‘దక్షిణ భారతంలో కరువు పెరిగిపోయింది’ | siataram echury slams bjp government | Sakshi
Sakshi News home page

‘దక్షిణ భారతంలో కరువు పెరిగిపోయింది’

Published Wed, May 10 2017 3:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

siataram echury slams bjp government

విజయవాడ: నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో నిరుద్యోగం పెరగడంతో పాటు దక్షిణ భారతంలో కరువు కూడా పెరిగిపోయిందని సీపీఎం అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులను అదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రతి ఏటా 12 వేల మందికి పైగా రైతులు అత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
 
వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై ఈ నెల 12న ఎన్నికల సంఘం అఖిలపక్షం మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పేపర్ ట్రైల్ అధారంగానే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీలకు  బాండ్ల పేరుతో చందాలు ఇస్తున్నారు...ఇది పొలిటికల్ పార్టీ కరప్షన్గా మారే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ లో డబ్బు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరతామన్నారు. కాశ్మీర్లో పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకోవడానికి మా సలహాలు ప్రభుత్వానికి వివరిస్తామని తెలిపారు. దేశంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.
 
ఏపీలో రాజధానికి ప్రచార అర్బాటమే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీని వీడే పరిస్ధితి లేదన్నారు. ప్రత్యేక హోదా పై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది..ఇప్పుడు మాట తప్పితే పార్లమెంట్ కు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. దేశంలో నార్త్, సౌత్ భావాలు ఉండకూడదన్నారు. నార్త్ వల్ల సౌత్ కి సౌత్ వల్ల నార్త్‌కి ఇబ్బందులుంటే మాట్లాడుకోవాలే తప్ప విభజించి చూడకూడదన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు చర్చిస్తున్నాయని భవిష్యత్ ఎలా ఉంటుందో చూద్దామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement