అమరావతి:ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై సీఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో రెండు రోజుల క్రితం హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపిందిదాంతో రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment