SUV
-
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్‌గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
కొత్త కార్ల పండగ!
సార్వత్రిక ఎన్నికలు.. మండుటెండలు.. కుండపోత వర్షాలు.. కార్ల కంపెనీల అమ్మకాలను గత మూడు నాలుగు నెలలూ గట్టిగానే దెబ్బకొట్టాయి. గ్రామీణ డిమాండ్‌తో జూలైలో మాత్రం కాస్త పుంజుకుని ఊరటనిచ్చాయి. నిండు కుండలా కార్ల నిల్వలు పేరుకుపోవడంతో డీలర్లు పండగ సీజన్ కోసం అవురావురుమని ఎదురుచూస్తున్నారు. మరోపక్క, అమ్మకాలు మందగించడంతో.. కార్ల కంపెనీలు గేరు మారుస్తున్నాయి. కొంగొత్త వాహన మోడళ్లను కారు ప్రియుల కోసం రెడీ చేస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు సేల్స్ పెంపుతో పండుగ చేసుకోవాలని చూస్తుండగా.. కస్టమర్లకు కూడా కొత్త కార్ల జాతర కనువిందు చేయనుంది. రాబోయే పండుగ సీజన్ కోసం కార్ల కంపెనీలన్నీ ‘కొత్త’ వ్యూహంతో సిద్ధమవుతున్నాయి. దాదాపు 20 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అంచనా. ఇందులో 12 కార్లు పూర్తిగా కొత్తవి కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ)పైనే కంపెనీలన్నీ ఎక్కువగా గురి పెట్టాయి. కొత్తగా విడుదలయ్యే వాటిలో 13 ఎస్యూవీ మోడల్స్ ఉండటం దీనికి నిదర్శనం. టాటా మోటార్స్, నిస్సాన్, సిట్రాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, కియా, హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్తో పాటు లగ్జరీ కార్ దిగ్గజాలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు వచ్చే మూడు నెలల్లో కొత్త ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. ఇక మారుతీ సుజుకీ, మెర్సిడెస్ నయా సెడాన్లతో అలరించనుండగా.. కియా, ఎంజీ మల్టీ పర్పస్ వాహనాలను (ఎంపీవీ) రంగంలోకి దించుతున్నాయి. సేల్స్ తగ్గినా.. నిల్వల పెంపు.. ఈ ఆరి్థక సంవత్సరం మొదలు (ఏప్రిల్ నుంచి) వాహన అమ్మకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఎన్నికలతో పాటు మండుటెండలు కూడా వాహన విక్రయాలపై ప్రభావం చూపాయి. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేయడం కంపెనీల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, గ్రా మీణ డిమాండ్ మళ్లీ పుంజుకోవడంతో జూలైలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10% పెరగ డం విశేషం. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేయడం.. పండుగల్లో భారీ డిమాండ్ ఆశలతో వాహన కంపెనీలు భారీగా నిల్వలు పెంచుకున్నాయి. డీలర్ల వద్ద సగటున 25–30 రోజుల నిల్వలు ఉంటాయని, ప్రస్తుతం 60–65 రోజుల నిల్వలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.73,000 కోట్లుగా అంచనా. సెపె్టంబర్‌తో షురూ... దక్షిణాదిన కేరళ ‘ఓనమ్’ తో పండుగ సేల్స్ మొదలవుతాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి, దుర్గాపూజ, దసరా, దీపావళి ఇలా వరుసగా అటు జనాలకు ఇటు కంపెనీలకూ పండుగే. మూడు నెలలుగా పేరుకున్న నిల్వలను పండుగల్లో విక్రయించడంతో పాటు కొత్త మోడళ్లతో కస్టమర్లను షోరూమ్‌లకు క్యూ కట్టించాలనేది వాహన సంస్థల వ్యూహం. మహీంద్రా సక్సెస్ఫుల్ ఎస్యూవీ ‘థార్’లో (ప్రస్తుతం మూడు డోర్ల మోడల్ ఉంది) కొత్తగా ఐదు డోర్ల థార్ ‘రాక్స్’ను తీసుకొస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దీన్ని ఆవిష్కరించి.. పండుగ సీజన్లో మార్కెట్లోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ‘ఐదు డోర్ల థార్ కోసం మేము ముందుగా ప్లాన్ చేసిన ఉత్పత్తికి మరో 3,000–4,000 అదనంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ట్రాక్టర్ల విభాగం) రాజేష్ జెజూరికర్ క్యూ1 ఆరి్థక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.ఈవీలు, హైబ్రిడ్లు కూడా... కొత్తగా లైన్ కడుతున్న వాహన మోడల్స్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా రకరకాల ఇంజిన్ ఆప్షన్లతో లభించనున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ (ఈవీ) హైబ్రిడ్ (సీఎన్జీ+పెట్రోల్ వంటివి) ఇంజిన్లు సైతం వీటిలో ఉన్నాయి. ఈవీ విభాగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ కూప్ ‘కర్వ్’తో పండగ చేసుకోవాలనుకుంటోంది. ఈ మోడల్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఈవీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తోంది. ముందుగా ఈవీ ‘కర్వ్’ను ప్రవేశపెట్టడం విశేషం. గత నెలలో నిస్సాన్ ఆవిష్కరించిన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్–ట్రెయిల్ కూడా పండుగల్లో రోడ్డెక్కనుంది.పండుగ రేసు గుర్రాలు (అంచనా ధర రూ.లలో).. → టాటా మోటార్స్–కర్వ్ ఈవీ (18–25 లక్షలు), → కర్వ్ (రూ.10.5–20 లక్షలు), → మారుతీ–స్విఫ్ట్ హైబ్రిడ్ (10 లక్షలు), డిజైర్–2024 (7–10 లక్షలు) → మహీంద్రా–థార్ రాక్స్ (13–23 లక్షలు) → నిస్సాన్ – ఎక్స్ట్రెయిల్ (49 లక్షల నుంచి)→ టయోటా బెల్టా – (9.5–12 లక్షలు) → మెర్సిడెజ్–బెంజ్ – ఈక్యూఎస్ ఎస్యూవీ (2 కోట్లు) → బీఎండబ్ల్యూ–ఎం3 (1.47 కోట్లు) → రెనో–కార్డియన్ (10–12 లక్షలు) → ఎంజీ–క్లౌడ్ ఈవీ (29–30 లక్షలు), → గ్లోస్టర్–2024 (40 లక్షలు) → స్కోడా–కొడియాక్–2024 (40–50 లక్షలు) → బీవైడీ–సీగల్ ఈవీ (10 లక్షలు) → కియా–ఈవీ9 (75–82 లక్షలు)→ ఆడి–క్యూ8 ఫేస్‌లిఫ్ట్ (రూ.1.17 కోట్లు) → సిట్రాన్ – సీ3ఎక్స్ (రూ.11.5 –15 లక్షలు), బసాల్ట్ (రూ.8 లక్షలు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టాటా కర్వ్ ఈవీ వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్.ఈవీ ఎస్యూవీ కూపే విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.49 లక్షలతో ప్రారంభమై రూ.21.25 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ఈ కారు తొలిసారిగా దర్శనమిచ్చింది. కర్వ్.ఈవీ చేరికతో టాటా మోటార్స్ ఖాతాలో ఎలక్ట్రిక్ మోడళ్ల సంఖ్య అయిదుకు చేరుకుంది. 123 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కర్వ్. ఈవీలో పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 502 కిలోమీటర్లు, 55 కి.వా.అవర్ బ్యాటరీ ప్యాక్‌తో 585 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. భారత్ ఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇవీ అదనపు ఫీచర్లు.. 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్‌తో లెవెల్–2 అడాస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోహోల్డ్‌తో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 18 అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇతర హంగులు. 40 నిమిషాల్లో బ్యాటరీ 80% చార్జింగ్ పూర్తి అవుతుంది. కర్వ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మోడల్‌ను సెప్టెంబర్ 2న ఆవిష్కరిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. లక్ష టాటా ఈవీలు భారత రోడ్లపై పరుగెడుతున్నాయన్నారు. కంపెనీకి ఎలక్ట్రిక్ కార్ల విపణిలో 70% వాటా ఉందన్నారు. -
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్యూవీ డ్రైవర్‌కు బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. [Rajendra Nagar deaths] A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case. Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్‌యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్‌కి టీకేఎం వెర్షన్‌గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్‌ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్‌ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
రూ.16.8 లక్షల ఎస్‌యూవీని ఆవిష్కరించిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్‌లైన్ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్‌వీల్స్, రెడ్ ఫ్రంట్, రేర్ బ్రేక్ కాలిపర్స్, గ్రిల్‌పై ఎన్ లైన్ బాడ్జింగ్ పలు డిజైన్ సంబంధిత మార్పులుంటాయి. ఎన్ లైన్ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్‌ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్‌ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
మహీంద్రా కార్ల అమ్మకాల జోరు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్యూవీ వెహికల్స్‌ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్‌యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్‌లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్‌యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్‌లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్‌యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. -
భారత్‌లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్‌లో మినీ ల్యాండ్ క్రూజర్‌ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్‌లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..సింగిల్ ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4మేటిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.39 కోట్లు. బ్యాటరీపై 10 ఏళ్లు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. 90.56 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 465–550 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. పొడవు 4,863 మిల్లీమీటర్లు ఉంది. సీమ్‌లెస్ గ్లాస్ కవర్‌తో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 17.7 అంగుళాల ఓలెడ్ సెంట్రల్ డిస్ప్లే, 12.3 అంగుళాల ఓలెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.థర్మోట్రానిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాన్స్పరెంట్ బానెట్, 360 డిగ్రీల కెమెరా వంటి హంగులు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్కు చెందిన చార్జింగ్ కేంద్రాల్లో ఇతర బ్రాండ్ల కార్లకు సైతం చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. -
ఆగస్ట్‌లో ఆల్‌టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
ట్రక్కును ఢీకొన్న ఎస్యూవీ
ససరాం(బిహార్): బిహార్‌లోని రొహతస్ జిల్లా ససరాం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ససరాం పట్టణంలోని శివసాగర్ వద్ద రెండో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కైముర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఎస్‌యూవీలో జార్ఖండ్‌లోని రాజ్రప్ప ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొంది. ఘటనలో రాజ్మాతాదేవి(55)తోపాటు ఆమె కూతురు, అల్లుడు, మనవడు(8), మనవరాలు(9)తోపాటు ఒక బాలిక (15), మహిళ(22) చనిపోయారు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్‌యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్‌లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్‌యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
లఢక్ పర్యటకుని నిర్లక్ష్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..
లఢక్: భూతల స్వర్గం కశ్మీర్.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్‌ను పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్సర్ సైట్లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామ్సైట్ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్‌యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. Shared by a fellow birder from #Ladakh... this stupidity is getting out of hand. This seemingly "barren" landscape is teeming with #life- and the short summer is when that life is at its peak. That too at a Ramsar Site! These idiots need to be named, shamed and booked!… pic.twitter.com/wRpYkkYf6p — Mofussil_Medic (@Daak_Saab) July 9, 2023 ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్‌లో పర్యటకులకు భారీ ట్యాక్స్‌లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం! -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ఆగస్ట్‌లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్‌కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్‌లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్‌లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ మోటార్‌తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్‌తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్‌లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్‌తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్‌యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
సింగిల్ ఛార్జ్‌కి 501 కిలోమీటర్ల రేంజ్: కియా కొత్త ఎలక్ట్రిక్ కార్
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్‌యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్‌యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది. The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way. Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY — Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023 -
ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో
ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) తన పాటలు, వాయిస్‌తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్‌కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్‌స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్‌ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్‌కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్‌పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం) కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్‌తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్‌తో అనేక మంది ఫ్యాన్స్‌ని, ఫాలోయర్స్‌ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ. -
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్‌లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీని భారత్‌లో నెక్సా షోరూమ్‌ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్‌ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్‌తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్‌లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు