జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌14 గ్రాండ్‌ సక్సెస్‌.. సీఎం జగన్‌ హర్షం | AP CM Y.S Jagan Congratulates ISRO For Successful Launch Of GSLV-F14 - Sakshi
Sakshi News home page

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌14 గ్రాండ్‌ సక్సెస్‌.. సీఎం జగన్‌ హర్షం

Published Sat, Feb 17 2024 7:34 PM | Last Updated on Sat, Feb 17 2024 7:52 PM

Cm Jagan Congratulates Isro For Successful Launch Of Gslv F14 - Sakshi

సాక్షి, తాడేపల్లి: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది.

గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి.

ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement