సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.
పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్‌ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్‌లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ట్విట్టర్‌లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment