
నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు 51 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయాలబారిన పడ్డారు. కోకానిలో ఉన నైట్ క్లబ్ లో ఓ కార్యక్రమం నిమిత్తం భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మెసీడోనియా పాప్ గ్రూప్ డీఎన్ కే ప్రొగ్రామ్ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున నైట్ క్లబ్ కు వచ్చారు.
అయితే నైట్ క్లబ్ లో ఉన్న మందుగుండ సామాగ్రి అంటుకుని మంటలు వ్యాపించాయి. అక్కడకు వచ్చిన వారు తేరుకునే లోపు పలువురు మంటలకు ఆహుతయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన డీఎన్ కే పాప్ గ్రూప్ కు అధిక సంఖ్యలో యువత ఫ్యాన్స్ గా ఉన్నారు. డీఎన్ కే ఎక్కడ షో చేసినా యువతే అధికంగా హాజరవుతారు. ఈ క్రమంలోనే తాజా షోకు కూడా యువత ఎక్కువగా హాజరయ్యారని నార్త్ మెసీడోనియా న్యూస్ ఏజెన్నీ ఎమ్‌ఐఏ స్పష్టం చేసింది.

Comments
Please login to add a commentAdd a comment