రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7 వ తేదీన పెద్దల సభకు ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. దీనికి సంబంధించి ఈనెల 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ కు చివరి తేదీ జనవరి 28వ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు 31వ తేదీని ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి నామినేషన్లు పరిశీలన జరుగుతుందని ఈసీ తెలిపింది.