Launch
-
ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో మరియు బ్రోచర్ ప్రారంభం
-
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్‌లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గురుడి చందమామ యూరోపా..
“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.- జమ్ముల శ్రీకాంత్ -
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్‌లిఫ్ట్ చేసి 2024 మోడల్‌గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్‌తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్‌తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
12 కి.మీ. అండర్‌గ్రౌండ్ జర్నీ!
వచ్చేనెలలో ముంబైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ఒకటి. ఇది ఆక్వా లైన్‌లోని మొదటి దశ. ఆరే కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య నడుస్తున్న 12 కిలోమీటర్ల మార్గానికి ఇది విస్తరణకానుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, ముంబై నుండి నాగ్‌పూర్‌కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. థానే రింగ్ మెట్రోకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముంబై మెట్రో కొత్త విస్తరణలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ కారిడార్ పొడవు 33.5 కి.మీ. ఈ లైన్ పూర్తి కావడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టనుంది.ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దాదాపు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గంలో నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
AI: ప్రపంచంలో మొదటి హెల్త్ మానిటరింగ్ ఏఐ యాప్ ఇది..
సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య సంరక్షణలో భాగంగా యాప్ ఆధారిత హెల్త్ టూల్స్‌లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అడుగులేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని హోటల్ ఆవాసా వేదికగా బుధవారం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డీప్ లెరి్నంగ్ పవర్డ్ హెల్త్ మానిటరింగ్ యాప్ క్విక్ వైటల్స్‌ను ఆవిష్కరించారు.తెలుగు వ్యక్తి, బిసామ్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకులు ఎండీ హరీష్ బిసామ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా కీలకమైన హెల్త్ డేటాను అందిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో డాక్టర్ వంద మందికిపైగా రోగులను పరీక్షిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఈ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరిమాణంలోని వైవిధ్యాలను కాంతి శోషణ మార్పులను విశ్లేíÙంచడానికి ఈ యాప్‌లో ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ) అనే సాంకేతికతను వినియోగించడం విశేషం.డేటా భద్రత, గోప్యతకు మా హామీ..ఈ నేపథ్యంలో హరీష్ బిసామ్ మాట్లాడుతూ.. ఈ వినూత్న సాంకేతికత ఆధారంగా మొబైల్ యాప్‌లో కేవలం సెకన్లలో ఆరోగ్య సూచికలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. డాక్టర్‌ను కలవకుండానే ప్రాథమిక సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ దోహదపడుతుందని అన్నారు. ఈ యాప్ కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్ స్పాట్ చెక్‌లు, పీపీజీ సెన్సార్లతో పర్యవేక్షణ చేస్తుంది. ఇది బలమైన క్లౌడ్ రిజి్రస్టేషన్‌తో పాటు కఠినమైన భారతీయ డేటా రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, కాబట్టి డేటా భద్రత, గోప్యతకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.ఈ ఆవిష్కరణలో భాగంగా ఏఐ, డీప్ లెరి్నంగ్: ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్ అంశంపై ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించారు. చర్చలో ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.సుధ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ మాజీ డైరెక్టర్ డా.పి.వెంకటేశ్వర్లు, డా.పూరి్ణమ, ఇన్నోవేటర్–ప్రొడక్ట్ స్పెషలిస్ట్ డేనియల్ గోల్డ్‌మన్, కాటలిస్ట్ వ్యవస్థాపకులు ఆండ్రూ షోస్టాక్, డాక్టర్ ఉషతో పాటు టెక్ ఔత్సాహికులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఇవి చదవండి: పీక్స్‌లో.. పికిల్ బాల్! సిటిజనుల్ని ఉర్రూతలూగిస్తోన్న ఆట! -
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్ రివీల్ చేసిన అశ్విన్ బాబు
షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్‌ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
పుట్టపర్తిలో సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్
ప్రశాంతి నిలయం: సత్యసాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మానవతా విలువలను,సేవా స్ఫూర్తిని చాటుతూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్’ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మురళీ కార్తీక్‌తోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు తదితరులు ట్రోఫీని, క్రికెట్ లీగ్ పోటీల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. -
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్‌లోని పెషావర్ స్కూల్‌పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
షావోమీ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన సినీనటి వర్షిణి (ఫోటోలు)
-
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది. పిల్లల కోసం స్పెషల్‌గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్‌కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు. ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్‌గా ఉండబోతోందని ఆలియా ఇన్‌స్టాలో వెల్లడించింది. ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్‌కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్‌ను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది -
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
-
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో సందడి చేసిన నటి వర్ష (ఫోటోలు)
-
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రామ్‌చరణ్ లాంచ్ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఈ సినిమా ఓ మ్యాజిక్.. ఆ మ్యాజిక్‌ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ కృతీ ప్రసాద్, అసోసియేట్ప్రోడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడారు. -
మరో మడత ఫోన్ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!
దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)తేలికపాటి డిజైన్‌ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాఅంచనా ధరవివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్‌లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా