sitaram yechury
-
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్‌కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్‌కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు. సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. -
అన్నాడంటే మాటపై ఉన్నాడనే!
ఇచ్చిన మాటకే కాదు, తామన్న మాటలకూ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకులలో సీతారాం ఏచూరి ఒకరు. ఇంటర్వ్యూ లలో వెలిబుచ్చిన అభిప్రాయాల పర్యవసానాలను ఆ తర్వాత ఎదుర్కొనే ధైర్యం లేక ప్రసారాలకు ముందే వాటిని తొలగించమని నాయకులు కోరటమన్నది అసాధారణమేమీ కాదు. కానీ ఏచూరి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండేవారు. యునైటెడ్ ఫ్రంట్‌కు సీపీఎం మద్దతిస్తున్నప్పటికీ, అప్పటి ప్రధాని దేవె గౌడ మీద ఆయన చేసిన విమర్శ దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే విజ్ఞప్తులను సైతం అంగీకరించటం కోసమే ఏచూరి మార్గాలను వెతికేవారు. ఆయన గుణం సావధానం. ఆయన జ్ఞాపకశక్తి అపారం.సీతారాం ఏచూరిని నేను మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తుకు రావటం లేదు. బహుశా అది నేను 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకు కావచ్చు. అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆయనతో సుదీర్ఘమైన నా మొదటి ఇంటర్వ్యూ. అది 1996వ సంవత్సరం.ఇంటర్వ్యూ చేసింది ఆనాటి నూతన ప్రధాని దేవె గౌడ గురించి. అప్పటికి సీతారాంతో నాకు బాగా పరిచయం ఏర్పడి ఉంది. ఇంటర్వ్యూలో ‘సీత’ (తనను ఇలా పిలవొచ్చని ఏచూరి నాతో అన్నప్పట్నుంచీ నేనాయన్ని సీత అనటం మొదలుపెట్టాను) దేవె గౌడ తన అధికారిక పర్యటనకు తనతో పాటుగా అనేక మంది తన కుటుంబ సభ్యులను ఇటలీకి వెంటబెట్టుకుని వెళ్లటాన్ని విమర్శించారు. నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేవె గౌడ పార్టీ, సీపీఎం రెండూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నందు వల్ల సీత అలా విమర్శించటం అనూహ్యం, దాపరికం లేకపోవడం మాత్రమే కాక వార్తగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలం ఒక సాధారణ వ్యాఖ్య కాదు. పూర్తి స్థాయి విమర్శ. ఇంటర్వ్యూ ప్రసారానికి ముందు రోజు సాయంత్రం సీత నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానిని తొలగించమని అడగటానికి నేను మీకు కాల్ చేయలేదు’’ అని నవ్వుతూ అన్నారు. అదొక వ్యాప్తి చెందే స్వభావం కలిగిన సహృదయ హాసం. ‘‘నేను దాని గురించి ఇప్పటికే నా సహచరులకు చెప్పి, వారి స్పందనలకు తగిన వివరణ ఇచ్చేశాను కనుక దానిని మీరు తీసేయలేదని నిర్ధారించుకోటానికే మీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దానిని తొలగిస్తే ఇద్దరం కూడా నవ్వులపాలౌతాం’’ అన్నారు. నిజానికి సీత, తామన్న మాటలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో ఒకరు. నాయకులు ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన తమ వాస్తవ అభిప్రాయాల పర్యవసానా లను ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తొలగించమని కోరటమన్నది అసాధారణమేమీ కాని ఆ 9వ దశకంలో, 2000–2009 మధ్య కాలంలో సీత అలా నాకు కాల్ చేయటం అత్యంత అసాధారణం. చెప్పాలంటే అభినందనీయం. అదొక్కటే కాదు, సీత సావధానంగా వినే గుణం కలిగిన వారనీ, ఆయన జ్ఞాపకశక్తి అపారమనీ కనిపెట్టటానికి నాకు మరికొంచెం సమయం పట్టింది. నేను ‘ఐ విట్నెస్’ వీడియో మేగజీన్‌కు పని చేస్తూ, తరచు చర్చలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఓసారి నాకు ఢిల్లీ కమానీ ఆడిటోరియం వెలుపలి ప్రాంగణంలో సీత సిగరెట్ తాగుతూ కనిపించారు. ‘‘మీకూ ఒకటి కావాలా?’’ అని నన్ను అడిగారు. బహుశా నా ముఖం సిగరెట్టు తాగే రకంలా ఆయనకు కనిపించి ఉండాలి. తన సిగరెట్ వెలిగించుకున్నాక, నాకూ ఒకటి ఇచ్చారు. నేను సిగరెట్ తాగుతానని మీకెలా తెలుసు అని అడిగాను. ‘‘మీరేగా చెప్పారు, మర్చిపోయారా?’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘జనవరిలో మాత్రమే తాగుతానని, అది కూడా ఇతరులు ఇచ్చే సిగ రెట్లు మాత్రమే తాగుతానని మీరు నాతో చెప్పారు కదా’’ అన్నారు. ఆయన అన్నది నిజమే. అయితే ఎవరికి గుర్తుంటుంది కనుక అని నేను తమాషాగా చెప్పే విషయాలలో ఇది కూడా ఒకటి. కానీ సీత దానిని గుర్తుపెట్టుకున్నారు! వాస్తవానికి ఆయన జ్ఞాపకశక్తి పరిధి, కచ్చితత్వాలే ఇంటర్వ్యూ లలో ఆయనకు శక్తిమంతమైన ఆయుధాలు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ప్రశ్నల్లో నేను తేదీలను కలిపేసినప్పుడు లేదా వాస్త వాలలో నా వైపు తప్పులు దొర్లినప్పుడు వెంటనే ఆయన నన్ను సరి దిద్దేవారు. అలాగని ఎప్పుడూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడే వారు కాదు. నేను మర్చిపోయిన ఒకటీ రెండు పాయింట్లను కూడా జోడించి మరీ విషయాన్ని ముగించేవారు. అలాగుండేది ఏచూరితో. అయితే ఆయనలో అస్సలు లేనివి ఏమిటంటే ముఖం చిట్లింపు, హాస్య విహీనత. ఆయన చమత్కారం ఉవ్వెత్తున పొంగిన షాంపేన్లా మిరిమిట్లతో నురగలు కక్కుతుంది. 2005లో బృందా కారత్ సీపీఎం పాలిట్ బ్యూరోలో చేరారు. అప్పటికే ఆమె భర్త (ప్రకాశ్ కారత్) అందులో ఉన్నారు. బృందా పాలిట్ బ్యూరో సభ్యురాలైన కొత్తల్లో ‘సీఎన్ బీసీ’ లేట్ నైట్ డిస్కషన్లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.బృందాతో పాటు మరికొందరు అతిథులు ఉన్నారు. ఆ డిస్కషన్‌కు నాదే యాంకరింగ్. చర్చ సాగుతుండగా అతిథుల్లో ఒకరు... సీపీఎం పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన తొలి మహిళ కదా బృందా కారత్ అన్నారు. ‘‘అవును’’ అని చిరునవ్వుతో చూస్తూ, ‘‘మాది ఇప్పుడు రెండు క్యారెట్ల పార్టీ!’’ అన్నారు సీత. సీత... సల్లాపాల ఉల్లాస ప్రియుడు కూడా. కథలు కథలుగా తన గురించి చెప్పుకుంటున్నప్పుడు... ఆయన కళ్లు దివ్వెలై వెలగటం, ఆయన ముఖం నవ్వులై విరియటం చూసి... ఆయన స్వీయానంద భరితులై ఉన్నట్లు మీరు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఆయనకు ఒక ఇంటర్వ్యూ నచ్చి, లేదా అంతక్రితమే ఆయన చదివిన ఒక కాలమ్ గురించి చెప్పాలనిపించి, పొద్దుపోయాక నాతో ఫోన్లో వృత్తాంత భరితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలోని చిరుమంద హాసం లేదా ఆ గొంతులో తొణికిసలాడే నవ్వు నా గ్రహింపులోనికి వచ్చేవి. సీత ఎప్పుడో గాని చెప్పిన సమయానికి చేరుకోలేరు. ఒక ఇంటర్యూకి ఫలానా సమయానికి వచ్చేస్తానని మాట ఇచ్చి కూడా దారి మధ్యలో తనను కలవాలని వచ్చిన అనేక మంది కోసం కారును ఆపించేవారు. ‘‘సమస్య చిన్నదే. వాళ్లందరూ ఆయనతో మాట్లాడాలని ఆశ పడతారు. అందుకు ఆయన ఎప్పుడూ నిరాకరించరు’’ అని ఇంటర్వ్యూకు ఆయను తీసుకువచ్చేందుకు వెళ్లిన నా సహచరులు చెప్పేవారు. ‘కాదు’ అని సీత ఎప్పుడైనా నాతో అన్నట్లు గుర్తు లేదు. సాధా రణంగా జర్నలిస్టులు చేసే విధంగానే, ఇతర రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే అసంభవమైన విజ్ఞప్తులను నేను సీతకు చేసేవాడిని. అందుకు సీత ఎప్పుడూ వాటిని అంగీకరించటం కోసమే మార్గాలను వెతికే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు తన భార్య సీమ వైపు నుంచి చేయించే విన్నపాలను మన్నించేవారు. ఇన్ని విధాలుగా ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తుంటారు.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లాల్ సలాం.. లాల్ సలాం
సాక్షి, న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య కామ్రేడ్ సీతారాం ఏచూరి నివాళులు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ఏచూరికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితర ప్రముఖులు ఏచూరి పారి్థవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సచిన్ పైలట్, డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్ బాలు, దయానిధి మారన్, ఆప్ నేత మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, చైనా, వియత్నాం రాయబారులు నివాళులర్పించారు. అనంతరం ఏచూరి భార్య సీమాచిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏచూరిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ బృందం, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, విదేశాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఢిల్లీ గోల్మార్కెట్లోని సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. జోరు వానను లెక్కచేయకుండా ‘ఇక సెలవు కామ్రేడ్, రెడ్ సెల్యూట్ ఏచూరి’అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబీకులు, పార్టీ నేతలు ఎయిమ్స్‌కు అప్పగించారు. -
ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత
న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. VIDEO | Veteran CPI(M) leader Sitaram Yechury’s mortal remains brought to AIIMS, Delhi. The CPI(M) general secretary died on Thursday, August 12, in Delhi after battling a lung infection. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7eTYgwssEG— Press Trust of India (@PTI_News) September 14, 2024క్లిక్ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు -
ఏచూరి పార్థివదేహానికి విజయసాయిరెడ్డి నివాళులు (ఫొటోలు)
-
ఏచూరికి విజయసాయి రెడ్డి నివాళి
-
సీతారాం ఏచూరికి విజయసాయిరెడ్డి నివాళి
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీపీఎం నేతలు రాఘవులు, మధులను పరామర్శించిన విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పీడిత పక్షాన రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఏచూరి. నమ్మిన సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించారు. ఏచూరి విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన స్ఫూర్తిదాయకం. ఏచూరితో పార్లమెంట్లో కలిసి పనిచేసే అవకాశం లభించడం మర్చిపోలేను’’ అని విజయసాయి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!శనివారం ఉదయం వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులర్పించేందుకు వీలుగా అక్కడ ఉంచారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు. -
సీతారాం ఏచూరి పార్ధివదేహానికి సోనియా గాంధీ పుష్పాంజలి
-
ఏచూరి పార్థివదేహంను ప్రజా సేవకు అంకితం
-
ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది: మెగాస్టార్ ట్వీట్
సిపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సామాన్య ప్రజల గొంతుగా ఆయన చేసిన కృషి మరువలేనిదని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. సీతారాం ప్రజా సేవ, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి మరణించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు)కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. . సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist, Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024 -
సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు
సాక్షి, నేషనల్ డెస్క్/సాక్షి, హైదరాబాద్: బహుభాషావేత్తగా, కాలమిస్ట్‌గా, రాజకీయవేత్తగా, వామపక్షవాదిగా సీతారాం ఏచూరిది సుదీర్ఘ ప్రస్థానం. అటు పార్టీ అగ్రనేతగా కొనసాగుతూనే ఇటు ఎర్రజెండా పట్టుకుని పలు ప్రజా ఉద్యమాల్లో తలమునకలయ్యారు. సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగారు. తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పాటుపడి నిఖార్సయిన కామ్రేడ్‌గా పేరు నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్పటిమతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా ఏచూరికి పేరుంది.తెలుగు కుటుంబంలో జననం.. : సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలో స్థిరపడిన తెలుగు వాస్తవ్యులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు జని్మంచారు. స్వస్థలం కాకినాడ కాగా బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తండ్రి సోమయాజి బదిలీపై విజయవాడ ఆరీ్టసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలో చదువుకున్నారు. ఏచూరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్వయానా మేనమామ. చెన్నైలోని మేనమామ ఇంట్లో ఆయన జని్మంచారు. హైదరాబాద్ ఆల్ సెయింట్స్‌లో, ఢిల్లీలో హైసూ్కల్ విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర..తన గురు సమానులు హర్కిషన్ సింగ్ సుర్జీత్లాగా 2004–2014 కాలంలో ఏచూరి సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ తిరస్కరించాక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తర్వాత సోనియా కలిసిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరినే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్‌కు అత్యంత నమ్మదగ్గ నేస్తంగా ఉన్నారు. నెగ్గిన ఏచూరి బడ్జెట్ సవరణల ప్రతిపాదన..గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన చేసిన సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం కేవలం నాలుగోసారి మాత్రమే. ఒబామా రాకను వ్యతిరేకించిన సందర్భం..అమెరికాపై విమర్శలు చేయడంలో ఏచూరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణం అంటూ చురుకైన విమర్శలు చేసేవారు. గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను, జమ్మూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35అ రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమికి కృషి..పార్లమెంట్ వేదికగా సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడారు. విపక్షాలను ‘ఇండియా’ కూటమిగా ఏకతాటి మీదకు తేవడంలో కూడా ఏచూరి పాత్ర కీలకమైంది. లోక్‌సభలో విపక్షనేతగా మోదీ సర్కార్‌ను తూర్పారబడుతున్న రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. ఇతర భాషల్లోనూ అనర్గళంగా..అచ్చ తెలుగు వ్యక్తి అయిన ఏచూరి హిందీ, తమిళం, బెంగాళీ, మలయాళం సైతం అనర్గళంగా మాట్లాడేవారు. హిందూ పురాణాలను ఔపోసన పట్టిన ఏచూరి సందర్భోచితంగా తన ప్రసంగాల్లో వాటిని ఉదహరిస్తూ బీజేపీకి చురకలంటించేవారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్‌లు పెట్టేవారు. ప్రకాశ్‌కారత్ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్న ఏచూరి సౌమ్యంగా ఉంటూనే పార్టీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరొందారు. మా భుజాలపై తుపాకులు పెట్టి తప్పించు కుంటారా? తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పక్షాలు ఒప్పుకోవడం లేదన్న భావనతోకాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది. అలాంటి సందర్భంలో తెలంగాణపై జరిగిన చర్చలో సీతారాం ఏచూరి ‘తెలంగాణపై ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పారీ్టకి ఉంటాయి. ఆయా పారీ్టల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణపై మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంతేగానీ మా భుజాలపై తుపాకులు పెట్టి పేల్చాలనుకోవడం సరికాదు..’ అని ఏచూరి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారని పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2015లో విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) సదస్సులో పారీ్టకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో, 2021 కోజికోడ్ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే హోదాలో ఆయన మృతి చెందారు. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా ప్రముఖ జర్నలిస్టు సీమా ఛిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. కుమార్తె అఖిల, ఇద్దరు కుమారులు ఆశిష్, డ్యానిష్ కాగా.. 34 ఏళ్ల పెద్ద కుమారుడు ఆశిష్ 2021లో కోవిడ్‌తో కన్నుమూశారు. అఖిల.. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో బోధిస్తారు.ఎస్ఎఫ్ఐలో చేరికతో.. 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరికతో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన ఏచూరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టై కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న ఆయన..ఆ కారణంగా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. ఎంతోమంది సన్నిహితుల మధ్య తాను డాక్టరేట్ పూర్తి చేయలేకపోయానని ప్రస్తావిస్తూ బాధపడుతుండేవారు.దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశి్చమ బెంగాల్, కేరళయేతర వ్యక్తి ప్రెసిడెంట్ కావడం అదే తొలిసారి కావడం విశేషం. కాగా 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, వివిధ కమిటీల్లో..2005లో పశి్చమబెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలకు చైర్మన్‌గా, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా, జనాభా, ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫోరంలో సభ్యుడిగా, విలువల కమిటీలో సభ్యుడిగా, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమితులై సేవలు అందించారు. 2009లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీతో పాటు, పార్లమెంట్ హౌస్‌లో దేశ నాయకులు, పార్లమెంటేరియన్ల చిత్రపటాలు, విగ్రహాల ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2012లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.గొప్ప రచయిత ఏచూరి గొప్ప రచయితగా కూడా పేరు సంపాదించారు. పారీ్టకి చెందిన వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి రెండు దశాబ్దాలకు పైగా సంపాదకులుగా పనిచేశారు. సైద్ధాంతిక రంగంలో, హిందూత్వంపై ఆ పుస్తకంలో విమర్శలు చేసేవారు. ఇలా రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో ఆంగ్లపత్రికకు కాలమ్స్ రాసేవారు. ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్’, ‘న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనిలజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలను రాశారు. ఏచూరికి పాత హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసేందుకు ఏచూరితో కలిసి రఫీ మార్గ్ నుంచి చాణక్య ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లే వాళ్లమని తోటి సీపీఎం నేతలు నాటి సంగతులు చెప్పారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనూగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా వెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లేచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమోరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.అసాధారణ నేత..⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. –ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్‌ఖడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరి నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను –కేంద్ర హోంమంత్రి, అమిత్ షా⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. ఆయన మరణం ప్రజాస్వామ్య వర్గాలకు తీరని లోటు. –డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి⇒ ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ప్రజా, దేశ సమస్యలు ప్రస్తావించే ఒక గొంతు మూగబోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ⇒ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, భారత్‌లో చైనా రాయబారి ఫెహోంగ్ తదితరులు ఏచూరి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.⇒ ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి⇒ సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. మరణం భారత లౌకిక వాదానికి, కార్మిక లోకానికి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ⇒ ఏచూరి భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. – ఏపీ సీఎం చంద్రబాబు⇒ దత్తాత్రేయ, కేంద్ర మంత్రుల సంతాపం..: ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, బీఏఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. ⇒ ప్రముఖుల సంతాపం..: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అసదుద్దీన్ ఒవైసీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, తదితరులు ఏచూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
ఏపీతో ఏచూరికి ఎనలేని బంధం
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు/గాజువాక: అస్తమించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆంధ్రప్రదేశ్‌తో చాలా అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం కాకినాడ అయినా.. తండ్రి సర్వేశ్వర సోమయాజి బదిలీపై విజయవాడ ఆర్టీసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలోనే చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లారు. 1978లో స్టూడెండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడి హోదాలో విజయవాడకు వచ్చారు. విద్యార్థి నాయకుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా అనేక కార్యక్రమల్లో పాల్గొన్నారు.గతేడాది నవంబర్‌లో ప్రజారక్షణభేరి ర్యాలీ, సభకు హాజరయ్యారు. 2022లో దేశ రక్షణ భేరి బహిరంగ సభకు వచ్చారు. అదే ఏడాది జనవరిలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. 2010లో సీపీఎం అఖిల భారత విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడు రోజుల పాటు విజయవాడలో ఉండి రాష్ట్రమంతా పర్యటించారు. చివరిగా ఈ ఏడాది మే 10న విజయవాడలో ఇండియా కూటమి నిర్వహించిన కార్యక్రమంలో ఏచూరి పాల్గొన్నారు. ఏచూరి విద్యాభ్యాసం, నివాసం అంతా ఢిల్లీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వచి్చనప్పుడు తెలుగులోనే మాట్లాడేవారు. విశాఖతో ప్రత్యేక అనుబంధం సీతారాం ఏచూరికి విశాఖతో ఎనలేని అనుబంధం ఉంది. 2015 ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు విశాఖలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో ఆయన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా ఢిల్లీస్థాయిలో పోరాడటంలోను, షిప్‌యార్డు, బీహెచ్‌పీవీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రక్షణ కోసం జరిగిన ఉద్యమాల సందర్భంగా ఏచూరి ఢిల్లీ నుంచి విశాఖకు అనేక సార్లు వచ్చారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ స్థాపన కోసం జరిగిన ఉద్యమాల్లోను ఆయన పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన చేసిన తరువాత జరుగుతున్న ఉద్యమాల్లో కూడా ఆయన ప్రసంగించారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన మృతి వార్త ఈ ప్రాంత ఉద్యమకారులను, వామపక్షవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూనవరంలో థింసాతో సందడి ఎన్నికల ప్రచారం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో మే 9న సీతారాం ఏచూరి పర్యటించారు. ఆ సమయంలో థింసా నృత్యంతో సందడి చేశారు. గిరిజనులతో ఫోటోలు దిగారు. ఆయన మృతికి సీపీఎం, సీపీఐతో పాటు కారి్మక సంఘాల నేతలు, అసంఘటిత రంగ కారి్మకులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప మేధావి ఏచూరి గొప్ప మేధావి, కార్మికవర్గ పక్షపాతి, లౌకిక శక్తుల బలోపేతానికి అంకితమైన నాయకుడు అని సీసీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు అన్నారు. ఆయన మరణం దేశానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎంతో బాధను మిగిల్చింది సీతారాం ఏచూరి తుదిశ్వాస వదలడం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికశక్తులకు తీరని లోటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వి.శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన ఉపన్యాసాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల నాయకులతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవన్నారు. ఆయన మరణం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోందని చెప్పారు. రాష్ట్ర పార్టీ తరపున ఢిల్లీలో నివాళులు ఏచూరికి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచీ విజయవాడతో అనుబంధం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సీహెచ్ బాబూరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున పార్టీ సీనియర్ నాయకులు పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఈనెల 14న ఢిల్లీలో ఆయన భౌతికకాయానికి నివాళులరి్పంచి అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. సీతారాం ఏచూరి మృతి తీరని లోటు సీతారాం ఏచూరి మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. చిరస్మరణీయులు: ఎస్ఎఫ్ఐ దేశంలోని శ్రామిక ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీతారాం ఏచూరి చిరస్మరణీయులని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కళాశాల రోజుల్లో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాజకీయాల్లో ఎన్నో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడింది. ఏచూరి కుటుంబ సభ్యులకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు: యూటీఎఫ్ కామ్రేడ్ సీతారాం ఏచూరి కమ్యూనిస్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. దేశంలో వామపక్ష శక్తుల మధ్యనేకాక అంతర్జాతీయంగా అన్ని కమ్యూనిస్టు సంస్థల మధ్య ఐక్యత సాధించడానికి ఆయన కృషి చేశారన్నారు. త్వరలో కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వరో్ణత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహా్వనించాలని నిర్ణయించామని, ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందన్నారు. -
కాకినాడ కామ్రేడ్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామç³క్ష దిగ్గజం సీతారాం ఏచూరి తెలుగు బిడ్డే. సుదీర్ఘకాలం సీపీఎం అగ్రనేతగా కొనసాగిన ఆయన స్వస్థలం కాకినాడ. బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తాతల కాలం నాటి ఇంటి స్థానంలో అపార్టుమెంట్ నిరి్మంచారు. అక్కడ కనిపించే రెండు ఏనుగు బొమ్మల గురించి స్థానికులు గొప్పగా చెప్పుకునే వారు. తాత సీతారామారావు పేరునే ఏచూరికి పెట్టారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా సీతారాంకు స్వయానా మేనమామ. చెన్నైలో మేనమామ ఇంట సీతారాం జని్మంచారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అక్కడి నుంచే వామపక్షవాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు రవాణా శాఖలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లారు. ప్రాచీన కళలపై ఎనలేని మక్కువ సీతారాం తల్లి కల్పకం విద్యావంతురాలు. కాకినాడ కేంద్రంగా మూడున్నర దశాబ్దాల పాటు అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు. వాతావరణ కాలుష్యం, మొక్కల పెంపకం, నీటి వనరుల పరిరక్షణ, మహిళలపై దాడుల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి పేరుతో కాకినాడ గాం«దీభవన్‌లో నిరి్మంచిన కార్యాలయాన్ని చూసి సీతారాం ఎంతో సంతోíÙంచారని నాటి జ్ఞాపకాలను కాకినాడకు చెందిన వాడ్రేవు శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. మహర్షి సాంబమూర్తి ఇనిస్టిట్యూట్‌ను తాత్కాలికంగా సీతారాం ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలి్పంచారని ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు తటవర్తి శ్రీనివాస్ చెప్పారు.ప్రాచీన కళలంటే వల్లమాలిన అభిమానం కలిగిన సీతారాం తోలు బొమ్మలాట కార్మికులు నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాకినాడ వచ్చారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆకళింపు చేసుకునేలాగాంధీ భవన్ చేస్తున్న కృషిని ప్రశంసించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2008 ఆగస్టు 31న కాకినాడలో సీపీఎం కార్యాలయం సుందరయ్య భవనం ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో సీతారాం ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు. -
కామ్రేడ్ ఏచూరి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రజెండా నీడలో ప్రకాశించిన అరుణతార నేల రాలింది. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసిన వామపక్ష యోధుడు, ప్రజా ఉద్యమకారుడు, సామాజిక వేత్త, కాలమిస్ట్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతూ ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఐసీయూలో చేరిన ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో రెండురోజుల క్రితం విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించారు.అది కూడా ఫలితాన్నివ్వకపోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు పరిశోధనల నిమిత్తం దానంగా ఇవ్వనున్నారు. ఏచూరి కోరిక మేరకే ఆయన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్. రెండో భార్య సీమ చిస్తీ. ఆయనకు కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. పశి్చమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బుద్ధదేవ్ భట్టాచార్యకు నివాళులర్పిస్తూ ఆగస్టు 22న చివరిసారిగా ఏచూరి ఒక వీడియో సందేశంలో కని్పంచారు. ‘అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ నుంచే మాట్లాడాల్సి వస్తోంది. విప్లవ లాల్ సలామ్‌లు బుద్ధదేవ్ గారికి..’ అని ఆ సందేశంలో ఏచూరి అన్నారు.ఏచూరి మరణంతో అటు కమ్యూనిస్టు పార్టీలోనూ, ఇటు కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియతమ కామ్రేడ్‌ను కోల్పోవడం తీవ్ర విషాదకరమని సీపీఎం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏచూరి మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఏచూరి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తల నివాళులు, సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచుతామని సీపీఎం తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. పరిశోధనల కోసం పార్థివ దేహం ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. పార్థివ దేహాలను పరిశోధనల కోసం దానం చేసే పద్ధతిని కమ్యూనిస్టులు కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని కూడా దానం చేశారు. ఇలాగే మరికొందరి భౌతికకాయాలను కూడా ఆసుపత్రులకు అప్పగించారు. నేడు విదేశీ కమ్యూనిస్టు నేతల రాక ఏచూరి మరణవార్తను తెలుసుకున్న విదేశాలకు చెందిన కమ్యూనిస్టుల పార్టీల నేతలు, ఆయనకు నివాళులరి్పంచేందుకు ఢిల్లీ రానున్నారు. శుక్రవారం చైనా, నార్త్ కొరియా, వియత్నాం, క్యూబా వంటి దేశాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనుగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా చేరారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లెగిచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమెరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.ఏచూరికి ప్రముఖుల సంతాపం⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్కడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరు నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను – అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి⇒ ఏచూరి మరణం బాధాకరం. సుదీర్ఘ ప్రజాజీవితంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూనే పౌర సమస్యలపై పోరాడుతూ విశిష్టమైన నేతగా ఎదిగారు. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి⇒ భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఏచూరి ఒకరు. ఆయన కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎదిగారు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – సీఎం చంద్రబాబు ⇒ జీవితాంతం వామపక్ష భావాలతో ఏచూరి గడిపారు. దేశ ప్రగతి కోసం నిరి్వరామంగా చొరవ చూపారు. సీతారాం స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారు. ఏచూరి మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్, మాజీ సీఎం ⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తారు. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. పార్లమెంటేరియన్‌గా ప్రజాసమస్యలను బలంగా వినిపించారు. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి -
అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!
అలా వెళ్లిపోయావేం ఏచూరీ, ఆఖరి ఆశలు కూడా వమ్ముచేసి. తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపలేకపోతోంది మా భౌతికవాద చైతన్యం... సమకాలీన భారత రాజకీయ రంగంలో అరుదైన ఆణిముత్యం సీతారాం ఏచూరి. పదహారణాల సంప్రదాయ తెలుగు కుటుంబంలో అత్యున్నత విద్యావంతుల ముద్దుబిడ్డగా పుట్టారు. తండ్రి ఎఎస్ సోమయాజులు అధికారి, తల్లి కల్పకం ఉద్యోగిని (కాకినాడలో సామాజిక కార్యక్రమాలకు కన్నతల్లి లాంటి ఆమె మూడేళ్ళ క్రితం కన్నుమూశారు.) మేనమామ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మోహన్ కందా కాగా మిగిలిన వారిలోనూ ఐఏఎస్‌లే ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలలో మిన్న అయిన ఏచూరి కూడా అదే మార్గంలో నడుస్తాడనుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుతుండగా తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే చదువుతూ 1970లో సీబీఎస్ఈ 12వ క్లాసులో అఖిల భారత స్థాయిలో ప్రథముడుగా వచ్చారు. అమెరికా పర్యటించే అవకాశం దక్కించుకున్నారు. సెంట్ స్టీఫె¯Œ ్స కాలేజీలో ఎకనామిక్స్‌లో పట్టభద్రుడై ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. 1974లో అక్కడే ఆయనకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ప్రకాశ్ కరత్‌తో పరిచయమైంది. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి అర్థశాస్త్రంలో అపారమైన ఆసక్తితో పరిశోధన చేయాలనుకున్నా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. రెండేళ్లలో మూడుసార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్ హోదాలో ఉండగా, ఆమె నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి, ఆమెను నిలబెట్టి అభియోగ పత్రం చదవడమే గాక, ఛాన్సలర్‌గా వుండటం తగదని మొహం మీదనే చెప్పేశారు. మొదట ఆశ్చర్యానికి గురైన ఆమె తర్వాత నిజంగానే ఆ బాధ్యత నుంచి వైదొలగారు. యాభై ఏళ్లపాటు ఏచూరి సాగించబోయే నిబద్ధ, నిశ్చల రాజకీయ ప్రస్థానానికి అది నాందీ ప్రస్తావన.ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఏచూరి 1984 నుంచి 1986లో విజయవాడలో జరిగిన అఖిల భారత మహాసభల దాకా కొనసాగారు. 1985లోనే కలకత్తాలో జరిగిన సీపీఎం మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడైనాడు. నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య వంటి సీనియర్ నాయకులు ఉద్యమాన్ని సమర్థంగా కొనసాగించడం కోసం వ్యూహాత్మకంగానే ఏచూరి, కరత్ వంటి యువనాయకులకు తర్ఫీదునిచ్చారు. తెలుగువాడిగా మాకినేనితోనూ, జాతీయ రాజకీ యాల్లో సూర్జిత్తోనూ సీతారాం సన్నిహితంగా మెలు గుతూ ఆచరణాత్మక విషయాలూ ఆకళింపు చేసు కున్నారు. 1988లో సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన ఏచూరి, 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు సూర్జిత్తో పాటు ఆ పరిణామాలలో కీలక పాత్ర వహించారు. 1991లో సోషలిస్టు సోవియట్ విచ్ఛిన్నం పెద్ద ఎదురుదెబ్బగా మారిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వుండదనుకునేవారికి కను విప్పు కలిగేలా భారత దేశంలో మూడు రాష్ట్రాలలో సీపీఎం, వామపక్షాలు గెలుపొందాయి. 1992లో మద్రాసులో జరిగిన సీపీఎం మహాసభలో ఈ సైద్ధాంతిక పరిణామాలపై తీర్మానం ఏచూరి ప్రవేశపెట్టడం, సమాధానమివ్వడం ఆయన ఎదుగుదలకు అద్దం పట్టాయి. అప్పుడే పొలిట్ బ్యూరోలో ప్రవేశించారు.1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏచూరి కీలకపాత్ర వహించారు. అనేక ప్రామాణిక రచనలు వెలువరించారు. దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలానికి సూర్జిత్, జ్యోతిబసు, చంద్రబాబు, వీపీ సింగ్ వంటివారితో పాటు సీతారాం ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారిగా రూపొందారు. ఇదే కాలంలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా సీపీఎం పత్రాల విధానాల రూపకల్పనలో తనదైన ముద్ర వేస్తూ, ఉపన్యాసకుడుగా వాటిని దేశమంతటా ప్రజలకూ పార్టీ శ్రేణులకూ వివరిస్తూ సవ్యసాచిలా పనిచేశారు. ఆ క్రమంలోనే 2004లో యూపీఏ ఏర్పాటు, కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి వంటివారు కూడా ఆ రోజులలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు.వామపక్ష ఐక్యతలో భాగంగా సోదర పార్టీలతోనూ, లౌకిక పార్టీలతోనూ సంప్రదింపులు జరపడంలో ఏచూరి పట్టువిడుపులకు పేరు పొందారు. ఆ విషయంలో అక్షరాలా సూర్జిత్ వారసుడనే చెప్పాలి. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి బీజేపీ నేతలు కూడా ఏచూరి ప్రత్యేకతను చెప్పకుండా వుండలేరు. అదే సమయంలో అపారమైన అధ్యయనం, అర్థశాస్త్రంలో పట్టు, ఆధునిక పరిణామాల అవగాహన ఆయనకు రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. జాతీయంగా ఇంత ఉన్నత స్థాయిలో వ్యవహరించే ఏచూరి సామాన్య కార్యకర్తలతో, ప్రత్యేకంగా యువతతో అలవోకగా కలసిపోయేవారు. ఎక్కడైనా ఏచూరి ప్రవేశించడమే ఏదో ఒక ఛలోక్తితో జరిగేది.సామాజిక న్యాయం, సాంస్కృతిక రంగాల్లో సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబేడ్కర్ మాటలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించకుండా మాట్లాడేవారు కాదు. మీడియా మిత్రుడిగా టీవీ డిబేట్లలో కీలకంగా కనిపించిన కొందరు తొలి నేతలలో ఆయనొకరు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’కి ఇరవయ్యేళ్లు సంపాదకులుగా వున్నారు. పుష్కరకాలం రాజ్యసభ సభ్యుడిగా వున్న ఏచూరి ప్రసంగాలంటే పాలక పక్షానికి పరీక్షలే. తను ఎదిగిన జేఎన్‌యూపై 2019లో రాజ్యసభలో చర్చ జరిగినపుడు నాటి మంత్రి స్మృతీ ఇరానీకి షేక్స్పియర్ భాషలో ఆయన సమాధానమిచ్చిన తీరు మర్చిపోలేనిది. అందుకే ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు, ప్రసంగాలు అనేకం పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. ‘ప్రపంచీకరణ యుగంలో సోషలిజం’, ‘ప్రపంచీకరణలో అర్థశాస్త్రం’, ‘హిందూరాష్ట్ర’, ‘లౌకికతత్వం అంటే ఏమిటి?’ వంటివి ప్రత్యర్థి పార్టీల వ్యూహాల లోతుపాతులు తెలియాలంటే చదవాల్సిందే. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఏచూరి కీలక పాత్రధారిగా మెలిగారు. ఒక దశలో భారత దేశంలో ఐక్యతా ప్రయత్నాల లాగే నేపాల్లోనూ కమ్యూనిస్టు గ్రూపులను ఒక వేదిక మీదకు తేవడానికి దోహదం చేశారు. అనేక కారణాల వల్ల వామపక్షాల బలం తగ్గుతున్న పరిస్థితులలో రాజకీయ పోరాటాలలోనూ, ఎన్నికలలోనూ లౌకిక శక్తులను పునరేకీకరణ చేయడానికి సహేతుక ప్రాతిపదిక ఏర్పరచడానికి ఆయన నిరంతరం పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘ఇండియా’ వేదిక ఏర్పాటు, లోక్‌సభ బలాల పొందిక మార్పు వెనక ఈ కృషి వుంది.బెంగాలీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి బహు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఏచూరి తెలుగు బిడ్డగా తెలుగువారికి మరింత ప్రేమపాత్రులైనారు. ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలేనంటూ మొదలుపెట్టినా అదో ప్రత్యేకమైన మంచి భాష మాట్లాడేవారు. మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతుంటుందని ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి. తెలుగు పాటలు కూడా ఇష్టపడేవారు. శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆయన కేతు విశ్వనాథరెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. 1980లో ఎస్ఎఫ్ఐ మహాసభల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం తెలుగువారికి గర్వకారణమే. ఆయన తన కోసం ఏమీ కోరుకోలేదు. తీసుకుపోలేదు. ఆశయాల బాట మిగిల్చివెళ్లారు.తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏచూరి ప్రజల మనసుల్లో నిలిచిపోతారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వామపక్ష దిగ్గజ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.ఈ క్రమంలో ఏచూరి మరణంపై ప్రధానమంత్రి మోదీ మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దారిదీపం వంటి వారని పేర్కొన్నారు, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేదని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధాని మోదీ.. గతంలో ఏచూరితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.చదవండి: సీతారాం ఏచూరి కన్నుమూత.. జీవిత ప్రస్థానం ఇదేSaddened by the passing away of Shri Sitaram Yechury Ji. He was a leading light of the Left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective Parliamentarian. My thoughts are with his family and admirers in this sad hour.… pic.twitter.com/Cp8NYNlwSB— Narendra Modi (@narendramodi) September 12, 2024 -
ఏచూరి మరణం కార్మికలోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరిమృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కాగా ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష మోధుడు కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేడు ప్రాణాలు విడిచారు. -
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
మచ్చ లేని మహా నాయకుడు అతని మృతి దేశానికే తీరని లోటు
-
వామపక్ష దిగ్గజ నేత సీతారాం ఏచూరి ప్రత్యేక ఫొటోలు..
-
సీతారాం ఏచూరి కన్నుమూత
-
కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత.. నేతల దిగ్బ్రాంతి
ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష మోధుడు కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేడు ప్రాణాలు విడిచారు.విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు : వైఎస్ జగన్సీతారాం ఏచూరి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారని ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని అన్నారు.సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారని కొనియాడారు. సీతారాం ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని తెలిపిన వైఎస్ జగన్.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.చదవండి: సీతారాం ఏచూరి జీవిత ప్రస్థానంఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం: సీఎం రేవంత్సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని తెలియజేశారు.దేశంపై లోతైన అవగాహన: రాహుల్సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మరణంపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశ ఆలోచనల రక్షకుడని, భారత్ గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఏచూరి అని పేర్కొన్నారు. తాను ఏచూరితో కలిసి చేసిన సుదీర్ఘ చర్చలను ఇకపై మిస్ అవుతానని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.జాతీయ రాజకీయాలకు తీరని లోటు: మమతా బెనర్జీసీతారాం ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘సీతారాం ఏచూరి మరణించారని తెలిసి బాధగా ఉంది. ప్రముఖ పార్లమెంటేరియన్ అయిన ఆయన మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఎక్స్‌లో తెలిపారు.చాలా బాధాకరం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణసీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, చాలా బాధాకరమని నారాయణ అన్నారు. ఏచూరితో కలిసి అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నట్టు నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.ఏచూరిని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు: బండి సంజయ్సీతారాం ఏచూరి మరణం పట్ల కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం పనిచేశారన్నారు. తెలుగువాడిగా ఏచూరిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని బండి సంజయ్ అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఏచూరి పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అదే పార్టీలో ఉండి పోరాడారన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీవ్ర లోటు: రాఘవులుఎల్లుండి సీతారాం ఏచూరికి అంతిమయాత్ర నిర్వహిస్తాం.దేశ విదేశాల నాయకులు, ప్రతినిధులు దౌత్యవేత్తలు రాబోతున్నారు.ఎల్లుండి మధ్యాహ్నం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు సీపీఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం సీతారాం ఏచూరి పార్తివ దేహాన్ని ఉంచుతాం.ఆయన కోరిక మేరకు పార్థివదేహాన్ని పరిశోధనల కోసం ఆస్పత్రికి అప్పగిస్తాం.సీతారాం ఏచూరి జీవితాంతం వామపక్ష ఉద్యమం కోసం పనిచేశారుఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.ఏ పని అప్పగించిన అందులో తనదైన ముద్ర వేశారు.కష్టకాలంలో సిపిఎం పార్టీని ముందుకు నడిపించారు.ఇండియా కూటమి లో కీలకపాత్ర పోషించారు.ఆయన పోరాట మార్గాన్ని ముందుకు తీసుకెళ్తాముపీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కామెంట్స్.చిన్ననాటి నుంచి వామపక్ష భావజానీకి ఆకర్షితుడై ,విద్యార్ధి ఉద్యమం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మహా ధీరుడు సీతారాం ఏచూరిజేఎన్యూ నుంచి అభ్యుదయ భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింప చేశారు .అత్యున్నత యూనివర్సిటీ జె ఎన్ యు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.ప్రపంచ దేశాలకు సైద్ధాంతిక చర్చకు వెళ్లేవారు.చైనా , రష్యా లాంటి దేశాలకు సలహాలు ఇచ్చే వారుఆర్థిక సంస్కరణ లపై వీశ్లేషణ చేసే వరకు..మన్మోహన్ సింగ్ లాంటి వారు రాజ్య సభ లో అయిన ప్రసంగం వినటానికి వచ్చే వారు..చిన్న పెద్ద అందరినీ ఆప్యాయంగా పిలవడం అయినా గొప్పతనం..దేశంలో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేశారు.ఖమ్మం జిల్లా లో అనేక సందర్భాల్లో కూడా పిలిసిన వెంటనే వచ్చేవారు.ఎంపీ గా తన బాధ్యత సక్రమంగా నేరేవేరుస్తూ ఆదర్శంగా నిలిచారుమతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలోకమ్యూనిస్టులకు ఆదరణ లేదు.ఏచూరి లాంటి వారు చాలా అవసరం..కమ్యూనిష్టులు ప్రజలకు అవసరం ఉన్నపుడు బలహీన పడ్డాం.ఎల్లుండి బౌతికాయన్ని మెడికల్ కాలేజీ కి బౌతిక కాయని డొనేట్ చేస్తారు.తెలంగాణ నుండి భారీ ఎత్తున అక్కడికి వెళ్తున్నాం.ఏచూరి వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు: కపిల్ సిబల్సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త తనను కలిచివేసిందని రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, తాము సుదీర్ఘకాలం ప్రయాణించామని చెప్పారు. 2005 నుంచి 2014 వరకూ ఆయన పార్లమెంట్లో తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తాము ఎన్నో అంశాలపై చర్చించి పరిష్కరించేవారమని అన్నారు. -
విషమంగా ఏచూరి ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: న్యూమోనియాతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు పార్టీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. న్యూమోనియా కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏచూరి బాధపడుతున్నారు. 72 ఏళ్ల ఏచూరిని కుటుంబీకులు ఆగస్టు 19న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోజు నుంచి ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవడం, ఇక్కడి మందులకు ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో.. విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించినట్లు తెలిసింది. మంగళవారం ఆయనకు విదేశాల నుంచి తెప్పించిన మెడిసిన్ ఇచ్చారు. 24 గంటలు గడిచిన తర్వాతనే ఆరోగ్య పరిస్థితిని వెల్లడించగలమని వైద్యులు కుటుంబీకులకు తెలిపారు. పలు విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్ల బృందం సీతారాం ఏచూరీకి చికిత్స అందిస్తోంది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పరామర్శించేందుకు హస్తినకు వస్తున్నారు. -
మళ్లీ విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విషమించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని వెల్లడించింది. ‘‘సీతారాం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.కాగా ఆగస్టు 19వ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0— CPI (M) (@cpimspeak) September 10, 2024 ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల -
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
మోదీపై ఫిర్యాదు: సీతారాం ఏచూరి
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శ్రీరాముడి అంశంపై ప్రజలను మతపరంగా సంఘటితం చేసేలా పలు ప్రకటనలు చేశారని, దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కోడ్‌ను ఉల్లంఘించేలా మోదీ మాట్లాడిన మాటలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏచూరి గురువారం కేరళలోని కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
సీపీఎం పోటీ చేయని చోట కాంగ్రెస్‌కు మద్దతు: సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు. ‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి, పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి. ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు. చదవండి: మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి -
లోక్‌సభ ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి
న్యూఢిల్లీ: 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, కలిసికట్టుగా పోటీ చేయడానికి విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం చెప్పారు. ప్రస్తుత ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూటమి పక్షాలు పరస్పరం అవగాహనతో పని చేయాలని సూచించారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అభ్యర్థుల జాబితాకు కేంద్ర కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామని, తెలంగాణ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
‘పూటకో పార్టీతో చంద్రబాబు జట్టు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఉదయం ఓ పార్టీతో.. సాయంత్రం మరో పార్టీతో ఉంటారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తారో తెలియదన్నారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు తమతో ఉదయం సమావేశం నిర్వహించి.. సాయంత్రానికి వాజ్‌పేయ్‌ని కలిసి పొత్తు గురించి మాట్లాడుకున్నారని గుర్తు చేశారు. గతంలో బీజేపీతోనూ, ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారన్నారు. అందువల్ల చంద్రబాబు ఇప్పుడు ఎవరితో ఉంటారో చెప్పడం కష్టమని తెలిపారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారో, లేదో కచ్చితమైన బ్లూప్రింట్ ఎవరి దగ్గర ఉండదన్నారు. జాతీయ స్థాయిలో ఒక విధానంతో పనిచేసే సీపీఎం ఎన్నికల సమయంలో రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుందని గుర్తు చేశారు. విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం ఏచూరి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ దేశానికి హానికరమని.. బీజేపీతో జట్టు కట్టే పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదన్నది తమ పార్టీ విధానమని ఏచూరి తెలిపారు. కాగా కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌కు రాష్ట్రపతి అధిపతి అని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రధాని అధికారపక్షానికి మాత్రమే ప్రతినిధి అనే విషయం మరిచిపోతున్నారన్నారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ప్రధాని ప్రారంభిస్తుండటం వల్లే 19 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయన్నారు. హిందూత్వ పేరుతో దేశ చరిత్రను, సిలబస్‌ను చెరిపేసి తమకు అనుకూలమైన కొత్త చరిత్రను సృష్టించుకునేందుకే మతతత్వ బీజేపీ రాజదండం నాటకాన్ని తెరమీదకు తెచ్చిందని ఆరోపించారు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య గతంలో నోట్ల రద్దు, ఇప్పుడు రూ.2 వేల నోటు రద్దు వెనుక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయని సీతారాం ఏచూరి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడి పార్టీలను దెబ్బతీసేందుకే పథకం ప్రకారం రూ.2 వేల నోటు రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. దీనివల్ల సాధించేదేమీ లేదన్నారు. గౌతమ్ అదానీ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు -
విపక్షాల ఐక్యతా యత్నాలు
న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ గురువారం సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతో సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోనూ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. అతిత్వరలో వివిధ పార్టీల అగ్రనేతలతో కీలక భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విపక్షాలు రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. దేశంలో మూడో కూటమి సాధ్యమేనని ఉద్ఘాటించారు. అయితే, ఈ కూటమి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందేనని సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. బీజేపీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసుగెత్తిపోయారని డి.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
మోదీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగహక్కులపై దాడులు జరుగుతున్నాయి.. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ల దోపిడీతో ప్రజలు అల్లాడుతున్నారు.. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్యం పరిరక్షణ జరుగుతుంది. ప్రగతిశీల శక్తులను కూడగట్టి ప్రజా ఉద్యమాలతోనే హక్కులను సాధించుకుందాం’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు సంఘటితం కావాలని కోరారు. శుక్రవారం వరంగల్, హనుమకొండలలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 29 వరకు సాగే రాష్ట్రవ్యాప్త జన చైతన్యయాత్రలను ప్రారంభించారు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘‘చేంజింగ్ సినారియో ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం’’అనే అంశంపై నిర్వహించిన సింపోజియంలో మాట్లాడారు. వరంగల్‌లోని అజంజాహి మిల్ (ఓ సిటీ) మైదానంలో జరిగిన బహిరంగసభలో సీతారాం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం హిందుత్వ ఎజెండాను తెరపైకి తీసుకొస్తుందని, అత్యంత బలమైన కేంద్రంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరలిజంను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కేంద్రం గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రాలపై అధికారం చెలాయిస్తూ, ప్రభుత్వాలను కూలదోసిన ఘటలను ఆయన ఉదహరించారు. మోదీ ప్రభుత్వంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ సంస్థల దోపిడీ కవల పిల్లలుగా తయారయ్యాయని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే ముద్రవేసి సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిందించారు. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత మద్యం పాలసీలో తప్పు చేసినట్లు రుజువైతే జైలు శిక్షలు వేసినా తమ పార్టీలు తప్పు పట్టవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ నుంచి ప్రజాచైతన్యయాత్ర ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రజాచైతన్య యాత్రలు ప్రారంభంకానుండగా తొలుత వరంగల్‌లో సీతారాం ఏచూరి శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట కాజీపేటనుంచి బైక్‌ర్యాలీ, హనుమకొండ ‘కుడా’మైదానం, వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్లు మైదానం కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. కాగా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బహిరంగసభలో ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరిని కలిసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో గురువారం కలిశారు. ఆయనను జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఆహ్వానించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు, మహిళా రిజర్వేషన్ బిల్లు రావాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. ఎస్పీ, ఆర్జేడీ పార్టీలకు ప్రాథమికంగా మహిళ రిజర్వేషన్లపై ఎలాంటి అభ్యంతరం లేదని కవిత అన్నారు. ‘‘మజ్లిస్ పార్టీని కూడా ధర్నాకు ఆహ్వానించాం. బిల్లు పెడితే అన్ని అంశాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 18 పార్టీలకు చెందిన నేతల ప్రతినిధులు రేపు హాజరుకానున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలో బిల్లు ప్రాముఖ్యత వివరిస్తాము. మహిళా బిల్లు వల్ల ఎవరికీ నష్టం లేదు. బిల్లు పెట్టే బీజేపీ చిత్తశుద్ధి నెరవేర్చుకోవాలి. బీజేపీ హైదరాబాద్ దీక్ష చేపడుతుందంటే.. ఢిల్లీలో నా దీక్ష సక్సెస్ అయ్యనట్టే కదా.. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేలా బండి సంజయ్, కిషన్ రెడ్డి చూడాలి’’ అని కవిత అన్నారు. ‘‘మార్చి 2న నేను దీక్ష చేస్తామని ప్రకటించాను. నాకు ధైర్యం ఉంది. 9 వతేదీన రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.. నేను 11ను వస్తాను అని తెలియజేశాను. బీఎల్ సంతోష్ ఎందుకు సిట్ ఎదుటకు రారు. కోర్టు స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు మాట్లాడితే ఎలా?. ఈడీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా. వెళ్లాల్సిన సమయంలో కోర్టుకు వెళ్తాం’’ అని కవిత పేర్కొన్నారు. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? -
ఈడీ లేకుంటే బీజేపీనే లేదు
సాక్షి, హైదరాబాద్: ఈడీ లేకుంటే బీజేపీనే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆ పార్టీ కూలదోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పారు. ఈడీ ఇంకా తమ దాకా రాలేదని, వచి్చనా ఆశ్చర్యపోయేదేం లేదని చెప్పారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ జరగాలనీ, బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం 1948 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 1949 జూలై 11వ తేదీ వరకు రా్రïÙ్టయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై అప్పటి కేంద్ర హెూంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని ఏచూరి తెలిపారు. ఆయన్ను ఇప్పుడు తమ సొంత మనిషి అన్నట్టు బీజేపీ ప్రచారం చేసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం ఘర్షణగా వక్రీకరించి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం చేస్తోందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు లొంగిపోవడానికి అంగీకరిస్తేనే భారత సైన్యం ఇక్కడకు వచి్చందని చెప్పారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, రజాకార్లు 57 మంది మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. లౌకిక శక్తుల ఏకీకరణకు కృషి బీజేపీని గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా లౌకిక శక్తుల ఏకీకరణకు తాము కృషి చేస్తున్నామని ఏచూరి చెప్పారు. ఈ నెల 25న హర్యానాలో దేవీలాల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వామపక్ష పారీ్టలను ఆహ్వానించారని, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కూడా ఆహా్వనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారానికి బీజేపీ యత్నాలు.. కర్ణాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని ఏచూరి చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ అధికారం సాధించే క్రమంలో చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సీపీఎం వ్యూహం ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతోందని, తాము కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కలసి నడవడంలో తప్పులేదన్నారు. మోదీని గద్దె దింపేందుకు కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు టీఆర్ఎస్ ఇష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీయే ప్రథమ శత్రువు: తమ్మినేని మునుగోడులో టీఆర్ఎస్కు తాము మద్దతు ఇచి్చనంత మాత్రాన ప్రజా సమస్యల పరిష్కారంలో ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమలు తమకేమీ లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమకు ప్రథమ శత్రువు అని, దాన్ని ఓడించడమే తమ ముందున్న తక్షణ రాజకీయ అవసరం అని చెప్పారు. సీపీఎం రాష్ట్ర నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుట్ర.. క్విడ్ ప్రోకో! -
సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారత్‌ను నిర్మిద్దాం
మిర్యాలగూడ/అర్వపల్లి/జనగామ: రాజ్యాంగ విలువలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు సహకరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. బీజేపీని నిలువరించేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారతదేశాన్ని సృష్టించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ సాయుధ పోరు ప్రారంభమయ్యేనాటికి బీజేపీ, సంఘ్‌పరివార్ ఉనికిలో లేవ న్నారు. గాంధీజీ హత్య అనంతరం 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారని చెప్పారు. తెలంగాణ పోరాట ఉత్సవాలను విమోచనంగా చెప్పుకుంటూ తమ ఘనకార్యంగా బీజేపీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏచూరి సూర్యాపేట జిల్లా అర్వపల్లి లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ సాయు ద పోరాట వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడారు. బీజేపీని నిలువరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అనేక అంశాలను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని ఏచూరి ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాల్లో జీఎస్టీ వాటాను విడుదల చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బలపడి.. తలపడదాం..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరం ఉంది..’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ముందుగా వామ పక్షాలు మరింత బలపడి, ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్లైన్లో.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ కేంద్రంగా ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ అజెండాను అమలు చేయడమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అదే ఈ రోజు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా త్వరలోనే ‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’అంటూ బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అవినీతి ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్దయెత్తున దాడి జరుగుతోందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బీజేపీ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఉదహరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న టీఆర్ఎస్: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పడే వాగ్దానాలను విస్మరించి, ఎన్నికల్లో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు ప్రధానంగా ప్రజాస్వామిక, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పొత్తు వార్తలను ఆయన ఖండించారు. పునరేకీకరణకు కృషి జరగాలి: చాడ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేప ట్టే పోరాటాల్లో సీపీఐ, సీపీఎంల మధ్య సారూప్యత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు తమ ఐక్యతకే కాకుండా పునరేకీకరణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలు వురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని, అంతా రాష్ట్రాలపైకి నెట్టిందని ఆరోపించారు. గత డిసెంబర్ 31 నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామన్నారని, అది ఇంకా నెరవేరలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ‘ఆర్థిక రంగంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ధరలు పెరుగుతున్నాయి. సంపద లూటీ అవుతోంది’అని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్ముకోండి.. పొలిటికల్ ఫండ్‌గా బీజేపీకి కేటాయించండని చెబుతున్నారని విమర్శించారు. దేశంలో 112 మంది మహా కోటీశ్వరులు ఉన్నారని, వారి చేతుల్లో ప్రజల వద్ద ఉన్న సంపదలో 55 శాతం ఉందని చెప్పారు. పార్లమెంటులో చర్చలే జరగవు రాజ్యాంగంలోని కీలక స్తంభాలను ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసి కేంద్రమే తన చేతుల్లోకి తీసుకుంటోందని ఏచూరి మండిపడ్డారు. ‘12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగవు. పార్లమెంటును రబ్బర్ స్టాంప్‌లా వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీలను తన రాజకీయ ఏజెన్సీలుగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. తనకు లొంగని ప్రతిపక్షనాయకుల మీద కేసులు పెడుతూ హింసిస్తోంది’అని విమర్శించారు. ఎన్నికల్లో ఏ పార్టీనైనా నెగ్గనీయండి.. కానీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అనడంపై మండిపడ్డారు. పార్టీ పాత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళల కోసం ఎర్రజెండా పోరాడుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక బంగారు తెలంగాణ తెస్తామని పాలకులు ఆశ చూపారని, కానీ ఆశలు అడియాసలయ్యాయని మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ రావాలన్నారు. బీజేపీ విషసర్పంలా ఎదుగుతోంది: తమ్మినేని రాష్ట్రంలో బీజేపీ విషసర్పంలా ఎదుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వార్డు స్థాయిలోకి కూడా వెళ్లిందని, విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతవిద్వేషాలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించారు. రాష్ట్ర మహాసభల్లో కూడా బీజేపీని అడ్డుకోవడమెలానో చర్చిస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరడంలేదని విమర్శించారు. కేంద్రంపై ఒక్కనాడైనా ఆయన పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. బీజేపీని రాజకీయ బేరసారాలకు, తన ప్రయోజనాలకు కేసీఆర్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను నమ్మలేకపోతున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సహా ఎవరు వచ్చినా కలిసి పోరాడతామని, దీనర్థం వాళ్లతో ఎన్నికల పొత్తులుంటాయని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ఊరుకోబోమన్నారు. రాబోయే కాలంలో వామపక్షవాదులతో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు ఏర్పడుతాయని చరిత్ర చెబుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్, 2004లో యూపీఏ, 1998లో ఎన్డీఏ వంటివన్నీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఏర్పడినవేనని ఉదహరించారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన సమయంలో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతే ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఎన్నికలకు ముందు ఎలాంటి ఫ్రంట్లు ఏర్పడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాను ఆమోదించాం. దీనిపై కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సవరణలను నేరుగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. ఆయా సవరణలను పార్టీ జాతీయ మహాసభల ముందుంచుతాం. పార్టీ జాతీయ మహాసభలు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలోని కన్నూరులో జరపాలని నిర్ణయించాం. మా రాజకీయ ముసాయిదాలో ప్రధానంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పిలుపునిచ్చాం. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించాం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి బీజేపీని ఓడించాల్సిన అవసరముంది, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడలు రచిస్తాం’అని ఏచూరి చెప్పారు. ప్రజల్లో మోదీపై అసంతృప్తి దేశ ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా తీవ్ర వ్యతిరేకత ఉందని సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆర్థిక సంక్షోభం పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రో ఉత్పత్తులు నిరంతరం పెరుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు. ప్రధానమంత్రి సహా ఎవరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విరాళాలను బాండ్ల రూపంలో తీసుకొచ్చి రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేశారు. ఎన్నికల బాండ్లలో 80 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. ఈ డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల కమిషన్ దీన్ని అడ్డుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మేము మద్దతు ఇస్తాం’అని ఏచూరి వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్‌కు స్వాగతం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తే తాము స్వాగతిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేస్తామా లేదా అన్నది ఇప్పుడు నిర్ణయించబోమని, ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పరిస్థితులు ఉంటాయని, అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఎతుగడలు ఉంటాయని చెప్పారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. సీపీఐ, సీపీఎంల విలీనం ప్రతిపాదనేదీ రాలేదన్నారు. బీజేపీపై సానుకూలంగానే టీఆర్ఎస్: తమ్మినేని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘బీజేపీని టీఆర్ఎస్ సూటిగా విమర్శించడంలేదు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ చెప్పట్లేదు. రైతు సమస్యలు వంటి విషయాలు తప్పిస్తే ఇతరత్రా బీజేపీ పట్ల టీఆర్ఎస్ ఇంకా సానుకూల వైఖరితోనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా ఎదుగుతోంది. దాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది’అని తమ్మినేని చెప్పారు. -
‘చెయ్యి’ కలిపేదే లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘‘బీజేపీని ఓడించాల్సిందే.. కానీ అందుకోసం కాంగ్రెస్‌తో ఎక్కడా పొత్తు పెట్టుకోకూడదు. అలాగే బలమైన బూర్జువా ప్రాంతీయ పార్టీలతోనూ ఇదే వైఖరి అనుసరించాలి. విధానపరమైన పోరాటాలు చేయాలి. అయితే బీజేపీ గెలిచే అవకాశమున్న సీట్లల్లో ప్రత్యామ్నాయ లౌకిక పార్టీలతో అంతర్గత అవగాహన కలిగి ఉండాలి. పార్టీ కేడర్‌కు సూచించి సదరు లౌకిక పార్టీకి ఓటు వేయించాలి. తెలంగాణలో హుజూరాబాద్, హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అనుసరించిన వ్యూహాన్నే కొనసాగించాలి..’’వామపక్షాల్లో కీలకమైన సీపీఎం తాజా రాజకీయ వ్యూహం ఇదేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో బీజేపీ మతతత్వ పాలనను అడ్డుకోవడం, అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడమనేవి సీపీఎం ప్రధాన లక్ష్యాలని వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే పార్టీ జాతీయ మహాసభలకు సంబంధించిన రాజకీయ తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే ఖరారు చేయనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకూ అదే వర్తించనుంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు సీతారాం ఏచూరి, పినరై విజయన్, మాణిక్ సర్కార్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు రాజకీయ తీర్మానంపై తలమునకలై ఉన్నారు. ఊగిసలాట పోయి.. సీపీఎం గత సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌తోపాటు మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. అయితే ఈసారి అలాంటి పొత్తులు పెట్టుకోకూడదని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం సరికాదని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ లౌకిక పార్టీయే అయినా.. ఆర్థిక విధానాల విషయంలో బీజేపీకి, దానికి తేడా లేదన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో ఇప్పటిదాకా పార్టీలో భిన్నాభిప్రాయం ఉండేదని.. అది ఇప్పుడు మారిందని ఓ సీపీఎం నేత చెప్పారు. ప్రధాన కర్తవ్యాలు రెండు ప్రస్తుతం సీపీఎం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకటి దేశంలో బీజేపీ మతతత్వ వ్యవహారాన్ని అడ్డుకోవడం, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రయత్నించడం కాగా.. మరొకటి పార్టీని మరింత బలోపేతం చేయడమని అంటున్నాయి. ఈ రెండింటిలో ఇప్పటివరకు పార్టీ అనుసరించిన వ్యూహం పెద్దగా విజయవంతం కాలేదన్న భావన ఉందని చెప్తున్నాయి. బీజేపీని నిలువరించేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లినా కొన్ని పార్టీలు మధ్యలో పొత్తులను వదిలేసి బీజేపీతో వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ప్రాంతీయ పార్టీలతో ఈ సమస్య ఉందని సీపీఎం నేతలు అంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ఒకప్పుడు సీపీఎం టీడీపీతో కలిసి నడిచిందని.. కానీ టీడీపీ పలుమార్లు సీపీఎంను విమర్శించడమే కాకుండా బీజేపీతో జతకట్టిందని గుర్తు చేస్తున్నారు. కొంతకాలం కింద జనసేనతో కలిసి ముందుకు నడవాలనుకున్నా ఆ పార్టీ కూడా నేరుగా బీజేపీతో జతకట్టిందని, విధానాల్లేని అలాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల సీపీఎం ప్రతిష్ట కూడా మసకబారిందని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లోనూ పార్టీ పట్ల గందరగోళం నెలకొందని.. కాబట్టి బూర్జువా పార్టీలతో పొత్తుల జోలికి వెళ్లొద్దని పార్టీ భావిస్తోందని వెల్లడిస్తున్నారు. -
ఎన్నికల వ్యూహంపై చర్చిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజులపాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్‌తోపాటు మిగతా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఏచూరి మాట్లాడుతూ తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు. ఇందుకోసం నెలరోజుల గడువు ఇస్తామని, ఇది సీపీఎం అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ మలయాళీ అసోసియేషన్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దయిందని, అయితే ఇక్కడి కేరళవాసులు విజ్ఞప్తి మేరకు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారని తెలిపారు. -
సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి మాతృవియోగం
సాక్షి, అమరావతి\ న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం (88) శనివారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. అస్వస్థత, వృద్ధాప్య సమస్యలతో ఆమె మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 1933 జూన్ 6న పాపాయ్యమ్మ, కందా భీమశంకరం దంపతులకు కల్పకం మద్రాసులో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు వేముగంటి బొప్మాయమ్మ, అనేకమంది ఇతర కార్యకర్తలతో కలసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏర్పాటు చేసిన బాలికాసేనలో సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ దివ్యాంగుల బాలికల పాఠశాల, బాలభవన్‌లకు కన్వీనర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మహిళా మండలి అక్షరాస్యత ఉద్యమం, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ, ఆంధ్రా వనితామండలి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేసినందుకు దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరిట ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు. కల్పకం బాల్యంలోనే ఏచూరి సర్వేశ్వర సోమయాజులుతో వివాహం జరిగింది. అర్ధంతరంగా ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ’ఇండియా అండ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్’ అంశంలో ఎంఫిల్ చేశారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఇటలీ, మలేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వివిధ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శనలకు 80కి పైగా పతకాలు గెలుచుకున్నారు. కల్పకం రెండో కుమారుడు భీమశంకర్ ఏచూరి మారుతి ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె సోదరుడు మోహన్ కందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. కల్పకం భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు దానం చేశారు. ఆమె మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వై.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణ , ఏపీ, మహారాష్ట్ర సీపీఎం కమిటీలు, కేరళ సీఎం పినరయి విజయన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. -
సీతారాం ఏచూరి కొడుకు మృతి: ప్రముఖుల సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందడం విచారకరం. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్లో పేర్కొన్నారు. Condolences to Shri Sitaram Yechury Ji and his family on the tragic and untimely demise of his son, Ashish. Om Shanti. — Narendra Modi (@narendramodi) April 22, 2021 ప్రముఖల సంతాపం ► సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2021 ► ఆశిష్ ఏచూరి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్ సీతారాం, మీ నుంచి ఆశిష్ దూరమైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్టమైన సమయంలో మా ఆలోచనలు మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి’అని ఆయన ట్వీట్ చేశారు. ► కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ సీపీఎం నేత సీతారాం ఏచూరి పెద్దకుమారుడి మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. ‘ఈ వార్త వినటం చాలా విచారకరం.తల్లిదండ్రులకు ఇంత కంటే పెద్ద నష్టం మరోటి ఉండదు.ఈ నష్టం పూడ్చలేనిది. దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కలిగిఉండండి. ఈ బాధకరమైన సమయంలో నా హృదయం బరువెక్కింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) నేత కవితా కృష్ణన్ విచారం వ్యక్తం చేశారు. ‘డియర్ కామ్రేడ్, ఈ విషాదం గురించి విని షాక్‌కు గురయ్యాము. మీకు, మీకు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఆమె ట్వీట్ చేశారు. ► ఆశిష్ ఏచూరి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. -
కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మరణించారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరీ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్‌ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు’ అని ఆయన ట్వీట్ చేశారు. 34 ఏళ్ల ఆశిష్ ఓ ప్రముఖ వార్తాపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us. — Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021 మరో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో మరో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి డాక్టర్ ఎ.కె.వాలియా గురువారం మృతి చెందారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనకు చికిత్స అందించడం కోసం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. వాలియా వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: రాష్ట్రాలకు రూ.400లకు డోసు -
తప్పుడు కేసులు దుర్మార్గ చర్య
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌యూ ప్రొఫెసర్ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్‌పరివార్‌కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి రెండేళ్లు అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నిరసనలు.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసి క్రాస్‌రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది. -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
రాజ్యసభ ఎన్నికలకు ఏచూరి దూరం
న్యూఢిల్లీ: సీపీఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం సీపీఎం పోలిట్‌బ్యూరోలో కేరళ నాయకుల ప్రాబల్యం కనిపిస్తుందని.. సీపీఎం పార్టీ ఒకే నాయకుడిని రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. మార్చి 26న పశ్చిమ బెంగాల్‌కు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయాలని కొందరు నాయకులు భావిస్తున్నా..మెజారిటీ నాయకులు పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ, బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తు.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పార్టీ నేతలు సీతారాం ఏచూరిని ప్రశంసిస్తున్నారు. -
ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలతో పనేంటి?
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలను రాజకీయ నాయకులు తప్పుదోవలో నడిపిస్తున్నారంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. అసలు ఆర్మీ చీఫ్‌కు దేశ అంతర్గత రాజకీయాలతో పనేంటని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఆర్మీ చీఫ్ రాజకీయాల గురించి మాట్లాడటం ఇదే మొదటిసారని, సాయుధ దళాల్లో కూడా రాజకీయ జాడలు కనిపించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఏచూరి శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడే ధోరణి దేశాన్ని మరో పాకిస్తాన్లా మారుస్తుందన్న విషయాన్ని గ్రహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేని, కానీ కేంద్ర మంత్రులు కూడా రావత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్పీఆర్)ను 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే హోంమంత్రి అద్వానీ పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 2014లో రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కూడా దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని చెప్పారని, ఇది పార్లమెంటు రికార్డుల్లో ఉందన్నా రు. కానీ మోదీ మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నార్సీ గురించి తాము చర్చించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హింసకు పోలీసులే కారణం దేశంలో జరుగుతున్న హింసా ఘటనలకు పోలీసులే కారణమని, వారే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలపై ఆరోపణలు చేస్తున్నారని ఏచూరి ఆరోపించారు. తాము ప్రజల మీద ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించడం లేదని కేంద్రం చెబుతుంటే.. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ ఆందోళనల్లో 27 మంది ఎలా చనిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిరూపించేంత వరకు ఈ దేశంలో నివసించే వారంతా దేశ పౌరులేనని, కానీ కేంద్రం మాత్రం ప్రజలు దేశ పౌరులని నిరూపించుకునేంత వరకు ఈ దేశ పౌరులు కాదని అంటోందని ఎద్దేవా చేశారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ఎన్నార్సీని అమలు చేయడం లేదని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారని, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని ఏచూరి డిమాండ్ చేశారు. కేసీఆర్ డబుల్ డ్రామా.. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ విషయాల్లో సీఎం కేసీఆర్ డబుల్ డ్రామా ఆడుతున్నారని అర్థమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఎంఐఎంతో ఉన్న స్నేహం కారణంగా ముస్లింల ఓట్లు కావాలి కాబట్టి సీఏఏ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించారన్నారు. ఇటీవల పత్రికల్లో వస్తున్న వార్తల ఆధారంగా సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నారని అర్థమవుతోందని, అది నిజం కావాలని తాము కోరుకుటుంటున్నామన్నారు. -
రాజస్తాన్ సీఎంకు ఏచూరి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కు లేఖ రాశారు. రాజస్తాన్ పోలీసులు సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ ఘటనపై విచారణ నిమిత్తం ఏలాంటి సమాచారం లేకుండా తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేని, ఇద్దరు కార్యకర్తలను రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే తమ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఈ ఘటనపై శాంతియుతతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళా కార్యకర్తలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సీఎంకు తెలియజేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని గెహ్లోట్‌కు విజ్క్షప్తి చేశారు. -
యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?
సాక్షి, గుంటూరు : జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అత్యవసరంగా 40వేల మంది సైనికులను కశ్మీర్‌కు ఎందుకు తరలించారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్లో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందన్నారు. అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాగా, అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. -
సీపీం ప్రధాన కార్యదర్శి ఏచూరి సంచలన వ్యాఖ్యలు
-
‘హిందువులు హింసావాదులు కాదని ఎవరన్నారు?’
భోపాల్ : హిందువులు హింసాత్మకంగా ఉండరని ఎలా చెబుతారంటూ సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరెస్సెస్ ప్రచారక్‌లను ప్రశ్నించారు. రామాయణ, మహాభారతాల్లోని ఘట్టాలు హిందువులు కూడా హింసకు పాల్పడతారని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవుల రక్షణ కోసమంటూ ప్రైవేట్ ఆర్మీని పెంచి పోషిస్తున్నారంటూ ఆరెస్సెస్‌ను విమర్శించారు. ‘ రామాయణ, మహాభారతాల్లో యుద్ధాలు, హింసకు సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఆరెస్సెస్ ప్రచారకులై ఉండి ఈ పురాణాలను బాగానే చెబుతారు గానీ.. ఈ హింస గురించి ఎందుకు మాట్లాడారు. హిందువులు హింసాత్మకంగా వ్యవహరించరు అని ఎందుకు చెబుతారు. వేరే మతాలకు మాత్రమే హింసను ఆపాదిస్తూ.. హిందువులు అసలు అలాంటివి చేయరు అని ప్రచారం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి’ అని మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు.. సీతారాం ఏచూరితో పాటు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆరెస్సెస్, బీజేపీలకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ గౌరవాన్ని కేవలం కళ్లద్దాలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని పేర్కొన్నారు. -
‘సైనిక దాడులను రాజకీయం చేస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం సైనిక దాడులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజకీయం చేస్తున్నారని సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోయిందని, నిరద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కశ్మీరీలను పరాయి వారిగా చూడడం దగదన్నారు. అనుభవం లేని సంస్థలకు విమానాశ్రాయాల ప్రైవేటీకరణ అప్పగించారని విమర్శించారు. ఆధార్ డేటాబేస్‌ను ప్రైవేట్ సంస్థలు ఉపయోగించుకునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతిఆమోదం తెలపకూడదని డిమాండ్ చేశారు. ఏపీలో పవన్‌తో కలిసి పోటీ చేస్తాం రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో పవన్ కల్యాణ్, సీపీఐలతో కలిసి పోటీ చేస్తామని ఏచూరి స్పష్టం చేశారు. తెలంగాణలో సీపీఐ, బీఎల్‌ఎఫ్‌లతో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్లపంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బీహార్‌లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా ఒక్క సీటులో పోటీ చేస్తామన్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుంటామని, సీట్ల కోసం చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఒడిశాలో భువనేశ్వర్ ఎంపీ సీటుకు పోటీ చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. లెఫ్ట్ ప్రంట్, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేయవద్దని ప్రతిపాదన చేసుకున్నామని పేర్కొన్నారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎప్‌ల మధ్యే పోటీ ఉంటుదన్నారు. కేరళలో ఈ సారి ఎక్కువ సీట్లు గేలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ఉగ్రదాడితో రాజకీయ లబ్ధికి బీజేపీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని రాజకీయం చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. అన్నిరంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వం, ఉగ్రదాడిని రాజకీయంగా ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ భద్రత దృష్ట్యా ఇది విద్రోహ చర్యేనని, యావద్దేశం ఈ దాడి విషయంలో ఐక్యంగా నిలిస్తే బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో సైనికులు చనిపోయారని అయినా తమది కాంగ్రెస్ ప్రభుత్వం కాదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం ఏమి సాధించిందని, ఈ దాడి కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా అని ఆయన నిలదీశారు. పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చే ప్రయత్నం అత్యంత ప్రమాదకరమని, అందుకే దానిని వ్యతిరేకించామన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వహయాంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’రక్షణ ఒప్పందం రూపంలో బయటపడిందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని ఏచూరి చెప్పారు. ప్రధాని మోదీని ఓడించి దేశాన్ని కాపాడాలని, పశ్చిమబెంగాల్లో అక్కడి సీఎం మమతాబెనర్జీని ఓడించి బెంగాల్‌ను పరిరక్షించాలనే నినాదంతో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేయడంపై సీపీఐతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీతో నేరుగా పొత్తు ఉండదన్నారు. అయితే తమిళనాడులో డీఎంకేతో తమకు పొత్తు ఉండగా, ఆ పార్టీతో కాంగ్రెస్ కూడా కలసి పనిచేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్లు చూస్తుంటామన్నారు. అప్పట్లో హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఎల్ఎఫ్ కొనసాగింపు: తమ్మినేని లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎల్ఎఫ్ ప్రయోగం కొనసాగించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.ఈ ఎన్నికల్లో కలసి పోటీచేసే విషయంలో సీపీఐ కార్యదర్శిచాడ వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో టీజేఎస్, జనసేనతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. సీపీఎం పక్షంగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదని తమ్మినేని ఓ ప్రశ్నకు బదులిచ్చా రు. టెన్ టీవీని విరాళాలు తీసుకుని ఏర్పాటు చేశామని, నష్టాలు రావడంతో విరాళాలు వెనక్కు ఇస్తున్నామన్నారు. పొలిట్‌బ్యూరో అనుమతి తీసుకున్నాకే నష్టాల్లో ఉన్న సంస్థను విక్రయించినట్టు తెలిపారు. -
‘వారు జవాన్లపై దాడి చేయలేదు’
సాక్షి, హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పుల్వామా ఘటనను ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియటం లేదంటూ బీజేపీపై మండిపడ్డారు. ఒక మతానికి సంబంధించిన వారు జవాన్లపై దాడి చేయలేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా పుల్వామాలో జరిగిన సంఘటనను విద్రోహ చర్యగా పేర్కొన్నారు. అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశం మొత్తం ఐక్యంగా ఉంటే బీజేపీ మాత్రం రాజకీయం చేయాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం ఇది.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు’ అన్న అమిత్ షా మాటలను తప్పుబట్టారు. సంఘటనను బీజేపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ సంఘటనతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందని ప్రశ్నించారు. కాశ్మీర్‌లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఎవరూ ఉగ్రవాదుల ట్రాప్‌లో పడకూడదని కోరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో జవాన్లు చనిపోయారని తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. మాది సెక్యులర్ పార్టీ. ఎన్నికల ముందు కేసీఆర్ లాంటి ఫెడరల్ ఫ్రంట్లు చూస్తూనే ఉంటాము. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. వామపక్షాలు పార్లమెంట్లో ఉండేలా కార్యాచరణ రచిస్తున్నాం. ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుంది. 2019 ఎన్నికల తరువాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేయడంపై సీపీఐతో చర్చలు జరుగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు. ఎలక్షన్ కమీషన్ అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేయాలి. జనసేన, టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నాం: తమ్మినేని ఎంపీ ఎలక్షన్లలో కలిసి పోటీ చేసే విషయంపై జనసేన, తెలంగాణ జనసమితి పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఎల్‌ఎఫ్‌తో దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. చాడ వెంకట్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అధికారంలోకి రాకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 టీవీ సీపీఎం పార్టీది కాదని, సీపీఎం పార్టీగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదన్నారు. విరాళాలు తీసుకుని టీవీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నష్టంలో ఉన్నందున 10 టీవీని అమ్మి వేసినట్లు చెప్పారు. సేకరించిన విరాళాలు తిరిగి ఇస్తున్నామని, తమపై వచ్చిన వార్తలు ,సోషల్ మీడియాలో వచ్చినవి.. ఒక పేపర్లో వచ్చిన వార్తలు సరైనవి కావన్నారు. తాము టీవీ ద్వారా నష్టపోయామని పొలిట్ బ్యూరోకి చెబితే.. 10 టీవీని అమ్మి వేయండని పోలిట్ బ్యూరో సలహా ఇచ్చినట్లు తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికలకు వ్యూహమెలా?
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై సీపీఎం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పేరిట పార్టీ రాష్ట్ర శాఖ చేసిన ప్రయోగం ఆశించిన ప్రయోజనం చేకూర్చకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఏ వైఖరిని అవలంబించాలనే దానిపై చర్చిస్తోంది. సోమవారం రాత్రి వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీపీఐ, ఇతర వామపక్షాలు, సామాజిక సంస్థలు, శక్తులతో కలసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బావుంటుందని కొందరు రాష్ట్ర నాయకులు సూచించారు. సీపీఐ ముఖ్య నేతలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్టీకి అనుభవంలోకి వచ్చిన లోటుపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ మౌలిక విధానాలు, వైఖరికి భిన్నంగా వ్యవహరించవద్దని, రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూనే కులం లేదా సామాజిక ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. -
‘రాష్ట్ర సమీకరణాల ఆధారంగానే పొత్తులు’
న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి సమీకరణాల ఆధారంగానే ఎన్నికల పొత్తులను పార్టీ నిర్ణయిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రెండు రోజుల పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహాగఠ్‌బంధన్‌లో ముందస్తు కూటమి సాధ్యం కాదు. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే మా ఎన్నికల వ్యూహాలు ఉంటాయి’అని సీతారాం స్పష్టం చేశారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్న దానిపై పార్టీకేంద్ర కమిటీ మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని, లోక్‌సభలో సీపీఎంను బలోపేతం చేసి కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. -
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌పైనా శుక్రవారం నాడు పార్లమెంట్లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు) ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్‌ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే. సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా? మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది. సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు! -
‘ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో తేలుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఖరారు అవుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 2004లో వచ్చిన ఫలితాలే మరోసారి రానున్నాయని, వారి తల రాతలో ఓటమి రాసిపెట్టి ఉందని జోస్యం చెప్పారు. కేవలం ప్రధాని మోదీ వల్ల బీజేపీ ఓటమి చవిచూడబోదని.. ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే ఎన్డీయేకు చెంపపెట్టులా మారతాయని వ్యాఖ్యానించారు. అదే రిపీట్ అవుతుంది... ‘మోదీకి పోటీ ఎవరు అని ఈరోజు బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. 2004లో కూడా వాజ్‌పేయికి పోటీ ఎవరు అంటూ అతి విశ్వాసం ప్రదర్శించారు. ఫలితం ఏమైందో మనందరికీ తెలిసిందే. 2019లో అదే పునరావృతం అవుతుంది ’అని సీతారాం వ్యాఖ్యానించారు. కాగా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని అడగగా...‘ స్టాలిన్ అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. కానీ మేము ఆయనతో ఏకీభవించలేం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని ఖరారు చేయాలనేది మా అభిమతం’ అని సీతారం పేర్కొన్నారు. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో, సీపీఎం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. -
కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తాం - సీతారాం ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకే సీపీఎం కృషి చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సాధారణ ఎన్నికల తర్వాతే పొత్తుల అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్‌లో గురువారం ఏర్పాటు చేసిన రాజకీయ చర్చలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో లేరని, అందుకే రామ మందిర రాజకీయాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు. రామ మందిరం, శబరిమల అంశాలను వివాదాస్పదం చేయడం ద్వారా హిందుత్వ ఓటింగ్‌ను సంఘటితం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రామ మందిర రాజకీయాలు దక్షిణ భారతంలో చెల్లవన్నారు. హిందుత్వ విషయంలో కాంగ్రెస్ కూడా రాజీ పడి సెక్యులరిజానికి తూట్లు పొడుస్తోందని, అందువల్లే దేశంలో సెక్యులరిజంపై నమ్మకం సడలుతోందని పేర్కొన్నారు. -
ప్రచారానికి లెఫ్ట్ అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు వస్తున్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ కూటమి పక్షాన ప్రచార కార్యక్రమాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు పాల్గొంటారు. ఈ నెల 29న మహబూబ్‌నగర్, 30న జుక్కల్, చెన్నూరు ఎన్నికల ప్రచారసభల్లో డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగిస్తారు. డిసెంబర్ 3న మహబూబాబాద్, ఖమ్మం, 4న మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఏచూరి ప్రచారం చేస్తా రు. డిసెంబర్ 1న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, 2న కోదాడ, హుజూర్నగర్, 3న జనగామ నియోజకవర్గ ప్రచారంలో మాణిక్ సర్కార్ పాల్గొంటారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 30న భద్రాచలం, 1న ఖమ్మం జిల్లా, 2న గద్వాల, 3న నిజామాబాద్‌లో రెండో విడత ప్రచారాన్ని నిర్వహిస్తారు. మహిళానేత బృందాకారత్ కూడా రెండో విడత ప్రచారం చేస్తారు. మూడు చోట్ల సీపీఐ ప్రచారం.. కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మూడు సీట్లలో పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ జాతీయ ›ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో 3 నియోజకవర్గాల పరిధిలో సురవరం ప్రచారం చేస్తారు. ఈ నెల చివరి వారంలో పార్టీ పోటీ చేస్తున్న చోట్ల నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. -
టీఆర్ఎస్ ఓటమే లక్ష్యం సీతారాం ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించేలా సీపీఎం ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించి లౌకిక ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసేలా పనిచేస్తామని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు విపక్ష పార్టీలకు సహకరిస్తామని చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)తో కలసివచ్చే వారితో పనిచేస్తామన్నారు. కొన్ని స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులను ప్రకటించామని, త్వరలోనే మరికొన్ని స్థానాలకూ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
మహాకూటమిపై ఏచూరి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎన్నికలకు ముందు మహా ఘట్బంధన్ (మహా కూటమి) సాధ్యం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగిందని సోమవారం ఆయన మీడియాతో వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ‘మా స్థానాల్లో మేము పోటీ చేస్తాం, మిగిలిన స్థానాల్లో బీజేపీ ఓటమికి పని చేస్తాం’ అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామనీ, కాంగ్రెస్‌తో జతకట్టేది లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.(మహాకూటమిపై ‘మాయ’ మబ్బులు) రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలో కొన్ని సీట్లలో పోటీ చేస్తామనీ, మిగిలిన చోట్ల బీజేపీని ఓడించే పార్టీలకు ఓటేయాలని ప్రజలని కోరతామని సీతారం అన్నారు. మహాకూటమి సఫలం కానిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశం మున్ముందు చెప్తామని పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. బహుజన అజెండా మా లక్ష్యమని ఆయన వెల్లడించారు. ‘సీపీఎం, సీపీఐ అజెండా వేరు. అందుకే మేము రెండు పార్టీ లుగా ఉన్నాం’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు. చట్టం తీసుకురండి.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్వాగతం పలుకుతూ.. కేరళలో ధర్నాలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం తేవాలని అన్నారు. -
మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: సీతారాం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం.. వారి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందన్నారు. రైతులు రుణ భారంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి దేశంలో ఇంతటి వ్యవసాయ సంక్షోభాన్ని ఇప్పటి వరకు చూడలేదన్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన కిసాన్ క్రాంతి ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీలో దాదాపు 20వేల మంది రైతులు హరిద్వార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలుపడానికి సిద్ధం కాగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్ కెనాన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. చదవండి: రైతులపై పోలీసుల ఉక్కుపాదం -
జైట్లీని కలిశాకే.. భారత్ వీడాను
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. భారత్ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని ఆయన బుధవారం లండన్‌లో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. మాల్యా వ్యాఖ్యలను జైట్లీ తోసిపుచ్చారు. అసలు తనని కలిసేందుకు మాల్యాకు ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. మాల్యా భారత్ వదిలి వెళ్లేలా ఎప్పుడు, ఎలా అనుమతి ఇచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జైట్లీని కలిశానని మాల్యా చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌కు గురిచేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణను లండన్ కోర్టు ముగించింది. తీర్పును డిసెంబర్ 10న ప్రకటించనుంది. బలిపశువును చేశారు.. రూ. 9 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాల ఎగవేత, మోసం, మనీ లాండరింగ్ తదితర కేసుల్లో నిందితుడైన మాల్యాను తిరిగి అప్పగించాలని భారత్ వేసిన పిటిషన్ విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతోంది. బుధవారం విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన మాల్యా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత్ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్లు చెప్పారు. భారత్ విడిచి వెళ్లాలని ముందస్తుగా ఏమైనా సమాచారం వచ్చిందా? అని పాత్రికేయులు ప్రశ్నించగా..‘జెనీవాలో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున భారత్ వదిలి వచ్చాను. అంతకుముందు, ఆర్థిక మంత్రిని కలిసి బ్యాంకు రుణాలు చెల్లించేందుకు సిద్ధమని చెప్పాను. రాజకీయ పార్టీలు నన్ను బలిపశువును చేశాయి. రుణాల చెల్లింపు కోసం కర్ణాటక హైకోర్టుకు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాను. రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను కోర్టు ముందుంచాను’ అని బదులిచ్చారు. రుణాల చెల్లింపులో బ్యాంకులే సహకరించడం లేదని ఆరోపించారు. భారత్ పంపిన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు వీడియో ‘చాలా బాగుంది’ అని సిగరెట్ తాగుతూ ఎగతాళి చేశారు. ఆ సాక్ష్యాలు నిరాధారం: భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదిస్తూ.. మొదటి నుంచీ రుణాలు చెల్లించకూడదనే ఉద్దేశంతో మాల్యా ఉన్నారని, అందుకే తన కంపెనీ కింగ్‌ఫిషర్ ఆర్థిక ఫలితాలను ఏమార్చారని ఆరోపించింది. భారత్ సమర్పించిన సాక్ష్యాలు నిరాధారమని మాల్యా తరఫు లాయర్ కొట్టిపారేశారు. బ్యాంకులతోనే మాట్లాడుకోమన్నా: జైట్లీ మాల్యా వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని జైట్లీ కొట్టిపారేశారు. 2014 నుంచి మాల్యాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆయన తనని కలిసేందుకు అవకాశమే లేదని పేర్కొన్నారు. ‘ రాజ్యసభ సభ్యుడి హోదాలో ఓసారి మాల్యా పార్లమెంట్ ప్రాంగణంలో నా వెంట నడుస్తూ బ్యాంకు రుణాలు చెల్లించేందుకు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన నకిలీ ఆఫర్ల గురించి ముందే విన్నా కాబట్టి, ఇక ఆయనతో సంభాషణను కొనసాగించడం ఇష్టం లేక ఆ విషయాన్ని బ్యాంకులతోనే మాట్లాడుకోవాలని సూచించా’ అని జైట్లీ వివరణ ఇచ్చారు. మాల్యా, జైట్లీ ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెనక్కి తగ్గిన మాల్యా: జైట్లీ తన వ్యాఖ్యలను ఖండించిన తరువాత మాల్యా వెనక్కితగ్గారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. తాను జైట్లీతో అధికారికంగా సమావేశం కాలేదని, యాదృచ్ఛికంగా కలిశానని చెప్పారు. ‘భార త్లో మీడియా ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదు. లంచ్ విరామంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు నేను దేశం విడిచి రావడానికి దారితీసిన పరిస్థితులేంటో వివరించాను. లండన్ వెళ్తున్నానని మాత్రమే జైట్లీ తో చెప్పాను. అంతేకానీ ఆయనతో అధికారికంగా సమావేశం కాలేదు’ అని అన్నారు. -
జర్నలిస్టుల సమస్యలపై వేగంగా స్పందించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణిస్తున్న జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ఆరోగ్య, నివాస భద్రత కల్పించాలని టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెం టు స్ట్రీట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నాలుగేళ్లలో అసహజ కారణాలతో మరణించిన 220 మంది జర్నలిస్టులపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు వేగంగా స్పందించాలని ఏచూరి సూచించారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న జర్నలిస్టుల అసహజ మరణాలు దేశంలో ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో లేవన్నారు. జర్నలిజం కత్తిమీద సాములాంటిదని, వారి సమస్యలను కారుణ్య దృష్టితో చూడరాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. పని ఒత్తిడితో అనారోగ్యం బారిన పడి, ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు పనిచేయక, సరైన వైద్యం అందకపోవడంతో 220 మంది జర్నలిస్టులు చనిపోయారని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తేయడం వల్ల ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. జర్నలిస్టుల వైద్య సదుపాయాలపై ప్రభు త్వ ప్రకటనలు బూటకంగా కనిపిస్తున్నాయని ఐజేయూ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాకు సీపీఐ జాతీయ నేత డి.రాజా సంఘీభావం తెలిపారు. ధర్నాలో ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ఐఎఫ్‌జే ఉపాధ్యక్షురాలు సబీనా ఇంద్రజిత్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి అలీ, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు పి.ఆంజనేయులు, తెలంగాణలోని 31 జిల్లాల యూనియన్ అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. వాస్తవాలపై దృష్టి సారించాలి: ఉపరాష్ట్రపతి మీడియా సంచలనాలపై కాకుండా వాస్తవాలున్న వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ధర్నా అనంతరం ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలు ఉపరాష్ట్రపతిని కలసి జర్నలిస్టుల సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర సమాచార మంత్రిని పిలిపించి చర్చిస్తానని ఆయన హామీనిచ్చా రు. జర్నలిస్టుల సంక్షేమంపై యాజమాన్యాలూ దృష్టి సారించాలని, అప్పుడే వారు నిజాయితీగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వాలే కాకుండా మీడియా కూడా గ్రామాలు, వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఉపరాష్ట్రపతిని కలసినవారిలో ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, సబీనా ఇంద్రజిత్, నారాయణరెడ్డి, ఎంఎ మజీద్, కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
220 మంది మృతి.. జర్నలిస్ట్‌లను కాపాడండి..!
సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
ఆరెస్సెస్ వేదికపై రాహుల్!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్ భారత్: ఆరెస్సెస్ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్ అభిప్రాయాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ అయిన ముస్లిం బ్రదర్ హుడ్‌తో ఆరెస్సెస్‌ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ‘వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు’ అని సంఘ్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రాహుల్‌కు భారత్ గురించి తెలియదు గతవారం లండన్ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌పై రాహుల్ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై అరుణ్ కుమార్ మండిపడ్డారు. ‘భారత్ గురించి అర్థం చేసుకోనన్ని రోజులు ఆరెస్సెస్ గురించి రాహుల్‌కు అర్థం కాదు. భారత్, భారత సంస్కృతి, వసుధైక కుటుంబకం అన్న గొప్ప ఆలోచన గురించి రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదు. ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా యావత్ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విషయం రాహుల్‌కు అర్థం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులేంటో ఆయనకు తెలియదు’ అని విమర్శించారు. -
సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్ర
హైదరాబాద్: తెలంగాణలో బహుజన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఏర్పడకుంటే అది నినాదంగానే మిగులుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దేశభక్తి పేరుతో దళితులు, మైనార్టీ లు, రాజ్యాంగ సంస్థల మీద దాడులు చేసి ఆ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ వాళ్లను నింపి దేశచరిత్ర, ప్రజాస్వామ్య పునాదులను పెకిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత– బహుజన ప్రభుత్వం ఓటర్ పాత్ర అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే వెనుకబాటుతనం పోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓటుపడేలా ఈవీఎంల తయారీలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వేలాది ఎకరాలు ఆక్రమణ: తమ్మినేని ఎర్ర జెండాల ఐక్యతకు బీఎల్ఎఫ్ కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. హైదరాబాద్‌లో వేలాది ఎకరాల భూములు ఆక్ర మణకు గురయ్యాయని విమర్శించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో ఆప్ భారీ ర్యాలీ
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడం లక్ష్యంగా ఆప్ ఈ ర్యాలీని తలపెట్టినప్పటికీ, పోలీసులు అడ్డుకోవడంతో మోదీ ఇంటికి చాలా దూరంలోనే ర్యాలీ ఆగిపోయింది. ఢిల్లీలోని మండీహౌస్ ప్రాంతం నుంచి ఆప్ ఈ ర్యాలీని ప్రారంభించగా, అక్కడకు ఎక్కువ మంది కార్యకర్తలు రాకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీకి అనుమతించేది లేదని ప్రకటించిన పోలీసులు.. మండీహౌస్‌కు దగ్గర్లోని ఐదు ఢిల్లీ మెట్రోరైల్ స్టేషన్లను మధ్యాహ్నమే మూసివేశారు. ఆ ప్రాంతానికి చేరుకునే బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లు ర్యాలీని అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ 45 వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న ఈ ర్యాలీ సాయంత్రం 4.45 గంటలకు మండీహౌస్ వద్ద ప్రారంభమై ఆరు గంటల సమయంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్దనే ఆగిపోయింది. ర్యాలీ సమయంలో ఏచూరి మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇందుకు నిరసనగానే ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం’ అని చెప్పారు. మేం సమ్మె చేయడం లేదు: అధికారులు ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు కలసి ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తమకు భద్రత లేని సమావేశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారులపై కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. అధికారులంతా తమ కుటుంబంలో భాగమేనన్న ఆయన.. మంత్రులతో సమావేశాల్లో పాల్గొనే సమయంలో వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీనిచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని బాయ్‌కాట్ చేయడం మానేసి పనుల్లో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు. నా స్థానంలో ఎలా వెళ్తారు.. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశానికి తన స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెళ్లేందుకు తాను అనుమతినివ్వలేదని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌కు బదులుగా బైజల్ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారని వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి స్థానంలో ఎల్జీ భేటీకి వెళ్లారు?’ అని ప్రశ్నించారు. అయితే బైజల్ సమావేశానికి రానేలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. -
మార్క్సిజం ప్రాముఖ్యత మరింత పెరిగింది
ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్క్సిజం, కమ్యూనిజం అదృశ్యమౌతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో ఈమధ్య కారల్‌మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చాలాచోట్ల ఆయన స్మృతికి నివా ళులర్పించడంతోపాటు మార్క్సిజాన్ని భిన్న కోణాల్లో చర్చించారు. గోష్టులు నిర్వహించారు. మార్క్స్ జన్మించిన జర్మనీలోని ట్రియర్ పట్ట ణంలో ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైనా బహుకరించిన ఈ విగ్ర హాన్ని ఆయన అప్పట్లో నివసించిన ఇంటికి సమీపంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగానే చైనాలోని బీజింగ్, షెన్జెన్ నగరాల్లో గత నెల 27 నుంచి 30 వరకూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 21వ శతాబ్దంలో కారల్‌మార్క్స్ ప్రాముఖ్యత గురించి, ప్రపంచంలో సామ్యవాదం భవితవ్యం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుల్లో 70 దేశాలకు చెందిన 75 కమ్యూనిస్టు పార్టీల నుంచి 112 మంది నేతలు పాల్గొన్నారు. మన దేశం నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా సదస్సులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి చైనా నగరాల్లో జరిగిన సదస్సులు, వాటిలో జరిగిన చర్చల గురించి సాక్షి ప్రతినిధి జీకేఎం రావుకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చ డానికి భౌతిక శక్తులను శ్రామికవర్గం నేతృత్వంలో బలోపేతం చేయడం కోసం ప్రజా పోరాటాలను నిర్మించడమే మార్గమని ఏచూరి అంటున్నారు. ఇలాంటి పోరాటాలకు మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుందని చెబుతున్నారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు: కారల్ మార్క్స్, కమ్యూనిజంపై వర్క్‌షాప్‌లు ఎలా జరిగాయి? చైనా సోషలిజానికి తిలోదకాలు ఇస్తూ, పెట్టుబడిదారీ పంథాలో పయనిస్తోందని ప్రపంచ దేశాలు భావిస్తున్న కారణంగా చైనాలో ఇలాంటి సమావేశాలు జరగడం మార్క్సిజానికి గొప్ప విజయం. తమపై ప్రపంచ ప్రజానీకంలో ఉన్న అపోహలనూ, అనుమానాలనూ నివృత్తి చేయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమావేశాలు నిర్వహించింది. ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా చైనా అవతరించింది. సామ్యవాద పంథాలో పయ నిస్తూనే ఇది ఎలా సాధ్యమైంది? నేడు మార్క్సిజం అవసరం ఉందనడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేసిన ప్రారంభ ఉపన్యాసం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించింది. మార్క్సిజానికి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సామ్యవాద పంథాలో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగటం సాధ్యమేనని చైనాను చూస్తే అర్ధమవుతుంది. చైనాలో అవినీతి, అసమానతలపై ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రెండు అంశాలపై చైనా నిజంగా కలవరపడుతోంది. అవినీతి విస్తరించింది. ప్రభుత్వం అవినీతిని రూపుమాపడానికి కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అవినీతికి పాల్పడే వేలాది మంది అధికారులకు ప్రతి వారం ఉద్వాసన పలుకుతున్నారు. చైనాలో నగరాలు, పట్టణాలు పెరిగిపోవడంతో అసమానతలు అధికమౌతున్నాయి. ఈ సమస్య పరిష్కా రానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పట్టణాల్లోని ప్రజలు, ఫ్యాక్టరీలను గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల సముదాయాల్లో వైద్య సౌకర్యాలు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగరాలపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. మార్క్సిజంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు? ప్రారంభ, ముగింపు సమావేశాలతోపాటు మూడు అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించారు. కారల్‌మార్క్స్ చారిత్రక ప్రాధాన్యం–నేటి పరిస్థితుల్లో మార్క్సిజం ప్రయోజనం, 21వ శతాబ్దంలో కొత్త పరిస్థితులకు అనుగుణంగా చైనా తరహా సోష లిజంపై షీ జిన్‌పింగ్ ఆలోచనా విధానం ప్రభావం, చైనాకు అనుసరణీయమైన సోష లిజం సిద్ధాంతాలు, ఆచరణ–ప్రపంచ సామ్యవాదం భవితవ్యంపై మూడు సదస్సులు జరిగాయి. ప్రపంచంలో సోషల్ డెమొక్రాట్లు, లిబరల్ డెమొక్రాట్లకు ఆదరణ పెరగడంతోపాటు, కొన్ని దేశాల్లో మార్పును వ్యతిరేకించే మితవాదులు బలపడుతున్న నేపథ్యంలో–మార్క్సిజం భవితవ్యం ఏమిటనే విషయం చర్చించారా? విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితంగా నేడు మార్క్సిజం విలువను, ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీకి అంతముండదని, సంక్షోభం ముగియదని గుర్తించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందువల్లే పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడం మార్క్సిజాన్ని అనుసరించే పార్టీల వల్లనే సాధ్యమని తెలుసుకుంటున్నారు. ‘‘తత్వవేత్తలు ప్రపంచం తీరు గురించి అనేక పద్ధతుల్లో కేవలం భాష్యం చెప్పారు. కాని, ప్రపం చాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ అని కారల్ మార్క్స్ చెప్పారు. ఎలా మార్చాలి? అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దోపిడీని అంతం చేసి, మానవుల విముక్తి సాధించడానికి మార్క్సిజం ఒక్కటే మార్గాన్ని అందిస్తుంది. దోపిడీకి గురవుతున్న ప్రజలను ఆకట్టుకుంటున్న సిద్ధాంతం ఇదొక్కటే. మార్క్సిజం మార్పులేని సిద్ధాంతం కాదు. ఇదొక సృజనశీల శాస్త్రమని విప్లవ నేత లెనిన్ ఎన్నడో బోధించారు. చరిత్ర విశ్లేషణకు, మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానం పరిశీలనకు మార్క్సిజమే మంచి మార్గం. మార్క్సిస్టు సిద్ధాంతాలు, మార్క్స్ చూపించిన మార్గాల ప్రాతిపదికగా మేము మా సైద్ధాంతిక అవగాహనను బలోపేతం చేసుకుంటు న్నాము. ప్రస్తుత పరిస్థితులు, సంక్షోభాల నేగాక భవిష్యత్తులో కమ్యూనిస్టులకు గల అవ కాశాలను మార్క్సిజం వెలుగులో అర్థంచేసుకుంటున్నాం. ప్రపంచ నేతగా అవతరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రసంగంలో మీకు నచ్చిన అంశమేంటి? మార్క్సిజం కాలం చెల్లిన సిద్ధాంతం కాదని, ఇది ఎప్పటికీ విలువైనదేననే వాదనకు అభివృద్ధి పథంలో అగ్రగామిగా సాగుతున్న చైనా తిరుగులేని సాక్ష్యమని జిన్‌పింగ్ చెప్పారు. ‘ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ తూర్పు ప్రపంచంలో జబ్బు మనిషిగా ముద్రపడిన దేశం నేడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిరూపించుకుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కొత్త శకానికి కావాల్సింది చైనా తరహా లక్షణాలున్న సామ్య వాదమే అని జిన్‌పింగ్ నమ్ముతున్నారు. ఈ సదస్సులో మీరేం మాట్లాడారు? సమస్య ఎంత తీవ్రమైనదైనా పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతటదే కూలిపోదు. కేపిట లిజాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యామ్నాయం రూపుదిద్దుకునే వరకూ ఇది మానవుల దోపిడీని కొనసాగిస్తూ తన ఉనికిని కొనసాగిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదో యడానికి మేం సమాజంలోని భౌతిక శక్తులను శ్రామిక వర్గం నేతృత్వంలో బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రజా పోరాటాల ద్వారానే ఇది సాధ్యమౌతుంది. ఇలాంటి పోరా టానికి మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుంది. -
మోదీ, మమతపై నిప్పులు చెరిగిన ఏచూరి
కోల్‌కతా: 2019 లోక్‌సభ ఎన్నికల తరువాతే కూటమిపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఏచూరి పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఆ ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో.. రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని సీపీఎం జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని ఏచూరి తెలిపారు. ఎన్నికల తర్వాతనే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మేం కుడా ఎన్నికల అనంతరమే ఫెడరల్ ఫ్రెంట్‌పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలకు యూపీలోని ఎస్పీ-బీఎస్పీ కూటమి మంచి ఉదాహరణగా గుర్తుచేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏచూరి విమర్శలు గుప్పించారు. బెంగాల్లో మమత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం మమతకు, ప్రధాని నరేంద్ర మోదీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయని, వారిద్దరూ మతతత్వ ఘర్షణలను ప్రోత్సహించేవారేనన్నారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో, మమత హటావో.. బెంగాల్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన మమత, ఏచూరి ఒకే వేదికను పంచుకున్న మరునాడే ఏచూరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విరబూసిన ఎర్రమందారాలు
-
లాల్–నీల్ పోరు
సాక్షి, హైదరాబాద్ : ఎర్ర జెండా, సామాజిక జెండా కలవాల్సిన అవసరం ఉందని, జై భీమ్–లాల్ సలామ్ కలిసినప్పుడే దేశంలో మార్పు వస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లాల్–నీల్ జెండా నీడన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని అందిస్తామని ప్రకటించారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదురోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక దోపిడీ పెరిగిపోతోందని, ఏదో చేసేస్తానని డాబు కొట్టి ప్రధాని అయిన నరేంద్రమోదీ దేశ ప్రజల జీవితాలను భారం చేశారని విమర్శించారు. దేశంలో ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇప్పిస్తానన్న మోదీ.. ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదన్నారు. ‘‘ఈ దేశంలో రుణమాఫీ జరిగింది. కానీ రైతులకు కాదు. బడా పెట్టుబడిదారులకు మాత్రమే. గత మూడేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును రుణంగా తీసుకుని లూటీ చేస్తున్న దుస్థితి దేశంలో నెలకొంది. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ.. ఇలా అందరు మోదీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు. బ్యాంకుల లూటీ జరిగేంతవరకు దేశంలో ఇంతమంది మోదీలున్నారన్న సంగతి ప్రజలకు తెలియదు’’ అని ఏచూరి వ్యాఖ్యానించారు. దేశంలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయని, నవ భారత నిర్మాతలైన యువకులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి తీరుతామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కౌరవ సేనను ఓడిస్తాం దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మతంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ అన్నదమ్ముల్లా ఉన్న హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారు. మతం పేరుతో అత్యాచారాలు చేసి బాధితుల పక్షాన నిలవకుండా దౌర్జన్యకారులకు వత్తాసు పలుకుతున్న దుస్థితి ఎన్నడూ లేదు. రామాయణం కథ చెప్పి రాముడి పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ మహాభారతాన్ని విస్మరించింది. మహాభారతంలో కౌరవుల్లాంటి వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ఆ 100 మంది కౌరవుల్లో మోదీ, అమిత్‌షాలు దుర్యోధన, దుశ్శాసన లాంటివారు. ఆ కౌరవులకు భీష్ముడిలా, ద్రోణాచార్యుడిలా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోంది. ఈ కౌరవసేనను ఓడించే పాండవులుగా మేం పనిచేస్తాం. మతోన్మాద శక్తులను మట్టికరిపించి దేశంలో సామరస్యాన్ని కాపాడతాం’’ అని చెప్పారు. వారిది కౌరవ సైన్యమయితే తమది ప్రజాసైన్యమని అన్నారు. కేసీఆర్ ఫ్రంట్‌తో లాభమేంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్‌పై ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్ తనతో మాట్లాడారని, అయితే ఫ్రంట్‌లో చేరి ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘‘వ్యక్తులు, పార్టీలను చూసి ఫ్రంట్‌లో చేరేందుకు సీపీఎం సిద్ధంగా ఉండదు. ఫ్రంట్ విధానాల ఆధారంగానే మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే ఎత్తుగడలపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి మగ్ధూం మొయినుద్దీన్ చెప్పినట్టు భాగ్యాన్ని తీసుకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందరినీ కలుపుకుని విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలో ప్రజా ఉద్యమాలను బలపర్చడం ద్వారా భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పూర్వ వైభవం తథ్యం సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వ వైభవం రావడం తథ్యమని ఏచూరి« ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలను చూస్తుంటే తనకు ఆ నమ్మకం కలుగుతోందని, ఈ ఊపు కొనసాగించాలని, ఈ గడ్డపై ఎర్రజెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ప్రకాశ్ కారత్, బృందా కారత్, రామచంద్రన్ పిళ్లై, బిమన్‌బోస్, కేరళ సీఎం పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, మల్లు స్వరాజ్యం, పి.మధు, ఎస్.వీరయ్య, జి.నాగయ్య, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి, నంధ్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, పాటూరి రామయ్య, పోతినేని సుదర్శన్, జ్యోతి, డి.జి.నర్సింగరావు, బి.వెంకట్, నున్నా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రామిక కార్మిక పాలన తీసుకురావడమే లక్ష్యం
-
మళ్లీ ఏచూరినే...
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరో దఫా ఎన్నికయ్యారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరి రోజు(ఆదివారం) జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు 92 సభ్యులున్న కేంద్ర కమిటీ సంఖ్యను 95కు పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తమ్మినేని, వీరయ్యలు కొనసాగుతుండగా.. ఇప్పుడు నాగయ్య(తెలంగాణ)కు చోటు దక్కింది. ఇక భేటీ అనంతరం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. సమావేశ వివరాలను వివరించిన ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు.. సీపీఎంలో నెలకొన్న విభేదాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే తామంతా ఏకతాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన హైదరాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో ఆఖరి రోజైన నేడు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నేటి సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుండగా.. కాసేపట్లో మలక్‌పేట్ నుంచి సభ వేదిక వరకు రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు కొనసాగనుంది. -
సీపీఎం మహాసభల్లో అభిప్రాయ బేధాలు
-
సీపీఎం మహాసభల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్(సీపీఎం) జాతీయ మహాసభల(22వ) రెండో రోజు రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం ముఖ్యనేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేర్చింది. ఒకానోక దశలో సభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడంతో.. వర్గ పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. (చారిత్రక తప్పిదమా?) ఒంటరిగా పోరాటం చేస్తూనే ప్రగతిశీల శక్తులను ఐక్యం చేసి బీజేపీని దెబ్బ కొట్టాలని సీనియర్ నేత ప్రకాశ్ కారత్ తన వాదన తెరపైకి తెస్తే.. బలోపేతమైన బీజేపీని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సిందేనని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. గతంలో కేంద్ర కమిటీలో ఏచూరి తీర్మానం వీగిపోగా.. అన్యమనస్కంగానే ఆయన ఇప్పుడు మహాసభల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో నేడు జరగబోయే కీలక భేటీలో తన నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ప్రతిపాదనకే మెజారిటీ సభ్యులు మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మహాసభల్లో రెండు రకాల రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టడం పార్టీ చరిత్రలో లేదని.. ఇది పార్టీ ప్రతిష్టకు మంచిది కాదని కొందరు సీనియర్ నేతలు వారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటింగ్ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క జాతీయ కార్యదర్శిగా మళ్లీ సీతారామే ఎన్నికవుతారన్న చర్చ మొదలవుతుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొనసాగింపు కష్టమేనన్న మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళ, మణిపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని.. లేకపోతే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని సీతారాం ఏచూరి వాదిస్తున్నారు. ఏదిఏమైనా నేటి కీలక భేటీలో తీసుకోబోయే నిర్ణయం ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! -
‘దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారు’
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగి పోతుందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలలో పాల్గొన్న సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదన్నారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెడుతూ.. దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అన్నారు. మతోన్మాద శక్తులను అరికట్టి, వాటిని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాలు తెచ్చే సత్తా వామపక్ష పార్టీలకు ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు 22వ జాతీయ మహాసభలు దిశా నిర్దేశం చేస్తాయని సీతారాం ఏచూరి వివరించారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్ట్‌లు సహా సామాన్యులు హత్యకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నేడు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీలు.. రాజ్‌భవన్‌లని అధికార కేంద్రాలుగా వాడుకుంటుందని, గోవా, మణిపూర్లలో ఇదే నిరూపన అయిందన్నారు. ప్రస్తుత సమయంలో వామపక్ష పార్టీల ఐక్యత ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభం కాగా.. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకోనున్నారు. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
ఏచూరీయే.. లేదంటే చీలికే?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీతారాం అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరో వర్గం.. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశాల చివరిరోజైన ఏప్రిల్ 22న కొత్త ప్రధాన కార్యదర్శి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఏచూరీ వర్సెస్ కారత్ : పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకుని ఈఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రకాశ్ కారత్ వరకు అందరూ కనీసం మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే సంప్రదాయం ప్రకారం.. సీతారాం ఏచూరీయే మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. కానీ పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ గ్రూపుల్లో స్పష్టమైన విభేదాలు పొడసూపాయి. దీనికి తోడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. ఎన్నికలు అనివార్యమేనా..! ప్రకాశ్ కారత్కు కేరళ సీఎం పినరయి విజయన్ నుంచి బలమైన మద్దతుంది. దీనికితోడు పలు రాష్ట్రాల కామ్రెడ్లూ కారత్ వెంటే ఉన్నామంటున్నారు. 16 మంది సభ్యులున్న పొలిట్ బ్యూరో, 85 మంది సభ్యులున్న సెంట్రల్ కమిటీల్లో కారత్‌కే బలమైన మద్దతుంది. అయితే, ఏచూరీకి బలమైన మద్దతు లేదు. దీనికి తోడు, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసిపనిచేయటమే మంచిదని మొదట్నుంచీ ఈయన చెబుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కారత్, ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ కామ్రెడ్లు మాత్రం ఏచూరీ ఆలోచన నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉందని.. కారత్ వ్యూహం స్టాలిన్ కాలం నాటి ఆలోచన అని అంటున్నారు. 21నాటి సమావేశంలో పార్టీ సెంట్రల్ కమిటీయే కొత్త ప్రధాన కార్యదర్శిపై నిర్ణయం తీసుకోనుంది. ఏచూరీ కాకుండా మరెవరైనా ఆసక్తి కనబరిస్తే.. ఎన్నికలు అనివార్యమే. ఏచూరీయే.. లేదంటే చీలికే? మరోవైపు ఏచూరీ, కారత్‌ల వ్యతిరేక వర్గం త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను తెరపైకి తెచ్చేందుకు యోచిస్తోంది. అటు మహిళలకు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అదే జరిగితే.. ప్రకాశ్ కారత్ భార్య బృందా కారత్ ఒక్కరే పోటీదారు. పలువురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవికోసం తెరపైకి వస్తున్నప్పటికీ.. ఏచూరీకి మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీలో భారీ చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. -
‘వారు కన్నెర్ర చేస్తే సర్కార్లు కూలుతాయ్’
సాక్షి, ముంబయి : రైతుల న్యాయమైన డిమాండ్లను నిరాకరిస్తే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను వారు కూల్చివేస్తారని పాలక బీజేపీని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. కిసాన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఏచూరి మీడియాతో మాట్లాడుతూ రైతులు భారత్‌కు ఆధునిక సైనికులని అభివర్ణించారు. సైనికులు సరిహద్దులను కాపాడితే,..రైతులు ఆహారంతో ప్రజలను రక్షిస్తున్నారని కొనియాడారు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చని పార్టీలు మనుగడ కోల్పోతాయని అన్నారు. గత ఏడాది దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర రైతుల సమ్మెతో ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. మాఫీని ప్రకటించి పది నెలలు గడిచినా అది అమలుకు నోచుకోలేదన్నారు. 88 సంవత్సరాల కిందట ఇదే రోజున మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహంతో బ్రిటిష్ పాలకులను వణికించారని చెప్పారు. రైతుల డిమాండ్లను పట్టించుకోకుంటే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను వారు కుప్పకూల్చుతారని ఏచూరి హెచ్చరించారు. కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఓటమిపై స్పందించిన సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి వామపక్షేతర శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చిందని.. ఈ క్రమంలోనే అది విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘డబ్బును భారీ స్థాయిలో పంచి బీజేపీ అనైతిక రాజకీయాలను ప్రదర్శించింది. సీపీఎం, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధించింది. అయినప్పటికీ వామపక్ష పార్టీ 45 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అందుకు త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో కూడా స్పందించారు. త్రిపుర ఓటర్లు బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, 25 ఏళ్లుగా తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రశ్నించటం మాత్రం తాము ఆపబోమని.. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. Tripura voters have given their mandate for a BJP-IPTF government in the state. We thank the people of Tripura for giving us the opportunity to serve them for the past 25 years. We will continue to oppose BJP and its divisive agenda not only in Tripura but all over India. (1/n) — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 The Polit Bureau thanks the 45 per cent of the voters who extended support to the CPI(M) and the Left Front. The Party will carefully examine the reasons for this electoral setback and take necessary remedial measures. Full text: https://t.co/wjdhdqGrpU pic.twitter.com/BlDjCj81QS — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 -
సీతా.. ఎంత మారిపోయావ్‌రా!
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టు సుదీర్ఘ కాలం తర్వాత తనయుడిని చూసిన ఆ తల్లి సంబరపడిపోయింది. ‘సీతా.. ఎలా ఉన్నావ్రా?’ అంటూ ఆప్యాయంగా ముద్డాడింది. చిన్న పిల్లాడికి తినిపించినట్టు కంచంలో అన్నం తెచ్చి కొసరి తినిపించింది. ఎన్నో కబుర్లు చెప్పింది. ఏమిటిదంతా అనుకుంటున్నారా? భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ ఏపీ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కొద్ది విరామం దొరికింది. దీంతో ఆయన పార్టీ నేత బి.బలరాంకు మనసులో మాట చెప్పారు. ‘మా అమ్మను చూసి చాలాకాలం అయింది. ఒక్కసారి కాకినాడ వెళ్లి చూసొస్తా.. వాహనం ఏర్పాటు చేయగలరా?’ అని కోరారు. దానికాయన ‘మీరు వెళ్లటం ఎందుకు? అమ్మనే ఇక్కడకు (భీమవరం) తీసుకొద్దాం’ అని చెప్పగా ఏచూరి సున్నితంగా తిరస్కరించారు. తానే వెళ్లొస్తానని ఆదివారం కాకినాడ బయల్దేరారు. కాకినాడ కుళాయిచెరువు సమీపంలోని గాంధీపార్క్ వద్ద తన ఇంటికి వెళ్లే సమయానికి ఏచూరి మాతృమూర్తి కల్పకం పూజ చేస్తున్నారు. ఏచూరి రాక గురించి తెలియటంతో ఆమె వచ్చి.. ‘సీతా, ఎలా ఉన్నావ్ రా.. ఎంత మారిపోయావ్’ అంటూ కౌగిలించుకున్నారు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ‘ఎలా ఉన్నావమ్మా? మావయ్య వాళ్లు ఎలా ఉన్నారు?’ అంటూ ఏచూరి వాకబు చేశారు. భోజనం అనంతరం తిరిగి భీమవరం బయల్దేరారు. -
బ్రహ్మాండం బద్దలు కాలేదేం!
భీమవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రాన్ని విభజిస్తే తలెత్తే సమస్యలను ముందుగానే పసిగట్టాం. అందుకే సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నిలిచాం. నాలుగేళ్లక్రితం చంద్రబాబును అడిగా.. పదేళ్లు బీజేపీతో సావాసం చేశావు కదా, గుణపాఠం నేర్చుకోలేదా? మళ్లీ వాళ్లతోనే ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది, రాబోయే రోజుల్లో మేమిద్దరం కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం, బ్రహ్మాండం బద్దలు కొడతాం, చూస్తూ ఉండండి అన్నాడు. చివరకు ఏమైంది? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మొదటికే మోసం చేశారు. హోదా బదులు ప్యాకేజీ అన్నారు, చివరకు దాన్నీ లేకుండా చేశారు. ఇప్పుడేమో టీడీపీ వాళ్లు వచ్చి సీపీఎం సహకారం కావాలని అడుగుతున్నారు. మేము మద్దతిచ్చేది ప్రజలకోసమే తప్ప పార్టీలకోసం కాదు’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ప్రారంభమయ్యాయి. పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఏం సమాధానం చెబుతుంది?
-
ఏపీకి నిరాశే మిగిలింది: ఏచూరి
సాక్షి, నల్గొండ: కేంద్రం బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు నిరాశే మిగిలిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్లో ఆందోళన చేయడంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పందించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అయిదేళ్లు ప్యాకేజీ ఇస్తామంటే.. పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు పదేళ్లు అయితే బాగుంటుందని సూచించారని గుర్తు చేశారు. పదేళ్లపాటు ప్యాకేజీ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతున్న ఎన్డీఏలో ఉన్న టీడీపీ ప్రజలకు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టి టీడీపీ సాధించింది శూన్యమని విమర్శించారు. -
చంద్రబాబుకి స్వరం మార్చడం అలవాటే
-
దేశంమీద ఎందుకింత కోపం?
కొన్ని రోజులుగా వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు చైనాకు అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌కంటే చైనా గొప్ప దేశమని మన ఆర్థిక వ్యవస్థకంటే చైనా ఆర్థిక వ్యవస్థ గొప్పదని మాట్లాడుతూ ఈ దేశంలో ఉండే 125 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ఏదో కిందిస్థాయి నాయకులు మాట్లాడితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సీపీఎం చీఫ్ సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర కార్యదర్శి కె. బాలక్రిష్ణన్ చైనాను పొగడటం సగటు భారతీయులు జీర్ణించుకో లేకపోతున్నారు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, భారత్ కూటమి చైనాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెక్నాలజీ పరంగా అమెరికా సైతం ఇజ్రాయెల్‌పైన ఆధారపడుతుంది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనల ద్వారా ఇజ్రాయెల్ ముందుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇజ్రాయెల్ సహాయంతో కొత్త వంగడాలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్రప్రభుత్వం ఆలోచన... దేశీయంగా వ్యవసాయాభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలి. అమెరికా ఇన్నాళ్లు భారతదేశంలో బలహీన నాయకత్వాలను ఖాతరు చేయకుండా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్‌ని ప్రేరేపించి, వారికి ఆర్థికంగా సహకరించి పరోక్షంగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన దేశంగా మనకు తెలుసు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత అమెరికా భారత్ ఒక బలమైన దేశంగా భావించి మనతో చెలిమి చేస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంగా ప్రపంచానికి చెప్పి వారికి నిధులు సైతం రద్దు చేసి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాము. ఇది మోదీ దౌత్య విజయమే. ఈ సందర్భంలో పాకిస్తాన్ కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. అనేక దేశాలు అమెరికా చెలిమి కోసం సాగిలపడుతున్నాయి. కానీ అమెరికా భారత్ చెలిమి కోసం సాగిలపడుతుంది. వ్యూహాత్మకంగా అమెరికాతో సంబంధాలను భారత్ చేపడుతుంటే కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. చైనా భారతదేశంకంటే గొప్ప దేశమని భజన చేస్తున్న కమ్యూనిస్టు నాయకులు వాస్తవాలను గమనించాల్సి ఉంది. చైనా భారత్‌ను ఒకసారి యుద్ధంలో ఓడించి నేటికీ పాకిస్తాన్‌కు సహకరిస్తూ మనల్ని నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిత్యం పాకిస్తాన్‌ను రెచ్చ గొడుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్‌కు సహాయం చేస్తూనే ఉన్నది. అలాంటిది.. చైనాను మనం ఆదర్శంగా తీసుకోవాలని కమ్యూనిస్టులు నీతి సూత్రాలు వల్లిం చడం ఏ దేశభక్తి? చైనా దేశీయంగా బౌద్ధులపై కొనసాగి స్తున్న దాడులు, ముస్లింలను భయభ్రాంతులకు గురిచేయడం, కార్మికులతో 10 నుండి 12 గంటలు గొడ్డుచాకిరి చేయించటం, ప్రతిపక్ష పార్టీలను కాలరాయడం, అవినీతిని ప్రశ్నించిన సొంత పార్టీ నేతలమీద వివిధ కేసులు బనాయించి వేధించడం మనం ఆదర్శంగా తీసుకోవాలా? డోక్లాంలో భారత సైన్యాన్ని ప్రతిరోజూ కవ్విం చడం, అరుణాచల్ సరిహద్దుల్లో రోజూ మన సైన్యాన్ని రెచ్చగొట్టడం, బ్రహ్మపుత్రానది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించడం, మన సముద్ర జలాల గుండా సీపీఈసీ కారిడార్‌ను నిర్మించి మన దేశంపై దండయాత్ర ఆలోచనలను ఈ కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిం చడం లేదో ప్రజలకు తెలియాలి. చైనా తన నిధులతో శ్రీలంకలో పోర్టు నిర్మాణం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వెనుక భారత్‌పై దొంగచాటు దెబ్బతీయాలనే ఆలోచన లేదంటారా? మన చుట్టూ ఉన్న చిన్న దేశాలైన నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో వ్యాపారం పేరుతో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని మనల్ని దొంగదెబ్బ తీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకోవాలా? పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి స్వేచ్ఛ, పత్రికలు లేని, ప్రజాస్వామ్యంలేని నియంత పాలనను ఆదర్శంగా తీసుకోవాలా? పంచశీల ఒప్పందాల బంధాల్ని తెగదెంచిన చైనాను ఏ ప్రాతిపదికన ఆదర్శంగా తీసుకోవాలో కమ్యూనిస్టులే జవాబివ్వాలి. ఎన్.ఎస్.జి.లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఒక్కటే అడ్డు పడుతుంటే ఈ కమ్యూనిస్టుల నోళ్లు ఎందుకు పడిపోయాయి? చైనాతో భారత్ పోరాడుతున్న సందర్భంలో ఈ దేశంలోని వామపక్ష పార్టీలు చైనాకు వంత పలికాయి. ఈ ద్రోహాన్ని ఈ దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. నిజానికి కమ్యూనిస్టులకు ఈ దేశంపై గౌరవముంటే ఈ దేశ జాతీయ నాయకుల చిత్రపటాల్ని వారి కార్యాలయాల్లో ఎందుకు ఉంచరు? చేగువేరా, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్.. వీళ్లేనా వీళ్లకు హీరోలు? గాంధీజీ, పటేల్, నేతాజీ, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితరులెవ్వరూ కారా వీరికి ఆదర్శం? వారి కార్యాలయాలపై ఎందుకు జాతీయ జెండాను ఎగరే యరు? సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తూ దేశ ఔన్న త్యాన్ని కించపరచడం.. పరాయి దేశాలను, శత్రుదేశా లను కీర్తించడం భారత్‌లో కమ్యూనిస్టులకే సాధ్యం. దేశ వ్యతిరేక చర్యలు చేస్తే చైనా దేశస్తుడు ఆ దేశంలో ఉండ గలడా? అయినా గతి తప్పిన ఆలోచనలతో– భవిష్యత్తును చూడలేని కమ్యూనిస్టులు పంథా మార్చాలి. గుడ్డిగా విమర్శించడం మాని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. - ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ శిక్షణ విభాగం కన్వీనర్, ఏపీ ఈ–మెయిల్ : mjrinfravishnu@gmail.com -
బీఎల్ఎఫ్ దేశ రాజకీయాల్లో పెద్ద మలుపు
సాక్షి, హైదరాబాద్: బహుజన వామపక్ష వేదిక(బీఎల్ఎఫ్) ఆవిర్భావం దేశ రాజకీయాల్లో పెద్ద ముందడుగని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో సంక్షోభం తీవ్రంగా ఉన్న ఈ దశలో ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఉందని, వ్యక్తుల ఆధారంగా కాకుండా, విధానాల ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయాలు నడవాలని అభిప్రాయపడ్డారు. ఇపుడు దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం 28 రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలతో బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు ఏచూరి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రజా ఉద్యమం రావాలి.. సభలో ఏచూరి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక దోపిడీలు యథేచ్ఛగా సాగుతున్నాయని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తేవాలంటే ప్రజా ఉద్యమం జరగాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, గోరక్ష దళాలపై నిషేధం విధించమంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దేశంలో మోరల్ పోలీసింగ్ పెరిగిపోయిందని పేర్కొన్నారు. మనుస్మృతి ఆధారంగా పాలించాలని చూస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ఎన్నికల్లో హామీలు ఇచ్చి, ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం మినహా ఎలాంటి మార్పు లేదని అన్నారు. ప్రజా పోరాటాల ద్వారా బీఎల్ఎఫ్ను బలపరచాలని ఏచూరి పిలుపునిచ్చారు. 93 శాతంగా ఉన్న ప్రజలకే అధికారం దక్కాలి దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఉన్నారని, వీరి చేతుల్లోకి అధికారాన్ని తేవడమే బీఎల్ఎఫ్ ప్రత్యేక ఎజెండా అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 28 పార్టీలతో ఏర్పాటైన బీఎల్ఎఫ్ ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అన్న స్పష్టమైన అవగాహనతో ఉందని, ఎర్రజెండా–నీలి జెండా అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బీఎల్ఎఫ్ నిర్మాణం కొనసాగుతుందని, మే నెలలో నియోజకవర్గాల్లో జైత్రయాత్ర మొదలు పెడతామన్నారు. కాగా, 41 మందితో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. నల్లా సూర్యప్రకాశ్ చైర్మన్‌గా, నలుగురు వైస్ చైర్మన్లుగా, తమ్మినేని వీరభద్రం సహా ఏడుగురిని కన్వీనర్లుగా ఎంపిక చేశారు. సభలో టి–మాస్ చైర్మన్ కంచ ఐలయ్య, ఎంసీపీఐ జాతీయ కార్యదర్శి గౌస్, మల్లు స్వరాజ్యం, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కాదు: ప్రకాశ్ అంబేడ్కర్ దేశంలో బీజేపీ అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని, దేశానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారి అని ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ముస్లింలను అకారణంగా ద్వేషిస్తున్నారని, హిందువుల్లో స్లీపర్ సెల్స్ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇంకెంత మాత్రం లౌకికవాద పార్టీ కాదని, అది ఆర్ఎస్ఎస్కు బి టీమ్‌గా మారిపోయిందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని, అంతా ఒక్కటై రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. సీపీఐనీ చేర్చండి సురవరంను కోరిన సీతారాం ఏచూరి ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తో రాష్ట్రంలో ఏర్పడిన బీఎల్ఎఫ్లో సీపీఐని కూడా భాగస్వామి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సీతారాం ఏచూరి కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్‌తో కలసి హైదరాబాద్‌లో ఉంటున్న సురవరంను ఆయన నివాసంలో కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉభయులూ చర్చించారని సీపీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీపీఐ బీఎల్ఎఫ్లో చేరితే మరింత బలోపేతం అవుతుందని, దానికి తెలంగాణ సీపీఐ సమితి సానుకూలంగా నిర్ణయం తీసుకునేట్లు చొరవ తీసుకోవాలని సుధాకర్‌రెడ్డిని ఏచూరి కోరారు. -
సీపీఎం చేసింది మరో చారిత్రక తప్పిదమా?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆదివారం పార్టీ కేంద్ర కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ఆ స్థానంలో మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వర్గం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించడం సీపీఎం చేస్తున్న మరో చారిత్రక తప్పిదమా? పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి తన తీర్మానాన్ని నెగ్గించుకోకపోవడం సీతారాం ఏచూరి వైఫల్యమా? అందుకు ఆయన రాజీనామా చేస్తారా? పదవిలో కొనసాగుతూ మరో అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని తన పంథాన్ని భవిష్యత్తులోనైనా నెగ్గించుకుంటారా? వాస్తవానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, లేదా? అంశంలో తప్ప సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ ప్రవేశపెట్టిన తీర్మానాలకు పెద్ద తేడా లేదు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ లాంటి లౌకికవాద పార్టీలను కలుపుకుపోవాలని సీతారాం ఏచూరి ప్రతిపాదించగా, బీజేపీ నాజీ లాంటి కరడుగట్టిన పార్టీ కాదని, ఏకీకత అధికారాన్ని చెలాయించే పార్టీ అని, దాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థి నాయకుడు కన్నయ్హ కుమార్ లాంటి వాళ్లను కలుపుకోవాలని, కాంగ్రెస్‌లాంటి బూర్జువా పార్టీల సహాయం అవసరం లేదని కారత్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రెండు తీర్మానాల గురించి గత శనివారం చర్చించిన సీపీఎం పార్టీ సీతారాం ఏచూరి తీర్మానాన్ని వ్యతిరేకించి కారత్ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం తుది నిర్ణయం కోసం పార్టీ సెంట్రల్ కమిటీకి పంపించింది. ఆదివారం నాడు సమావేశమైన పార్టీ సెంట్రల్ కమిటీ కూడా సీతారాం ఏచారి తీర్మానాన్ని తిరస్కరించింది. ఏప్రిల్ హైదరాబాద్‌లో జరుగనున్న పార్టీ కాంగ్రెస్‌కు రెండు తీర్మానాలను పంపించేందుకు సీతారాం వర్గం చేసిన చివరి ప్రయత్నాన్ని బీవీ రాఘవులు అడ్డుకున్నారు. సీతారాం తీర్మానం వీగిపోవడానికి కారణం పార్టీ కేరళ శాఖ కారత్కు అండగా నిలబడటం. ప్రధానంగా కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే సీతారాం ఏచూరి తీర్మానాన్ని పార్టీ తిరస్కరించింది. కేరళలో సీపీఎంకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో అంటకాగడం స్థానిక పార్టీ నాయకులకు అస్సలు ఇష్టం లేదు. ఏదీ ఏమైనా 54 ఏళ్ల క్రితం, అంటే, 1964లో ఏకారణంగానైతే సీపీఐ రెండు పార్టీలుగా విడిపోయిందో, ఇప్పుడు అలాంటి కారణంతోనే పార్టీలో రెండు చీలికలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. 1962లో సీపీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ గోష్ మరణంతో పార్టీలో వర్గాలు ఏర్పడినప్పటికీ 1964లో రెండు పార్టీలుగా చీలిపోయాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు సమాజంలో చైనా, సోవియట్ యూనియన్లు రెండు చీలిపోవడం, కార్మికుల ఉద్యమం మంచి ఊపులో ఉన్నప్పుడు పార్లమెంటరీ ఎన్నికల ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ లాంటి బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమి లేదన్న వారు సీపీఐలో ఉండిపోయారు. అదంతా పక్కా రివిజనిజం అని, అంతకన్నా సోవియట్, చైనా తరహాలో చీలిపోవడం మంచిదంటూ విడిపోయిన వర్గం సీపీఎంగా మారింది. అలాగే, 1975లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు సంఘ్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని సీపీఎంలో మెజారిటీ వర్గం వాదించింది. ఎట్టి పరిస్థితుల్లో జనసంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలతో చేతులు కలపరాదని నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య వాదించారు. ఈ రోజున సీతారాం ఏచూరి ఓడిపోయినట్లుగానే నాడు సుందరయ్య తన పంతం నెగ్గించుకోలేక ఓడిపోయారు. అందుకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీతారాం ఏచూరి ఆయన తరహాలో రాజీనామా చేస్తారని అనుకోలేం. కేంద్రంలో ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలను జారవిడుచుకోం పెద్ద పొరపాటని, అది చారిత్రక తప్పిదమని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకుడు జ్యోతిబసు 1977, జనవరి నెలలో ‘ఏసియన్ ఏజ్’ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. నాడు జ్యోతిబసు ప్రధాని అభ్యర్థిత్వాన్ని సీతారాం ఏచూరి, కారత్‌లు గట్టిగా వ్యతిరేకించగా, ఆయన్ని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ ఒక్కరే బలపరిచారు. అప్పటి నుంచి సీపీఎం ఏ పొరపాటు చేసినా దాన్ని చారిత్రక తప్పిదనంగా పార్టీ వర్గాలు, రాజకీయ విమర్శకులు పేర్కొంటూ వస్తున్నారు. -
‘సీజే అభిశంసనపై చర్చిస్తున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. కేసుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ సీజేఐపై నలుగురు సీనియర్ సుప్రీం న్యాయమూర్తులు ఆరోపించిన నేపథ్యంలో ఏచూరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెబెల్ జడ్జీలు లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేశాయి. కాగా ఈనెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న 2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. -
ఏచూరికి ఎదురు దెబ్బ.. రాజీనామాకు సిద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించటంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు. ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన కేంద్ర కమిటీ ఓటింగ్‌లో 55-31తో ఏచూరి చేసిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో మనస్థాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఏచూరిని కొనసాగాల్సిందిగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేయటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తగ్గారు. అయినప్పటికీ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించబోయే అంతరంగిక సమావేశంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఏచూరి సిద్ధమవుతున్నారు. అసలు విషయం... 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యంగా సీపీఎం పార్టీ ఆరు నెలల క్రితం తీర్మానం చేసింది. పార్టీ ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలంటే బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన లేవనెత్తారు. కానీ, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని.. పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది మోసపూరిత రాజకీయాలని పేర్కొంటూ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏచూరి ప్రతిపాదనకు అచ్యుతానందన్ మద్ధతు ప్రకటించగా... ప్రకాశ్ ప్రతిపాదనకు కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నేతలు, పార్టీ లేబర్ విభాగం సీఐటీయూ కారత్ ప్రతిపాదనకు మద్ధతు ప్రకటించాయి. ఈ పరిణామాలు ఎంతకు తెగకపోవటంతో కోల్‌కతాలో భేటీ నిర్వహించిన కేంద్ర కమిటీ మూడు రోజులపాటు ఏచూరి-కారత్ ముసాయిదాల మీద చర్చించింది. శనివారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆదివారం ఓటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 55 మంది ప్రకాశ్ కారత్ ముసాయిదాకు ఓటేయగా.. 31 మంది ఏచూరి ముసాయిదావైపు మొగ్గు చూపారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. దీంతో ఏచూరి ముసాయిదా వీగిపోయినట్లయ్యింది. ఏచూరి ఓడిపోలేదు... సీతారాం ఏచూరికి బెంగాల్ పార్టీ యూనిట్ మొదటి నుంచి గట్టి మద్ధతు ఇస్తూ వస్తోంది. ముసాయిదా వీగిపోయిన నేపథ్యంలో ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిపాదన మాత్రమే వీగిపోయింది. కానీ, ఆయన ఓడిపోలేదు. అంతరంగిక సమావేశంలో అసలు విషయం తేల్చుకుంటాం’ అంటూ పేర్కొంది. ఇక అలీముద్దీన్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పందించిన ఏచూరి... ‘‘పార్టీ, పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ ఆదేశాల మేరకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. అంతిమ నిర్ణయం పార్టీదే’’ అంటూ ప్రకటించటంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ వార్తలకు బలం చేకూరింది. కానీ, కమిటీ భేటీ, ఓటింగ్ విషయాలను మాత్రం ఆయన మీడియాతో పంచుకోలేదు. చివరిసారిగా 1975లో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఆ సమయంలో పీ సుందరయ్య ప్రవేశపెట్టిన ప్రతిపాదనను తిరస్కరణకు గురికాగా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. -
కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం నో!
కోల్‌కతా: కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓటింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని కేరళ బృందం ఏచూరి తీర్మానాన్ని ఓడించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 31 ఓట్లు, వ్యతిరేకంగా 55 మంది ప్రతినిధులు ఓటేశారు. కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పొత్తు ఉండొద్దని ప్రకాశ్ కారత్ బృందం తేల్చిచెప్పింది. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడమే మేలని ఏచూరి ప్రతిపాదించారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసిన తరువాత ఏచూరి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. సవరణలు చేసిన తరువాత ఆమోదం పొందిన తీర్మానంలో కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు, అవగాహన కుదుర్చుకోవద్దని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు అనుకూలంగానే ఉన్నా కేరళ సభ్యులు వ్యతిరేకించిననట్లు తెలిపారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! కారత్ బృందం తీర్మానాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ సమావేశాలు జరగబోయే ముందు దీనిపై అభిప్రాయాలు సేకరిస్తారు. తన తీర్మానం ఆమోదం పొందకుంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాలని ఏచూరి అనుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఓటమిని పసిగట్టిన ఏచూరి అసలు ఓటింగ్ జరగకుండా ఉండేలా ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకోసం అత్యవసరంగా పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్రకమిటీసభ్యుడి హఠాన్మరణం ఈ సమావేశాలకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర అధికార లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ ఖగేన్‌దాస్(79) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున ఆయన తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. దాస్ 1978, 1983 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, 1998–2002 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా, 2002 నుంచి 2014 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. -
మోడీ పాలనలో దేశం మునిగిపోతోంది
-
టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది
విజయవాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విజయవాడలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నందున బీజేపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి ఇబ్బందేనని చెప్పారు. రాష్ట్రంలోను టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. పోలవం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయనే నమ్మకం తమకు లేదన్నారు. తప్పుడు హామీలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఏచూరి అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని, దీనికి కారణం నోట్ల రద్దేనని ఆరోపించారు. నాలుగు అంశాల కోసం నోట్ల రద్దు చేశామని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కానీ ఏ ఒక్కటీ జరగలేదని, పైగా అవన్నీ ఎక్కువైపోయామని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ శక్తులకు ఈ మూడేళ్లలో రెండు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన సర్కారు రైతుల రుణమాఫీని గాలికి వదిలేసిందని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని, నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని విమర్శించారు. మోదీ ప్రధానిగా కంటే మంచి ఈవెంట్ మ్యానేజర్గా బాగా పనికి వస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం విధానాలకు నిరసనగా రాబోయే రోజుల్లో వామపక్షాలు ప్రజా ఉద్యమాలు ఉదృతం చేస్తాయని తెలిపారు. రైతులు సమస్యలపై అక్టోబర్‌లో ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల సమస్యల పై ఉద్యమించేందుకు మేధావుల ఫోరం ను ఏర్పాటు చేశామన్నారు.ఈ వేదిక ద్వారా మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఏచూరి చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ మత కలహాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశంలో రోజు రోజుకూ బీజేపీ పతనం అవుతోందని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మతతత్వ, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలపడనున్నాయని వివరించారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు మరింత పన్ను భారం పెంచేశారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం రేట్లు 80 శాతం తగ్గాయి. మన దేశంలో 125 శాతం పెంచేశారని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అధికారం తమదే అని చంద్రబాబు, మోదీ చెప్పుకోవటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
వెంటనే బలపరీక్ష నిర్వహించాలి గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్ష సభ్యులు న్యూఢిల్లీ: తమిళ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీకి చేరాయి. సీఎం పళనిస్వామికి మెజారిటీ లేదని, తమిళనాడు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి.. బలపరీక్షను నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రపతిని కలిసినవారిలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళని సర్కారు మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. సీఎం పళని వర్గానికి మెజారిటీ లేకపోయినా.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వైఖరి ఉందని ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి.. బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్రపతిని కోరారు. అనంతరం సీపీఎం నేత ఏచూరి, సీపీఐ నేత రాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరికి లేఖే కారణమా? దినకరన్ వర్గం పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ.. గవర్నర్ విద్యాసాగర్‌రావు చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అందించిన లేఖలో పొరపాట్లు ఉన్నాయని, అందువల్లే తాము చర్య తీసుకోవడం లేదని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. తాము అన్నాడీఎంకే ఎమ్మెల్యేలమే అయినప్పటికీ, పళనిస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం లేదని, బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వం తిరుగుబాటు చేస్తే.. అది పార్టీ అంతర్గత విషయం అవుతుందని, అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకొని గవర్నర్‌కు తెలియజేయవచ్చునని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమకు మెజారిటీ లేదన్న విపక్షాల వాదనను అన్నాడీఎంకే తోసిపుచ్చుతోంది. పళనికి పూర్తిస్థాయిలో సంఖ్యాబలముందని చెప్తోంది. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
-
మనసులో ఉంది అడగలేకపోయిన రాహుల్
న్యూఢిల్లీ: జనతాదల్ యునైటెడ్ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను ఓ విషయాన్ని సూటిగా అడిగేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొహమాట పడ్డారు. ఆయన పక్కనే శరద్ యాదవ్ కూర్చున్నప్పటికీ ఆయన అడగలేకపోవడంతో ఆ విషయాన్ని సీతారాం ఏచూరి అడిగేశారు. ఇంతకీ రాహుల్ ఏం అడగాలని అనుకున్నారంటే.. మంగళవారం ప్రతిపక్షాలు భేటీ అయిన సందర్భంలో రైతు సమస్యలపైన చర్చించారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెబుతూ ఎన్డీయే సర్కార్‌ను కార్నర్ చేయాలని భావించాయి. అయితే, ఈ సమావేశానికి హాజరైన శరద్ యాదవ్ నాన్ స్టాప్‌గా రైతుల విషయంలో మాట్లాడారు. అయితే, అక్కడ ఉన్న రాహుల్‌గాంధీతో సహా పలువురు నేతలకు ఒక సందేహం వచ్చింది. శరద్ యాదవ్ పార్టీ తరుపున ఈ విషయం చెప్పారా లేక వ్యక్తిగతం చెప్పారా అని తెలుసుకోవాలనిపించింది. డైరెక్ట్‌గానే ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ అలా చేయలేకపోయారు. దీంతో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ బాధ్యత తీసుకొని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని శరద్ యాదవ్‌ను అడిగేశారు. దీంతో ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని, తన పార్టీతరుపునే ఇలా అంటున్నట్లు తెలిపారు. అయితే, ఆ నేతల్లో ఒకరు గతంలో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ మాట్లాడగా అదే పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం విభేదించినట్లు గుర్తు చేశారు. దీంతోపాటు ఇటీవల నితీష్ కుమార్ ఎన్డీయేకు దగ్గరవుతున్నట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీకి తాజాగా ఈ అనుమానం వచ్చింది. -
ఆర్ఎస్ఎస్ నాయకుడు రాష్ట్రపతిగానా?
- రామ్‌నాథ్ మత సంస్థలో ప్రముఖ నాయకుడన్న సీపీఎం - ఇది రాజకీయ సంఘర్షణ.. పోటీపై 22న నిర్ణయం: ఏచూరి - మద్దతు ఇవ్వబోమని తేల్చిన సీపీఐ న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. మద్దతుపై ఇప్పుడే చెప్పబోమని కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది సేపటికే, మరో ప్రధాన ప్రతిపక్షం సీపీఎం.. కోవింద్‌ను మతసంస్థ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తిగా అభిర్ణించింది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమనే సంకేతాలు ఇచ్చారు. ‘రామ్‌నాథ్.. ఆర్ఎస్ఎస్ దళిత శాఖకు చెందిన నేతగా ప్రసిద్ధి. అలాంటాయనను ‘రాజకీయేతరుడి’గా భావించలేం. అయినా ఇది(రాష్ట్రపతి ఎన్నిక) పూర్తిగా రాజకీయ సంఘర్షణే. కాబట్టి పోటీ తప్పకపోవచ్చు. మన దేశంలో ఒకేఒక్కసారి తప్ప అన్నిసార్లూ రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరిగాయి. జూన్ 22న విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీ అభ్యర్థిని నిలపాలా లేదా అనేదానిపై ఆ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ సైతం వ్యతిరేకమే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై సీపీఐ సైతం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటనపై అసహనం -
పేరు చెప్పకుండా మద్దతు కావాలంటే ఎలా?
- బీజేపీ కమీటీని ప్రశ్నించిన సోనియా.. ఏచూరిదీ అదే మాట - కాంగ్రెస్, సీపీఎంతో బీజేపీ కమిటీ మంతనాలు ప్లాప్ - రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనించిన చర్చలు అత్యంత పేలవంగా ముగిశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన బీజేపీ త్రిసభ్య కమిటీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరిని కలిసింది. ఒక్కోటి దాదాపు 30 నిమిషాల పాటు భేటీలు సాగాయి. తొలుత సోనియాను కలిసిన వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌లు.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అభిప్రాయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘మీ అభ్యర్థి ఎవరో చెప్పండి.. అవసరమైతే మేమే(ఎన్డీఏనే) మద్దతిస్తాం’ అని బీజేపీ నేతలు సోనియాతో అన్నట్లు సమాచారం. సమాధానంగా.. ‘మద్దతు కోసం వచ్చిన మీరు ఎవరికి మద్దతివ్వాలో ఆ పేరు చెప్పకుంటే ఎలా?’ అని సోనియా అన్నట్లు తెలిసింది. ‘వాళ్లు(బీజేపీ) అభ్యర్థుల పేర్లు చెప్పనేలేదు. అలాంటప్పుడు దీనిని చర్చలని కూడా అనలేం’ అని సోనియాతో బీజేపీ కమిటీ భేటీపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘పేర్లు చెప్పకుంటే ప్రక్రియ ముందుకు సాగనేసాద’ని మరో నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. వచ్చారు.. వెళ్లారు..: ఏచూరి సోనియాతో భేటీ అనంతరం బీజేపీ నేతలు వెంకయ్య, రాజ్‌నాథ్‌లు నేరుగా సీపీఎం కేంద్రకార్యాలయానికి వెళ్లి సీతారం ఏచూరిని కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీపీఎం అభిప్రాయాన్ని అడిగితెలుసుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాఉ. భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అయితే ఎన్డీఏ అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. కాసేపటికి వెళ్లిపోయారు. అయినా పేరు చెప్పకుండా మద్దతెలా ఇస్తాం?’ అని ఏచూరి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యమా? -
ఏచూరిపై దాడికి యత్నం
- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిపై హిందూ అతివాదుల దుశ్చర్య న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి యత్నించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అన్నారు. -
మోదీ పాలన వైఫల్యాలమయం
-
మోదీ పాలన వైఫల్యాలమయం: ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అన్నిరంగాల్లో దేశం దిగజారిందని, మోదీ పాలనంతా వైఫల్యాలమయమని దుయ్యబట్టారు. ధనిక వర్గానికి భారీగా లాభాలు పెరిగే చర్యలు తీసుకోవడం, పేదలకు ఉపాధి అవకాశాలు తగ్గి, భారాలు ఎక్కువై దారిద్య్రం పెరగడం ద్వారా ధనిక, పేద భారత్‌లుగా దేశ విభజన స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఆచరణకు నోచుకోలేదన్నారు. గురువారం ఇక్కడ ఎంబీ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వలెక్కల ప్రకారమే దేశంలో 12 వేలమంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలకు వ్యతిరేకం గా ప్రజాస్వామ్యశక్తులు, వామపక్షాలు, సామాజిక సంఘాలు కలసి ప్రజా ఉద్య మాల నిర్మాణానికి కృషి చేయాలని సీపీఎం నిర్ణయించిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలపా లనే విషయంలో బీజేపీ ప్రభుత్వం స్పష్టతనివ్వకపోగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టలేదన్నారు. సీపీఐ, సీపీఎం ఏకీకరణ ప్రస్తుత ఎజెండాలో లేదన్నారు. సామాజిక న్యాయం పార్టీలో అమలుకావడం లేదని ఒక విలేకరి ప్రశ్నించగా ‘నా గోత్రాన్ని తీసుకుని పనిచేస్తారా లేక నేను ఆచరణలో పాటిస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా’ అని ఏచూరి ఎదురు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వివిధపార్టీలు, సామాజిక తరగతు లతో ఐక్య ఉద్యమం చేపట్టాలని సీపీఎం నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాణ్‌ను స్నేహపూర్వకంగానే కలి సినా, రాజకీయ పరిస్థితులు, పరిణామాల పైనా చర్చించామన్నారు. జనసేన విధా నాలు వెల్లడయ్యాక మళ్లీ చర్చించి వైఖరిని నిర్ణయిస్తామని చెప్పారు. -
‘వెనకబడిన ఐటీ రంగం.. కుదేలైన ఉపాధి’
హైదరాబాద్: మూడేళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పాలనలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధికల్పన కూడా మరుగున పడిందని, ఐటీ రంగం వెనకబడిందని తెలిపారు. గోసంరక్షకుల సంఘాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. గోసంరక్షణ సంఘాల పేరుతో ప్రైవేటు సైన్యాలు జరుపుతున్న అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సరిహద్దుల వెలుపల సైనికుల మరణాలు పెరిగాయని, అంతర్గతంగా మావోయిస్టుల సమస్య కూడా పెరిగిందన్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా బీజేపీ అనుసరిస్తున్న విధానం విఫలమైందన్నారు. కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందుతున్నారని ఘాటుగా విమర్శించారు. లౌకికశక్తులతో కలిసి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలు, సంఘాలతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సీపీఎం నిర్ణయించిందని తెలిపారు. కుంభకోణాల్లో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందేని.. చిదంబరం, లాలూపై కేసుల విషయంలో చూస్తే రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నట్టు కనిపిస్తోందన్నారు. దేశంలో ముస్లింలను మినహాయిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా ప్రచారం చేయడం శోచనీయమని సీతారాం ఏచూరి అన్నారు. -
ఐక్యవేదికకే తొలి ప్రాధాన్యం
- సమస్యల ప్రాతిపదికగా ఆందోళనలు: సీపీఎం - ఆ తర్వాతే రాజకీయ సమీకరణలపై దృష్టి... - భేటీకి హాజరైన ఏచూరి, కారత్, రాఘవులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రజాసమస్యలపై వామపక్షాలు, ప్రజా, సామాజిక సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలపై కార్యాచరణను రూపొందించు కుని ముందుకు సాగాలని తీర్మానించింది. ఆయా సమస్యల ప్రాతిపదికన వివిధ రూపా ల్లో ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయిం చింది. ఈ కృషిని కొనసాగిస్తూనే రాజకీయ అంశాలు, వైఖరికి సంబంధించి కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఉమ్మడి రాజకీయ వేదిక నిర్మాణానికి కృషి చేయాలని భావిస్తోంది. బుధవారం ఇక్కడ ఎంబీ భవన్లో పార్టీ నాయకుడు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు హాజరయ్యారు. రాష్ట్రంలో 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు అభివృద్ధిలో, అవకాశాల్లో, ఇతరత్రా సమాన వాటా అందేలా చేసేందుకు పార్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికపై చర్చించనున్నారు. దీని అమలుకు సంబంధించి గురువారం పార్టీ నాయకత్వం తన నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్థిక అంశాలపై పోరు... రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ఆయా అంశాలు, సమస్యలపై ఉద్యమించాలని ఈ సమావేశం లో నిర్ణయించారు. ప్రధానంగా అత్యధిక శాతం ప్రజలపై ప్రభావం చూపే అంశాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, కార్మికులు, కాంట్రాక్ట్, ఇతర వర్గాలకు తగిన జీతభత్యాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూమి పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద లకు ఇళ్లు, ఇంటిస్థలాలు, సంబంధిత అంశా లపై దృష్టి పెట్టాలని తీర్మానించారు. సర్కార్ నిరంకుశ చర్యలను వీడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ చర్యలను విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం విజ్ఞప్తి చేసింది. ప్రజా సమస్యలను పరిష్కరించి, అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తోందని ధ్వజమెత్తింది. సమా వేశ నిర్ణయాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని కనీసం రూ.వెయ్యికోట్ల మార్కెట్ నిధిని కేటాయించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సమావేశం కోరింది. ఉపాధి హామీ పనిదినాలు 200 రోజులకు పెంచి, రోజు వేతనం రూ.400 చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం జరిగే భవిష్యత్ ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది. -
రైతుల ఆత్మహత్యలు నివారించటంలో ప్రభుత్వం విఫలం
-
‘దక్షిణ భారతంలో కరువు పెరిగిపోయింది’
విజయవాడ: నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో నిరుద్యోగం పెరగడంతో పాటు దక్షిణ భారతంలో కరువు కూడా పెరిగిపోయిందని సీపీఎం అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను అదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రతి ఏటా 12 వేల మందికి పైగా రైతులు అత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై ఈ నెల 12న ఎన్నికల సంఘం అఖిలపక్షం మీటింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పేపర్ ట్రైల్ అధారంగానే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీలకు బాండ్ల పేరుతో చందాలు ఇస్తున్నారు...ఇది పొలిటికల్ పార్టీ కరప్షన్గా మారే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ లో డబ్బు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరతామన్నారు. కాశ్మీర్లో పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకోవడానికి మా సలహాలు ప్రభుత్వానికి వివరిస్తామని తెలిపారు. దేశంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఏపీలో రాజధానికి ప్రచార అర్బాటమే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీని వీడే పరిస్ధితి లేదన్నారు. ప్రత్యేక హోదా పై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది..ఇప్పుడు మాట తప్పితే పార్లమెంట్ కు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. దేశంలో నార్త్, సౌత్ భావాలు ఉండకూడదన్నారు. నార్త్ వల్ల సౌత్ కి సౌత్ వల్ల నార్త్‌కి ఇబ్బందులుంటే మాట్లాడుకోవాలే తప్ప విభజించి చూడకూడదన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు చర్చిస్తున్నాయని భవిష్యత్ ఎలా ఉంటుందో చూద్దామన్నారు. -
రాజ్యసభకు మళ్లీ పోటీ చేయను: ఏచూరి
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా మరోమారు ఎన్నిక కావాలని కోరుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. వరుసగా రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన పదవీకాలం వచ్చే ఆగస్టులో పూర్తికానుంది. ఒక వ్యక్తి రెండు కన్నా ఎక్కువ సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యేందుకు పార్టీ నియమాలు అనుమతించవని, ‘ఇది మా పార్టీ నియమం. మూడోసారి నేను పోటీ చేయను’ అని తెలిపారు. ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు లెఫ్ట్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘జోక్యం చేసుకోండి.. మంత్రిని సాగనంపండి’
తిరువనంతపురం: కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎంఎం మణి అనుచితవ్యాఖ్యలు చేయడంపై వివాద ముదురుతోంది. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఎఫ్ కూటమి గట్టిగా పట్టుబడుతోంది. ఈ విషయంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల బుధవారం సీతారాం ఏచూరికి లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎం మణికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని రమేశ్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమే కాకుండా నేరపూరితంగా కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళా సాధికారత, ప్రజల గౌరవానికి పెద్దపీట వేస్తామని చెప్పుకునే సీపీఎం.. మణిపై చర్య తీసుకోవాల్సిన అవసరముందున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీతారాం ఏచూరి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, పార్టీ అడిగితే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఎంఎం మణి ప్రకటించారు. -
సీతారామ్ ఏచూరికే మళ్లీ పట్టం?
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సరికొత్త ఆఫర్‌తో సీపీఎం ఇరకాటంలో పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు మూడోసారి పోటీ చేయాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఏచూరిని కాకుండా సీపీఎం నుంచి మరొక అభ్యర్థిని నిలబెడతామంటే ఒప్పుకోబోమని, సీటును వదులుకోవాల్సిందేనని ఏచూరిని రాహుల్ గాంధీ స్వయంగా కలుసుకొని స్పష్టం చేసినట్లు తెల్సింది. అయితే, ఏచూరి మళ్లీ పోటీ చేయడానికి ఒక ఇబ్బంది ఉంది. ఒక వ్యక్తిని రెండుసార్లకు మించి రాజ్యసభకు పోటీ పెట్టరాదనేది సీపీఎం నియమం. పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీకి ప్రాతినిధ్యం కావాలనుకుంటే ఈ నియమాన్ని ఉల్లంఘించక తప్పదు. లేదంటే ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అంగీకరించాల్సి ఉంటుంది. బెంగాల్ నుంచి సీతారామ్ ఏచూరితో పాటు మరో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారందరి సభ్యత్వం ఆగస్టు నెలతో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బెంగాల్ అసెంబ్లీలో 44 స్థానాలు, మిత్రపక్షాలను కలపుకొని సీపీఎంకు 32 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితేనే ఆ అభ్యర్థి గెలుస్తారు. రెండు పార్టీలు ఇద్దరిని నిలబెడితే ఆరో సీటు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే లభిస్తుంది. పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి పార్లమెంటులో కూడా పార్టీకి నాయకత్వం వహించకూడదు. ఇప్పటికే ఈ నియమాన్ని ఏచూరి ఉల్లంఘించారు. ఇప్పుడు మూడోసారి రాజ్యసభకు పోటీ చేస్తే ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందన్నది పార్టీ వర్గాల తర్జనభర్జన. ఓ నిబంధన ఒకసారి ఉల్లంఘించినప్పుడు మరోసారి ఉల్లంఘించడంలో తప్పేముందని కొత్తమంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి సీపీఎం జాతీయ కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఒక్కతాటిపైకి ప్రతిపక్షాలు!
► రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం కసరత్తు ► ప్రాంతీయ పార్టీల ఐక్యతకు పిలుపునిచ్చిన లాలూ, మమత, ఏచూరి న్యూఢిల్లీ/కోల్‌కతా/పట్నా: యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్ని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో బిహార్ సీఎం నితీశ్ చర్చించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సోనియాతో చర్చించారు. భేటీ అనంతరం ఏచూరి మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అన్ని లౌకిక ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే అవకాశంపై ఏచూరి, సోనియాలు చర్చించారని, ఈ ప్రతిపాదనకు సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారని సీపీఎం వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీపీఎం పార్టీ సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి గురువారం మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థి నిలపాలని జేడీయూ కూడా భావిస్తున్నట్లు చెప్పారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అవసరం: లాలూ బిహార్ ఆర్జేడీ అధినేత లాలూ పట్నాలో శుక్రవారం మాట్లాడుతూ... 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మహాఘట్బంధన్ పేరిట ఆర్జేడీ–జేడీయూల పొత్తు తరహాలోనే ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మతతత్వ, ఫాసిస్టు శక్తుల్ని ఓడించేందుకు మాయావతి, కాంగ్రెస్, మమతా బెనర్జీ, అఖిలేశ్‌లు ముందుకు రావాలన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలి: బీజేపీని వ్యతిరేకిస్తే వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని శుక్రవారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వాలని కార్యకర్తల్ని ఉద్దేశించి మమత ప్రసంగించారు. కలిసికట్టుగా, ఐక్యంగా సాగాలని అన్ని పార్టీలను కోరుతున్నానని, తృణమూల్ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. చర్చించాకే నిర్ణయం: కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, వర్కింగ్ కమిటీలు చర్చించాకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. నిర్ణయం తీసుకోగానే మీడియాకు వెల్లడిస్తామంది. -
సోనియాతో ఏచూరి కీలక చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ, సీపీఎం ముందడుగు వేశాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని పోటీ పెట్టడంపై సోనియాతో ఏచూరి చర్చించినట్టు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్ బ్యూరో ఇంతకుముందే నిర్ణయించింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్ కోరినట్లు సమాచారం. -
రుణమాఫీపై పార్లమెంటు ముట్టడి
⇒ సీతారాం ఏచూరి వెల్లడి ⇒ కేంద్రం కార్పొరేట్ రుణాలు మాఫీ చేస్తూ రైతు రుణమాఫీని పట్టించుకోదా? సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అంశంపై వచ్చే వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటును ముట్టడిస్తామని లేదా భారీ ప్రదర్శన చేపడతామని సీపీఎం ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. అన్ని ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ప్రజానిరసన నిర్వహిస్తామన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాఉద్యమాలు, నిరసనల ద్వారానే మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాల నుంచి వెనక్కు తగ్గేలా ఒత్తిడి తేవడం సాధ్యమన్నారు. కార్పొ రేట్ సంస్థలు, ధనికుల రుణాలను పెద్దఎత్తు న మాఫీ చేస్తున్న మోదీ ప్రభుత్వం దేశవ్యా ప్తంగా రైతు రుణాలపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో వ్యవసాయరంగ సంక్షోభం ము దురుతోందని, రైతు ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. మతోన్మాద విధానాలపై ఐక్య పోరు... మతోన్మాద విధానాల ద్వారా దేశంలో మతప రమైన విభజనకు బీజేపీ చేస్తున్న ప్రయత్నా లను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు కలసి రావాల్సిన అవసరం ఉందని ఏచూరి తెలిపారు. ఇది రాజకీయ స్థాయిలో కాకుండా పోరా టాల ద్వారా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఒక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురా వాలన్నది తమ ఆలోచనన్నారు. పార్లమెంటు లో బీజేపీ ప్రమాదకర ధోరణిని అనుసరిస్తోం దని, ఆర్థిక బిల్లులకు సవరణల ద్వారా పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి స్తోందని అన్నారు. పార్లమెంటు సంప్రదా యాలను కాదని ఆర్థిక బిల్లుకు ఐదు సవరణ లు చేసి దాన్ని ద్రవ్య బిల్లుగా చూపడం దారుణమని విమర్శించారు. రాజకీయ అవినీతికి రాచబాట... రాజకీయాల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించాలంటూ ఉపన్యాసాలిచ్చిన మోదీ.. పార్లమెంటులో అందుకు విరుద్ధంగా వ్యవహరిం చారన్నారు. ఆర్థిక బిల్లులో కంపెనీ చట్టాన్ని సవరించి కార్పొరేట్ సంస్థల నుంచిరాజకీయ పార్టీల విరాళాలకు పరిమితిని ఎత్తేయడం ద్వారా ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత విరాళాలిచ్చిందో, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేకుండా చేశారన్నారు. ఇది రాజకీయ అవినీతినిపెంచుతుందన్నారు. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందేందుకు ఎంతగానో ప్రయత్నించి మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. -
మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారా ఏచూరి ఆరోపించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక సవరణల విషయంలో బీజేపీకి రాజ్యసభలో చుక్కెదురైందన్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉపకరించే చట్టాన్ని బీజేపీ సవరించాలని చూస్తోందంటూ మోదీ బహిరంగ సభలలో చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని విమర్శించారు. కారణాలకతీతంగా దాడులు చేసే అధికారం ఆదాయపన్ను అధికారులకు కట్టబెట్టాలని బీజేపీ చూస్తోందని, దీనివల్ల దేశంలో బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రుణ మాఫీ చేయలేని మోదీ 11 లక్షల కార్పొరేట్ రుణాలను రద్దు చేశారన్నారు. కాగా, తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చేపట్టిన పాదయాత్ర అనుభవాలను సమీక్ష చేశామన్నారు. సామాజిక న్యాయం అనేది ప్రాథమిక అంశంగా గుర్తించామని, ఆ న్యాయ స్థాపన కోసం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించామని సీతారాం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. తమ మహాజన పాదయాత్రని ఇదేవిధంగా కొనసాగించాలని కేంద్ర కమిటీ స్వాగతించిందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సామాజిక న్యాయంలో తెలంగాణ అభివృద్ది జరిగేందుకు వచ్చే సంవత్సరం అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మాటలు చెప్పి టైం గడిపేందుకే వచ్చే ఏడాది అని చెబుతున్నారని విమర్శించారు. మధుకర్ అనే దళిత యువకుడు హత్యను దాచిపెడుతున్నారంటూ.. ఆత్మహత్య అయితే ఆవిధంగా ప్రభుత్వం విచారణ జరిపించాలి.. పోస్టుమార్టం చేయించాలి అని కోరారు. దీనిపై నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం.. ఆ తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
తిరోగమనవాదాలను తిప్పికొడదాం
ప్రగతిశీల పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో వక్తలు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పులకించింది. అప్పుడెప్పుడో ఇక్కడ ఉద్యమ పాఠాలు నేర్చి నేడు దేశరాజకీయాల్లో ఉద్దండులుగా నిలిచిన తన పూర్వ విద్యార్థుల రాకతో ఉప్పొంగి పోయింది. జనాన్ని ఉర్రూతలూగించిన ప్రజాకవులు, గాయకుల పలకరింపులతో తన్మయత్వం చెందింది. ప్రతిభాపాటవాలతో దేశవిదేశాల్లో తన ప్రతిష్టను చాటిచెప్పిన మేధావులను చూసి మురిసిపోయింది. ఈ అపూర్వ సన్నివేశం ఉస్మానియా వర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం(జార్జిరెడ్డి హాల్)లో శుక్రవారం జరిగిన ప్రగతిశీల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చోటు చేసుకుంది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రగతినిరోధక, మతోన్మాద, హిందూత్వ తిరోగమన వాదాలను తిప్పికొట్టేందుకు మరింత సంఘటి తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కె.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో తొలి విప్లవ విద్యార్థి ఉద్యమ నాయ కుడు బూర్గుల నర్సింగరావు మాట్లాడుతూ 1948 పోలీస్ యాక్షన్ అనంతరం అత్యధిక శాతం మంది వాడే ఉర్దూ భాషకి బదులు ఆంగ్ల భాషని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియాలో తొలి ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. అనేక ఉద్యమాలకు ఊతమిచ్చిన ఉస్మానియా విద్యారి ్థలోకం దేశ విద్యార్థి ఉద్యమ చరిత్రలోనే ముఖ్యపాత్ర వహించింద న్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి ఉద్యమాల ప్రభా వాన్ని తగ్గించాలనే పాలకవర్గాల కుట్రలో భాగంగా పీహెచ్డీ, ఎం.ఫిల్ సీట్లను కుదించి దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లోకి రాకుండా చేస్తున్నారన్నారు. వామపక్షపార్టీల ఐక్యతా దిశగా పయనిస్తున్నామని, త్వరలోనే దాన్ని సాధిస్తా మని అన్నారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలను అణచివేసే హత్యాఘటనలకు ఉస్మానియా ప్రత్యక్షసాక్షిగా నిలిచిందన్నారు. ప్రజాగాయకులకు పుట్టినిల్లు: సత్యనారాయణ ప్రజాగాయకులను, మహిళా ఉద్యమకారులను మన కందించిన ఉస్మానియా చరిత్ర చిరస్థాయిగా ఉంటుందని తెలుగు వర్సిటీ వీసీ ఎస్.వి. సత్య నారాయణ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం, దళిత్ పాంథర్స్ ఉద్యమాలు స్ఫూర్తినిచ్చా యని గద్దర్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల కొచ్చిన తాము గ్రామాలకు తరలండి అనే నినాదంతో గ్రామాలకు చేరుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల్లో దళిత, అస్తిత్వ ఉద్యమాలు జరిగిన విధంగా తెలంగాణ పోరాటం సైతం రాజకీయాలకతీతంగా ఉస్మానియా విద్యార్థు లంతా పాల్గొన్నారని అన్నారు. ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికీ వందేళ్లు: వరవరరావు విప్లవాల పురిటిగడ్డ ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికి సైతం నూరు వసంతాలు పూర్తికావడం యాదృచ్ఛికం కాదని విరసం నేత వరవరరావు అన్నారు. బోల్షివిక్ విప్లవ స్ఫూర్తినీ, షహీద్ భగత్‌సింగ్ విప్లవ త్యాగనిరతిని పుణికి పుచ్చుకున్న చరిత్ర ఒక్క ఉస్మానియాకే దక్కిందన్నారు. ప్రజా పోరాటయోధులు మల్లోజుల, పటేల్ సుధాకర్‌లు ఉస్మానియాలా కాలేజ్ విద్యార్థులేనని, తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చిన మగ్దుం మొయీనుద్దీన్, రాజ్బహదూర్గౌర్ల స్ఫూర్తి ఇక్కడుందని అన్నారు. ప్రగతి శీల ఉద్యమంతో ప్రారంభమై స్త్రీల అస్తిత్వ ఉద్యమాలకు పునాదులు వేసిన సమానత్వ చరిత్ర నేటికీ స్ఫూర్తిదాయకమని ప్రగతిశీల మహిళా సంఘం వ్యవస్థాప కురాలు కె.లలిత అ న్నారు. పీడీఎస్ యూ, ఎఐ ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీవీవీ, డీఎస్‌యూ, టీవీఎస్, పీడీఎస్యు (విజృం భణ) లాంటి ప్రగతిశీల విద్యార్థి సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. నాటి రష్యా బోల్షివిక్ విప్లవం వెదజల్లిన విప్లవ భావాలు నేటికీ ఇక్కడ సజీవంగా ఉన్నాయని న్యూడె మొక్రసీ నాయకుడు ప్రదీప్ అన్నారు. నాటి విద్యార్థి అమరులు జార్జిరెడ్డి, మధు సూధన్రాజ్, రంగవల్లి, మారోజు వీరన్నల త్యాగాలు విప్లవం పట్ల అచంచల విశ్వాసాన్ని నింపుతున్నాయని అన్నారు. -
మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విజయం
యూపీలో బీజేపీ గెలుపుపై సీతారాం ఏచూరి సాక్షి, హైదరాబాద్: మతోన్మాదాన్ని రెచ్చ గొట్టి, ఎస్సీ, బీసీ కులాల్లో చీలికను తీసుకురావడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. మతో న్మాదానికి ఊతమిచ్చేలా వివిధ కార్యక్ర మాలను చేపట్టి, దళితులు, మైనారిటీలపై దాడులు సాగించి యూపీ ప్రజల్లో భయో త్పాతాన్ని కలిగించడం ద్వారా ఈ విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయ సాధన నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ ఖరారుకు శుక్రవారం ఎంబీ భవన్లో జరిగిన రెండు రోజుల రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సమావేశానికి ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వాగ్దానాల అమలులో కేసీఆర్ వైఫల్యం.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేసిన ఎన్నికల వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎంగా కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం అమలు చేయాలంటూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమాలు పెరుగుతుండటంతో కేసీఆర్ మళ్లీ కొత్త వాగ్దానాలు చేస్తున్నారన్నారు. వాటి అమలు పరిస్థితి ఏమిటో కొంతకాలంలోనే తెలిసి పోతుందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాదయాత్ర ప్రభావం, తదితర అంశాలపై తమ్మినేని నివేదికను సమర్పించారు. సామాజికన్యాయం నినాదంతో పార్టీ చేపట్టిన కార్యాచరణను ఇకముందు కూడా కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. సీపీఎం పాదయాత్ర మంచి ఫలితాలనిచ్చిందని, కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఈ కృషిని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తికి సంకేతం
- ఏపీ ఎమ్మెల్సీ ఫలితాలపై ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనడానికి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు పట్ల ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో, మేధావులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగిందని చెప్పారు. -
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
-
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
► సామాజిక న్యాయానికి ఐక్య ఉద్యమాలు: ఏచూరి ► హిందూ రాజ్యస్థాపన దిశగా మోదీ, సంఘ్ శక్తులు సందేశమిచ్చాయి ► యూపీ పీఠంపై ‘యోగి’ని కూర్చోబెట్టడమే అందుకు నిదర్శనం ► బీజేపీ, ఆరెస్సెస్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి: కేరళ సీఎం విజయన్ ► ముగిసిన తమ్మినేని మహాజన పాదయాత్ర.. సరూర్‌నగర్‌లో సీపీఎం భారీ సభ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎరుపు, నీలం రంగు జెండాలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా చేయడం ద్వారా ప్రధాని మోదీ, ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు హిందూ రాజ్యస్థాపన దిశగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయన్నారు. దళితులు, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అగ్రకుల పెత్తందారీ విధానాలు అమలు కాబోతున్నాయని చెప్పారు. ఈ శక్తులు అధికారంలోకి రావడం వల్ల సామాజిక న్యాయ సాధన మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనం’పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. ‘‘ఇంద్రధనస్సులో మొదటనున్న ఎరుపు రంగు, చివరనున్న నీలం రంగు మధ్యలోని సమస్త రంగులు కలగలిసేలా ఉద్యమిద్దాం. సామాజిక న్యాయ సాధన కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తాం. అన్ని రంగాలు, వర్గాలపై మోదీ ప్రభుత్వ దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. పోరాడి సాధించిన పథకాలు రద్దవుతున్నాయి. సబ్‌ప్లాన్ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందిన రూ.73 వేల కోట్ల స్కాలర్షిప్పులు, బకాయిలు విడుదల చేయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు. గోరక్ష సమితి ద్వారా దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. లాల్, నీల్ జెండాలు, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం కలవకపోతే ఇలాంటి దాడులు తట్టుకునే పరిస్థితి ఉండదు’’అని ఆయన అన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో తన సభకు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు అడ్డంకులు సృష్టించినా.. అక్కడే అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన వీరభూమిలో ఎరుపు, నీలి జెండాలతో పాటు భగత్‌సింగ్ ఇంక్విలాబ్ నినాదాలతో ఉద్వేగభరితంగా సభ సాగిందని ఏచూరి చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఐక్యతను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘‘దేశవ్యాప్తంగా అంబేద్కర్, వామపక్ష భావజాలంతో సామాజిక న్యాయం నినాదంతో అన్ని శక్తులు కలసి పనిచేయడం మొదలైందని, ఇది నిర్నిరోధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 4,200 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను చైనాలో మావో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌తో పోల్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ తమ మిత్రుడిగా ఉన్నారని, ఆ తర్వాత మారిపోయారని ఏచూరి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై సీఎంకు తమ్మినేని రోజూ లేఖలు రాశారని, కేసీఆర్ ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలం గాణ సాయుధ పోరాటం భూసమస్యను దేశం ఎజెండాగా మార్చిందని, ఇక్కడ పోరాటాలు జరిగితే అవి దేశమంతా ప్రభావితం చేస్తాయ న్నారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీ లను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: విజయన్ బీజేపీ, సంఘ్ శక్తులు దేశాన్ని కాషాయీకరణ దిశగా తీసుకెళ్లేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. సీపీఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కాషాయీకరణతో దళితులు, మైనారిటీలతోపాటు మహిళలు కూడా తీవ్ర నిర్భందానికి, ఒత్తిళ్లు, కట్టుబాట్లకు గురవుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. సంఘ్ అరాచకాల వల్లే రోహిత్ వేముల, ముత్తుకృష్ణ వంటి తెలివైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం వినాశకరమైన విధానాలు అమలు చేస్తోంది. కేంద్రానికి రాష్టాలన్నా, రాష్ట్రాల హక్కులన్నా గౌరవం లేదు. దక్షిణాదిపై కక్ష కట్టింది. అందుకే ఈ రాష్ట్రాల్లో అశాంతి రేపాలని చూస్తోంది. భోపాల్‌లో, మంగళూరులో నా ఉపన్యాసాన్ని అడ్డుకోవాలని చూశారు. హైదరాబాద్ సభను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. వీటికి భయపడేది లేదు. మత ఘర్షణలు, పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ, ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే యూపీలో బీజేపీ గెలిచింది’’అని విజయన్ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదు ఉమ్మడి రాష్ట్రంలో అసమానతలపై పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలోనూ సామాజిక న్యాయం అమలు కావడం లేదని, కొందరు రాజకీయవేత్తలు భారీగా ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. -
సామాజిక న్యాయానికి సీపీఎం కట్టుబడి ఉంది
-
ఆరెస్సెస్ పుట్టిల్లు నాగపూర్ నుంచి నేరుగా ఇక్కడికే
హైదరాబాద్: జైభీమ్ లాల్ సలామ్ అని చెప్పటానికే తాను ఇక్కడికి వచ్చానని, ఆరెస్సెస్ పుట్టిల్లు నాగపూర్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చానని సీపీఎం ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆదివారం సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సారథ్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర 154 రోజుల పాటు 4200 కిలో మీటర్లు సాగింది. మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో సీతారాం ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, మాజీ సీఎస్ కాకి మాధవ రావు, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొ.హారగోపాల్, కంచె ఐలయ్య, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విమలక్క తదితరులు పాల్గొన్నారు. సభలో ఏచూరి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అనే స్లోగన్ మీదనే ఇక వామపక్షాల ప్రజా ఉద్యమాలు ఉంటాయని తెలిపారు. ముస్లింలను, దళితులని వ్యతిరేకించే వ్యక్తి యోగి ఆదిత్యనాధ్.. అలాంటి వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా నియమించారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్లానింగ్ కమిటీని రద్దు చేయటం వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. ఆరెస్సెస్ గోరక్షక దళాలు దళితులపై వ్యతిరేకంగా మారి దాడులకు దిగుతున్నారని అన్నారు. సామాజిక న్యాయానికి సీపీఎం కట్టుబడి ఉన్నదని తెలిపారు. మోదీ మీద ఒత్తిడి పెంచి.. ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తామని తెలిపారు. కేసీఆర్‌కి హెచ్చరిక చేస్తున్నా.. ప్రజా సమస్యలను పరిష్కరించండి.. లేదంటే పునరేకీకరిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి చిక్కిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే మన ఆయుధాలన్నారు. హామీలు నెరవేర్చకుండా కాలయాపన, అబద్ధాలాడుతున్న కేసీఆర్ తల ఎన్ని సార్లు నరుక్కోవాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రా లేక యావత్ తెలంగాణాకా? అని సూటిగా అడిగారు. అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు ఒక గొంతుకలా మారాలని కోరారు. కేసీఆర్ ఎంత అక్కసు వెళ్ల గక్కినా పాదయాత్ర విజయవంతం అయ్యిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేలకు ముక్కు రాసి పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి హేళన చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ నీకిదే సవాల్ ఇప్పుడు ఎవరు ముక్కు నేలకు రాయాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమనేతలు ప్రొ.జయశంకర్, ప్రొ. కోదండరామ్‌లను మరచిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మరచిపోవడం వింతేమీకాదని అద్దంకి దయాకర్ విమర్శించారు. కుటుంబ పాలనపై సమాజిక యుద్ధం ఇక్కడి నుంచి మొదలైందని అన్నారు. -
సీతారాం ఏచూరి రాయని డైరీ
తొలిసారి నేనొక కొత్త మాట విన్నాను! ఆ మాటన్న పెద్దమనిషి మనోహర్ పారికర్. ఈ దేశపు డిఫెన్స్ మినిస్టర్! ఎంత పెద్ద ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలట! అంటే ఏమిటి? లోబడి ఉండడంలోని స్వేచ్ఛను అనుభవించేవారు మాత్రమే నిజమైన జాతీయవాదులని పారికర్ అంటున్నారా?! నిజానికైతే.. గౌరవనీయులైన మనోహర్ పారికర్ గారిని ‘ఈ దేశపు డిఫెన్స్ మినిస్టర్’ అని కాకుండా ‘నా దేశపు డిఫెన్స్ మినిస్టర్’ అనాలి నేను. అయితే అలా అనిపించుకోవడం పారికర్‌కి కానీ, పరివార్ సభ్యులకు కానీ ఇష్టం లేకపోవచ్చు. ఈ దేశంలోని ముస్లింలను, క్రైస్తవులను, కమ్యూనిస్టులను ఈ దేశ పౌరులుగా వారు ఎప్పటికీ అంగీకరించరు. అంగీకరించకపోవడమే వారి జాతీయవాదం. నేషనలిజం అన్నది ఇండియాలో చెడ్డ మాట అయిపోయిందని అరుణ్‌జైట్లీ రెండు రోజులుగా ఆవే దన చెందుతున్నారు. ఇది నేను వింటున్న ఇంకొక కొత్త మాట. నాకూ బాధేసింది. పాపం.. ఈ పెద్దాయ నకు ఇంత కష్టం ఏమిటా అని! మా ఇద్దరి వయసూ ఒకటే. కానీ నేషనలిజం గురించి తరచూ మాట్లాడు తుండేవారు త్వరగా పెద్దవాళ్లయిపోతారు. కమ్యూనిస్టుల రాకపోకలపై నిషేధాజ్ఞలేవీ లేకపోవడంతో కోల్‌కతా నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్లడం నాకు తేలికవుతోంది. ఇందుకు ప్రతి కమ్యూనిస్టు మహాసభలోనూ ముందుగా మేము మోదీకి ధన్యవాద సమర్పణ చేయాలి. సాధారణంగా ధన్యవాద సమర్పణ సభ చివర్లో చేస్తారు. మోదీకి సభ మొదట్లోనే చేయాలి. నిన్నా, మొన్నా నేను ఢిల్లీలోనే ఉన్నాను. దేశ రాజధాని ఇప్పుడు ఢిల్లీ కాదు. ఢిల్లీ యూనివర్సిటీ! ప్రతినిధుల సభ ఇప్పుడు పార్లమెంటు కాదు. డీయూ క్యాంపస్! డీయూలో ఇప్పుడు దేశం పట్టనంత నేషనలిజం!! క్యాంపస్ సిలబస్‌లో ఇప్పుడు గ్రేస్ మార్కులు ఉన్న ఒకే ఒక సబ్జెక్టు.. నేషనలిజం! ఈ సబ్జెక్టు తీసుకున్న విద్యార్థులు విద్యార్థులు కారు! నేషనలిజంలో తల పండి, కర్రలు పట్టుకుని తిరుగు తున్న ప్రొఫెసర్లు. నేనూ ఇక్కడ తిరిగిన వాడినే. ఇప్పటంత నేషనలిజం అప్పుడు లేదు. నేషనలిజంలో ఇప్పటంత ప్రొఫెషనలిజం కూడా అప్పుడు లేదు. పాకిస్తాన్ మీద పది రన్నులు ఎక్కువ తీయడం కూడా వీళ్లకు నేషనలిజమే! ‘మా నాన్నను పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం చంపేసింది’ అనడం మాత్రం యాంటీ నేషనలిజం. ‘అంత మాట అంటుందా.. ఆ పిల్లని ఇండియా నుంచి తరిమికొట్టండి. జైహింద్’ అంటున్నాడు అనిల్ విజ్. మరొక జాతీయవాద మినిస్టర్ ఆయన. హరియాణలో ఉంటాడు. దేశమంతా ఆయనదే. మోదీ ఆయనకు స్వయానా జాతిపిత! కోల్‌కతా వచ్చేశాను. మళ్లీ ఓ కొత్త మాట వినిపించింది! మాటకు స్వేచ్ఛ ఎక్కువైతే.. జాతికి భద్రత తక్కువౌతుందట! వెంకయ్యనాయుడు అంటున్నారు. ఏ జాతి? భరతజాతా? హైందవజాతా? - మాధవ్ శింగరాజు -
జీడీపీ వృద్ధి సందేహాస్పదం: విపక్షాలు
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రేటు 2016–17కు 7.1 శాతంగా ఉంటుందన్న ప్రభుత్వ అంచనాలు అత్యంత సందేహాస్పదంగా, ప్రశ్నార్థకంగా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది. రేటును అతిగా చూపుతున్నారని సీపీఎం, సీపీఐ ఆరోపించాయి. ‘అంచనాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. అంతర్జాతీయంగా దేశ విశ్వసనీయత దెబ్బతినే అవకాశముంది. ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి ఆనందర్ శర్మ మండిపడ్డారు. నోట్ల రద్దు అనేది లేకపోయుంటే మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 25 శాతం ఉండేదా? అని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. అభివృద్ధికి అసలు కొలమానం మానవాభివృద్ధి సూచీ అని, ప్రభుత్వ లెక్కలు అతిగా ఉన్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. అయితే గణాంకాలను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాలు 7 శాతం జీడీపీతో తొలగిపోయాయని జైట్లీ అన్నారు. -
ముగింపు పలకాల్సిన టైం వచ్చింది
-
‘మాజీ ఎంపీ మరణవార్త ఎందుకు లేటయింది?’
న్యూఢిల్లీ: రాజ్యసభలో గుండెపోటుతో కుప్పకూలి అనంతరం ప్రాణాలు కోల్పోయిన మాజీ కేంద్రమంత్రి ఈ అహ్మద్ మరణం ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాప్యం చేసిందని, ఆటలాడుకున్న పరిస్థితి కనిపించిందని సీపీఎం సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్ సమయంలో ఈ అంశంపై ప్రశ్నను లేవనెత్తారు. తనకు పలువురు వైద్యుల నుంచి సమాచారం ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయానికే అహ్మద్ చనిపోయాడని చెప్పారని, ఇంకొంతమంది మాత్రం అహ్మద్ ఐసీయూలో చనిపోయాడని చెప్పారని అన్నారు. ఏదేమైనా ఆయన మరణంపై చాలా ఆలస్యంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని, వైద్యుల నుంచి భిన్నమైన సమాధానాలు వచ్చాయని ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి నిజనిజాలు తెలిపాల్సిన అవసరం ఉందని ఆయన స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు మాజీ కేబినెట్ మంత్రి అహ్మద్ గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్రం బడ్జెట్ పెట్టింది. ఈ సమయంలో సీతారాం ఏచూరి దర్యాప్తు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘పార్లమెంటు’ను సాగనివ్వండి
అఖిలపక్ష భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అభిప్రాయ భేదాలెన్ని ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలను జరగనివ్వాలని.. ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల వల్ల శీతాకాల పార్లమెంటు సమావేశాలు వృథా అయిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేసేందుకు ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన పార్టీలు హాజరైన ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని కోరారు. చిట్‌ఫండ్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో తమ ఎంపీలను అరెస్టు చేసినందుకు, నోట్ల రద్దుకు నిరసనగా తృణమూల్ ఈ సమావేశానికి గైర్హాజరైంది. నోట్ల రద్దుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల్లో మొదటి రెండు రోజులు తాము గైర్హాజరు కానున్నట్లు లోక్‌సభలో తృణమూల్ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ చెప్పారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని కోరారని ఆయన తెలిపారు. దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై ప్రభావం చూపేందుకే ముందస్తుగా బడ్జెట్ సమావేశాలు పెట్టారన్న విపక్షాల ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. దీనిపై సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఇప్పటికే తీర్పునిచ్చాయని అన్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా, దేశం అభివృద్ధి చెందేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముందస్తు సమావేశాలు సరికాదు: ఆజాద్ సమావేశానికి ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి 2012లో తలెత్తినపుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసిందని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రా లకు సంబంధించి బడ్జెట్లో వరాలు ప్రకటిం చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండో దశ బడ్జెట్ సమావేశాలకు ముందు కూడా మరో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నోట్ల రద్దుపై చర్చ సాగాలి: ఏచూరి పెద్దనోట్ల రద్దుపై తొలి దశ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు రోజులపాటు చర్చ సాగించాలని ప్రభుత్వాన్ని తాము కోరినట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెట్టడం అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సమావేశాల్లోనే పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. -
ఈసీది విచిత్ర నిర్ణయం: ఏచూరి
భువనేశ్వర్: ఎన్నికలకు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఎన్నికలసంఘం(ఈసీ) ఓకే చెప్పడం విచిత్రంగా ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల ప్రయోజనాలను మినహాయించి బడ్జెట్‌ను తయారుచేశారనడం ఆశ్చర్యంగా ఉందని ఏచూరి వ్యాఖ్యానించారు. ఐటీ మినహాయింపు పరిధిని పెంచడం, సన్నకారు రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ లాంటి వాటి నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలపై ప్రభావం ఉండదనడం విచిత్రంగా ఉందన్నారు. గతంలో 2012లో ఇలాంటి పరిస్థితే వచ్చినపుడు గత ప్రభుత్వం బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిందని, ఇప్పుడూ వాయిదావేయాల్సిందేనని చెప్పారు. సాధారణ బడ్జెట్ ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో వామపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థులుగా బరిలోకి దింపుతాయన్నారు. బుల్లెట్, స్పీడ్ రైళ్లకంటే ముందు మౌలికాంశాలపై రైల్వేశాఖ దృష్టిపెట్టాలని రైల్వేప్రమాదాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
నోట్ల రద్దుతో నల్లకుబేరులకే మేలు
దళిత హక్కుల సాధన సదస్సులో సీతారాం ఏచూరి ఎన్డీయే పాలనలో దళితులపై పెరిగిన దాడులు: సురవరం సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద నోట్ల రద్దు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజల డబ్బును బ్యాంకుల్లో జమ చేయించి వారిని ఆర్థికంగా దోపిడీ చేసింది.ఇబ్బందులు ఎదుర్కొంది సామా న్యులే. రూ.కోట్లలో రుణాలు ఎగవేసిన వారికి విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను ఇచ్చింది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆదివారం ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన జరిగిన దళితుల హక్కుల సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ట్రిపుల్ తలాఖ్‌కు చట్టబద్ధత కల్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తలాఖ్ ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి యూపీలో కూడా ఇస్తారు.’ అని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదాన్ని అంతమొందించినట్లు ప్రధాని చెబుతున్నా సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 30 మధ్యకాలంలో భారత సైనికుల మరణాల సంఖ్య రెట్టింపైందన్నారు. హెచ్‌సీయూలో రోహిత్ వేము ల ఆత్మహత్యకు కారణాలపై కమిటీ ఇచ్చిన నివేదికను గోప్యంగా ఉంచడంపై అంతర్య మేమిటని ప్రశ్నించారు. ‘ మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి గాంధీజీ లేని కొత్తనోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు చరఖా పట్టుకుని గాంధీలా అవతరించా లనుకుం టున్నారేమో, ప్రజల్లో నుంచి గాడ్సేలు పుట్టుకొస్తారు జాగ్రత్త.’ అంటూ హెచ్చరించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు డి.రాజా, నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్ప టికీ పాలనంతా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నే సాగుతోందని అంబేడ్కర్ మనవడు ప్రకాష్అంబేడ్కర్ ఆరోపించారు. ‘ఇటీ వల ఆర్ఎస్ఎస్ నేత ఒకరు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాని ప్రకటించారు. అధికా రం వారి చేతుల్లోనే ఉంది. పార్లమెంటు లో సంఖ్యా బలం కూడా ఉంది. ఇక ఆలస్య మెందుకు! రిజర్వేషన్లు రద్దు చేసి చూడం డి.ఆ తర్వాతేం జరుగుతుందో చూద్దాం’ అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి సీఎంని చేస్తానని ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందని, ఆ హామీ నిల బెట్టుకోలేకపోగా ఎస్సీ, ఎస్టీలకు కేటా యించిన నిధులను దారిమళ్లించి సాగు నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లిస్తోందని అన్నారు. -
‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐది కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐది కానే కాదని అన్నారు. అది ఒకే ఒక్క వ్యక్తి తీసుకొచ్చిన తుగ్లక్ ఫర్మానా అంటూ ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ ఇచ్చిందని, అందులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమేనని చెప్పిందని, ప్రభుత్వం ఏం చెబితే అదే చేయాలని తమను ఆదేశించినట్లు ఆర్బీఐ అందులో పేర్కొందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందునుంచే వామపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ కు సీపీఎం షాక్
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యక్తిగత అవినీతి ఆరోపణలపై ఇతర విపక్షాల మద్దతు కూడగట్టాలకున్న కాంగ్రెస్ పార్టీకి సీపీఎం షాక్ ఇచ్చింది. మంగళవారం ప్రతిపక్ష పార్టీలతో సంయుక్తంగా నిర్వహించనున్న విలేకరుల సమావేశానికి తాము హాజరుకావడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హాజరైతే 16 విపక్ష పార్టీలు విలేకరుల సమావేశానికి రావని వెల్లడించారు. కాంగ్రెస్ సరిగా వ్యూహాలు రచించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఉమ్మడి విలేకరుల సమవేశానికి వెళ్లాలా, వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని మమతా బెనర్జీ వెల్లడించారు. రేపు జరగనున్న విలేకరుల సమావేశానికి ఏయే పార్టీలు హాజరవుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
పార్లమెంట్లో సేమ్ సీన్!
ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిష్టంభన - మిగిలింది ఇక రెండు రోజులే! న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింది. కార్యకలాపాలు ఈ చివరి మూడు రోజులైనా(డిసెంబర్ 16తో ముగుస్తాయి) సజావుగా సాగుతాయన్న ఆశ తొలిరోజే నీరుగారింది. రాజ్యసభలో మాత్రం వికలాంగుల హక్కుల బిల్లు ఆమోదం విషయంలో అధికార పక్ష విపక్షాల మధ్య కాసేపు సయోధ్య సాధ్యమైంది. ఆ బిల్లుకు సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, బీఎస్పీ చీఫ్ మాయావతి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ నిర్ద్వంద్వంగా మద్దతిచ్చారు. స్వల్ప చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఆ వెంటనే.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణల అంశంపై మళ్లీ గందరగోళం ప్రారంభమై వాయిదాకు దారితీసింది. లోక్‌సభలో నోట్ల రద్దుకు కిరణ్ రిజిజు అవినీతి అంశం తోడై సభా కార్యక్రమాల ప్రతిష్టంభన బుధవారం కూడా నిరాటంకంగా కొనసాగింది. రాజ్యసభలో.. వికలాంగుల బిల్లు ఆమోదం సమయంలో మినహా సభలో నిరసనలు, నినాదాలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ లేవనెత్తడానికి ప్రయత్నించగా.. డిప్యూటీ చైర్మన్ కురియన్ అడ్డుకుని నిబంధనలకు అనుగుణంగా సాగాలని సూచించారు. దాంతో, విపక్ష, అధికార పక్ష సభ్యులు పరస్పరం విమర్శలతో కేకలు, నినాదాలు ప్రారంభించారు. గందరగోళం మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. తుపానుతో దెబ్బతిన్న తమిళనాడుకు సత్వరమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో.. పేదలకు అనుకూలించే నోట్ల రద్దు నిర్ణయాన్ని విఫలం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం లోక్‌సభలో దుయ్యబట్టింది. తమ నేత ఖర్గేకు అవకాశం ఇవ్వకుండా.. అగస్టా స్కామ్ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేడీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్‌కు అవకాశం ఇవ్వడంపై స్పీకర్ సుమ్రితా మహాజన్‌పై కాంగ్రెస్ చీఫ్ సోనియా సహా ఆ పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఆ సమయంలో.. ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు రద్దయిన పాత నోట్ల మార్పిడికి కమిషన్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తను మంత్రి అనంత్‌కుమార్ ప్రస్తావించడంతో.. విపక్షాల ఆగ్రహం మరింత పెరిగింది. గందరగోళం నడుమ సభ గురువారానికి వాయిదా పండింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ.. తదితరులు సభకు హాజరయ్యారు. కాగా,పార్లమెంటు పూర్తిగా స్తంభించిపోయిందని, అక్కడ ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు కొనసాగడం లేదని ఒక తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్తోందని బీజేడీ ఎంపీ బీ మెహతాబ్ రాసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ సుమిత్ర అన్నారు. మాజీ ఉద్యోగులకు ఆధార్ తప్పనిసరి ప్రతిపాదన లేదు.. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పింఛన్ పొందడానికి ఆధార్‌ను తప్పనిసరిచేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో చెప్పారు. దివ్యాంగులపై వివక్ష చూపితే జైలే! బిల్లుకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ: ఇకపై దివ్యాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. రెండేళ్ల జైలుశిక్ష అనుభవిం చడంతోపాటు రూ. 5 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దివ్యాంగుల హక్కుల బిల్లు–2014ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. దివ్యాంగులకు భద్రత కల్పించి వారి హక్కులను కాపాడ్డానికి రూపొందించిన ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దివ్యాంగులపై వివక్ష చూపితే ఆర్నెళ్ల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలున్నాయి. కొన్ని కులాలను ఎస్సీ జాబితా నుంచి ఎస్టీలోకి మార్చడానికి, ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చడానికి ఉద్దేశించిన బిల్లు లోక్‌సభకు వచ్చింది. భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటర్తీ కమిటీకి ఎనిమిదోసారి పొడిగించారు. నివేదిక సమర్పణకు బడ్జెట్ సమావేశాల వరకు గడువిచ్చారు. భారీ ఓడరేవుల బిల్లుకు కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: ఓడరేవులు సమర్థవంతంగా పని చేసేందుకు ఉద్దేశించిన భారీ ఓడరేవుల అథారిటీ బిల్లు–2016కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెద్ద ఓడరేవుల ట్రస్ట్‌ల చట్టం–1963 స్థానంలో ఈ బిల్లును తెచ్చింది. బుధవారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ బిల్లుకు పచ్చజెండా ఊపింది. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై మోదీ సమీక్ష జరిపారు. -
భ్రమలు కల్పించినందునే మౌనం
- నోట్ల రద్దు తర్వాత అవినీతి మరింత పెరిగింది: ఏచూరి - నల్లధనాన్ని పేదలకు పంచిపెడతారని ప్రచారం చేశారు - అయితే ప్రజలు క్రమంగా వాస్తవాలు తెలుసుకుంటున్నారు సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల నిర్ణయం తర్వాత వెలుగులోకొచ్చే కోట్లాది రూపాయల నల్లధనాన్ని మోదీ ప్రభుత్వం పేదలకు పంచిపెడుతుందంటూ లేనిపోని భ్రమలు కల్పించినందువల్లే అనేక కష్టాలు పడుతున్నా ప్రజలు మౌనంగా ఉంటున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విశ్లేషించారు. అయితే జరుగుతున్న సంఘటనలను చూస్తున్న ప్రజలు క్రమంగా వాస్తవాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. మంగళ వారం విజయవాడలో జరిగిన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రారం భోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏచూరి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నకలీ కరెన్సీని, నల్లధనాన్ని వెలికి తీస్తానని, అవినీతిని అరికడతానని, దేశం లో ఉగ్రవాదమే లేకుండా చేస్తాన ని మోదీ చెప్పారని, అయితే అందులో ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చలామణీలో ఉండాల్సిన నోట్లకన్నా ఎక్కువ మొత్తం నోట్లు డిసెంబర్ 31 నాటికి బ్యాంకులకు జమ కాబోతున్నా యన్నారు. నల్లధనం వెలికితీసే ప్రయత్నంలో నకిలీ నోట్లు బ్యాంకుల్లో జమవడంద్వారా అవి వైట్‌మనీగా మార్చుకునే వెసులు కల్పించిన ట్టయిందన్నారు. పేదలు రూ.రెండువేలకోసం రోజుల తరబడి ఏటీఎంల వద్ద క్యూలలో నిలబడుతుంటే.. కొందరి వద్ద రూ.70–80 కోట్ల కొత్త కరెన్సీ పట్టుబడడం చూస్తుంటే.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అవినీతి స్థాయి మరింత పెరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా 111 మంది చనిపోయారని ఏచూరి గుర్తు చేశారు. దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరిగే మూడు ప్రధాన రంగాలైన వస్త్రాలు, తోలు, ఆభరణాల రంగాల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. మోదీ పార్లమెంట్‌కు వస్తే కదా.. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడనీయట్లేదని మోదీ ఆరోపిస్తున్నారని, అసలు ఆయన పార్లమెంట్‌కు వస్తేగా తాము మాట్లాడనీయకపోవడానికి? అని ఏచూరి అన్నారు. రాజ్యసభలో రెండు రోజులపాటు ఈ అంశంపై చర్చ జరిగితే ప్రధాని గంటసేపు కూర్చొనిÐð వెళ్లిపోయారని.. తర్వాత రాలేదని తెలిపారు. అమెరికాతో రక్షణ ఒప్పందం చేసుకోవడం, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో మోదీ మన దేశాన్ని అమెరికా జూనియర్‌గా తీర్చిదిద్దుతున్నారని ఏచూరి ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీనియర్ నాయకులు పాటూరి రామయ్య, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. పేదల్ని కష్టపెడుతూ క్యాష్‌లెస్ లావాదేవీలా? దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరగడం వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది విదేశీ బహుళజాతి సంస్థ లే తప్ప పేదలకు ఏం లాభం ఉంటుం దని ఏచూరి ధ్వజమెత్తారు. దేశంలో చిల్లర వ్యాపారుల్ని దెబ్బతీయడానికి రిటైల్ వాణిజ్యంలో ఎఫ్‌డీఐలను పోత్స హించాలన్న ప్రయత్నాలను కమ్యూని స్టు పార్టీలు గతంలో అడ్డుకుంటే, అలాంటి సంస్థలు ఈ కామర్స్ పేరుతో ఆన్లైన్ వ్యాపారం మొదలు పెట్టాయని.. నగదు రహిత లావాదేవీల వల్ల ఇప్పుడలాంటి సంస్థలే బాగుపడ బోతున్నాయని చెప్పారు. నగదురహిత లావాదేవీలపై అవగాహనుండి, అందరూ చదువుకున్న వారుండే అమెరికాలోనే 48 శాతం నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. అలాంటిది మనదేశంలో ఇంతమంది పేదప్రజల్ని కష్టపెడుతూ నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడం అవసరమా? అని ఏచూరి ప్రశ్నించారు. -
బసవపున్నయ్య ప్రపంచ నేత: ఏచూరి
హైదరాబాద్: మాకినేని బసవపున్నయ్య ప్రపంచ కమ్యూనిస్టు నేత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మంగళవారం చిక్కడపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఏచూరి ప్రసంగించారు. హోచిమిన్, స్టాలిన్, ఫిడెల్‌క్యాస్ట్రో వంటి దేశాధినేతలతో బసవపున్నయ్యకు దగ్గరి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరితో మంద కృష్ణ భేటీ
వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు సముఖత చూపుతున్న తరుణంతో.. తదుపరి తమకు మద్దతు ఇవ్వాలని ఏచూరిని కోరినట్టు మంద కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్‌కుమార్‌తో మంద కృష్ణ సమావేశమై వర్గీకణకు మద్దతివ్వాలని కోరారు. ఆరెకటిక కులాన్ని ఎస్సీలో చేర్చండి: ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరెకటిక పోరాట సమితి బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చారని, అరుుతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీ-డీలో ఉన్నారని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.సుధాకర్ తెలిపారు. -
క్యాస్ట్రో ఎప్పటికీ విప్లవవీరుడుగా నిలిచిపొతాడు
-
‘అసలు ప్రధాని ప్లాన్ ఏమిటి?’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి గురువారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ నగదు రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. టెక్స్టైల్స్, ప్రభుత్వం రంగాల్లోని 3.19కోట్ల మంది ఉద్యోగులు జీతాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దును ప్రకటించిన తర్వాత వరుసగా మరో 16 కొత్త నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. అసలు తాను ఏం చేయాలనుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క మాట కూడా చెప్పకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వాళ్ల సొంత డబ్బును కూడా అవసరాలకోసం ఉపయోగించుకోలేకపోతున్నారని బ్యాంకుల నుంచి తీసుకోలేకపోతున్నారని అన్నారు. -
‘అసలు ప్రధాని ప్లాన్ ఏమిటి?’
-
రూ. 2 వేల నోటుతో మరింత అవినీతి: ఏచూరి
-
రూ. 2 వేల నోటుతో మరింత అవినీతి: ఏచూరి
కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిందని, దాంతో అవినీతి తగ్గడం కాకుండా మరింత ఎక్కువవుతుందని సీపీఎం అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో బుధవారం మధ్యాహ్నం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. అసోంలో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ టీ కార్మికులకు మినహాయింపు ఇచ్చారని, ఇతర ప్రాంతాల్లో ఇది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం స్వీడన్లో మాత్రమే పూర్తిగా నగదు రహిత వ్యవస్థ ఉందని, అక్కడ నూటికి నూరుశాతం ఇంటర్నెట్ విస్తృతి ఉంది కాబట్టి అందరూ తమ ఫోన్లు, ఐ ప్యాడ్ల సాయంతో చెల్లింపులు చేస్తారని.. కానీ మన దేశంలో అంత విస్తృతి ఎక్కడ ఉందని అడిగారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరినీ కరెన్సీ వాడొద్దని, అన్నిచోట్లా కార్డులే వాడాలని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని అన్నారు. 86 శాతం నగదును రద్దుచేసి.. కేవలం 14 శాతం నగదుపైనే వ్యవస్థ నడవాలంటున్నారని చెప్పారు. ధాన్యం ధర గణనీయంగా పడిపోయిందని, లక్షలాది ట్రక్కులు జాతీయ రహదారిపైనే ఉండిపోయాయని సీతారాం ఏచూరి అన్నారు. దేశం వెలుపల 90 శాతం నల్లధనం ఉందని ప్రధానమంత్రి చెప్పారని, దాన్ని వెనక్కి తీసుకొచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్కరి అకౌంటులో రూ. 15 లక్షలు వేస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం 6 శాతం బ్లాక్‌మనీ మాత్రమే నగదు రూపంలో ఉందని, మిగిలినదంతా పెట్టుబడులు, వ్యాపారాల రూపంలోనే ఉందని తెలిపారు. రైతులకు కచ్చితంగా ఉపశమనం కల్పించాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. రైతులు తమ పంటలను కూడా అమ్ముకోలేకపోతున్నారన్నారు. -
యూపీ ఎన్నికల కోసమే పెద్ద నోట్ల రద్దు
-
ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు
-
ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదనీ, ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలన్నారు. -
ప్యాకేజీతో భ్రమలు కల్పిస్తున్నారు
- ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదు - మీడియాతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో పదేపదే డిమాండ్ చేశాం. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదు. ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారు. ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. గతంలో మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలి. ఎందుకు హామీని నిలబెట్టుకోవడం లేదో కేంద్రం సమాధానం చెప్పడంలో విఫలమవుతోంది. విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా అమలుకు గ్యారంటీ ఏంటని నేను ప్రశ్నించినప్పుడు వెంకయ్య నాయుడు లేచి అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు..హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వకపోవడంపై కేంద్రం ఉద్దేశం అర్థం కావడం లేదు. కేంద్రం వైఖరిని ప్రజలు గుర్తిస్తారు..’ అని పేర్కొన్నారు. సీపీఎంతో కలిసి పనిచేసే సంకేతాలను పవన్ కల్యాణ్ ఇచ్చారని మీడియా ప్రస్తావించగా ‘కలిసి పనిచేయాలనుకోవడం మంచిదే. ఎంతమంది కలిసొస్తే అంతమంచిది. పవన్ కల్యాణ్ మాతో కలిసి పనిచేయడంపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది..’ అని పేర్కొన్నారు. -
మోదీ నేతృత్వంలో చతుర్ముఖ ప్రభుత్వం
* అమెరికా అనుకూల విధానాలు.. మతోన్మాద ధోరణులతో నష్టం * సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనంలో సీతారాం ఏచూరి సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో చ తుర్ముఖ ప్రభుత్వం సాగుతోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక, విదేశాంగ విధానాలతో పాటు మతోన్మాద, నిరంకుశ-ఆధిపత్య ధోరణులతో కూడిన నాలుగు ముఖాల పాలన ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద మోదీ సుదీర్ఘ ప్రసంగంలో దేశంలో నేటి పరిస్థితులు, సమస్యలు.. వాటి పరిష్కారం గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదన్నారు. మంగళవారం సుందరయ్య కళానిలయం వద్ద మూడురోజుల సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనం సమావేశాల ప్రారంభం సందర్భంగా సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. అమలవీరుల స్థూపం వద్ద ఏచూరితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి ప్రతిపాదించారు. ఆ ప్రసంగం వాస్తవానికి భిన్నం... సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ... ‘ఎర్రకోటపై ప్రసంగంలో మోదీ... రిఫార్మ్, ఫెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (ఆర్పీటీ) అంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఇంగ్లిషులో ఆర్పీటీ అంటే రిపీట్ అని అర్థం. రెండేళ్లుగా మోదీ అదే పని చేస్తున్నారు. ప్రజలపై ఆర్థిక భారం పెద్దఎత్తున పెరగబోతుండగా, వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఆయన ప్రసంగం ఉంది. కశ్మీర్ భారత్ అంతర్గత అంశమన్న మోదీ.. పాక్ అంతర్భాగమైన బెలూచిస్తాన్ పై ప్రస్తావించి మన సమస్యలో ఇతర దేశాలు జోక్యం చేసుకొనే అవకాశమిచ్చారు. దేశంలో మతోన్మాద ఘర్షణలతో సామాజిక ఐక్యతను దెబ్బతీసి మత విభజన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అన్నారు. అభివృద్ధి ఎక్కడ? బీజేపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధి జాడ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ మాటలను బట్టి స్పష్టమైందన్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రమై రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను తీవ్రం చేయడం ద్వారానే కేంద్రంపై ఒత్తిడిని తీసుకురాగలమన్నారు. ఇందుకోసం లెఫ్ట్,ప్రజాతంత్ర, అభ్యుదయ, సామాజిక శక్తులను కూడగట్టి ఐక్యంగా ముందుకు సాగాలని ఏచూరి పిలుపునిచ్చారు. నయీమ్ అక్రమాలపై విచారణ చేయాలి నయీమ్ ఆగడాలు, అక్రమాలు, వెనుక నుంచి వాటిని ప్రేరేపించిన వారిని బయట పెట్టేందుకు సిట్ చాలదని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని సీపీఎం ప్లీనం ఆమోదించింది. పోలీసులు, ప్రభుత్వ సహకారం లేకుండా నయీమ్ ఇన్ని దుర్మార్గాలు చేయగలిగేవాడు కాదని పార్టీ నేత జూలకంటి అన్నారు. అతను ఆక్రమించిన ఆస్తులను సొంతదారులకు అప్పగించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానాన్ని ప్లీనం ఆమోదించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక న్యాయసాధనకు వామపక్ష, ప్రజాస్వామిక, సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా వామపక్షాలు ఐక్యంగా చొరవ చూపాలి’’ అని పిలుపునిచ్చింది. అన్ని శక్తులూ ఏకం కావాలి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆశించినట్టు లేదని, భవిష్యత్ కూడా ఆశాజనకంగా కనబడడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష, ప్రజాతంత్ర, జస్టిస్ చంద్రకుమార్, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సామాజిక శక్తులు కలసి కొత్త ఆలోచనలతో మార్పునకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనంలో ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపింది. నేడు టీఆర్ఎస్ హయాంలో కదిలితే కాల్పులు, మెదిలితే లాఠీచార్జీ చేస్తున్నారు’ అన్నారు. -
పాక్ విషయాల్లో మన జోక్యం ఎందుకు?
హైదరాబాద్: బలూచిస్తాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. పాకిస్తాన్ అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా బలూచిస్తాన్, జిల్జిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వల్ల అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని, వారికి మద్దతుగా మాట్లాడినందుకు తనకు వారు కృతజ్ఞతలు తెలిపారని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలు సరికాదని ఏచూరి అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే అది మతపరమైన వివాదాలకు తావిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పార్లమెంటులో వర్గీకరణపై ప్రశ్నిస్తాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వర్గీకరణకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అణగారిన వ ర్గాల అభ్యున్నతి కోసమే అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఒక కులమే దోచుకోవడం అన్యాయమని, వర్గీకరించుకొని రిజర్వేషన్లను పంచుకోవాలని అన్నారు. విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు ఆ హామీని అమలు చేయాలన్నారు. స్వార్థపరులే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని.. అంబేడ్కర్ వాదులు వర్గీకరణకు సహకరిస్తారని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు కె.కె.ప్రసాద్ మాట్లాడుతూ వర్గీకరణతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు లభిస్తుందన్నారు. -
చెప్పేదొకటి.. చేసేదొకటి..
మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వ తీరుపై తమ్మినేని ధ్వజం సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చే స్తున్న పనులకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతులకు.. కేంద్ర భూసేకరణ చట్టం-2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉందన్నారు. కేంద్ర భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి జీవో 123 ప్రకారమే బలవంతంగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాల ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వ్యవహరిస్తున్న తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రైతులను ఆందోళనల్లో పాల్గొనకుండా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారని, ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసు రాజ్యమా, ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మంగళవారం ఎంబీ భవన్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సందర్భంగా పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, సున్నం రాజయ్య, బి.వెంకట్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోందని, భూసేకరణ సమస్యపై కదిలేందుకు సన్నద్ధత కనబడుతోందని ఒక ప్రశ్నకు తమ్మినేని బదులిచ్చారు. రాష్ర్టవ్యాప్తంగా భూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 26న ఇందిరాపార్కు వద్ద భూనిర్వాసితుల రాష్ట్రవ్యాప్త మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటించిందన్నారు. ఆగస్టులో పార్టీ ప్లీనం సమావేశాలు ఆగస్టు 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పార్టీ ప్రత్యేక ప్లీనం సమావేశాలకు ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నాయకులు రామచంద్ర పిళ్లై, బీవీ రాఘవులు హాజ రవుతారు. కోల్‌కతాలో జరిగిన అఖిల భారత ప్లీనంలో పార్టీ నిర్మాణంపై నిర్ణయాలు చేసినట్లు తమ్మినేని తెలిపారు. పార్టీ నిర్మాణ లోపాలు,వాటి సవరణకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిం చారన్నారు. -
ప్రారంభమైన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం
హైదరాబాద్ : సీపీఎం కేంద్రకార్యాలయంలో పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి అధ్యక్షతన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాణిక్ సర్కార్, పి. విజయన్ తదితరులు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు... నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన... జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. -
'అందుకే బీజేపీ ఆ ఒక్క సీటు గెలిచింది'
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల యూడీఎఫ్‌ను కేరళ ఓటర్లు తిరస్కరించారు. కేరళ అభివృద్ధికి ఎల్డీఎఫ్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ ఓట్లు కొన్ని బీజేపీకి బదిలీ అవ్వడం వల్ల ఒక సీటు గెలిచింది. పశ్చిమ బెంగాల్లో మా పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటాం. తమిళనాడులో డబ్బు కీలక పాత్ర పోషించింది. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశాయి. అస్సాంలో మరో సెక్యులర్ ప్రత్యామ్నాయం లేక బీజేపీ గెలిచింది. 15 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది’ అని ఏచూరి పేర్కొన్నారు. -
బీజేపీది విశ్వాస ఘాతుకం
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదు: సీతారాం ఏచూరి సాక్షి,న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్.పి.చౌదరి పేర్కొనడం విశ్వాస ఘాతుకమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరి సోమవారం ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలపై ఇప్పుడు వెనక్కు పోతోందని ఆరోపించారు. విభజన బిల్లు పై చర్చ జరిగే సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలకు ప్రతిపాదిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఉండాల్సిందేనని వాదించారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, విభజన వల్ల నష్టపోతున్న ఏపీని ఆదుకుంటుందని వెంకయ్య రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు. విభజన జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమే లేదని వాదించడం బీజేపీ నాయకులకు సరికాదన్నారు.