Partner
-
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
వివాదంలో రాజ్‌తరుణ్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ (ఫోటోలు)
-
‘శని’ వారికి వ్యాపార భాగస్వామి.. లాభాలలో వాటా కూడా!
దేశంలో శని దేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ఒక ప్రత్యేకమైన శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు. ఇందుకోసం ఒక డాక్యుమెంట్ తయారు చేసి, శని దేవుని పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని వారు నమ్ముతారు. ఇప్పటి వరకు 1,500 మంది వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. ఈ ఆలయం ఖర్గోన్ జిల్లాలోని మోర్ఘడిలో శ్రీ సిద్ధ శని గజానన్ శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 21 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దేవుని విగ్రహం లేదు. శిల రూపంలో శనిదేవుడు ఇక్కడ కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చిన పలువురు వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారని ఆలయ పూజారి సందీప్ బార్వే తెలిపారు. వారు వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని శనిదేవునికి సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి, తమ వ్యాపారంలో పురోగతి కోసం శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు. ఇందుకోసం వారు ఒక దరఖాస్తును వారు నింపుతారు. దానిలో తన వ్యాపారంలో శని దేవుడిని భాగస్వామిగా చేస్తున్నట్లు రాస్తారు. వివాదాస్పద కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ కూడా పలువురు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. -
Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్‌ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్‌లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే! భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్‌పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g — N Chandrababu Naidu (@ncbn) November 12, 2014 అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది. బాబు తరహా మనిషే! సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్‌ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది. -
శృంగార కోరికల్లో స్పష్టత.. భాగస్వామి ఎంపికలో నవ్యత
వ్యక్తిగత ప్రాధాన్యతపై దృష్టి సారిస్తున్నారు. అందుకే డేటింగ్ పరంగా 2024 సంవత్సరం ’ ఇయర్ ఆఫ్ సెల్ఫ్ ’( ’స్వీయ సంవత్సరం’) గా పరిగణన పొందనుంది. తాము ఎక్కువగా దేనికి విలువ నిస్తున్నారు తామేమి కోరుకుంటున్నారు? అనేది డేటింగ్, బంధాలలో కీలకం కానుంది అని మహిళల తొలి డేటింగ్ యాప్ బంబుల్ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 డేటింగ్ శైలులు ఎలా ఉండబోతున్నాయ్? సింగిల్స్ ఎలా డేటింగ్ చేయనున్నారు? డేటింగ్‌కు సంబంధించి భాగస్వాముల పట్ల మారుతున్న ఆశలు, అంచనాలు ఏమిటి?.. తదితర డేటింగ్ ధోరణులను అధ్యయనం చేసింది. ఆ అధ్యయన ఫలితాల ప్రకారం... ►83% మంది మహిళలు ఇప్పుడు ఉన్నవారితో మరింత సంతోషంగా ఉండటానికి వీలుగా అడుగులు వేస్తున్నారు ►70% మంది సామాజిక సమస్యలపై చురుకుగా పాల్గొనే వారి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ►ఈ తరం విలువల గురించి మాట్లాడతారు అయితే శృంగారం విషయానికి వస్తే వారు కోరుకున్నదానిని పొందడానికి అవసరమైన మార్గాన్ని అనుసరించడానికి ఏ మాత్రం సందేహించరు. ►అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా (59%) తమ సంతోషభరిత శృంగార జీవితాలకు ఏం కావాలి? అనే విషయంలో స్పష్టమైన థృక్పధంతో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నారని తేల్చింది. ►అత్యధికులు (84%) తమను తాము మెరుగుపరుచుకునే మార్గాలను నిరంతరం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. ►అలాగే 63% మంది తమ గురించి తాము జాగ్రత్త తీసుకోని వారిని తమ భాగస్వామిగా అనర్హులని భావిస్తున్నారు. ►సింగిల్స్‌లో 83% మంది నిరంతరం స్వీయ అభివృద్ధికి (సెల్ఫ్ బెటర్మెంట్)కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు ఇప్పుడు ఉన్న వారితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ►61% మంది తమను మార్చడానికి ప్రయత్నించని వ్యక్తులతో మాత్రమే డేటింగ్ చేస్తామంటున్నారు. ►44% మందికి సామాజిక అంచనాలే స్వీయ అభివృద్ధిని కోరుకునేలా చేస్తున్నాయి , ఆ తర్వాత స్వీయ–ఎదుగుదల కోరిక (38 %), వ్యక్తిగత అభద్రతలు తల్లిదండ్రుల అంచనాలు (రెండూ 37%), తిరస్కరణ భయం (35%), బాహ్య పోలికలు (28%), మునుపటి సంబంధాల అనుభవాలు (27%) ఉంటున్నాయి. ►భాగస్వామితో కలిసి గందరగోళ సంస్కృతి ( హస్టిల్ కల్చర్) కన్నా నెమ్మది అయిన జీవితం ( ‘స్లో లైఫ్’) ఇష్టమని 53% మంది చెప్పారు. ►70% మంది వ్యక్తులు సామాజిక సమస్యలపై చురుకుగా పాల్గొనే వారి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ►73% మందికి శ్రద్ధ వహించడమే కాకుండా, సామాజిక కారణాలు సమస్యలలో చురుకుగా పాల్గొనడం కూడా ముఖ్యమే. ►64% మంది సామాజిక కారణాలు (న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైనవి) గురించి పట్టించుకోరు, ►68%కి వారి భాగస్వామి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ►58% మంది మహిళలు భిన్నమైన రాజకీయ ఆలోచనలు కలిగిన వారి పట్ల తక్కువగా ఓపెన్ అవుతున్నారు, ►డేటింగ్ విధానంలో కొన్ని అనూహ్యమైన మార్పుల్ని మనం చూడబోతున్నాం. వ్యక్తిగత సంబంధాలతో పాటు సామాజిక సమస్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి అని బంబుల్స్ ఇండియా కమ్యూనికేషన్ డైరెక్టర్ సమర్పిత సమద్ధర్ అంటున్నారు. -
20 ఏళ్లు వెదికినా తగిన జోడీ దొరకలేదని..
బ్రిటన్‌కు చెందిన సారా విల్కిన్సన్ (42) అనే మహిళ సరైన భాగస్వామి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో, ఇక మరోమార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌స్టో నివాసి సారా ఇటీవల హార్వెస్ట్ హౌస్‌లో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిన్నప్పటి నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలుగనేదానినని, ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకున్నానని సారా మీడియాకు తెలిపింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం సారా వివాహం ముఖ్యాంశాలలో నిలిచింది. అయితే అధికారికంగా ఈ పెళ్లికి గుర్తింపు దక్కలేదు. సారా తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన వివాహ వేదికను సిద్ధం చేసుకుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ల మాదిరిగానే డెకరేషన్ నుంచి ఫుడ్, డ్రింక్స్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు సారా తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. తన పెళ్లి ఖర్చుల కోసం సారా చాలా ఏళ్లుగా పొదుపు చేస్తూ, డబ్బులు దాచింది. ఈ వివాహానికి సారా విల్కిన్సన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా పెళ్లి వేడుకలో స్నేహితులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉందని కేథరీన్ చెప్పింది. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని తెలిపింది. ఇది కూడా చదవండి: నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి.. -
ఓటీటీకి సిద్ధమైన హన్సిక చిత్రం.. థియేటర్ల కంటే ముందుగానే!
కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, హన్సిక హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం పార్ట్నర్. తమిళంలో ఆగస్ట్ 25న రిలీజైన ఈ మూవీని తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 6 నుంచి సింప్లీసౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఓవర్సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది. (ఇది చదవండి: జిమ్ ట్రైనర్‌పై లైంగిక వేధింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో నటుడి అరెస్ట్!) అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంగా డైరెక్టర్ మనోజ్దామోదరన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగిబాబు కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్, టీజర్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. -
దారుణం: భాగస్వామిని ప్రెషర్ కుక్కర్‌తో బాది..
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్‌తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ఇదీ జరిగింది.. దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) భారత ప్రభుత్వం టీసీఎస్‌ను పార్టనర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు టీసీఎస్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి ప్రకారం ప్రభుత్వ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి ఆన్ఇన్క్లూజివ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండనుంది. క్లౌడ్ న్యూట్రాలిటీ, ఇంటర్ ఆపెరాబిలిటీ వంటి కొత్త టెక్నాలజీ సాయంతో, కొత్త GeM ప్లాట్‌ఫారమ్‌ను బహుభాషల్లో,ఓపెన్ సోర్స్-ఆధారితంగా సరికొత్తగా తీర్చిదిద్దనుంది. ప్రస్తుత ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ను మెరుగైన సామర్థ్యం, పారదర్శకత, సమగ్రతతో అత్యాధునిక ప్రజా సేకరణ వేదికగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. GeM అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUలు) ఎండ్-టు-ఎండ్ మార్కెట్ ప్లేస్. సాధారణ వినియోగ వస్తువులు సేవలను పారదర్శకంగా, సమర్ధవంతంగా సేకరించేందుకు ఎంటిటీలు దీనిని ఉపయోగిస్తాయి. (అమ్మకోసం... భళా బుడ్డోడా! వైరల్ వీడియో) ఈ ఇ-మార్కెట్‌ప్లేస్ ప్రస్తుత వ్యాపార విలువ రూ. 2 ట్రిలియన్లకు పైగా ఉంది. 70,000 కంటే ఎక్కువ కొనుగోలుదారుల సంస్థలు, 6.5 మిలియన్ సెల్లర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ఉన్నారు. వీరిలో 800,000 కంటే ఎక్కువ మధ్యస్థ ,చిన్న సంస్థలతో సహా 6.5 మిలియన్లకు పైగా అమ్మకందారులున్నారని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ విజయ వంతమైనప్పటికీ. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో నిర్మాణపరమైన సవాళ్లను కలిగి ఉందని పేర్కొంది. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఈ నేపథ్యంలో తాజా భాగస్వామ్యంతో ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌ను కొనసాగిస్తూనే, డిజైన్, కొత్త టెక్నాలజీలను ప్రభావితం చేసే కొత్త ఆధునిక పరిష్కారాన్ని నిర్మిస్తుందని కూడా టీసీఎస్ పబ్లిక్ సర్వీసెస్ ఇండియా బిజినెస్ హెడ్ తేజ్ పాల్ భట్ల వెల్లడించారు. (స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం) జీఈఎం కొత్త వెర్షన్‌ను రీడిజైనింగ్,రూపకల్పనకు ప్రభుత్వ కాంట్రాక్టు టీసీఎస్ దక్కించుకోవడంపై జీఈఎం సీఈవోపీకే సింగ్ మాట్లాడుతూ కొత్త అవతార్‌లో తమ జీఈఎం, మెరుగైన వ్యాపార సౌలభ్యాన్ని, పారదర్శకతను అందిస్తుందన్నారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ పార్టనర్‌గా టీసీఎస్ ఎంపిక ద్వారా, వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసి,యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తామనే హామీ ఇస్తున్నామన్నారు. -
Singapore : చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అరెస్ట్
సింగపూర్ : చంద్రబాబు ఆప్త మిత్రుడు, సింగపూర్ రవాణాశాఖ మంత్రిగా మొన్నటి వరకు పని చేసిన ఎస్.ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్‌ను జూలై 11నే అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై విడుదల అయినట్లు అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) శుక్రవారం వెల్లడించింది. అయితే ఈశ్వరన్‌పై విచారణ ప్రారంభించిన మరుసటి రోజే CPIB ఆయన సన్నిహితులపై కూడా దృష్టి సారించింది. మంత్రి ఈశ్వరన్ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించి.. దీనికి సంబంధించి ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ ను అరెస్ట్ చేసింది. (ఈశ్వరన్ సన్నిహితుడు సెంగ్ ను అరెస్ట్ చేస్తోన్న సింగపూర్ పోలీసులు) ఎవరీ హూంగ్ బెంగ్ సెంగ్ ? హూంగ్ బెంగ్ సెంగ్ ఒక హోటల్ అధినేత. ఆయన సంస్థ పేరు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్(HPL). దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా హూంగ్ బెంగ్ సెంగ్. 2008లో ఫార్ములా వన్ రేస్‌ను సింగపూర్‌కు తీసుకువస్తానంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసి కాంట్రాక్టు సంపాదించారు సెంగ్. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 135 మిలియన్ డాలర్లు. (F1 ప్రతినిధులతో ఈశ్వరన్) ఈశ్వరన్ పాత్ర ఏంటీ? ఫార్ములా వన్ రేస్ ప్రాజెక్టుకు సంబంధించి హూంగ్ బెంగ్ సెంగ్ సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఈశ్వరన్ ఈ వ్యవహారం నడిపించారు. మొత్తం 135 మిలియన్ డాలర్ల ఈ కాంట్రాక్టులో 40 శాతం వాటా ప్రమోటర్ గా హూంగ్ బెంగ్ సెంగ్ ది. ఆ మేరకు నిధులను సమకూరుస్తాడు. ఇక ఈ కాంట్రాక్టులో 60 శాతం నిధులను సింగపూర్ టూరిజం బోర్డు ఇవ్వాలి. ఈ మేరకు మంత్రిగా ఈశ్వరన్ ఈ ఒప్పందంలో ప్రభుత్వం తరపున సంతకాలు చేశారు. (తన స్నేహితుడు సెంగ్ తో ఈశ్వరన్ సెల్ఫీ) దర్యాప్తు సంస్థ అభియోగాలేంటీ? ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న CPIB సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం కేటాయించిన 60 శాతం నిధులలో కుంభకోణం జరిగిందని గుర్తించింది. ఈ వ్యవహారంలో హూంగ్ బెంగ్ సెంగ్ పారదర్శకత పాటించకపోవడం, కొన్నిపెద్ద మొత్తాలకు సంబంధించిన వ్యవహారాన్ని గుప్తంగా ఉంచడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో హూంగ్ బెంగ్ సెంగ్ కు మొదటి నుంచి మద్దతిస్తోన్న మంత్రి ఈశ్వరన్ పైనా ప్రధానికి లేఖ రాసింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ CPIB నుంచి లేఖ రావడంతో హుటాహుటిన ఈశ్వరన్ ను బాధ్యతల నుంచి తప్పించారు ప్రధాని. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ప్రధాని. ( సింగపూర్ ప్రధాని విడుదల చేసిన ప్రకటన) ఈశ్వరన్ వ్యవహారశైలి ఏంటీ? మొదటి నుంచి ఈశ్వరన్ వ్యవహారశైలి అనుమానస్పదంగానే ఉందన్నది సింగపూర్ వర్గాల సమాచారం. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు, సింగపూర్ కు లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించాడు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించాడు. (నారా లోకేష్ తో సింగపూర్ ఈశ్వరన్) అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. (బాబు నాడు కుదుర్చుకున్న అమరావతి ఒప్పందం, సంతకం చేస్తున్నది ఈశ్వరన్) కేసులో తాజా అప్ డేట్స్ ఏంటీ? హూంగ్ బెంగ్ సెంగ్ ను తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన CPIB సంస్థ.. ఈశ్వరన్ తో లావాదేవీల గురించి లోతుగా ప్రశ్నించినట్టు సింగపూర్ మీడియా పేర్కొంది. తనకు ఇప్పటికే విదేశాల్లో ఇతర షెడ్యూల్ ఉందని, ఆ మేరకు బెయిల్ ఇవ్వాలని హూంగ్ బెంగ్ సెంగ్ కోర్టులో అభ్యర్థించారు. ఆ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను హూంగ్ బెంగ్ సెంగ్‌కు మంజూరు చేసింది. అయితే విదేశీ పర్యటన నుంచి వెనక్కు రాగానే.. హూంగ్ బెంగ్ సెంగ్ తన పాస్ పోర్టును CPIB సంస్థకు అప్పగించాలని సూచించింది. అలాగే బెయిల్ మంజూర్ చేయడానికి ఒక లక్ష అమెరికన్ డాలర్లను పూచీకత్తుగా పెట్టాలని కోర్టు సూచించింది. అలాగే ఈశ్వరన్ కు సంబంధించిన లావాదేవీల పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఈశ్వరన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సీపీఐబీ ఓ అంచనాకు వచ్చింది. సేకరించిన ఆధారాల మేరకు ఈశ్వరన్‌ను విచారిస్తున్నామని సీపీఐబీ డైరెక్టర్ డెనిస్ టాంగ్ తెలిపారు. ఈ కేసును కొందరు మరో కేసుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మొదటి కేసు పార్లమెంటుకు సంబంధించిందని, దాంట్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు టాంగ్. అయితే ఈశ్వరన్ పై ఇప్పుడు పెట్టిన కేసు.. CPIB స్వయంగా గుర్తించిందని, ఆ మేరకు అభియోగాలు నమోదు చేసి, ప్రధానికి సమాచారం అందించామన్నారు డైరెక్టర్ టాంగ్. We have always been unapologetic in stamping out corruption even if it is potentially embarrassing for the @PAPSingapore . No means No. Check out my bro @LawrenceWongST explaining the difference between CPIB investigating #ridout Ridout and Iswaran. pic.twitter.com/hJlEu9aYpl — Edwin Tong Fan Bot (@EdwinFanBot) July 12, 2023 ఇదీ చదవండి: చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ‘ఈశ్వరన్’ ఔట్ -
కేదార్నాథ్ ఆలయంలో ప్రపోజల్స్... యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్..
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రేమికురాలు విశాఖ ఫల్సంగే ఆ వీడియోను పోస్టు చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియోలో ప్రేమికురాలు విశాఖ ఫుల్సంగే తన ప్రియుడి ముందు మోకాలిపై కూర్చుంటుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన ఎల్లో కలర్లో దుస్తులు ధరించారు. ఆలయం బయట కేదార్నాథ్ మహాదేవునికి దండం పెట్టుకున్న తర్వాత ప్రియురాలు విశాఖ తన ప్రియునికి ప్రపోజ్ చేస్తుంది. అనంతరం ఇద్దరు కౌగిలించుకుంటారు. ఈ దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి అవసరమా? అని ఫైరయ్యారు. 11,750 అడుగుల ఎత్తులో కష్టమైన యాత్రను పూర్తి చేసి ఇలా హగ్ చేసుకోవడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇందుకు భిన్నంగా ప్రమికులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మహాదేవుని సన్నిధిలో ప్రపోజ్ చేసుకున్నందుకు మెచ్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు.. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో కలిసి ఉంటామని ప్రామిస్ తీసుకోవడంలో తప్పు ఏముందని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: కుక్కను కారులోనే వదిలి వెళ్లారు.. తిరిగొచ్చేసరికి.. -
టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!
ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) అయితే ఈవెంట్లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్‌పై ఈవెంట్‌కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్‌కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్! ) -
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023 సమరానికి నేడు (మార్చి 31) తెరలేవనుంది. నరేంద మోదీ స్టేడియంలో 4 సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జరిగే తొలి మ్యాచ్‌తో పోరు షురూకానుంది. ఈ మేజర్ టోర్నమెంట్‌కు అధికారిక భాగస్వామిగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో వరుసగా ఆరవ సంవత్సరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఈవీలపై అవగాహన పెంచనుంది. గో ఈవీ అనేందుకు 100 కారణాలు అంటూ టాటా టియాగో ఈవీతో వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. వరుసగా ఆరోసారి ఆఫీషియల్ పార్టనర్‌గా టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌కు అధికారిక భాగస్వామిగా టియాగో ఈవీని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స ప్రకటించారు.ఈవీ సెగ్మెంట్లో తాము టాప్‌లో ఉన్నామని ఎఫ్సిబి ఉల్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్విందర్ అహ్లువాలియా తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 స్టేడియంలలో కొత్త Tiago.evని ప్రదర్శించడమే అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న క్రికెటర్‌కు ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్ టాటా టియాగో ఈవీని గిఫ్ట్‌గా ఇవ్వనుంది. దీంతోపాటు పాటు లక్షరూపాయల నగదు బహుమతిని కూడా అందివ్వనుంది. బంతి తగిలితే రూ. 5 లక్షల విరాళం అంతేకాదు డిప్ప్లేలో ఉన్న Tiago.ev కారుకు బంతి తగిలిన ప్రతిసారీ టాటా మోటార్స్ రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తుంది. కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా మొక్కల్ని పంపిణీ చేయనుంది. మరో బంపర్ ఆఫర్ ఏంటంటే టాటా టియోగో కొనుగోలు చేసిన వారికి ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టిక్కెట్లను అందించనుంది. అలాగే టాటా ఈవీ ఓనర్లు ఆన్-గ్రౌండ్లో కొన్ని ఉత్తేజకరమైన ఎంగేజ్మెంట్ కార్యకలాపాలలో భాగం పంచుకోవచ్చు. అంతేనా కొంతమంది లక్కీ ఓనర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో కొందరికి అవార్డును అందించే అద్బుత అవకాశాన్ని గెలుచుకోవచ్చు. కాగా టాటా మోటార్స్ 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో నిమగ్నమై ఉంది, నెక్సాన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారి , పంచ్ లాంటి తన పాపులర్ కార్లను ప్రదర్శిస్తోంది. -
ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..
మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ మాదిరి రివేంజ్ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ. వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త.. పేరు మోసిన డ్రగ్ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది. అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారి కల్నల్ గాబ్రియేల్ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు. చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. (చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు') -
తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: పెద్దపులులు తోడు కోసం ఆరాటపడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడ తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తున్నాయి. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్‌లో ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే మాసంలో ఏ2 అనే మగపులి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సంచరించింది. కవ్వాల్ నుంచి కాగజ్‌నగర్ వరకు తిరిగింది. రెండుచోట్లా ఆవాసం, తోడు కోసం ఆధిపత్య పోరు జరిపింది. చివరకు ఓపెన్ కాస్టులు, పత్తి చేలలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. తాజాగా మూడున్నర ఏళ్లున్న మరో మగపులి ఈ నెల 15న ఒకరిపై దాడి చేసింది. ఈ పులి ఆవాసం, తోడు కోసం సంచరిస్తోంది. తన ప్రయాణంలో ఎక్కడా స్థిరపడకుండా రోజుకు కనీసం పది కిలోమీటర్లకు పైగా తిరుగుతోంది. నిలకడ లేని పులులు దాడులు చేసే అవకాశాలు ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు.. పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. అయితే చలి గుప్పే మాసాలైన నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కువగా ఇష్టపడతాయి. మగవి ఆడపులులను వెతుక్కుంటాయి. ఆడ పులి 10 నుంచి 30కి.మీ. పరిధిలోనే ఉండిపోతే మగపులి 100 నుంచి 150కి.మీ. తిరగగలదు. ఒక్కో మగపులి రెండు, మూడు ఆడపులులతో సహవాసం చేయగలదు. అయితే కొత్తగా వచ్చే మగపులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర, తెలంగాణలో మొత్తం 3వేల కి.మీ. తిరిగి ’వాకర్’ అనే మగపులి రికార్డు సృష్టించింది. పులి మెడకు అక్కడి అధికారులు రేడియో కాలర్ అమర్చడంతో తోడు కోసమే తిరిగినట్లు గుర్తించారు. అప్పట్లో మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో జే1 మగపులికి కవ్వాల్ కోర్ ప్రాంతంలో ఆవాసం, రక్షణకు ఇబ్బంది లేదు. అడవి దాటి ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు అనేక పులులకు అవాసం ఇవ్వగలవు. అయితే పులులకు ఎలాంటి అలజడి లేని అన్ని రకాల అనుకూలమైన ఆవాసాలు ఉంటేనే కొన్నాళ్లు ఉంటాయి. కాగజ్‌నగర్ డివిజన్లో ‘సూపర్ మామ్’గా పిలిచే పాల్గుణ రెండు దశల్లో 9 పిల్లల్ని, మళ్లీ వాటి పిల్లలు(కే1 నుంచి కే9) కూడా జన్మనిచ్చాయి. ఇవేకాకుండా ‘ఎస్’ సిరీస్ పులులు ఇక్కడే జత కట్టాయి. ఇవి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాయి. రెండు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి ‘పీ1’ అనే మగపులి కాగజ్‌నగర్ డివిజన్లోని ‘కే8’తో జతకట్టింది. ఇది ఏడాదిన్నర క్రితమే తన మూడు పిల్లల నుంచి విడిపోయింది. ఇక ‘ఎస్6’ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అటవీ శాఖ అధికారులు కొత్త పులి ఉందని సమాచారం రాగానే కెమెరాలు అమర్చి వాటి కదలికలు పర్యవేక్షిస్తుంటారు. పశువుల వేట, ప్రవర్తన, ఆ పులికి తోడు ఉందా లేదా తెలుసుకుంటూ రిజర్వు ఫారెస్టులో స్థిరపడేలా చేయాలి. అయితే కవ్వాల్ కోర్ ప్రాంతంలో పులుల జీవనం సాగితే అటు అటవీ అధికారులకు, ఇటు స్థానికులకు సమస్యలు ఉండకపోయేవి. కానీ కోర్ ఆవల బఫర్ జోన్లో ఇంకా చెప్పాలంటే పులుల కారిడార్‌గా పిలిచే ప్రాంతాల్లో సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారిడార్‌లో పత్తి చేలు ఉన్నాయి. చదవండి: హస్తంలో అన్ని వేళ్లు ఒకేలా ఉంటాయా.. కాంగ్రెస్‌లో కూడా అంతే సుమీ.. -
రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా...
చండీగఢ్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు నేరాలకు దారి తీస్తున్నాయి. అందులోని కొన్ని ఘటనలైతే కూతురు వరసయ్యే వాళ్ల మీద కూడా లైంగైక దాడులు పాల్పడుతున్నారు కొందరు కామందులు. తాజాగా ఇటువంటి ఘటనే చండీగఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తని ఆరేళ్ల క్రితం విడిచిపెట్టి ఒంటరిగా తన కూతురితో జీవనం గడుపుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అతను డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ మహిళపై కూతురిపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మహిళ అతన్ని నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారి పోయాడు. మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
భర్త చీటింగ్.. పోస్టర్లతో భార్య నిరసన!
లండన్: తన భర్త మోసం చేస్తే ఏ మహిళ అయినా ఏం చేస్తుంది. మొబైల్‌తో మెస్సెజ్ లేదా కాల్ చేసి తన కోపాన్ని తీర్చుకుంటుంది. పెద్దలకు దృష్టికి తీసుకువెళుతుంది. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండి దూరంగా వెళ్ళపోవడమో.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడమో చేస్తుంది. అయితే యూకేలోని ఓల్డ్ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త చేసిన మోసానికి వెరైటిగా నిరసన తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్హోమ్కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. తన భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయించి గోడలకు అంటించింది. ఆ పోస్టర్ కింద ఇతనొక పెద్ద మోసగాడు అని కూడా రాసింది. చెట్లు, కార్లు వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని వెల్లగక్కింది. అంతటితో ఆగకుండా మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది. ‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అని కామెంట్లు కూడా రాసింది. అయితే భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అని రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అతికించి ప్రచారం చేసింది. అయితే గుర్తు తెలియని ఈ మహిళ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎమిలీ అనే మహిళ కూడా తన లవర్ మోసం చేశాడని అతని గది చుట్టూ ఇటువంటి పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది. కాగా, 2019లో ఓ యువకుడు ఏకంగా తనను మోసంచేసిన అమ్మాయి ఫోటోను పట్టుకొని రద్దీగా ఉండే వీధిలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనను మోసం చేసిందని రోడ్డుకెక్కాడు. ఆమెకు తను బ్రేకప్ చెప్తున్నాను అంటూ రోడ్డుపైనే ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా! -
ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు
మలయాళ నటి అంజలి అమీర్ తన సహజీవన భాగస్వామికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ వ్యక్తి పెడుతున్న వేధింపులు భరించలేకుండా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్గా అంజలి అమీర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తను ఎదుర్కొంటున్న కష్టాల గురించి అంజలి ఫేస్బుక్ లైవ్‌లో పలు విషయాలను వెల్లడించారు. ‘ఆ వ్యక్తి తనతో కలిసి జీవించాలని నన్ను బెదిరిస్తున్నాడు. కానీ నేను ఇక మీదట అతనితో జీవించాలనుకోవటం లేదు. అతని నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. అతనితో కలిసి జీవించకుంటే నన్ను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు’ అని అంజలి తన బాధను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. అతను గత కొంతకాలం నుంచి తన సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడని విమర్శించారు. ఈ బాధలు చూస్తుంటే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై పోలీసుకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా, 2018 మలయాళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పెరంబు చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అంజలి తన బయోపిక్‌ను తెరకెక్కించాలని చూస్తున్నారు. -
కడ వరకూ కలసి ఉండాలనుకుంటున్నారా?
సెల్ఫ్‌చెక్ నేను బతికున్నంతకాలం నీతోనే జీవించాలని ఉంది... ఇలా చెప్పటం పెళ్లైన కొత్తలోనే కాదు, ఆ మాటను నిజం చేయటానికి చాలామంది ప్రయత్నిస్తారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అంకిత భావంతో, అవ్యాజమైన ప్రేమతో జీవితాంతం కలసిమెలసి ఉంటే ఎంత ఆనందం! అలాంటివారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. దాదాపు అర్ధశతాబ్ద కాపురంలో జీవితభాగస్వాములిద్దరూ ఎన్నో అనుభవాలను చవిచూస్తారు. పండు వయసు వచ్చేదాకా ఒకరికోసం ఒకరు బతుకుతూ అమృత ప్రేమను ఆస్వాదిస్తారు. ఇది నిజంగా గొప్ప విషయం. మీరూ మీ జీవితభాగస్వామితో చివరి క్షణం వరకు కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? మీ వార్ధక్య దశలో కూడా తోడునీడల్లా ఉండాలని ఆశపడుతున్నారా? 1. ఒంటరిగా ప్రయాణం చేయవలసినప్పుడు, మీ జీవితభాగస్వామి మీకు తోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. మీకు తెలియకుండానే మీ లైఫ్పార్ట్నర్లోని కొన్ని అలవాట్లను సొంతం చేసుకొన్నారు. ఎ. అవును బి. కాదు 3. మీ భార్య/భర్త లేకుండానే మీరు సంతోషంగా జీవించగలరని చెప్పగలరు. ఎ. కాదు బి. అవును 4. కొన్ని పరిస్థితులవల్ల మీ లైఫ్పార్ట్నర్ మీకు దూరం కావలసివస్తే... ఎవరైనా (పిల్లలు, తల్లిదండ్రులు మొదలైనవారు) మీకు తోడుగా ఉంటే సరిపోతుందనుకుంటారు. ఎ. కాదు బి. అవును 5. అన్యోన్యంగా ఉన్న జంటలను చూస్తే మీకు అసూయ కలుగుతుంది. మీకన్నా వారే సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. ఎ. కాదు బి. అవును 6. మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని నమ్ముతారు. దాపరికం లేకుండా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. శారీరకంగా, మానసికంగా మీ జీవితభాగస్వామిపై ఆధారపడి ఉన్నారు. ఎ. అవును బి. కాదు 8. మీ కాపురంలో ఒకరినివిడిచి మరొకరు ఉన్నకాలం చాలా తక్కువ. ఎ. అవును బి. కాదు 9. మీ జీవితభాగస్వామి మనసును కష్టపెట్టటం మీకు ఇష్టం ఉండదు. మీ గురించి కంటే మీ లైఫ్పార్ట్నర్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 10. గొడవలు మీ కాపురాన్ని కూలదోస్తాయని మీరు నమ్ముతారు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ లు ఏడు దాటితే మీ జీవితభాగస్వామిని ప్రాణంగా చూసుకుంటారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. చివరి వరకు వారి వెంటే ఉండాలని కోరుకుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే జీవితభాగస్వామిపై మీకు పెద్దగా ప్రేమ ఉండదు. ఇద్దరి మధ్య గొప్ప రిలేషన్ ఉండదు. ఒకరికోసం ఒకరు జీవించాలనుకోరు. -
నస.. బుస..!
రైట్ టైమ్ లేవండి.. బ్రేకప్ పార్టీకి రెడీ అవ్వండి అతడు మీ పాస్వర్డ్ అడుగుతున్నాడా? ఆమె మీ ‘వాట్సప్ లాస్ట్ సీన్’ కోసం పట్టు పడుతోందా? మీరు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు అతడు అదే పనిగా మీకు ఫోన్ చేస్తూ మిమ్మల్ని ‘డ్రిల్’ చేస్తున్నాడా? అయితే, బ్రేకప్ గురించి ఆలోచించవలసిన టైమ్ వచ్చేసిందనే! శుభమా అంటూ వాలెంటైన్స్ డే దగ్గరపడుతుంటే.. ఈ బ్రేకప్ ప్రీచింగ్ ఏంటి అంటారా?! ప్రీచింగ్ కాదు.. టీచింగ్ కాదు. ప్రేమకు వేళయినట్లే... సమ్‌టైమ్స్.. బ్రేకప్కీ వేళవుతుందని చెప్పడం. ప్రేమలో పడినప్పుడు అన్నీ వదులుకుంటాం. మన టైమ్, మన మనీ, మన ఇష్టాలు.. ఆఖరికి మన వ్యక్తిత్వం కూడా! నిజానికి అది మన తప్పు కాదు. పవర్ ఆఫ్ లవ్! ప్రేమలో ఉన్నప్పుడు మన పార్ట్నర్లోని లోపాలను కూడా ప్రేమిస్తాం. కోపాలనూ భరిస్తాం. ఉట్టి పుణ్యానికి తిట్లు తింటున్నా, నిందలు పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తాం. కానీ అన్నిసార్లూ అలా సాధ్యం కాదు. మాటలు పడీపడీ సడెన్‌గా చికాకు పడిపోతాం. ‘ఈ లైఫ్ నాది కదా’ అనుకునేంతగా ప్రేమ నుంచి వేరైపోతాం! దీనికి కారణం ప్రేమ తగ్గిపోవడం కాదు. నస ఎక్కువవడం! అది మన ఫస్ట్ లవ్ కావచ్చు. మన ఫస్ట్ రిలేషన్షిప్ కావచ్చు. కానీ అంతకంటే ముందే మనతో మనకు లవ్, రిలేషన్షిప్ ఏర్పడి ఉంటాయి! అందుకే.. ఆ లవ్‌కి, ఆ రిలేషన్‌షిప్‌కి భంగం కలిగించే బయటి లవ్‌ని, బయటి రిలేషన్‌షిప్‌ని వదిలేసుకోడానికి సిద్ధమైపోతాం. అది మన ప్రేమ తప్పు కాదు. మన పార్ట్నర్ తప్పు. ఏమైనా జీవితానికి సంతోషం ముఖ్యం. అది ప్రేమలో దొరికితే మరీ సంతోషం. బ్రేకప్‌తో మాత్రమే దొరుకుతుందనిపిస్తే.. ప్రేమ కోసం చూసుకోనక్కర్లేదు. బ్రేకప్ పార్టీ ఇచ్చేయడమే! బ్రేకప్‌కి టైమ్ దగ్గర పడిందనడానికి పది సంకేతాలు 1 మీ పార్ట్నర్ మీ ఫోన్‌ని ప్రతి రోజూ జల్లెడ పట్టేస్తున్నారా? 2 మనిద్దరికీ ఒకే పాస్వర్డ్ ఉండాలని మీ పార్ట్నర్ సతాయిస్తున్నారా?. 3 మీ ఇద్దరి మధ్యా గొడవ జరిగిన ప్రతిసారీ మీ పార్ట్నర్ మీ ‘ఎక్స్’ పార్ట్నర్ ఊసెత్తుతున్నారా? 4 మీకు ఇష్టం లేని పనులను తన ఇష్టం కోసం చెయ్యమని తరచు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? 5 ఎంతో కాలంగా అడుగుతున్నా మీకు తన ఫ్రెండ్స్‌ను పరిచయం చేయడానికి తటపటాయిస్తున్నారా? 6 మీ పార్ట్నర్ చుట్టూతే మీ పర్సనల్ లైఫ్ అంతా తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా? 7 మీరు వేసుకునే బట్టల గురించి మీ పార్ట్నర్ పదే పదే నెగటివ్‌గా మాట్లాడుతున్నారా? లైక్... నా పక్కన వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు... అని! 8 మీరు మాట్లాడే ప్రతి ఒక్కరితో మిమ్మల్ని కలిపి, మీ పార్ట్నర్ మీ గురించి అనుమానంగా మాట్లాడుతున్నారా? అసూయ పడుతున్నారా? 9 మీరు తనకే దక్కాలనీ, మీ అటెన్షన్ అంతా తన మీదే ఉండాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారా? 10 చిన్న వాదులాటకు కూడా మన విడిపోదాం అని మీ పార్ట్నర్ అంటున్నారా? ఈ ‘సుగుణాలలో’ ఏ ఒక్క సుగుణం మీ పార్ట్నర్లో కనిపించినా.. మీరు మీ రిలేషన్‌షిప్‌కి ‘థమ్స్‌డౌన్’ ఇచ్చే ఆలోచన చేయడం మంచిది. ఇప్పటికే ప్రేమతో చాలా ఇచ్చేసి ఉంటారు. వాటిల్లో థమ్స్‌డౌన్ కూడా ఒకటి అనుకుని ఇచ్చేయండి. -
అశోక్ లేలాండ్.. 2 వాణిజ్య వాహనాలు
చెన్నై: హిందుజా గ్రూప్‌కు చెందిన ‘అశోక్ లేలాండ్’ కంపెనీ తన మధ్యస్థ, తేలికపాటి వాణిజ్య వాహన విభాగపు పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. కంపెనీ తాజాగా మధ్యస్థ వాణిజ్య వాహనం ‘గురు’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనం ‘పార్ట్నర్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. గురు వాహనం ధర రూ.14.35 లక్షలు–రూ.16.72 లక్షల శ్రేణిలో, పార్ట్నర్ వాహనం ధర రూ.10.29 లక్షలు–రూ.10.59 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ చెన్నైవి. తాజా కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లో తమ స్థానం మరింత పదిలమౌతుందని, అంతర్జాతీయంగా టాప్–10 ట్రక్ తయారీ కంపెనీల్లో స్థానం పొందడమే లక్ష్యమని అశోక్ లేలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి తెలిపారు. ‘గురు’.. 12 టన్నులు, 13 టన్నుల కేటగిరీలో పలు రకాల బాడీ ఆప్షన్లలో బీఎస్–3, బీఎస్–4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
'ఏసీటీ'తో యప్‌టీవీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్‌టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ సేవలను వినియోగించుకుంటున్న వారు యాడ్ ఆన్ ప్యాకేజీ కింద కేవలం నెలకు రూ 99 చెల్లించి యప్టీవీలో అందుబాటులో ఉండే 200లకు పైగా లైవ్ టీవీ చానల్స్, రెండు వేలకు పైగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, టీవీ షోలు లాంటి విభిన్న కార్యక్రమాలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు కలుగుతోంది. హైదరాబాద్‌లో ఏసీటీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకునే వారికి మనోరంజకమైన యప్‌టీవీ కార్యక్రమాలు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా యప్‌టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ కావాలని.. ఏసీటీతో ఒప్పందం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సర్వీస్ అందుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ఈ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. -
అలా ఉంటే సెక్సువల్ లైఫ్ కూడా సూపర్..!
లండన్: భర్త అంటే ఓ భార్యకు మరో రూపంలో తోడుగా ఉండే తండ్రి. భార్యంటే ఓ భర్తకు మరో రూపంలో ఉండే తల్లి. ఈ సూక్ష్మ భేదం తెలియక ఎంతోమంది పొద్దున లేచినప్పటి నుంచి చెరో కల్పిత ప్రపంచంలో ఇరుక్కుపోయి ఒకరినొకరు తిట్టిపోసుకుంటుంటారు. చిన్నచిన్న విషయాలకే నువ్వంటే నువ్వంటూ తెగ వాదులాడుతుంటారు. ఈ వాదనల్లో ఇరుక్కొని కొందరు విడాకులు అంటూ చెరో దిక్కుకు చేరుకునే ప్రయత్నం చేస్తారే తప్ప కనీసం ఒకరితో ఒకరు సమస్యపై ఏనాడు చర్చించుకోరు. ఈ సమయంలో మధ్య వర్తుల ప్రలోభాలకే ఎక్కువ గురవుతుంటారు. ఇంకొందరైతే మాత్రం ఇలా అవకుండా ఉండాల్సిందని అనుకుంటారు. మరికొందరు మాత్రం తాము భార్యభర్తలమే అయినా స్నేహితులుగా ఉంటే ఎంతో బావుంటుంది కదా అనుకుంటారు. అలా స్నేహితులుగా ఉండాలనుకునే వారికోసం అమెరికాకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్తలు పలు విషయాలు చెబుతున్నారు. ఏ భార్యభర్తలైతే స్నేహితులుగా ఉంటారో వారి బంధం చాలా బలంగా ఉంటుందని, లైంగిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని, సుదీర్ఘకాలం వారి జీవితం హాయిగా గడిచిపోతుందని చెబుతున్నారు. ఇండియానాలోని లారా వాండర్ డ్రిఫ్ట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు మొత్తం 184మందిని వారు 16 నెలలుగా ఎలా ఉంటున్నారని, వారు అలా ఉండటానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించగా వారంతా స్నేహమే అని తెలిపారు. స్నేహితులుగా మారిపోతే గడ్డుసమస్యలు కూడా ఇట్టే మాయమైపోతాయని.. అందుకే భార్యభర్తలు ముందు స్నేహితులుగా మారిపోవాలని వారు సూచిస్తున్నారు. -
సమంత అధర్వతో జోడీ కడుతుందా?
మరపురాని విజయాలు జీవితంలో మెలురాళ్లుగా నిలిచిపోతాయన్నది ఎంత సత్యమో తొలి చిత్రం అందులో నటించిన సహ నటుడు గానీ, నటి గానీవారికి జీవితాంతం గుర్తుండి పోతారన్నది అంత నిజం. అలాగే నేటి కొత్త తారలు రేపటి క్రేజీ బ్యూటీలుగానూ మాపటికి మాజీ భామలుగానూ అవడం సహజం. ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం నటిగా సమంత స్థాయి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్, తెలుగు ద్విభాషల్లోనూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ చెన్నై చందం నటిస్తున్నవన్నీ టాప్ హీరోల చిత్రాలే అన్నది గమనార్హం. అయితే సమంత నాయకిగా నటించిన తొలి చిత్రం బానాకాత్తాడి. ఇందులో కథానాయకుడు అధర్వ. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించిన ఆ చిత్రానికి బద్రి వెంకట్ దర్శకుడు. 2010లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడిందన్నది వాస్తవం. కాగా సమంత కెరీర్‌కు మాత్రం బానాకాత్తాడి బాగానే హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ భామ ఘన విజయాన్ని చవిచూసింది మాత్రం తెలుగు చిత్రం ఏమాయ చేసావే చిత్రంతోనే. ఏదేమైనా ప్రస్తుతం సమంత ప్రముఖ కథానాయకి అంతస్థును అధిష్టించిన నటి. ఐదేళ్లలోనే 25 చిత్రాలో నటించేశారు. అలాంటి నాయకి ఇప్పుడు తన తొలి చిత్ర కథానాయకుడితో నటిస్తారా?అన్నదే చిత్రపరిశ్రమలో ఆసక్తిగా మారిన అంశం. విషయం ఏమిటంటే అధర్వకు చిన్న నిరీక్షణ తరువాత ఈటీ చిత్రంతో మంచి విజయం వరించింది.దీంతో చాలా ఉత్సాహంగా ఉన్న ఈ యువ హీరో స్వంతంగా చిత్ర నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. కిక్కాస్ ఎంటర్టెయిన్మెంట్ అనే బ్యానర్‌ను కూడా నమోదు చేసుకున్నారు. దీనికి తన తొలి చిత్ర దర్శకుడు బద్రివెంకట్నే ఎంచుకున్నారు. అదే విధంగా తొలి చిత్ర నాయకినే నటింపజేయాలని ఆశిస్తున్నట్లు, అందుకు దర్శకుడు, నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టాప్ హీరోల చిత్రాలతో యమ బిజీగా ఉన్న సమంత తన తొలి చిత్ర కథానాయకుడితో నటించడానికి సుముఖత వ్యక్తం చేస్తారా?లేదా అన్నది ఆసక్తిగా మారింది.