డెహ్రాడూన్: భారతీయులు, సహా విదేశీయులు కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఓ మహిళ ఓవరాక్షన్‌తో ఆలయం గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఘటనపై ఆలయ కమిటీ సీరియస్ అయ్యింది.
వివరాల ప్రకారం.. పవిత్ర కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు వెదజల్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లింది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు.
అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలో, వీడియోలు తీయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇలా తాజాగా వీడియో బయటకు రావడం, గర్భగుడిలో ఇలా కరెన్సీ నోట్లు చల్లడంపై బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు. అయితే, కరెన్సీ నోట్లు చల్లిన మహిళ ఎవరనేది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
#KedarnathDham : A woman showers currency notes on the Shivling inside the Kedarnath mandir. Look at her way of throwing money, is she in a dance bar or attending a Baraat, such people are disgrace to Sanatan dharm and for showoff can stoop any low.
— Amitabh Chaudhary (@MithilaWaala) June 20, 2023
FIR has been filed. pic.twitter.com/VEPUJrq3Lb
ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ!
Comments
Please login to add a commentAdd a comment