
మియామి: అమెరికాలో ఆదివారం మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫ్లొరిడా రాష్ట్రంలోని మియామి నగరంలో గుర్తు తెలియని దుండగులు ఎస్‌యూవీ కారులో వచ్చి పార్టీలో ఉన్న అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మియామి పోలీస్ డైరెక్టర్ ఆల్‌ఫ్రెడో రామిరెజ్ పేర్కొన్నారు.
మియామిలోని బిలియర్డ్స్ క్లబ్ వద్దకు అర్థరాత్రి 12 గంటల సమయంలో నిస్సాన్ ఎస్‌యూవీ కారు వచ్చి ఆగిందని.. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో కిందకు దిగి క్లబ్ నుంచి బయటకు వస్తున్న ఒక గుంపుపై కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రామిరెజ్ తెలిపారు. కాల్పులు జరిగే సమయంలో 20 నుంచి 25 మంది ఉన్నారని.. వారిలో ఇద్దరు చనిపోయారని.. మిగతావారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించామని.. కాల్పులకు పాల్పడ్డ దుండగులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష
అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment