YouTuber Proposes To Her Boyfriend In Front Of Kedarnath Temple, Video Goes Viral - Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రపోజల్స్‌... యూట్యూబర్‌పై నెటిజన్స్‌ ఫైర్‌.. వీడియో వైరల్..

Published Tue, Jul 4 2023 9:57 AM | Last Updated on Tue, Jul 4 2023 10:14 AM

YouTuber Proposes To Her Partner In Front Of Kedarnath Temple - Sakshi

కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రేమికురాలు విశాఖ ఫల్‌సంగే ఆ వీడియోను పోస్టు చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 

ఈ వీడియోలో ప్రేమికురాలు విశాఖ ఫుల్‌సంగే తన ప్రియుడి ముందు మోకాలిపై కూర్చుంటుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన ఎల్లో కలర్‌లో దుస్తులు ధరించారు. ఆలయం బయట కేదార్‌నాథ్ మహాదేవునికి దండం పెట్టుకున్న తర్వాత ప్రియురాలు విశాఖ తన ప్రియునికి ప్రపోజ్ చేస్తుంది. అనంతరం ఇద్దరు కౌగిలించుకుంటారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. 

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి అవసరమా? అని ఫైరయ్యారు. 11,750 అడుగుల ఎత్తులో కష్టమైన యాత్రను పూర్తి చేసి ఇలా హగ్‌ చేసుకోవడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు ఇందుకు భిన్నంగా ప్రమికులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మహాదేవుని సన్నిధిలో ప్రపోజ్ చేసుకున్నందుకు మెచ్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు.. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో కలిసి ఉంటామని ప్రామిస్ తీసుకోవడంలో తప్పు ఏముందని కామెంట్ చేశారు.

ఇదీ చదవండి: కుక్కను కారులోనే వదిలి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి..

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement