Ashok Leyland
-
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్‌లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్‌పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్‌ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్‌ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
భారత సైన్యానికి అశోక్ లేలాండ్ వాహనాలు - ఆర్డర్ ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా భారత సైన్యం నుంచి రూ.800 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్, గన్ టోయింగ్ వెహికిల్స్‌ను అశోక్ లేలాండ్ సరఫరా చేస్తుంది. 12 నెలల్లో వీటిని డెలివరీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్ తెలిపారు. డిఫెన్స్ వ్యాపారం కంపెనీ వృద్ధికి బలమైన స్తంభంగా నిలిచిందని చెప్పారు. ఈ డీల్‌తో డిఫెన్స్ మొబిలిటీ వెహికల్స్ వ్యాపారంలో సంస్థ నాయకత్వాన్ని మరింత స్థిరపరుస్తుందని అన్నారు. -
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
ఆర్టీసీకి అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన నిర్వహించనుంది. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకునే ఎలక్ట్రిక్ బస్సులను ఆ కంపెనీ నుంచే తీసుకోనుంది. అయితే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ, వాటిని సొంతంగా కొనకుండా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో అద్దెకు తీసుకోనుంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో ఇక బస్సులను సరఫరా చేయాల్సి ఉంది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. అయితే అశోక్ లేలాండే వాటిని నిర్వహిస్తుంది కాబట్టి, అందుకు ప్రతిగా ఆ సంస్థకు ఆర్టీసీ కి.మీ.కు నిర్ధారిత మొత్తం చొప్పున అద్దెను చెల్లిస్తుంది. మూడేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ఇంతకాలం డీజిల్ బస్సులనే నడుపుతున్న టీఎస్ ఆర్టీసీ క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు చూస్తోంది. భారీగా పెరిగిన డీజిల్ ధర ఆర్టీసీపై భారం పెంచుతోంది. దీంతో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మళ్లటం ద్వారా ఆ ఖర్చును తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. కానీ డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల ధర చాలా ఎక్కువ. ఎక్స్‌ప్రెస్ కేటగిరీలో తిరిగే డీజిల్ బస్సు రూ.35 లక్షలు పలుకుతుంటే, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర వరకు పలుకుతోంది. అంత మొత్తం వెచ్చించి వాటిని కొనటం ఆర్టీసీకి తలకు మించిన భారంగా మారింది. దీంతో జీసీసీ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ, ఇప్పుడు అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి 500 బస్సులు సమకూర్చుకోనుంది. టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ ఎల్1గా నిలవటంతో దానికే బస్సుల నిర్వహణ బాధ్యత అప్పగించింది. కి.మీ.కు అద్దెను ఆ సంస్థ రూ.58గా కోట్ చేసింది. దాన్ని కనీసం రూ.54కు తగ్గించాలని ఆర్టీసీ కోరింది. దీనిపై ఆ సంస్థ ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. వచ్చే రెండు, మూడురోజుల్లో అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. డిపోల్లో చార్జింగ్ వ్యవస్థలు ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతున్నందున, వాటి చార్జింగ్ కోసం డిపోల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏయే డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తారో, ఆయా డిపోల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు అవసరం. కాగా 33 కేవీ అవసరమా, 11 కేవీ సరిపోతుందా? అనే పరిశీలన జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల స్థాయిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఆర్టీసీ ఈడీ వినోద్‌కు ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ బాధ్యత ఉండేది. ఇప్పుడు ఓ అధికారి ప్రత్యేకంగా ఈ పనులకే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన నుంచి దాన్ని తప్పించి సీఎంఈకి కేటాయించారు. కి.మీ.కు రూ.79 అశోక్ లేలాండ్ ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులను కూడా సరఫరా చేయాల్సి ఉంది. తొలుత 10 బస్సులను ఆర్టీసీ తీసుకుంటోంది. ఇది కూడా జీసీసీ పద్ధతిలోనే అయినందున, దానికి కి.మీ.కు ఆ సంస్థ రూ.79ని అద్దెగా కోట్ చేసింది. అయితే దాన్ని కూడా కొంతమేర తగ్గించాలని ఆర్టీసీ కోరింది. త్వరలో దానిపై కూడా నిర్ణయం వెలువడనుంది. -
ఆర్టీసీకి కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ 2015 తర్వాత పెద్దఎత్తున కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. మొత్తం వెయ్యి బస్సులను కొనేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. అశోక్ లేలాండ్ కంపెనీ సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల టెండర్లు దక్కించుకుంది. బస్సుల తయారీ పూర్తి కావస్తుండటంతో దశలవారీగా వాటిని ఆర్టీసీకి సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీబస్సులు ఆర్టీసీకి చేరాయి. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేయబోతోంది. తొలిసారి కంపెనీలోనే బస్సు తయారీ గరుడ లాంటి ఏసీ కేటగిరీ బస్సులు మినహా మిగతావాటికి సంబంధించిన చాసీస్‌ను మాత్రమే ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. ఆర్టీసీకి ముందు నుంచి సొంతంగా బస్‌బాడీ యూనిట్ ఉండటమే దీనికి కారణం. దాదాపు 250 మంది సిబ్బందితో మియాపూర్‌లో ఆర్టీసీకి పెద్ద బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. చాసీస్లను కొనుగోలు చేసి ఇందులో బాడీలను సొంతంగా కట్టించుకునేది. కానీ, ఆర్థిక ఇబ్బందులతో బస్‌బాడీ నిర్వహణను భారంగా భావించి దాన్ని క్రమంగా పక్కనపెట్టేస్తూ వచ్చింది. దీంతో గతంలోనే సూపర్ లగ్జరీ బస్సులను కొన్నప్పుడు, కంపెనీ నుంచి చాసీస్ కొని ప్రైవేటు సంస్థతో బాడీ కట్టించింది. కానీ, ఈసారి బాడీతో కలిపే బస్సులు కొనాలని నిర్ణయించి ఆ మేరకే టెండర్లు పిలిచింది. ఫలితంగా ఆదివారం సరఫరా అయిన 4 బస్సులు పూర్తి బాడీతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఆర్టీసీకి చేరాయి. బాడీలకు కొత్త లుక్ ఇప్పుడు అశోక్‌లేలాండ్ తయారీ చేసిన బస్సుల బాడీలు కొత్త లుక్ సంతరించుకున్నాయి. ముందుభాగం ఓల్వో బస్సును పోలినట్టుగా ఉంది. గతంలో కొన్న సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు గులాబీ రంగుతో రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ కొత్త బస్సులు తెలుపు రంగుపై నీలం, క్రీమ్ రంగు స్ట్రైప్లతో కనిపిస్తున్నాయి. ముందుభాగంలో తెలుపు, క్రీమ్ కలర్ స్ట్రైప్స్ ఏర్పాటు చేశారు. లైట్లు ఉన్న భాగాన్ని నలుపు రంగులో ఉంచారు. సామగ్రి పెట్టేందుకు గతంతో పోలిస్తే చాలా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం నడుస్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 450 బస్సులు దాదాపు ఆరు లక్షల కి.మీ. మేర తిరిగాయి. దీంతో వాటిల్లో కొన్నింటిని ఆర్డినరీ బస్సులుగా, కొన్నింటిని పల్లెవెలుగు సర్వీసులుగా అధికారులు మార్చనున్నారు. ఆ 450 బస్సుల స్థానంలో కొత్త సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. మంచి లాభాలతో తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రూట్లను అప్‌గ్రేడ్ చేసి దాదాపు 150 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 130 డీలక్స్ బస్సులన్నీ 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగి ఉన్నందున వీటిని తుక్కుగా మార్చాలని నిర్ణయించారు. వాటి స్థానంలో కొత్త డీలక్స్ బస్సులు రానున్నాయి. 370 ఇతర కేటగిరీ బస్సుల్లో అన్ని డీలక్స్ బస్సులనే తీసుకోవాలా, కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు తీసుకోవాలా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలుత 130 డీలక్స్ బస్సులను సరఫరా చేయాలని అశోక్ లేలాండ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడ్డాక తొలిసారి స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే 16 కొత్త బస్సులకు టెండర్లు పిలిచింది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. వాటిని దూరప్రాంత నగరాలు, పట్టణాలకు తిప్పనుంది. -
టాంజానియా పోలీసు బలగాలకు అశోక్ లేలాండ్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తాజాగా టాంజానియా పోలీసు బలగాలకు 150 వాహనాలను సరఫరా చేసింది. వీటిలో సిబ్బంది ప్రయాణించేందుకు కావాల్సిన బస్‌లు, పోలీస్ ట్రూప్ క్యారియర్స్, అంబులెన్స్‌లు, రికవరీ ట్రక్స్, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. టాంజానియా పోలీసు బలగాలు ఇప్పటికే అశోక్ లేలాండ్ తయారీ 475 వాహనాలను విని యోగిస్తున్నాయి. మరిన్ని వెహికిల్స్‌ను టాంజానియాకు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. -
అశోక్ లేలాండ్ లాభం రూ.199 కోట్లు
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌కు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.199 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఆదాయం దాదాపు రెట్టింపై రూ.8,266 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,458 కోట్లుగా ఉంది. దేశీ మార్కెట్లో మధ్య, భారీ స్థాయి వాణిజ్య విక్రయాలు 25,475 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలం వీటి విక్రయాలు 11,988 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ వాటా 9.6 శాతంగా ఉంది. స్వల్ప స్థాయి వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 17,040 యూనిట్లుగా ఉన్నా యి. ఎగుమతులు 25 శాతం పెరిగి 2,780 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం ధోరణలు ఉన్నా, దేశీ వాణిజ్య వాహన మార్కెట్లో వృద్ధి చక్కగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి విక్రయాలు పరిశ్రమ వ్యాప్తంగా నమోదయ్యాయి’’అని అశోక్‌లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. మెరుగైన ఉత్పత్తులు, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత భవిష్యత్తు ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. -
దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రయ్!
డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా. అవి మనం నేరుగా చూడకపోవచ్చు గానీ 90 దశకంలో కొన్ని సినిమాల్లో చూసుంటాం. ప్రస్తుత అవే కాలానికి అనుగుణంగా ఏసీ హంగులతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చెంది మళ్లీ రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని హిందూజా గ్రూప్‌నకు చెందిని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లే ల్యాండ్ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన స్విచ్ మొబిలిటీ తయారు చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్ రోడ్లపైకి రానున్నాయి. తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించారు. ముంబైలోని బృహన్ ముంబాయ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్లు స్విచ్ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్ గన్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ. First AC double decker bus by @switchEVglobal entering Mumbai this morning. The launch is tomorrow. (Credits to respective owner) pic.twitter.com/QrQKjUy3X4 — Rajendra B. Aklekar (@rajtoday) August 17, 2022 చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
స్విచ్ మొబిలిటీ ఈవీ12 ఈ–బస్
చెన్నై: అశోక్ లేలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ ఈవీ12 పేరుతో ఈ–బస్‌ను ఆవిష్కరించింది. నగరంలో, నగరాల మధ్య, సిబ్బంది రవాణా, పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే రకాన్నిబట్టి 100–300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు స్విచ్ మొబిలిటీ డైరెక్టర్ మహేశ్ బాబు తెలిపారు. బస్ ఖరీదు రూ.1 కోటి ఉంటుందన్నారు. 600లకుపైగా బస్‌లకు ఆర్డర్లు ఉన్నాయని వివరించారు. వచ్చే మూడేళ్లలో స్విచ్ మొబిలిటీ రూ.2,810 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ చైర్మన్ ధీరజ్ హిందూజా వెల్లడించారు. కొత్త ఉత్పత్తుల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి కేంద్రం స్థాపనకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను సైతం పరిచయం చేస్తామన్నారు. -
అశోక్ లేలాండ్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 377 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,142 కోట్ల నుంచి రూ. 9,927 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,831 కోట్ల నుంచి రూ. 9,430 కోట్లకు పెరిగాయి. ముడివ్యయాలు రూ. 1,100 కోట్లమేర పెరిగి రూ. 6,581 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు రూ. 267 కోట్ల అనుకోని నష్టం నమోదైనట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండు ప్రకటించింది. -
పాత వాణిజ్య వాహన వ్యాపారంలోకి అశోక్ లేలాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ పాత వాణిజ్య వాహనాల విక్రయంలోకి ప్రవేశించింది. ఈ మేరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌తో చేతులు కలిపింది. అశోక్ లేలాండ్ తయారీ పాత వాహనం ఇచ్చి కొత్తది కొనుగోలు, పాత వాహన విక్రయానికి మహీంద్రాకు చెందిన 700లకుపైగా పార్కింగ్ కేంద్రాలు వేదికగా మారనున్నాయి. పాత వాహనాల మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. -
అశోక్ లేలాండ్ ఎండీ రాజీనామా
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో విపిన్ సోంధి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలం కొనసాగనుంది. ధీరజ్ హిందూజా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్, నాన్–ఇండిపెండెంట్ డైరెక్టర్–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తదుపరి ఎండీ, సీఈవో ఎంపిక కోసం బోర్డు త్వరలో సమావేశం కానుందని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
హావెల్స్ రికార్డ్- అశోక్ లేలాండ్ అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ హావెల్స్ ఇండియా కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ అక్టోబర్ నెలలో అమ్మకాలు జోరందుకోవడంతో ఆటో రంగ కంపెనీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హావెల్స్ ఇండియా నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 325 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,452 కోట్లకు చేరింది. ఇబిటా 79 శాతం ఎగసి రూ. 421 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.7 శాతం బలపడి 17.2 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 816 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 827 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడింది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 51,000 కోట్లను అధిగమించింది. అశోక్ లేలాండ్ ఈ అక్టోబర్ నెలలో అశోక్ లేలాండ్ 1 శాతం అధికంగా 9,989 వాహనాలను విక్రయించింది. ఇందుకు ఎల్‌సీవీలు, ట్రక్కుల విక్రయాలలో 14 శాతం నమోదైన వృద్ధి సహకరించింది. అయితే మధ్య, భారీస్థాయి వాహన విక్రయాలు 11 శాతం క్షీణించాయి. అయితే నెలవారీగా చూస్తే మొత్తం అమ్మకాల పరిమాణం 20 శాతం వృద్ధి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎల్‌సీవీలు, వాణిజ్య వాహనాలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో కంపెనీ 8,344 యూనిటన్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం బలపడి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 87.5కు చేరువైంది. గత మూడు నెలల్లో ఈ షేరు 72 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్‌గేర్‌లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్‌లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్‌ను ప్రకటించడం తెలిసిందే. -
అశోక్ లేలాండ్ బీఎస్–6 వాహనాలు
చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌లేలాండ్.. భారత్ స్టేజ్(బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్ బిజినెస్ ప్రోగ్రామ్‌గా పిలిచే ఈ విధానం టైలర్‌మేడ్ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దమవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉండగా, నూతన మోడళ్ల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు. ఈ కామర్స్, పార్సిల్స్‌కు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్‌ను తరలించే వాహనాలతోపాటు, డిఫెన్స్, టూరిస్ట్ బస్సులను ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల వాహనాల విక్రయాలు నమోదు కాగా, త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్–10 స్థానంలోకి చేరనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదల చేయడం ద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఇంజన్లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్‌కు సమాచారం వస్తుందని వెల్లడించారు. నూజివీడు ప్లాంట్‌కు మందగమనం సెగ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ప్లాంట్ ఏర్పాటు చేయగా, ఆ నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని ధీరజ్ హిందుజా అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రైవేటు ప్యాసింజర్ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు. -
కారు.. బైకు.. రివర్స్‌గేర్‌లోనే!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. సెప్టెంబర్‌లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ కంపెనీగా కొనసాగుతోన్న మారుతీ సుజుకీ అమ్మకాలు గతనెల్లో 26.7 శాతం పడిపోయాయి. తాజా అమ్మకాల గణాంకాలపై హ్యుందాయ్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడకపోవడం వల్ల సెప్టెంబర్‌లో కూడా అమ్మకాలు క్షీణించాయి. ఈ అంశమే తాజా గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది’ అని అన్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో అమ్మకాలు గాడిన పడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్(ఆటోమోటివ్) వీజయ్ రామ్ నక్రా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి వర్షాలు అనుకున్నస్థాయిని మించి నమోదుకావడం, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోత విధించి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలను వెల్లడించడం వంటి సానుకూలతతో త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. పండుగల సీజన్లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. పెరిగిన డాట్సన్ గో, గో ప్లస్ ధరలు ‘డాట్సన్ గో, గో ప్లస్’ ధరలను 5 శాతం మేర పెంచినట్లు జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని నిస్సాన్ ఇండియా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా పెంపు అనంతరం ఈ మోడల్ కార్ల ధరల శ్రేణి రూ. 3.32 లక్షలు నుంచి రూ. 3.86 లక్షలుగా ఉన్నట్లు వివరించారు. వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ధరల్లో పెరుగుదల ఉంటుందని వెల్లడించారు. -
అశోక్ లేలాండ్ లాభం 21% డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 21 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.485 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.381 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఇతర ఆదాయం తక్కువగా ఉండటం, అమ్మకాలు కూడా తగ్గడంతో నికర లాభం తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,191 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.6,325 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు 6 శాతం తగ్గగా, ఇతర ఆదాయం 43 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరిందని వివరించింది. ఎబిటా 23 శాతం తగ్గి రూ.650 కోట్లకు చేరగా, ఎబిటా మార్జిన్ 1.4 శాతం తగ్గి 10.3 శాతంగా ఉందని కంపెనీ పేర్కొంది. పన్ను వ్యయాలు 56 శాతం తగ్గి రూ.106 కోట్లకు తగ్గాయని తెలిపింది. పూర్తి రేంజ్ ఎల్‌సీవీలు... ధరల ఒత్తిడి, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి సమస్యలున్నప్పటికీ, ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని కంపెనీ సీఎఫ్ఓ గోపాల్ మహదేవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, రెండంకెల ఎబిటా మార్జిన్ సాధించగలిగామన్నారు. తేలిక రకం వాణిజ్య వాహనాల (ఎల్సీవీ) వ్యాపారాన్ని అశోక్ లేలాండ్లో విలీనం చేశామని కంపెనీ ఎమ్డీ వినోద్ కె దాసరి చెప్పారు. 2020 నుంచి పూర్తి రేంజ్ ఎల్‌సీవీలను ఆఫర్ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేర్ 7 శాతం లాభంతో రూ.84.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 4 శాతం నష్టంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.77.75ను తాకింది. -
ద్వితీయార్ధం దాకా ఇంతే!
ముంబై, సాక్షి బిజినెస్ బ్యూరో: గతేడాది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు హెవీ, మీడియమ్ కమర్షియల్ వెహికల్ మార్కెట్‌ను కుంగదీశాయని, వీటి ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం రెండో అర్ధభాగం వరకు కొనసాగవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ట్రక్ అండ్ బస్ సీఈఓ వినోద్ సహాయ్ చెప్పారు. ఈ నిబంధనల వల్ల మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్ అమ్మకాలు దాదాపు 25 శాతం క్షీణించాయన్నారు. నిబంధనల ప్రభావం తమపై కూడా పడిందని, అందుకే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ క్యూ3లో వ్యాపారం దాదాపు 30– 40 శాతం మేర కుంచించుకుపోయిందని చెప్పారు. ‘‘క్రమంగా ఈ నెగిటివ్ ప్రభావం నుంచి మార్కెట్ కోలుకుంటోంది. క్యూ4 నాటికి విక్రయాల్లో వృద్ధి తరుగుదల పది శాతానికి పరిమితం కావచ్చు. కొత్త నిబంధనలతో పాత ట్రక్కు యజమానులకు ఊరట లభించింది. దీంతో కొత్త వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పడ్డాయి’’ అని వివరించారు. కొత్త యాక్సిల్ లోడు నిబంధనల ప్రభావం ఈ ఏడాది ద్వితీయర్ధానికి పూర్తిగా తొలగిపోతే తిరిగి ట్రక్ మార్కెట్ వృద్ధి బాట పట్టవచ్చని అంచనా వేశారు. బీఎస్6 నిబంధనలు అమల్లోకి వస్తే ట్రక్ ధరలు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు పెరగవచ్చని చెప్పారు. ఐసీవీ విభాగంపై ప్రత్యేక ఫోకస్: పవన్ గోయింకా ఐసీవీ (ఇంటర్మీడియరీ కమర్షియల్ వెహికల్స్) విభాగం ఏటా 15–17 శాతం చక్రీయ వృద్ధి సాధిస్తోందని ఎంఅండ్ఎం ఎండీ పవన్ గోయింకా చెప్పారు. ఆటో కంపెనీలు హెచ్‌సీవీ (హెవీ కమర్షియల్ వెహికల్స్) వచ్చిన తరుగుదలను తట్టుకునేందుకు ఐసీవీ, ఎల్సీవీ మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయని, అందుకే తామూ ఈ విభాగంలో ప్రవేశించామని తెలిపారు. ఈ విభాగంలో టాప్3 కంపెనీలతో (టాటామోటర్స్, అశోక్ లేలాండ్, వోల్వో ఐషర్) పోటీ పడేలా ఫ్యూరియో ట్రక్ మోడల్‌ను డిజైన్ చేశామన్నారు. ‘‘దీనిపై రూ.600 కోట్లు వెచ్చించాం. ఐసీవీ విభాగంలో సింగిల్ ట్రక్ ఓనర్స్ ఎక్కువమంది ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తెచ్చాం. ప్యూరియోను గతేడాదే ఆవిష్కరించినా, ఆరు నెలలపాటు అన్ని రకాలుగా సమీక్షించామని, ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకొని మార్కెట్లోకి విడుదల చేశాం’’ అన్నారు. -
అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు దక్కాయి. చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్‌ల నుంచి ఆర్డర్లు లభించాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఈ సంస్థల నుంచి మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎమ్డీ, వినోద్ కె దాసరి వివరించారు. ఈ బస్సులను మరో రెండు నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, నవకల్పనలతో బస్సులను తయారు చేయడం వల్ల భారత బస్సు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు. -
అశోక్ లేలాండ్ ఆదాయం 25% అప్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 37 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.460 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.6,076 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.7,608 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎండీ వినోద్ కె. దాసరి వెల్లడించారు. తీవ్రమైన పోటీ, అనేక సవాళ్లున్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటం కొనసాగుతున్నప్పటికీ, పటిష్టమైన వ్యయ నియంత్రణ విధానాలతో ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ సీఏఎఫ్ఓ గోపాల్ మహదేవన్ పేర్కొన్నారు. సీఈఓ పదవికి వినోద్ రాజీనామా 14 ఏళ్లుగా అశోక్ లేలాండ్ కంపెనీలో వివిధ హోదాల్లో విజయవంతంగా పనిచేసిన వినోద్ కె. దాసరి... సీఈఓ, ఎమ్డీ పదవులకు రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఆయన రాజీనామా వచ్చే ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో పాటు, కొత్త విషయాలపై తనకున్న ఆసక్తిని మెరుగుపరచుకోవటానికి ఆయన రాజీనామా చేస్తున్నారని, ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని కంపెనీ వివరించింది. తక్షణం కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ధీరజ్ హిందుజా వ్యవహరిస్తారని పేర్కొంది. కొత్త సీఈఓ, ఎమ్డీ నియామకం కోసం నామినేషన్స్, రెమ్యూనరేషన్ కమిటీ త్వరలోనే కసరత్తు ఆరంభించనున్నదని తెలిపింది. ఫలితాలు, వినోద్ దాసరి రాజీనామా మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. మంగళవారం బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేర్ 0.8% లాభంతో రూ.119 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: హిందుజాల ప్రధాన కంపెనీ, అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 3 రెట్లు పెరిగింది. గత క్యూ1లో నికర లాభం స్డాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.111 కోట్లుగా ఉండగా, ఈ క్యూ1లో రూ.370 కోట్లుగా ఉందని అశోక్ లేలాండ్ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. గత క్యూ1లో ఆదాయం రూ.4,534 కోట్లు కాగా, ఈ క్యూ1లో రూ.6,250 కోట్లకు చేరిందన్నారు. ‘‘గత ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున గత క్యూ1, ఈ క్యూ1 లాభాలను, ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదు. మౌలిక రంగంపై పెట్టుబడులు పెరగడం, గత క్యూ1లో బేస్ బాగా తక్కువగా ఉండటం వంటి కారణాలతో వాహన పరిశ్రమ అమ్మకాలు 84 శాతం ఎగిశాయి. గత క్యూ1లో 28,498గా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ1లో 42,128కు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 51%, ఎగుమతులు 22% ఎగిశాయి’’ అని వినోద్ కె. దాసరి వివరించారు. ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, బస్సుల విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు. భారీ డిస్కౌంట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిశ్రమలో వర్కింగ్ క్యాపిటల్‌పై కఠినమైన నియంత్రణ పాటిస్తున్నామని, లాభదాయకత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేర్ 2% లాభంతో రూ.129 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ లాభం 40% అప్
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ, అశోక్ లేలాండ్ నికర లాభం 2017–18 జనవరి–మార్చి క్వార్టర్లో 40 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.476 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.667 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,133 కోట్ల నుంచి రూ8,830 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.43 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,612 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధితో రూ.1,816 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో చాలా ఘనతలు సాధించామని, ఇది అత్యంత సంతృప్తికరమైన సంవత్సరమని వినోద్ చెప్పారు. రికార్డ్ స్థాయి లాభాలను, ఆదాయాన్ని సాధించామని, ఏడాది చివరినాటికి నగదు నిల్వలు రూ.3,000 కోట్లకు పెరిగాయని కంపెనీ సీఎఫ్ఓ గోపాల్ మహదేవన్ తెలిపారు. ఎగుమతులు జోరుగా పెరిగాయని, అంతర్జాతీయ వ్యాపారం వృద్ధి, రక్షణ, విక్రయానంతర సేవల సెగ్మెంట్లు కూడా మంచి వృద్ది సాధించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని దాసరి పేర్కొన్నారు. అశోక్ లేలాండ్ వెహికల్స్, ఆష్లే పవర్‌ట్రెయిన్, అశోక్ లేలాండ్ టెక్నాలజీస్.. ఈ మూడు కంపెనీలను అశోక్ లేలాండ్లో విలీనం చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఈ విలీనానికి సంబంధిత ఇతర ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొన్నారు. -
రేట్లు పెంచేసిన అశోక్ లేలాండ్
న్యూఢిల్లీ: వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ ‘అశోక్ లేలాండ్’ తన వాహన ధరలను పెంచుతోంది. వచ్చే నెల నుంచి వాహన ధరలను కనీసం 2 శాతం పెంచుతామని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, ఏఐఎస్ 140 నిబంధన అమలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఏఐఎస్ 140 నిబంధన ప్రకారం వాహన కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి కొత్త, ప్రస్తుతమున్న ప్రజా రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్, ఎమర్జెన్సీ బటన్లను అమర్చాలి. కాగా అశోక్ లేలాండ్ కంపెనీ ట్రక్కులు, బస్సులు సహా పలు రకాల వాణిజ్య వాహనాలను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇక టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా, ఆడి కంపెనీలు కూడా వచ్చే నెల నుంచి వాటి వాహన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
అశోక లేలాండ్ చేతికి భారీ ఆర్డర్
సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ ఆర్డ్ర్ను తన ఖాతాలో వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్‌ను సాధించింది. బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర్డర్నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2వేల పాసింజర్ వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100 చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్ లేలాండ్ షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి. -
అశోక్ లేలాండ్ లాభం 334 కోట్లు
ముంబై: హిందుజా గ్రూప్‌కు చెందిన వాహన దిగ్గజ కంపెనీ అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి రూ.334 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.294 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్ లేలాండ్ పేర్కొంది. గత క్యూ2లో రూ.4,943 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.6,102 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎఫ్ఓ గోపాల్ మహదేవన్ తెలిపారు. ఆదాయం అధికంగా రావడం, ఎగుమతులు 39 శాతం పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 1న హిందుజా ఫౌండరీస్ను విలీనం చేసుకున్నందున గత క్యూ2 ఫలితాలతో, ఈ క్యూ2 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఈ క్యూ2లో 10 శాతం ఇబిటా మార్జిన్ సాధించామని, గత 11 క్వార్టర్లలో రెండంకెల ఇబిటా మార్జిన్‌ను వరుసగా పది క్వార్టర్లలో సాధించామని వివరించారు. గత క్యూ2లో రూ.536 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ2లో రూ.612 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతులు 39 శాతం అప్.. ఈ క్యూ2లో ఎగుమతులు 39 శాతం వృద్ధితో 4,437కు పెరిగాయని మహదేవన్ చెప్పారు. ఇక దేశీయంగా మీడియమ్, భారీ వాణిజ్య వాహన విక్రయాలు 22 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. గత క్యూ2లో 8,100గా ఉన్న తేలిక రకం వాణిజ్య వాహన అమ్మకాలు ఈ క్యూ2లో 18 శాతం వృద్ధితో 9,588కు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాలు సంతృప్తికరం... ఆర్థిక ఫలితాలు బాగా ఉన్నాయని మహదేవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. వర్కింగ్ క్యాపిటల్ తగిన స్థాయిలోనే ఉందని, రుణ–ఈక్విటీ నిష్పత్తి 0.35:1 గా ఉందని పేర్కొన్నారు. లాభదాయక వృద్ధి బాటను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, తమ మార్కెట్ వాటా పెరిగిందని అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. ఐఈజీఆర్ టెక్నాలజీతో రూపొందించిన బీఎస్ ఫోర్ వాహనాలకు మంచి స్పందన లబిస్తోందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అశోక్ లేలాండ్ షేర్ 2 శాతం నష్టపోయి రూ.119 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.74గానూ, గరిష్ట స్థాయి రూ.133 గానూ ఉన్నాయి. -
అశోక్ లేలాండ్ ‘దోస్త్ ప్లస్’
► 2.75 టన్నుల తేలికపాటి రవాణా వాహనం ► ఎక్స్‌షోరూం ధర రూ.5.47 లక్షల నుంచి.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ‘దోస్త్ ప్లస్’ పేరుతో 2.75 టన్నుల తేలికపాటి రవాణా వాహనాన్ని (ఎల్సీవీ) హైదరాబాద్ వేదికగా సోమవారమిక్కడ భారత మార్కెట్లో విడుదల చేసింది. పేలోడ్ సామర్థ్యం 1.475 టన్నులు. 170 ఎన్ఎమ్ టార్క్, 60 హెచ్‌పీ పవర్‌తో 1.5 టీడీసీఆర్ ఇంజన్‌ను పొందుపరిచారు. రెండేళ్ల అదనపు వారంటీ ఉంది. మూడు వర్షన్లలో లభిస్తుంది. టాప్ ఎండ్ వర్షన్‌కు ఏసీ, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లను జోడించారు. ఈ వాహనం 2–3.5 టన్నుల విభాగంలో పోటీపడుతుందని కంపెనీ ఎల్సీవీ విభాగం ప్రెసిడెంట్ నితిన్ సేథ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. దోస్త్ బ్రాండ్‌లో 1.7 లక్షలకుపైగా వాహనాలు అమ్ముడయ్యాయని చెప్పారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.5.47 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. మూడేళ్లలో లక్ష యూనిట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో అశోక్ లేలాండ్ 20 శాతం వృద్ధితో 32,000 ఎల్‌సీవీలను విక్రయించింది. 2020 నాటికి అమ్మకాలు ఒక లక్ష యూనిట్లకు చేరుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు నితిన్ సేథ్ తెలిపారు. అలాగే 5 శాతం ఉన్న ఎగుమతుల వాటాను 20 శాతానికి చేరుస్తామన్నారు. ‘ఎల్‌సీవీల విభాగంలో ప్రతి ఆరు నెలలకో కొత్త మోడల్‌ను విడుదల చేస్తాం. ఏటా 4.5 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్న ఈ పరిశ్రమలో 2–3.5 టన్నుల విభాగం 60 శాతం కైవసం చేసుకుంది. ఈ సెగ్మెంట్లో మరిన్ని మోడళ్లు తీసుకొస్తాం. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఇది ఎల్సీవీ అమ్మకాలకు బూస్ట్‌నిచ్చింది. అయితే 90 శాతం విక్రయాలు ఫైనాన్స్ ద్వారా జరుగుతాయి. క్యాష్ ద్వారా వాహనాన్ని కొనే 10 శాతం కస్టమర్లపైనే డీమోనిటైజేషన్ తీవ్ర ప్రభావం చూపింది’ అని వివరించారు. -
అశోక్ లేలాండ్ లాభం 111 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం అశోక్ లేలాండ్ నికర లాభం 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా తగ్గి రూ. 111.23 కోట్లకు దిగింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ. 291 కోట్లు. అయితే హిందూజా ఫౌండ్రీస్ విలీనం కారణంగా ఈ కంపెనీ ఆర్థికాంశాలు కూడా కలిసివున్నందున, తమతాజా ఫలితాల్ని గతేడాదితో పోల్చలేమని అశోక్‌లేలాండ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కానీ ముగిసిన త్రైమాసికంలో తమ లాభదాయకత తగ్గినట్లు కంపెనీ తెలిపింది. తాజా త్రైమాసికంలో ఫారిన్ ఎక్సే్ఛంజ్ స్వాప్స్ కారణంగా రూ. 2.67 కోట్ల నష్టం వచ్చిందని, గతేడాది ఇదేకాలంలో ఈ కార్యకలాపాల ద్వారా రూ. 49 కోట్ల లాభం వచ్చినట్లు కంపెనీ వివరించింది. అశోక్ లేలాండ్ మొత్తం ఆదాయం రూ. 4,553 కోట్ల వద్ద స్థిరంగా నమోదయ్యింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ. 4,569 కోట్లు. -
అశోక్ లేలాండ్‌కు రూ.476 కోట్ల లాభం
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ మార్చి క్వార్టర్లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రూ.476 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విక్రయాలు భారీగా పుంజుకోవడం, నిర్వహణ వ్యయాలు తగ్గడం లాభాలకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.141 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆదాయం 13% వృద్ధితో రూ.6,237 కోట్ల నుంచి రూ.7,057 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 3 రెట్లు పెరిగి రూ.1,223 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో లాభం కేవలం రూ.390 కోట్లే. ఆదాయం 7% పెరిగి రూ.21,332 కోట్లుగా నమోదైంది. -
టీటీడీకి అశోక్ లెలాండ్ విరాళం
-
వేంకటేశ్వరస్వామికి లారీ బహుకరణ
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అశోక్ లేలాండ్ కంపెనీ యాజమాన్యం లారీని బహూకరించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే దాసరి శనివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ఎదుట లారీకి పూజలు నిర్వహించారు. లారీకి సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. వాహనం విలువ రూ.18.88 లక్షలుగా వినోద్ కే దాసరి పేర్కొన్నారు. -
అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త ట్రక్కులు
గురు, పార్టనర్ వాహనాలు విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మరో రెండు ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్మీడియల్ కమర్షియల్ వెహికిల్ (ఐసీవీ) విభాగంలో ‘గురు’, లైట్ కమర్షియల్ వెహికిల్ (ఎల్సీవీ) విభాగంలో పార్టనర్ వాహనాలను మంగళవారమిక్కడ విడుదల చేశారు. వేరియంట్లను బట్టి గురు వాహనం ధర రూ.14.35 లక్షల నుంచి రూ.16.72 లక్షలు, పార్టనర్ ధర రూ.10.29 లక్షల నుంచి రూ.10.59 లక్షల మధ్య ఉంది. ఈ సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో సంస్థ ట్రక్స్ విభాగం గ్లోబల్ ప్రెసిడెంట్ అనూజ్ కథూరియా మాట్లాడుతూ... ఈ రెండు వాహనాలు కూడా భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవేనని, అయితే బీఎస్–3 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. గత నెలలో ఈ రెండు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చామని.. ఇప్పటికే వంద బుకింగ్స్ కూడా అయ్యాయని చెప్పారాయన. వచ్చే వారంలో సెంట్రల్, పశ్చిమ జోన్లో విడుదల చేయనున్నట్లు అనూజ్ తెలియజేశారు. అన్ని రకాలూ కలిసిన వాణిజ్య వాహనాల మార్కెట్లో అశోక్ లేలాండ్ 30 శాతం వాటా కలిగి ఉందని.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల్లో తమ వాటా 46.8 శాతం వరకూ ఉందని ఆయన చెప్పారు. ఐసీవీ వాహనాలు ఏటా 50 వేలు విక్రయమవుతుండగా ఇందులో అశోక్ లేలాండ్ వాటా 20 శాతం వరకూ ఉందని చెప్పారాయన. దీంతో ప్రస్తుతం సంస్థ పోర్ట్‌ఫోలియోలో 2 టన్నుల నుంచి 49 టన్నుల వరకూ అన్ని రకాల వాణిజ్య వాహనాలూ ఉన్నట్లయిందని వివరించారు. -
అశోక్ లేలాండ్ అదరహా!
ముంబై: డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ హెవీ కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని, నికర లాబాలను రిపోర్టు చేసింది. వాల్యూమ్స్ లో కూడా వేగం బాగా పుంజుకున్న ఈ హిందుజా ఫ్లాగ్ షిప్ అశోక్ లేలాండ్ నికర లాభం రూ.185. 88కోట్లను ఆర్జించింది. రూ 4.723 కోట్ల అమ్మకాలపై ఈ లాభాలను నమోదుచేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ నికర లాభం రూ.213. 70 కోట్లగా వుంది. ఈ త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రికార్డు వాల్యూమ్లను పోస్ట్ చేసింది. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు25,285 యూనిట్లుగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో మెటీరయల్ కాస్ట్ బాగా పెరగడం సవాల్ గా మారిందని అశోక్ లేలాండ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వినోద్ కె దాసరి తెలిపారు. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ, ఇపుడిపుడే పరిశ్రమ కోలుకుంటోందన్నారు. ఆరోగ్యకరమైన ఆపరేటింగ్ మార్జిన్లు నిర్వహణ తరువాతి క్వార్టర్ లో చాలా సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ వాణిజ్య వాహనాల డిమాండ్ పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో అశోక్ లేలాండ్ పాజిటివ్ గా ఉందనుందని ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ & సెక్యూరిటీస్ హెడ్ ఎకె ప్రభాకర్ చెప్పారు. దీంతో నేటి మార్కెట్లో 7.16 శాతం వృద్ధిని సాధించి నిఫ్టీని అధిగమించింది. -
అశోక్ లేలాండ్.. 2 వాణిజ్య వాహనాలు
చెన్నై: హిందుజా గ్రూప్‌కు చెందిన ‘అశోక్ లేలాండ్’ కంపెనీ తన మధ్యస్థ, తేలికపాటి వాణిజ్య వాహన విభాగపు పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. కంపెనీ తాజాగా మధ్యస్థ వాణిజ్య వాహనం ‘గురు’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే తేలికపాటి వాణిజ్య వాహనం ‘పార్ట్నర్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. గురు వాహనం ధర రూ.14.35 లక్షలు–రూ.16.72 లక్షల శ్రేణిలో, పార్ట్నర్ వాహనం ధర రూ.10.29 లక్షలు–రూ.10.59 లక్షల శ్రేణిలో ఉందని కంపెనీ పేర్కొంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ చెన్నైవి. తాజా కొత్త ఆవిష్కరణలతో మార్కెట్లో తమ స్థానం మరింత పదిలమౌతుందని, అంతర్జాతీయంగా టాప్–10 ట్రక్ తయారీ కంపెనీల్లో స్థానం పొందడమే లక్ష్యమని అశోక్ లేలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె.దాసరి తెలిపారు. ‘గురు’.. 12 టన్నులు, 13 టన్నుల కేటగిరీలో పలు రకాల బాడీ ఆప్షన్లలో బీఎస్–3, బీఎస్–4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
అశోక్ లేలాండ్ లాభం 71 శాతం జూమ్..
న్యూఢిల్లీ: జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో హిందుజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ అదిరిపోయే లాభాలను నమోదు చేసింది. 71 శాతం అధికంగా రూ.294.41 కోట్ల స్టాండలోన్ లాభాన్ని కంపెనీ ఆర్జించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.172 కోట్లుగా ఉంది. ఈ మేరకు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో రూ.5,274 కోట్లుగా ఉండగా, తాజాగా అది 7 శాతం తగ్గి రూ.4,911 కోట్లకు పరిమితం అరుుంది. విదేశీ మారక ద్రవ్యం రూపంలో కంపెనీకి రూ.6.56 కోట్లు కలిసివచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జారుుంట్ వెంచర్లు, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడుల వల్ల రూ.157 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సానుకూల ఫలితాలతో బీఎస్ఈలో అశోక్‌లేలాండ్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభంతో రూ.91.75 వద్ద క్లోజరుుంది. -
అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్
ముంబై: ఆటోమొబైల్ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అశోక్ లేలాండ్ భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. టాంజానియా ప్రభుత్వం నుంచి 170 మిలియన్ డాలర్లు సుమారు రూ 1,130.96 కోట్ల విలువైన ఆర్డర్ ను దక్కించుకుంది. అశోక్ లేలాండ్ వాహనాలు, జెన్ సెట్స్, విడిభాగాలు తదితర వర్క్ షాప్ కవసరమైన పరికరాలు, ట్రైయినింగ్ మాడ్యూల్స్ సరఫరా కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ ప్రభుత్వం నుంచి తమ వాహనాలు, విడిభాగాలు , అంబులెన్స్ పరికరాల కొనుగోలు కోసం భారీ ఆర్డర్ ను సాధించినట్టు గురువాం బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులద్వారా గ్లోబల్ గా విస్తరించాలన్న అశోక్ లేలాండ్ వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందమని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి ఒక ప్రకటనలో తెలిపారు . ఈ ప్రకటనలో ఇవాల్టి మార్కెట్ అశోక్ లేలాండ్ సుమారు 2శాతం లాభపడింది. తాజా ఆర్డర్ నేషనల్ ఎగుమతి భీమా ఖాతా(ఎన్ఈఐఎ) పథకంలో భాగంగా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఫైనాన్స్ చేసింది. -
ఏడాదిలో తెలంగాణ ప్లాంట్!
పెట్టుబడులతో సిద్ధం.. స్థల కేటాయింపే ఆలస్యం • ముందు బస్సుల బాడీ బిల్డింగ్ చేపడతాం • తరవాత ట్రక్కులు, భారీ వాహనాల తయారీ కూడా.. • ‘సాక్షి’తో అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి • దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ • సీటింగ్, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర రూ.2-4 కోట్లు • చెన్నై నుంచి సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి భారీ వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్... తెలంగాణలో ప్రతిపాదిత ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలియజేసింది. తొలి దశలో రూ.500 కోట్లతో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే పనులు మొదలుపెడతామని కంపెనీ ఎండీ వినోద్ కె దాసరి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తొలి దశలో 50-60 ఎకరాల స్థలం అవసరమని.. స్థల సమీకరణ పూర్తయితే 12-16 నెలల్లోనే ప్లాంట్‌ను ప్రారంభిస్తామని తెలియజేశారు. డిమాండ్‌ను బట్టి దశలవారీగా ట్రక్కులు, భారీ వాణిజ్య వాహనాలనూ ఈ ప్లాంట్‌లో అభివృద్ధి చేసే అవకాశాలున్నట్లు దాసరి తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సును మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో సోమవారమిక్కడ ఆయన మాట్లాడారు. డిమాండ్, స్థల కేటాయింపు, బిల్డింగ్ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తులో పెట్టుబడుల మొత్తాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 120 కి.మీ. ప్రయాణం సర్క్యూట్ సీరిస్‌లో భాగంగా దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్సును చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ వినోద్ కె దాసరితో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీ వెంకటరామన్, తమిళనాడు పరిశ్రమల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అంబుజ్ శర్మ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సు ప్రాజెక్ట్ కోసం రూ.200 కోట్ల వరకు ఖర్చయింది. చెన్నైలోని టెక్ సెంటర్లో దీన్ని రూపకల్పన చేశాం. బస్సు పూర్తి తయారీకి రెండేళ్ల సమయం పట్టింది. సర్క్యూట్ సీరిస్‌లో మెట్రో, పట్టణ, గ్రామీణ అవసరాలకు అనుగుణంగా బస్సులను తయారు చేస్తాం. వీటిని ఆర్డరుపై మాత్రమే తయారు చేస్తాం. డెలివరీకి మూడు వారాల నుంచి మూడు నెలలు పడుతుంది. ఈ బస్సులో లిథియం ఇయాన్ అనే బ్యాటరీలను వినియోగించాం. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. బస్సు మొత్తం ధరలో బ్యాటరీ వ్యయమే 60 శాతం వరకుంటుంది. ఎలక్ట్రిక్ బస్సులోని ప్రధాన ఫీచర్లివే... ⇔ ధర రూ.2-4 కోట్లు ⇔ సీట్ల సామర్థ్యం 31 నుంచి 80 ⇔ 3 గంటల్లోపే పూర్తి చార్జింగ్ ⇔ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. ప్రయాణం గరిష్ఠ వేగం 75 కి.మీ. ⇔ ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ట్రాకింగ్, కెమెరాలు ⇔ బ్యాటరీ జీవిత కాలం 5-7 ఏళ్లు -
ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సు వచ్చేసింది..
చెన్నై: హిందూజా గ్రూపునకు చెందిన ఆటో దిగ్గజం, కమర్షియల్ వెహికల్ మేజర్ అశోక్ లేలాండ్ 'సర్క్యూట్ సిరీస్' లో మొదటి ఎలక్ట్రిక్ కార్ ను సోమవారం లాంచ్ చేసింది. పూర్తిగా స్వదేశంలో డిజైన్ చేసి రూపొందించిన, పొల్యూషన్ లేని, 100 శాతం ఎలక్ట్రిక్ బస్ ను చెన్నైలో విడుదల చేసింది. జీరో ఎమిషన్ బస్ ను ప్రధానంగా దేశంలోని రోడ్లు, ప్రయాణీకులకోసం తయారు చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఇంధనాన్ని వినియోగించే కార్లకు బదులుగా పూర్తిగా విద్యుతో నడిచే 'సర్క్యూట్ సిరీస్' ఎలక్ట్రిక్ బస్సు లాంచింగ్ సంస్థ చర్రితలో ఒక మైలురాయి లాంటిదనీ, సిరీస్ లో 2017 నాటికల్లా ఎలక్ట్రిక్ బస్సును భారత మార్కెట్లో విడుదల చేస్తామన్న తమ వాగ్దానానికి కట్టుబడి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి తెలిపారు. 'ఆప్ కీ జీత్, హమారీ జీత్' అశోక్ లేలాండ్ ఫిలాసఫీకి అనుగుణంగా అన్ని నగరాల్లోని పర్యావరణాన్ని రక్షిస్తుందని చెప్పారు. ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం(ఎఫ్ డీఎస్ఎస్) తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బస్సు సింగిల్ చార్జ్ తో 120 కి.మీ దూరం ప్రయాణిస్తుందని అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకటరామన్ వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర, దేశ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజని, భారత మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారు తయారు చేయడం సంతోషమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అంబుజ్ శర్మ వ్యాఖ్యానించారు. వాహన ఇంధన దిగుమతి బిల్లులను తగ్గించాలన్న ప్రభుత్వం ఆలోచనకు ఇది దోహదం చేస్తుందని, భవిష్యత్తు తరాల కోసం ఒక ప్రకాశవంతమైన, క్లీన్ ఫూచర్ ను అందిస్తుందన్నారు. -
అశోక్ లేలాండ్ పెట్టుబడులు
► రూ. 500 కోట్లతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం ► వెయ్యి మందికిపైగా ఉపాధి ► సీఎం సమక్షంలో కుదిరిన ఎంవోయూ ► ఉత్పాదక రంగానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రూ. 500 కోట్ల పెట్టుబడితో బాడీ బిల్డింగ్ యూనిట్ నెలకొల్పేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్‌తో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి అవగాహనా ఒప్పందాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్టీసీకి, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుంచే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం తెలిపారు. జీహెచ్ఎంసీకి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణలో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టంను మెరుగుపరచడానికి అశోక్ లేలాండ్ సలహాలు తీసుకోవాలని రవాణా, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 45 శాతం ఉందని...వారికి సౌకర్యంగా ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్ మాణిక్ రాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వి. నర్సింహారెడ్డి, అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ పి. వెంకట్రామన్, ఇ. హరిహర్, హిందూజా ఫౌండేషన్ సీఈవో డి.ఎం. రెడ్డి, ఇ.డి. రాజీవ్ సింఘ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహకారానికి ముందుకొచ్చిన ఇండియన్ బ్యాంక్ దేశ విదేశాల పెట్టుబడిదారులను రాష్ట్రం ఆకర్షిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎం.కె.జైన్ తన బృందంతో కలసి సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు రుణం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాల్లో పెట్టుబడులకు సంసిద్ధతను వ్యక్తపరిచారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు రావడం శుభ పరిణామమని, వారిని ఆహ్వానిస్తున్నాని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవా రంగంలో వ్యవస్థల బలోపేతానికి బ్యాంక్ అందించే ఆర్థిక సహకారం దోహదపడుతుందని సీఎం ఆకాంక్షించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్ ఐపాస్ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్
♦ మూడు జేవీల్లో నిస్సాన్ వాటాల కొనుగోలుకు అశోక్ లేలాండ్ ఓకే ♦ ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం... న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్‌తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్‌కు విక్రయించేందుకు బుధవారం ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఒక సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు వెల్లడించాయి. 2008 మే నెలలో అశోక్ లేలాండ్ నిస్సాన్ వెహికల్స్(ఏఎల్ఎన్వీఎల్) పేరుతో వాహన తయారీ జేవీ, అదేవిధంగా ఇంజిన్ల ఉత్పత్తి కోసం నిస్సాన్ అశోక్ లేలాండ్ పవర్ ట్రెయిన్(ఎన్ఏఎల్పీటీ), సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి నిస్సాన్ అశోక్ లేలాండ్ టెక్నాలజీస్(ఎన్ఏఎల్) అనే మూడు జేవీలను ఈ కంపెనీలు నెలకొల్పాయి. వీటిలో ఈక్విటీ రూపంలో దాదాపు రూ.1,000 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మూడు జేవీలు ఇక అశోక్ లేలాండ్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లుగా మారతాయని, భారత్‌లోని వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల మేరకు ఈ డీల్ పూర్తవుతుందని సంయుక్త ప్రకటన తెలిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. దోస్త్, ఇతర ఎస్సీవీలకు తోడ్పాటు... అశోక్ లేలాండ్‌తో జేవీల నుంచి వైదొలగినప్పటికీ... కొన్ని వాహనాలకు సంబంధించి లెసైన్సింగ్‌కు ఇరు కంపెనీలు అంగీకరించాయి. ప్రధానంగా దోస్త్, ఇతర లైట్ కమర్షియల్ వాహనాల(ఎల్సీవీ)కు కొత్తగా లెసైన్సింగ్ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుంది. వీటికి ఇంజినీరింగ్, టెక్నాలజీ, డిజైన్‌ను నిస్సాన్ సమకూర్చింది. అదేవిధంగా కస్టమర్లకు సర్వీసింగ్, విడిభాగాల లభ్యత వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. మరోపక్క, దేశీయంగా తయారైన విడిభాగాల కొనుగోలును నిస్సాన్ కొనసాగించేందుకు కూడా ఇరు కంపెనీలు అంగీకరించాయి. ఎందుకీ తెగదెంపులు... వాస్తవానికి మూడు జేవీల్లో ఒకదాని నుంచి వైదొలగుతామంటూ ఈ ఏడాది ఆరంభంలోనే నిస్సాన్ టెర్మినేషన్ నోటీసులను అశోక్ లేలాండ్‌కు పంపింది. యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక స్కీమ్(ఈపీసీజీ) నిబంధనలను రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అశోక్ లేలాండ్ కోర్టుకెళ్లడంతో ఇరు కంపెనీల మధ్య విభేధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా జేవీల ద్వారా విడుదల చేసిన పలు మోడల్స్ మార్కెట్లో అంతగా విజయవంతం కాకపోవడం కూడా దీనికి కారణంగా నిలిచింది. ఇవాలియా ఎంపీవీని నిస్సాన్ నిలిపివేయగా... స్టైల్ ఎంపీవీ ఉత్పత్తిని అశోక్ లేలాండ్ ఆపేసింది. ఈ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. అయితే, విజయవంతంగా అమ్ముడవుతున్న దోస్త్ ఎల్‌సీవీని మాత్రమే ప్రస్తుతం అశోక్ లేలాండ్ కొనసాగిస్తోంది. అతేకాకుండా దోస్త్‌కు సంబంధించి నిస్సాన్ అధిక రాయల్టీని డిమాండ్ చేయడం కూడా అశోక్ లేలాండ్‌కు నచ్చలేదు. అయితే, జేవీ ద్వారా తమకంటే తమ భాగస్వామే ఎక్కువగా లాభపడుతోందని నిస్సాన్ భావిస్తూవచ్చింది. ఈ పరిణామాలన్నీ చివరకు భాగస్వామ్యం ముగిసేలా చేసింది. మూడు జేవీల్లో నిస్సాన్ వాటాను కొనుగోలు చేయడానికి మేం అంగీకరించాం. మా కీలక వాహన వ్యాపారంపై మరింత దృష్టిపెట్టేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి. అదేవిధంగా తాజా లెసైన్సింగ్ ఒప్పందం మేరకు నిస్సాన్‌తో మా బంధం కొనసాగుతుంది’. - వినోద్ దాసరి, అశోక్ లేలాండ్ ఎండీ భారత్‌లో మా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తాం. వాహనాల తయారీ, పరిశోధన-అభివృద్ధితో పాటు సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇక్కడి మార్కెట్లో ప్రధాన వాహన కంపెనీగా అవిర్భవించే సన్నాహాల్లో ఉన్నాం. అశోక్ లేలాండ్‌తో కొత్తగా కుదిరిన లెసైన్సింగ్ ఒప్పందం ప్రకారం ఎల్సీవీ కస్టమర్లకు నిస్సాన్ ఇంజనీరింగ్, సర్వీసింగ్, విడిభాగాల లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండదు’. - ఫిలిప్ గురిన్-బౌటాడ్, స్సాన్ గ్లోబల్ ఎల్సీవీ బిజినెస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ -
దేశీ వాహన విక్రయాలు జూమ్
♦ 9-15 శాతం మధ్యలో వృద్ధి ♦ హోండా, అశోక్ లేలాండ్ అమ్మకాలు దిగువకు ♦ నిస్సాన్ విక్రయాలు 2 రెట్లు అప్ ♦ రెనో అమ్మకాలు 8 రెట్లు జంప్ న్యూఢిల్లీ: దేశంలో వాహన విక్రయాల జోరు కొనసాగుతోంది. ఆగస్ట్ నెలలో వార్షిక ప్రాతిపదికన మారుతీ, మహీంద్రా, టయోటా వంటి పలు కంపెనీల అమ్మకాలు ఎగశారుు. హోండా, అశోక్ లేలాండ్ విక్రయాలు తగ్గారుు. వాహన విక్రయాల పెరుగుదలకు పండుగల సీజన్, రుతుపవనాలు, కొత్త ప్రొడక్ట్‌ల ఆవిష్కరణ, డీజిల్ వాహనాలపై నిషేధం ఎత్తివేత వంటి పలు అంశాలు సానుకూల ప్రభావం చూపారుు. మారుతీ సుజుకీ మొత్తం వాహన విక్రయాలు 12.2 శాతంమేర ఎగశారుు.1,17,864 యూనిట్ల నుంచి 1,32,211 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 12.3 శాతం వృద్ధితో 1,06,781 యూనిట్ల నుంచి 1,19,931 యూనిట్లకు ఎగశారుు. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం విక్రయాలు 14 శాతం వృద్ధితో 35,634 యూనిట్ల నుంచి 40,591 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 15 శాతం వృద్ధితో 32,122 యూనిట్ల నుంచి 36,944 యూనిట్లకు ఎగశారుు. టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ దేశీ విక్రయాలు 12,801 యూనిట్లుగా నమోదయ్యారుు. ఫోర్డ్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 23 శాతం వృద్ధితో 21,520 యూనిట్ల నుంచి 26,408 యూనిట్లకు పెరిగారుు. దీని దేశీ విక్రయాలు 2.6 శాతం వృద్ధితో 8,331 యూనిట్ల నుంచి 8,548 యూనిట్లకు ఎగశారుు. హ్యుందాయ్ మొత్తం వాహన విక్రయాలు 9 శాతం వృద్ధితో 54,607 యూనిట్ల నుంచి 59,707 యూనిట్లకు ఎగశారుు. ఇక దేశీ విక్రయాలు 6 శాతం వృద్ధితో 40,505 యూనిట్ల నుంచి 43,201 యూనిట్లకు పెరిగారుు. ఇక ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలు 6 శాతం వృద్ధితో 4,191 యూనిట్ల నుంచి 4,447 యూనిట్లకు పెరిగారుు. టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 40,679 యూనిట్ల నుంచి 43,061 యూనిట్లకు పెరిగారుు. నిస్సాన్ దేశీ వాహన విక్రయాలు రెండు రెట్లు పెరిగారుు. 2,809 యూనిట్ల నుంచి 5,918 యూనిట్లకు ఎగశారుు. కాగా కంపెనీ తన కొత్త జీటీ-ఆర్ వెర్షన్‌కు ప్రి-బుకింగ్సను ప్రారంభించింది. ఇక రెనో వాహన విక్రయాలు ఏకంగా 8 రెట్లు పెరిగారుు. 1,527 యూనిట్ల నుంచి 12,972 యూనిట్లకు ఎగశారుు. అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాలు 6 శాతం తగ్గుదలతో 10,897 యూనిట్లకు క్షీణించారుు. హోండా దేశీ కార్ల విక్రయాలు 11 శాతం క్షీణతతో 15,655 యూనిట్ల నుంచి 13,941 యూనిట్లకు తగ్గారుు. -
అశోక్ లేలాండ్ లాభం రెండు రెట్లు
ఆదాయం 10 శాతం అప్ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.144 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.291 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.3,775 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.4,176 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో వాహన పరిశ్రమ 15 శాతం వృద్ధిని సాధిస్తే తాము మాత్రం 19 శాతం వృద్ధిని సాధించామని అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. ‘‘కరెన్సీ, వడ్డీరేట్ల స్వాప్ సంబంధిత లాభాలు రూ.18 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెరిగాయి. మేం వాహనాలు ఎగుమతి చేస్తున్న కీలక మార్కెట్లలో అమ్మకాలు తగ్గాయి. కానీ రెండో క్వార్టర్ నుంచి పుంజుకుంటామనే నమ్మకం ఉంది. దేశీయం గా 22,061 యూనిట్ల మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాను విక్రయించాం. కంపెనీ చరిత్రలో ఈ విభాగంలో ఇవే రికార్డ్ స్థాయి అమ్మకాలు’’ అని వివరించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థల నుం చి 3,600 బస్సులకు ఆర్డర్లు పొందామని, వీటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారాయన. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అశోక్ లేలాం డ్ షేర్ 3.6% లాభపడి రూ.97 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ ఎండీగా వినోద్ కె దాసరి
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ ఎండీగా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్ఈకి నివేదించింది. అంటే ఈయన 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు అశోక్ లేలాండ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారు. -
అశోక్ లేలాండ్ లాభం 67 శాతం డౌన్
* క్యూ4లో రూ. 77 కోట్లు * ఒక్కో షేర్‌కు 95 పైసల డివిడెండ్ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 67 శాతం క్షీణించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.230 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.77 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఇన్వెస్ట్మెంట్స్ విలువలో తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చినట్లు అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. విదేశాల్లోని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లలో పెట్టిన పెట్టుబడుల తరుగుదలకు కూడా కలుపుకొని మొత్తం రూ.389 కోట్ల అసాధరణమైన కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. నికర అమ్మకాలు రూ.4,436 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.5,893 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.0.95 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈక్విటీ షేర్లు, సెక్యూర్డ్/అన్సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్ల నిధుల సమీకరణకు డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని దాసరి వెల్లడించారు. -
స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్వేస్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.790 ఎందుకంటే: ప్యాసింజర్ ట్రాఫిక్ 21 శాతం పెరగడం, విమానయాన ఇంధనం ధరలు 31 శాతం తగ్గడంతో మూడో త్రైమాసిక కాలానికి జెట్ ఎయిర్వేస్ కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,880 కోట్లకు పెరిగింది. విమాన ఇంధనం ధరలు బాగా పడిపోవడంతో గత క్యూ3లో రూ.171 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో రూ.929 కోట్లకు పెరిగింది. జెట్‌లైట్ ఇన్వెస్ట్మెంట్స్ విలువ తగ్గిపోవడంతో వచ్చిన రూ.47 కోట్ల నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ నికర లాభం రూ.515కోట్లకు పెరిగింది. అందుకనే గత రెండేళ్లలో దేశీయ ట్రాఫిక్ అంతంత మాత్రం వృద్ధి సాధిస్తున్నా, అంతర్జాతీయ ట్రాఫిక్ దన్నుతో జెట్ ఎయిర్వేస్ మంచి రాబడి సాధిస్తోంది. అంతేకాకుండా కరెన్సీ ఒడిదుడుకులకు సహజమైన హెడ్జింగ్‌గా అంతర్జాతీయ సెగ్మెంట్ పనిచేస్తోంది. గత నాలుగేళ్లలో దేశీయ రూట్ల ఆదాయం 8 శాతం చక్రగతిన వృద్ధి సాధించగా, అంతర్జాతీయ సెగ్మెంట్ ఆదాయం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను ఎతిహాద్ కంపెనీ కొనుగోలు చేయడం అంతర్జాతీయ సెగ్మెంట్ వృద్ధికి తోడ్పడింది. ఎతిహాద్‌తో కుదుర్చుకున్న కొత్త కోడ్-షేరింగ్ ఒప్పందం జెట్ ఎయిర్వేస్కు ప్రయోజనం కలిగించనున్నది. దీర్ఘకాలంలో కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. దేశీయ సెగ్మెంట్లో కొత్త కంపెనీల రాకతో పోటీ తీవ్రమవుతోంది. అయితే విమానయాన ఇంధనం ధరలు బాగా తగ్గడం కలసివస్తోంది. రెండేళ్లలో ఆదాయం 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఏడాది కాలానికి ఈ షేర్ రూ.790కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేస్తున్నాం. అశోక్ లేలాండ్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.91 టార్గెట్ ధర: రూ.111 ఎందుకంటే: భారత్‌లో వాణిజ్య వాహనాలు తయారు చేసే రెండో అతి పెద్ద కంపెనీ. మధ్య, భారీ తరహా వాణిజ్య వాహన(ఎంహెచ్‌సీవీ) మార్కెట్లో కంపెనీ మార్కెట్ వాటా 28 శాతంగా ఉంది. మూడో త్రైమాసిక కాలానికి ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. వాహన విక్రయాలు 23 శాతం పెరగడంతో ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.4,085 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.430 కోట్లకు వృద్ధి చెందింది. రూ.205 కోట్ల నికర లాభం సాధించింది. వరుసగా నాలుగో క్వార్టర్లోనూ మార్జిన్లలో రెండంకెల వృద్ధి సాధించింది. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటం, డీజిల్ ధరలు తగ్గుతుండటంతో లాభదాయకత పెరుగుతుండడం, మౌలిక, మైనింగ్ రంగాల్లో జోరు పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకుంటుండటంతో రవాణా, ట్రక్కు ఆపరేటర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. దీంతో ఎంహెచ్‌సీవీ సెగ్మెంట్ రెండంకెల వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో సన్‌షైన్ పేరుతో ప్యాసింజర్ వేరియంట్‌ను, గురు పేరుతో గూడ్స్ క్యారియర్‌ను అందించనున్నది. తక్కువ స్థాయిల్లో ఉన్న కమోడిటీ ధరలు మరికొంత కాలం కొనసాగుతాయని, ఫలితంగా ముడిసరుకు వ్యయాలు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది కాలానికి ఈ షేర్ రూ.111కు ధరను చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం
చెన్నూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అశోక్ లేలాండ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. -
మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేల్యాండ్ తాజాగా కెప్టెన్ సిరీస్ టిప్పర్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెప్టెన్ 2523, 2518 మోడల్ టిప్పర్లను కంపెనీ ఎండీవీ ట్రక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎం సురేంద్రనాథ్ గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిలో కొత్త తరహా క్యాబిన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ రెండింటిలోనూ 9-హై స్పీడ్ గేర్ బాక్సులు ఉంటాయని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయని సురేంద్రనాథ్ పేర్కొన్నారు. కెప్టెన్ సిరీస్ టిప్పర్లపై మూడు సంవత్సరాలు లేదా 5,000 గంటల వారంటీ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. -
కంపెనీల వీఆర్ఎస్ బాట
న్యూఢిల్లీ: కాలానుగుణంగా బిజినెస్ వాతావరణంలో ఏర్పడే మార్పులను ఎదుర్కోవడం, వ్యయాల ఆదుపు వంటి చర్యలను చేపట్టే బాటలో ఇటీవల కంపెనీలు తమ ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెడుతున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఫార్మా, ఎరువులు, రసాయనాలు, స్టీల్, టెక్స్టైల్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు అత్యధిక స్థాయిలో వీఆర్ఎస్ను అనుసరిస్తున్నాయి. మాన్సెర్ కన్సల్టింగ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. కాగా, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రధానంగా కంపెనీలు వీఆర్ఎస్ బాట పడుతున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ వీఆర్ఎస్ను ప్రవేశపెట్టే కంపెనీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అశోక్ లేలాండ్, నోకియా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ను ఆఫర్ చేయడం గమనార్హం. పునర్వ్యవస్థీకరణ వ్యూహం గరిష్ట స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యే రంగాలలోని కంపెనీలు ప్రధానంగా వీఆర్ఎస్ను చేపడుతున్నాయని రాండ్‌స్టాండ్ ఇండియా సీఈవో మూర్తి కె.ఉప్పలూరి చెప్పారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని వివరించారు. దశాబ్దంకిందటి పరిస్థితుల తో పోలిస్తే ప్రస్తుతం వీఆర్ఎస్ అమలు చేయడం అధికమైందని తెలిపారు. బిజినెస్‌లలో స్థిరత్వం ఏర్పడేటంతవరకూ రానున్న కొద్ది త్రైమాసికాలపాటు ఈ ట్రెండ్ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ లైట్‌హౌస్ పార్టనర్స్‌కు చెందిన మేనేజింగ్ పార్టనర్ రాజీవ్ బర్మన్ సైతం వ్యక్తం చేశారు. మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకుని వీఆర్ఎస్ ను కొనసాగిస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ కంపెనీలు పనితీరును మెరుగుపరచుకునేందుకు వీఆర్ఎస్ అమలును చేపట్టాల్సి వస్తుందన్నారు. -
స్వల్పంగా పెరిగిన హీరో అమ్మకాలు
న్యూఢిల్లీ/చెన్నై: హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 5,01,271 వాహనాలు విక్రయించామని, ప్రస్తుతం 5,04,181 వాహనాలు అమ్మామని కంపెనీ పేర్కొంది. త్వరలో ప్లెజర్, ఎక్స్ట్రీమ్, కరిజ్మా, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించనున్నట్లు తెలిపింది. బజాజ్ ఆటో: మరో వాహన కంపెనీ బజాజ్ ఆటో మోటార్ బైక్‌ల విక్రయాలు ఫిబ్రవరిలో 6% తగ్గాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 2,91,297 మోటార్ బైక్‌లను విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 2,73,323 మోటార్‌బైక్‌లను అమ్మామని కంపెనీ పేర్కొంది. వాణిజ్య వాహనాలతో సహా మొత్తం అమ్మకాలు 3,32,387 నుంచి 3,13,294కు క్షీణించాయని వివరించింది. ఎగుమతులు మాత్రం 1,35,149 నుంచి 5% వృద్ధితో 1,35,149కు పెరిగాయని పేర్కొంది. అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ ఫిబ్రవరి అమ్మకాలు 21 శాతం క్షీణించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 10,046 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఇదే నెలలో 7.915 వాహనాలు అమ్మామని కంపెనీ తెలిపింది. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 7,045 నుంచి 21 శాతం క్షీణించి 5,576కు, తేలిక రకం వాణిజ్య వాహనాలు 3,001 నుంచి 2,339కు తగ్గాయని పేర్కొంది. ఇక 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ మొత్తం 79,056 వాహనాలను విక్రయించామని వివరించింది. 2012 ఏప్రిల్ నుంచి 2013 ఫిబ్రవరి అమ్మకాలు(1,00,592)తో పోల్చితే అమ్మకాలు 21 శాతం పడిపోయాయని పేర్కొంది. అలాగే భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 70,000 నుంచి 52,624కు, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 30,592 నుంచి 26,432కు తగ్గాయని వివరించింది. -
అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్లు
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీ ఈ ఏడాది 18 రకాలైన ట్రక్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. ఈ వాణిజ్య వాహనాలను కొత్త బ్రాండ్ కెప్టెన్ కింద అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి పేర్కొన్నారు. ఈ కంపెనీ టిప్పర్ మోడల్, కెప్టెన్ 2523ను సోమవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్ బ్రాండ్ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా పాల్గొన్నారు. కెప్టెన్ 2523 టిప్పర్ ధర రూ. 24 లక్షలకు మించి ఉంటుందని దాసరి వివరించారు. ఇక చిన్న ట్రక్ల ధరలను ఈ కంపెనీ రూ.30,000 వరకూ పెంచుతోంది. కెప్టెన్ రేంజ్ వాహనాల అభివృద్ధికి రూ.600-700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టామని దాసరి పేర్కొన్నారు. ఈ కెప్టెన్ వాహనాలు 16-49 టన్నుల రేంజ్లో టిప్పర్లు, ట్రాక్టర్లు, హాలేజ్ వాహనాలుగా లభ్యమవుతాయని వివరించారు. వీటిని పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేయనున్నామన్నారు. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అమ్మకాలు పుంజుకుంటాయని, అదే విధంగా ఈ ఏడాది కూడా అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నామని దాసరి చెప్పారు. -
అశోక్ లేలాండ్లో వీఆర్ఎస్
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) స్కీమ్‌ను శుక్రవారం ప్రకటించింది. మందగమనం కొనసాగుతుండటంతో సిబ్బంది వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా వీఆర్ఎస్ను ప్రకటించామని హిందూజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ పేర్కొంది. గత క్వార్టర్లో తమ మార్కెట్ వాటా నిలుపుకోగలిగామని, కానీ అమ్మకాలు తగ్గాయని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. వీఆర్ఎస్ తీసుకోవాలనుకునే ఉద్యోగులకు న్యాయమైన, సరైన పరిహారమిస్తామన్నారు. అయితే వీఆర్ఎస్కు సంబంధించి విధి, విధానాలు, నిబంధనలు, గడువు తదితర వివరాలను వెల్లడించలేదు. -
అశోక్ లేలాండ్ నుంచి ‘బాస్’
చెన్నై: అశోక్ లేలాండ్ కంపెనీ మధ్యతరహా వాణిజ్య వాహనం(ఐసీవీ-ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్) బాస్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక కారుకు ఉండే సౌఖ్యాన్ని, ఒక ట్రక్కుకు ఉండే కెపాసిటీని కలగలపి ఈ బాస్ వాహనాన్ని అందిస్తున్నామని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. రోబోటిక్ ప్రాసెస్లను ఉపయోగించి ఈ వాహనాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఈ బాస్ ఐసీవీని కార్ ట్రక్‌గా ఆయన అభివర్ణించారు. రెండు వేరియంట్ల(ఎల్ఈ, ఎల్ఎక్స్)లో లభ్యమయ్యే ఈ ఐసీవీలో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, ఇన్-లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్, 6-సీడ్ ఓవర్‌డ్రైవ్ గేర్‌బాక్స్, టిల్టబుల్ టెలిస్కోపిక్ స్టీరింగ్, మల్టీ యాంగిల్ అడ్జెస్టబుల్ సీట్లు, 2-పాయింట్ సస్పెండెడ్ క్యాబిన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. క్లచ్‌లు, గేర్లు మార్చడం వంటి బాదరబందీ లేని ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను బాస్ ఎల్ఎక్స్లో అందిస్తున్నామని, ఇలాంటి ఫీచర్ ఉన్న తొలి ఐసీవీ ఇదేనని దాసరి చెప్పారు. మూడేళ్ల వారంటీని ఇస్తున్నామని వివరించారు. ‘యాంటినా’ను కొనుగోలు చేసిన పెగా సిస్టమ్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవలను అందించే పెగా సిస్టమ్స్ అమెరికాకు చెందిన మొబైల్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫామ్స్ సంస్థ యాంటినా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది. న్యూ జెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న యాంటినా సాఫ్ట్వేర్ ప్రపంచవ్యాప్తంగా 250 మంది సిబ్బంది పనిచేస్తుండటమే కాకుండా బెంగళూరులో ఒక కేంద్రాన్ని కలిగి ఉంది. -
అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ అశోక్ లేలాండ్ నెల రోజుల్లో దోస్త్ ఎక్స్‌ప్రెస్‌ను మార్కెట్లోకి తేనుంది. 13 మంది కూర్చునే వీలున్న ఈ వాహనం గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ధర రూ.5.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మోటార్ భాగస్వామ్యంతో దోస్త్ పేరుతో తేలకపాటి రవాణా వాహనాన్ని అశోక్ లేలాండ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దోస్త్ ప్లాట్‌ఫాంపైనే ఎక్స్‌ప్రెస్‌ను అభివృద్ధి చేశారు. అలాగే పార్ట్నర్ పేరుతో 5, 6 టన్నుల ట్రక్‌తోపాటు బస్‌లను ఆవిష్కరించనున్నారు. ఇవి జనవరిలో రోడ్లపైకి ఎక్కనున్నాయి. ఆధునిక తేలకపాటి వాణిజ్య వాహనంగా పార్ట్నర్కు ఇతర దేశాల్లో పేరుంది. ఎన్వీ 200 ప్లాట్‌ఫాంపై మరిన్ని వ్యాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుంది. వాహనాలు కావాల్సిందే.. మాంద్యం వస్తుంది, పోతుంది. అది సహజం. వాహనాలనేవి ఎప్పటికీ అవసరమని అశోక్ లేలాండ్ లైట్ కమర్షియల్ వెహికిల్స్, డిఫెన్స్ ఈడీ నితిన్ సేథ్ అన్నారు. బుధవారమిక్కడ ‘స్టైల్’ మల్టీ పర్పస్ వాహనాన్ని రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్లు తగ్గితే భారత వాహన మార్కెట్లో సంచలనాలు నమోదవుతాయని అన్నారు. కార్ల మార్కెట్లో తాము ప్రవేశించబోమని స్పష్టం చేశారు. వ్యాన్లు, ట్రక్కులు, బస్సులు మాత్రమే తయారు చేస్తామన్నారు. బీపీవో కార్యాలయాలు అధికంగా ఉన్న బెంగళురు, హైదరాబాద్‌లో స్టైల్ వాహనాలకు డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. నిస్సాన్ తయారీ ఎన్వీ 200 వాహనం ఆధారంగా స్టైల్‌కు రూపకల్పన చేశారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో స్టైల్ ధర రూ.7.49-9.29 లక్షలుంది. బహుమతి చేరేనా.. స్టైల్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుమతిగా ఇవ్వాలని అశోక్ లేలాండ్ భావించింది. అయితే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాహనాన్ని అందించలేకపోతున్నట్టు కంపెనీ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ చెప్పారు. అహ్మదాబాద్‌లో స్టైల్ విడుదల కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ గతంలో దోస్త్ వాహనాన్ని దేవస్థానానికి బహుమతిగా ఇచ్చింది. -
మార్కెట్లోకి అశోక్ లేలాండ్ స్టైల్
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) స్టైల్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7.49 లక్షలు-రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). భారత్‌లో తమ తేలిక రకం వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంలో భాగంగా దీన్ని మార్కెట్లోకి తెచ్చామని ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్ వి. సుమంత్రన్ చెప్పారు. అశోక్ లేలాండ్-నిస్సాన్ మోటార్ కంపెనీ జాయింట్ వెంచర్... దోస్త్ ఎంపీవీ తరవాత దీన్ని అభివృద్ధి చేసింది. తేలిక రకం వాణిజ్య వాహనం ‘పార్ట్నర్’ను వచ్చే ఏడాది ఈ కంపెనీ మార్కెట్లోకి తేబోతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7-8 సీట్ల రవాణా వాహనంగా, ట్యాక్సీ సర్వీస్‌కు, అంబులెన్స్ సర్వీస్‌కు, హోటల్ షటిల్స్‌కు ఈ స్టైల్ కారు ఉపయోగపడుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. త్వరలో సీఎన్జీ వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 5 స్పీడ్ ట్రాన్సిమిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, వంటి ప్రత్యేకతలున్న ఈ స్లైల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 18 సెకన్లలోనే అందుకుంటుందని, 19.5 కిమీ నుంచి 22.5 కిమీ. వరకూ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. త్వరలో సీఎన్జీ వేరియంట్‌ను కూడా అందించాలని కంపెనీ యోచిస్తోంది. -
నెలరోజుల్లో మార్కెట్లోకి ‘స్టైల్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మా బలం. 50కిపైగా దేశాల్లో సేవలందిస్తున్నాం. సంపన్న దేశాల్లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్, ఎలక్ట్రిక్ బస్సులను భారత్‌లో పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి అన్నారు. మల్టీ యాక్సిల్ ట్రక్ 3120 ఛాసిస్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాహన రంగం మందగమనంలో ఉందన్నారు. ‘సియాం’ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వినోద్ ఇంకా ఏమన్నారంటే.. ఈ సమయంలోనే.. దేశంలో వాహన రంగం మందగమనంలో ఉంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఇది సహజం. అయితే ఈసారి మందగమనం ఎక్కువ రోజులు కొనసాగుతోంది. వాణిజ్య వాహనాల అమ్మకాల వృద్ధి తిరోగమనంలో ఉంది. ఇంధన ధరలు రోజురోజుకూ దూసుకెళ్తున్నాయి. వాణిజ్య వాహన యజమానులకు లాభాలు గగనమే. అందుకే ఎక్కువ మైలేజీ, మన్నిక, సమర్థవంతంగా పనిచేసే వాహనాలు మార్కెట్లోకి తేవడానికి ఇదే మంచి తరుణం. రూ.500 కోట్లు వ్యయం చేసి ఐదేళ్లు శ్రమించి నెప్ట్యూన్ ఇంజిన్‌కు రూపకల్పన చేశాం. 3120 ట్రక్‌లో ఈ ఇంజన్‌ను పొందుపరిచాం. మార్కెట్లో ఉన్న ట్రక్‌లతో పోలిస్తే 10% ఎక్కువ మైలేజీ ఇస్తుంది. కొద్ది రోజుల్లో బస్సుల్లో కూడా ఈ ఇంజిన్‌ను ప్రవేశపెడతాం. కంపెనీ రుణ భారాన్ని రూ.6 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు చేరుస్తాం. పెద్దగా ప్రభావం చూపని ఆస్తులను విక్రయిస్తాం. కొత్తవి వస్తూనే ఉంటాయి.. అశోక్ లేలాండ్ నుంచి నెలకొక కొత్త మోడల్ తీసుకొస్తున్నాం. మల్టీ పర్పస్ కమర్షియల్ వెహికిల్ స్టైల్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానుంది. ప్రయాణికుల రవాణా విభాగంలో కంపెనీ నుంచి ఇదే తొలి చిన్న వాహనం. స్టైల్లో ఎనిమిది మంది హాయిగా కూర్చునే వీలుంది. ఇన్నోవా, టవేరాలకు పోటీనిస్తుంది. ధర ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 8 నుంచి 15 టన్నుల విభాగంలో బాస్ పేరుతో పలు ట్రక్కులను ఈ నెల నుంచే విడుదల చేస్తున్నాం. ప్రయాణికుల కోసం తేలికపాటి రవాణా వాహనం దోస్త్ ఎక్స్‌ప్రెస్ అక్టోబరులో రానుంది. అలాగే 5, 6 టన్నుల కమర్షియల్ ట్రక్ దోస్త్ పార్ట్నర్ విడుదల కానుంది. పార్ట్నర్ బస్ వేరియంట్‌ను కూడా తయారు చేస్తాం. జనం బస్సు ‘జన్బస్’.. ముందువైపు ఇంజిన్ ఉండి, తక్కువ ఎత్తున్న (సెమీ లో ఫ్లోర్) బస్‌లను ఎనిమిదేళ్ల క్రితమే ముంబై రోడ్డు రవాణా సంస్థ కోసం భారత్‌లో తొలిసారిగా అశోక్ లేలాండ్ రూపొందించింది. అదే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెనివల్ మిషన్‌లో (జేఎన్ఎన్యూఆర్ఎం) ప్రామాణికమైంది. జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశలో జన్బస్ను ప్రవేశపెడతాం. ప్రయాణికులు మూడు నాలుగు మెట్లు ఎక్కే అవసరమే లేదు. ఒక్క అడుగు చాలు. బస్ ద్వారం రోడ్డు నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఎవరైనా సులువుగా ఎక్కొచ్చు. డ్రైవర్ మీట నొక్కితే చాలు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ 5-8 సెంటీమీటర్లు ఒకవైపుకు వంగుతుంది. ముందు ఇంజిన్‌తో ఉండి తక్కువ ఎత్తులో ఉన్న బస్సు ప్రపంచంలో ఇదే మొదటిది. 18 పేటెంట్లు జన్బస్ సొంతం. థాయ్‌లాండ్‌లో కొద్ది రోజుల్లో ప్రవేశపెడతాం. బస్సుల వ్యాపారం బాగుంది..: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లోనూ కంపెనీ నిలబడుతుంది. మొత్తం అమ్మకాల్లో వాణిజ్య వాహనాల వాటా 50 శాతమే. బస్సులు, ఇంజిన్లు, విడిభాగాల వ్యాపారం బాగుంది. ఎగుమతులూ కలిసొచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం తొలి దశలో 50% అంటే 5,500 బస్సులు సరఫరా చేశాం. రెండో దశలో 10 వేల బస్సులకు ప్రభుత్వం టెండర్లు అక్టోబరులో పిలిచే అవకాశం ఉంది. బస్సుల సరఫరా డిసెంబరు నుంచి ఉంటుంది. మిషన్‌లో భాగంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రపంచం లో ఇటువంటి బస్సులను పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్న కంపెనీల్లో అశోక్ లేలాండ్ది అగ్రస్థానం.