సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.
ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్‌కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్‌పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment