Currency
-
ఓ సిపాయీ... తెలుసుకొనవోయీ!
భాష తెలియని దేశంలో సైనికుడైనా సామాన్యుడే. కొత్త నేలపై కుదురుకోవటం యుద్ధం చేసినంత పని! భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారాలకు అలవాటు పడాలి. సంస్కృతులకు సర్దుకుపోవాలి. సంప్రదాయాల కత్తుల వంతెనపై ఒద్దికగా నడవాలి. నడవడికను బుద్ధిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా, కరెన్సీని అర్థం చేసుకోవాలి, బేరాలాడాలి. అత్యవసరంలో ప్రాథమిక చికిత్సా, అకాల పరిస్థితుల ముందుచూపూ ఉండాలి. ఇవన్నీ సైనికులకు ప్రభుత్వాలు చెప్పి పంపవు. ‘వెళ్లాక తెలుస్తుందిలే’ అని బదలీ పత్రాలు ఇచ్చేస్తాయి. అయితే, వెళ్లాక తెలుసుకోవటం కాదు, ‘తెలుసుకునే వెళ్లండి’ అంటూ నూటపాతికేళ్ల క్రితమే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ సిగరెట్ కంపెనీ భారత్ వెళ్లే బ్రిటన్ సైనికుల కోసం హ్యాండ్‌బుక్‌ను ప్రచురించటం విశేషమే!‘వైల్డ్ ఉడ్బైన్’ బ్రాండు సిగరెట్లను ఉత్పత్తి చేస్తుండే 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటన్ పొగాకు కంపెనీ ‘డబ్లు్య.డి. అండ్ హెచ్.వో. విల్స్’ తాత్కాలిక విధి నిర్వహణలపై భారతదేశానికి తరలివెళ్లే బ్రిటిష్ సైనికుల కోసం మార్గదర్శకాలతో కూడిన ఒక కరదీపికను ప్రచురించినట్లుంది! మన దేశంలో ఆ సైనికుల అపరిచిత స్థానిక వ్యవహారాలను సులభతరం చేయటానికి ఉద్దేశించిన ఆ పుస్తక ప్రతి ఒకటి గతవారం లండన్ , పోర్టోబెల్లో రోడ్డులోని పురాతన వస్తువుల దుకాణంలో నా కంట పడింది. చదువుతుంటే ఎంత సరదాగా అనిపించిందో! భారతదేశం ఎంత పెద్దదో చెప్పడంతో ఆ కర పుస్తకం మొదలౌతుంది. ‘‘ఇండియాలో ఇరవై గ్రేట్ బ్రిటన్లను పట్టించ వచ్చు’’ అని చెబుతూ, ఆనాటి మన కరెన్సీని, బ్రిటన్ కరెన్సీతో పోల్చి వాటి సమాన విలువలను తెలియబరిచింది. ఆ ప్రకారం:1 అణా 1 పెన్నీకి సమానం. 11 అణాలు 1 షిల్లింగ్కి సమానం (రూపాయికి 16 అణాలు అనే లెక్క ఆధారంగా). 1 రూపాయి 1 షిల్లింగు 5 పెన్నీలకు సమానం. 13 రూపాయల 6 అణాలు ఒక పౌండుకు సమానం. పుస్తకంలోని ఎక్కువ భాగంలో, సైనికుడు తెలుసుకోవలసిన అవసరం ఉన్న ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను, వాటిని ఉచ్చరించే విధానాన్ని పొందుపరచటం జరిగింది. ఉదాహరణకు, ఎలుక Chew-ha (చూహా), రోడ్ Rust-er (రస్తా), సముద్రం Some-under (సమందర్), చొక్కా Come-ease (కమీజ్), చక్కెర Chee-knee (చీనీ), నీళ్లు Par-knee (పానీ), మహిళ Awe-rut (ఔరత్) అని ఇచ్చారు. (ఈ హిందీ మాటలను పలికే విధానమంతా ఆంగ్ల పదాలకు దగ్గరగా ఉండేలా ఇచ్చారు.)సైనికుడు స్థానికులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు రోజువారీ వాడుక కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా ఆ కర పుస్తకంలో ఉన్నాయి. మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనుకున్న సైనికుడు "Kid-her jar-ta high?" (కిదర్ జాతా హై?) అంటాడు; అతనికేదైనా అర్థం కాకపోతే, "Tomb key-ah bowl-ta high?" (తుమ్ క్యా బోల్తా హై) అంటాడు. అతను పోస్టాఫీస్ కోసం వెదుకుతుంటే "Dark-car-ner kid-her high?" (డాక్ ఘర్ కిదర్ హై) అని అడుగుతాడు. దుకాణందారు ఎక్కువ రేటు చెప్పినట్లనిస్తే "Darm jars-tea high" (దర్ జాస్తి హై) అంటాడు. బ్రిటిష్ సైనికుల కోసం ముద్రించిన హ్యాండ్‌బుక్ కవరు పేజీ ఇప్పుడు బ్రిటన్ సైనికులు అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేయాలని పుస్తకం చెప్పిందో చూద్దాం. జ్వరాలను తగ్గించుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే కచ్చితమైన సూచనలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. ‘‘అనేక కారణాల ఫలితంగా జ్వరం అనేది వస్తుంది. లవణాలు, ఆముదపు నూనె మోతాదులను ఎప్ప టికప్పుడు తీసుకోవటం ద్వారా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. వీలైనంత వరకు మాట్లాడకుండా, మౌనంగా ఉండండి. ముఖంపైన, తల పైన చల్లటి తడి గుడ్డను వేసుకుని పడుకోండి. ఒకవేళ మలేరియా సోకి, రోగికి చలిపుడుతూ, వణుకు వస్తున్నట్లయితే వేడి టీ చుక్కల్ని తాగిస్తే చమటలు పడతాయి. వణుకు తగ్గేవరకు రోగికి దుప్పటి కప్పి ఉంచాలి’’ అని ఆ కరదీపిక సూచించింది. పాము కాట్లకు బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యేవారని అని పిస్తోంది. అందుక్కూడా పుస్తకంలో ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి. విషపూరితమైన సర్పం కాటేస్తే ‘‘తక్షణం, తీక్షణమైన చికిత్స’’ అవసరం అవుతుంది. అంటే, రక్త ప్రసరణను ఆపటానికి కాటుకు పైభాగాన వస్త్రపు నాడాతో గట్టిగా బిగించి కట్టాలన్న మాట. ఆ తర్వాత, పెదవులపై లేదా నోటిలో పుండ్లు, కోతలు, లేదా పొక్కులు లేని వ్యక్తి ఆ గాయాన్ని పీల్చి, విషాన్ని ఉమ్మేయాలి. ఆ తర్వాత, గాయంపై బలమైన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణాన్ని, (లేదా, ముడి స్ఫటికాలను) అద్దాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో సిర, లేదా ధమని ఉన్నందువల్ల కోత పెట్టటానికి వీలు లేకుంటే కాటు వేసిన చోట నిప్పు కణికను, మండుతున్న సిగరెట్‌ను, కాల్చిన తాడు కొసను తాకించాలి. ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన సంగతి: ‘‘ఇవన్నీ చేసేలోగా చేతిలో ఏదైనా బలమైన ఉద్దీపన ఉంటే (బ్రాందీ, విస్కీ మొదలు అమ్మోనియం కార్బోనేట్ కలిసిన శాల్ ఓలటైల్ వరకు ఏదైనా) కొంచెం తాగించాలి. అలా పదిహేను నిముషాలకొకసారి చేయాలి’’ అని ఉండటం! బహుశా, మద్యంతో నరాలను శాంతపరచటమే దీని ఉద్దేశం కావచ్చు. ఈ హ్యాండ్‌బుక్‌లో... ‘తగని పనులు – చిట్కాలు’ అనే ఒక కీలకమైన విభాగం కూడా ఉంది. ‘‘మండే సూర్యరశ్మిలో తలపై టోపీ లేకుండా బయటికి వెళ్లొద్దు – అది వేసవైనా, చలికాలమైనా’’. ‘‘సూర్యాస్తమయానికి ముందు వైన్, బీరు, ఆల్కహాల్ సేవించ వద్దు – (సేవించే అవకాశం వచ్చినప్పటికీ!). ‘‘కొన్ని ఆకులను,ముఖ్యంగా వేపాకులను మీరు అడవిలో ఉన్నప్పుడు మీ టోపీ కింద ఉంచుకోవటం మీ తలను చల్లగా ఉంచుతుంది’’. ‘‘ఫ్లానల్ షర్టును వేసుకోవటం మరచిపోవద్దు. శీతాకాలమైనా, వేసవి కాలమైనా అది మీకు సురక్షితమైన కవచం’’. ఫ్లానల్ వేడిమిని గ్రహించదు. (ఫ్లాన ల్లో చుట్టిన ఐసు ముక్కలు త్వరగా కరగకపోవటమే ఇందుకు రుజువు)’’ అని పుస్తకంలో రాసి ఉంది. బ్రిటిష్ సైనికుడు ఇండియాలో ఆడగలిగే అనేక ఆటల వివరాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘‘హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, పోలో, గోల్ఫ్, స్విమ్మింగ్, రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రోయింగ్, షూటింగ్, పిగ్–స్టిక్కింగ్, గేమ్ హంటింగ్ వంటివి... భారతదేశం అందించే ఆసక్తికరమైన ఆటలు, క్రీడల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇండియాకు కొట్టిన పిండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ముగింపులో ఆ పుస్తకం ఇచ్చిన సలహా నా పొట్టను చెక్కలు చేసింది. ‘‘చివరిగా ఒక మాట. ఎట్టి పరిస్థితిలోనూ ఇండి యాలో మీరు మీ ప్రశాంతతను, ఉత్సాహాన్ని, నిద్రను కోల్పోకండి. బ్రిటన్‌పై బెంగ పెట్టుకోకండి. సమయం త్వరగానే గడిచిపోతుంది. అంతేకాదు, సౌతాంప్టన్ హార్బరులో మీకు వీడ్కోలు పలుకుతూ ఊగిన చేతి రుమాలు గతించిపోయిన కాలంలా అనిపిస్తుంది. అన్ని టినీ మించి ఇండియా మంచి దేశం.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రూ.2000 నోట్లు.. ఇంకా రూ.6,691 కోట్లు
ఉపసంహరించిన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకూ 98.12 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని, ఇంకా రూ.6,691 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. 2023 మే 19న ఆర్బీఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా 2024 డిసెంబర్ 31న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తాజాగా తెలిపింది. 98.12 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకునే లేదా మార్చుకునే సదుపాయాన్ని 2023 అక్టోబర్ 7 వరకు ఆర్బీఐ అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. 2023 అక్టోబరు 9 నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి.అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు. -
రూపాయి భారీ పతనం.. రికార్డు కనిష్టం నమోదు
డాలరుతో రూపాయి మారక విలువ శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల జీవితకాల ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 85.80కి చేరుకుంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ గట్టి ప్రయత్నాలతో కొంత మేర పుంజుకుని రికార్డు స్థాయికి 23 పైసలు దిగువన 85.50 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లలో డాలర్ చెల్లింపులను కొనసాగించడం డాలరు కొరతను పెంచింది. దీంతో నెలాఖరు చెల్లింపుల కోసం దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన సెంటిమెంట్ ఉన్నప్పటికీ, విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి పతనమైనట్లు దిగుమతిదారులు చెబుతున్నారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ వద్ద రూ.85.31 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి 53 పైసలు పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి రూ.85.80కి పడిపోయింది. చివరకు డాలరుతో పోలిస్తే రూ.85.50 (తాత్కాలిక) వద్ద సెషన్‌ను ముగించింది. దాని మునుపటి ముగింపు స్థాయి రూ.85.27 నుండి 23 పైసలు నష్టపోయింది.గత రెండు వారాల్లో రూపాయి దాదాపు ప్రతిరోజూ కొత్త కనిష్ట స్థాయిలను తాకుతోంది. గత రెండు సెషన్లలో 13 పైసలు క్షీణించిన తర్వాత గురువారం డాలర్‌తో పోలిస్తే 12 పైసలు పతనమై 85.27 వద్దకు చేరుకుంది. రూపాయి అంతకుముందు 2023 ఫిబ్రవరి 2న 68 పైసలు పతనమైంది. -
పార్లమెంట్‌లోకి నోట్ల కట్ట తీసుకెళ్లకూడదా?
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సమగ్ర దర్యాప్తు-కుట్ర అని పరస్పరం ఆరోపించుకున్నాయవి. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా కూడా పడింది. కానీ, ఒక చట్ట సభ్యుడు నిజంగా అలా నోట్ల కట్టతో సభకు వెళ్లకూడదా?.. ఇది రాజకీయ రాద్ధాంతం చేయాల్సిన అంశమా?.. అసలు అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమా?పార్లమెంట్ అంటే చట్ట సభ్యులు కొలువుదీరే భవనం. కాబట్టి.. హైసెక్యూరిటీ జోన్ అని అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అయితే పార్లమెంట్లో భాగమైన రాజ్యసభలో.. అదీ ఓ సభ్యుడి సీటు దగ్గర డబ్బు దొరకడం కచ్చితంగా తీవ్రమైన అంశమే!. పార్లమెంట్‌లోకి ఏది పడితే అది తీసుకురావడానికి ఆస్కారం ఉందన్న సంకేతాలను పంపిచింది ఈ ఘటన.‘‘ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటుచేయాలి. సభ్యులు వాటికి తాళాలు వేసుకుంటే.. తాము ఇంటికెళ్లాక సీట్ల వద్ద ఇతరులెవరూ గంజాయి, కరెన్సీ నోట్లు పెట్టకుండా నివారించొచ్చు’’.. నోట్ల కట్ట దొరికిన సీటు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కామెంట్అసలేం జరిగిందంటే..శుక్రవారం రాజ్యసభ నడుస్తుండగా.. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించా. ఈ విషయాన్ని సభకు తెలియజేయడం నా బాధ్యత’’ అన్నారు.#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7— ANI (@ANI) December 6, 2024రాజకీయ దుమారంతో..చైర్మన్ చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్‌ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నోట్ల కట్ట వ్యవహారంపై దర్యాప్తునకు తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకూడదనే కుట్రలో ఇది భాగంకావొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అయితే..ఖర్గే స్పందనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఏ సీటు వద్ద కరెన్సీ దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో.. ఛైర్మన్ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోట్ల కట్టను సభకు తీసుకురావడం చాలా తీవ్రమైన అంశమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ భంగం కలిగించిందంటూ మరో సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సభ్యులెవరూ శాంతించకపోవడంతో.. సభ వాయిదా పడింది. అరుదుగా జరిగిన ఘటన.. అందునా రాజకీయ దుమారం రేగడంతో మీడియా కూడా అంతే హైలైట్ చేసి చూపించింది.మరి ఇంత వీకా?అయితే సదరు సభ్యుడు ఆరోపిస్తున్నట్లు ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే!. గత అనుభవాల దృష్ట్యా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. సరిగ్గా కిందటి ఏడాది ఇదే నెలలో లోక్‌సభలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. సెషన్ జరుగుతున్న టైంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకిన ఇద్దరు.. టియర్ గ్యాస్ షెల్స్‌తో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. కొందరు ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ నిలువరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. హైటెక్ హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక పాత పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు 2001లో జరిగిన ఉగ్రదాడి సంగతి సరేసరి.ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతా ఎవరి బాధ్యతో తెలుసా? మరోవైపు ఈ ఘటనతో పార్లమెంట్ ఔనత్యంపై ప్రజల్లోనూ పలు అనుమానాలు కలగొచ్చు. చట్ట సభల్లోనే సభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నమా? లేదంటే డబ్బుతో ప్రభావితం చేయాలనుకుంటున్నారా? లేకుంటే.. విపక్ష సభ్యుడి సీటు దగ్గరే దొరకడంలో ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వీటిని నివృత్తి చేయడానికైనా రాజ్యసభలో నోట్ల కట్ట బయటపడడంపై రాద్ధాంతం కాకుండా.. చర్చ జరగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం
-
సుంకం విధిస్తే దాన్ని మళ్లీ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీలోనే చెలిస్తారట సార్!
-
కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ప్రపంచంలో అత్యధిక విలువైన కరెన్సీ అంటే అంతా అమెరికన్ డాలర్ అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. ప్రపంచంలో అత్యధిక లావాదేవీలు డాలర్‌తోనే జరుగుతాయి. అక్టోబరు 7 నాటికి.. ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.84.కానీ, కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్ కొనాలంటే ఒకటి కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్. ఇది ఒక యూనిట్ సుమారు రూ.274. ఒక దీనార్ కొనాలంటే 3.26 డాలర్లు ఖర్చు పెట్టాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్‌ను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. ఈ కారకాలలో విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ డైనమిక్స్, ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే విధానాలు, దేశం మొత్తం ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. -
కరెన్సీ కాదు.. కలర్ జిరాక్స్!
బత్తలపల్లి: టెక్నాలజీ మహిమ..అంతా మాయ. కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇట్టే మోసం చేస్తున్నారు. తెలివిమీరిపోయిన కొందరు కేటుగాళ్లు... బత్తలపల్లిలోని చిరు వ్యాపారులకు టోకరా వేశారు. రూ.10 విలువైన వస్తువులు కొని రూ.200, రూ.500 నోట్లు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుని మరీ వెళ్లారు. ఆ నోట్లు తీసుకుని బ్యాంకులకు వెళ్లిన చిరువ్యాపారులు అవి కలర్ జిరాక్సు పేపర్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసాలు ఇటీవల బత్తలపల్లిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కూడలిలో ఆటోవాలాకు ఓ వ్యక్తి ఇలాగే కలర్ జిరాక్స్ నోటు ఇచ్చాడు. అలాగే జొన్నరొట్టెలు విక్రయించే వృద్ధురాలినీ ఓ ఆగంతకుడు ఇలాగే మోసం చేశాడు. కలర్ జిరాక్స్ నోట్ల బాధితుల్లో ఎక్కువగా చిరువ్యాపారులే ఉండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
పాడుబడిన బావిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
పిలిభిత్: ‘నోట్ల వర్షం కురిసింది’ అనే మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. అయితే ఇంతకీ నోట్ల వర్షం కురుస్తుందా? కురిస్తే ఎలా ఉంటుంది? దీనిని తెలుసుకోవాలంటూ యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే..యూపీలోని పిలిభిత్‌లో ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు నోట్లు రావడం మొదలైంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ నోట్లను దక్కించుకునేందుకు వేలాది మంది బావి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ నోట్లను దక్కించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. దీనికి కారణం ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.పిలిభిత్‌లోని బిసల్పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. ఈ వార్త తెలిసిన వారంతా పరుగు పరుగున ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే ఆ నోట్లన్నీ చినిగిపోయిన స్థితిలో ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఆ బావిలోకి నోట్లు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదు. ఈ ఉదంతంపై బిసల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు? -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
రూ.10.. పరేషాన్..!
నెన్నెల: మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం గగనంగా మారింది. దీంతో అటు వ్యాపారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ కొనుగోళ్లకు 1, 2, 5, 10 రూపాయల నాణేలు గతంలో చాలా చెలామణిలో ఉండేవి. ధరల పెరుగుదల కారణంగా 1, 2, 5 రూపాయల నాణేలు ఉన్నా 5, 10 రూపాయల నాణేల వినియోగం పెరి గింది. ప్రస్తుతం ఆయా నాణేలతోపాటు రూ.10 నో ట్ల చెలామణి కూడా భారీగా తగ్గింది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10కి మూడు అని చెబుతున్నారు. దీంతో కి రాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, బస్సు, ఆటో చార్జీల్లో రూ.10 కరెన్సీనోటుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తు తం రూ.10 నోటు మార్కెట్లో అందుబాటులో లేక వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు.ఆన్లైన్ చెల్లింపులుకరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తు వు కొనుగోలు చేయాలన్నా డిజిటల్ చెల్లింపులు అనే పరిస్థితి నెలకొంది. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో, చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులకు అనుమతిస్తున్నారు. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదా రులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండడం గమనార్హం. ఎక్కడ ఆగిందో..?రూ.10 నోటు మార్కెట్లో చెలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వినియోగదారులు చిరు వ్యాపారు ల వద్ద వస్తువులు కొనుగోలు చేసినప్పడు రూ.100నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు గా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదా రుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. చిన్నమొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నోట్ల కొరత వాస్తవమేరూ.10 నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వు బ్యాంకు నుంచి రావడం లేదు. రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10 నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి. – గోపికృష్ణ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఆవుడం -
రూ.6,66,66,666.66 తో అమ్మవారికి అలంకరణ.. చూపు తిప్పుకోలేరు!
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.6,66,66,666.66 కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని, పూజా మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి విచ్చేశారు.యాదగిరిగుట్ట కిటకిటయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని సుమారు 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.32,50,448 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అవసరాలకు తగ్గ ప్రణాళిక.. ఆర్బీఐ
న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్నిర్మించాలని ఆర్బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సర్వైలెన్స్ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది.కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహ్వానించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది.గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్ పీసుల నుంచి 132.35 బిలియన్ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్బీఐ టెండర్ డాక్యుమెంట్ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్బీఐ ఈవోఐలకు ఆహ్వానం పలికింది. -
భవిష్యత్ కరెన్సీ అవసరాలకు తగ్గ ప్రణాళిక
న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్నిర్మించాలని ఆర్బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సరై్వలెన్స్ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది. కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహా్వనించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్ పీసుల నుంచి 132.35 బిలియన్ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్బీఐ టెండర్ డాక్యుమెంట్ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్బీఐ ఈవోఐలకు ఆహా్వనం పలికింది. -
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం. -
డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు: జమీల్ అహ్మద్
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్తాన్ నెమ్మదిగా కోలుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మెరుగైన భద్రత, హోలోగ్రామ్ ఫీచర్ల కోసం ఇప్పటికే ఉన్న అన్ని కరెన్సీ నోట్లను రీడిజైన్ చేస్తూనే పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోటుతో ప్రయోగాలు చేస్తుంది.ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెనేట్ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రస్తుతమున్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేయనున్నట్లు తెలిపారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను డిసెంబర్లో విడుదల చేస్తామని ఆయన అన్నారు.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పాత నోట్లు ఐదు సంవత్సరాలు చెలామణిలో ఉంటాయని చెబుతున్నారు. మొదట్లో ప్రజల కోసం ఒక డినామినేషన్ పాలిమర్ ప్లాస్టిక్ నోట్‌ను విడుదల చేస్తామని.. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి ఇతర డినామినేషన్లలో ప్లాస్టిక్ కరెన్సీని అందిస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.పాలిమర్ ప్లాస్టిక్ నోట్లు కొత్త కాదుపాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఇప్పటికే 40 దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్లను డూప్లికేట్ చేయడం అసాధ్యం. నిజానికి పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను 1998లో ఆస్ట్రేలియా మొదటిసారి ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఇతర దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు పాకిస్తాన్ చేరనుంది. అయితే ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. -
గాల్లోకి కరెన్సీ నోట్లను విసురుతూ.. యూట్యూబర్ ఓవరాక్షన్
సాక్షి,హైదరాబాద్: తెలుగు యూట్యూబర్ హర్ష మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. గురువారం కూకట్ పల్లిలో రద్దీగా ఉండే ప్రాంతంలో డబ్బును గాల్లోకి విసిరి రీల్స్ చేశాడు. నోట్లు వెదజల్లడంతో వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాల్లోకి నోట్లు విసురుతున్న రీల్స్ వైరల్ కావడంపై ప్రజలు, నెటిజన్లు సదరు యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా యూట్యూబర్ హర్ష ఇప్పటికే పలు మార్లు డబ్బుల్ని గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టంట్లు చేయడం,విసిరిన డబ్బుల్ని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించడంపై వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మరోసారి డబ్బుల్ని గాల్లోకి విసరడంతో ట్రాఫిక్‌జామ్ కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in HyderabadCyberabad police will you please take action?A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024 -
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్‌లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్‌కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కిర్గిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్‌లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్‌కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్‌లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్‌తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్‌కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్‌లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్ మెడిసిన్ కేరాఫ్ కిర్గిస్తాన్కిర్గిస్తాన్లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్ డాక్టర్ల టీచింగ్ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్‌కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్‌లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్‌లోనే కోచింగ్ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. -
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
నేపాల్ భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలు కలిగి ఉన్న మ్యాప్‌తో కొత్త రూ.100 కరెన్సీ నోటును ముద్రించాలని నిర్ణయించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి.వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ రూ.100 నోట్‌పై ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్ వివరణఅసలు వివాదం ఏమిటి..?లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది. -
ఎన్నికల ఎఫెక్ట్: గుట్టలుగా కరెన్సీ కట్టలు.. కిలోల్లో బంగారం, వెండి..
సాక్షి, బెంగళూరు: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. #WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm — ANI (@ANI) April 8, 2024 అయితే, వీటిని హవాలా మార్గంలో తీసుకువచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. ఇక, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను రెండు దశల్లో ఏప్రిల్ 26న, మే నాలుగో తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.