలువురి అభిప్రాయం. ప్రస్తుతం అనూహ్య పరిణామాలపై ప్రజాతీర్పు పట్ల ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.ధీమాకు మించిన విజయం... ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి ఈమారు ఆ మూడు స్థానాల్లో గెలుస్తామనే ధీమాను టీడీపీ వ్యక్త పర్చేది. ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురంలో విజయం సాధిస్తామని ఆశించేవారు. ఎన్నికల గడువు సమీపించే కొద్ది ఆ ధీమా సైతం సడలిపోయింది. మరోమారు ఓటమి చవిచూస్తామనే బెంగ కూడా ఆ పారీ్టలో లేకపోలేదు. పోలింగ్ ముగిశాక అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు చెప్పినా, ఉండవయ్యా గెలుపొందాక చూద్దామనేవారు. విజయం సాధిస్తాం, మెజార్టీ 5వేలు పైనా అటు ఇటుగా ఉంటుందని చెప్పేవారు. అలాంటి పరిస్థితి ఉండగా ఫలితాల్లో ఊహించని మెజారీ్టని సొంతం చేసుకున్నారు. ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని వైఎస్సార్సీపీ అభ్యర్థులు అస్సలు పసిగట్టలేదు. భారీగా అనుకూలత ఉందని టీడీపీ అభ్యర్థులు కూడా అంచనాకు రాలేదు. అభ్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ తీర్పు రావడం విశేష పరిణామం.రాయచోటిలో అనూహ్య తీర్పువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటి జిల్లా కేంద్రమైంది. విశేష అభివృద్ధి సాధించింది. తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించింది. అన్ని రంగాల్లో రాయచోటి దూసుకుపోయింది. మరోవైపు ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతం. తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తులతో పాటు గుర్తింపు పొందిన ఓ స్థాయి నేతలు పార్టీ ఫిరాయించారు. ఇలాంటి అనుకూలతలన్నీ ఉన్నప్పటికీ రాయచోటిలో టీడీపీ విజయాన్ని దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే రాయచోటిలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని 10కి 7 ఇస్తే చాలంటూ పెద్ద ఎత్తున జిల్లాలో పందేలు నడిచాయి. అంటే రాయచోటి మీద జిల్లా వ్యాప్తంగా అంచనా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పులివెందుల, బద్వేల్, రాయచోటిలో వైఎస్సార్సీపీ ఏకపక్షమే అన్నంత విశ్వాసం ఉండేది. అలాంటి చోట కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఊహించని పరిణామంపై వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయిలో çసమీక్షిస్తుండగా, ఆ స్థాయి మెజార్టీ దక్కడానికి కారణాల అన్వేషణలో టీడీపీ విజయసారథులుండడం విశేషం. -
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు గురువారం కలిశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గురుమూర్తి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరిపారు. -
ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలన్నారుచంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి.. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదు.. విశాఖలో పుట్టిన వ్యక్తిగా మేం ప్రజలకు అండగా ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం కూటమి ప్రభుత్వానికి సమయమిస్తాం... ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎం జగన్ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశారు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ప్రజలకు ఇంటి దగ్గరికే పథకాలు వచ్చేలా చేశారు. గాజువాక అభివృద్ధి కోసం గెలిచిన అభ్యర్థికి సహకరిస్తా. ఏపీకి విశాఖ కీలకం.. ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలి విశాఖ నగరానికి ఉన్న అంశాలు, అవకాశాల్ని కూటమి గుర్తించాలి. రామయ్య పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ఈ కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. అమరావతి వద్దు.. విశాఖ ఒకటే అనలేదు. విశాఖతో పాటు కర్నూలు, అమరావతిని అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెప్పింది’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
అభ్యర్థుల కంటే నోటాకే అధికం
యలమంచిలి రూరల్: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ, వైఎస్సార్సీపీ వంటి ప్రధాన పారీ్టల అభ్యర్థులను మినహాయిస్తే ఇతర పారీ్టలు, స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రజల మద్దతును పొందడంలో విఫలమైన ఆ 13 మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. వారికి పోలైన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉండడం విశేషం. పలకా శ్రీరామ్మూర్తికి 19,157, వేది వెంకటేష్ కు 24,833, నమ్మి అప్పలరాజుకు 2589, ఆడారి శరత్ చంద్రకు 1886, వడ్లమూరి కృష్ణస్వరూప్‌కు 3549, కర్రి విజయలక్ష్మికి 1578, తుమ్మగుంట అప్పలనాయుడుకు 1055, గారా సత్యారావుకు 3116, జున్నూరి జె శ్రీనివాస్‌కు 1195, డాక్టర్ తుమ్మపాల హరిశంకర్‌కు 1567, పెట్ల నాగేశ్వర్రావుకు 2179, సిద్ధా లోవరాజుకు 3845, వంకాయల రామచంద్రరావుకు 4001 ఓట్లు పోలవ్వగా వీరందరి కంటే అధికంగా నోటాకు 26,235 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా మాడుగులలో 4880 ఓట్లు, అత్యల్పంగా అనకాపల్లిలో 1924 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అసెంబ్లీల పరిధిలో నోటాకు వచ్చిన ఓట్లు 20,111 జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెండు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 4,107 రాగా..అత్యల్పంగా అనకాపల్లిలో 1,853 వచ్చాయి. యలమంచిలిలో 2,409, చోడవరంలో 3,849, మాడుగులలో 4,070, నర్సీపట్నంలో 3,824.. మొత్తం 20,111 ఓట్లు నోటాకు పడ్డాయి. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
ఎన్డీఏతోనే మా ప్రయాణం: చంద్రబాబు
సాక్షి, విజయవాడ: కూటమికి విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏతోనే తమ ప్రయాణం అని.. ఇవాళ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నానని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, కానీ ఇది చారిత్రాత్మక ఎన్నికగా పేర్కొన్నారు.రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయన్న చంద్రబాబు.. కూటమికి 58 శాతం ఓట్లు వచ్చాయని.. ఇది ఊహించని పరిణామం అన్నారు. కమిట్మెంట్, త్యాగాల ఫలితమే కూటమి గెలుపు. సూపర్ సిక్స్ ఇచ్చాం. మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి’’ అని చంద్రబాబు చెప్పారు. -
ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం.. ప్రజాసేవలో మమేకం అవుతాం: కాకాణి
సాక్షి, నెల్లూరు: ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా వైఎస్ జగన్ అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. రాజీపడకుండా విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారని.. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదన్నారు.‘‘పేదవానికి అండగా నిలిచాం.. పథకాలు అందుకున్న ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తాం.. వైస్సార్‌సీసీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం.. ప్రజాసేవలో మమేకం అవుతాం.. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం.. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి అండగా ఉంటాం.. ఆయన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను పార్టీలతో, కుల మతాలతో సంబంధం లేకుండా అందించాం’’ అని కాకాణి చెప్పారు. -
AP: ఈవీఎంల మార్పిడి జరిగిందా?
పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బూటకపు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ చెప్పారు. వీటిని చీకట్లో జరిగిన ఎన్నికలుగా పరిగణించాలన్నారు. ఎన్నికల కమిషన్‌పై న్యాయసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ కుట్ర చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తక్షణం ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువులో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని కోరారు. ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీచేసిన రెండుచోట్ల లక్షల్లో మెజార్టీ రావడం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నారు.ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వేసంస్థలు వెల్లడించాయని చెప్పారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారన్నారు. లక్షలాదిమంది ఓటర్లున్న వైఎస్సార్సీపీకి కేవలం ప్రతిపక్ష హోదాకు తక్కువగా అసెంబ్లీ సీట్లు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందు నుంచి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. తనపై కేసు నమోదు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. -
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
తాడేపల్లి: ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీనామా చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి అనంతరం రాజీనామా చేశారు వైఎస్ జగన్. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు వైఎస్ జగన్.అంతకుముందు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపించాం. మేనిఫెస్టోను పవిత్రంగా భావించాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగిన మంచి చేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, పేదవాడికి తోడుగా.. అండగా ఎప్పుడూ నిలబడతాం’’ అని వైఎస్ జగన్ గద్గద స్వరంతో చెప్పారు.పెద్ద పెద్ద నేతల కూటమి ఇది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గొప్ప విజయానికి కూటమి నేతలకు అభినందనలు. నా తోడుగా నిలబడిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకి, స్టార్ క్యాంపెయినర్ నా అక్కచెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఏం చేసినా, ఎంత చేసినా ఇంక 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం పోరాటాలు చేయడం నాకు కొత్త కాదు. ఎవరూ అనుభవించని రాజకీయ కష్టాలు అనుభవించా. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా సిద్ధం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఎదురుగాలి ఎందుకంటే?
గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైఎస్సార్సిపికి ఈ సారి అనూహ్యమైన ఫలితాలను చవి చూసింది. సంక్షేమం, అభివృద్ధి అన్న రెండు అంశాలతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్సార్సిపి తాను అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ ఫ్యాన్‌కు ఎదురుగాలి వీచింది.వైఎస్సార్సీపీ ఓటమికి కారణాలు:వైఎస్సార్సిపికి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే.. వాటికి తోడ్పాటుగా మిగతా పార్టీలు మారడంకూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవడం, నెరవేర్చలేని హామీని ఇవ్వలేనని చెప్పడంల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడంసచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను ఎదుర్కోలేకపోవడంకరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడంపార్టీలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడడంఅందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప.. వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడంసామాజిక సమీకరణంలో భాగంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంమూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం -
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండడం.. ఆర్థికంగా పరిపుష్టమైన వనరులు ఉండడం.. అన్ని వ్యవస్థల నుంచి సహకారం అందడం వంటి అంశాలు టీడీపీకి కలిసివచ్చాయి. టీడీపీ+జనసేన+బీజేపీల గెలుపునకు గల కారణాలను విశ్లేషిస్తే.. టీడీపీ ఎక్కువగా ప్రచారం చేసిన అంశాలు:లాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మీ భూములు కొట్టేస్తారని బాబు పదే పదే ప్రకటించడంసూపర్ సిక్స్ పేరుతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏపీలో ప్రకటించడంవైఎస్సార్‌సిపి ప్రకటించిన ప్రతీ హామీకి అదనంగా కలిపి తామిస్తామని చెప్పడంవలంటీర్ల వ్యవస్థను ముందు తప్పుబట్టిన వాళ్లే.. తర్వాత వాలంటీర్లకు 5వేల వేతనం బదులు పదివేలిస్తామని ప్రకటించడంఅమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా నిలబెడతామని చెప్పడంమెగా డీఎస్సీతో పాటు ప్రతీ ఏటా జాబ్ కాలెండర్ ఇస్తామనడం2014లో రైతు రుణమాఫీ తరహలో పెన్షన్‌ను ఏకంగా రూ.4000 చేస్తామనడం50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం -
ElectionsResults ఫీవర్.. ట్రెండింగ్‌లో AP హవా
ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్ చేస్తే కౌంటింగ్ అప్డేట్, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్ సైతం ఎన్నికల రిజల్ట్స్ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్‌సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బిగ్ విక్టరీ, వైఎస్ జగన్ అగెయిన్, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. -
కట్టుదిట్టంగా ఏపీ కౌంటింగ్ డే (ఫొటోలు)
-
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్‌రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ సందేశం
తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్’ వేదికగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 -
బిగ్ డే.. కౌంటింగ్‌కు వైఎస్ఆర్సీపీ ‘సిద్ధం’
సాధారణ ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అధికార వైఎస్ఆర్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు.రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్ళలో ఏపీలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని చెబుతున్నారు.రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2 శాతం ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారని భావించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో అనేక అనుభవాలు చూసినా..తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా..ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ధి పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో, గడచిన మూడు నెలల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీమ్ పెట్టిన కష్టాలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎన్నికల్లో తమ ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అసలైన ఫలితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులకు సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
వైఎస్ఆర్సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు. -
AP: ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్ ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లుు పోల్ 26,721 సర్వీస్ ఓట్లు భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలురాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటులోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటుఅసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లుఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతిమూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపురెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులుకౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులుతుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశంగెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు -
భారీ బందోబస్త్..కౌంటింగ్ కు కౌంట్ డౌన్
-
మళ్లీ వైఎస్ఆర్ సీపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ పై కొమ్మినేని రియాక్షన్
-
ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ జిమ్మిక్కు ఇదే తొలిసారి!
దేశం అంతటా పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు ఒక ఎత్తుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరో ఎత్తుగా ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని సర్వే సంస్థలు కేంద్రంలో తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మెజార్టీ సర్వే సంస్థలు వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పోటీగా పలు సర్వే సంస్థలను రంగంలో దించి మొత్తం పరిస్థితిని గందరగోళం చేయడానికి యత్నించారు. దీనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందన్నది వేరే విషయం. కౌంటింగ్ రోజుకు కేడర్ నిరాశకు లోను కాకుండా ఉండడానికి ఇదొక వ్యూహంగా భావిస్తారు.రెండు పార్టీలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ టీడీపీ మాత్రం ఏదో కుట్ర ఆలోచనతో పనిచేస్తోందా? అనే సందేహాన్ని వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ హాల్ లో వివాదాలు సృష్టించడం, ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టి బయటకు పంపిస్తే, ఆ తర్వాత తాము కోరుకున్న విధంగా కౌంటింగ్ జరుపుకోవచ్చేమోనని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ చంద్రబాబుకు ఉన్నట్లుగా దేశంలోనే మరెవ్వరికి ఉండకపోవచ్చు.పోస్ట్ పోల్ సర్వేలలో ఆరా మస్తాన్, ఆత్మసాక్షి, ఫస్ట్ స్టెప్ సొల్యుషన్స్, రేస్, సీపీఎస్ మొదలైన సంస్థలు 2019 ఎన్నికల సమయంలో కూడా ప్రముఖంగా తమ సర్వేలను వెల్లడించాయి. అవి అన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ సంస్థలు వైఎస్సార్సీపీకి 95 నుంచి 110 సీట్ల వరకు రావచ్చని లెక్కగడుతున్నాయి. వీరు వైఎస్సార్సీపీకి వచ్చే స్థానాలను బాగా తగ్గించి అంటే కన్జర్వేటివ్ గా ఈ అంకెలు చెప్పారన్నమాట. ప్రత్యేకించి ఆరా మస్తాన్ సర్వేకి విశేష ప్రాధాన్యం వచ్చింది. ఆయన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు, తదుపరి జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో, 2019 ఏపీ ఎన్నికలలో కానీ, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కానీ చెప్పిన ఫలితాలు నిజం అవడంతో విశ్వసనీయత వచ్చింది. దాంతో ఆయన ఏమి చెబుతారా? అని చాలామంది ఎదురు చూశారు.ఆయన తొలుత టీడీపీ, జనసేనలకు పాజిటివ్ గా ఉన్న పాయింట్లు చెప్పి, తదుపరి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని తమ సంస్థ సర్వేలో తేలిందని వెల్లడించారు. మస్తాన్ సర్వే వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందన్న ముందస్తు సమాచారంతో కొందరు టీడీపీ మేనేజర్లు ఆయనను రకరకాల రూపాలలో బెదిరంచారన్న ప్రచారం ఉంది. తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆరా మస్తాన్ తన మీడియా సమావేశంలో ఆందోళనతోనే కనిపించారు. అంతేకాక ఆయన ఇంకా అనేక వివరాలు వెల్లడిద్దామని భావించినా, ఈ బెదిరంపులు భరించలేక కొంతమేరే వెల్లడించి వదలివేశారు. ఈ సందర్భంగా ఆయా టీవీలతో మాట్లాడి తన సర్వే ప్రాతిపదిక, వైఎస్సార్సీపీ గెలుపు అవకాశాలు మొదలైనవాటిని వివరించారు.ఇదీ చదవండి: నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా ఈ సందర్భంలో ఒక ప్రతినిధి ఆయనను ఈ సర్వే షలితాలు వాస్తవం కాకపోతే.. అని ప్రశ్నించినప్పుడు ఆయన నిర్మొహమాటంగా తన సంస్థ కనుమరుగు అవుతుందని స్పష్టంగా చెప్పడం విశేషం. అంటే అంత నమ్మకంతో ఆయన ఆ మాట చెప్పారన్నమాట. కొన్ని జాతీయ సంస్థల సర్వేలలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే, మరికొన్నిటిలో అనుకూలంగా వచ్చాయి. ఉదాహరణకు టైమ్స్ నౌ సర్వే చాలా క్లారిటీతో వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కడతారని చెప్పింది. ఒక సంస్థ వైఎస్సార్సీపీకి అసలు పార్లమెంటు సీట్లే రావంటూ ఇచ్చిన సర్వే చూసి జనం నవ్వుకున్నారు. టీడీపీ కొన్ని ఫేక్ సర్వేలను ప్రచారంలోకి గట్టిగానే తెచ్చినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీకి అనుకూలం అంటూ ఒక ఇరవై చిన్నా, చితక సంస్థలు ఇచ్చిన సర్వేలలో చివరిలో ఏడెనిమిది సంస్థలు టీడీపీకి అసెంబ్లీ ఎన్నికలలో 152 సీట్లు వస్తాయంటూ ఒకే అంకెను ఫోకస్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.అంతేకాక వీరిచ్చిన లెక్కల ప్రకారం ఏపీ అసెంబ్లీలో 200 సీట్లు ఉండాలి. అంత అద్వానంగా ఈ బోగస్ సర్వేలు వచ్చాయన్నమాట. వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న భావన ప్రజలలోకి వెళ్లకుండా గందరగోళం సృష్టించడానికి ఈ సర్వేలను ఏవేవో పేర్లతో ప్రవేశపెట్టారన్నమాట. ఇలాంటి వాటిలో చంద్రబాబుకు చాలా నైపుణ్యం ఉంది. 2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉండగా, ఒక ప్రముఖ సెఫాలిజిస్ట్ ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి మీడియా సమావేశం పెట్టించి టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పించారు. ఆ వివరాలను అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కానీ టీడీపీ ఓడిపోయింది. అలా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక జిమ్మిక్కు చేస్తుంటారు.ఈసారి కూటమి కట్టిన నేపథ్యంలో కొంత విశ్వాసం పెంచుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేద వర్గాల మద్దతు రావడం లేదన్న సంగతిని చంద్రబాబు, తదితర కూటమి పెద్దలు గమనించకపోలేదు. అందుకే కొన్ని నకిలీ సర్వేలతో పాటు, పోస్టల్ బాలెట్ లలో అటెష్టేషన్ అధికారి వివరాలు లేకపోయినా అవి చెల్లుబాటు అయ్యేలా తమ పలుకుబడిని ఉపయోగించి సీఈఓ ద్వారా ఆదేశాలు ఇప్పించుకోగలిగారు. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిని సరిచేయలేకపోయింది. ఈసీ రూల్స్ ను ఈసీనే బ్రేక్ చేసేలా పరిస్థితి ఏర్పడిందంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యవస్థలు ఎలా ఒత్తిళ్లకు లొంగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.చావో, రేవో అన్నట్లుగా రాజకీయ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ కౌంటింగ్ లో గొడవలకు దిగుతుందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒక పరిశీలకుడు అయితే పరిస్థితి టైట్ గా ఉందనుకుంటే ఒక పది, పన్నెండు నియోజకవర్గాలలో ఓట్లను తారుమారు చేయడానికి కూడా టీడీపీ యత్నించవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీతో టీడీపీ పెట్టుకున్నది ఈ ప్రయోజనానన్ని ఆశించేనని ఎక్కువ మంది నమ్ముతారు. ఇంతవరకు జరిగిన తీరు ఎలా ఉన్నా ఈసీ ఏపీలో కౌంటింగ్ నైనా సజావుగా జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా చేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది.ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గెలవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అన్ని కులాలలోని పేద వర్గాలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని వైఎస్సార్సీపీకి ఓట్లు వేసినట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలలో వైఎస్సార్సీపీకి స్వీప్ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఓట్లు వేసినట్లు అవుతుంది. ఒక వేళ టైట్ గా పరిస్థితి ఏర్పడి 95,100 సీట్లను సాధించి అధికారంలోకి వస్తే ఆయన విధానాలు కరెక్టేనా కాదా అన్నది ఆలోచించుకోవల్సి ఉంటుంది. కాస్త దూరం అయిన కొన్ని ఇతర వర్గాలను మళ్లీ కలుపుకునే యత్నం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను సమీక్షించుకుని పునరుత్సాహంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి. ఏపీలో జరిగిన ప్రయోగాలను దేశం అంతా ఆసక్తిగా చూస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలం అయితే ఆయా రాష్ట్రాలు అదేబాటలో వెళ్లే యత్నం చేస్తాయి. అలాకానీ పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి హామీలు అమలు చేయనవసరం లేదని, అలాకాకుండా ప్రజలను ఏమార్చితే, మోసం చేస్తే సరిపోతుందన్న సంకేతం వెళుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్, తదితర హామీలు అమలు చేయడం అసాధ్యం అవుతుంది. దాంతో వారు ఆ విషయాలను పక్కనబెట్టి ఇతర అంశాలపైకి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తారు. దీనిని గుర్తుంచుకునే జనం టీడీపీని కాకుండా వైఎస్సార్సీపీనే మళ్లీ ఆదరించారన్నది ఎక్కువ మంది భావనగా ఉంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జనం గెలిచినట్లు. నిజం గెలిచినట్లు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గెలిచినట్లు. పేదలు విజయం సాధించినట్లు. పెత్తందార్ల ఒత్తిళ్లకు పేదలు లొంగలేదని రుజువైనట్లు. అదే టీడీపీ కూటమి గెలిస్తే అబద్దం గెలిచినట్లు. ఎందుకంటే అనేక అబద్దాలను కూటమి నేతలు ప్రచారం చేశారు. ఉదాహరణకు లేని టైటిలింగ్ చట్టంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూములను లాక్కొంటారని దారుణమైన ప్రచారం చేశారు. అలాంటి అసత్యాలను నమ్మి జనం ఓట్లు వేసినట్లు అవుతుంది. అంతేకాక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన విష ప్రచారానికి కొంత ప్రభావం అయినట్లు అవుతుంది.బహుశా దేశ చరిత్రలోనే కొన్ని మీడియా సంస్థలు కూటమి కట్టి, కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై, ఒక ప్రభుత్వంపై, ఒక రాజకీయ పార్టీపై కుట్రలు చేయడం ఏపీలో మాత్రమే జరిగి ఉంటుంది. టీడీపీ కూటమి గెలిస్తే ఎల్లో మీడియానే పాలన చేస్తుంది. వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కూటమి గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన మీడియాకు జనం మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. కూటమి ఓడిపోతే కుట్రల మీడియా పరాజయం చెందినట్లు అవుతుంది. కొన్ని గంట్లలో జరగబోయే ఓట్ల లెక్కింపులో పేదలు గెలుస్తారా? పెత్తందార్లు నెగ్గుతారా? అన్నది తేలిపోతుంది. దుష్ట మీడియా కుట్రలు, అసత్యాలు గెలుస్తాయా? లేక ప్రజలు వాటిని తిప్పి కొడతారా అన్నది కూడా నిర్దారణ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని తాము చెరబట్టగలమని, తాము శాసించగలమని, ప్రజాభిప్రాయాన్ని మార్చగలమని, ప్రజాస్వామ్యంలో కృత్రిమ వ్యతిరేకతను సృష్టించగలమనుకున్నవారికి ఈ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయని ఆశిద్దాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ జడ్జిమెంట్ డే.. కూటమిలో గుబులు
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ సాక్షిలో.. -
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయిందని పార్టీ నేతల ధీమా
-
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంలో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్సీపీ.. పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.కాగా, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరువాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. -
YSRCPదే ప్రభంజనం..
-
బీజేపీ అందుకే వెనకపడింది
-
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
ఏపీలో పనిచేయని NDA హవా.. షర్మిలకు డిపాజిట్ గల్లంతు
-
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
జగన్ అనే నేను..
-
కౌంటింగ్ రోజున అల్లర్లకు టీడీపీ కుట్రలు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి కోరారు. అనంతరం మీడియాతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.కౌంటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజాతీర్పును మార్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని మల్లాది విష్ణు హెచ్చరించారు. సజ్జలపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలన్నారు. -
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్సార్సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. ‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు. -
‘ప్రజా తీర్పు’ అంటే టీడీపీకి ఎందుకు భయం?: రావెల
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు.‘‘ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్సార్సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది. జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని రావెల పేర్కొన్నారు‘‘ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలి. ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవు. న్యాయం, ధర్మం, విజయం వైఎస్సార్సీపీ వైపు ఉన్నాయి’’ అని రావెల కిషోర్ బాబు చెప్పారు. -
ఎగ్జిట్ పోల్స్ ఏం తేలుస్తాయి ?
-
ఓటమి భయంతో టీడీపీ, టాయిలెట్ మీడియా కుట్రల మేళా
-
ఈసీపై పేర్నినాని ఫైర్
-
ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..ఈసీ డబుల్ గేమ్
-
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
‘మెమో వెనక్కి అంటే.. తప్పుచేసినట్లేకదా!’
కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్‌పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్ వేయకపోయినా.. డిజిగ్నేషన్ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. .. అందుకే మేం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే.. .. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు. .. వైఎస్సార్సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన. -
టీడీపీ అభ్యర్ధి సైలెంట్.. అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గానికి పరార్
పోలింగ్‌కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది? అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు. ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం కాన్ఫిడెంట్గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు. -
పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
బెజవాడ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. అటువంటి కంచుకోటలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందనే ధీమా కనిపిస్తోంది. టీడీపీ అడ్డాలో ఫ్యాన్ గిర్రున తిరిగి పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బెజవాడలో జరిగిన రాజకీయాలు.. పోలింగ్ జరిగిన తీరు చూశాక కచ్చితంగా సైకిల్ పార్టీ ఓటమి ఖాయం అంటున్నారు విశ్లేషకులు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఓ లుక్కేద్దాం.తెలుగుదేశం అడ్డాలో పాగా వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, పన్నిన వ్యూహాలు ఫలించాయంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని ఈ సారి వైఎస్సార్ సిపి గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2004, 2009 ఎన్నికలలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని గెలుచుకోలేకపోయింది.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటును టిడిపి గెలుచుకుంది. 1984, 1991 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరావు విజయవాడ ఎంపీగా గెలుపొందారు. మరలా 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుంది. ఈ రెండుసార్లు కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసి పరాజయం చెందారు. అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా..విజయవాడ ఎంపీ సీటు మాత్రం వైఎస్ఆర్సీపీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 44.36 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నానికి...వైఎస్సార్ సిపి అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌కు మధ్య ఒక శాతంలోపే ఓట్ల తేడా ఉండటం విశేషం. టిడిపి అభ్యర్ధి వైఎస్సార్ సిపిపై కేవలం 8726 ఓట్లతోనే గెలిచారు. దాదాపు గెలుచుకునే పరిస్ధితి వరకు వచ్చి కేవలం తొమ్మది వేల లోపు ఓట్ల తేడాతోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందారు. గతానుభవాలతో ఈసారి విజయవాడను దక్కించుకోవడానికి వైఎస్సార్ సిపి ముందునుంచి గట్టి ప్రయత్నమే చేసింది. సిఎం వైఎస్ జగన్ పాలన నచ్చి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరారు. చేరిన మొదట రోజు నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గట్టిగానే ప్రచారం చేశారు. ఇక టిడిపి తరపున నాని సోదరుడు కేశినేని చిన్ని బరిలో నిలిచారు.విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్ నమోదు అయితే, 2019 నాటికి పోలింగ్ 78.94 శాతానికి పెరిగింది. గత ఎన్నికలలో పెరిగిన పోలింగ్ శాతం వైఎస్సార్ సిపికే అనుకూలించింది. 2014 నాటికి టిడిపికి..వైఎస్సార్ సిపికి మధ్య ఆరు శాతం పైన ఓట్ల తేడా ఉంటే, 2019 నాటికి తేడా ఒక శాతం కంటే తక్కువకి దిగి వచ్చింది. ఈ సారి పోలింగ్ శాతం 79.36 శాతం నమోదైంది. ఈ సారి పెరిగిన పోలింగ్ శాతం కూడా వైఎస్సార్ సిపికే కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2014 ఎన్నికలలో 65.87 శాతం పోలింగ్ నమోదు అయితే ఈ ఎన్నికలలో ఏకంగా 72.96 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే విజయవాడ తూర్పులో ఆరు శాతం, నందిగామలో దాదాపు నాలుగు శాతం పెరగడం విశేషం.ఈ ఎన్నికలలో మహిళా ఓటర్లు భారీగా పెరగడం కూడా వైఎస్సార్ సిపికే అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకంటే దాదాపు 27 వేల మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందడం వల్లే పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ స్ధానంలో ఈ సారి వైఎస్సార్ సిపి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. కేశినేని బ్రదర్స్ మధ్య జరిగిన పోరులో గెలుపెవరిదనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతుండగా...గెలుపుపై వైఎస్సార్ సిపి మాత్రం ధీమాగా ఉంది. కేశినేని నాని బరిలో గట్టి అభ్యర్ధిగా ఉండటం కూడా వైఎస్సార్ సిపికి కలిసొచ్చిందంటున్నారు. -
ఈసీ డబుల్ గేమ్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎన్నికల సంఘం డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఈ మెమోలపై వైఎస్సార్సీపీ కోర్టుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే రాజకీయ దుమారం రేపాయి.ఏపీ సీఈవో ఇచ్చిన మెమో సారాంశం..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.వైఎస్సార్సీపీ అభ్యంతరాలు ఏంటంటే..పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ వాటిల్లో పేర్కొన్నారాయన. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది కూడా.డబుల్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంఈలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈసీ డబుల్ గేమ్‌తో.. జూన్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎలా జగరనుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే వైఎస్సార్సీపీ పిటిషన్‌పై కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు గనుక తీర్పు ఇస్తే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీని సైతం కలిసినా..అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ అంటోంది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా ఉండేలా నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో మీనా జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏపీ సీఈవోకు అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆ వివాదాస్పద జీవో వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
ఉమ్మడి విశాఖలో రౌడీ షీటర్లపై భైండోవర్ ల అస్త్రం
-
ఎన్నికల కమిషన్ పై న్యాయ పోరాటం
-
May 30th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 30th AP Elections 2024 News Political Updates..09:37 PM, May 30th, 2024ఇక్కడి జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీపల్నాడు హింసకు సంబంధించి దాదాపు 1200 మందిని అరెస్టు ఇలాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా పేరు కెక్కడం దురదృష్టకరంజిల్లా ఘటనలపై నా స్నేహితులు సైతం ఆరా తీస్తున్నారుకర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, దాడులు అవసరమా? నరసరావుపేట జైలులో ఖాళీలేక నిందితులను రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాంమీడియాతో ఎస్పీ మలికా గార్గ్ 07:40 PM, May 30th, 2024మెమో వెనక్కి అంటే తప్పు చేసినట్లే కదా: పేర్ని నానిఏపీ ఎన్నికల సీఈవో , కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయిఈ విషయాన్ని మేం ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నాం ఆధారాలతో టీడీపీ తప్పుల పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదుఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్ లో వార్త వచ్చినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు టీడీపీ పై పొరపాటున కేసులు కనిపిస్తే కలెక్టర్లను , ఆర్వోలను బెదిరిస్తున్నారువైఎస్సార్సీపీ శ్రేణులపై సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారుటీడీపీ , బీజేపీ పై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారుపోస్టల్ బ్యాలెట్ విషయంలో నిబంధనలకు మీరి సీఈవో ముకేష్ కుమార్ మీనా వ్యవహరించారు స్టాంప్ వేయకపోయినా... డిజిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదని మెమో జారీ చేశారు . చట్టాన్ని మీరి రూల్స్ తయారు చేస్తున్నారుఈ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారుఅందుకే మేము కోర్టులో లంచ్ మోషన్ వేశాందేశం లో ఏ రాష్ట్రం లో లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారుతాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ముకేష్ కుమార్ మీనా కోర్టుకు తెలిపారుమెమో వెనక్కి తీసుకున్నారంటే ఆయన తప్పుచేసినట్లేకదాముకేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోను కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధించడం అన్యాయంకేంద్ర ఎన్నికల సంఘం పై ఇచ్చిన వెసులు బాటు పై కోర్టులో పోరాడుతున్నాం ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుందిచంద్రబాబు , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో ధర్మం గెలిచి తీరుతుంది07:09 PM, May 30th, 2024రేపు గవర్నర్‌ను కలవనున్న పురందేశ్వరి ఏపీ రాజ్‌భవన్‌కు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పురంధేశ్వరిశుక్రవారం రాజ్‌భవన్ వెళ్లనున్న పురంధేేశ్వరి06:09 PM, May 30th, 2024విజయవాడ గడ్డ- ఇక వైఎస్సార్ సీపీ అడ్డావిజయవాడ పార్లమెంట్ సీట్లో సత్తా చాటనున్న వైఎస్సార్సీపీ పదేళ్లగా టిడిపి చేతిలోనే విజయవాడ ఎంపీ సీటుఈ సారి ఎన్నికలలో YSRCP గెలుస్తుందనే అంచనాలుహాట్రిక్ దిశగా కేశినేని నానిమహిళల ఓట్లే గెలుపునకు కీలకంఎవరిని కదిపినా.. సీఎం జగన్, ఫ్యాన్ పార్టీకే ఓటేశామని జపంసంక్షేమ పధకాలతో తమ కుటుంబాలకి మేలు జరిగిందంటున్న జనంతమ కుటుంబాలకి మేలు చేసిన వైఎస్ జగన్ కి కృతజ్ఞతగా ఓటేసామని చెబుతున్న బెజవాడ ప్రజలు 05:40 PM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది: సీఎం జగన్తాడేపల్లి :దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందికులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 202405:20 PM, May 30th, 2024సీఈసీకి హైకోర్టు ఆదేశంఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్ని పిటిషన్‌పై విచారణతనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయం తెలపాలని సీఈసీకి ఆదేశం 04:20 PM, May 30th, 2024ఏపీ: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల్లో కొత్త ట్విస్ట్సీఈవో జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘంసీఈవో మెమోపై హైకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ 04:10 PM, May 30th, 2024కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ సెంటర్లను పరిశీలించాం: సీఈవో ముకేష్ కుమార్ మీనాకౌంటింగ్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయిస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రత ఉందికౌంటింగ్ డే తర్వాత గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాల పై నిఘా పెట్టాంకౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం కలిగించినా అరెస్ట్ చేసి ...జైలుకి పంపిస్తాంర్యాలీలు..సెలబ్రేషన్స్ కు ఎలాంటి అనుమతి లేదుపోస్టల్ బ్యాలెట్ నిబంధనల్లో ఎలాంటి గందరగోళం లేదుసంతకం ఉండి...పేరు,హోదా లేకుంటే స్పెసిమెన్ సంతకం తీసుకోవాలని సూచించానుఈ గైడ్ లైన్స్ పై ఒక పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందిఆ పార్టీ అభ్యంతరాన్ని ఎన్నికల కమిషన్ కు పంపించానుఈరోజు.. రేపట్లో ఒక క్లారిటీ వస్తుంది02:25 PM, May 30th, 2024చంద్రబాబు, రామోజీపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తోందిఅసైన్డ్ భూములను కొట్టేయటానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశారుఅసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డు భూములు ఆక్రమించి కట్టలేదా?ఆ ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదు?మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పని చేస్తుందిచంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయంకుట్రపూరితంగా వ్యవహరించంఅమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసుసీఎం జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అక్కున చేర్చుకున్నారుసీఎం జగన్ వైజాగ్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారుచంద్రబాబు, రామోజీ ఏనాడూ దళితుల బాగోగుల గురించి ఆలోచించరువారిద్దరూ దళితుల వ్యతిరేకులువెర్రి కూతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలి11:16 AM, May 30th, 2024తిరుపతి: చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై చర్యలుడీఎస్పీ శరత్ రాజ్ కుమార్ డీజీపి కార్యాలయంలో సరెండర్ కావాలంటూ ఆదేశాలుమూడు నెలల క్రితమే చంద్రగిరి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శరత్ రాజ్ కుమార్చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడటంలో డీఎస్పీ విఫలంపోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై సిట్ నివేదిక ఆధారంగా చర్యలు7:18 AM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం2019లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయంఅదే ఏడాది మే 30న ‘జగన్ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంరాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలనఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచిన జనంగత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు7:11 AM, May 30th, 2024మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపురాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటనసీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్‌కు ఏపీ సీఈవో మీనా వెల్లడిజాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలిఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండిగుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలిరాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం 7:05 AM, May 30th, 2024ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలిప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలివైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందిజూన్ 9న సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు7:02 AM, May 30th, 2024‘సడలింపు’ని సరిదిద్దండికేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులుఅటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళనసడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి -
‘సడలింపులు’పై హైకోర్టుకు వెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ అన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..
-
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు? -
బాధితులపై పోలీసుల కర్కశత్వం
-
పచ్చ ఖాకీల కుట్ర బట్టబయలు
-
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates..07:00 PM, May 28th, 2024 కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జునపోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 06:00 PM, May 28th, 2024 నెల్లూరు..మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 -
AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?
అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కొందరు పోలీసులు తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇవ్వాళ హైకోర్టు ముందు జరిగిన విచారణలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసుల తీరు పలు ప్రశ్నలకు దారి తీసేలా మారింది.ఏం జరిగింది? ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులు ఏం చేశారు?హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈవీఎం కేసు ఉండగానే పిన్నెల్లిపై మరో మూడు కేసులు పెట్టారు. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. హైకోర్టులో ఏం తేలింది? ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో .. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. ఆ రికార్డుల్లో ఏం తేలిందంటే.. పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న పోలీసులు నమోదు చేశారుఅది కూడా ఈవీఎంల కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత కేసులు నమోదు చేశారుఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచారుఅయినా హైకోర్టుకు కేసు నమోదు విషయంలో పోలీసులు తప్పుడు సమాచారం అందించారుహైకోర్టు విచారణ సందర్భంగా ఇంకేం తేలింది?ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా లాయర్ అశ్వనీకుమార్‌ను రంగంలోకి దించారుపోలీసుల తరపున ఒక లాయర్ వాదించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలినిబంధనలన్నింటిని తుంగలో తొక్కి అశ్వనీకుమార్‌ను వాదనల కోసం తెచ్చారుఅశ్వనీ కుమార్ ద్వారా ముందే కేసు నమోదు చేశామంటూ తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకు ఇచ్చారుతమ వాదనలు వినిపిస్తున్న పోలీసు పిపికి కూడా సమాచారం ఇవ్వని డిజిపి, పోలీసులుఇవ్వాళ కోర్టుకు రాని అశ్వనీకుమార్ఇదే కేసులో టిడిపి లీగల్ సెల్ లాయర్ పోసానితో ఇంప్లీడ్ పిటిషన్ వేయించారుఇవ్వాళ కోర్టు ముందు వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లురికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావడం లేదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు వాయిదా వేసింది. పిన్నెల్లి విషయంలో వ్యక్తిగత కక్ష కనిపిస్తోందని తాజా ఘటనల ద్వారా అర్థమవుతోంది. ఈ కేసులో డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు రోజురోజుకూ దిగజారుతోంది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కొందరు పోలీసు అధికారులు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పిన్నెల్లి లాయర్ హైకోర్టుకు తెలిపారు. "పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
ఏపీలో కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ పత్యేక దృష్టి
-
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
పచ్చ మూక రిగ్గింగ్.. బయటపడ్డ సంచలన నిజాలు
-
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్‌ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. -
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్‌కి బ్రేక్ పడినట్లేనా...ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్‌ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్‌గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయివిశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్‌గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు.ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్‌గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు. -
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు. -
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates5:17 PM, May 21st, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 5:08 PM, May 21st, 2024మేం గెలుస్తామని...జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం: మంత్రి బొత్స సత్యనారాయణఎన్నికలు పూర్తయ్యాయి...భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో ఉన్నాయిఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాంప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదురాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారుఏపీ విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాంఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్,జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారుమాపై బురద జల్లుతున్నారువిద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచనమా విధానాలు నచ్చ పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాంమళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారునేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదుప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారుసీఎం జగన్ ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లారువాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలిచంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు విదేశాలకి వెళ్లారురాష్ట్ర ప్రజలని కోరుతున్నా....సంయమనం పాటించాలని కోరుతున్నాసోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిరాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమేఎందుకు హర్రీ అండ్ వర్రీచంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకి వెళ్తే తప్పేంటి?ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారుభయంతో చంద్రబాబు విదేశాలకి పారిపోయారా?సిఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు?అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి?సిఎం వైఎస్ జగన్‌ని అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి?ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నామేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?తన పాలన చూసి ఓటేయాలని ప్రధాని మోదీనే అడగలేకపోయారుమీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ మాత్రమే అడిగారుసీఎం జగన్ రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారునా తప్పులని దిద్దుకుంటానని అధికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారురైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదాచంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాంమా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగిందిగ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణంవాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదుకరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాంప్రజలకి కావాల్సిన విధానాలని...సంస్కరణలనే సిఎం వైఎస్ జగన్ అమలు చేశారుఅందుకే సీఎం జగన్‌కి మళ్లీ పట్టం కట్టారని భావిస్తున్నాంప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మానా...ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికిఆ రోజు భ్రమలలో ఉండి ప్రశాంత్ కిషోర్‌ని తీసుకొచ్చాంసిఎం వైఎస్ జగన్ పర్మినెంట్‌గా ఉండే విధానాలనే నమ్ముతారుప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నాం2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్‌ఏపీలో మేం పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్ సంజయ్‌కుమార్ మాటలు కూడా నిరాధారమే: సీఎస్డీఎస్ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడుఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి