Fire Accident
-
రామాంతపూర్ వివేక్ నగర్ లో పేలిన బ్యాటరీ బైక్
-
హైదరాబాద్ జీడిమెట్లలో ఆరని మంటలు
-
ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్ల: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. ఓ భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఫేజ్–5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు.పరిశ్రమ గ్రౌండ్ ఫ్లోర్ సహా మరో రెండు ఫ్లోర్లు ఉండగా ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిఫ్ట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో కొంతమంది కారి్మకులు ఆర్పీ (రీప్రాసెసింగ్) మెషీన్ వద్ద పనులు చేస్తున్నారు. 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్మికులు బతుకు జీవుడా అంటూ కిందకు పరుగులు తీశారు. శ్రమించిన 50 మంది ఫైర్ సిబ్బంది.. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో భారీగా మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. దాదాపు అయిదు ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటోసై్కలిఫ్ట్ను తెప్పించారు. మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. పైనుంచి కింది అంతస్తు వరకు వ్యాపించిన మంటలు.. పరిశ్రమ విశాలంగా ఉండటంతో పాటు లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగులు నిల్వ ఉన్నాయి. పైన ఆర్పీ యంత్రం వద్ద అంటుకున్న మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. పరిశ్రమ భవనం మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలికి బాలానగర్ ఏసీసీ హన్మంతరావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లే‹Ù, ఎస్ఐలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. -
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకూ మంటలు పెరుగుతున్నాయి. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మంటలు వ్యాపించాయి. చుట్టూ పక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 0ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. నాలుగున్నర గంటలకు పైగా భవనం మంటల్లోనే ఉంది. ఏడు ఫైర్‌ఇంజిన్లు, 40 వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. రాత్రి కావడంతో సహయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. -
బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
Hyderabad: పేలిన రిఫ్రిజిరేటర్ సిలిండర్
మణికొండ: రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్‌కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్.. గోల్డెన్ ఓరియల్లో రెండు బ్లాక్‌ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.కేసు నమోదు గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి పది మంది నవజాత శిశువులు సజీవదహనమవ్వడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ విషాదం వేళ ఆస్పత్రికి వర్గాలు వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీసింది. ఝాన్సీ ఆసుపత్రికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వస్తున్నారని తెలిసి... ఆయన రాక ముందే సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది.ఓవైపు అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడి.. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారంటూ కాంగ్రెస్ మండిపింది. . అప్పటి వరకు మురికి కూపంలా ఉన్న ఆస్పత్రి ఆవరణను డిప్యూటీ సీఎం రాక వేళ శుభ్రం చేశారని స్థానికులు తెలిపినట్లు పేర్కొంది. మంటల్లో చిన్నారులు చనిపోతే.. ఈ ప్రభుత్వం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ఇది సిగ్గుచేటని మండిపడింది.BJP सरकार की संवेदनहीनता देखिए।एक ओर बच्चे जलकर मर गए, उनके परिवार रो रहे थे, बिलख रहे थे। दूसरी तरफ, डिप्टी CM के स्वागत के लिए सड़क पर चूने का छिड़काव हो रहा था।परिजनों का यहां तक कहना है कि पूरे कम्पाउंड में गंदगी फ़ैली हुई थी, जो डिप्टी CM के आने से पहले ही साफ की गई।… pic.twitter.com/M1sk8SAa0E— Congress (@INCIndia) November 16, 2024యూపీలోని ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. చిన్నారులను రక్షించడానికి ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఆరోపించింది. ప్రజలు చనిపోతున్నా ఆ పార్టీకి ఏమీ పట్టదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ విమర్శించారు. కాగా ఆసుపత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితేవిద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఈ దుర్ఘటనలో పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే మంటలు చెలరేగిన వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు కనిపించడంతో పాటు సేఫ్టీ అలారాలు కూడా మోగలేదు. 2020లో ఎక్స్టింగ్విషర్ల గడువు ముగిసినట్లు గుర్తించారు. -
Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’ -
Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్‌పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్‌ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. ఆపద్భాందవుడిలా భగవాన్ దాస్!హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే దాస్ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాథక్.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని చెబుతున్నారు. సిలిండర్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.నెట్టింట దయనీయమైన దృశ్యాలుశుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. -
ఘోరాతి ఘోరంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు.పీఎం మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు.రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…— PMO India (@PMOIndia) November 16, 2024తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం!
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోగల లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి. లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం అమర్చారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఆ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించినవారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని స్థానికులు అంటున్నారు.నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోనికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వారు వార్డు కిటికీ అద్దాలను పగులగొట్టి, లోపలికి చేరుకుని మంటలను అదుపు చేస్తూనే, శిశువులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ లోపల, మరొకటి వెలుపల ఉంది. ముందుగా అగ్నిమాపక సిబ్బంది బయట ఉన్న వార్డులోని నవజాత శిశువులను వెలుపలికి తీసుకువచ్చారు. ఇంతలోనే మంటలు లోపలి వార్డులోకి ప్రవేశించడంతో అక్కడున్న పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఝాన్సీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎస్ఎస్పీ సుధా సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం
-
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం
-
యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుని, 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులలో రోజుల వయసు కలిగిన నవజాత శిశువులు కూడా ఉన్నారు.ఘటన జరిగిన సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షార్ట్ జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతరత్రా సామాగ్రి అగ్నికి ఆహుతయ్యింది. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. #WATCH | Uttar Pradesh: A massive fire broke out at the Neonatal intensive care unit (NICU) of Jhansi Medical College. Many children feared dead. Rescue operations underway. More details awaited.(Visuals from outside Jhansi Medical College) pic.twitter.com/e8uiivyPk3— ANI (@ANI) November 15, 2024సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం రంగంలోకి దిగి మంటలను ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేశారు.जनपद झांसी स्थित मेडिकल कॉलेज के NICU में घटित एक दुर्घटना में हुई बच्चों की मृत्यु अत्यंत दुःखद एवं हृदयविदारक है।जिला प्रशासन तथा संबंधित अधिकारियों को युद्ध स्तर पर राहत एवं बचाव कार्यों को संचालित कराने के निर्देश दिए हैं।प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं…— Yogi Adityanath (@myogiadityanath) November 15, 2024ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఉదంతంపై విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణమేమిటనేది తెలుస్తుందన్నారు. నవజాత శిశువులు మరణం దురదృష్టకరమని, ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. VIDEO | Uttar Pradesh: Rescue operation continues at Jhansi Medical College where a fire broke out on Friday. #Fire #Jhansifire(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFras9L3jz— Press Trust of India (@PTI_News) November 15, 2024చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని బ్రజేష్ పాఠక్ హామీనిచ్చారు. ఈ ఆసుపత్రిలో గత ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారన్నారు. అయినా ఈ దుర్ఘటన జరగడం విచారకరమన్నారు. ఇది కూడా చదవండి: HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. -
HYD: అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో, అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. దీంతో, భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న మరో ఇంటికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కావడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగాలో అపార్ట్మెంట్లో పలువురి విలువైన వస్తువులు, దుస్తులు కాలిపోయాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
హైవేపై కంటైనర్‌లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
నందిగామలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసు ధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. -
ఔటర్ రింగురోడ్డుపై కారు దగ్ధం
-
పెట్రోల్‌బంక్ వద్ద లారీలో మంటలు.. తప్పిన ముప్పు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం -
అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
హౌరా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో దీపావళి వేళ పెను ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి కూడా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హౌరాలోని ఉల్బీరియా ప్రాంతంలో శుక్రవారం బాణాసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న దుకాణానికి కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఉలుబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 27లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన చిన్నారులు బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న బాణసంచా సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను తానియా మిస్త్రీ, ఇషాన్ ధార, ముంతాజ్ ఖాతూన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు