సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ ఆడి కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కొన్ని నెలలు వెయింటిగ్ తరువాత , ఆడి చివరకు ఇండియాలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ ఎంఎల్‌బీ ఎవో ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించిన ఈ లగ్జరీ కారు ప్రారంభ ధరను రూ.53.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ నిర్ణయించింది. టాప్ ఎండ్ టెక్నాలజీ వేరియంట్ ధరను రూ. 57. 60లక్షలుగాను ప్రకటించింది. త్వరలో డెలివరీ ప్రారంభం కానుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇతర ఫీచర్లు క్యూ7 మాదిరిగానే 2.0లీటర్ టీడీఐ ఇంజీన్ కెపాసిటీతో వస్తున్నఈ కారులో కంట్రోల్ నాబ్ స్థానంలో నాలుగు టోగుల్ బటన్స్ యాడ్ చేసి మునుపటి 8.3అంగుళాల ఎంఎంఐ ఇన్ఫోటైన్‌మెంట్‌ను, బోనెట్ డిజైన్‌ను అప్ గ్రేడ్ చేసింది. వర్చువల్ కాక్‌పిట్, వైర్‌లెస్ చార్జింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రీకల్లీ ఎడ్జస్టబుల్ సీట్స్‌తోపాటు ముందుభాగంలో మాట్రిక్స్ సింగిల్ ఫ్రేమ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్ అమర్చింది. వెనుక కూడా ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, డిఫ్యూసర్‌తో కొత్త బంపర్‌ను జోడించింది. దీని ఇంజీన్18బీహెచ్‌పీ, 400ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment