
న్యూఢిల్లీ: సీపీఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం సీపీఎం పోలిట్‌బ్యూరోలో కేరళ నాయకుల ప్రాబల్యం కనిపిస్తుందని.. సీపీఎం పార్టీ ఒకే నాయకుడిని రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. మార్చి 26న పశ్చిమ బెంగాల్‌కు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయాలని కొందరు నాయకులు భావిస్తున్నా..మెజారిటీ నాయకులు పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ, బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తు.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పార్టీ నేతలు సీతారాం ఏచూరిని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment