CEC
-
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
వివాదాల నడుమ ‘రాజీవ్’కు వీడ్కోలు
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్‌కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్‌కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్‌కుమార్ హయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్‌కుమార్ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్‌కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.రాజీవ్‌కుమార్ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్‌కుమార్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్‌కుమార్ అనడం చర్చకు దారి తీసింది.మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ హాయంలో ఎన్నికల కమిషన్‌తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్‌కుమార్ రిటైర్ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. -
‘ఈసీ’కి అమెరికా సాయం..? మాజీ ‘సీఈసీ’ ఫైర్
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అమెరికా నిధులిచ్చిందనే విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా ఇచ్చే 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.‘భారత్‌లో ఓటర్ టర్నౌట్ విషయంలో సాయం కోసం తాను సీఈసీగా ఉండగా ఎన్నికల కమిషన్ అమెరికాతో ఒప్పందం కుదర్చుకుందనడంలో కొంచెం కూడా నిజం లేదు.నేను 2012లో సీఈసీగా ఉన్నపుడు ఐఎఫ్‌ఈస్‌తో మాత్రమే సిబ్బంది శిక్షణ కోసం ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందంలో ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రస్తావన లేనే లేదు.ఆర్థిక,న్యాయపరమైన బాధ్యతలేవీ ఉండవని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నాం’అని ఖురేషి తెలిపారు. భారత్‌లో ఓటర్ టర్నౌట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల సాయాన్ని మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఇప్పటికే ప్రకటించింది.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ సలహాదారు సంజీవ్ సన్యాల్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అమెరికా సాయం అనేది అతి పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్‌లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్‌ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్‌కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్‌కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్‌కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
#ElectionsResults: సెకనుకు 2లక్షల మంది వీక్షణ
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా.. ఈసీ వెబ్‌సైట్‌ను సెకనుకు 2లక్షల మంది చూస్తున్నారని తెలిపారాయన. అలాగే.. కౌంటింగ్‌ను ఈసీ బృందాలు వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
పిన్నెల్లి పిటిషన్‌పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
అమరావతి:ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై సీఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో రెండు రోజుల క్రితం హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపిందిదాంతో రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. -
పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం
-
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది. -
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
-
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయండి: సీఈసీ
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా శాంతి యుతంగా,హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాగానికి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ సెన్సిటివిటి,నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు ఫెయిడ్ హాలిడే,అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి సహచర ఎన్నికల కమిషనర్లతో కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవోలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ ఎన్నికలు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కావున రానున్నఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా హింసా రహితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు పునరుద్ఘాటించారు.ఇప్పటికే మొదటి,రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సీఎస్, డీజీపీ,సీఈవోలకు స్పష్టం చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఇసి రాజీవ్ కుమార్ ఆదేశించారు.ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు(సైలెంట్ ఫిరియడ్)ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు,మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మోడల్ కోడ్ బృందాలు మరింత నిఘా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలను సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాలా కట్టుబడి పూర్తి సన్నద్ధమై ఉందని ఈప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సిఇసి రాజీవ్ కుమార్ సూచించారు.ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేని విధంగా రానున్న ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్ట అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలు విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఏపీతో ఐదు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయని, రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రశాంత మరియు స్వేచ్ఛాయుత,హింసా రహిత ఎన్నికల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకుంటున్నా మని సిఎస్ జవహర్ రెడ్డి వివరించారు.శాంతి భధ్రతల అంశానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీష్ఘడ్ నుండి కొంత మేర మావోయిస్టుల సమస్య ఉందని ఆ సమస్యను అధిగ మించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు,632 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని సీఎస్ జవహర్ రెడ్డి సీఈసీకి వివరించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా,ఛతీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కొంత వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉందని ఇందుకు సంబంధించి 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.ఇటీవల మహారాష్ట్రకు 10 కంపెనీల పోలీసు బలగాలను పంపామని వాటిని తిరిగి పంపాలని కోరారు.రాష్ట్రానికి అదనపు బలగాలను పంపాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సమావేశంలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డీజీపీ ఎస్.బాగ్చి,చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఇబి డైరెక్టర్ యం.రవి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీకి ముగ్గురు పరిశీలకుల నియామకం
సాక్షి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి సానుకూలత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ నుంచి సునీల్‌రెడ్డి, దిల్‌రాజు తదితరుల పేర్లు పరిశీలించినా, చివరి కి టి.జీవన్‌రెడ్డి వైపే నేతల మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆయనకు సీఎం వర్గం బలమైన మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం చామల కిరణ్ కుమార్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనకే టిక్కెట్ దక్కేలా రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. గురువారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్‌తో మహేశ్‌గౌడ్ భేటీ గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సభ తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగసభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాత ర సభకు రాహుల్, ఖర్గే లాంటి కీలక నేతలు రానుండడం, జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
Lok sabha elections 2024: సార్వత్రిక సమరం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది. తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచానికే తలమానికంగా... ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్‌లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే... ► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్‌లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం. ► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం. ► నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి. ► అక్రమ ఆన్లైన్ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తారు. ► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు. ఆ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్! ఈసీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్‌సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్‌లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్ జరగనుంది. ‘4ఎం’ సవాలుకు సిద్ధం ‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్ (కండ బలం), మనీ (ధన బలం), మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ వయోలేషన్స్ (కోడ్ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు, నాన్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం. ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది. హోరాహోరీ తలపడండి, కానీ... ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు. విరాళాలపై నిఘా పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు. -
ఈసీలో కొత్త నీరు!
ఎన్నికల నోటిఫికేషన్ల విడుదల సమయాల్లో మాత్రమే వినబడే ఎన్నికల సంఘం చాన్నాళ్లుగా తరచు వార్తల్లోకెక్కుతోంది. అక్కడ కమిషనర్ల ప్రవేశమూ, నిష్క్రమణా కూడా సంచలనాలుగా, వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నెల 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశాక ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. తాజాగా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ గురువారం ప్రకటించింది. తనకు 212 పేర్లతో బుధవారం రాత్రే జాబితా పంపారని, తెల్లారేలోగా అంతమందిని జల్లెడపట్టి వారిలో ఇద్దరిని ఎంపిక చేయటం సాధ్య మేనా అని కమిటీలోని విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. ఆ సంగతలావుంచి రేపో మాపో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న దశలో ఈ ఎంపిక వుండదని, ఏకసభ్య సంఘం చేతులమీదుగా అంతా ముగుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ రాజు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది? నిజానికి ఎన్నికల సంఘం 90వ దశకం వరకూ ఏకసభ్య సంఘంగానే వుండేది. 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జైల్‌సింగ్‌కు రెండోసారి అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను సవరించాలన్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రయత్నానికి అప్పటి ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరిశాస్త్రి అడ్డుపుల్ల వేయటంతో ఆగ్రహించి ఆ సంఘాన్ని త్రిసభ్య సంఘం చేయాలని కేంద్రం భావించింది. అయితే అనంతర కాలంలో వీపీ సింగ్ ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలా చేసింది. 1990లో నాటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దూకుడును తట్టుకోలేకపోయిన నాటి పీవీ నరసింహారావు సర్కారు దాన్ని త్రిసభ్యసంఘంగా మార్చింది. నిర్వాచన్ సదన్‌లో ఏదో జరుగుతోందని తెలిసినా ఎందుకో అర్థంకాని పరిస్థితి గతంలో లేదు. ఏదైనా సమస్యవుంటే ప్రభుత్వం వివరణనివ్వటం రొటీన్‌గా సాగిపోయేది. లేదంటే మీడియానే కూపీ లాగే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వివరణనిచ్చే సంస్కృతీ లేదు... వెలికితీసే మీడియా కూడా లేదు. ఈమధ్యే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసి నిష్క్రమించారు. వచ్చినప్పటిలాగే వెళ్లేటపుడు కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చారు. వాస్తవానికి ఆయనకు ఇంకా మూడేళ్ల వ్యవధివుంది. పైగా వచ్చే ఫిబ్రవరిలో రాజీవ్‌కుమార్ రిటైరయ్యాక ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం కూడావుంది. ఈ చాన్సును కమిషనర్లుగా వున్నవారు ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోరు. పోనీ గోయెల్‌కు అలా వెళ్లితీరాల్సిన పరిస్థితి ఏర్పడినా సాధారణంగా కేంద్రం సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గత నెలలో మరో కమిషనర్ అనూప్ పాండే రిటైరయ్యారు. గోయెల్ కూడా నిష్క్రమిస్తే ఒక్కరే మిగులుతారు. ఒక్కరితో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు బదులు ఆ ప్రక్రియ ముగిసేవరకూ వుండాలని ఆయన్ను కోరితే వేరుగా వుండేది. ఈ హఠాత్తు నిష్క్ర మణలోని ఆంతర్యమేమిటో మూడోకంటికి తెలియదు. ఆయనంతట ఆయన వెళ్లారా, ప్రభుత్వమే అడిగిందా అన్నది అర్థంకాదు. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022 నవంబర్ వరకూ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వున్న గోయెల్ ఆ నెల 18న స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. రాత్రికి రాత్రి కేంద్ర న్యాయశాఖలో కమిషనర్ ఫైలు చకచకా కదిలి, నలుగురు సభ్యుల జాబితాలో గోయెల్ పేరు చేరిపోయింది. ఆ మర్నాడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఆ ఫైలు వెళ్లటం, గోయెల్‌ను ఎంపిక చేయటం, ఆయన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం ముగిసిపోయాయి. ఈ హైస్పీడ్ ‘24గంటల వ్యవహారం’పై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఎందుకింత తొందర?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది కూడా. కానీ చివరకు ఆ పిల్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామకం అంశంలో కొత్త చట్టం వచ్చేవరకూ ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వుండాలని నిరుడు మార్చిలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని 324(2) అధికరణను ఉల్లంఘించి ప్రధాని ఏకపక్షంగా నియమకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. అనంతరం ఆగస్టులో కేంద్రం తెచ్చిన చట్టంలో ఆ తీర్పు స్ఫూర్తి గాలికెగిరి పోయింది. ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో విపక్షనేత ఎంపిక కమిటీలో వుంటారని ఆ చట్టం చెబుతోంది. పర్యవసానంగా ఎప్పటిలా పాలకపక్షం అభీష్టమే నెరవేరుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షం లేకుండానే బిల్లు ఆమోదం పొంది, చట్టం కావటాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ ప్రస్తుతం విచారణలో వుంది. ఆ చట్టంకిందనే తాజాగా ఇద్దరు కమిషనర్లను నియమించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. దాన్ని పర్యవేక్షించే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వుండాలని జనం కోరుకుంటారు. అందుకే కమిషనర్ల నియామకం, పదోన్నతులు సాధ్యమైనంత పారదర్శకంగా వుండేందుకు ప్రయత్నించాలి. హఠాత్తు నిష్క్రమణలు, ఆగమనాలు ఎన్నికల సంఘం తటస్థతను ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే దశలో అశోక్ లావాసా 2020లో హఠాత్తుగా రాజీనామా చేయటం, ఇటీవల వున్నట్టుండి గోయెల్ నిష్క్రమించటం, పాలకపక్షందే పైచేయిగావున్న ఎంపిక కమిటీ కొత్త నియామకాలు చేయటం వంటివి సంశ యాలకు తావిస్తాయని పాలకులు తెలుసుకోవటం ఉత్తమం. -
ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: CEC రాజీవ్ కుమార్
-
సీఈసీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపులేని పార్టీ.. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘కోనేరు సురేష్ అనే వ్యక్తి పదిలక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓస్ చెప్పాలి, గాని ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు?. ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోమన్నాం. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేశాం’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారు. ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరాం. తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటరగా నమోదు చేసుకోవాలి. యువగళం, చంద్రబాబు సభలో అసభ్యపదజాలంతో సీఎం జగన్‌ను విమర్శించారు. లోకేష్ ఎర్రబుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడు. అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నా వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అంటూ లోకేష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరాం. రెండు రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరపాలని కోరాం . ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చు . చంద్రబాబు జీవితమే మోసపూరితం.. కుట్రలతో నిండిపోయింది’’ అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు 1). ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదుల చేసిన కోనేరు సురేష్ అనే వ్యక్తిపై చర్య తీసుకోవాలి టీడీపీ తరఫున ఎన్నికల్లో అక్రమాలకు కుట్ర చేసిన కోనేరు సురేష్. అధికారులపై నిరాధార ఆరోపణలు. నిందలు. 10 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటూ తప్పుడు ఫిర్యాదు. ఆ ఫిర్యాదును జిల్లాల్లో పరిశీలనకు పంపిన ఎలక్షన్ కమిషన్. కర్నూలు జిల్లాలో 67,370 చెల్లని ఓట్లు ఉన్నాయని సురేష్ ఫిర్యాదు. ఓటర్ల జాబితాలు పరిశీలించిన కర్నూలు కలెక్టర్. క్షేత్రస్థాయిలో లోతుగా అధ్యయనం. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన జిల్లా అధికారులు. సురేష్ ఫిర్యాదు చేసిన చెల్లని ఓట్లలో.. 59,000 వేల ఓట్లు వాస్తవ ఓట్లే అని తేల్చిన అధికారులు. బతికి ఉన్నవారూ చనిపోయినట్లు ఫిర్యాదు చేసిన కోనేరు సురేష్. తప్పుడు సమాచారంతో అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. మొత్తంగా 80 శాతం ఓట్లు వాస్తవ ఓట్లేనని నిర్ధారణ. తెలుగుదేశం పార్టీ తరపున సురేష్ చేసిన తప్పుడు ఫిర్యాదు వల్ల వైఎస్సార్సీపీకి నష్టం వాటిల్లిందని వెల్లడి. అలాగే అన్నమయ్య, విశాఖ జిల్లాల నుంచి కూడా ఎన్నికల సంఘానికి (ఈసీ) వాస్తవ నివేదికలు. వెంటనే టీడీపీపైనా, కోనేరు సురేష్‌పైనా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. జాబితాలో ఒక్క ఓటు తొలగించాలన్నా.. లేదా చేర్చాలన్నా బూత్ లెవల్ ఆఫీసర్ వద్దే, క్షేత్రస్థాయిలో జరగాలి. నియమ, నిబంధనల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా, నిరాధార ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ. కోనేరు సురేష్. ఏకంగా 10 లక్షల ఓట్లు బోగస్ అని, వాటిని తొలగించాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. దాన్ని ఎలా పరిగణలోకి తీసుకున్నారు? అన్న అంశాన్ని ఈసీ ప్రతినిధుల వద్ద ప్రస్తావించిన వైయస్సార్సీపీ. అసలు ఆ 10 లక్షల ఓట్లకు సంబంధించిన డేటా కోనేరు సురేష్‌కు ఎలా లభించిందన్న దానిపైనా దర్యాప్తు చేయాలన్న వైఎస్సార్సీపీ నేతలు 2). అక్రమంగా ఓటర్ల వివరాల ప్రొఫైలింగ్ మై పార్టీ డాస్బోర్డ్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటర్ల వివరాలను ప్రొఫైల్ చేశారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ఓటర్లను వారు (టీడీపీ నాయకులు) ప్రొఫైల్ చేస్తున్నారు. ఇంకా ఆ డేటాను అమెరికాలోని అమెజాన్ సర్వర్‌లో స్టోర్ చేశారు. భవిష్యత్తులో ఒకవేళ ఆ డేటా బ్రీచ్ అయితే బాధ్యులు ఎవరు?. నిజానికి ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఓటర్లను ప్రొఫైల్ చేయకూడదు. కులం, మతం, పొలిటికల్ ప్రిఫరెన్స్ ప్రాతిపదికన ఓటర్ల ప్రొఫైలింగ్ చట్ట విరుద్ధం. కానీ ఆ పని చేసిన తెలుగుదేశం పార్టీ.. ఆ ప్రొఫైల్ ఆధారంగా ఓటర్ల తొలగింపునకు ప్రయత్నించింది. అందువల్ల దీనిపై చర్యలు తీసుకోవాలి. 3). వెబ్ లింక్ క్రియేషన్. ఇంకా టీడీపీ మేనిఫెస్టో అనే మరో వెబ్‌లింక్‌ను క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ. డోర్ టు డోర్ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటున్నారు. ఓటర్ల ఫోన్లకు ఓటీపీలు వస్తున్నాయి. ఆ ఓటీపీని వారు సేకరిస్తున్నారు. అలా సేకరించిన డేటాను కూడా లండన్‌లో ఉన్న సర్వర్‌లో స్టోర్ చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. దీనిపైనా తగిన చర్య తీసుకోవాలి. 4). ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి ప్రజా ప్రాతినిథ్య చట్టం, సెక్షన్ 17, 18 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. కానీ తెలంగాణలో ఇటీవల ఓటు వినియోగించుకున్న వారు.. తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో చేరిక కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉదా: ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు కోసం మంగళగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అలా ఏపీలో ఓట్ల కోసం అక్కడ (తెలంగాణలో) బ్యానర్లు కట్టి మరీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అక్రమ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలి. 5). రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరింపు రాష్ట్రంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్, ప్రతి చోటా రెడ్ బుక్ చూపి, అందులో చాలా మంది అధికారుల పేర్లు నమోదు చేశానంటూ బెదిరిస్తున్నారు. ఆ విధంగా అధికారులను బెదిరించి, బ్లాక్మెయిల్ చేయాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అలా అధికారులను తమ వైపు తిప్పుకోవాలన్నది నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ కుట్రలా కనిపిస్తోంది. అందువల్ల ఈ వ్యవహారంపైనా ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, తగిన చర్య తీసుకోవాలి. ఇదీ చదవండి: మా వల్ల కాదు బాబూ.. -
CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది. ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. పార్లమెంట్ తీసుకువచ్చిన కొత్త బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను పక్కన పెట్టేశారు. సీఈసీ, ఈసీ కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టును దూరంగా ఉంచారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్లపై సుప్రీంకోర్టు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అర్హత ఉండదు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది. అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి. #Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF — Suneel Veer (@sunilveer08) December 12, 2023 -
అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ
-
కాంగ్రెస్ సీఈసీ సమావేశం రేపటికి వాయిదా
-
బీజేపీ తొలి జాబితాకు నేడు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తర ఫున బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాకు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఈసీకి పంపే జాబితాకు సంబంధించి గురువారం ఢిల్లీలో వరు సగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలా లపై పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో.. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జరిగిన చర్చల అంశాన్ని పార్టీ పెద్దలకు కిషన్‌రెడ్డి వివరించారు. వరుసగా భేటీలతో.. తొలుత గురువారం మధ్యాహ్నం పార్టీ ఎన్నికల ఇన్ చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివా సంలో రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నేతలతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్స ల్లు పాల్గొన్నారు. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై చర్చించారు. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న సెగ్మెంట్లకు సంబంధించి ఆయా అభ్యర్థుల బలాబలాలను సమీక్షించారు. తర్వాత గురువారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మరో సారి కోర్ గ్రూప్ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇందులో పాల్గొన్నారు. తొలి జాబితా విడుదలయ్యాక ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేలా.. ఒక్కో నియో జకవర్గానికి సంబంధించి క్షుణ్నంగా సమీక్షించారు. చర్చించే సమయంలో తెలంగాణ అభ్యర్థుల జాబితాలను మూడు కేటగిరీలుగా.. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, గట్టి పోటీ ఇచ్చే స్థానాలు, బలం పుంజుకోవాల్సిన సీట్లుగా జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రచార ప్రణాళికపైనా చర్చ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించే అంశంపై రాష్ట్ర నాయకు లకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. వీటితోపాటు కేంద్ర పెద్దల పర్యట నలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
Telangana: నేడు బీజేపీ తొలి జాబితా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) తుది నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సమా వేశంలో రాష్ట్ర పార్టీ నుంచి అందిన జాబితాపై చర్చించి తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో మంగళవారం ఈ జాబి తా వెలువడవచ్చుననే చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబి తా కూడా సిద్థమైన నేపథ్యంలో 40–45 మందితో అధ్యర్థుల తొలిజాబితా... లేదా ఏకాభిప్రాయం ప్రాతిపదికన అంతకంటే ఎక్కువ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో ఎవరుంటారో? అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో పాటు సగం మందికి పైగా బీ–ఫారమ్‌లు కూడా అందజేయగా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా 55 మందితో తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో ప్రధానపార్టీ బీజే పీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఢిల్లీలో సీఈసీ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ట్ర స్క్రీనింగ్ కమి టీ చైర్మన్ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా అమ్మవారి భవానీ మాలను ధరించి, పదిరోజుల పాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ ఈ భేటీకి హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టతరాలేదు. -
హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా సజ్జనార్..?
-
ఈసీని కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటలకు సీఈసీని కలవనున్నారు. ఓట్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. వాటిలో దాదాపు 30 లక్షల దొంగ ఓటర్లను నాడే వైఎస్సార్సీపీ తొలగించి వేయించింది. 2019 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,98,34,776 కాగా, 2023 మార్చి 31 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,97,96,678. చంద్రబాబు హయాంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గినప్పటికీ, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దొంగ ఓట్లను తొలగిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు తథ్యమని, హిందూపురంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి అన్నారు. చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు -
CEC Bill: అద్వానీ లేఖ తెరపైకి..
ఢిల్లీ: ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో.. కాంగ్రెస్ కమలం పార్టీ సీనియర్, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ రాసిన ఓ లేఖను తెరపైకి తెచ్చింది. ఎన్నికల అధికారులను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని (CJI) తప్పించే ప్రతిపాదిత బిల్లుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో అద్వానీ లేఖను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆ పార్టీ జైరాం రమేష్ ఈ మేరకు లేఖను షేర్ చేశారు. 2012లోనే.. ఇలాంటి నియామకాలను పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయి కొలీజియం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీ లేఖ ద్వారా సూచించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఎన్నికల కమిషన్ పనితీరులో స్వతంత్రతను అనుమతించాలంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల కార్యాలయం, అలాగే ఎన్నికల కమిషనర్లు కార్యనిర్వాహక జోక్యానికి దూరంగా ఉండాలి అని అద్వానీ ఆ లేఖ స్పష్టంగా అభిప్రాయపడ్డారు. “There is a rapidly growing opinion in the country which holds that appointments to Constitutional bodies such the Election Commission should be done on a bipartisan basis in order to remove any impression of bias or lack of transparency and fairness.” No, this isn’t a Modi… pic.twitter.com/NDXAHLQ6DZ — Jairam Ramesh (@Jairam_Ramesh) August 11, 2023 ఇదిలా ఉంటే.. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే ఓ కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ సిఫారసుల ఆధారంగా.. రాష్ట్రపతి ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను నియమించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం. అయితే.. ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు మార్చిలో తీర్పు ఇచ్చింది. అయినా కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోయింది. చీఫ్ జస్టిస్ ప్లేస్‌లో కేబినెట్ మంత్రిని చేర్చింది. CEC బిల్లు విషయంలో కేంద్రం చర్య.. అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉండడమే కాదు.. మార్చి 2వ తేదీన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని జైరామ్ రమేశ్ తన ట్వీట్లో విమర్శించారు. అయితే ఈ బిల్లు, ఎన్నికల వేళ ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే యత్నంగా కనిపిస్తోందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే 2024, ఫిబ్రవరి 14వ తేదీతో రిటైర్ కానున్నారు. అదే సమయంలో ఎన్నికలూ జరగాల్సి ఉంది. దీంతో పోల్ ప్యానెల్ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను ప్రభుత్వ సిఫార్సుల మీద రాష్ట్రపతి నియమించేవారు. ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ విషయంలో మరీ ఇంత దుర్మార్గమా? -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ..
ఢిల్లీ:తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు వాళ్ల సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.స్థానికంగా అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి:రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే! -
ఈసీపై ఎన్నదగిన తీర్పు
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం, వాటికి విశ్వసనీయత కల్పించటం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అత్యంత కీలకం. ఈ కర్తవ్యనిర్వహణలో తలమునకలు కావాల్సిన ఎన్నికల సంఘం(ఈసీ) స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆ పని పూర్తిచేస్తున్నదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తే విశ్వస నీయత దానంతటదే ఏర్పడుతుంది. అందుకే ఎన్నికల సంఘం కూర్పు విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ప్రకారం ఇకపై ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే త్రిసభ్య కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను ఖరారు చేయాల్సివుంటుంది. ఇంతవరకూ అనుసరిస్తున్న విధానం వేరు. కేంద్ర పాలకుల ఇష్టారాజ్యంగా ఆ నియమాకాలుంటున్నాయి. ఎన్నికల సంఘం విధులు, అధికారాల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. విస్తృతాధికారాలుండే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని, అందుకు అనుగుణమైన అధికారాలు దానికుండాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, అవసరమైన మార్గదర్శకాల ఖరారు కోసం ఎన్నికల సంఘం ఉండాలని రాజ్యాంగంలోని 324 అధికరణ మొదలుకొని 329వ అధికరణ వరకూ నిర్దేశిస్తున్నాయి. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను ఏవిధంగా ఎంపిక చేయాలన్న అంశంలో రాజ్యాంగం ఏమీ చెప్పలేదు. ఈ అధికరణలపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగి నప్పుడు ఎంపిక ప్రక్రియను పార్లమెంటుకే విడిచిపెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిర్దిష్టంగా ఉండే నిబంధనలకే తూట్లుపొడవటం అలవాటైన దేశంలో స్పష్టత కొరవడితే చెప్పేదేముంది? ఇది సహజంగానే అధికారంలో ఉండేవారికి వరమైంది. తమకు అనుకూలురైనవారిని ఆ సంఘంలో నియమించటం ఒక సంప్రదాయంగా స్థిరపడింది. అందువల్లే ఎన్నికలు ముంచుకొచ్చినపుడల్లా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు రివాజుగా మారాయి. ఎన్నికలు ప్రకటించటం దగ్గర్నుంచి ఎన్నికల తేదీల ఖరారు, ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ వివాదాస్పదమే అవుతున్నాయి. పార దర్శకత లోపించటమే ఇందుకు కారణం. గడువు పూర్తయిన రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి మాత్రమే ఎన్నికల ప్రకటన వెలువరించి, మరో రాష్ట్రం గురించి మౌనం పాటించారన్న విమర్శలు ఒకపక్క... ప్రచారసభల్లో అవతలి పార్టీ నేతలు ఏం మాట్లాడినా మౌనంవహిస్తూ తమపై మాత్రం దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు మరోపక్క తరచు ఈసీ ఎదుర్కొనాల్సివస్తోంది. కొన్ని సందర్భాల్లో అదిచ్చే వివరణలు అసంబద్ధంగా ఉండటం కూడా కనబడుతూనే ఉంది. కేంద్రంలోని పాలకపక్షం తన విధేయులను ఎన్నికల సంఘంలో నియమించటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపించటం కూడా మామూలే. యూపీఏ పాలనలో ప్రధానంగా బీజేపీనుంచి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే ఇప్పుడు బీజేపీయేతర పక్షాలు ఆ పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు అధికారంలోకొచ్చినా కమిషనర్ల ఎంపిక ప్రక్రియ మార్చాలన్న ఆలోచనకే దూరంగా ఉంటున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే అది తమకే గుదిబండవుతుందని, తమ పాచికలు పారవని భావిస్తున్నారు. వాస్తవానికి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ఎన్నికల సంఘం కూర్పు, ఎన్నికల సంస్కరణల గురించి లోతుగా పరిశీలించి నివేదిక ఇచ్చింది. కమిషనర్ల ఎంపికకు ఒక ప్రత్యేక కమిటీ ఉండాలని సూచించింది. కానీ ఇంతవరకూ దాని ఊసే లేదు. ఎన్నికల సంఘం తటస్థ పాత్ర పోషిస్తున్నదని పార్టీలకు పూర్తి నమ్మకం కుదిరినప్పుడే ఆ ఎన్ని కలపై ప్రజానీకంలో కూడా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం తాను సర్వస్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నానన్న భరోసా అందరిలోనూ కలగజేస్తే మెజారిటీ ప్రజానీకం నిర్భయంగా ఓటేయగలుగుతారు. మొదట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఒక్కరే ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యంవహిస్తే 1987 నాటి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో అప్పటి సీఈసీ ఆర్వీఎస్ పేరిశాస్త్రి వ్యవహరించిన తీరుతో ఆందో ళనపడ్డ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1989 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీని ఇద్దరు సభ్యుల కమి షన్‌గా మార్చారు. కానీ ఎన్నికల అనంతరం వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని తిరగదోడింది. ఆ తర్వాత పదవి కోల్పోయిన కమిషనర్ ధనోవా సుప్రీంకోర్టుకెళ్లినా లాభం లేక పోయింది. తదనంతరకాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం అప్పటి సీఈసీ శేషన్ దూకుడు చూసి కీడు శంకించి త్రిసభ్య కమిషన్‌గా దాన్ని మార్చింది. కొత్తగా ఎంఎస్ గిల్, జీవీజీ కృష్ణ మూర్తిలను తీసుకుంది. ఎన్నికల సంఘం చట్టాన్ని సవరించి ముగ్గురికీ ఒకే రకమైన అధికారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కల్పించారు. అయితే అంతా మారినట్టేనా? లేదని ఇన్ని దశాబ్దాల అనుభవాలు పదే పదే నిరూపించాయి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈసీకి నిందలు తప్పటం లేదు. నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత కూడా అంతంతమాత్రం. సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే ప్రభుత్వాలు దీన్ని గ్రహిస్తే బాగుండేది. కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై కొత్త చట్టం తీసుకు రావాలని, అంతవరకూ తమ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తాజాగా ధర్మాసనం ప్రకటిం చింది. ఈ తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టం తీసుకొస్తుందని, ఇకపై ఎన్నికల సంఘం తటస్థత విషయంలో అనుమానాలకూ, అపోహలకూ ఆస్కారం ఉండదని ఆశించాలి. -
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకంపై పలు ప్రశ్నలు సంధించిన సుప్రీం
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకంపై పలు ప్రశ్నలు సంధించిన సుప్రీం -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆలస్యానికి కారణం అదే ..
-
Gujarat: రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. తేదీలివే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 1న, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 8 న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 182 శాసనసభ స్థానాలున్నాయని.. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ చెప్పారు. ► నవంబర్ 5 న తొలిదశ ఎన్నికలకు నోటిషికేషన్ ► నవంబర్ 10న రెండోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ ► నవంబర్ 14 వరకు తొలిదశ నామినేషన్ల స్వీకరణ ► నవంబర్ 15న తొలిదశ నామినేషన్ల పరిశీలన ► నవంబర్ 17 వరకు తొలిదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ► నవంబర్ 17 వరకు రెండోదశ నామినేషన్ల స్వీకరణ ► నవంబర్ 18న రెండోదశ నామినేషన్ల పరిశీలన ► నవంబర్ 21 వరకు రెండోదశ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ► డిసెంబర్ 10తో ముగియనున్న ఎన్నికల షెడ్యూల్ మోదీ, షాకు కీలకం ఫిబ్రవరి 18తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుతం బీజేపీకి 111, కాంగ్రెస్‌కు 62 సభ్యులున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ఉండనుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆప్ ప్రచారంలో దూకుడు పెంచింది. మరోవైపు 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఈ ఎన్నిక కీలకం కానుంది. సొంత రాష్ట్రంలో పట్టు కోల్పోకూడదని వీరిద్దరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4.90 లక్షల ఓటర్లున్నారు. 51,782 పోలింగ్ కేంద్రాలున్నాయి. -
ఢిల్లీ: సీఈసీని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
-
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
ఎన్నికల హామీలపై పర్యవేక్షణ ఉండాలి
మన దేశ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రజలు ఆకాంక్షి స్తున్నారు. ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల నియమావళి, ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం వంటి వాటిలో మార్పులు రావాలని ఆశిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలోచనలు ఉన్నా, అమలు వాయిదా పడుతూ వస్తున్నది. కొత్త కమిషనర్ సారథ్యంలో ఈ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయని ఆశిద్దాం. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఉన్నప్పటికీ... నియంత్రణ వైఫల్యం కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవడాన్ని నివారిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం మెరుగవుతుంది. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషనర్ నియంత్రణ కలిగి ఉండాలని చాలామంది బలంగా కోరుతున్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అమలుకు సాధ్యంకాని, ప్రజాకర్షక హామీలను తొలగించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉండాలి. ఎన్నిక తరువాత కూడా, మేనిఫెస్టోలోని హామీల అమలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ బాధ్యతను ఎన్నికల కమిషన్ చేపడితే ప్రజాస్వా మ్యంపై ప్రజల నమ్మకం, కమిషన్ ప్రతిష్ఠ తప్పకుండా పెరుగుతాయి. ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే... ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు నిరంతరం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా జరగాల్సి ఉంది. బోగస్ ఓటర్ల ఏరివేత, అర్హుల చేర్పు జనామోదంగా ఉండాలి. ఓటర్ల గుర్తింపును ‘ఆధార్’తో అనుసంధానం వేగిరపర్చాలి. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎం (ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై ఉన్న అపోహలను, ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పారద్రోలి, ప్రజల విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలి. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?) ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటింగ్ శాతం తగ్గితే, ఎన్నికలు అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవు. ఎన్నో సవాళ్లు, సంస్కరణలు కొత్త ఎన్నికల కమిషన్‌కు స్వాగతం పలుకుతున్నా... సమర్థవంతంగా పరిష్కరిస్తూ ప్రజామోదం పొందాలని ఆకాంక్షిద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా పనితీరు ఉండాలని కోరుకోవడం అత్యాశ ఎంతమాత్రం కాబోదు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్ (ప్రస్తుత మంత్రి) సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చినట్టుగా అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు సమాచారం ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తిస్థాయిలో విచారించాం ‘2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చారని చలువగాలి రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్ 16న ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరాం. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ 2018 నవంబర్ 14న మూడు సెట్లు, నవంబర్ 19న మరో సెట్ నామినేషన్ వేశారు. చదవండి👉🏻 Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ మొత్తం 51 సెట్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఆరు సెట్లకు సంబంధించి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద 14 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్ (సక్రమమైన) నామినేషన్ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్/డూప్లికేట్ సెట్లు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో కనిపించే ఆప్షన్ లేదు. ఈ మేరకు 2018 నవంబర్ 14న శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లు మార్చారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, అలాంటివేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదులు డిస్పోజ్ చేస్తున్నామని తెలిపారు. ధ్రువీకరించిన కలెక్టర్ ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని, రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని ఆయన చెప్పారు. చదవండి👉 దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
కోట్లు పట్టుకుని.. మళ్లీ ఇచ్చేశారు!: విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో దొరికిన డబ్బునంతా దాదాపు తిరిగి ఇచ్చేశారు. నమోదు చేసిన పోలీస్ కేసుల పరిస్థితి సైతం బుట్టదాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ – కేసుల నమోదు తదితర అంశాలపై సుపరిపాలనా వేదిక సేకరించిన సమాచారంలో విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడైయ్యాయి. ఈ మేరకు ఫోరం కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కు లేఖ రాస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైన తీరుపై తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా తగ్గించేందుకు వెంటనే తగు మార్గదర్శకాలు విడుదల చేయాలని పద్మనాభ రెడ్డి కోరారు. 94 కేసులు నమోదు... హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అక్టోబర్1 నుంచి నవంబర్ 2 వరకు వివిధ ప్రాంతాల్లో రశీదులు లేని రూ.3.80 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 94 కేసులు నమోదు చేశారు. ఇందులో కేవలం 18 లక్షలే కోర్టుకు సమర్పించి, మిగిలిన కేసుల్లో డబ్బంతా వాపస్ ఇచ్చేశారు. 94 కేసుల్లో కేవలం ఐదు కేసుల్లోనే అభియోగాలు నమోదు చేయగా, అందులో రెండు కేసులు పేకాటకు సంబంధిం చినవి కాగా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన డబ్బు పంపిణీకి సంబంధించి మూడు కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేశారు. చదవండి: మోదీ జీ... ప్లీజ్ పెంచండి.. పోస్ట్‌కార్డ్ సందేశాల పవర్ ఇది! -
హుజూరాబాద్ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్లే?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశముందనే సంకేతాలు ఇస్తోంది. సీఈసీ ఈ నెల 9న లేఖ విడుదల చేసింది. ‘ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో గతంలో సాధారణ లేదా ఉప ఎన్నికలు జరిగే చోట అనుసరించాల్సిన మార్గదర్శకాలతో అనేక ఆదేశాలు, సూచనలు జారీ చేశాం. అయితే ఇప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో జారీ చేసిన ఆయా మార్గదర్శకాలపై మీ పార్టీల అభిప్రాయాన్ని ఈ నెల 30వ తేదీలోగా వెల్లడించగలరు..’అని అందులో కోరింది. అభిప్రాయాలు పరిశీలించిన తర్వాతే.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, మేఘాలయ, ఏపీ, తమిళనాడులో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలోనూ ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సీఈసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కోరడం, ఈ నెల 30లోగా సలహాలు, సూచనలు అందజేయాలని కోరిన నేపథ్యంలో ఇప్పట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, ఆ తర్వాతే ఉప ఎన్నికలపై సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో పాటే శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది. -
కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఈసీ తెలిపింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో 3 మండలి స్థానాలకు ఈ నెల 31తో, తెలంగాణలో 6 మండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. తాజాగా ఈ నిర్ణయంతో ఏపీలో 3 , తెలంగాణలో 6 మండలి సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని సీఈసీ తెలిపింది. చదవండి: DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం -
పసుపు రైతులకు దొరకని సీఈసీ అపాయింట్మెంట్
-
సీఈసీని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల బృందం
-
ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
-
ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
అమరావతి: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్పీ ఠాకూర్ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో డీజీపీ ఠాకూర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఆర్పీ ఠాకూర్‌ను ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో ఏసీబీ బాధత్యల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. రేపు మరోసారి ఎన్నికల సంఘం ముందు డీజీపీ హాజరు కానున్నారు. -
టీఆర్ఎస్పై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్ శుక్రవారం ఢిల్లీలో సీఈసీని కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా గవర్నర్ ద్వారా హైదరాబాద్‌లో మూడో దశ మెట్రోను ప్రారంభించారని, ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. అలాగే ఇటీవల భూ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తి తన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోకు స్పందించి సీఎం కేసీఆర్.. నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడి కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించి రైతుబంధు కింద నగదు ఇస్తారని చెప్పారన్నారు. ఈ ఫోన్ సంభాషణను ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేక ప్రసారం చేశారన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల భూ వివాదాలున్నా వాటిని పట్టించుకోకుండా కేవలం ప్రచారం కోసం ఎన్నికల ముందు ఇలా కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడారని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్నారు. ఉద్యమసింహం విడుదల కూడా ఉల్లంఘనే.. ఎలాంటి ఆదేశాలు లేకున్నా జాతీయ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు రాష్ట్రంలో ముసుగులు వేశారని, ఎన్నికల వేళ తమ పార్టీ నేతలను హింసిస్తున్నారని శశిధర్, నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’చిత్రాన్ని విడుదల చేయడం కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బ్యాలెట్ ద్వారా జరిగే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. -
‘పొరపాటు దొర్లకుండా మూడుసార్లు పరిశీలిస్తున్నాం’
అమరావతి: ఈవీఎం బ్యాలెట్లలో చిన్నపొరపాటు కూడా దొర్లకుండా ఉండేందుకు ప్రతీ బ్యాలెట్‌ను రెండు మూడు మార్లు పరిశీలిస్తున్నామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. శుక్రవారం అమరావతిలో ద్వివేది విలేకరులతో మాట్లాడారు. ఈసారి అభ్యర్థుల ఫోటోలను కూడా బ్యాలెట్లపై ముద్రించాల్సి ఉంది.. అందుకే పరిశీలనా ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవీఎంలలో పెట్టే బ్యాలెట్ పేపర్ల ముద్రణను ప్రారంభించామని వెల్లడించారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలోనే వీటిని ముద్రిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 7 వేల వరకూ ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి ఉందన్నారు. ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గానికి 30 వేల చొప్పున పేపర్లు అవసరం అవుతాయన్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 30 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉండటంతో 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమని, వీటిని పొరుగు జిల్లాల నుంచే సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పూర్తిగా సిద్ధమైన తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, రాజకీయ పార్టీలు పోలింగ్ తేదీకి 48 గంటల ముందే మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంగా ఏపీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని వ్యాక్యానించారు. ఎన్జీవోల ఓటరు చైతన్యం కోసం పారదర్శకంగా ప్రచారం చేస్తే ఇబ్బంది లేదని, పార్టీల పరంగా చేస్తే ఆ ఖర్చు సదరు పార్టీ ఖాతాలోకే వెళ్తుందని పేర్కొన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మాకు సంబంధం లేదు’
అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతిలో ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయనిపుణుల అభిప్రాయం తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఈ నెల 29న సినిమా విడుదల చేసే అంశం ఈసీకి సంబంధం లేదని వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓటర్ల తుది జాబితాను ఖరారు చేశామని తెలిపారు. ఫారం-6లను మార్చి 10వ తేదీన నిలిపేసినా..పరిశీలన ప్రక్రియను ఇవాళ్టి వరకూ కొనసాగించామన్నారు. మార్చి 20వ తేదీనే ఓట్ల తొలగింపు పక్రియ ముగిసిందన్నారు. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మందిగా తేలిందని, మార్చి 18వ తేదీతో మొదలైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసిందని చెప్పారు. అలాగే మార్చి 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో కేంద్రం నుంచి వచ్చిన అబ్జర్వర్లు కూడా పాల్గొంటారని, వీడియో రికార్డింగు కూడా చేయనున్నామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు తుదిగా అభ్యర్థులకు జారీ చేసిన బీఫాంనే ఈసీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 230 కేజీల వెండి, 120 వాహనాలు స్వాధీనం అయ్యాయని వెల్లడించారు. అలాగే 12 కోట్ల రూపాయల విలువ చేసే 2.5 లక్షల లీటర్ల మధ్యం దొరికిందని, రూ.6 కోట్ల విలువ చేసే ఎన్నికల్లో పంచే వస్తువులు పట్టుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో దురుద్దేశపూర్వక వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలకు 367 నోటీసులు జారీ చేసినట్లు ద్వివేది తెలిపారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. -
ఓటు నమోదుకు రేపే చివరి రోజు: ఈసీ
-
ఆఫ్లైన్లోనూ ఓటు దరఖాస్తుకు అవకాశం
అమరావతి: ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15తో గడువు ముగుస్తుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు నమోదు కోసం ఆన్లైన్లో సర్వర్ డౌన్ అయితే ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేయవచ్చునని సూచించారు. బూత్ లెవెల్ అధికారి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ దరఖాస్తు ఫారంలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ఏపీ ఓటర్ల నమోదులో వెనకబడి ఉందన్న వాదనలు సరికాదని అన్నారు. ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశముందని వ్యాక్యానించారు. 3.95 కోట్లకు ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితా చేర్చామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత విడుదల చేయనున్న అనుబంధ ఓటర్ల జాబితా తర్వాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్నికల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు ఏపీలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. 6600 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 31 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 46 తాత్కాలిక చెక్‌పోస్టులు, 18 మొబైల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాణిజ్య పన్నుల శాఖల ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెంచినట్లు చెప్పారు. సోషల్ మీడియాపై నిఘా కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో 29.91 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల తనిఖీల్లో 190 జిలెటిన్ స్టిక్స్, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
రెండో రోజు సీఈసీ సునీల్ అరోరా సమీక్ష
-
సేవ్ డెమోక్రసీ
-
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్ జగన్
-
మల్రెడ్డి పిటిషన్ వచ్చేనెలకు వాయిదా వేసిన కోర్టు
సాక్షి, హైదరాబాద్ : వీవీ ప్యాలెట్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేసిన ఎలక్షన్ పిటిషన్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 7 వరకూ ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ.. హై కోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తం పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు కూడా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
ఓట్ల తొలగింపుపై కోర్టుకెళ్తాం : సజ్జల
సాక్షి, వైఎస్సార్ జిల్లా : చంద్రబాబు నాయుడు దోషిగా బోనులో నిలబడాల్సిన సమయం వచ్చింది.. అందుకే ఓట్ల తొలగింపు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాల వల్ల త్వరలోనే ఆయన బోనులో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. దీన్నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు ఏడాది నుంచి ఓట్ల తొలగింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో చంద్రబాబు బూత్ స్థాయిలో కొన్ని ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నాడని ఆరోపించారు. ఈ సర్వేల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 55 లక్షల ఓట్లను తొలగించారని.. దీని గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కత్తిరింపు సర్వేల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఓటమి భయంతోనే చంద్రబాబు అత్యంత హీన స్థితిలోకి వెళ్లిపోయరంటూ విమర్శించారు. సర్వేల పేరుతో ఎవరు వచ్చినా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు సజ్జల. -
‘ఈవీఎంల భద్రత నిరూపించడానికి సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంల సెక్యూరిటీని నిరూపించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 1982 నుంచే ఈవీఎంలను వాడుతున్నామన్నారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోణల గురించి కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల పట్ల తానేమీ స్పందించనన్నారు రజత్ కుమార్. ప్రస్తుతం తాము పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఓటర్ల కోసం 1950 హెల్ప్‌లైన్‌ను లాంచ్ చేశామని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అనుమానాలున్న 1950కి కాల్ చేయవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాపై కూడా ఆంక్షలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే సోషల్ మీడియా హెడ్స్‌తో మాట్లాడినట్లు తెలిపారు. -
ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి: కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నిర్వచన్ సదన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈ సందర్భంగా అరోరాని కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టీఆర్ఎస్కు నష్టం జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందే సవరణలు చేయాలని కోరారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్ అన్నారు. 'ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, హ్యాట్ గుర్తులపై సునీల్ అరోరాతో కేసీఆర్ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజక వర్గాల్లో నష్టం జరిగింది. అందువల్ల ట్రక్కు సింబల్ ఇకపై ఇవ్వొద్దని, ఎవరికీ కేటాయించవద్దని కేసీఆర్ సునీల్ అరోరాను కోరారు. ప్రజా స్వామ్యంలో ఓటర్లకు అనువుగా గుర్తులు ఉండాలి. ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండకూడదని సీఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాము. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం భేటి అయి నిర్ణయం తీసుకుంటామని సునిల్ అరోరా కేసీఆర్‌కు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా సాగినందుకు కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు' అని ఎంపీ వినోద్ తెలిపారు. (కారుకు ట్రక్కు బ్రేకులు!) -
ఫిబ్రవరిలో ‘లోక్‌సభ’ షెడ్యూల్?
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా నేతృత్వంలోని కమిషన్ వచ్చే వారంలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి లభ్యత, రవాణా తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాల సన్నద్ధత, ఏర్పాట్లపై ఈసీ విస్తృత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి, ఎన్నికల షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్ 7– మే 12వ తేదీల మధ్యలో జరిగాయి. ఈసారి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ మేరకు మొదటి విడత ఎన్నిక ఏప్రిల్ 10వ తేదీ తర్వాత జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ ద్వారా జూన్ 30వ తేదీ వరకు దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి ఆమోదం లభిస్తుంది. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడ్డాక మే మూడో వారంలో లేదా కాస్త ముందుగా ఏర్పడే కొత్త ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. -
‘ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి’
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైఎస్సార్సీపీ అగ్రనేతలు గురువారం భేటీ అయ్యారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్‌కు వివరించారు. ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని వినతి పత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్, మిథున్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు: విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఒకే వ్యక్తి పేరుతో నాలుగు, ఐదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వివరించారు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించారు. ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలి లేదంటే ఆర్డినెన్స్ చేయాలని కోరారు. చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. -
ఈసీ చీఫ్‌గా సునీల్ అరోరా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అరోరాను సీఈసీగా నియమించారు. ఓపీ రావత్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, హరియాణా, జమ్మూ కశ్మీర్, సిక్కిం, ఒడిషా, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అరోరా సారథ్యంలో జరగనున్నాయి. పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి అయిన సునీల్ అరోరా గతంలో కేంద్ర సమాచార ప్రసార, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా వ్యవహరించారు. ఆర్థిక, జౌళి మంత్రిత్వ శాఖతో పాటు ప్రణాళిక సంఘంలోనూ కీలక బాధ్యతల్లో అరోరా పనిచేశారు.1999-2002 మధ్య అరోరా పౌరవిమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా ఆరేళ్ల పాటు కొనసాగుతారు. -
మా ప్రాధాన్యతలు ఇవే: రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఓటింగ్ రోజైన డిసెంబరు 7వ తేదీన, దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన సంస్థలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ సెలవు పాటించేల్సిందేననీ, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు, విద్యాలయాలకు సెలవు ప్రకటించామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన సీఈఓ, ప్రముఖులతో గురువారం సైబరాబాద్‌లో జరిపిన ఇష్టాగోష్ఠి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘దేశం, ప్రజాస్వామ్యం.. వీటిదే మొదటి ప్రాధాన్యతగా ఉండాలనీ, మీరంతా మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలి’’ అని ఉద్బోధించారు. విదేశీ ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా అక్కడి వారి పనివేళలను అనుసరించడం, అలాగే కీలకమైన వ్యాపారపరమైన కార్యకలాపాలు కూడా నిర్వర్తించాల్సి ఉన్నందున, ఉద్యోగులు అన్ని సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుందనీ, అందువల్ల రోజంతా పూర్తిగా సెలవు ప్రకటించకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్.సి.ఎస్.సి) ప్రతినిధులు కోరినప్పడు డా. రజత్ కుమార్ పైవిధంగా స్పందించారు. అయితే పౌరులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని, తమ వద్ద పనిచేసే వారందరూ ఓటు వేసి రావడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, విధి నిర్వహణ వేళల సడలింపు వంటి చర్యలు తీసుకుంటామని వారు గట్టి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పిన విషయాలతో ఏకీభవిస్తూ అక్కడ హాజరైన వారందరూ చేతులెత్తి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఎంతో ప్రగతి శీలకంగా ఆలోచించే వారు మీ రంగంలో ఉన్నారు. దేశం ముందుకు పోతున్నకొద్దీ మీరు కూడా వ్యవస్థలో భాగస్వాములు కావాలి. ఓటు వేయడంలో మన బాధ్యతను మరిచి - అమెరికా, జపాన్, సింగపూర్‌లతో పోలిస్తే మన వ్యవస్థ ఘోరంగా ఉందనడం సరికాదనీ, మనం ఓటు వేయకపోతే జరిగే దుష్పరిణామాలకు మొత్తం దేశ ప్రజలందరూ కొన్ని సంవత్సరాలపాటు బాధపడాల్సి వస్తుందని డా.రజత్ కుమార్ హెచ్చరించారు. అలాగే ఐటీ కంపెనీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న వారి సూచనలను ప్రస్తావిస్తూ దేశంలో ప్రతి పౌరుడూ తను ఉంటున్న ఇంటి నుంచీ 500 మీటర్ల దూరం దాటి వెళ్ళే అవసరం లేకుండా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారి సూచన పాటించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను దుర్వినియోగం చేయడం సాధ్యంకాదనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, దేశ చట్ట పరిమితులకు లోబడి, పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థలు వాటిని తయారు చేశాయనీ, ప్రతి స్థాయిలో వాటిని పలు రకాలుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే పరీక్షించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రారంభ ఉపన్యాసం చేసి అందర్నీ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమీషనర్ హరి చందన, కార్మిక విభాగం జాయింట్ కమీషనర్ ఆర్. చంద్రశేఖర్, ఎస్.సి.ఎస్.సి కార్యదర్శి, ఇన్ఫోపీర్స్ సీఈఓ భరణీ కుమార్ ఆరోల్, రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోజూవారీ ప్రచార వ్యయం కుదింపు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మితిమీరిన నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచారం నిమిత్తం అభ్యర్థి రోజుకు జరిపే నగదు లావాదేవీలను రూ.20 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.10 వేల పరిమితి దాటి కూడా ఖర్చు చేయాల్సి వస్తే, ఆ లావాదేవీలను అభ్యర్థి ఖాతా నుంచి చెక్కులు, డ్రాఫ్టులు, నెఫ్ట్/ఆర్టీజీఎస్ రూపంలో నిర్వహించాలని ఈసీ సూచించింది. నవంబర్ 12నే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచార సమయంలో అభ్యర్థి ఎవరైనా వ్యక్తి, సంస్థ నుంచి నగదు రూపంలో రూ.10 వేలకు మించి విరాళాలు, రుణాలు స్వీకరించరాదు. -
‘48 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు గురువారం ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాతో భేటీ అయ్యారు. గల్లంతయిన ఓట్లలో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరుల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అధికారికి తెలిపారు. నియోజకవర్గాల వారిగా ఓట్ల గల్లంతు జాబితాను సిసోడియాకు అందజేశారు. అనంతరం ఈ విలేకరులతలో మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెల పెంచాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. అయితే ఇది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కాబట్టి సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారన్నారు. ఆర్టీజీ, పల్స్ సర్వే పేరుతో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీకున్న సమాచారం ప్రకారం 48. 61 లక్షల ఓట్లను తొలగించారన్నారు. డూప్లికేషన్ ఓట్ల పేరుతో మరో 11 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన చంద్రబాబు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రభావం లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని.. కొన్ని లొసుగులున్నాయని స్వయంగా ఎన్నికల ప్రధాన అధికారే అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటరు జాబితాను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఓటరు జాబితాలో తప్పుల సవరణకు మరింత సమయం ఇవ్వాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామక్రిష్ణారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో మరో నెల సమయం ఇవ్వాలని కోరారు. -
సీఈసీ, ఈసీల నియామకాలకూ కొలీజియం!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), కమిషనర్ల(ఈసీ) నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. పిటిషనర్ తరఫు లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ల వాదోపవాదనలు విన్న తరువాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక కార్యకర్త, న్యాయవాది అనూప్ బరన్వాల్ 2015లో ఈ పిల్ వేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారాలు, పర్యవేక్షణను ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన నిబంధన 324ను సునిశితంగా పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అంశాల్ని విచారించే సందర్భంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయొచ్చని ఆర్టికల్ 145(3)ని ప్రస్తావించింది. మరోవైపు, ప్రశాంత్ భూషణ్ వాదనలతో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విభేదించారు. -
సవ్యంగానే సాగుతున్నాయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సన్నాహాలను పరిశీలించామని, అవన్నీ సవ్యంగానే సాగుతున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రం ఎన్నికలకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. రాష్ట్ర శాసనసభ రద్దు అయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై అధ్యయనం చేయడానికి ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో మంగళవారం విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు, సూచనలను స్వీకరించిన ఈ కమిటీ.. బుధవారం తొలుత కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సుదీర్ఘంగా సమావేశమై చర్చించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోనూ భేటీ అయింది. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లేముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, తన బృందంలోని ఇతర అధికారులతో కలిసి ఉమేశ్ సిన్హా విలేకరులతో మాట్లాడారు. రెండురోజులపాటు వరుసగా నిర్వహించిన సమావేశాల్లో పరిశీలనకు వచ్చిన అంశాలు, సేకరించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ వెళ్లిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా బలగాలు, ఈవీఎంలు, వీవీ పాడ్ యంత్రాలు, నిధులు ఇతర సదుపాయాలపై సమీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షల ఆధారంగా సేకరించిన సమాచారంతో పాటు తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఏడు మండలాలకు సంబంధించిన అంశాన్ని కూడా నివేదికలో పొందుపరుస్తామని వెల్లడించారు. తప్పుగా తొలగించిన ప్రతి ఓటునూ చేర్చాలి... ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఆందోళన వ్యక్తమైందని ఉమేశ్ సిన్హా తెలిపారు. బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ) క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి ఇంకా ఓటరుగా నమోదు కాని వ్యక్తులను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ‘‘తప్పుగా తొలగించిన పేర్లన్నింటినీ విధిగా ఓటరు జాబితాలో చేర్చాలి. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించాలి. తప్పుడు ఎంట్రీలిచ్చిన వారికి సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమంపై రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారోద్యమం నిర్వహించాలి. ప్రతి గ్రామంలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటరు జాబితాలను చదవి వినిపించే ఏర్పాట్లు చేయాలి. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం’’అని ఉమేశ్ తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణ తీరుపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించినట్టు వెల్లడించారు. ఓటరు జాబితాలపై రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు 24 గంటల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. జిల్లాల్లో హెల్ప్లైన్లు 24 గంటలు పని చేయాలని స్పష్టంచేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో సమీక్షించేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాల్సిందిగా ఓటర్లకు ఎస్ఎంఎస్లు పంపించాలని కోరారు. సీనియర్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితా సవరణకు చర్యలు తీసుకుంటున్నారో లేదో పరిశీలించాలన్నారు. ఒకవేళ బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో లేకుంటే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసినట్టు చెప్పారు. అలాగే రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితా సాఫ్ట్, హార్డ్ కాపీలు అందజేయాలని సూచించినట్టు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ సభ్యులైన డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సుదీప్ జైన్, సందీప్ సక్సేనా, ముఖ్య కార్యదర్శి సుమిత్ ముఖర్జీ, డీజీ ధీరేంద్ర ఓఝా, దిలీప్ శర్మ పాల్గొన్నారు. -
నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను సవరించింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2018 జనవరి 1 ఆధారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. -
బ్యాలెట్ ప్రశ్నేలేదు
కోల్‌కతా: ఈవీఎంలు, వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రం)ల ద్వారానే అన్ని ఎన్నికలు జరుగుతాయనీ, బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చే ప్రశ్నే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంల పనితీరు, సమగ్రత విషయంలో అనుమానాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగం, చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు అవసరమైన సామగ్రిని భారీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల సంఘం(ఈసీ) మొబైల్ యాప్ ద్వారా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మొబైల్ యాప్‌నకు 780 వరకు ఫిర్యాదులు వీడియోల రూపంలో అందాయి. యాప్ సాయంతో పౌరులూ సాక్ష్యాధారాలను ఈసీకి నేరుగా పంపొచ్చు. అన్ని ఎన్నికల్లో యాప్‌ను వాడకంలోకి తెస్తాం. ‘రికార్డుల్లో మాత్రమే ఉండి, కార్యకలాపాలు జరపని దాదాపు 1000 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేశాం. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పూర్తి పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందుగా ఎలాంటి ప్రకటన చేసే అధికారం ఈసీకి లేదు’ అని రావత్ వివరించారు. -
సీఈసీకి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను ఎమ్మెల్యే పదవుల నుంచి అనైతికంగా తొలగించారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్లీ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తొలగించారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లు చేర్చాలని, అసెంబ్లీ సెక్రటరీని ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. -
‘ఆమెకే విజయావకాశాలు ఎక్కువ’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మహిళలకే ఎక్కువగా ఉంటాయని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ‘మహిళలు ఓడిపోతారనే భావన సరైంది కాదు. గత 70 ఏళ్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మహిళలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికిచ్చే టికెట్ల శాతం(6%) కంటే వారి గెలుపు శాతమే(10%) ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలు చాలు.. వారు ఎన్నికల్లో గెలవలేరనే భావన తప్పని నిరూపించడానికి’ అని ఖురేషీ తెలిపారు. ఇక మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. భారత్‌లో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 28 శాతం మంది మహిళలు లైంగిక వేధింపుల గురౌతున్నారన్నారు. మహిళలు హింసను భరించాలే తప్ప ఎదురు తిరగకూడదని పురుషులు భావించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం మన రాజ్యాంగం ఎన్నో హక్కులను, చట్ట సభలు చట్టాలను కల్పించాయని.. కానీ, అవేవీ అమలు కాకపోవటం బాధాకరమైన విషయమని ఖురేషీ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నికల ప్రధాన అధికారికి ముద్రగడ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో సామాన్య ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓమ్ ప్రకాష్ రావత్‌ను కోరారు. ఓటరు లిస్టులో పేరున్నా, ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్దుకు ఓటువేయడానికి వెళితే లిస్టులో పేరుంది కానీ, ఓటు వేసే అర్హత లేదని, లిస్టులో పేరు కొట్టేసుందని పోలింగ్ స్టేషన్లో ఉన్న సిబ్బంది చెబుతుంటారని తెలిపారు. దీనిపై అక్కడున్న పై అధికారులకు ఇంటి పన్ను రశీదు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు వగైరా ఆధారాలు చూపించినా అధికారులు నిస్సహాయులుగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముద్రగడ కోరారు. ఎన్నికలలో ఓటింగు రోజు పోలింగ్ కేంద్రాల వద్ద పేజీలకు పేజీల పేర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. బ్లాక్ లిస్టులో తమ పేర్లు పెట్టారేంటి అని రిటర్నింగ్ అధికారినిగానీ, కలెక్టర్‌ను గానీ అడిగితే పై నుంచి ఆదేశాలు వచ్చాయంటారని చెబుతారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణం తెలుసుకోవాలన్నారు. లేకపోతే భారతదేశంలో పుట్టిన తమకు ఓటు హక్కు లేదా అని యువత వాపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఓటు హక్కును సరైన విచారణ జరపకుండానే తీసివేసే ఆలోచన మంచిది కాదని వివరించారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు ఎలాంటి ఆటంకం లేకుండా ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎమ్మెల్యేలపై వేటు; నూతన సీఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపిన ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హత’ వ్యవహారంపై నూతన ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కనీసం మేం చెప్పేది ఆలకించకుండా వేటు వేశార’న్న ఆప్ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఇచ్చిన రెండు అవకాశాలను వారు(ఆప్) వినియోగించుకోలేదు’’ అని కుండబద్దలుకొట్టారు. మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టనున్న రావత్.. సోమవారం పలు జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు. రెండు ప్లస్ రెండు నాలుగే : సీఈసీ రావత్ చెప్పినట్లు.. అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ.. 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. 2017 సెప్టెంబర్ 28న మొదటి, నవంబర్2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిననిర్ణయానికి దోహదపడింది. ‘‘నోటీసులకు సమాధానం చెప్పకుండా వాళ్లు(ఆప్).. మమ్మల్ని(ఈసీని) నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. రెండుకు రెండు తోడైతే నాలుగే అవుతుంది కదా! అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా!’ అని సీఈసీ రావత్ వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది? బ్రీఫ్‌గా.. : 2015 జనవరిలో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆప్.. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చి, మరో 20 మంది ఎమ్మెల్యేలను మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. అయితే, ఆ నియామకాలు చెల్లబాటుకావంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో.. ఆరు నెలలు తిరగముందే ఆ 20 మంది అదనపు పదవులు ఊడిపోయాయి. ‘పార్లమెంటరీ కార్యదర్శులను తొలగించరాదం’టూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సైతం రాష్ట్రపతి కొట్టివేశారు. కాగా, కొంతకాలమే అయినా వారు లాభదాయక పదవులు నిర్వహించారు కాబట్టి ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని యువన్యాయవాది ప్రశాంత్ పటేల్.. నాటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం రాష్ట్రపతి ఆ ఫిర్యాదును ఈసీకి పంపారు. నాటి సీఈసీ నదీం జైదీ నేతృత్వంలో పూర్తి ప్యానెల్(జైదీతోపాటు ఈసీలు ఏకే జోతి, ప్రకాశ్ రావత్) ఆప్ ఎమ్మెల్యేల కేసును విచారించింది. అయితే, ప్రకాశ్ రావత్ బీజేపీ మనిషని, ఆయన పక్షపాతంతోనే వ్యవహరిస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. విమర్శల నేపథ్యంలో రావత్.. విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. జైదీ పదవీ విరమణ తర్వాత జోతి సీఈసీ కావడంతో రెండో స్థానంలో ఉన్న రావత్ మళ్లీ తప్పనిసరిగా కేసు విచారణలో పాల్గొనాల్సివచ్చింది. చివరికి జోతి పదవీవిరమణకు రెండు రోజుల ముందు.. ఈసీ విచారణను ముగించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సూచించింది. అలా అనర్హులైన 20 మంది.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు. జోతి వారసుడిగా రావత్ సీఈసీ పదవిని చేపడతారు. ఆనయ నేతృత్వంలోనే ఖాళీ అయిన ఆ 20 స్థానాలకు 6నెలల్లోపు ఉప ఎన్నికలు జరుగుతాయి. -
ఓటర్ ఐడీగా.. ఆధార్?!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల గుర్తింపు కార్డుగా ఆధార్‌ను ఎందుకు ఉపయోగించకూడదని మాజీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తి మంగళవారం అన్నారు. ఎన్నికల్లో ఆధార్ కార్డును ఏకైక వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తే.. మంచిదని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్ గుర్తింపు కార్డు లేనివారికోసం అనేక ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘః అనుమతిస్తోందని చెప్పారు. దీని వల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని ఆయన తెలిపారు. అక్రమాలుఓట జరిగే అవకాశముందని ఆయన అన్నారు. ఆధార్ కార్డును ఇప్పుడు దేశమంతా వ్యక్తిగత గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. అంతేకాక పలు పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇదే పద్దతిని ఎన్నికల్లో కూడా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఓటర్లందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు లేవు.. కానీ దేశంలోని 90 శాతం జనాభాకు ఆధార్ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఓటర్ గుర్తింపు కార్డు రూపొందిచేకన్నా.. ఆధార్‌నే అందుకు వినియోగిస్తే.. సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతాయని ఆయన అన్నారు. -
మోదీ,అమిత్ షా కోటలో కాంగ్రెస్ విజయం
-
ఎన్నికల ఫలితాలు: బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 1
అహ్మదాబాద్: గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి వెల్లడైన ఫలితాల్లో బీజేపీ రెండు స్థానాల్లో నెగ్గగా, అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అహ్మద్ పటేల్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలాయి. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలు నెగ్గగా, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ మాత్రం ఓటమి పాలయ్యారు. అమిత్‌షాకు 46 ఓట్లు, స్మృతీ ఇరానీకి 45 ఓట్లు, అహ్మద్ పటేల్‌కు మ్యాజిక్ ఫిగర్ అయిన 44 ఓట్లు పోలవ్వగా, బల్వంత్ సిన్హ్ రాజ్‌పుత్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ చూపిస్తూ ఓటేయగా వివాదం మొదలైంది. కాంగ్రెస్ ఫిర్యాదుతో వీరిద్దరి ఓట్లను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించగానే లెక్కింపు ప్ర్రక్రియ మొదలైంది. దీంతో ఓట్ల సంఖ్య 174కు పడిపోయింది. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోగా.. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉండటంతో సంఖ్య 44 గా మారింది. ఈ ఓట్లన్నీ సొంతం చేసుకోవడంతో అహ్మద్ పటేల్ ఐదోసారి ఎన్నికైనట్లయింది. -
రాజ్యసభ ఎన్నికలు: నెగ్గిన కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెలకొన్న హైడ్రామాకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తెరదించింది. ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ డిమాండ్‌కే ఈసీ మొగ్గుచుపుతూ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ చూపించి ఓటు వేశారని, వారి ఓట్లను లెక్కించవద్దని, ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు రణదీప్ సుర్జేవాలా, ఆర్పీఎన్ సింగ్ ఈసీని కలిసి విజ్ఞప్తిచేయడంతో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, పీయుష్ గోయల్‌లు తక్షణం కౌంటింగ్ ప్రారంభించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్ సిన్హా బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మద్ పటేల్ పోటీ చేశారు. -
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి...
-
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి...
►కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతిని కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఈసీ ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారు, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా ఏకే జోతికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ....అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందని, సుమారు పదిమంది మంత్రులు అక్కడే మకాం వేసి అరాచకాలు చేస్తున్నారన్నారు. అలాగే పలువురు అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే నంద్యాలలో ఎన్నికలు పాదర్శకంగా జరిగేలా కేంద్ర బలగాలను పంపించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. సీఈసీని కలిసినవారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు ఉన్నారు.