చెన్నూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అశోక్ లేలాండ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.