అశోక్ లేలాండ్.. 2 వాణిజ్య వాహనాలు
చెన్నై: హిందుజా గ్రూప్‌కు చెందిన ‘అశోక్ లేలాండ్’ కంపెనీ తన మధ్యస్థ, తేలికపాటి వాణిజ్య వాహన విభాగపు పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. కంపెనీ తాజాగా మధ్యస్థ వాణిజ్య వాహనం ‘గురు’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనం ‘పార్ట్‌నర్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. గురు వాహనం ధర రూ.14.35 లక్షలు–రూ.16.72 లక్షల శ్రేణిలో, పార్ట్‌నర్ వాహనం ధర రూ.10.29 లక్షలు–రూ.10.59 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది.
అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ చెన్నైవి. తాజా కొత్త ఆవిష్కరణలతో మార్కెట్‌లో తమ స్థానం మరింత పదిలమౌతుందని, అంతర్జాతీయంగా టాప్–10 ట్రక్ తయారీ కంపెనీల్లో స్థానం పొందడమే లక్ష్యమని అశోక్ లేలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి తెలిపారు. ‘గురు’.. 12 టన్నులు, 13 టన్నుల కేటగిరీలో పలు రకాల బాడీ ఆప్షన్లలో బీఎస్–3, బీఎస్–4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.