Rajya Sabha Elections
-
కేకే రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్‌సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రగడ
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచి్చంది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి. -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
జోరుగా క్రాస్ ఓటింగ్
బెంగళూరు/లఖ్‌నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్‌లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1; హిమాచల్‌లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్‌లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్‌లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్‌కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! హిమాచల్‌లో టాస్ హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహాజన్‌కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్ ద్వారా హర్‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్పీఎన్ సింగ్, తేజ్‌వీర్‌సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్ జైన్, సంజయ్ సేథ్ విజయం సాధించారు. సమాజ్‌వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. -
వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు
-
వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించనున్నారు. కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ జెండా మాయమయినట్టయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది నిదర్శనం. తన పార్టీకి బలం లేకున్నా.. చివరి వరకు ఓటుకు కోట్లు ఫార్ములా నమ్ముకున్న చంద్రబాబు.. ఆ ఎత్తులు పని చేయకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థిని దించే పని చెయ్యలేదు. చదవండి: 11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు -
సోనియా గాంధీ ఆస్తుల విలువెంతో తెలుసా?
ఢిల్లీ: ఏడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ సారి రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాయ్‌బరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ఆమె ప్రకటించారు. ప్రస్తుతం తన వద్ద రూ. 90,000 నగదు ఉందని, తన మొత్తం ఆస్తుల విలువ రూ. 12,53,76,822 (రూ.12.53 కోట్లు)గా పేర్కొన్నారు తనకు రూ.12.53 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటలీలో తన తండ్రికి చెందిన రూ.27 లక్షల విలువైన ఆస్తిలో వాటా ఉందని, వీటితో పాటు 88 కిలోల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నట్లు సోనియా తెలిపారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో మూడు బిగాల వ్యవసాయ భూమి ఉందని, ఎంపీగా వచ్చే వేతనం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలను ఆదాయంగా ఆమె పేర్కొన్నారు. తన వద్ద రూ.90 వేల నగదు ఉందని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తం రూ. 11.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా సొంత కారు కూడా లేదన్న సోనియా.. సోషల్ మీడియాలో తనకు ఖాతా లేదని తెలిపారు. ఇదీ చదవండి: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు
సాక్షి, విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. ఈ మూడు స్థానాలతో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరనుంది. ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’, వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగియనుంది. ఈలోగా అంటే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు జరగాలి. కానీ పోటీగా ఎవరూ నామినేషన్లు వేయలేదు కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం కానున్నాయి. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. ఇక రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ జెండా మాయమయినట్టయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది నిదర్శనం. తన పార్టీకి బలం లేకున్నా.. చివరి వరకు ఓటుకు కోట్లు ఫార్ములా నమ్ముకున్న చంద్రబాబు.. ఆ ఎత్తులు పని చేయకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థిని దించే పని చెయ్యలేదు. -
బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల గెలుపే లక్ష్యంగా, పార్టీలో కీలకమైన నేతలకు లోక్‌సభలో ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులకు మాత్రమే తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించటం గమనార్హం. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దల సభలో బీజేపీ చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న... ఏడుగురు కేంద్ర మంత్రులకు బీజేపీ తిరిగి రాజ్యసభకు అవకాశం ఇవ్వదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారిని వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక). పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశి వ్యవహరాల శాఖ మంత్రి వి. మురళీధరన్ (మహారాష్ట్ర)లు ఉన్నారు. అయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తన సొంతం రాష్ట్రం అయిన ఒడిశాలోని (సంబల్పూర్ లేదా ధేక్నాల్) సెగ్మెంట్ల నుంచి లోక్‌సభకు పోటీకి నిలపనున్నట్లు సమాచారం. మంత్రి భూపేందర్ యాదవ్‌ను రాజస్థాన్‌లోని (అల్వార్ లేదా మహేంద్రగఢ్) నియోజకవర్గం, మంత్రి చంద్రశేఖర్‌ను బెంగళూరులోని మూడు నియోజకవర్గాలు (సెంట్రల్, నార్త్, సౌత్)లో ఏదో ఒక స్థానంలో బరిలో దించనుంది. మంత్రి మాండవియాను గుజరాత్‌లోని (భావ్‌నగర్ లేదా సూరత్), మంత్రి రూపాలా రాజ్‌కోట్ నుంచి బీజేపీ పోటీలో నిలపనుంది. మంత్రి మురళీధరన్‌కు తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీకి ఉనికి లేనప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా మురళీధరన్‌ను అక్కడ నిలబెడుతుందని సమాచారం. రెండు దఫాల్లో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రుకే తిరగి అవకాశం కల్పించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ (మధ్యప్రదేశ్)లకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఇప్పటివరకు అయితే కేవలం నలుగురు సభ్యులను మాత్రమే తిరిగి ఎంపిక చేయటం గమనార్హం. బీజేపీ పెద్దల సభకు కొత్తవారికి అవకాశం కల్పించటంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడుగురు మంత్రులను కూడా రాజ్యసభకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల బరి దించనున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ: ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
ఢిల్లీ: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక.. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్‌సింగ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరంతా రేపు(గురువారం) నామినేషన్ వేయనున్నారు. రేణుకా చౌదరీ ఎవరి కోటా.? తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన రేణుకా చౌదరీ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖలో పుట్టిపెరిగిన రేణుకా చౌదరీ.. బెంగళూరులో చదువుకున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 1998లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేణుకా ఖమ్మం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. వివాదస్పద ప్రకటనలు చేసి తరచుగా వార్తల్లోకెక్కే రేణుకా చౌదరీ మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పేరు ఆశ్చర్యమే.! తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "నాలాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం అంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి గుర్తించినట్టు.!. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని.. నా జీవితంలో ఊహించలేదు" అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. -
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేబీ 12 మందితో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. గుజరాత్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్‌ను నలుగురు, ఒడిషా నుంచి ఒకరిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్‌భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేయగా.. మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్, మేధా కుల్కర్ణీ, అజిత్ గోప్‌చాడేలతోమ కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి డా. ఎల్. మురుగన్, ఉమేష్‌నాథ్ మహారాజ్, బన్సిలాల్ గుర్జార్, మాయా నరోలియాలను ఎంపిక చేశారు. ఓడిశా నుంచి అశ్వీణీ వైష్ణవ్‌కు మరోసారి బీజేపీ అవకాశం కల్పించింది. ఇక..మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చౌహన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం గమనార్హం. గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదిటి విడతలో ఉత్తరప్రదేశ్(7), బిహార్(2), చత్తీస్ఘఢ్(1), హర్యానా(1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్(1), పశ్చిమ బెంగాల్(1) చొప్పున అభ్యర్థులను బీజేపీ జాబితా విడుదల చేసింది. ఇక.. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్‌తో 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఇద్దరు కేంద్ర మంత్రులకు మళ్లీ రాజ్యసభ టికెట్లు
ఢిల్లీ, సాక్షి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు. ఒడిషా నుంచి ఆయనకు రాజ్యసభ టికెట్‌ను కేటాయించింది బీజేపీ. అలాగే.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేసింది. ఒకవేళ అశ్వినీ వైష్ణవ్, మురుగున్‌లు గనుక ఎన్నికైతే.. అదే రాష్ట్రాల నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహించే నేతలు అవుతారు. మధ్యప్రదేశ్ నుంచి మురుగన్‌తో పాటు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన అశ్వినీ వైష్ణవ్.. 2019లో తొలిసారి ఒడిషా అధికార పార్టీ బీజూ జనతా దళ్(BJD) మద్దతుతో నెగ్గారు. రెండోసారి కూడా ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోనూ మురుగన్ గెలుపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లలో సంఖ్యా బలం ఆధారంగా చూసుకుంటే.. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒక్క సీటు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రేపటితో ముగియనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నికల నామినేషన్ గడువు
-
మొత్తానికి.. చేతులెత్తేసిన చంద్రబాబు!
ఢిల్లీ, సాక్షి: నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. ఆఖరికి చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీలో టికెట్లు దక్కని వాళ్లపై ఆశలు పెట్టుకుంటే.. అవి కాస్త గల్లంతయ్యాయి. సంక్షేమ సారథి జగనన్న వెంటే ఉంటామని వాళ్లు తేల్చుకోవడంతో టీడీపీ అధినేతకు నిరాశే ఎదురైంది. ఫలితంగా.. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతోంది. రాజ్యసభలో టీడీపీని మట్టికరిపించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. సంఖ్యాబలం చూసుకుంటే.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్సీపీ ఏకపక్షంగా మూడింటికి మూడు దక్కించుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నామినేషన్ల దాఖలు గడువుకు మరో రెండు రోజులే మిగిలి ఉంది. రాజ్యసభలో పోటీకి.. ప్రాతినిధ్యానికి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి ఇప్పుడు 18 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడుతుంది. వైఎస్సార్సీపీలో మార్పులు-చేర్పుల కారణంగా టికెట్ దక్కనివాళ్ల మీద చంద్రబాబు గంపెడు ఆశలు పెట్టున్నారు. కుట్రలు, కుతంత్రాలకు తెర తీశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనంతలో చంద్రబాబుపై టీడీపీ నేతల ఫైర్ ఇలా .. ఎలా చూసుకున్నా రాజ్యసభ పోటీలో టీడీపీ గట్టెక్కడం అసాధ్యం. అందుకే పోటీ చేసే బలం లేక బరిలోకి దిగకూడదని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ పరిణామం ప్రతికూలం కానుంది. మరోవైపు వైఎస్సార్సీపీ ఖాతాలోనే మూడు రాజ్యసభ సీట్లు పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు దాఖలు చేశారు. -
రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియా శ్రీనేత్?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకటి ఏఐసీసీ నుంచి మరోటి తెలంగాణ నుంచి భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనేత్ పేరును పరిశీలిస్తున్నారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాందీలను తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని, లేదంటే రాజ్యసభకు పంపాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు కాని పక్షంలో శ్రీనేత్తో పాటు కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేసిన ఇద్దరి నేతల పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రానికి చెందిన ఒకరిని ఈమారు రాజ్యసభకు పంపనున్నారు. చాలాకాలం తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుండటంతో పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, ఈసారి తెలంగాణ నుంచి బీసీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే జానారెడ్డి, రేణుకా చౌదరిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈనెల 15వ తేదీతో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాజ్యసభ అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. -
56 రాజ్యసభ స్థానాలకు 27న ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరిరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఐదింటికి గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులున్నారు. యూపీలో అత్యధికంగా 10 ఖాళీలు ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 ఉన్నాయి. బిహార్, మహారాష్ట్రల్లో చెరో 6, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్లో చెరో 5, కర్ణాటక, గుజరాత్లో చెరో 4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి. బీజేపీ పరం కానున్న 28 సీట్లు ఎన్నికలు జరిగే 56 రాజ్యసభ స్థానాల్లో 28 సీట్లను బీజేపీ గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో 93 మంది బీజేపీ సభ్యులతో కలిసి ఎన్డీఏ కూటమి బలం 114గా ఉంది. కాంగ్రెస్‌కు 30 సీట్లున్నాయి. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం దృష్ట్యా అక్కడి ఒక్క రాజ్యసభ స్థానం ఆ పార్టీకే దక్కనుంది. దాన్ని ప్రియాంక గాం«దీకి కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న వహిస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మరో రాష్ట్రం నుంచి అధిష్టానం సర్దుబాటు చేయనుంది. -
ముగ్గురు ‘పెద్దలు’ ఎవరో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ద్వైవార్షిక ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో, ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుండగా, 27న ఎన్నిక జరగనుంది. అయితే 15వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో సందడి మొదలైంది. పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతుండగా, ఎవరికి చాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లో జరుగుతోంది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం, ఇటీవలి దావోస్ పర్యటన అనంతరం లండన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ముఖ్యమంత్రి భేటీ, తదితర పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుడిని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకటి ఢిల్లీకి, మరొకటి స్థానికులకు రెండు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వు చేయాలని భావిస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీని రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇందుకు కూడా సోనియా మొగ్గు చూపని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతల్లో పార్టీ ఎంపిక చేసే ఒకరిని తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. నేడు టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చ! మరో సీటుపై పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కావడంతో ఎస్సీ మాదిగ లేదా రెడ్డి లేదా బీసీలకు చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలతో పాటు రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు. అరడజనుకు పైగానే ఆశావహులు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు బలరామ్ నాయక్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, వి.హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరో? రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు రిటైర్ కానుండగా ఒక సీటు మాత్రం తిరిగి పార్టీకి దక్కనుంది. ఈ స్థానంలో తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. 2018 ఏప్రిల్ 13న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన ఆరేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే 2022 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రకాశ్ ప్రస్తుతం మండలి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు సుమారు రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కినందున మరోమారు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గానికి చెందిన వారికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున డాక్టర్ కె.కేశవరావు (మున్నూరు కాపు), దామోదర్ రావు (వెలమ), పార్థసారథి రెడ్డి (రెడ్డి), కేఆర్ సురేశ్‌రెడ్డి (రెడ్డి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ లేదా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేస్తారననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. -
RS Elections: వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం.. పెద్దల సభకు జరగబోయే ఎన్నికలు. తద్వారా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశం. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠా నెలకొంది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుంది. కారణం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఉన్న ఒక్క సీటు కూడా దూరం కానుంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యా బలంతో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది వైఎస్సార్సీపీ. ఈ తీవ్ర ఆందోళనల నడుమే దుష్ట రాజకీయానికి తెర లేపినట్లు స్పష్టమవుతోంది. ఎందుకు.. ఏప్రిల్ 2తో వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగియనుంది. సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం కానున్నాయి. తద్వారా రాజ్యసభలో ఉనికే లేకుండాపోనుంది టీడీపీ. అదే జరిగితే.. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి కానుంది. ఇదీ చదవండి: రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల వ్యూహ-ప్రతివ్యూహాలు రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యే ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న 3 స్థానాలకు షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో అప్రమత్తమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ గెలుచుకుంటామని వైఎస్సార్సీపీ ధీమాతో ఉండగా.. ఒక్క సీటుకు పోటీ పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ప్రస్తుతం స్పీకర్ ముందు నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. గంటా రాజీనామా ఆమోదం ద్వారా టీడీపీ కి ఒక సీటు తగ్గింది. మళ్లీ అదే బాటలో బాబు.. తెలుగుదేశం అనగానే గుర్తొచ్చేది పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఓటుకు కోట్లు అయినా.. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల డబ్బు వ్యవహారం అయినా.. ఫిరాయింపులకు టీడీపీ బ్రాండ్‌గా మారింది. మరోసారి అదే అస్త్రంపై నమ్మకం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. బలం లేకున్నా... పోటీకి అభ్యర్థిని పెట్టడం.. ఆ పార్టీకి వస్తోన్న అనవాయితీ. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరు పరిశీలిస్తున్నట్టు టీడీపీ లీకులిస్తోంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల ద్వారా నెలపాటు స్పీకర్‌ను గడువు కోరడం వెనుక చంద్రబాబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
రాజ్యసభకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన, తెలుగు రాష్ట్రాల వారికి దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబు బాయి జేసంగ్ బాయ్, కే శ్రీదేవన్స్ జాలా, బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి చోటు దక్కలేదు. కాగా ఇప్పటికే గుజరాత్ నుంచి కేంద్రమంత్రి జైశంకర్ పేరును నామినేట్ చేసిన విషయం తెలిసిందే. జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఆరు స్థానాలకు, గుజరాత్లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. -
రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా నాలుగో సీటును దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీజేపీ రెండు సీట్లు సులభంగా గెలుస్తుంది. మూడో సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశముంది. ఇక నాలుగో స్థానంపై జేడీ(ఎస్) ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి కోరుతున్నారు. లౌకికవాద శక్తులను బలోపేతం చేసేందుకు తన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే తమ అభ్యర్థి గెలుస్తారని కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై తమకు నమ్మకం లేదని జాతీయ నేతలు చొరవ తీసుకుని తమ విజయానికి మద్దతు ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదు తమ అభ్యర్థికే జేడీ(ఎస్) మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోంది. గతంలో తాము చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే సమయం ఇప్పుడు వచ్చిందని పేర్కొంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 2020లో తమ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారని హస్తం పార్టీ గుర్తు చేసింది. కుమారస్వామి ఈ వాదనను వ్యతిరేకించారు. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. బీజేపీ నుంచి ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చిందన్నారు. ఒకవేళ బీజేపీ పోటీ చేసివుంటే కాంగ్రెస్ కచ్చితంగా బరిలోకి దిగేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగి పోయారని.. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు. ఒక్క సీటు.. మూడు పార్టీలు! ఇక తాజా రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే బలం లేనప్పటికీ నాలుగో స్థానంలో మూడు పార్టీలు పోటీకి దిగాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కర్ణాటక శాసనసభలో బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ రెండు సీట్లు సునాయాసంగా గెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థితో సహా కాంగ్రెస్‌కు 70 మంది ఉండటంతో.. వారికి ఒక సీటు ఖాయం. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు (నిర్మలా సీతారామన్, జగ్గేష్) ఎన్నికైన తర్వాత, బీజేపీకి అదనంగా 32 ఎమ్మెల్యే ఓట్లు మిగిలిపోతాయి. జైరాం రమేష్‌ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్‌కు 24 ఎమ్మెల్యే ఓట్లు మిగులుతాయి. జేడీ(ఎస్)కు 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ బలం ఒక సీటు గెలవడానికి సరిపోదు కాబట్టి కాంగ్రెస్ మద్దతును జేడీ(ఎస్) కోరుతోంది. (క్లిక్: రాజ్యసభ ఎన్నికలు.. ఎన్సీపీ నేతలకు షాక్) క్రాస్ ఓటింగ్ భయం.. అయితే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశముందని జేడీ(ఎస్) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించినట్టు కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుంది? బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై జేడీ(ఎస్) విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. నాలుగో స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు డి. కుపేంద్ర రెడ్డి- జేడీ(ఎస్) మన్సూర్ అలీఖాన్- కాంగ్రెస్ లహర్ సింగ్ సిరోయా- బీజేపీ -
రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం
న్యూఢిల్లీ: పెద్దల సభకు కొత్తగా 41 మంది పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పి.చిదంబరం, రాజీవ్ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్రా వాల్మీకి, కవితా పటిదార్, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్, ఆర్జేడీ నుంచి మీసా భారతి, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది, తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, పంజాబ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికయ్యారు. జేఎంఎం, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. తాజా ఎన్నికతో ఎగువ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏకంగా తొమ్మిదికి చేరింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాల భర్తీ చేయడానికి ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. ఏకగ్రీవం కాగా మిగిలిన 16 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హరియాణాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయ్యింది. తమ పార్టీకి చెందిన దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లో క్యాంప్‌నకు తరలించింది. తమ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష బీజేపీ గాలం వేస్తుందన్న అనుమానంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తోంది. -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
ఏపీ: ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నికలు
-
ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెల 1వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అనంతరం ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నలుగురి ఎన్నికతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎంపీలుగా ఎన్నికైన నలుగురు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం అసెంబ్లీ ఆవరణలోను, సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ప్రయోజనాల కోసం శ్రమిస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల కోసం కృషిచేస్తా. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సీఎం జగన్ ఆశయాలు, పార్టీ విధివిధానాల మేరకు పనిచేస్తా. రాజ్యసభలో 50 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించడం చరిత్రాత్మకం. ప్రజాసేవలో ఇంతగొప్ప అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వి.విజయసాయిరెడ్డి బీసీలంతా జగన్ వైపే సీఎం జగన్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించి వెనుకబడిన కులాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా జగన్ వైపే ఉన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమం, రాజ్యాధికారం మాటల్లో కాకుండా చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారు. – ఆర్.కృష్ణయ్య బీసీల హృదయాల్లో చెరగని ముద్ర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక భరోసాతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వైఎస్సార్సీపీకి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే ఐదుగురు బీసీలే. పరిమళ్ నత్వానీ కూడా బీసీ వర్గానికి చెందినవారే. అందుకే బీసీల హృదయాల్లో సీఎం జగన్ శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారు. – బీద మస్తాన్‌రావు ప్రజాసేవ గొప్ప వరం ప్రజాసేవలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప వరంగా భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాను. సీనియర్ నాయకుల సలహాలతో ముందుకెళ్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సాక్షిగా నిరంతరం శ్రమిస్తా. – నిరంజన్‌రెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎంపీలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం వారు నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌ను కలుసుకున్నారు. రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎంపీల నేపథ్యం ఇదే.. ఆర్ కృష్ణయ్య: ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లిలో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్‌రావు: ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. విజయసాయి రెడ్డి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో కూడా సేవలందించారు. -
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు..
సాక్షి, ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసింది. 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం బీజేపీ అభ్యర్థులు వీరే: నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్ కృష్ణలాల్-హర్యానా కవితా పటిదార్-మధ్య ప్రదేశ్ గణశ్యామ్-రాజస్థాన్ లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్- ఉత్తరప్రదేశ్ కల్పన సైని- ఉత్తరాఖండ్ -
మండవకు ‘రాజ్య’యోగం దక్కేనా..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం అయింది. రెండు సాధా రణ స్థానాలు కాగా, ఒకటి ఉప ఎన్నిక. జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి శ్రీనివాస్ పదవీకాలం వచ్చే నెల 21న ముగియనుంది. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు సభ్యత్వం కాలపరిమితి ముగియనుంది. మరొక స్థానం విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి ఈ నెల 19 వర కు నామినేషన్ల గడువు ఉంది. మిగిలిన రెండు సాధారణ స్థానాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే జిల్లా నుంచి డీఎస్ ఖాళీ చేస్తున్న స్థానాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ ఆశిస్తున్నారు. కాగా జిల్లా నుంచి ఇప్ప టికే రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి ఉన్నా రు. రాజ్యసభ సీట్లను ఆశించేవారి సంఖ్య అధికార పార్టీలో భారీగానే ఉంది. దీంతో అనేక స మీకరణాలు ప్రభావితం కానున్నాయి. ఈ మేర కు సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారేనే విషయ మై వివిధ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆశావహుల్లో ప్రధానంగా మండవ వెంకటేశ్వరరావు పేరు మాత్రమే వినిపిస్తోంది. -
నాలుగు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కన్పిస్తోంది. రాష్ట్ర శాసన సభలో మొత్తం 175 స్థానాలకుగాను 150 వైఎస్సార్‌సీపీవి. 23 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో స్థానంలో గెలవడానికి సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్న ఎమ్మేల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. నాలుగు స్థానాలూ వైఎస్సార్సీపీ గెల్చుకుంటుంది. 2024 నాటికి 11 స్థానాలు వైఎస్సార్‌సీపీవే రాజ్యసభలో రాష్ట్ర కోటా 11 స్థానాలు. ప్రస్తుతం ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులున్నారు (జూన్ 21తో పదవీ కాలం ముగిసే విజయసాయిరెడ్డి స్థానాన్ని మినహాయిస్తే). జూన్ 10న పోలింగ్ జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరతాయి. అప్పుడు వైఎస్సార్సీపీ బలం ఐదు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వైఎస్సార్సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం 2024 ఏప్రిల్ 22తో ముగుస్తుంది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల పదవీ కాలమూ అదే రోజుతో ముగుస్తుంది. ఈ మూడు స్థానాలకు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతాయి. శాసనసభలో సంఖ్యాబలం ఆధారంగా ఆ మూడు స్థానాలను కూడా వైఎస్సార్సీపీ దక్కించుకోనుంది. అప్పుడు రాష్ట్ర కోటాలోని 11 రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలో చేరతాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020లో రాష్ట్ర కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో రెండు స్థానాల్లో వైఎస్సార్సీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార)లను రాజ్యసభకు పంపడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మిగతా రెండు స్థానాల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వానీలను రాజ్యసభకు పంపారు. -
ఐదు రాష్ట్రాల్లో వేడెక్కిన రాజకీయం
-
బీజేపీ 86.. కాంగ్రెస్ పార్టీ 41!
న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) బలం పెద్దల సభలో 100కు పెరిగింది. పదవీకాలం పూర్తవడం సహా ఇతర కారణాల వల్ల ఖాళీ అయిన మొత్తం 61 రాజ్యసభ స్థానాలకు.. 42 సీట్ల ఫలితం తేలగా(అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం)... మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం(జూన్ 19న) ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 4, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4, ఇతర పార్టీలు 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇక మొత్తం 61 సభ్యుల్లో 43 మంది సభలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో గతంలో లోక్‌సభ ఎంపీలుగా పనిచేసి, 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన జోత్యిరాదిత్య సింధియా, మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. (చదవండి : ఆరేళ్లలో అరవై ఏళ్ల ప్రగతి: జేపీ నడ్డా) కాగా 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా అధికారం చేపట్టిన సమయంలో రాజ్యసభలో బీజేపీకి తగినంత మెజారిటీ లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగువ సభలో కీలక బిల్లుల ఆమోదం విషయంలో మిత్ర పక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. అదే సమయంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉండటం కూడా ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతికూల అంశంగా ఉండేది. అయితే మోదీ 2.0 సర్కారు ఏర్పాటైన తర్వాత నెమ్మనెమ్మదిగా రాజ్యసభలోనూ బీజేపీ బలం పుంజుకుంటోంది. ఇక 245 స్థానాలున్న ఎగువ సభలో ప్రస్తుతం ఎన్డీయేకు 100 మంది ఎంపీలు ఉండగా ఏఐఏడీఎంకే(9), బీజేడీ(9) సహా ఇతర పార్టీలు మద్దతు తెలిపినట్లయితే ఈ బలం మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా ఎన్నికలతో పాటు గతంలో ఏకగ్రీవమైన స్థానాలను మొత్తంగా పరిశీలిస్తే.. బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 9, జేడీయూ 3, బీజేడీ 4, టీఎంసీ 4, ఏఐఏడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ 2, ఆర్జేడీ 2, టీఆర్ఎస్ 2, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా 245 స్థానాలున్న పెద్దల సభలో సొంతంగా 86 సీట్లతో కాషాయ పార్టీ పట్టు సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలకు పరిమితమైంది. -
అందుకే వర్ల రామయ్యను బరిలోకి..
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానాల పాలు చేశారనే ఆగ్రహం పార్టీలో వ్యక్తమవుతోంది. నాలుగు రాజ్యసభ స్థానాలూ సంఖ్యాబలం దృష్ట్యా వైఎస్సార్ సీపీకి దక్కడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా దళిత వర్గాన్ని మోసం చేసేందుకే చంద్రబాబు రామయ్యను బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలకు అనివార్యంగా ఎన్నికలు వచ్చేలా చేసి చివరికి తమకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలతోనూ పూర్తిస్థాయిలో ఓట్లు వేయించుకోలేక అభాసుపాలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వర్లకు పూర్తి స్థాయిలో పడలేదని స్పష్టమవుతోంది. పోటీలో ఉన్నది దళిత నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్‌పై.. గెలిచేటప్పుడు మీ సొంత కులం వారికి, ఓడేటప్పుడు దళిత నేతకు సీటిస్తారా? అని రాసి ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీలో దళితులకున్న గౌరవం ఏపాటిదో దీనిద్వారా స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. (నలుగురూ నెగ్గారు ) ► ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజికవర్గానికి చెందిన వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చి సీట్లిచ్చారు. ఇప్పుడు ఓడిపోయే సీటును దళిత వర్గానికి కట్టబెట్టారు. ఆరేళ్లలో ఒక్క దళితుడు, ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపకపోగా నమ్మించి మోసం చేశారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా తన సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ► 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపినప్పుడు ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు కేటాయించారు. మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన సన్నిహితుడైన సుజనా చౌదరికి చంద్రబాబు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి అవమానించి పంపారు. ► 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి అవకాశం ఇచ్చారు. మరో సీటు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. -
చంద్రబాబు చరిత్ర ముగిసింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర ముగిసిన అధ్యాయమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక ఆయన కుట్రలు సాగవన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మీడియాతో మాట్లాడారు. బొత్స ఏమన్నారంటే.. ► చంద్రబాబు అనుకున్నవన్నీ ఇక జరగవు. ► రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదని తెలిసినా చంద్రబాబు పోటీపెట్టడం నీచం. ► గతంలో సంఖ్యా బలం ఉన్నప్పుడు చంద్రబాబుకు దళితులు ఎందుకు గుర్తురాలేదు? ► గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టంలేని చంద్రబాబు, గవర్నరును ఎలా కలుస్తారు? ► చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చినిగిపోయింది. ఇక కొత్త పేజీలు లేవు. ► ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుంది. రాష్ట్రంలో బీసీలకు సమన్యాయం ► చంద్రబాబు గతంలో బీసీలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. ► అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారేగానీ, బీసీలు చంద్రబాబుకు గుర్తురాలేదు. ► ఈరోజు వైఎస్సార్సీపీ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో ఆ వర్గానికి సమన్యాయం జరిగింది. – ధర్మాన కృష్ణదాస్, ఆర్ అండ్ బీ మంత్రి వర్ల రామయ్యను బలిపశువును చేశారు ► రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కూడా ఏ దురుద్దేశంతో చంద్రబాబు తన అభ్యర్థిని బరిలో దించారు? ► చంద్రబాబు గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ తర్వాత తన సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ► ఇప్పుడు మరోసారి చంద్రబాబు ఆయన్ను బలిపశువును చేశారు. ► టీడీపీ.. శాసన మండలిలో వాపును చూసి బలుపు అని అనుకుంటోంది. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ మళ్లీ ఎస్సీ నేతను కించపరచాలనే నిలపెట్టారు ► రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే మెజార్టీ లేకపోయినా ఎస్సీ నేతను మళ్లీ కించపరచాలనే ఉద్దేశంతోనే నిలబెట్టినట్లుగా అనిపిస్తోంది. ► చంద్రబాబుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఆ రోజుల్లోనే రాజ్యసభకు పంపేవారు. ► నాలుగు రాజ్యసభ స్థానాలుంటే అందులో రెండు స్థానాలను బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించిన అభినవ ఫూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – జోగి రమేష్, ఎమ్మెల్యే లోకేశ్‌తో ఎందుకు పోటీ చేయించలేదు ► ఓడిపోయే సీటులో మంగళగిరి మా లోకం అయిన నారా లోకేశ్ నాయుడును ఎందుకు పోటీచేయించలేదు? ► దళిత జాతికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. ► బాబు తన కుమారుడు లోకేశ్‌ను గెలిచే స్థానంలో ఎమ్మెల్సీగా పోటీచేయించి ఆ తరువాత అడ్డదారిలో మంత్రిని చేశారు. – నందిగం సురేష్, బాపట్ల ఎంపీ దళితులను పావులుగా వాడుకుంటున్నారు ► గెలిచే దానికి చంద్రబాబు కుమారుడు.. ఓడిపోయే దానికి దళితులు అన్నది చంద్రబాబు సిద్ధాంతం. ► గతంలో చంద్రబాబు పక్కా ప్లాన్‌తో పుష్పరాజ్, మాజీమంత్రి ఎం నరసింహులుతో పాటు పలువురికి మోసం చేశారు. ► దళితులను పావులుగా వాడుకుంటున్నారు. ► చంద్రబాబు దుర్మార్గపు, కుట్రపూరిత బుద్ధి ఇంకా మారలేదు. – ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే ఓడిపోతారని తెలిసీ పోటీ ► మాట్లాడితే తనది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఓడిపోతారని తెలిసీ పోటీకి వర్ల రామయ్యను ఎలా నిలిపారు? ► ఉద్దేశపూర్వకంగా ఆయన పరువు తీయటంతో పాటు దళిత జాతిని బాబు తీవ్రంగా అవమానించారు. ► చంద్రబాబు తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. ► పేదలకు ఇంత అండగా నిలబడిన సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగనే. – మద్దాల గిరి, ఎమ్మెల్యే బీసీలకు అత్యధిక గౌరవం ► సీఎం వైఎస్ జగన్ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో బీసీలకు అత్యధిక గౌరవం దక్కింది. ► బీసీలకు సమన్యాయం జరిగింది. ► గెలిచే స్థానాలు తన సామాజికవర్గానికి.. గెలవని స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వటం చంద్రబాబు నైజం. ► ఓడిపోతాం అని తెలిసి కూడా చంద్రబాబు వర్ల రామయ్యకి ఇచ్చి ఆయన్ను బలిపశువును చేశారు. – కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే ‘ప్రతిపక్ష’ హోదా పోయిన స్థితి చంద్రబాబుది ► చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర అంతా ఇక ముగిసినట్లే. ► రాజ్యసభ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష నేత హోదా పోయే స్థితికి తెచ్చుకున్నారు. ఇక చంద్రబాబు డెన్ ఖాళీ అయినట్లే. ► ఇప్పటికైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలి. బాబు కొన్ని వార్తా పత్రికలను, సామాజిక మాధ్యమాలను, చెంచాలను దూరం పెట్టాలి. ► నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. మళ్లీ నువ్వు రావాలి ఓటేయ్యాలని ఎలా విప్ జారీచేస్తారు? ► ఇక చంద్రబాబు కుట్రలు సాగవు. – వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే గెలిచేటపుడు ధనికులకు.. ఓడేటపుడు ఎస్సీలకా!? ఇదేనా మీ వైఖరి బాబూ.. బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేల వ్యాఖ్యలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరిని ప్రశ్నిస్తూ తమ బ్యాలట్ పత్రంపై రాసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేటప్పుడేమో సుజనా చౌదరి, కనకమేడల చౌదరి, గరికపాటి, సీఎం రమేష్ లాంటి ధనవంతులకు టికెట్లు కేటాయిస్తారా? ఏ మాత్రం బలం లేనపుడు.. ఓటమి ఖాయమైనప్పుడు ఎస్సీలను (వర్ల రామయ్య) పోటీచేయిస్తారా? ఇదేనా మీ వైఖరి చంద్రబాబూ! అని ఓ ఎమ్మెల్యే తన బ్యాలట్‌పై రాశారు. దీంతో ఈ ఓటు చెల్లకుండా పోయింది. అలాగే.. మరో ఎమ్మెల్యే అయితే చంద్రబాబు ఐదేళ్ల దోపిడీ విధానాలను ప్రశ్నించారు. ‘‘ఐదేళ్ల నీ పాలనలో అడ్డగోలుగా దోపిడీ చేసి, రాష్ట్రాన్ని అప్పులపాల్జేసింది చాలక, గెలవలేనని తెలిసి మళ్లీ రాజ్యసభలో అభ్యర్థిని పోటీచేయిస్తావా?’’ అని ప్రశ్నించారు. -
నలుగురూ నెగ్గారు
సాక్షి, అమరావతి: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నలుగురూ విజయ భేరీ మోగించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు 38 ఓట్ల చొప్పున సాధించడంతో నలుగురూ తొలి రౌండ్లోనే నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు. గెలుపొందిన నలుగురు అభ్యర్థులకు ఆయన శుక్రవారం రాత్రి సీఈవో విజయానంద్ సమక్షంలో ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ఓటింగ్‌కు ఇద్దరు శాసనసభ్యులు గైర్హాజరయ్యారని, 4 ఓట్లు చెల్లలేదని తెలిపారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. అధికార పక్షానికి 152 ఓట్లు... శాసనసభలోని మొత్తం 175 ఓట్లు కనుక పోల్ అయి ఉంటే గెలిచేందుకు 36 ఓట్లు అవసరం అవుతాయి. అయితే 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కె.అచ్చెన్నాయుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పోలైన వాటిల్లో కూడా నలుగురి ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో గెలిచేందుకు ఒక్కొక్క అభ్యర్థికి 34 ఓట్లే అవసరం అయ్యాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు తోడు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మద్దతివ్వడంతో అధికార పక్షానికి 152 ఓట్లు వచ్చాయి. తమ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులూ గెలుపొందడంతో వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటన్నర లోపే ఫలితాలన్నీ కొలిక్కి వచ్చాయి. రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత ఓటింగ్ పద్ధతిలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపుగా ఎమ్మెల్యేలంతా తొలి ప్రాధాన్యత ఓటునే ఎంపిక చేసుకోవడంతో లెక్కింపులో స్పష్టత వచ్చింది. తొలి ఓటు ముఖ్యమంత్రి జగన్‌దే... శాసనసభ కమిటీ హాల్–1లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తొలి ఓటు వేసిన అనంతరం వైఎస్సార్సీపీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్ తన ఓటును బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు కేటాయించిన విషయం విదితమే. స్పీకర్ తమ్మినేని సీతారామ్ రెండో ఓటు వేశారు. తొలి రెండు గంటల్లోనే సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటు వేశారు. అందరికంటే చివరిగా సాయంత్రం 3.45 గంటలకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసి పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వారంతా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. టీడీపీకి మరికొందరు ఎమ్మెల్యేలు దూరం! తగినంత బలం లేకున్నా అనవసరంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు కారణమైన టీడీపీ అధినాయకత్వం మరి కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ప్రకారం ఓటింగ్‌కు హాజరై ఓటేసినప్పటికీ వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబు బీసీలను నిరాదరిస్తున్నారనే ఆవేదనతో నంబర్ వేయాల్సిన చోట టిక్ కొట్టటంతో ఆ ఓటు కూడా చెల్లకుండా పోయిందని భావిస్తున్నారు. కోవిడ్ సోకిన వారిని కలివడం వల్ల తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్లు మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అయితే పోలింగ్ జరిగే చోట ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆయన అందుకు మొగ్గు చూపలేదని పేర్కొంటున్నారు. రాజ్యసభలో ఆరుకు చేరిన వైఎస్సార్సీపీ బలం వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో రాజ్యసభలో పార్టీ బలం ఆరుకు పెరగనుంది. 2024 నాటికి వైఎస్సార్ సీపీ బలం 11కు చేరుకుంటుందని, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యం రాష్ట్రం నుంచి ఒకేసారి బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాజ్యసభకు పంపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాల్లో, ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. రాజ్యసభ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన అనంతరం శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మోపిదేవితోపాటు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మోపిదేవి ఏమన్నారంటే.. ► నన్ను రాజ్యసభకు పంపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. ► రాజ్యసభకు ఇంత త్వరగా ఎంపికవుతానని ఊహించలేదు. ► కేంద్రం నుంచి రావాల్సిన సహకారం కోసం పార్టీ పెద్దలతో కలిసి, సీఎం వైఎస్ జగన్ డైరెక్షన్లో ఎల్లవేళలా పనిచేస్తాం. ► మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. మీడియాతో మాట్లాడుతున్న బోస్, నత్వానీ, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి తదితరులు కలలో కూడా ఊహించలేదు ► రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవ్వడం సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సువర్ణావకాశం. ► పార్లమెంట్లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదు. ► ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ► కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇతర అంశాలపై శక్తివంచన లేకుండా పాటుపడతా. ► నా రాజకీయ గురువులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దివంగత రాయవరం మునసబు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి జన్మజన్మలకి రుణపడి ఉంటా. – పిల్లి సుభాష్‌చంద్రబోస్ సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నేత ► రాజ్యసభ అభ్యర్థిగా నన్ను ఎంపికచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ► వైఎస్ జగన్ గొప్ప విజన్ ఉన్న నేత. ఆయన నాయకత్వంలో రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తాం. ► ఈ రోజు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ► ఈ ఎన్నిక మూడు నెలలు ఆలస్యమైనా సజావుగా జరిగింది. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, వైఎస్సార్సీపీ నేతలకు, హితులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. – ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు ► రాజ్యసభ సభ్యుడిగా నన్ను పార్లమెంట్‌కు పంపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ► నాపై నమ్మకంతో నాకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. ► రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్లో పోరాడుతా. ► రాష్ట్రానికి సంబంధించి అన్ని హక్కులను సాధించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి కృషిచేస్తా. – పరిమళ్ నత్వానీ ఐక్యంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాం ► రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రస్థానం తొలుత ఒకటి నుంచి ఇప్పుడు ఆరు స్థానాలకు చేరింది. ► 2024 నాటికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఇది 11 స్థానాలకు చేరుకుంటుంది. ► 30 ఎంపీ స్థానాలు ఉంటే ఏ ప్రాంతీయ పార్టీకైనా మంచి గుర్తింపు ఉంటుంది. ► అందరం కలిసి ఐక్యమత్యంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం. – వి. విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మోపిదేవి వెంకటరమణారావు 1964 ఆగస్టు 6వతేదీన రాఘవయ్య, నాగులమ్మ దంపతులకు జన్మించారు. 2004లో కూచిపూడి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2009లో రేపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లో పలు శాఖలు నిర్వహించారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గుంటూరు జిల్లా పెదకాకానిలో 1964 ఆగస్టు 12న దశరథరామిరెడ్డి, వీర రాఘవమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఈ (సివిల్) చదివారు. 1988లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి 1994లో రాంకీ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. ఏడు కంపెనీలకు చైర్మన్‌గా విదేశాల్లో సైతం వ్యాపారం విస్తరించారు. వ్యర్థాల నిర్వహణలో ఆసియా ఖండంలోనే ప్రధాన కంపెనీల్లో ఒకటిగా రాంకీ గుర్తింపు పొందింది. రాంకీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా విద్య, మహిళా సాధికారత, సహజ వనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ పిల్లి సుభాష్‌చంద్రబోస్ 1950 ఆగస్టు 8న సూర్యనారాయణ, ముత్యాలమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ చదివారు. 1978లో జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో హసన్‌బాద సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రామచంద్రపురం నుంచి 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు. పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ 1956 ఫిబ్రవరి 1న జన్మించిన పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ జార్ఖండ్ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియడంతో ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్నారు. 20 రాష్ట్రాల్లో రిలయన్స్ జియో 4జీ సేవలను విస్తరించడంలో నత్వానీ కీలకపాత్ర పోషించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన నత్వానీని పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ముఖేష్ అంబానీ ఈ ఏడాది ఫిబ్రవరి 29న స్వయంగా తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నత్వానీకి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ‘రాజ్యసభ’ విజేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, పరిమళ్ నత్వానీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఫలితాలు ప్రకటించిన అనంతరం శుక్రవారం వారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎంను కలిశారు. వారి వెంట వైఎస్సార్సీపీ నేత వి. విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
ఎంపీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. (చదవండి : రాజ్యసభ ఎన్నికలు: వైఎస్సార్సీపీ ఘనవిజయం) సీఎం జగన్‌ను కలిసిన కొత్తగా గెలిచిన ఎంపీలు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కొత్తగా గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కలిశారు. అంతకు ముందు వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ‘నా రాజకీయ జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది. మండల ప్రెసిడెంట్‌గా నా రాజకీయ జీవితం ప్రారంభించాను. గ్రామస్థాయి నుంచి మంత్రి హోదా వరకు పనిచేశాను. ఇంత త్వరగా నాకు రాజ్యసభలో స్థానం వస్తుందని ఊహించలేదు. బీసీ కులంలో అగ్నికులక్షత్రీయుల నుంచి తొలిసారి.. రాజ్యసభలో నాకు సీఎం వైఎస్ జగన్ స్థానం కల్పించారు. ప్రాంతీయ పార్టీల్లో బీసీలకు ఇలాంటి అవకాశమివ్వటం అరుదైన సంఘటన’ అని తెలిపారు. నత్వాని మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవచేసే భాగ్యం నాకు కల్పించిన.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ అభివృద్దికి నా వంతు కృషి చేస్తాను’ అని తెలిపారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాజ్యసభ అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సీఎం వైఎస్ జగన్ నాకు సువర్ణ అవకాశమిచ్చారు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశమిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. రాష్ట్రానికి అవసరమైన విధంగా రాజ్యసభ సభ్యుడిగా నా వంతు కృషి చేస్తాను’ అని చెప్పారు. -
రాజ్యసభ ఎన్నికలు: కాంగ్రెస్- బీజేపీ చెరో 2
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన రసవత్తర పోరులో.. రెండు పార్టీలు సమఉజ్జీగా నిలిచాయి. రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే రిపీట్ అయింది. అధికార బీజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కేసీ వేణుగోపాల్, నీరజ్ దండి, బీజేపీ నుంచి రాజేంద్ర గెహ్లాట్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, సమర్ సింగ్ సోలంకి, కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్ విజయంసాధించారు. (చదవండి: ఓటేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన ఎమ్మెల్యే) ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మేఘాలయా నుంచి అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అభ్యర్థి డాక్టర్ డబ్ల్యూఆర్ ఖర్లుఖీ విజయం సాధించారు. మిజోరాం నుంచి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి కె.వాన్లాల్వేనా విజయం సాధించారు. జార్ఖండ్ నుంచి బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా చెరో స్థానంలో విజయం సాధించాయి. గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాలను బీజేపీ గెలిచింది. ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మణిపూర్ ఫలితాలు రావాల్సి ఉంది. (చదవండి: అఖిలపక్ష భేటీలో వరుస ప్రశ్నలు సంధించిన సోనియా) -
రాజ్యసభ ఎన్నికలు: ఏపీ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే కావడం గమనార్హం. అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టారు. తాజా గెలుపుతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం ఆరుకు చేరింది. (చదవండి: బ్యాలెట్‌పై బాబును ప్రశ్నించారు..) -
బ్యాలెట్‌పై బాబును ప్రశ్నించారు..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 173 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా ఓ ఎమ్మెల్యే బ్యాలెట్ పేపర్‌పై రాసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అని బ్యాలెట్ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు పోలైన 173 ఓట్లలో నాలుగు చెల్లనివిగా లెక్కింపు అధికారులు గుర్తించారు. ఆ నాలుగు ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలకు చెందినవని తెలిసింది. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. రిమాండ్‌లో ఉండటం ఎమ్మెల్యే అచ్చెన్నాయడు, కరోనా స్వీయ నిర్భంధంలో ఉండటం అనగాని సత్యప్రసాద్‌లు ఓటు వేయలేదు. -
ఓటేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన ఎమ్మెల్యే
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓ బీజేపీ ఎమ్మెల్యే అంబులెన్స్‌లో వచ్చారు. ఈ ఘటన శుక్రవారం గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మతార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసరిసిన్హ్ జెసాంగ్భాయ్ సోలంకి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అయితే నేడు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆయన హాస్పిటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. అంబులెన్స్‌లో అసెంబ్లీకి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, 8 రాష్ట్రాల్లో 19 స్థానాలకు నేడు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో 4 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కొద్దిసేపటి కిత్రం ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. అప్డేట్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 175 ఓట్లకు గాను ఇప్పటి వరకు 170 ఓట్లు పోలైయ్యాయి. వీరిలో 151 వైఎస్సార్సీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి ఇప్పటి వరకు 18 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగి ముగిసన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూత్‌లో కూర్చున్నారు. ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉన్నారు. ఇక సభలో సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు. (ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న..) దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు సీట్లకు, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు సీట్లకు, జార్ఖండ్ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటులో బీజేపీ-కాంగ్రెస్ మధ్య చాలా గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్: బరిలో మాజీ ప్రధాని) -
ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో వారిని నేరుగా కలిసివారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా పాజిటివ్‌గా తేలిన జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఆయన ఇటీవల కలవడంతో వైద్యుల సూచన మేరకు సెల్ఫ్ క్వారెంటైన్‌కు వెళ్లారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు తాను హాజరుకావడం లేదంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ ద్వారా తేలియజేశారు. లేఖలో ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్) ‘కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నాను. ఇటీవల వ్యాపార రీత్యా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్నాను. కనుక శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు వైద్యుల సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. (కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్) -
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నేడే
సాక్షి, హైదరాబాద్: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నందున నేడు పోలింగ్ అనివార్యంగా మారింది. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభలోని అసెంబ్లీ కమిటీ హాలు–1లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మార్చి 26నే పోలింగ్ జరగాల్సినా కరోనా కారణంగా సీఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోపే ఫలితాలు! వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు పోటీలో ఉండగా టీడీపీ తరçఫున వర్ల రామయ్య బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా 2గంటల్లోపే ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేసిందీ బ్యాలెట్‌ను పార్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా పొరబాటున ఓటు వేసిన బ్యాలెట్ పత్రాన్ని తమ పార్టీ ప్రతినిధికి కాక మరొకరికి చూపిస్తే ఆ ఓటు చెల్లదు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూత్‌లో కూర్చోనున్నారు. అధికారపక్షం నియమించిన పార్టీ ప్రతినిధులు అవసరాన్ని బట్టి ఒకరినొకరు రిలీవ్ చేసుకుంటూ ఒక్కరు మాత్రమే పోలింగ్ బూత్‌లో ఓట్లను పరిశీలిస్తూ ఉంటారు. గెలిచేందుకు 36 ఓట్లు అవసరం శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయని రిటర్నింగ్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. బలం లేకున్నా బరిలో టీడీపీ.. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం నిజానికి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలి. బలం చాలనప్పుడు ఏకగ్రీవాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. టీడీపీకి అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా, గెలిచే అవకాశం లేకున్నా కావాలనే పోటీకి దిగినట్లు స్పష్టమవుతోంది. 2014 తరువాత పోలింగ్ ఇదే.. ఉమ్మడిఏపీలో 2014లో ఆరు రాజ్యసభ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయడంతో పరిస్థితి పోలింగ్ వరకు వెళ్లింది. అప్పుడు ఏడో అభ్యర్థికి సున్నా ఓట్లు రావడం గమనార్హం. టీడీపీ తరపున 23 మంది గెలిచినా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలతో విభేదిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు మాట అటుంచి ఉన్న ఓట్లు సైతం చేజారతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ మాక్ పోలింగ్ వైఎస్సార్సీపీ సభ్యులకు లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి 37 మంది ఎమ్మెల్యేల ఓట్లను కేటాయించగా మిగతా ముగ్గురు అభ్యర్థులకు 38 చొప్పున ఓట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాక్ పోలింగ్‌ను పర్యవేక్షించారు. వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా దీనికి హాజరయ్యారు. సీఎం జగన్ ఓటు బీసీకి! రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటును బీసీ వర్గానికి చెందిన పార్టీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేటాయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా దీన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల షాక్!
భోపాల్: రాజ్యసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. రాజధాని భోపాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బీఎస్పీ సభ్యులు రాంబాయి సింగ్, సంజీవ్ సింగ్ కుశ్వాహ, ఎస్పీ సభ్యుడు రాజేశ్ శుక్లా సహా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విక్రం సింగ్, సురేంద్ర సింగ్ తదితురులు పాల్గొన్నారు. దీంతో పెద్దల సభలో కనీసం రెండు సీట్లు గెలుచుకోవాలన్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా కరోనా కారణంగా నిలిచిపోయిన రాజ్యసభలోని 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు శుక్రవారం(జూన్ 19న)ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. (పెద్దల పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!) ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని 3 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 107 మంది సొంత ఎమ్మెల్యేలు కలిగి ఉన్న బీజేపీ జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు నామినేట్ చేయగా.. 91 మంది శాసన సభ్యులు కలిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు అవకాశమిచ్చింది. అసెంబ్లీలో మెజారిటీ ప్రకారం.. వీరిద్దరి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మిత్రపక్షాలు(ఎస్పీ, బీఎస్సీ), స్వతంత్రుల సహాయంతో మూడో స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేయగా.. ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీ ఏర్పాటు చేసిన విందుకు హాజరై హ్యాండ్ ఇచ్చారు. వీరితో పాటు పలువురు సొంత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మీటింగ్‌కు గైర్హాజరుకావడం గమనార్హం. దళిత నేత, రాజ్యసభ అభ్యర్థి ఫూల్సింగ్ బరైయాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే వీరంతా సమావేశానికి డుమ్మా కొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున మరో అభ్యర్థిగా ఆరెస్సెస్ మూలాలు ఉన్న సుమర్ సింగ్ సోలంకి(ట్రైబల్ కమ్యూనిటీ) బరిలో దిగిన విషయం తెలిసిందే. -
ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న..
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని ట్వీట్ చేశారు. (నీచ స్థాయికి ఎల్లోమీడియా..) -
పెద్దల పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!
జైపూర్ : రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓటు వేసే విధంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశచూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (‘కాంగ్రెస్‌ను పడగొట్టేందుకు కుట్ర’) కాగా రాజస్తాన్‌లో మూడు స్థానాలకు ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం మొత్తం మూడింటిలో కాంగ్రెస్ రెండు స్థానాలు, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అయితే సరైన సంఖ్యాబలం లేకున్నా బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. ఎన్నికల వేళ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. వారంతా బీజేపీ ఒత్తిడి మేరకు రాజీనామాలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. (ఎన్నికల వేళ షాకిస్తున్న ఎమ్మెల్యేలు) -
‘కాంగ్రెస్‌ను పడగొట్టేందుకు కుట్ర’
రాజస్థాన్: రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బుధవారం కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ తరహాలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ మహేష్ జోషి విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై విచారణ జరపాలని ఏసీబీకి మహేష్ జోషి లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపారు. జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అనైతికంగా గెలిచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని జోషి మండిపడ్డారు. రాజస్థాన్‌లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా.. ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం రెండు కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. కానీ, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు చదవండి: పాక్‌కు సమాచారం: ఇద్దరు ఉద్యోగుల అరెస్టు -
కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్: బరిలో మాజీ ప్రధాని
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (87) నిలుస్తున్నారని జేడీఎస్ ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో సహా, మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ పెద్దల విజ్ఞప్తి మేరకు పోటీ చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ట్విటర్ వేదికగా సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతులో రాజ్యసభ పోరులో దిగనున్నారని తెలిపారు. మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. (ఉత్కంఠగా రాజ్యసభ పోరు) మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ప్రస్తుతం జేడీఎస్‌కు 34 మంది సభ్యుల మద్దతు ఉంది. తమ అభ్యర్థిని గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. ఇక సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 68 మంది సభ్యులు ఉన్నారు. ఓ సభ్యుని గెలిపించుని, మిగిలిన వారిని దేవెగౌడ్కు మద్దతు తెలిపేలా ఇరుపార్టీల నేతలు సంప్రదింపులు జరిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దేవెగౌడ మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి ఆయన 1996లో పెద్దల సభకు ఎన్నికయ్యారు. (రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక అధికార బీజేపీకి సభలో 117 మంది సభ్యులు మద్దతుతో సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఈ రెండు స్థానాల కోసం విపరీతమైన పోటీ నడుమ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేతలు అశోక్ గస్తీ, ఎరన్న కాదడిలను రాజ్యసభ అభ్యర్థులకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ప్రకటించారు. మరోవైపు నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికలకు మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈనెల 10న నామినేషన్ల పరిశీలన, 12 వరకు ఉపసంహరణ గడువు ఉంది. -
రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైపూర్ : గుజరాత్‌లోని తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాజస్తాన్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించింది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించింది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో.. పలువురు సభ్యుల రాజీనామా అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుజరాత్‌లోని రాజ్‌కోట్, అంబాజీ, ఆనంద్‌ల్లో ఉన్న రిసార్ట్‌లకు తరలించింది. రాజ్‌కోట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నీల్సిటీ రిసార్ట్‌పై లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసు కేసు నమోదైంది. ‘ప్రస్తుతం రాజస్తాన్‌లోని అబు రోడ్లో ఉన్న రిసార్ట్‌లో 21 మంది మా ఎమ్మెల్యేలున్నారు. ఉత్తర గుజరాత్ నుంచి మరి కొందరు సోమవారం వస్తారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కరోనాతో పోరాడాల్సిన సమయంలో మా ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో బీజేపీ బిజీగా ఉంది అని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా విమర్శించారు. -
ఉత్కంఠగా పెద్దల పోరు: బరిలో మాజీ ప్రధాని!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. దీంతో బీజేపీ (117) సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఇక 68 మంది సభ్యులున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓ స్థానం దక్కనుంది. దీనికోసం ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను తమ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక నాలుగో స్థానంపై ఇరు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీకి అసెంబ్లీలో 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఓ స్థానం గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. (ఎన్నికల వేళ షాకిస్తున్న ఎమ్మెల్యేలు) ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ జట్టు కట్టి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడను బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవెగౌడ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపేలా కుమారస్వామి ఇప్పటికే మంతనాలు ప్రారంభించినట్లు కన్నడ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హస్తం ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తే బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకున్నా, కాంగ్రెస్, జేడీఎస్ చెరో స్థానం గెలుపొందొచ్చు. అయితే వృద్ధాప్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని దేవెగౌడ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల వేళ సభ్యులు జారిపోకుండా అన్ని రాజకీయ పక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. (కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!) ఇక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో టికెట్ కోసం ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. నాలుగింటిలో రెండు స్థానాలు కైవసం చేసుకోగలిగే బలం ఉన్న బీజేపీలో ఈ పోటీ అధికంగా ఉంది. ఒకవైపు మాజీ మంత్రి ఉమేశ్ కత్తి తన తమ్ముడు రమేశ్ కత్తికి టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇందుకోసం గురువారం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో సుమారు అరగంట పాటు ఉమేశ్ కత్తి సమావేశమై టికెట్ కోసం విన్నవించారు. మరోవైపు మంత్రి రమేశ్ జార్కిహొళి గురువారం రాత్రి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. మొత్తానికి రాజకీయ రంగస్థలానికి వేదికగా నిలిచే కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఎన్నికలు ముగిసేలోపు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
ఎన్నికల వేళ షాకిస్తున్న ఎమ్మెల్యేలు
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ స్థానాల్లో గెలిచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తొలుత మార్చిలో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఐదుగురు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజా ప్రకటన రాగానే మరో ఇద్దరు రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి గురువారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందు హస్తం పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ నేత బ్రిజేష్ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. కాగా గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. (రాజ్యసభ ఎన్నికలు : కాంగ్రెస్‌కు షాక్) అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ బలం 73 నుంచి తాజా రాజీనాలతో 65కి పడిపోయింది. దీంతో నాలుగు స్థానాల్లో కనీసం రెండు స్థానాలైనా గెలవాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నానికి అధికార బీజేపీ గండికొట్టింది. తాజా పరిణామాలతో బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఇదిలావుండగా ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక బీజేపీ నేతల ఒత్తిడి ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రెండు స్థానాలు గెలిచే సంఖ్యా బలం తమకు ఉన్నా.. కుట్రపూరితంగానే తమ ఎమ్మెల్యేల చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. (24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక) -
గుజరాత్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి బుధవారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. వీరిద్దరితో పాటు మార్చి నుంచి గుజరాత్లో మొత్తం ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే.. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం 66 మంది సభ్యులున్నారు. జూన్ 19న ఎన్నికలు జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీ సిటింగ్ స్థానాలే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఎంపీల పీఏలకు ప్రవేశం లేదు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బందిని అనుమతించకూడదని లోక్‌సభ సచివాలయం గురువారం నిర్ణయించింది.సమావేశాలు జరుగుతున్న సమయంలో సుమారు 800 మంది ఎంపీల పీఏలను ప్రాంగణంలోకి అనుమతిస్తే కరోనా సమస్య మరింత జటిలమవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
రాజ్యసభ ఎన్నికలు : కాంగ్రెస్‌కు షాక్
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్లో మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతుభాయ్ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదం తెలిపానని స్పీకర్ ప్రకటించారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌లోని 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు స్థానాలు దక్కకుండా చేసేందుకు అధికార బీజేపీ ఎమ్మెల్యేలపై బేరసారాలకు దిగుతోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. (24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక) ఇక కాంగ్రెస్ కీలకంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల ముందు వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 73నుంచి 66కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. అయితే ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలను రెండు పార్టీల సంఖ్యా బలాలను బట్టి కాంగ్రెస్, బీజేపీ చెరి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే మూడో స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. (ఆ పార్టీ కోసం పని చేయను: పీకే) ఈ క్రమంలోనే 111 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే విపక్ష సభ్యులు రాజీనామా చేయడం వెనుక కాషాయ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు స్థానాలను దక్కించుకోవాలంటే విపక్ష కాంగ్రెస్‌కు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందును వారిని తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్‌కు లేని కష్టాలను తెచ్చిపెడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా నిలిచిపోయిన రాజ్యసభలోని 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. 17 రాష్ట్రాలకు సంబంధించి 55 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఫిబ్రవరి 25న ఎన్నికల ప్రకటన చేసింది. అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం 37 మంది సభ్యులు పోటీ లేకుండా గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. మిగతావి, ఆంధ్రప్రదేశ్‌లోని 4, గుజరాత్‌లోని 4, జార్ఖండ్‌లోని 2, మధ్యప్రదేశ్‌లోని 3, రాజస్తాన్‌లో 3, మణిపూర్, మేఘాలయల్లోని ఒక్కో స్థానం మొత్తం 19 సీట్లకు మార్చి 26న జరగాల్సిన ఎన్నికను కోవిడ్ కారణంగా వాయిదా వేసింది. పరిస్థితులను సమీక్షించి ఈ 18 స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యులు కుపేంద్ర రెడ్డి(జేడీఎస్), ప్రభాకర్ కోరె(బీజేపీ), ఎంవీ రాజీవ్ గౌడ(కాంగ్రెస్), బీకే హరిప్రసాద్ (కాంగ్రెస్)లు 25న∙రిటైరవుతుండగా, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన ముకుట్ మితి(కాంగ్రెస్) పదవీ కాలం జూన్ 23తో, మిజోరం ఎంపీ రొనాల్డ్ సపట్లౌ(కాంగ్రెస్) పదవీ కాలం జూలై 18తో ముగియనుంది. ఖాళీ కానున్న ఈ 6 స్థానాలకూ 19నే ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. -
త్వరలో రాజ్యసభ ఎన్నికలు: ఈసీ
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల నిర్వహణపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. పరిస్థితులను సమీక్షించిన అనంతరం మార్చి 26 వాయిదాపడిన రాజ్యసభ ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మార్చి 26న ఎగువ సభలోని 55 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న వాయిదావేస్తూ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరోసారి సమీక్ష జరిపి ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం మరో ప్రకటన చేసింది. ఎన్నికల నిర్వహణ తేదీని తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నిక పూర్తయింది. కాగా మరో 18 స్థానాల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. -
కరోనా ఎఫెక్ట్ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా పది రాష్ట్రాల్లో ఇప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
కాంగ్రెస్‌కు షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం అసెంబ్లీ స్పీకర్ రాజేంద్రత్రివేదికి సమర్పించారు. గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పేర్లను సోమవారం ప్రకటిస్తామని స్పీకర్ రాజేంద్రత్రివేది తెలిపారు. కాగా కాంగ్రెస్ కీలకంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 73నుంచి 68కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. అయితే ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలను రెండు పార్టీల సంఖ్యాబలాలను బట్టి కాంగ్రెస్, బీజేపీ చెరి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే మూడో స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే 111 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. మరోవైపు రెండు స్థానాలను దక్కించుకోవాలంటే విపక్ష కాంగ్రెస్‌కు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందును వారిని తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలను జైపూర్ తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఈ నెల 26న జరిగే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు గురువారం ఖరారు చేశారు. సుమారు పక్షం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులు మధ్యాహ్నం 12.41 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వారిని పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తూ పత్రాలు అందజేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీకి వచ్చిన పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నరేందర్ తదితరులు కేకే, సురేశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో పోచారంతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన సురేశ్‌రెడ్డి, కె. కేశవరావు ఎమ్మెల్సీ అభ్యర్థిపై కసరత్తు.. శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడగా, ఈ నెల 19 నామినేషన్ల దాఖలకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు గురువారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, లోయపల్లి నర్సింగరావు, ముజీబ్ శాసన మండలి అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్నారు. గతంలో స్థానిక సంస్థలో కోటాలో టీడీపీ నుంచి ఎన్నికైన అరికెల నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆరంభం నుంచి పార్టీలో ఉంటూ వరుసగా మూడు పర్యాయాలు ఎంపీపీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా నర్సింగరావు కోరుతున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముజీబ్ కోరుతుండటంతో జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కేఆర్ సురేశ్‌రెడ్డి... భార్య: పద్మజారెడ్డి జననం: 1959, మే 25 స్థలం: చౌట్పల్లి, కమ్మరపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా రాజకీయ ప్రస్థానం.. 1984లో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన సురేశ్‌రెడ్డి తండ్రి గోవిందరెడ్డి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నాలుగు పర్యాయాలు నిజామాబాద్ బాల్కొండ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2009, 2014లో అర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018, సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల కేశవరావు భార్య: వసంతకుమారి జననం: 1939, జూన్ 4 స్థలం: మహబూబాబాద్ రాజకీయ ప్రస్థానం.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేశవరావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వర్తించారు. 2005లో ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. పట్టభద్రుల కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో విద్య, పరిశ్రమలు వంటి కీలక శాఖలతో పాటు కాంగ్రెస్ హయాంలో కొంతకాలం శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తూ 2014లో రెండో పర్యాయం రాజ్యసభకు ఎన్నికై పార్టీ పార్లమెంటరీ పక్షం నేతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! సంక్షేమం ఆగదు.. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నాయకులు కే కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేకేకు కేసీఆర్ మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న సురేష్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే దానిపై తీవ్ర చర్చ సాగింది. ఒక స్థానానికి కేశవరావు పేరును ఖరారు చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే మరో స్థానానికి సీఎం కేసీఆర్ ఎవరిని నామినేట్ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. అయితే చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్.. కేకే, సురేష్‌రెడ్డి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేశారు. -
దళిత నేతకు గెలవని సీటు
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది. ఈసారి రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్న వైఎస్సార్ సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపడం ఆ వర్గాన్ని మోసం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆరేళ్లలో ఒక్క దళిత, బీసీ నేతనైనా రాజ్యసభకు పంపకపోగా.. మాట ఇచ్చి వారిని మోసం చేసిన ఉదంతాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2002 నుంచీ మాటిచ్చి మోసగించడమే - 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన కోటరీలో సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. - ఆ సమయంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. - 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు ఇచ్చారు. - మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికి కేటాయించారు. - అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. - 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు. - 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు. - గతంలో రాజ్యసభ సీటివ్వాలని కోరిన పరసా రత్నం, సత్యవేడుకు చెందిన హేమలత, బల్లి దుర్గాప్రసాద్ (అప్పట్లో టీడీపీ నేత) వంటి వారికి మొండిచేయి చూపారు. - ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్‌గా పంపిస్తానని నమ్మించి మోసం చేశారని మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో వాపోయారు. -
దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపడం ద్వారా మరోసారి వారిని మోసం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడం వల్లే వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో నిలిపినట్టుగా తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. తన సామాజికవర్గం, అగ్రవర్ణాలకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్రావు, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్‌లను రాజ్యసభకు పంపించారు. గతంలో వర్ల రామయ్య కన్నీరు పెట్టుకున్నా రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు అతన్ని బరిలో నిలపడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే.. వర్ల రామయ్యకు అప్పుడు ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దళితులను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా, 2002 నుంచి ఇప్పటివరకు ఒక్క దళిత నేతను కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. 2016లో జేఆర్ పుష్పరాజ్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని తిప్పించుకున్న చంద్రబాబు.. చివరి నిమిషంలో దానిని అగ్రవర్ణాలకు కేటాయించారు. చదవండి : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం -
సీఎం జగన్‌ను కలిసిన నత్వానీ
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. కాగా, నత్వానీ బుధవారం ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించి ముందుండి పూర్తిచేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నత్వానీతో పాటు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి : వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరం: నత్వానీ -
ఏపీ ప్రజలకు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి
సాక్షి, గుంటూరు : తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర వాణి వినిపిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారని అన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే వైఎస్ జగన్ కూడా నడుస్తున్నాని చెప్పారు. కాగా, రాజ్యసభ ఎన్నికలకు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ పరిమల్ నత్వాని పేర్లను ప్రకటించింది. చదవండి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరిద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమల్‌ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థులను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం వీరు మాట్లాడుతూ... ‘ఈనెల 6వ తేదీన రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్థులను ఖరారు చేశాం. 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలను రాజ్యసభకు నామినేట్ చేశాం. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశాం. ఇక నాలుగో సీటు పరిమల్ నత్వానికి ఇవ్వనున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి పరిమల్‌కు ఇవ్వడం జరిగింది. పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’ అని వెల్లడించారు. పరిమల్ నత్వానీ వైస్సార్ సీపీ అభ్యర్ధే... పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ అభ్యర్ధన మేరకే నత్వానీకి టిక్కెట్ కేటాయించామని, అయినా ఆయన్ని తమ పార్టీ అభ్యర్థిగానే భావిస్తుస్తాని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యసభ టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరు మంత్రులు ఇప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారని ప్రకటించి.. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజీనామా చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు ఈనెల 7న ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. మార్చి 6 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
రాజ్యసభ ఎన్నికలకు ఏచూరి దూరం
న్యూఢిల్లీ: సీపీఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం సీపీఎం పోలిట్‌బ్యూరోలో కేరళ నాయకుల ప్రాబల్యం కనిపిస్తుందని.. సీపీఎం పార్టీ ఒకే నాయకుడిని రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. మార్చి 26న పశ్చిమ బెంగాల్‌కు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయాలని కొందరు నాయకులు భావిస్తున్నా..మెజారిటీ నాయకులు పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ, బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తు.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పార్టీ నేతలు సీతారాం ఏచూరిని ప్రశంసిస్తున్నారు. -
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పొందొచ్చు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు. ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఏపీ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 6 నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అయితే నామినేషన్లకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ కోసం 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాల్సి ఉండగా, స్వతంత్రులు 10 మంది ఎమ్మెల్యేలను ప్రతిపాదకులుగా చేయాల్సి ఉంటుంది. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామ లక్ష్మిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం రానుంది. -
20 మంది ఎమ్మెల్యేలతో వస్తే.. సీఎం పదవి
గాంధీనగర్ : త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యేలపై గాలం వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.. గుజరాత్ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో లాథీ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్జీ తుమారానే ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై అధికార పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ కూటమికి 77 స్థానాలు దక్కాయి. అయితే మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుజరాత్ కీలకంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు తమ పార్టీలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. -
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-
మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు
-
మరో ఎన్నికల నగారా... షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 చివరి తేదీ. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో కె.కేశవరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, తెలంగాణలో కేవీపీ, గరికపాటి రాంమోహన్‌రావు పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
గుజరాత్ ఉపఎన్నికలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకోసం వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ కాంగ్రెస్ వేసిన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో జూన్ 24లోగా స్పందన తెలపాలని బుధవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జూన్ 25న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం తెలియజేసింది. గుజరాత్ కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా మాట్లాడుతూ, ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వాదించారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, ఎన్నికల షెడ్యూల్ ఒకటే ఉన్నప్పటికీ ప్రత్యేక స్థితిలో ఏర్పడిన ఖాళీలను వేర్వేరుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. -
రాజ్యసభకు మన్మోహన్ దూరం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(86) రాజ్యసభకు కొద్దిరోజుల పాటు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అస్సాంలో మన్మోహన్ సీటుతో పాటు మరో స్థానానికి జూన్ 14తో ఆరేళ్ల గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 7న ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. సాధారణంగా రాజ్యసభకు ఓ అభ్యర్థిని నామినేట్ చేయాలంటే 43 మంది ఎమ్మెల్యేల తొలి ప్రాధాన్యత ఓట్లు కావాలి. అయితే 126 సీట్లు ఉన్న అస్సాం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 25 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 87 సీట్లు ఉన్నాయి. దీంతో మన్మోహన్ కొద్దికాలం పాటు రాజ్యసభకు దూరం కావొచ్చని తెలుస్తోంది. తమిళనాడులో ఈ ఏడాది జూలై చివరినాటికి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే ఓ రాజ్యసభ సీటును మన్మోహన్‌కు కేటాయించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ అది కుదరకుంటే 2020, ఏప్రిల్‌లో మరో 55 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ కోటాలో మన్మోహన్‌ను ఎగువసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 1991లో తొలిసారి అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 28 సంవత్సరాల పాటు అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. మరోవైపు అస్సాంలో అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఓ సీటును మిత్రపక్షం ఎల్జేపీకి అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ను కమలనాథులు రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని తెలుస్తోంది. -
రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ తొలగింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో నోటా(నన్ ఆఫ్ ది ఎబో– పై వారు ఎవరూ కాదు) గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ ఆప్షన్లకు నోటా వర్తించదని స్పష్టంచేస్తూ ఆగస్టు 21న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటాను వినియోగించాలని కోర్టు సూచించింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ తీర్పు చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం మాత్రమే ‘నోటా’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’కు నో: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ను ప్రవేశపెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి చర్యలు అవినీతి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని పేర్కొంది. నోటా విధానం ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితమని, నైష్పత్తిక ప్రాతిపదికన నిర్వహించే పరోక్ష ఎన్నికలకు అనుమతించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ‘ఓటింగ్ ప్రక్రియలో నోటా వాడకాన్ని విశ్లేషించినట్లయితే..గోప్యతకు తావులేని రాజ్యసభ ఎన్నికల్లో ఆ విధానం చెడు ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి ఒకటే ఓటు కలిగి ఉన్నా, అది చాలా విలువైనది. ఓటు విలువను నిర్ధారించేందుకు ప్రత్యేక ఫార్ములా ఉంది. ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ, ఒక నియోజక వర్గానికి కాదు. నోటాను అనుమతిస్తే ఫిరాయింపులు మరింత పెరుగుతాయి. పరోక్ష ఎన్నికల్లో దాన్ని అమలుచేస్తే ప్రజాస్వామ్య పవిత్రత దెబ్బతినడమే కాకుండా, అవినీతి, ఫిరాయింపు భూతాలు పురివిప్పుతాయి’అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. -
వారి ఓట్లు లెక్కించొద్దు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లేసిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లను కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జి. విఠల్‌రెడ్డి (ముథోల్), కాలె యాదయ్య (చేవెళ్ల), చిట్టెం రామ్మోహన్‌రెడ్డి (మక్తల్), ఎన్. భాస్కర్‌రావు (మిర్యాలగూడ), డి.ఎస్.రెడ్యా నాయక్ (డోర్నకల్), కోరం కనకయ్య (ఇల్లందు), పువ్వాడ అజయ్ (ఖమ్మం) పార్టీ విప్‌ను ధిక్కరించి తనకు చూపించి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేశారని రాజ్యసభ ఎన్నికల కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ రేగా కాంతారావు శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఎమ్మెల్యేల ఓట్లను కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోవద్దని, వారు ఓట్లేసిన టీఆర్ఎస్ అభ్యర్థులను కూడా అనర్హులుగా ప్రకటించాలని ఆ ఫిర్యాదులో కోరారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు ప్రతులను పంపారు. అయితే టీఆర్ఎస్కు ఓటేసిన ఆ ఎమ్మెల్యేలు నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ ఏజెంట్‌కు చూపించినందున వారి ఓట్లను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. కేసీఆర్‌వి నీచ రాజకీయాలు: ఉత్తమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన ఆ ఏడుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన మధుసూదనాచారిని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థి చేసిన ఫిర్యాదుకు అసెంబ్లీ కార్యదర్శి కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. -
రాజ్యసభ ఎన్నికల టెన్షన్ : ‘బీజేపీకే ఓటేశా’
-
రాజ్యసభ ఎన్నికల టెన్షన్ : ‘బీజేపీకే ఓటేశా’
సాక్షి, న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ ఝలక్ ఇచ్చారు. శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేసినట్లు నేరుగా చెప్పి షాక్ ఇచ్చారు. మిగితా వారు ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదన్నారు. దీంతో బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండం ఏర్పడినట్లయింది. అత్యంత ఉత్కంఠ నడుమ శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 25 సీట్లకుగాను ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్లో 5, కర్ణాటకలో 3, తెలంగాణలో 3, జార్ఖండ్‌లో 2, చత్తీస్‌గఢ్‌లో 1, కేరళలో 1 సీటుకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఉత్కంఠ తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే 37మంది మద్దతివ్వాలి. దీంతో మొత్తం 10 స్థానాల్లో 300 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా ఉండటంతోపాటు తొమ్మిదో సీటును కూడా కొల్లగొట్టాలని చూస్తోంది. అలాగే, అక్కడ ఎస్పీకి 1, బీఎస్పీకి 1 సీటు ఉన్నాయి. ఎస్పీ సీటుకు ఎలాంటి డోకా లేకున్నా బీఎస్పీకి పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ సీటును బీజేపీ దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, 19మంది ఎమ్మెల్యేలు బీఎస్పీకి ఉండటం, ఎస్పీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి 7గురు, అజిత్ సింగ్ పార్టీ నుంచి ఒకరు(మొత్తం 37 మంది) మాయావతికి లభించడంతో బీఎస్పీ సీటుకు కూడా ఢోకా లేదనుకున్నారు. అయితే, తాజాగా తాను ఓటును బీజేపీకి వేశానంటూ అనిల్ సింగ్ ఝలక్ ఇవ్వడంతో బీఎస్పీ ఇప్పుడు కొంత టెన్షన్లో పడింది. అనిల్ సింగ్ ఓటు బీజేపీకి వెళితే మాయావతి పార్టీకి 36 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లవుతుంది. దాంతో ఆమె పార్టీకి రాజ్యసభ సీటు దూరమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ బీజేపీ వాళ్లలో ఎవరైనా క్రాస్ ఓటింగ్‌కు దిగి బీఎస్పీకి ఓటు వేస్తే సీటుకు ఏ ప్రమాదం ఉండబోదు. అయితే, ఈ ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ తొమ్మిదో సీటును కూడా గెలుచుకుంటుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేయగా.. తమ పార్టీలో ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగడం లేదని, బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ తమకు అనుకూలంగా చేస్తారని సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. -
నేడే రాజ్యసభ ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్‌పాల్ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరుగుతాయి.