ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కేదార్‌పురి టౌన్‌షిప్‌ను ప్రారంభించి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. దివాళీ తర్వాత రోజు కేదార్‌నాథ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని కోట్లాది ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం మరువలేనిదన్నారు.