
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..
సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..
పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.
అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్‌లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్‌లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్‌గా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment