Kedarnath Temple
-
కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్‌బాబు (ఫొటోలు)
-
కేదార్‌నాథ్‌లో 228 కేజీల గోల్డ్ స్కామ్: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
ముంబై: కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందన్నారు జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి. సుమారు 228 కిలోల బంగారం మాయమైంది దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.కాగా, అవిముక్తేశ్వరానంద ఈరోజు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో థాక్రే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేకు అతిపెద్ద ద్రోహం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే త్వరలో తిరిగి ముఖ్యమంత్రి పదవికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్దవ్‌కు కొందరు నమ్మించి మోసం చేశారు. ప్రజలు అన్నీ గమనించాలి అంటూ కామెంట్స్ చేశారు. VIDEO | Swami Avimukteshwaranand Saraswati, Shankaracharya of Jyotirmath was at 'Matoshree' in Mumbai on request of Shiv Sena (UBT) Chief Uddhav Thackeray. Here's what he said interacting with the media. "We follow Hindu religion. We believe in 'Punya' and 'Paap'. 'Vishwasghat'… pic.twitter.com/AZCJaDfHhi— Press Trust of India (@PTI_News) July 15, 2024 ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు ప్రణామాలు చేశారని, తమ దగ్గరికి వచ్చినవాళ్లను దీవించడం తమ విధానమని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు శత్రువు కాదన్నారు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపుతామని అన్నారు.మరోవైపు.. కేదార్‌నాథ్‌లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు. కేదార్నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించలేం. పన్నెండు జ్యోతిర్లింగాలు నిర్వచించబడ్డాయి. దాని స్థానం స్థిరంగా ఉంది. అది తప్పు అని కామెంట్స్ చేశారు. -
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. -
గిరికీలు కొట్టిన హెలికాప్టర్
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్‌నాథ్‌కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ వేగంగా గిరికీలు కొట్టింది. హెలిప్యాడ్ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి, హెలిప్యాడ్ పక్కనే 100 మీటర్ల దూరంలోని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా కిందికి దిగారు. -
వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. భక్తులను కేదార్నాథ్ ధామ్‌కు తీసుకెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతికలోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనై భూమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. భక్తులను కేదార్‌ధామ్‌కు తీసుకువెళ్తున్న ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కేదార్నాథ్ ధామ్‌కు 100 మీటర్ల ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. Today morning at Kedarnath Helipad. Really superb handling. pic.twitter.com/oKMSwqIffR— Vaibhavi Limaye (@LimayeVaibhavi) May 24, 2024 ఈ సందర్బంగా హెలికాప్టర్ ఒడిదుడుకులకు లోనైంది. ఒకానొక సమయంలో హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. అనంతరం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమమంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భక్తులు కూడా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సందర్భంగా అది తమ మీద పడిపోతుందేమోనన్న భయంతో ఆలయం వద్ద ఉన్న భక్తులు పరుగు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #Kedarnath #KedarnathVideo #Chardhampic.twitter.com/eMJ5EPZUVn— Pahadi Voice (@HimalayanRoars) May 24, 2024 -
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రైవేట్ హెలికాప్టర్లో ఆయన అక్కడికి చేరుకున్నారు. ‘‘కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేయడం ఆనందంగా ఉంది. హర హర మహాదేవ్’’ అంటూ ఫేస్బుక్లో రాహుల్ పోస్టు చేశారు. ఆలయాన్ని దర్శించుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఆలయం ఉంది. -
Payal Rajput In Kedarnath Temple Pics: కేదార్నాథ్ క్షేత్రంలో పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం..
డెహ్రాడూన్: సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన సంఘటన ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ. కొద్దిరోజుల క్రితం విశాఖ ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల మెప్పు కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తనకు బాయ్ ఫ్రెండుకు తన ప్రేమను తెలియజేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెప్పు పొందడం సంగతి అటుంచితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో పిచ్చి పనులేంటని కామెంట్లు కూడా పోటెత్తాయి. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఆమెను ఏకిపారేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకు శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని న్నారు. ఇది కూడా చదవండి: టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు -
ఐదు నెలల కిందటే పెళ్లి.. కేదార్నాథ్ యాత్రకు వెళ్లి నవ వరుడి మృతి
ఐదు నెలల క్రితం జరిగిన వివాహానంతరం కోటి ఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవజంట భవిష్యత్తు గురించి ఎన్నో కలల కంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో నవ వరుడి ప్రాణాలు గాలిలో కలిసిపోగా నవవధువు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద వార్తతో రాజాం మండల పరిధిలోని బొద్దాం గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాక్షి, విజయనగరం: రాజాం సిటీ మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవిరావుకు, పట్టణ పరిధిలోని సారథికి చెందిన కల్యాణితో ఫిబ్రవరి 12న వివాహమైంది. రవిరావు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య కల్యాణితో జీవనం సాగిస్తున్నాడు. ఈ నవజంట వారం రోజుల క్రితం కేథారినాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరింది. యాత్ర జాలీగా సాగుతున్న సమయంలో శనివారం రాత్రి (తెల్లవారితే ఆదివారం) అక్కడ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ప్రయాణికులంతా గల్లంతయ్యారని తొలుత భావించారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూటీం బాధితులను రక్షించే క్రమంలో కల్యాణితోపాటు మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ముమ్మరగాలింపు చర్యలు చేపట్టిన తరువాత రవిరావు (29) మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబ సభ్యులంతా తగరపువలసలో జరుగుతున్న బాలసారె కార్యక్రమంలో ఉన్నారు. రవిరావు మృతి విషయం తెలుసుకున్న వీరంతా విషాదంలో మునిగిపోయారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అధికారుల ఆరా.. గ్రామానికి చెందిన రవిరావు దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదం బారిన పడిన విషయంపై తహసీల్దార్ ఎస్కే రాజు, ఆర్ఐ విద్యాసాగర్‌లు గ్రామానికి వచ్చి ఆరా తీశారు. రవిరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను కోరినట్లు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, సర్పంచ్ నక్క తవిటమ్మతో పాటు గ్రామస్తులు తెలిపారు. -
కేదార్నాథ్ ఆలయంలో ప్రపోజల్స్... యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్..
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రేమికురాలు విశాఖ ఫల్సంగే ఆ వీడియోను పోస్టు చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియోలో ప్రేమికురాలు విశాఖ ఫుల్సంగే తన ప్రియుడి ముందు మోకాలిపై కూర్చుంటుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన ఎల్లో కలర్లో దుస్తులు ధరించారు. ఆలయం బయట కేదార్నాథ్ మహాదేవునికి దండం పెట్టుకున్న తర్వాత ప్రియురాలు విశాఖ తన ప్రియునికి ప్రపోజ్ చేస్తుంది. అనంతరం ఇద్దరు కౌగిలించుకుంటారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి అవసరమా? అని ఫైరయ్యారు. 11,750 అడుగుల ఎత్తులో కష్టమైన యాత్రను పూర్తి చేసి ఇలా హగ్ చేసుకోవడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇందుకు భిన్నంగా ప్రమికులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మహాదేవుని సన్నిధిలో ప్రపోజ్ చేసుకున్నందుకు మెచ్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు.. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో కలిసి ఉంటామని ప్రామిస్ తీసుకోవడంలో తప్పు ఏముందని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: కుక్కను కారులోనే వదిలి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి.. -
కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి..
డెహ్రాడూన్: భారతీయులు, సహా విదేశీయులు కేదార్నాథ్ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఓ మహిళ ఓవరాక్షన్‌తో ఆలయం గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఘటనపై ఆలయ కమిటీ సీరియస్ అయ్యింది. వివరాల ప్రకారం.. పవిత్ర కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు వెదజల్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లింది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలో, వీడియోలు తీయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇలా తాజాగా వీడియో బయటకు రావడం, గర్భగుడిలో ఇలా కరెన్సీ నోట్లు చల్లడంపై బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు. అయితే, కరెన్సీ నోట్లు చల్లిన మహిళ ఎవరనేది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. #KedarnathDham : A woman showers currency notes on the Shivling inside the Kedarnath mandir. Look at her way of throwing money, is she in a dance bar or attending a Baraat, such people are disgrace to Sanatan dharm and for showoff can stoop any low. FIR has been filed. pic.twitter.com/VEPUJrq3Lb — Amitabh Chaudhary (@MithilaWaala) June 20, 2023 ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
-
దట్టమైన పొగమంచులో చిక్కుకున్న నటి శోభన.. వీడియో వైరల్
సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన పొగమంచులో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న ఆమె అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు కారణంగా నాకు జలుబు చేసింది. పైగా దట్టమైన పొగకారణంగా హెలికాప్టర్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం నేను దానికోసంమే ఎదురుచూస్తున్నా.మంచు పోయాక బయలు దేరతాను. పూర్తి వివరాలన్నీ అప్డేట్ చేస్తాను’ అని అన్నారు. ఇదంతా చెప్తుంటే తాను న్యూస్ రిపోర్టర్లా ఉన్నానంటూ నవ్వుతూ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. క్షేమంగా ఇంటికి చేరుకోండి.. హ్యాపీ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 90వ దశకంలో శోభన టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలందరి సరసన నటించారామె. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ప్రస్తుతం భరత నాట్యం ప్రదర్శనలతో పాటు క్లాసికల్ డ్యాన్స్‌లకు సంబంధించిన క్లాసులు చెప్తూ బిజీగా ఉంటున్నారు. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
కేదార్నాథ్ ఆలయాన్ని చుట్టుముట్టిన భారీ హిమపాతం: వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లోని పవిత్రక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం చుట్టూతా ఉన్న పర్వతాలపై భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి గ్లేసియర్ పరీవాహక ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనివల్ల రుద్రప్రయాగ్‌లో ఎలాంటి నష్టం జరగలేదని, ఈ తాము ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్‌లోని జాతీయ రహదారిని బ్లాక్ చేసిన కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం. ఈ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి తర్సాలి గ్రామ సమీపంలోకి దొర్లిపడ్డాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అంతేగాక మధ్య ఉష్ణమండల పశ్చిమాలలో ఒక ద్రోణి ఏర్పడిందని, ఇది పశ్చిమంగా కదలడంతో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఆ తదనంతరం ఈ ద్రోణి వాయువ్య భారతదేశం వైపుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #Avalanche in #Kedarnath #flood pic.twitter.com/sAgLU3TTJn — Amit Shukla (@amitshuklazee) September 23, 2022 (చదవండి: ఏరులై పారుతున్న రహదారులు..ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ) -
కేదార్నాథ్ గోడలకు బంగారు తాపడం వద్దు
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్‌తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు. -
ఈ అభివృద్ధి విధ్వంసానికి బాట
కేదార్‌నాథ్‌లో 2013 సంవత్సరం వరదల విలయతాండవం చోటుచేసుకున్న తర్వాత, 11 వేల అడుగుల కంటే ఎత్తులో ఉన్న పూడిపోయిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ జుయల్ ఆలయ పునర్మిర్మాణంపై తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణం, పెద్దమొత్తంలో సిమెంట్ లేక ఇనుమును ఉపయోగిస్తే కేదార్నాథ్ పరిసరాల్లో భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చెలరేగుతాయని హెచ్చరించారు. వేసవిలో మంచు కరిగేటప్పుడు భూ ఉపరితలానికి పైనున్న నేల కిందికి జారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కానీ పర్యావరణ హెచ్చరికలపై, శాస్త్రీయ వాదనలపై దృష్టి సారించడానికి బదులుగా ఎన్నికల్లో గెలుపు కోసం పరుగుపందెమే ఇప్పుడు ముఖ్యమవుతోంది. కేదార్‌నాథ్‌లో డాక్టర్ జుయల్, ఇతర నిపుణులు పర్యటనలు ప్రారంభిస్తున్నప్పుడు, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ కొండల చుట్టూ వెల్లువగా ప్రకృతి విపత్తుల ఘటనలు పెరుగుతూ వచ్చాయి. అక్కడ నిర్మాణపనులు పెరిగినప్పుడే విపత్తులు కూడా పెరగడం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. ఈ ఒక్క ఏడాదిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తుల కారణంగా 250 మంది ప్రజలు చనిపోయారు. పైగా ఇవి కలిగించిన ఆర్థిక నష్టాలు తక్కువేమీ కాదు. (చదవండి: ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!) కేదార్నాథ్ ప్రాంతంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టూ జాతీయ భద్రతతో, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. ఈ నెల మొదట్లో కేదార్నాథ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ‘పర్వతాల్లో నీళ్లు, పర్వతాల్లో యువత’ అనే పాత సామెతను ఉపయోగించారు. తన ప్రభుత్వం ఈ రెండింటినీ (నీరు, యువత) అభివృద్ధి పథకాలతో కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే జీవితాలను నిలబెట్టడానికి బదులుగా పర్వతాల్లోని నీరు వేగంగా నిర్మించిన డ్యాముల్లో ఇరుక్కుపోయి ఉంది. వరదల రూపంలో పదేపదే విపత్తులకు కారణమవుతోంది. రాష్ట్రంలో 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ, ఈ శతాబ్ది మూడోదశాబ్దం ఉత్తరాఖండ్‌దే అవుతుందనీ, గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చే పదేళ్లలోనే రాష్ట్రానికి పర్యాటకులు వెల్లువెత్తుతారనీ మోదీ ఘనంగా ప్రకటించారు. రాష్ట్రంలో అనేకమంది ప్రజలకు మతపరమైన, ప్రకృతిపరమైన పర్యాటకం ఒక్కటే ఏకైక ఆధారం అనేది నిజం. కానీ ఉత్తరాఖండ్‌లో ప్రోత్సహిస్తున్న ప్రణాళికలు కొంతమంది కాంట్రాక్టర్లకు, కంపెనీలకు మాత్రమే లబ్ధి కలిగిస్తాయి. వీటి నుంచి సామాన్య ప్రజానీకం పొందేది ఏమీ లేదు. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) పర్యావరణ నియమాలను నిర్లక్ష్యపర్చడం, విచక్షణారహితంగా అడవులను నరికేయడం కారణంగా ఈ యాత్రామార్గంలో నిర్మాణ పనులు తరుచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. చార్ధామ్ యాత్రా మార్గాన్ని అన్ని వాతావరణాల్లో పనిచేసే రహదారిగా పేర్కొన్నారు. కానీ నాణ్యతా లోపం వల్ల కట్టిన రహదారి ఎప్పుడో మాయమైపోయింది. నదీ ఉపరితలాలను ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు, పేలవమైన నగర నిర్వహణ వంటివి విపత్తులకు కారణాలు. ఢిల్లీ–మీరట్ హైవే లేదా ఉత్తరాఖండ్‌లో ముంబై–పుణే హైవే వంటి రహదారుల నిర్మాణం అన్ని వాతావరణాల్లో పనిచేసేవిధంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది పర్వత ప్రాంత భౌగోళికతకు దూరంగా లేదు. అందుకనే ప్రతి ఏటా ఈ రోడ్లు వరదల్లో కొట్టుకుపోతుంటాయి. ప్రజాధనం వృథా అయిపోతుంటుంది. పర్యావరణానికి మాత్రం కోలుకోలేని నష్టం జరుగుతుంటుంది. సరిహద్దు ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు కావాలి తప్ప వెడల్పాటి రహదారులు అవసరం లేదు. పైగా అత్యంత సున్నిత ప్రాంతాల్లో రహదారులను నిర్మించడమే కాకుండా, సొరంగాలు కూడా తవ్వడం మరీ ప్రమాదకరం. కేదార్‌నాథ్‌కి కేబుల్ కార్లలో నేరుగా చేరుకోవాలన్న ప్రధాని మోదీ ఆలోచన పర్యావరణ పరిరక్షణకు భిన్నంగా ఉంది. పైగా ఆధ్యాత్మిక యాత్రల స్ఫూర్తికి అది దూరంగా ఉంటుంది. కేదార్ మార్గ్ ప్రయాణంలో ప్రకృతి నిసర్గ సౌందర్యం నుంచి నడుచుకుంటూ పోతూ చివరి గమ్యాన్ని చేరుకున్నప్పుడు కఠిన ప్రయాణాన్ని అధిగమించిన భావన మనసు నిండా వ్యాపిస్తుంది. కానీ కేదారనాథ్‌లో ఇప్పుడు హెలికాప్టర్లు రొదపెడుతున్నాయి. న్యాయస్థానాల ఆంక్షలను ఈ హెలికాప్టర్లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి. నిరంతరం ఇవి పెట్టే రొద, శబ్దాలు కేదార్ రక్షిత లోయలోని పక్షులు, జంతువుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి. నడకదారిలో యాత్ర మెల్లగా సాగిపోతున్నప్పుడు యాత్రికులు అక్కడక్కడా కూర్చుంటూ మరింత ఎక్కువ సమయం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా గడిపేవారు. స్థానిక దుకాణదారులు, దాబా యజమానులు, టీ విక్రేతలు, వ్యాపారులు, సరకులు మోసే వారు, ఇంకా అనేకమంది లబ్ధి పొందేవారు. దీనికి భిన్నంగా హెలికాప్టర్లు, హైవే వల్ల కొన్ని ఎంచుకున్న కంపెనీలకు, ట్రావెల్ ఏజెంట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సదస్సు నుంచి తిరిగొచ్చిన ప్రధాని పర్యావరణ హిత జీవన శైలి అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ప్రకృతిని వట్టి నినాదాల ద్వారా మాత్రమే కాపాడలేమని పదేపదే రుజువవుతోంది. ప్రకృతిని ఛిన్నాభిన్నం చేసే ప్రతి ఒక్క ప్రయత్నమూ, నేటి, రేపటి తరాలను బలి తీసుకుంటుందని మరవరాదు. – హృదయేష్ జోషీ రచయిత, సంపాదకుడు -
కేదార్ నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
-
కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
నౌషెరా(జమ్మూకశ్మీర్): మారుతున్న ప్రపంచం, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మన సైనిక సామర్థ్యం మెరుగుపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. సైనికులను త్వరగా చేరవేయడానికి లద్దాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా, జైసల్మేర్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల దాకా అనుసంధానం పెంచుతున్నట్లు వెల్లడించారు. మోదీ గురువారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవాలని కోరుకుంటారని అన్నారు. తాను ప్రధానమంత్రిగా ఇక్కడికి రాలేదని, సైనికుల కుటుంబ సభ్యుడిగానే వచ్చానని చెప్పారు. 2016 సెప్టెంబర్ 29న ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో ఇక్కడి బ్రిగేడ్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. సర్టికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా ఈ ప్రాంతంలో శాంతిని భగ్నం చేసేందుకు ముష్కరులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వారికి మన సైన్యం దీటుగా జవాబిచ్చిందని కొనియాడారు. భరతమాతకు మన సైనికులే సురక్షా కవచమని అన్నారు. సైనిక బలగాల త్యాగాల వల్ల దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారని, సంతోషంగా పండుlగలు జరుపుకుంటున్నారని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ఆ రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శత్రు శిబిరాలను నేటమట్టం చేసేందుకు వెళ్లిన మన సైన్యం క్షేమంగా వెనక్కి వచ్చేసిందన్న సమాచారం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశానని అన్నారు. భారత వీర జవాన్లు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అనుకున్నది సాధించి వచ్చారని పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్లో 65 శాతం నిధులను మనదేశంలోనే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశీయంగా సమకూర్చుకోవాల్సిన 200 రక్షణ ఉత్పత్తుల జాబితా సిద్ధమవుతోందని వివరించారు. విజయ దశమి సందర్భంగా 7 కొత్త డిఫెన్స్ కంపెనీలను ప్రారంభించామని చెప్పారు. రక్షణ సంబంధిత అంకుర పరిశ్రమల(స్టార్టప్స్) స్థాపనకు ముందుకు రావాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. దీనివల్ల రక్షణ రంగంలో ఎగుమతిదారుగా భారత్ మరింత బలోపేతం అవుతుందన్నారు. సైన్యంలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. నౌషెరాలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న చిత్రాలను ప్రధాని ట్విట్టర్లో షేర్ చేశారు. 130 కోట్ల మంది భారతీయుల సమ్మిళిత ఆత్మకు, దేశ వైవిధ్యానికి మన సైనిక దళాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ వీరుల గడ్డ డెహ్రాడూన్/కేదార్నాథ్: ప్రస్తుత శతాబ్దిలో మూడో దశాబ్దం ఉత్తరాఖండ్ రాష్ట్రానిదేనని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగబోతోందని, ఇతర ప్రాంతాలకు వలసలకు అడ్డుకట్ట పడడం ఖాయమని చెప్పారు. ఆయన శుక్రవారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధినిప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మత గురువులను, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రాచీన వైభవాన్ని మళ్లీ సాక్షాత్కరింపజేసేందుకు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతోందని, కాశీలో విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనులు ముగింపునకు వచ్చాయని వివరించారు. కేదార్‌నాథ్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన పునర్నిర్మాణ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ వీరుల గడ్డ అని కొనియాడారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం ఇక్కడి ప్రజలు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతారని అన్నారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. Uttarakhand | Prime Minister Narendra Modi offers prayers at Kedarnath temple pic.twitter.com/ApNYwczb94 — ANI (@ANI) November 5, 2021 Uttarakhand | PM Modi arrives at Kedarnath, to offer prayers at the shrine and also inaugurate Adi Shankaracharya Samadhi shortly pic.twitter.com/Lt1JGtxXFQ — ANI (@ANI) November 5, 2021 చదవండి: (పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) -
5న కేదార్‌నాథ్‌కు ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొంది. అనంతరం రూ.130 కోట్లతో నిర్మించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.180 కోట్లతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపింది. 2013లో సంభవించిన వరదల్లో ఆదిశంకరాచార్య సమాధి ధ్వంసమైందని పీఎంవో పేర్కొంది. -
ఈసీకి మోదీ కృతజ్ఞతలు
బద్రీనాథ్/కేదార్నాథ్/న్యూఢిల్లీ: తన ఉత్తరాఖండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం బద్రీనాథ్ వెళ్లేముందు ఆయన కేదార్‌నాథ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నిశ్శబ్ద సమయం’లో మోదీ చేపట్టిన పర్యటనపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మీడియా పెద్దయెత్తున ప్రచారం కల్పించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. కాగా కేదార్‌నాథ్‌లో ధ్యానం సందర్భంగా తానేమీ కోరుకోలేదని, అది తన నైజం కాదని మోదీ చెప్పారు. డిమాండ్ చేయడం కాకుండా ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఆయన అన్నారు. దేవుడు భారతదేశాన్నే కాకుండా యావత్ మానవాళి సంతోషంగా ఉండేలా దీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నానన్నారు. పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టమని, 2013లో వరుస వరదలతో కుదేలైన కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బద్రీనాథ్‌లో 20 నిమిషాలు పూజ శనివారం కేదార్నాథ్ సందర్శించిన మోదీ సుమారు 20 గంటల పాటు అక్కడ గడిపిన తర్వాత ఆదివారం వైమానిక దళం హెలికాప్టర్లో బద్రీనాథ్ చేరుకున్నారు. ఆలయానికి సమీపంలోని ఐఏఎఫ్ హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయన తర్వాత రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయం లోపల గర్భగుడిలో పూజలు జరిపారు. ప్రధాని సుమారు 20 నిమిషాలు పూజలో పాల్గొన్నారని బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ చీఫ్ మోహన్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. ఆలయ పూజారులు ఆయనకు భోజ చెట్టు ఆకులపై రూపొందించిన గ్రీటింగ్ కార్డును అందజేసినట్లు తెలిపారు. కాగా కొద్దిసేపు ఆలయం ఆవరణలో కలియతిరిగిన మోదీ భక్తులకు, స్థానికులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆలయం వద్ద వేచి చూస్తున్న యాత్రికులను ప్రధాని కలిసారని వివరించారు. కాగా అతిథి గృహంలో ప్రధానితో భేటీ అయిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయం ఆవరణాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఓ వినతిపత్రం అందజేశారు. మీడియా కవరేజీపై టీఎంసీ ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడటం అనైతికమని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఆయన సందర్శనకు మీడియా కవరేజీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రీన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాని పర్యటనకు మీడియా కవరేజీ ఇవ్వడం కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
కేదార్‌నాథ్‌లో మోదీ
కేదార్నాథ్(ఉత్తరాఖండ్): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శనివారం ఉదయమే డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ బూడిద రంగు సంప్రదాయ దుస్తులు ధరించారు. హిమాచల్ సంప్రదాయ టోపీ పెట్టుకుని కాషాయరంగు కండువాను నడుముకు చుట్టుకున్నారు. సుమారు అర్ధగంట పాటు ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మందాకినీ నదీ సమీపంలో ఉన్న ఈ 11,755 అడుగుల ఎత్తుగల కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం కేదార్‌నాథ్‌లో 2013 జూన్‌లో వచ్చిన భారీ వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ పనులను సమీక్షించారు. ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ఆ పనుల గురించి ప్రధానికి వివరించారు. మధ్యాహ్నం సమయంలో కాసేపు ధ్యానం చేసుకోడానికి ఆలయం సమీపంలోని ‘ధ్యాన్ కుతియా’అనే గుహకు వెళ్లారు. ప్రధాని రాత్రికి అక్కడే గడిపి ఆదివారం ఉదయం బద్రీనాథ్‌కి వెళ్తారు. బద్రీనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఇక రెండేళ్లలో మోదీ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ మాట్లాడుతూ ‘ఆధ్యాత్మిక సందర్శన కోసం మాత్రమే ప్రధాని ఇక్కడికి వచ్చారు’అని తెలిపారు. ప్రధాని రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. ప్రధాని పూజల నేపథ్యంలో భక్తులెవరినీ ఆలయం సమీపంలోకి కూడా అనుమతించలేదని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మంగేశ్ చెప్పారు. బద్రీనాథ్ ఆలయం సందర్శన అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటనకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమల్లోనే ఉందని ప్రధాని కార్యాలయానికి సూచించింది. -
జేదార్నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
-
కేదార్‌నాథ్‌లో మోదీ
-
కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ పూజలు
సిమ్లా : ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. కాగా, 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు. తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్ బోర్డర్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్ బోర్డర్లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. -
ఈ పూజలు ఎవరి కోసం?
‘నాకు దైవ భక్తి ఎక్కువ. వీలు కుదురినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళుతుంటాను’ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు అనుష్క. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ టెంపుల్‌ను సందర్శించారామె. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనుష్క. కేదార్‌నాథ్‌తో పాటు గంగోత్రి, బద్రీనాథ్ కూడా సందర్శించనున్నారట. సన్నిహితుల కోసం మొక్కుకుని గుడికి వెళుతుంటానని అనుష్క ఈ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుడికి వెళ్లి తన కోసం తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని కూడా అన్నారు. మరి.. ఇప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్లారో? లేక జస్ట్ ఖాళీ దొరికింది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందని వెళ్లారో? -
కేదార్‌పురికి శ్రీకారం.
-
కేదార్‌పురికి శ్రీకారం
సాక్షి,డెహ్రాడూన్: ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కేదార్‌పురి టౌన్‌షిప్‌ను ప్రారంభించి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. దివాళీ తర్వాత రోజు కేదార్‌నాథ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని కోట్లాది ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం మరువలేనిదన్నారు. 2022 నాటికి నవ భారత్‌ను ఆవిష్కరించేందుకు తాను పునరంకితమయ్యానన్నారు. ఈ బృహత్తర యజ్ఞానికి భోలే బాబా ఆశీస్సులు కోరానన్నారు. 2013 వరదల్లో దెబ్బతిన్న పలు నిర్మాణాల పునరుద్ధరణకు ఈ సందర్భంగా ప్రధాని శంకుస్ధాపనలు చేశారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరాచార్య సమాధి పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్ధాపన చేశారు.అంతకుముందు డెహ్రాడూన్ చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, సీఎం రావత్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. -
దళాలతో దివాళీ
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దీపావళి వేడుకలను సైనిక బలగాల మధ్య జరుపుకుంటారని సమాచారం. రెండు మూడు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను సందర్శించే ప్రధాని దివాళీ వేడుకలను అక్కడే సైనిక దళాలతో జరుపుకుంటారని తెలిసింది. చైనా సరిహద్దులో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), భారత సైనిక దళాలతో కలిసి . ప్రధాని మోదీ ఈసారి దివాళీ వేడుకల్లో పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దివాళీ వేడుకల అనంతరం మరుసటి రోజు ప్రధాని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి టెంపుల ప్రహరీ గోడ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 2013 తరహాలో ఆలయాన్ని వరదలు ముంచెత్తకుండా ప్రొటెక్షన్ వాల్‌ను నిర్మించిన విషయం తెలసిందే.అయితే ప్రధాని పర్యటనపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని కేథార్నాథ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. -
కేదరనాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ
-
2017 చూడాలని ఉంది
ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు. 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్నాథ్ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి. కేదార్నాథ్ చేరుకోవాలంటే.. విమానమార్గంలో డెహ్రడూన్ (ఉత్తరాఖండ్) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్∙315, కేదార్నాథ్ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్ నుంచి కేదార్నాథ్ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్ అయి తెలుసుకోవచ్చు. 2 మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్ రిజర్వ్‌లో హోటల్ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్ స్పాట్ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్ పార్క్‌గా ప్రకటించింది. http://rtdc.tourism.rajasthan.gov.in 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు. చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్ సీయింగ్ టూర్స్‌కి హిమాచల్ ప్రదేశ్ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్ (రాజస్థాన్)కు దేశంలో అత్యంత రొమాంటిక్ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్ ఆఫ్ మేవార్’, ‘వెనీస్ ఆఫ్ ద ఈస్ట్’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్ లేక్, ఉదయ్‌సాగర్ లేక్, జైస్మండ్ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. http://rtdc.tourism.rajasthan.gov.in/ 5 ప్రకృతిప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్పోర్ట్ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్ బకులా రిన్పోచే’ ఎయిర్పోర్ట్ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు. నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు. 32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్ రూట్లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్ గ్రామం ఓవర్వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. 6 గుజరాత్లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్ గార్డెన్లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్ టెంపుల్ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్ టెంపుల్ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం. ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్ మెహసనాలో ఉంది. Mail: info@gujarattourism.com 7 ఇది దేశంలోనే అతి పెద్ద జైన్ టెంపుల్. భావనగర్‌కు (గుజరాత్) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు. రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు 9493350099 ఫోన్ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com 8 స్నేహబృందంతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లాలంటే మధేఘాట్ సరైన ప్లేస్. పశ్చిమlపూణె (మహారాష్ట్ర) రాయగడ్ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్. భటఘర్ డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్ ఉంటుంది. రాయగడ్ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్ ఘాట్ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్ టేక్’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్ ఘల్ కి మహాబలేశ్వర్ రోడ్ మీదుగా వెళితే ముంబయ్–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు. 9 పశ్చిమ బెంగాల్లో టెర్రకోట టెంపుల్స్ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్ టెంపుల్ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక విద్యాలయాలకు పెట్టింది పేరు. బిష్ణుపూర్ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్పోర్ట్ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు: రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్ దర్వాజ, గడ్ దర్వాజ, దాల్‌మండల్ కమాన్, స్టోన్ చారియట్, నూతన్ మహల్, చిన్నమస్త టెంపుల్. 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్ ఛీఫ్తాన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్పోర్ట్ ఖజురహో. రైల్వేస్టేషన్ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్ మందిర్, షాహిద్‌స్మారక్ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్ ఉంది. www.mptourism.com----- 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్ లేక్. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం. కోయంబత్తూర్‌కి హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్ నుంచి ఎమరాల్డ్ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్ గార్డెన్, ఊటీ, రోజ్ గార్డెన్, లేక్ పార్ట్, ఊటీ లేక్, డీర్ పార్క్. 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్. సిక్కిమ్ వాసులు ఇక్కడ ‘పాంగ్ లహ్‌బ్సోల్’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ హెలీకాప్టర్ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్ నుంచి మే వరకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు బడ్జెట్ హోటల్స్ సదుపాయాలను పొందవచ్చు. మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్ అవ్వచ్చు. 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్ నేషనల్ పార్క్ లక్కమ్ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి. కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్. హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్ ఉంది. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్ హార్ట్ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి. -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభమవడంతో కేదార్నాథ్, యమునోత్రి దేవాలయాలను మంగళవారం నుంచి మూసివేశారు. ఈ క్షేత్రాల వద్ద హిమపాతం పెరుగుతూ ఉండడం, భక్తులు చేరుకోవడం కష్టతరమైన పని కావడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఉదయం 8 గంటలకు, యమునోత్రిని మధ్యాహ్నం 1.15 గంట లకు మూసివేశారు. ఆలయంలో పూజ సందర్భంగా నాసిక్ నుంచి తీసుకువచ్చిన వంద కిలోల విభూదిని శివలింగానికి పూశారు. శీతాకాలం వచ్చేనాటికి మంచు ఎక్కువగా కురవడం, మార్గం లేకపోవడంతో ఆలయాన్ని మూసేశారు. శీతాకాలం ముగిసే వరకూ కేదార్నాథేశ్వరుడి ప్రతిమను ఉకిమఠ్ పట్టణంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. చార్ధామ్ యాత్రలోని మరో పుణ్యక్షేత్రం గంగోత్రి సోమవారం మూతపడగా, మరో దేవాలయం బద్రీనాథ్‌ను ఈ నెల 18 నుంచి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
కేదార్‌నాథ్‌లో పూజలు పునఃప్రారంభం
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో భారీ వరదల కారణంగా మూతపడిన ప్రఖ్యాత కేదార్నాథ్ దేవాలయంలో 86 రోజుల తర్వాత బుధవారం పూజలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ పునరుద్ధరణ అనంతరం బుధవారం ఉదయం 7 గంటలకు శుభప్రదమైన ‘సర్వార్థ సిద్ధి యోగం’ సమయంలో వేదమంత్రాలు పఠిస్తూ పురోహితులతో కలసి గర్భగుడిలోకి ప్రవేశించిన ప్రధాన పూజారి రావల్ భీమ శంకర్ లింగ్ శివాచార్య ‘శుద్ధీకరణ’, ‘ప్రాయశ్చిత్తీకరణ’ చేసి పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, పలువురు మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణం కారణంగా రాలేకపోయారు. వరదల వల్ల ఉత్తరాఖండ్‌లో వేలాది మంది మృత్యువాత పడటం, ఒక్క కేదార్నాథ్ లోయలోనే 400 మంది వరకూ చనిపోవడం తెలిసిందే. ఆలయం సైతం శవాలదిబ్బగా మార డంతో పూజలు నిలిపేశారు. కేదార్‌నాథ్‌కు యాత్రికులను అనుమతించడంపై 30న నిర్ణయం తీసుకోనున్నారు. -
కేదారినాథ్ లో పూజలు పున:ప్రారంభం!
ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన కేదార్నాథ్ ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభం అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వరదలు ప్రఖ్యాత శైవక్షేత్రాన్నిఅతలాకుతలం చేయడమేగాక, వందలాది భక్తులు, స్థానికులను బలిగొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే పూజాధికాలకు దూరమైన కేదార్‌నాథ్‌లో మళ్లీ 86 రోజుల తర్వాత బుధవారం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి. పవిత్ర, పాపపరిహార కార్యక్రమాల అనంతరం పూజారులు, ఆలయ కమిటీ అధికారులతో కూడిన 24మంది సభ్యుల బృందం సమక్షంలో ప్రార్థనలు పునరుద్దరణ జరిగాయి. కాగా కేదార్నాథ్ ఆలయ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన కేబినెట్ సహచరులతో హాజరయ్యేందుకు బయల్దేరినా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో డెహ్రాడూన్లోనే నిలిచిపోవల్సి వచ్చింది. కాగా ఆలయంలో చాలారోజులు తర్వాత జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రార్థనలు జరుగుతున్నాయే తప్ప భక్తులు సందర్శించే స్థాయి పూజలు ఇవి కావని, వరదల ధాటికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు బాగుపరచాల్సి ఉందని అధికారులు తెలిపారు.