successful
-
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్: ఇస్రో
భారత స్పేడెక్స్ ఉపగ్రహాల పనితీరుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అప్డేట్ ఇచ్చింది. నేడు(ఆదివారం) ఈ ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాయి. శనివారం వీటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉంది. తాజాగా వీటి దూరం తొలుత 15 మీటర్లకు చేరుకోగా, ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను మూడు మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చి, తరువాత సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది. SpaDeX Docking Update:A trial attempt to reach up to 15 m and further to 3 m is done.Moving back spacecrafts to safe distanceThe docking process will be done after analysing data further. Stay tuned for updates.#SpaDeX #ISRO— ISRO (@isro) January 12, 2025ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని, ప్రస్తుతం ఎస్డీ01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని, ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను(Satellite) సురక్షితమైన దూరానికి తరలించామని ఇస్రో ఒక ట్వీట్లో పేర్కొంది.SpaDeX Docking Update:SpaDeX satellites holding position at 15m, capturing stunning photos and videos of each other! 🛰️🛰️#SPADEX #ISRO pic.twitter.com/RICiEVP6qB— ISRO (@isro) January 12, 2025కాగా ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్) ఎప్పుడు చేపడతామన్నది ఇస్రో ఇంకా వెల్లడించలేదు.2025 జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని గతంలో ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం(Spadex experiment) పూర్తిగా విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది.ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్ జాబ్స్ సతీమణి -
సవాల్ ఉంటేనే సక్సెస్... తగ్గేదేలే!
‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి ‘చేసి చూపుతాం..’ అని నిరూపిస్తోంది నేటి మహిళ. ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి స్ట్రాంగ్‌గా ఉంటే.. వింటారు సివిల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్ అడ్వాన్స్ కోర్స్ 2018లో పూర్తి చేశాను. గేటెడ్ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్‌లు డిజైన్ చేశాను. కస్టమర్ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్ పూర్తి చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్‌గా ఉంటాను. స్ట్రాంగ్‌గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష మేకప్ ఒక ఆర్ట్ మేకప్ ఆర్ట్ నాకు చాలా ఇష్టమైన వర్క్. అందుకే, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్ సర్వీస్ అందిస్తున్నాను. చాలా మంది మేకప్ అనగానే ఫౌండేషన్, కాజల్.. బ్యుటీషియన్ వర్క్ అనుకుంటారు. అలాగే మేకప్ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్ పార్టీలు, బర్త్ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్ స్టైల్స్ ఉన్నాయి. మేకప్ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్‌వర్క్‌తో ప్రొఫెషనల్‌గా చేసే మేకప్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. – శ్రీలేఖ, మేకప్ సెంట్రల్ నిరూపించుకోవాలనుకుంటే సాధించగలంలక్సస్ డిజైన్ స్టూడియోస్పెషల్గా బ్రైడల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ డిజైన్ చేస్తాను. కార్పొరేట్ యూనిఫార్మ్స్, ఫస్ట్ బర్త్‌డే పార్టీలకు డ్రెస్ డిజైన్ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్‌కి డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్‌లోనూ.. ప్రతిదీ సవాల్‌గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య, అమూల్య అండ్ కృష్ణ కొచర్ పనిలో ప్రత్యేకత చూపాలికేక్ బేకింగ్ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు, నీవేం సక్సెస్ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్ వర్క్‌నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్ కేక్స్ హాఫ్ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్‌లెస్ డిజర్ట్స్ కేక్స్ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్ రావడం మొదలయ్యింది. టైమ్ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్‌కి బహుమతులు ఆర్డర్‌పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్ వర్క్‌షాప్ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్ ఇస్తుంటారు. ఫైనాన్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్ నడ΄ాలని బేకింగ్ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను. – రాధిక, ఆర్బేక్ హౌజ్ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా -
సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: సుదూర శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ హైపర్ సోనిక్ క్షిపణిని భారత సాయుధ దళాలలో వివిధ సేవలను అందించేందుకు రూపొందించారు.ఈ క్షిపణి 1,500 కి.మీకి మించిన పరిధి వరకూ వివిధ పేలోడ్లను మోసుకెళ్లగలదు. పలు డొమైన్లలో అమర్చిన వివిధ రేంజ్ సిస్టమ్‌ల ద్వారా ఈ క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుండి అందిన డేటా ప్రకారం ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో తన ప్రభావాన్ని నిర్ధారించింది.ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోని ప్రయోగశాలలు, డీఆర్డీఓకి చెందిన ఇతర ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములతో స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. డీఆర్డీఓతో పాటు సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్షిపణ పరీక్ష అధునాతన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్న దేశాలలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ క్షిపణి భారతదేశంలో పెరుగుతున్న స్వావలంబనను ‘మేక్ ఇన్ ఇండియా’పై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. India has achieved a major milestone by successfully conducting flight trial of long range hypersonic missile from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is a historic moment and this significant achievement has put our country in the group of select nations… pic.twitter.com/jZzdTwIF6w— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024డీఆర్డీఓ సాధించిన ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వాములైన డీఆర్డీఓ బృందం, సాయుధ దళాలు, పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం మరో ఘన విజయాన్ని సాధించిందన్నారు. హైపర్సోనిక్ క్షిపణులు గంటకు 6,174 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. -
కలతలు లేని కాపురానికి సుధామూర్తి చెప్పిన సూపర్ టిప్స్
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదుభార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలిఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.బాధ్యలు బరువులు పంచుకోవాలిఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది. అబ్బాయిలకో సలహాముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్‌లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు. -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్‌నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్‌వర్‌లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్‌లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్‌చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్‌చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే.. -
సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా
అనంతపురం: చిరుప్రాయంలోనే తల్లిదండ్రుల మరణంతో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంది. జీవితంలో ఎత్తు పల్లాలను సునాయశంగా అధిగమించింది. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల అధిరోహణకు సిద్ధమైంది. ఇప్పటికే పలు శిఖరాలను అధిరోహించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన సమీరాఖాన్... తన పేరుకు తగినట్లుగానే ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది. ఏ ఆధారం లేకుండా ఒంటరి పోరు సాగిస్తున్న సమీరాఖాన్ విజయ ప్రస్తానం... ఆమె మాటల్లోనే...మాది అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న విద్యారణ్య నగర్. నాన్న జాఫర్ ఖాన్, అమ్మ ఖాతూన్‌బీ. ఓ చిన్నపాటి ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటున్నా. మేము మొత్తం ఐదుగురం ఆడపిల్లలమైతే... నేనే అందరికంటే చిన్నదాన్ని. నా చిన్నప్పుడే అమ్మ అనారోగ్యంతో మరణించింది. మా పోషణ కోసం నాన్న ఓ చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. నలుగురు అక్కలకీ నాన్న పెళ్లిళ్లు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం.బతుకు తెరువు కోసం వలస పోయా నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో వయస్సు మీద పడి నాన్న ఏ పనీ చేయలేక ఇబ్బంది పడసాగారు. ఇది చూసి చివరకు నేనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ వచ్చా. సంపాదన అంతంత మాత్రమే ఉండడంతో చదువు మానేసి బెంగళూరుకు చేరుకున్నా. ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. అయితే చాలా తక్కువ సమయంలోనే పదోన్నతులు అందుకున్నా. అలాగని చదువును పక్కన పెట్టేయలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరి 2015లో డిగ్రీ పూర్తి చేశాను. ఇక జీవితం కుదుట పడుతోంది... పరిస్థితలన్నీ చక్కబడ్డాయి అనుకుంటుండగానే నాన్న మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాను. ఆ పరిస్థితుల్లో నన్ను చూసిన అక్కయ్య వాళ్లు... నన్ను పెళ్లి చేసుకోమన్నారు. అయితే నేను ఒప్పుకోలేదు. మలుపు తిప్పిన ఒంటరి ప్రయాణం నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నా స్నేహితులతో కలసి సైక్లింగ్, పర్వతారోహణపై దృష్టి పెట్టాను. నా సంపాదనలోనే కొంత దాచుకుంటూ వస్తూ ట్రెక్కింగ్‌పై శిక్షణ పొందాను. ఓ సారి సైక్లింగ్ చేస్తూ దేశమంతా తిరిగా. అలా ఓ ప్రయాణంలో కొంతమంది విదేశీయులు కలిశారు. ‘ఒంటరి ప్రయాణం సాహసంతో కూడుకున్నది. నీ ధైర్యానికి ఆశ్చర్యమేస్తోంది’ అనే వారన్న మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. వారితో కలసి ఉన్న సమయంలో వారి ఆచార వ్యవహారాలను చాలా క్లోజ్‌గా పరిశీలించాను. చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో విదేశీ ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేయాలని అనుకున్నా. అలా మొదలైనా నా ఒంటరి ప్రయాణం... చివరకు దేశ సరిహద్దులు దాటించింది. థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్, జపాన్, మాల్దీవులు, మలేసియా, సింగపూర్ తదితర 18 దేశాల్లో సైకిల్ యాత్రతో పాటు ఆయా దేశాల్లోని పర్వతాలను అధిరోహిస్తూ వచ్చా. నేపాల్ టూర్ మరవలేను నా సహచరులతో కలసి నేపాల్‌లో చేసిన పర్వతారోహణను నేను మరవలేను. అదే సమయంలో అక్కడి మౌంట్ ఐస్‌ల్యాండ్, మౌంట్ అమా దబ్లామ్ అనే రెండు పర్వతాలను అధిరోహించాలనుకున్నా. ఇది సాధ్యమయ్యే పనికాదని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయినా నేను వినలేదు. ఎవరూ రాకపోతే ఒంటరిగానే పోతానన్నా. దీంతో కొంతమంది నాతో పాటు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మౌంట్ అమా దబ్లామ్ పర్వతం పైకి ఎక్కే కొద్ది వాతావరణ పరిస్థితుల్లో శరవేగమైన మార్పులు రాసాగాయి. మంచు పర్వతాల్లో ఈ పరిస్థితులు సర్వసాధారణమే. ఓ వైపు రక్తం గడ్డ కట్టించే చలి, మరో వైపు మంచు తుఫానులు.. . ఇలా అడగడునా సవాళ్లే. కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా పెద్ద సమస్యే. అంత ఎత్తైన ప్రదేశంలో నిద్ర కూడా దాదాపు అసంభవం. అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలూ ఎన్నో అనుభవించా. అయినా సరే అన్నింటినీ దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించా. స్నేహితుడి మరణం కలిచివేసింది అమా దబ్లామ్ పర్వతంపై ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమని అక్కడి వాళ్లూ చెప్పారు. అయినా వినకుండా మా సహచర బృందం నేపాల్‌లోని లుకా గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి గతేడాది అక్టోబర్ 29న 6,189 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఐస్‌ల్యాండ్‌కు బయలుదేరింది. పైకి వెళ్లే కొద్దీ ప్రయాణం కష్టమైంది. 4,800 మీటర్ల ఎత్తు చేరుకున్నాక విడిది శిబిరం వేసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి మిగిలిన 1,389 మీటర్ల ఎత్తును తప్పని పరిస్థితిల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. చివరకు అనుకున్నది సాధించాం. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరాం. అమా దబ్లామ్ పర్వతంపై దాదాపు లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో మాతో పాటు వచ్చిన ఆ్రస్టియా యువకుడు మైఖేల్‌పై రాళ్లు పడి, అక్కడే చనిపోయాడు. నాకైతే నోట మాట రాలేదు. తేరుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, స్నేహితుడి మృతదేహాన్ని సాగనంపి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించాం. చివరకు ఐదు రోజుల పాటు శ్రమించి 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించాం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్‌గా.. ప్రస్తుతం నేను బెంగళూరులో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నా. ఏటా రెండు సార్లు రెండేసి నెలల్లో హిమాలయాల్లో ఒంటరిగానే ట్రెక్కింగ్ చేస్తుంటాను. మధ్యలో ఒక వారం రోజుల పాటు అనంతపురానికి వచ్చి అక్కయ్యలతో కలసి వెళుతుంటాను. మరో రెండు నెలలు విదేశాల్లో సైక్లింగ్ చేస్తూ అక్కడి ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంటా. ఇందుకు అవసరమైన డబ్బును ఈవెంట్ ప్లానింగ్ చేయడం ద్వారా సమకూర్చుకుంటుంటాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే నా ఆకాంక్ష. ఇందుకు అవసరమైన డబ్బును పొగు చేసుకుంటున్నా. నా కష్టాలే ఇంతటి సాహసానికి పురిగొల్పాయి. భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. దేవుడి సహకారంతో ఈ లక్ష్యాన్ని కూడా సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది. -
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుపతి: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారుఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. -
వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
ఈ అలవాట్లు ఉన్న ఉద్యోగులకు తిరుగులేదంతే...
-
‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ టెస్టు సక్సెస్
చెన్నై: భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు పడింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్‌కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్‌యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్‌యాన్–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్‌యాన్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెపె్టన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. -
జీఎస్ఎల్వీ ఎఫ్14 గ్రాండ్ సక్సెస్.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: జీఎస్ఎల్వీ ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది! -
AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్జీవీ కొత్త హీరోయిన్ శ్రీలక్ష్మీ.. చీరలో హాట్ హాట్ లుక్స్ (ఫోటోలు)
-
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
ఆదిత్య–ఎల్1 మూడోసారి కక్ష్య పెంపు విజయవంతం
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇ్రస్టాక్), పోర్టుబ్లెయర్‌లోని స్పేస్ ఏజెన్సీ కేంద్రాల శాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని మరింత పెంచారు. Aditya-L1 Mission: The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru. ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation. The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My — ISRO (@isro) September 9, 2023 కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం భూమికి దగ్గరగా 296 కిలోమీటర్లు, భూమికి దూరంగా 7,1,767 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఉపగ్రహాన్ని ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా పెంచారు. లాంగ్రేజ్ పాయింట్ ఎల్1కు చేరేసరికి మరోసారి కక్ష్య పెంపు ఉంటుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం నిర్దేషిత ఎల్1 పాయింట్‌కు చేరుకోనుంది. సూర్యునిలో కరోనా అధ్యయనానికి పంపిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ఇప్పటికే భూమి, చంద్రునికి సంబందించిన ఫొటోలను పంపించింది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్1 పాయింట్‌కు చేరి సూర్యునిపై పరిశోధనలు చేయనుంది. ఇదీ చదవండి: జీవ ఇంధనాల కూటమి -
Aditya-L1: మిషన్ సూర్య సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యడిపై పరిశోధనలు చేయాలనే కల నెరవేరింది. సూర్యయాన్–1 పేరుతో చేసిన ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో మంచి జోష్ మీదుంది. నిన్న చంద్రయాన్–3, నేడు సూర్యయాన్ ప్రయోగంతో వరుసగా రెండు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతం చేసి చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంతోనే చంద్రయాన్–4, శుక్రుడిపై ప్రయోగానికి బీజం పడింది. ప్రపంచంలో నాసా ఇప్పటికే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ప్రయోగాలను చేసింది. ఆ తరువాత మొదటిసారి సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. సూర్యుడు అగి్నగోళం కదా! అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోదా! అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకే భూమికి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని సూర్యునికి దగ్గరగా ఉన్న లాంగ్రేజియన్ బిందువు 1 వద్ద ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి అ«ధ్యయనం చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయనుంది. చంద్రుడు, అంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు కూడా మొదటి ప్రయత్నంలోనే చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమై ప్రయోగంలో మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి సూర్యయాన్–1 పేరుతో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,480 కిలోలు ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో చరిత్రలోచరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొన్న చంద్రయాన్–3 సక్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని దేశంగా మరోమారు నిలిపారు. సూర్యుడి మీద అధ్యయనం చేసే ప్రయోగం కావడం, కక్ష్య దూరం కొత్తగా ఉండడంతో మిషన్ కంట్రోల్‌రూంలో నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 23.40 గంటలపాటు కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడింది. కౌంట్‌డౌన్ సమయంలో జీరో పడడమే తరువాయి.. తూర్పువైపున నిప్పులు చెరుగుతున్న భగభగ మండే ఎండను, మబ్బులను చీల్చుకుంటూ ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లును ఆపరేట్ చేస్తూ కంటి మీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. 1,480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ)235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్‌ట్రిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 125 రోజులకు లాంగ్రేజియన్ బిందువు వద్ద ప్రవేశపెట్టి, 12 రోజుల తర్వాత సూర్యుడు సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద అధ్యయనం చేసి సూర్యునిపై రహస్యాలను భూమికి చేర్చుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి మరో గ‘ఘన’విజయాన్ని నమోదు చేసుకున్నారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు. ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1.03.31 గంటల్లో (3,799.52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు. -
గగన్‌యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ పరీక్షలు విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గగన్‌యాన్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం (జీఎంపీఎ‹)తో మరో రెండు హాట్ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్‌ఎంపీఎస్)ను బెంగళూరులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, వలియామల, తిరువనంతపురంలలో డిజైన్ చేసి, అభివృద్ధి పరిచారు. ఈ తరహాలో మొదటి హాట్ టెస్ట్‌ను ఈనెల 19న నిర్వహించారు. పేజ్–2 టెస్ట్ సిరీస్‌లో రెండు, మూడు హాట్ టెస్ట్‌లను బుధవారం చేపట్టి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. 723.6 సెకెండ్ల పాటు సాగిన ప్రారంభ హాట్టెస్ట్ ఆర్బిటల్ మాడ్యూల్ ఇంజెక్షన్, 100 ఎన్ థ్రస్ట్‌లు లిక్విడ్ అపోజిమోటార్ (ఎల్ఏఎం) ఇంజిన్ల కాలిబ్రేషన్ బర్న్‌ను ప్రదర్శించారు. నాన్ అపరేషన్ ఇంజిన్‌ను గుర్తించి, వేరు చేయడానికి కాలిబరేషన్ బర్న్ అవసరమైంది. లామ్ ఇంజిన్ల రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లు ఊహించిన విధంగా పనిచేయడంతో ఈ పరీక్షలు విజయవంతమై’నట్లు ఇస్రో ప్రకటించింది. -
మామా.. మేమొస్తున్నాం...!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ (షార్) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది. చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ ఉది్వగ్న క్షణాలు... తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగం సూపర్ సక్సెసైంది. 640 టన్నుల ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు. చంద్రయాన్–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్ స్వయంగా షార్ కేంద్రం నుంచి వీక్షించారు. ప్రయోగం జరిగిందిలా... ► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. ► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ► ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది. ► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. ► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. ► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. ► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది... ► చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ► 16 రోజుల్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు. ► తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు. ► అలా ఆగస్టు 17న చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్ మాడ్యూల్ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది. ► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్ లాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ► ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. ► చంద్రయాన్–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ వాడారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని కూడా చంద్రయాన్–2 తరహాలోనే నిర్వహించారు. ► చంద్రయాన్–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే వుంది. ► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే ప్రయతి్నస్తున్నారు. మనకిక ఆకాశమే హద్దు మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం. ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్ఎస్ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు. సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. -
17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం..
అంకుష్ సచ్‌దేవా పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 'షేర్‌చాట్' పేరు మాత్రం అందరికి తెలుసు. ఈ షేర్‌చాట్ వ్యవస్థాపకుడే అంకుష్ సచ్‌దేవా. విజయం సాధించడంలో 17 సార్లు విఫలైమనప్పటికీ ప్రస్తుతం రూ. 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? దీని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షేర్చాట్తో ఇంతలా పాపులర్ అవ్వడానికి అతడు అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ రోజు షేర్‌చాట్ మారు మూల గ్రామాలకు కూడా పాకింది. ఈ ప్రయాణంలో అతడు 17 సార్లు ఫెయిలయ్యాడు. మొత్తానికి పట్టువదలని విక్రమార్కునిలాగా అనుకున్నది సాధించి సక్సెస్ సాధించాడు. 2015లో ప్రారంభమైన షేర్‌చాట్ ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ సహా మొత్తం 15 భాషలలో అందుబాటులో ఉంది. అంకుష్ సచ్‌దేవా మొదట్లో 17 స్టార్టప్‌లను ప్రారంభించినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత 18వ ప్రయత్నంలో అంకుష్ సచ్‌దేవా అతని ఇద్దరు ఐఐటీ ఫ్రెండ్స్ ఫరీద్ అహ్సన్, భాను సింగ్‌తో కలిసి షేర్‌చాట్ ప్రారంభించాడు. (ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?) 1992 ఘజియాబాద్‌లో జన్మించిన అంకుష్ సచ్‌దేవా తన సీనియర్ సెకండరీ పాఠశాల విద్యను సోమర్విల్లే స్కూల్లో పూర్తి చేసి, తరువాత 2011లో ఐఐటి కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసాడు. ఆ తరువాత 2015లో మైక్రోసాఫ్ట్‌లో కొంత శిక్షణ పొందాడు. (ఇదీ చదవండి: తక్కువ వడ్డీతో లోన్ అందించే టాప్ 10 బ్యాంకులు - ఇవే!) భారతదేశంలో షేర్‌చాట్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీనికి అంకుష్ సచ్‌దేవా సీఈఓగా ఉన్నారు. ఇది ప్రస్తుతం 15 భారతీయ భాషల్లో 350 మిలియన్ల కంటే ఎక్కువ మంది మంత్లీ యాక్టివ్ యూజర్స్ కలిగి ఉంది. ఇందులో సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షేర్‌చాట్ విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 40,000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్‌మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్‌లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్‌ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
అగ్ని-5 ప్రయోగం విజయవంతం.. 5,500 కిమీ లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
భువనేశ్వర్: అగ్ని-5 అణు బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. డమ్మీ వార్‌హెడ్స్‌తో అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్స్ ఛేదించగలవు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలు మరో మైలురాయిని చేరుకున్నట్లయింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దులో చైనా బలగాలలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే అగ్ని-5 ప్రయోగం జరగడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిసైల్స్.. సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగంపై చైనా గతంలో అభ్యతరం కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని సాకుగా చూపింది. భారత్ మాత్రం యథావిధిగా ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. చదవండి: గతం గతహా.. వాళ్లతో నన్ను పోల్చకండి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
Integrated Main Parachute Airdrop Test: ‘గగన్‌యాన్’లో ముందడుగు...
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్’కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆస్ట్రొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. నిజానికి ఆస్ట్రొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ ఆర్అండ్డీ కార్యకలాపాలతోపాటు.. ఏపీఐలను రూపొందిస్తున్న కంపెనీ సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 104 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంపన్న వర్గాల విభాగంలో 161 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 56 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలోనూ 32 రెట్లు స్పందన కనిపించింది. షేరుకి రూ. 265–274 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 700 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని వాటాదారులు, ప్రమోటర్లు ఆఫర్ చేయడంతోపాటు, మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. గత బుధవారం(15న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ. 315 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఈక్విటీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. -
మరోసారి సత్తా చాటిన ‘అగ్ని–5’
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సిద్ధం చేసింది. -
TS: ఎక్కడికక్కడ అరెస్టులు.. భారత్ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసింది. ఆదివారం రాత్రి నుంచే జోరుగా వర్షం కురుస్తుండటంతో సోమవారం ఉదయం ఆందోళనకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందిపడ్డారు. పోలీసులు ఉదయం నుంచే అఖిలపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడంతోపాటు ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఉద యం నుంచే కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్రంలోని బస్‌డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఉదయం 10 గం. తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో బస్సుల రాకపోకలు యథావిధిగా సాగా యి. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తెరచినా విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు అక్కడకు చేరుకుని మూసివేయించారు. ఉదయం 10 గంటల తర్వాత వాణిజ్య దుకాణాలు యథావిధిగా నడిచాయి. మాల్స్, మార్కెట్లు కూడా పలుచోట్ల ఉదయం నుంచే కార్యకలాపాల్లో నిమగ్నంకాగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆం దోళనకారులు మూసివేయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశాయి. ఈ బంద్‌లో పాల్గొన్న ముఖ్య నేతలనూ పోలీసులు అరెస్టు చేసి.. కొంతసేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. బంద్‌లో భాగంగా ప్రతిపక్షాల రాస్తారోకోతో ఖమ్మం బైపాస్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు ఎక్కడికక్కడ నిర్బంధం... బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలను సోమవారం ఉదయాన్నే గృహ నిర్బంధం చేశారు. ఉప్పల్ బస్‌డిపో ఎదుట జరిగిన ఆందోళనలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హయత్‌నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడా వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు జూల కంటి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్ తదిత రులు ర్యాలీ నిర్వహించారు. వీరిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కోదండరాం దుస్తులు చినిగిపోయాయి. శంషాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణ, పుల్లూరు టోల్గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేడ్చల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ముంబై హైవేపై మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, బంజా రాహిల్స్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, తుక్కుగూడ వద్ద ఏఐసీసీ కార్య దర్శి వంశీచందర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొనగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరా బాద్– విజయవాడ, హైదరాబాద్– శ్రీశైలం, హైద రాబాద్–బెంగళూర్ వెళ్లే జాతీయ రహదారులు రాస్తారోకోలతో స్తంభించిపోయాయి. హైదరాబా ద్లో ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగా నడిచాయి. పలు ప్రాంతాల్లో బంద్ ఇలా... ►సిద్దిపేట జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. పలుచోట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ►నల్లగొండ బస్‌స్టాండ్ ఎదుట బైఠాయించిన అఖి లపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్య క్షుడు చెరకు సుధాకర్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి నల్లగొండ పరిధి లోని మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, నకిరేకల్ ప్రాం తాల్లో ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారా యణపేటలో మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. మిగతా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉదయం 10 నుంచే బస్సులు నడిచాయి. పలు షాపులు, హోటళ్లు, వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. సోమవారం తెల్లవారుజాము నుంచే అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. జోరు వర్షంలో సైతం ఖమ్మం ఆర్టీసీ బస్‌డిపో, బస్టాండ్, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం బస్‌డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో మధ్యాహ్నం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 610 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొన్ని బస్సులను నడిపారు. ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నా యకులను పోలీసులు అరెస్టు చేశారు. యాచా రం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, ఆది భట్ల ప్రాంతాల్లో పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగా రెడ్డిని ఉదయమే గృహ నిర్బంధం చేశారు. ►ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాం తంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో దుకాణాలు కొంత ఆలస్యంగా తెరిచారు. కాం గ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేస్తూ వ్యాపార సముదాయాలను మూసేయిం చారు. మధ్యాహ్నం తరువాత దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు తెరుచుకున్నాయి. ఆ చట్టాలు రద్దు చేయాలి.. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశాన్ని పెట్టుబడిదారు లకు తాకట్టు పెట్టి తెగన మ్మేందుకు సిద్ధమయ్యారు. రైతు చట్టాలను నిరసిస్తూ నాడు మంత్రి కేటీఆర్ కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఢిల్లీ పిలుపుతో కేసీఆర్ అక్కడ విందులో పాల్గొన్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చే వరకు, నోటిఫికేషన్ ఇచ్చే వరకు కేసీఆర్ ఫ్లెక్సీలకు లిక్కర్‌తో అభిషేకం చేయాలి. ప్రతి బార్ షాపు ముందు కేసీఆర్ బొమ్మ పెట్టాలి’. – టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మోదీ సర్కార్‌పై వ్యతిరేకతతో... దేశంలో ఆరు రాష్ట్రాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పు కుంటున్న తెలంగాణ సర్కా ర్ మద్దతు ఇవ్వడం లేదు. ఈ బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదు.. మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలే ప్రకటిం చింది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ అధికారం లేదు... నిరసన హక్కును నియంత్రించే అధికారం తప్ప.. నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. నిరసన ప్రజల హక్కు, దాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోర్టు లు తీర్పిచ్చినా సర్కార్ పట్టించుకో వడంలేదు. నిరసనకారులను అరెస్ట్ చేస్తుండటా న్ని చూస్తే కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కుమ్మకైనట్లు అర్థమవుతోంది. – టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆ చట్టాలు రైతులకు ఉరితాళ్లు కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు అదానీ, అంబానీకి బానిసలుగా మార్చేవి మాత్రమే. మోదీకో హటావో.. దేశ్‌కో బచావో అన్నది ఇప్పుడు అత్యవసరం. – సీపీఐ జాతీయ నేత నారాయణ -
యూనియన్ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం
న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్ బ్యాంకు ప్రకటించింది. -
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు
సియోల్: సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో వరుసగా రెండు రోజులు ఉత్తర కొరియా నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కలి్పంచే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. అణు వార్హెడ్లు మోసుకుపోగలదా? ఈ క్షిపణిని ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అభివర్ణించింది. ఇది అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని నిపుణులు చెబుతున్నారు. ‘వ్యూహాత్మక ఆయుధమని ఉత్తర కొరియా చెబుతోందంటే దీనికి అణు వార్హెడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. అయితే వాటిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందో లేదో చెప్పడం కష్టం’ అని అమెరికాకు చెందిన కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సభ్యుడు అంకిత్ పాండా చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అందుకే ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా ఇప్పటికే కిమ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు. మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా నిరంతరం అణ్వాయుధాలపైనే దృష్టి సారించి ఇలా పరీక్షలు చేయడం అంతర్జాతీయ సమాజానికి కూడా ముప్పేనని యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రూయిజ్ క్షిపణి ప్రయోగ దృశ్యాలు -
అంగారకుడిపై అరుణ పతాకం
బీజింగ్: డ్రాగన్ దేశం ప్రయోగించిన జురోంగ్ రోవర్ అంగారక గ్రహంపై శనివారం విజయవంతంగా దిగింది. అరుణ గ్రహంపై రోవర్‌ను దింపిన రెండో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. 9 నిమిషాల ఉత్కంఠ పరిస్థితుల తర్వాత తమ రోవర్ మార్స్‌పై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చైనా పురాణాల్లోని అగ్నిదేవుడి పేరు జురోంగ్. 320 మిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ముందే నిర్దేశించినట్లుగా మార్స్‌పై ఉటోపియా ప్లానిటియా దక్షిణ ప్రాంతంలో జురోంగ్ చైనా కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అడుగు మోపింది. రోవర్ మార్స్‌పై దిగాక తన సోలార్ ప్యానెళ్లను, యాంటెనాను విప్పుకొని, సిగ్నల్స్ పంపించగానే చైనా స్పేస్ సైంటిస్టులు హర్షాతిరేకాలు చేశారు. అంగారకుడిపై విజయవంతంగా ఎర్రజెండా పాతి, స్పేస్ ప్రాజెక్టుల్లో తాను ముందంజలో ఉన్నానన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు చైనా పంపించింది. ప్రాజెక్టును విజయవంతం చేసిన తమ స్పేస్ సైంటిస్టులకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ఆరు చక్రాలున్న జురోంగ్ రోవర్ సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. తనకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రోవర్ బరువు 240 కిలోలు. తన వెంట ఆరు శాస్త్ర సాంకేతిక పరికరాలను మార్స్‌పైకి మోసుకెళ్లింది. ల్యాండర్ నుంచి వేరుపడిన తర్వాత మూడు నెలల పాటు విధులు నిర్వర్తిస్తుంది. అరుణ గ్రహం ఉపరితలంపై జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తుంది. -
ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదని. అందుకోసం హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అమితాబ్‌కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగింది. తాజాగా ఆయన మరో కంటికి కూడా ఆపరేషన్ విజయవంతంగా పూరయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తెలిపారు. అంతేకాక ‘కంటిశుక్లం చాలా ముఖ్యమైనది. దీని విషయంలో ఎలాంటి ఆలస్యం చేసినా అది అంధత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఆలస్యం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’ అని సూచించారు బిగ్ బీ. ఆపరేషన్ విజయవంతం అయిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడమే కాక.. తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ హిమాన్షు మెహతాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు బిగ్ బీ. ‘‘నా రెండో కంటికి చేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను.. బాగున్నాను. ఆధునిక వైద్య పరిజ్ఞానం.. డాక్టర్ మెహత హస్తవాసి వల్ల ఇది సాధ్యమయ్యింది. ఈ అనుభవం నా జీవితాన్ని మార్చేసింది. గతంలో మీరు చూడలేనిది ఇప్పుడు చూడవచ్చు. ఖచ్చితంగా అద్భుతమైన ప్రపంచం’ అని కొనియాడాతు ట్వీట్ చేశారు. T 3842 - .. and the 2nd one has gone well .. recovering now .. all good .. the marvels of modern medical technology and the dexterity of dr HM 's hands .. life changing experience .. You see now what you were not seeing before .. surely a wonderful world !! — Amitabh Bachchan (@SrBachchan) March 14, 2021 అమితాబ్ బచ్చన్ గత ఫిబ్రవరిలో మొదటిసారి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ‘అభిమానుల ఆందోళన, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. ఈ వయస్సులో కంటి శస్త్రచికిత్స సున్నితమైనది. ఖచ్చితమైన సంరక్షణ అవసరం. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ బ్లాగ్‌లో తెలియజేశారు. శస్త్ర చికిత్స జరిగినందున టైపింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నది. టైపింగ్ తప్పులు జరిగితే క్షమించండి అని చివరన పేర్కొన్నారు బిగ్ బీ. ఇక అమితాబ్ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఇదే కాక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తున్నారు. చదవండి: అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్ గంగారామ్.. నువ్వు సూపర్!: అమితాబ్ -
మళ్లీ ఊపిరి పోశారు!
సాక్షి, హైదరాబాద్: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇ బ్బంది, ఆయాసంతో పాటు కరోనా వైరస్ బారిన పడిన ఓ యువకుడికి నగరంలోని కిమ్స్ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ భాస్కర్‌రావు, హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్టు డాక్టర్ సందీప్ అట్టావర్లు చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ఒకే సమయంలో 2 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చే యడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. దాతది కోల్‌కతా.. స్వీకర్తది చండీగఢ్ పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన రిజ్వాన్ (32) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్య (సర్కోయిడోసిస్)తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రులను తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆయన హైదరాబాద్ కిమ్స్‌లోని ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అట్టావర్‌ను సంప్రదించాడు. అయితే బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా సర్కోయిడోసిస్‌కు తోడు కరోనా కూడా సోకినట్లు తేలింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు నిర్ణయించారు. అవయవ మార్పిడి చికిత్సకు రిజ్వాన్ అంగీకరించడంతో అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆగస్టు 24న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి (52) బ్రెయిన్‌డెత్ స్థితికి చేరుకున్నాడు. అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న రిజ్వాన్, కిమ్స్ వైద్యులకు ఈ సమాచారం అందింది. అప్పటికే రిజ్వాన్ కోవిడ్‌ను జయించడంతో వైద్యులు చికిత్సకు సిద్ధమయ్యారు. వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి.. ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఓ వైద్య బృందం వెంటనే ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్లి దాత శరీరం నుంచి ఊపిరితిత్తులను సేకరించి, అదే రోజు అదే విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆస్పత్రిలో ఉన్న మరో వైద్య బృందం అప్పటికే రోగి ఛాతీని ఓపెన్ చేసి ఉంచింది. డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి రోగికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్ వైద్యులకు బాధితుడు రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్లాస్మాథెరపీలో ‘గాంధీ’ సక్సెస్
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): కరోనా వైద్యం లో భాగంగా చేపట్టిన ప్లాస్మాథెరపీ చికిత్సలు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వంద శాతం విజయవంతమయ్యా యి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాస్మాథెరపీ చికిత్సల్లో ఐసీఎంఆర్ చేపట్టిన గ్రేడింగ్‌లో ఈ ఆస్పత్రికి 5వ స్థానం దక్కింది. కేటాయించిన కోటా పూర్తికావడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాల మేర కు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాధెరపీ చికిత్సలు నిలిపివేశారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయస్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. మే 14న మొదటి ప్లాస్మాచికిత్స సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీఎంఆర్ ఆదేశాలతో వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన యువకుడి (44)కి గత మే 14న 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పం దించడంతో మే 16న మరో డోస్ ప్లాస్మాను ఎక్కించడంతో బా«ధితుడు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకుని వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యా డు. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న మ రో 24 మందికి విజయవంతంగా ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న క్రమంలో ప్లాస్మాథెరపీని కరోనా చికిత్సలో భాగం చేయాలా, మరికొంతకాలం ప్రయోగాత్మకంగానే పరిశీలించాలా అనే అం శంపై ఐసీఎంఆర్ తర్జనభర్జన పడుతోంది. దేశవ్యాప్తంగా ఈ చికిత్సలు నిర్వహించిన 25 సెం టర్లలో చికిత్సపొందిన 625 మంది బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్లాస్మాచికిత్స ఫలితాలు సాధించలేదు. తెలంగాణ, ఏపీలో సత్ఫలితాలనిచ్చిన క్రమంలో ప్రాంతాలవారీగా అధ్యయనం చేస్తున్నారు. అప్పటి వరకు ప్లాస్మా చికిత్సలకు విరామమివ్వాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. 5వ ర్యాంకు గర్వకారణం ప్లాస్మాథెరపీ చికిత్సల్లో వంద శాతం ఫలితాలు సాధించి దేశవ్యాప్త గ్రేడింగ్‌లో గాంధీ ఆస్పత్రి 5వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఐసీఎంఆర్ సూచనతో ప్రస్తుతం ప్లాస్మాథెరపీ చికిత్సలు నిలిపివేశాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
సాహా చేతివేలికి సర్జరీ
కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం అతని గాయంపై మణికట్టు వైద్య నిపుణుడిని సంప్రదించింది. ఆయన సర్జరీకి సూచించడంతో ముంబైలోని హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాహా మాట్లాడుతూ ‘ఇది మామూలు గాయమే. కాస్త ఫ్రాక్చర్ అయింది. కోలుకునేందుకు పెద్దగా సమయం పట్టదు. ఐదు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొని ఫిట్నెస్ సంతరించుకుంటాను’ అని అన్నాడు. న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. -
కేసీఆర్ చరిష్మా.. ఆరేళ్లుగా హ్యాపీ జర్నీ!
సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ, 11 లోక్‌సభ స్థానాల్లో విజయం.. ఆ తర్వాత జరిగిన మెదక్, వరంగల్ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గెలుపు.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం.. అనంతరం జరిగిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల్లో 60% పైగా స్థానాలు, దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా ఏకంగా 32 జడ్పీ పీఠాలు కైవసం.. తాజాగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో 50 శాతానికి పైగా ఓట్లతో రికార్డు విజయం.. ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో తడబాటు మినహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. అది ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా.. కారు జోరుగా దూసుకుపోతోంది. ఎన్నికల పేరు మార డమే తప్ప.. ఆరేళ్లుగా విజయం మాత్రం టీఆర్ఎస్నే వరిస్తోంది. దీంతో అధికార పార్టీ జైత్రయాత్రకు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఆ పార్టీ అధినేత కేసీఆర్ చరిష్మాకు గండికొట్టి ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలా ఓడించాలన్న దానిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అననుకూల పరిస్థితుల్లో జరిగాయని భావిస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికల్లోనూ 43వేల మెజారిటీతో టీఆర్ఎస్ గెలవడంతో తమ భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆ పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏం చేద్దాం చెప్మా...! టీఆర్ఎస్ జోరుకు అడ్డుకట్ట వేయడం ఎలా అన్నది ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలు రాబో తున్న తరుణంలో వెలువడిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితం ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అయితే రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ టీఆర్ఎస్దే పూర్తిస్థాయిలో ఆధిపత్యం కానుంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే పార్టీ పరంగా సంస్థాగతంగా వేళ్లూనుకుంటున్న టీఆర్ఎస్కు పట్టణ ప్రాంతాల్లో అయినా కళ్లెం వేయడం ప్రతిపక్ష పార్టీలకు తక్షణ కర్తవ్యం కానుంది. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రస్తుత పరిస్థితి, ప్రజల మూడ్ చూస్తే ఇది సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రంలో మంచి కేడర్, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలోనూ అధికార పార్టీని ఢీకొడుతోంది కానీ పైచేయి సాధించలేకపోతోంది. దీంతో వరుస ఓటములు ఆ పార్టీ కేడర్‌ను నైరాశ్యంలో ముంచేస్తున్నాయి. కేసీఆర్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్పినా ఎన్నికల బరిలో కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు విశ్వసించకపోవడంతో ఆ పార్టీ కేవలం పోటీకి మాత్రమే పరిమితమవుతోంది. ఇక, టీఆర్ఎస్ను గద్దె దించి 2023లో తెలంగాణపై జెండా ఎగరవేస్తామని చెబుతున్న బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. 2014 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో మినహా ఆ పార్టీ కనీసం టీఆర్ఎస్కు పోటీ ఇవ్వడమే కాదు.. రెండో స్థానానికి కూడా ఆమడ దూరంలో నిలిచింది. ఇక, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అయితే డిపాజిట్ కూడా కోల్పోయి పరాభవం మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు పద్మవ్యూహంగానే కనిపిస్తోంది. ఆ పార్టీలు ‘ఖల్లాస్’.. రాష్ట్రంలోని టీడీపీ, వామపక్షాల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ తమ ఖాతాలో వేసేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి 25వేల పైచిలుకు ఓట్లు రాగా, తాజా ఉప ఎన్నికలో 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నష్టం జరిగినా హుజూర్‌నగర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీకి కనీసంగా 7వేలకు తగ్గకుండా ఓట్లు రావాల్సి ఉంది. కానీ, అందులో పావు వంతు కూడా రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు సైకిల్‌ను వదిలి కారెక్కినట్టు అర్థమవుతోంది. వామపక్షాలదీ అదే పరిస్థితిగా కనిపిస్తోంది. సీపీఎంకి 2018 ముందస్తు ఎన్నికల్లో 2వేల పైచిలుకు ఓట్లు రాగా, ఇప్పుడు ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ఇక, సీపీఐ పోటీలో లేనప్పటికీ ఆ పార్టీ ఓట్లు కూడా కారుకే పడ్డాయనేది అంచనా. ఒక్క హుజూర్‌నగర్‌లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్ వైపు దాదాపు మళ్లినట్టేనని, ఆ పార్టీల ఓటు బ్యాంకును కారు కొల్లగొట్టందని హుజూర్నగర్ ఉప ఫలితమే చెబుతోంది. క్షేత్రం.. మరింత పటిష్టం టీఆర్ఎస్ ఆవిర్భావ దశ నుంచి ఉత్తర తెలంగాణలో బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలో కొంత వెనుకబడేది. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇక 2019 అక్టోబర్ నాటికి చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలీయ శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రాబల్యం కొట్టిచ్చినట్టు కనిపించే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లతో పాటు ఖమ్మంలోనూ పటిష్ట స్థితికి చేరింది. తాజా ఉప ఎన్నికతో పాటు ఖమ్మం కార్పొరేషన్‌ను స్వంతంగా దక్కించుకునే స్థాయికి అధికార పక్షం వేళ్లూనుకుంది. ఇక, ఇతర పార్టీల నుంచి చాలా రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న వలసలు క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి టానిక్‌లా పనిచేస్తున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు కూడా కొన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు లేనంతగా అవి ఉపయోగపడ్డాయి. రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి పటిష్ట కేడర్ ఉన్న హుజూర్‌నగర్‌లోనే ఆ పరిస్థితి ఉందంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో పేరు మోసిన నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడం, గ్రామాల్లో కనీసం పార్టీ జెండాలు మోసేందుకు, మోయించేందుకు కూడా ఇతర పార్టీలకు మనుషులు లేకుండా చేయడమే వ్యూహంగా పథకం ప్రకారం టీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ చదరంగం.. ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
సయ్యారే వయ్యారి గాలిపటం..!
-
డెంగ్యూ దోమపై విజయం
లండన్: పరిశోధకులు చేపట్టిన ఓ ప్రయోగం వల్ల డెంగ్యూ రహిత పట్టణం ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితం డెంగ్యూ వైరస్‌ను అదుపు చేసేందుకు దోమల్లో ప్రవేశ పెట్టిన వోల్బచియా బ్యాక్టీరియా ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ దీవిలో 66 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న టౌన్స్‌విల్లే వేదికైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు దోమల్లో వోల్బచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి ఇతర దోమలతో జత కూడేలా చేయడంతో డెంగ్యూ వైరస్‌ను నివారించగలిగారు. 2014 నుంచి టౌన్స్‌విల్లేలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ, జికా వ్యాధులను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన మొదలు పెట్టామని, ఈ ఫలితాలతో తమకు నమ్మకం పెరిగిందని వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ డైరెక్టర్ స్కాట్ ఓ నీల్ చెప్పారు. ప్రస్తుతం వీటిని ఇండోనేషియాలో ప్రయోగిస్తున్నారు. జికా వైరస్‌ను నివారించేందుకు వీటిని బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో ప్రయోగించనున్నారు. ‘టౌన్స్‌విల్లే కన్నా రెట్టింపు విస్తీర్ణం, 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న రియోలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధిస్తాం’ అని నీల్ అన్నారు. ఈ బ్యాక్టీరియా మలేరియాను నివారించగలదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. -
అమ్మో..కణితి
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం డాన్బరిలోని ఓ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ అండాశయం నుంచి తొలగించిన 60 కిలోల కణతి ఇది. రెండు నెలల పాటు వారానికి అసాధారణంగా 5 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నట్లు గుర్తించిన ఆమె వైద్యులను సంప్రదించడంతో అది కణతి అని తెలిసింది. దాని పరిమాణం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమె జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో ఆమెకు తక్కువ పోషకాలు ఉన్న ఆహారమిచ్చి క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా ఫిబ్రవరిలో కణతిని విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
-
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
పోఖ్రాన్: రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చివరిసారిగా 2017 నవంబర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. పలు దేశాల సైనికాధికారులు కూడా వీటిని కొనేందుకు చాలా ఆసక్తి చూయించారు. బ్రహ్మోస్ గురించి కొన్ని వాస్తవాలు - బ్రహ్మోస్ ఒక మాధ్యమ శ్రేణి రామ్‌జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. - భూమి, గాలి మరియు సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు. - ఇది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), రష్యన్ ఫెడరేషన్ ఎన్పీఓ మాషినోస్రోయేనియాల ఉమ్మడి వెంచర్. - బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది. - గతంలో బ్రహ్మోస్ 2.8 నుంచి 3.0 మాక్‌ల వేగంతో ప్రయాణించేది. ఇప్పుడు దీని వేగం 5.0 మాక్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. (మాక్ = 1234.8 కిలోమీటర్/అవర్)ఇది మాక్ - ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి. - ఇది 2006 నుంచి సేవలందింస్తోంది. -
సాంకేతిక రంగంలో గిరిజన యువతులు
‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగ¯ŒS’ అనే విషయాన్ని మరోమారు ఆదివాసీ యువతులు రుజువు చేశారు. ఎల్ఈడీ బల్బుల తయారీలో ముందంజ వేశారు. దాదాపు 70 మంది గిరిజన యువతులు ఉపాధి పొందుతున్నారు. రూ.ఐదు కోట్ల బల్బుల సరఫరాకు ఆర్డర్ పొందారు. స్వయం ఉపాధి రంగంలో దిక్సూచిగా నిలిచిన రంపచోడవరం ఆదివాసీ యువతులు విజయగాథ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది. – రంపచోడవరం ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కో సం అనేక చోట్ల తిరిగి నేడు అనేక మంది గిరిజన యువతకు ఉపాధినిస్తోంది వీరలక్ష్మి. ‘రంప గిరి జన మహిళ సమాఖ్య పరిశ్రమ కో ఆపరేటివ్ సొసైటీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్లో 41 మంది గిరిజన యువతులు సభ్యులుగా మరో 29 మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి జీతాలతో పాటు సభ్యులు యూనిట్ నిర్వహణ ద్వారా వచ్చే లాభాలను సమానంగా పంచుకుంటారు. ఏజెన్సీలో ఇంజినీరింగ్ చదివి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవని కేవలం ఏజెన్సీ డీఎస్సీ తప్ప అంటూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ మీటింగ్‌లో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఏజెన్సీలో పరిశ్రమ స్థాపన కోసం నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో విజయం సాధించి నేడు ఎల్ఈడీ యూనిట్ నిర్వహణ దగ్గర నుంచి మార్కెట్ వరకు అన్ని తానై చూసుకుంటుంది. రూ.5 కోట్ల ఆర్డర్ లాభాల బాటలో పయనిస్తున్న ఎల్ఈడీ యూనిట్ రూ. 5 కోట్లు వ్యాపారం దిశగా అడుగులు వేస్తోది. ఏపీఈపీడీసీఎల్‌కు రూ. 3 కోట్లతో పాటు ఇతర సంస్థలకు కూడా ఎల్ఈడీ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు అర్డర్ పొందారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీవో ఎఎస్ దినేష్‌కుమార్ ప్రోత్సాహంతో ముందుకు వెళ్లుతున్నారు. -
మేరా ఇస్రో మహాన్.
-
పినాక–2 పరీక్ష విజయవంతం
బాలసోర్ (ఒడిశా): పినాక రాకెట్ మార్క్–2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి గురువారం దీనిని విజయవంతంగా పరీక్షించారు. పినాక మార్క్–1కు నేవిగేషన్, మార్గనిర్దేశనం, నియంత్రణ కిట్లను జతచేర్చి పినాక–2ను అభివృద్ధి చేశారు. అన్ని నిర్దేశిత ప్రమాణాలను పినాక–2 అందుకుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనిని హైదరాబాద్‌లోని ఆర్సీఐ, డీఆర్డీఎల్, పుణెలోని ఏఆర్డీఈలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. -
అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం
-
పరుగులు పెట్టిన రైలు
రాయదుర్గం–కళ్యాణదుర్గం మార్గంలో 110 కిలోమీటర్ల స్పీడ్‌తో ట్రయల్ రన్ విజయవంతం వారం రోజుల్లోగా సౌత్ వెస్ట్రన్ రైల్వే జీఎంకు నివేదిక నెలాఖరులోనే ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం? రాయదుర్గం టౌన్: రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు నిర్మించిన కొత్త రైలు మార్గంలో ప్రత్యేక తనిఖీ రైలు శుక్రవారం అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా నడిపి పరీక్షించారు. ట్రయల్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైనట్లు రైల్వే సేఫ్టీ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల మధ్య దూరం గల ఈ మార్గంలో తొలుత రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి ఉదయం 9.30 గంటలకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రత్యేక రైలు కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు అదే వేగంతో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా విజయవంతంగా రాయదుర్గం స్టేషన్‌కు వెళ్లింది. మొదటి రోజు ఆరు మోటార్ ట్రాలీలలో సీఆర్ఎస్ తనిఖీలు నిర్వహించిన సౌత్ వెస్ట్రన్ రైల్వే, రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు రెండో రోజైన శుక్రవారం ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఇంజినీర్లను, రైలు గార్డులు, డ్రైవర్లు, అధికారులను అభినందించారు. రాయదుర్గం చేరుకున్న తరువాత విలేకర్లతో రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అశోక్ గుప్తా, చీఫ్ సేఫ్టీ కమిషనర్ మనోహర్, ఏడీఆర్ఎం పునిత్ మాట్లాడారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని, ఆథరైజేషన్ నివేదికను వారం రోజుల్లోగా సౌత్‌వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌కు అందజేస్తామన్నారు. సేఫ్టీ తనిఖీల్లో అన్ని పారా మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. మార్గంలో రైలు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అన్ని రకాలుగా ట్రాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నెలాఖరులో లేదా జనవరిలో ఒక ప్యాసింజర్ రైలు నడిపించే అవకాశం ఉందన్నారు. రాయదుర్గం నుంచి టుంకూరుకు 207 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం వరకు రైలు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఆంధ్రా పరిధిలోని 94 కిలోమీటర్లకు గాను ఇంకా 23 కిలోమీటర్ల పరిధిలో భూమి అక్విజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, కర్ణాటక పరిధిలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. -
పెద్ద దర్గాలో నాగ అన్వేష్ ప్రార్థనలు
కడప కల్చరల్: యువ సినీ నటుడు నాగ అన్వేష్ శనివారం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గాను దర్శించుకున్నారు. దర్గా ముజావర్ అమీర్ ఆయనకు దర్గా గురువుల విశిష్ఠత, చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత దర్గాలోని ప్రధాన గురువుల మజార్‌ను, అనంతరం ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించార. అనంతరం నాగ అన్వేష్ మాట్లాడుతూ తాను నటించిన వినవయ్యా రామయ్య చిత్రం విజయవంతమైందని, ప్రస్తుతం తాను హీరోగా నటించిన ఏంజిల్ చిత్రం త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఆ చిత్రం విజయవంతం కావాలని దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు. -
తొర్రూరు బంద్ విజయవంతం
తొర్రూరు : తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తొర్రూరు మండల బంద్‌తో పట్టణంలోని షాపులు, విద్యా సంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, బ్యాంక్‌లు మం గళవారం మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకొని జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ, బీజేపీ, కాం గ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, స్వ చ్ఛంద సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. తర్వాత ర్యాలీగా గాంధీ సెంటర్‌కు వస్తున్న నాయకులు, కార్యకర్తలను సీఐ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. ఈ సం దర్భంగా డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రవీణ్‌రాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, బీజేపీ, టీడీపీ, వామపక్షాల నాయకులు పల్లె కుమార్, బిజ్జాల శంకర్, వై. వెంకటయ్య, ఓమ బిక్షపతి, పాడ్య బీకు మాట్లాడుతూ అన్ని వనరులతో అర్హత కలిగిన తొర్రూరు మండలాన్ని రెవెన్యూ డివి జన్‌గా ప్రభుత్వం గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కోటగిరి కృష్ణమూర్తి, జాటోతు ధర్మ, కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మిత్తింటి వెంకటేశ్వర్లు, చిత్తలూరి శ్రీనివాస్, రవీంద్రాచారి, పూర్ణచందర్, అమీర్, రాయిశెట్టి వెంకన్న, మేకల కుమార్, బొల్లం అశోక్, ముద్దం మహబూబ్‌రెడ్డి, చీక టి శ్రీనివాస్, రంగు రాములు, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కస్తూరి పులేం దర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన క్యారమ్స్ పోటీలు
పురుషుల విభాగంలో తమిళనాడు హవా చిలకలూరిపేట రూరల్ : సీఅర్ క్లబ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నాలుగు రోజులపాటు పట్టణంలోని క్లబ్ ఆవరణలో నిర్వహించిన స్టేట్ సెకెండ్ ర్యాంకు, సౌత్ ఇండియా టోర్నమెంట్ క్యారమ్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు విభాగాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో విజేతలు.. సౌత్ ఇండియా టోర్నమెంట్ పురుషుల విభాగంలో తమిళనాడు క్రీడాకారులు వరుసగా నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన భారతిదాసన్, బి.రాధాకృష్ణన్ ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. మూడు, నాలుగు స్థానాలను సగమ భారతి, కుబేంద్రబాబు పొందారు. మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యు సరితాదేవి, విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. మూడు, నాలుగు స్థానాలను గుంటూరు చెందిన హుస్నాసమీర, విజయవాడ టి. తనూజ కైవసం చేసుకున్నారు. స్టేట్ సెకెండ్ ర్యాంకు పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎల్. రాఘవేంద్ర ప్రథమ, మహిళ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో అఖిల భారత క్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ సంపతి, ప్రధాన కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్, టెక్నికల్æడైరెక్టర్ డి.రవీంద్రన్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ శంకరరావు, సీఆర్ క్లబ్ కోశాధికారి ఎన్. వెంకట్రామయ్య విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. -
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
అమెరికా పర్యటన విజయవంతం- మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రెండు వారాలపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలిపారు. అమెరికాలోని అనేక రాష్ట్రాలతో తెలంగాణ నూతన సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ పర్యటన దోహదం చేసిందన్నారు. తెలంగాణతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెట్టుకునేలా ఆయా రాష్ట్రాలను ఒప్పించడంలో ఈ పర్యటన సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. వాటి విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. సిలికాన్ వ్యాలీలో మంత్రి చేసిన ప్రసంగంతో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు అక్కడి ప్రముఖ కంపెనీ ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఐటీ, బయోటెక్నాలజీ, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ టెక్ రంగాల్లోని కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశాలు జరిపారు. అక్కడి టెక్నాలజీ పనితీరును తెలుసుకున్నామన్నారు. మొత్తంగా పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందన్న నమ్మకాన్ని కలిగించడంలో విజయవంతం అయ్యామని మంత్రి తారకరామారావు తెలిపారు. -
పాలిసెట్‌కు 97.35 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన పాలిసెట్-2016 పరీక్షకు 97.35 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) చైర్మన్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1,27,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,24,584 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 220 కాలేజీల్లో 28 బ్రాంచీల్లో 53,870 సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఫలితాలను 2 వారాల్లో ప్రకటిస్తామని, ప్రవేశాలను మే మూడో వారంలో చేపడతామని తెలిపారు. తరగతులు జూన్ 9 నుంచి ప్రారంభిస్తామన్నారు. -
ప్రాచీన మమ్మీ నుంచి డీఎన్ఏ సేకరణ
పరిశోధకులు మొదటిసారి 300 ఏళ్ళనాటి ప్రాచీన డీఎన్ఏ అవశేషాలను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ మమ్మీనుంచి విజయవంతంగా ప్రాచీన డీఎన్ఏ ను వెలికి తీశారు. ముందుగా మమ్మీకి కంప్యూటరరైజ్జ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) నిర్వహించి డీఎన్ఏ అవశేషాలను గుర్తించారు. అనాటమికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ మెరీనా స్టెయిన్... స్విట్జర్లాండ్ లోని జురిచ్, ప్రెటోరియా, బోట్స్వానా విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ఇతర అధ్యయనకారుల బృందంతో కలసి ఈ తాజా అధ్యయనాలు నిర్వహించారు. తులిబ్లాక్ కు చెందిన ఇనుప యుగంనాటి మమ్మీపై జరిపిన జన్యు విశ్లేషణ పరిశోధనా ఫలితాలను సౌతాఫ్రికాలోని బోట్స్వానా సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రాచీనకాలంనాటి మమ్మీ అవశేషాలు.. అప్పటి జనాభాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపేందుకు మంచి వనరుగా ఉపయోగిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే పరిశోధనలు జరిపిన మమ్మీ.. తులి ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా మొదట్లో భావించిన పరిశోధకులు... అనంతరం మమ్మీ అవశేషాలను బట్టి ఆఫ్రికన్ మాలాలు కలిగిన పురుషుడికి చెందినదిగా గుర్తించారు. అతడి మమ్మీ కదలసి స్థితిలో ఉండి, జంతు చర్మంతో చుట్టి, తాళ్ళతో గట్టిగా కట్టి ఉన్నట్లు పరిశోధనా ఫలితాల్లో ప్రచురించారు. మమ్మీలోని అంతర్గత అవయవాలు ఏవీ సురక్షితంగా లేవని సీటీ స్కాన్ ద్వారా తెలుసుకున్న పరిశోధక బృదం... అనేక పోస్టు మార్టం లను కూడ నిర్వహించి వెన్నెముక కింది భాగంలో కొన్నిప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని తెలుసుకున్నారు. అయితే వెన్నెముకలో కనిపించిన మార్పులను బట్టి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలా కనిపించిందని, అతడి మరణం ఎప్పుడు జరిగింది, ఏ కారణంగా జరిగింది అన్న వివరాలు ధృవీకరించడం సాధ్యం కాలేదని వెల్లడించారు. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నట్లు కూడ కనిపించలేదని చెప్పారు. అయితే విజయవంతంగా తాము కనుగొన్న డీఎన్ ఏ విశ్లేషణను బట్టి ఆ వ్యక్తి సోతో సెటస్వానా లేదా ఖోయెసాన్ ప్రాంతానికి చెందిన వాడిగా నిర్థారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
స్లమ్ నుంచి డాక్టర్ స్థాయికి...
ముంబై స్లమ్‌ల గురించి చెబితే.. ముందుగా ఎవరికైనా స్లమ్ డాగ్ మిలీయనీర్ సినిమా గుర్తుకొస్తుంది. మురికివాడల్లో పుట్టినా.. మట్టిలో మాణిక్యాల్లా మారి, ఆణిముత్యాల్లా జీవితాలను మలుచుకున్నవారు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే ముంబైకి చెందిన డాక్టర్ సువాస్ దార్వేకర్. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్బుక్ పేజీలో 'హౌ టు లివ్ లైఫ్' అంటూ ఆయన చెప్పిన విశేషాలు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాయి. పేదరికాన్ని జయించి మంచి ప్రొఫెషనల్‌గా మారాలంటే దాని వెనుక ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. చుట్టపక్కలవారు, స్నేహితుల సహాయ సహకారాలూ అవసరం అవుతాయనేందుకు దార్వేకర్ జీవితం పెద్ద ఉదాహరణ. అందుకే ముంబైలో వ్యర్థాల నుంచి వెలుగులు నింపే చంద్రుడిలా తయారైన డాక్టర్ సువాస్ దార్వేకర్ కథ... జీవితాలను మంచి మార్గంలోకి ఎలా మలచుకోవాలో తెలిపే ఓ పాఠంగా మారింది. పిల్లలు పెరిగే సమయంలో తండ్రి చనిపోవడం, పేదరికానికి తోడు కుటుంబంలోని వారంతా దృష్టి దోషంతో బాధపడటం.. ఒక్కోరోజు భోజనం దొరకడం కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో నిజంగా దార్వేకర్ జీవితం... సినిమా కష్టాలను మించిపోయింది. పాఠశాల ఫీజు కట్టలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో స్నేహితులు ఉపాధ్యాయులు ఆదుకోవడం కూడా తన జీవితంలో మార్పు తెచ్చేందుకు సహాయపడిందంటూ ఫేస్ బుక్ పేజీలో దార్వేకర్ తన కథను పోస్ట్ చేశాడు. వీధిదీపాల కింద చదువుకుంటూ, డబ్బుకోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఎట్టకేలకు పాఠశాల స్థాయి దాటగలిగిన దార్వేకర్.... ఇంటర్మీడియెట్ చివరి దశలో ఉండగా 50 రూపాయల ఫీజు లేక ఇంటికి బయల్దేరాల్సి వచ్చింది. అదే సమయంలో బస్టాప్ లో కనిపించిన స్నేహితుడికి పరిస్థితిని వివరించడంతో అతడు వెంటనే 50 రూపాయలు తీసివ్వడం ఎంతో సహాయపడింది. ఆ స్నేహితుడి రుణం తీర్చుకోలేనిదంటూ ఫేస్బుక్ పేజీలో దార్వేకర్ చెప్పడం అతడి కృతజ్ఞతా భావాన్ని తెలుపుతుంది. అటువంటి గడ్డు పరిస్థితికి చింతిస్తూ కూర్చోలేదు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న చందంగా పట్టుదలతో చదివి డాక్టర్ దార్వేకర్ గా మారాడు. ముంబైలో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించి తన గతజీవితాన్ని మరచిపోకుండా మురికివాడల్లో నివసించేవారికి సేవలందిస్తూ.. అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన దార్వేకర్ కథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. -
'ప్రత్యేక బంద్' సంపూర్ణం.. విజయవంతం
-
ఏడాది కరువు తీరింది
ఏడాది దాటింది భారత్ చివరిసారి టెస్టు మ్యాచ్ గెలిచి. ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడాం. బంగ్లాదేశ్‌పై కూడా వరుణుడి వల్ల గెలవలేకపోయాం. శ్రీలంకలో తొలి టెస్టులో విజయం ముంగిట బొక్కబోర్లా పడ్డాం. టెస్టు విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసిన భారత జట్టు ఎట్టకేలకు శ్రీలంకలో ఆ కరువు తీర్చుకుంది. అద్భుతాలు, అనూహ్యాలకు తావివ్వకుండా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంక దిగ్గజం సంగక్కర ఓటమితోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించగా... భారత కెప్టెన్‌గా కోహ్లి తొలి టెస్టు విజయాన్ని రుచి చూశాడు. - రెండో టెస్టులో భారత్ ఘనవిజయం - 278 పరుగులతో లంక చిత్తు - అశ్విన్‌కు 5 వికెట్లు - 28నుంచి మూడో టెస్టు కొలంబో: శ్రీలంకతో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న భారత్ వెంటనే కోలుకుంది. రెండో టెస్టులో ఆరంభంనుంచి అంది వచ్చిన ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటూ మరోసారి చేజారకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా సోమవారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో భారత్ 278 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 72/2తో చివరి రోజు ఆట ప్రారంభించిన లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. కరుణరత్నే (103 బంతుల్లో 46; 6 ఫోర్లు) పోరాటం మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (5/42) మరోసారి చెలరేగి జట్టును గెలిపించాడు. అతనికి లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/29) అండగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత్ మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ శుక్రవారంనుంచి ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతుంది. తొలి బంతికే షాక్ చివరి రోజు పోరాడి మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనుకున్నశ్రీలంక ఆశలు మ్యాథ్యూస్ (23) అవుట్ కావడంతోనే సన్నగిల్లాయి. ఐదో రోజు ఉమేశ్ వేసిన తొలి బంతికే కీపర్ రాహుల్ అద్భుత క్యాచ్ పట్టడంతో లంక కెప్టెన్ నిష్ర్కమించాడు. ఆ తర్వాత మిశ్రా తన ఓవర్లోనే చండీమల్ (15)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ మరింత పట్టు బిగించింది. కొద్ది సేపటికే తిరిమన్నె (11)ను అవుట్‌చేసి అశ్విన్ తానూ సంబరంలో భాగమయ్యాడు. అనంతరం లంక మిగతా వికెట్లు కోల్పోవడం లాంఛనమే అయింది. కొంత పోరాడే ప్రయత్నం చేసిన ఓపెనర్ కరుణరత్నే కూడా అశ్విన్‌కు వికెట్ అప్పగించాడు. మిశ్రా బౌలింగ్‌లో కౌశల్ అవుట్ కావడంతో ఆ జట్టు 9వ వికెట్ కోల్పోయింది. ఏడు బంతుల్లోనే... ఈ దశలో ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దాంతో పది నిమిషాలు ముందుగా అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. అయితే మైదానంలోకి తిరిగి వచ్చిన తర్వాత భారత్ విజయానికి మరో ఏడు బంతులు మాత్రమే సరిపోయాయి. మిశ్రా బౌలింగ్‌లో చమీరా ఎల్బీడబ్ల్యూ కావడంతో గెలుపు టీమిండియా సొంతమైంది. ఆదివారం 21 ఓవర్లు ఆడి 2 వికెట్లకు 72 పరుగులు చేసిన లంక...చివరి రోజు 22.4 ఓవర్లు ఆడి 62 పరుగులకే మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 393. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 306. భారత్ రెండో ఇన్నింగ్స్ 325/8 డిక్లేర్డ్. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సిల్వ (సి) బిన్నీ (బి) అశ్విన్ 1; కరుణరత్నే (బి) అశ్విన్ 46; సంగక్కర (సి) విజయ్ (బి) అశ్విన్ 18; మ్యాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 23; చండీమల్ (బి) మిశ్రా 15; తిరిమన్నె (సి) (సబ్) పుజారా (బి) అశ్విన్ 11; ముబారక్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 0; ప్రసాద్ (సి) మిశ్రా (బి) అశ్విన్ 0; హెరాత్ (నాటౌట్) 4; కౌశల్ (ఎల్బీ) (బి) మిశ్రా 5; చమీరా (ఎల్బీ) (బి) మిశ్రా 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (43.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1-8; 2-33; 3-72; 4-91; 5-106; 6-111; 7-114; 8-123; 9-128; 10-134. బౌలింగ్: అశ్విన్ 16-6-42-5; ఉమేశ్ 7-1-18-1; ఇషాంత్ 11-2-41-1; మిశ్రా 9.4-3-29-3. 12 అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 12వ సారి. ఇందులో 9 సార్లు భారత్ మ్యాచ్ గెలిచింది. కేవలం 27 టెస్టుల్లోనే అతను ఈ గణాంకాలు నమోదు చేశాడు. 2 1986 (ఇంగ్లండ్‌పై) తర్వాత పరుగులపరంగా భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం. 5 కోహ్లికి కెప్టెన్‌గా ఐదో టెస్టులోనే తొలి ‘విదేశీ’ విజయం దక్కింది. అజహర్ 18, కపిల్ 12 టెస్టులకు గానీ కెప్టెన్‌గా విదేశాల్లో విజయాన్ని అందించలేకపోయారు. 1 గత ఏడాది లార్డ్స్ టెస్టు (2014 జులై) విజయం తర్వాత భారత్ గెలవడం ఇదే తొలిసారి. ఈ మధ్యలో జరిగిన 9 టెస్టుల్లో టీమిండియా 6 ఓడి, 3 డ్రా చేసుకుంది. పుజారాను ఆడిస్తాం గతంలో రెండు సార్లు విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయాం. ఎవరో ఒకరనే కాకుండా ఈ విజయంలో జట్టులోని ప్రతీ సభ్యుడు తన వంతు పాత్ర పోషించాడు. అశ్విన్ బౌలింగ్‌లో దూకుడు నాకు చాలా నచ్చిం ది. కెప్టెన్‌గా తొలి గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. గాలే ఓటమి మమ్మల్ని తీవ్రంగా బాధించింది. మా బ్యాట్స్‌మెన్ సెంచరీలకంటే ప్రత్యర్థి 20 వికెట్లు తీయడమే నాకు ఎక్కువ ఆనందం. మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి మార్చుకోవడమే తప్ప ఎవరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా శాశ్వతం కాదు (రహానే, రోహిత్ గురించి). రాబోయే కొన్నేళ్లు భారత్‌కు ఆడాల్సినవారు దేని కైనా సిద్ధంగా ఉండాలి. మూడో టెస్టులో రాహుల్‌తో కలిసి పుజారా ఓపెనింగ్ చేస్తాడు. అతను గతంలోనూ ఓపెనర్‌గా వచ్చాడు. కరుణ్ నాయర్‌ను ఆడించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం. -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
పల్స్‌పోలియో విజయవంతం
కోనరావుపేట : పోలియో మహమ్మారి నామరూపాలు లేకుండా చేయడానికి ఏర్పాటుచేసిన రెండవ విడత పోలియో ఆదివారం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయడంతో ఈ మహమ్మారిని పారద్రోలడానికి అధికారులంతా కలసికట్టుగా ముందడుగు వేశారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. ఆదివారం ఉదయం రెండేళ్ల బాబుకు పోలియో చుక్కలు వేసిన ఆమె అందరు కలిసి పోరాడి పోలియోను రూపుమాపాలన్నారు. -
స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు
న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన ఓ 28 ఏళ్ల గర్భిణికి స్థానిక వైద్యులు విజయవంతంగా కాన్పు చేశారు. అలాగే స్వైన్‌ఫ్లూ నుంచి ఆ మహిళ బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ‘సాధారణ గర్భిణులతో పోలిస్తే స్వైన్‌ఫ్లూ సోకిన మహిళకు, కడుపులోని శిశువుకు ప్రాణాపాయం ఎక్కువ. 10 శాతం కేసులు మాత్రమే ఇలా విజయవంతం అవుతాయి’ అని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘జనవరి 25న గంగారాం ఆసుపత్రిలో ఆమె చేరింది. దగ్గు, జ్వరం, శ్వాసం తీసుకోవడంలో ఇబ్బంది వంటి వాటితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయగా ఆమెకు న్యుమోనియా అని, ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. దీంతో స్వైన్‌ఫ్లూ నిరోధక వ్యాక్సిన్ ‘టామిఫ్లూ’ను ఆ మహిళకు ఇవ్వడం ప్రారంభించాం. దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి కాన్పు చేశాం. ఢిల్లీలో ఇప్పటి వరకు 1,608 కేసులు నమోదవగాగా, ఈ ఆస్పత్రిలో గత డిసెంబర్ 26న ఈ వ్యాధితో ఒక వ్యక్తి చనిపోయాడు’ అని గంగా రాం ఆస్పత్రి ఛాతీ విభాగం చైర్పర్సన్ ఆరుప్ బసు తెలిపారు. ‘తల్లీ బిడ్డను ఎలా రక్షించాలనే డైలమా ఏర్పడింది. శిశువుకు ఇంకా నెలలు నిండలేదు. తల్లి ఆక్సిజన్ పీల్చుకోడానికి ఇబ్బంది పడుతోంది. గర్భం దాల్చిన 32 వారాల లోపల కాన్పు చేస్తే శిశువు ప్రాణానికి ముప్పు. కానీ, విజయవంతంగా ఆపరేషన్ చే సి తల్లీ బిడ్డను రక్షించాం. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’ అని ’ అని బసు అన్నారు. -
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో పల్స్‌పోలియో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత జిల్లాగా కర్నూలు గుర్తింపు పొందిందన్నారు. ఇకపై కూడా పోలియో మహమ్మారి దరి చేరకుండా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు 5.07 లక్షల మందిని గుర్తించామని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2,167, అర్బన్ ప్రాంతాల్లో 473 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణంలోని చిన్నారులను గుర్తించి చుక్కలు వేయించాలన్నారు. మురికి వాడలు, చెంచుగూడేలు, గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. 18న పల్స్‌పోలియో కార్యక్రమం ఉంటుందని, 17వ తేదీన ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. 19, 20వ తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి చుక్కలు వేయాలన్నారు. పల్స్‌పోలియో సందర్భంగా 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి నోడల్ అధికారి తమ మండలంలో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డులకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైనా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన పింఛన్ల పంపిణీని సమీక్షించారు. ఏజేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, డీఎంహెచ్ఓ డాక్టర్ నిరుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ నెల్లూరును విజయవంతం చేయండి
నెల్లూరు (రవాణా): నగరంలో ప్రతి కుటుంబం పరిసరాల శుభ్రతను పాటించి స్వచ్ఛ నెల్లూరును విజయవంతం చేయాలని కలెక్టర్ జానకి పిలుపునిచ్చారు. స్వచ్ఛ నెల్లూరులో భాగం గా కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ర్యాలీని నగర మేయర్ అబ్దుల్అజీజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ బస్డాండ్ సెంటర్ నుంచి వీఆర్సీ, ఏసీబొమ్మ, కనకమహల్ సెంటర్ మీదుగా గాంధీ విగ్రహం వరకు సాగింది. మద్రాసు బస్డాండ్ పరిసర ప్రాంతాల్లో మేయర్ అజీజ్‌తో పాటు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ చెత్తను శుభ్రం చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ నెల్లూరుకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జానకి మాట్లాడుతూ సోమవారం నుంచి స్వచ్ఛనెల్లూరు కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు సంపూర్ణ సహకారం అందించి స్వచ్ఛనెల్లూరును విజయవంతం చేయాలన్నారు. మేయ ర్ అబ్దుల్అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు ను చెత్తరహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. పలువురు కార్పొరేటర్ల డుమ్మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛనెల్లూరు ర్యాలీకి టీడీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. నగర కమిషనర్ చక్రధర్‌బాబు హైదరాబాద్ వెళ్లారు. ర్యాలీలో నాయకులు, అధికారుల మధ్య పూర్తిగా సమన్వయం కొరవడింది. ర్యాలీ ప్రారంభంలో పాల్గొన్న వారిలో కొంతమంది మాత్రమే చివరి వరకు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎస్ఈ మొయినుద్దీన్, ఎంఎచ్ఓ వెంకటరమణయ్య, డీసీపీ శ్రీనివాసులు, ఏసీపీ వరప్రసాద్, ఎగ్జామినర్ నీలకంఠారెడ్డి, టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు, కృష్ణపట్నం పీఆర్ఓ వేణుగోపాల్, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: 'నిర్భయ్' క్షిపణి విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ విభాగాన్ని మరింత పటిష్ట పరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్భయ్ క్షిపణి సక్సెస్ కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ' ఇది దేశ రక్షణ విభాగం మరింత బలోపేతం కావడానికి మనం సాధించిన గొప్ప ఘన విజయం' అని ఓ సందేశాన్ని విడుదల చేశారు. భూ ఉపరితలంపై నుంచే కాకుండా నీళ్ల పై నుంచి వాయు మార్గాల్లో దాడి చేయగల సత్తా ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల కు పైగా దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. -
అమెరికా క్షిపణులకంటే 'నిర్భయ్' మేలైంది
హైదరాబాద్ : భారత్ అమ్ముల పొదిలో నిర్భయ్ క్షిపణి తిరుగులేని అస్త్రమని సైంటిస్ట్ సతీష్ రెడ్డి అన్నారు. క్షిపణి తయారీలో పాలుపంచుకున్న ఆయన చాందీపూర్ నుంచి ప్రయోగం వివరాలను శుక్రవారం 'సాక్షి'కి అందించారు. అతి తక్కువ ఎత్తులో నిర్భయ్ ప్రయాణించగలదని సతీష్ రెడ్డి వెల్లడించారు. క్షిపణి తయారీలో హైదరాబాద్‌కు చెందిన రక్షణ ప్రయోగశాల కీలక పాత్ర వహించిందన్నారు. అమెరికా దగ్గరున్న క్షిపణులకంటే నిర్భయ్ చాలా మేలైనదన్నారు. సముద్రం అలలపై నుంచి 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలన్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధించగలదని, 16 పాయింట్లను టచ్ చేసుకుంటూ క్షిపణి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందన్నారు. కాగా చాందీపూర్ నుంచి ప్రయోగించిన నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. -
నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భూమి మీద నుంచి, నీళ్ల మీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా చేయగల నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్రూయిజ్ మిసైళ్ల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ కూడా చేరింది. మొబైల్ లాంచర్ ద్వారా ఎక్కడినుంచైనా ప్రయోగించగల నిర్భయ్.. సగం మిసైల్ గాను, సగం విమానరూపంలోను ప్రయాణం చేస్తుంది. భూమిక అతి తక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది కాబట్టి.. రాడార్ నిఘా నుంచి కూడా ఇది తప్పించుకోగలదు. అందువల్ల శత్రువుల కంటబడకుండా వెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుంది. -
మహాలయ అమావాస్య అని భయపడ్డారా?
-
తొలిరోజు సమ్మె సంపూర్ణం
విజయగనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో జాతీయ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సోమవారం నిర్వహించిన తొలి రోజు సమ్మె సంపూర్ణంగా విజయవంతమయింది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ జాతీయ కమిటీల పిలుపుతో జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంక్‌ల సిబ్బంది స్పందిం చి సమ్మెలోపాల్గొన్నారు. జిల్లాలో ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వివిధ జాతీయ బ్యాంకులు 156, గ్రామీణ వికాస బ్యాంక్ శాఖలు 79 వరకు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు 900 మంది వరకు ఉన్నారు. వీరంతా విధులకు వెళ్లక పోవడంతో ఆయా బ్యాంకుల్లో సేవలు నిలిచి పోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో వివిధ రూపాలలో రూ. 130 కోట్ల వరకు లావాదేవీలు స్తంభించాయి. ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలి: ఎస్బీఐ రీజనల్ కార్యదర్శి శంకరసూర్యారావు బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలని ఎస్బీఐ అధికారుల సంఘం రీజనల్ కార్యదర్శి పి.శంకరసూర్యారావు డిమాండ్ చేశా రు. సమ్మె నేపథ్యంలో స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన నిరసన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలు రావడం లేదని గ్రామీణ ప్రాంతాల బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ చర్యలు తీసుకుంటోందని ఆరోపించా రు. ఉద్యోగ భద్రత లేని అవుట్ సోర్సింగ్ విధానం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని ఆవే దన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరా జు, సీఐటీయూ అధ్యక్షుడు ఎంశ్రీనివాస, ఎస్బీఐ సిబ్బంది రీజనల్ కార్యదర్శి పి.సతీష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు బి.శంకరరావు, మధుసూదనరావు, సభ్యులు సూర్యలక్ష్మి, చక్రపాణి, సంతోష్, గుప్తా, స్వామి, ప్రసాద్, జగదీష్, రవి, అప్పలరాజు, మురళిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘వికాస బ్యాంక్’ సమ్మె సక్సెస్ ఉద్యోగుల వేతన ఒప్పందం సాధన కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు, ఎంప్లాయీస్ సంఘాలు చేపట్టిన సోమవారం సమ్మె సక్సెస్ అయింది. సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు రెండు రోజుల పాటు సమ్మెకు తలపెట్టారు. స్థానిక బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట తొలుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జోనల్ కార్యదర్శి టి.రవి, అధ్యక్షుడు డీవీఎస్ఏఎన్.రాజు, ఉద్యోగుల సంఘం రీజియన్ కార్యదర్శి ఎన్.ఎన్.రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవీటీ.నాగేశ్వరరావు, కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు. -
సమైక్య రన్ విజయవంతం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఒలింపిక్, ఏపీఎన్జీఓ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ఐదు కిలోమీటర్ల సమైక్య పరుగు విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం స్థానిక అయోధ్యా మైదానం వద్ద ప్రారంభమైన ర్యాలీని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, ఏన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభూజీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గంటా వెంకటరావు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ర్యాలీ బాలాజీ జంక్షన్, ట్యాంక్‌బండ్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి జంక్షన్, ఎత్తు బ్రిడ్జి, ఆర్అండ్బీ జంక్షన్ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పలువురు విద్యార్థులు 15 అడుగుల జాతీయ జెండాతో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, సాధారణ పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రన్లో పాల్గొన్నవారందరికీ నిర్వాహకులు జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన టీ షర్టులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, తదితరులు ర్యాలీ బాలాజీ జంక్షన్ చేరుకున్న అనంతరం వెనుదిరగడంపై సమైక్యవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనకడుగు వేయం.. భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటి ఉద్యమానికైన వెనుకాడేది లేదని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, ఏన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభూజీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గంటా వెంకటరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒకేసారి సాయంత్రం నాలుగు గంట లకు సమైక్య రన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కొందరి స్వార్థం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒలింపి క్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటరావు, శ్రీనివాసరావు, అప్పారావు, పీవీ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో విజయవంతం
మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, చిన్నారులకు నూరు శాతం పోలియో చుక్కలు అందించినట్టు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్, జిల్లా నోడల్ అధికారి లోక్‌నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలియో, ఆస్పత్రుల అభివృద్ధి వైద్యులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌నాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తాను మూడు రోజులుగా విస్తృతంగా పర్యటించి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించానన్నారు. జిల్లాలోని 4.26 లక్షల మందికి పైగా ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు అందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2563 పల్స్‌పోలియో కేంద్రాలతో పాటు వంద మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివారం 95 శాతం పోలియో చుక్కలు పూర్తి చేశామని, సోమ, మంగళవారాల్లో మిగతా శాతాన్ని ఇంటింటికి తిరిగి పూర్తిచేశామన్నారు. ఇందుకు 10,900 మంది సిబ్బందిని వినియోగించుకున్నామన్నారు. గుంటూరు నగరంలో బుధవారం కూడా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి నిర్వహిస్తామన్నారు. గుంటూరు నగరంలో నేడు కూడా పల్స్‌పోలియో... కార్పొరేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు మరొక రోజు అదనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ వైద్యశాలల అభివృద్ధితో పాటు ఆయా వైద్యశాలలో సేవల వినియోగంపై మాచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల క్లస్టర్ ఏరియా అధికారి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఈఎస్ఐ వైద్యుడు కె.రామకోటయ్యలను అడిగి తెలుసుకున్నారు. -
నిర్వాసితులకు పునరావాసం
హిరమండలం, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే..వంశధార నిర్వాసితు లకు పునరావాసం కల్పిస్తామని, తాగు, సా గునీటి సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ జి ల్లా కన్వీనర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. స్థానిక పాతబ స్టాండ్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతమైంది. ముఖ్య అతిథిగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బలాన్ని కూడగడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఓదార్పు యా త్రకు వచ్చిన ఆదరణ చూసి, ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాయని పేర్కొన్నా రు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథం లో నడిపించాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ‘విభజించు..పాలించు’ రాజకీయాలకు చరమగీతం పాడాల న్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై పోరాడేందుకు అహర్నిశలూ కష్టపడతామన్నారు. రాజకీయ భిక్షపెట్టిన హిరమండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. భారీగా చేరికలు ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. హిరమండలం మేజరు పంచాయతీ సర్పంచ్ ఎ.సూర్యకుమారి, ఉపసర్పంచ్ ఎ. అబ్బాయితో పాటు 14మంది వార్డు సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ ఎ.రవిబాబు, డి.రమేష్, ఎస్.గోవింద, డి.నగేష్, కె. మల్లేశ్వరరావు, లాడె భాస్కరరావు, పి.నాగేశ్వరరావు, పి.రామారావు, పుల్లా నాగేశ్వరరావు, ఎ.నాగేశ్వరరావు, బి.అప్పలనాయుడు, పెరైడ్డి తవుడు, కె.కామేశ్వరరావు, డి.రామారావు, కె.మురళి, ఎం.మురళి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. అలాగే దుగ్గుపురం సర్పంచ్ ఆర్.మోహనరావు, మాజీ సర్పంచ్ మడపాన భాస్కరరావు, చల్ల భాస్కరరావు, రేగాన కృష్ణారావు, పాడలి పంచాయతీ నుంచి మాజీ ఉప సర్పంచ్ పెదకోట సాధుబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు యర్లంకి వెంకటరావు, గొర్లె మోహనరావు, పి.గోవిందరావు, బి.వెంకటరావు, కె.గోవిందరావు, బర్రి ఆఫీసు, గొర్లె రమేష్, అం పోలు అప్పలనాయుడు, సోలిపి నుంచి నేరడి రామయ్య, ఎన్.పున్నయ్య, పి.దండాసి, కె.గణపతిరావు, పి.వీరన్న, దబ్బగూడ నుంచి సవర బాపన్న, సన్నాయి, పి.అప్పల స్వామి, పి.చిన్నప్పలస్వామి, కొమనాపల్లి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, గొట్ట నుంచి మాజీ సర్పంచ్ వంజరాపు రామారావుతో పాటు వారి అనుచరులు పార్టీ గూటికి చేరారు. -
కోటిన్నర పెడితే కొత్త గుండె
-
‘కృత్రిమ గుండె’ సక్సెస్
ప్రపంచంలోనే తొలిసారి... పారిస్ వైద్య నిపుణుల ఘనత గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తికి పారిస్ వైద్యులు విజయవంతంగా కృత్రిమ గుండెను అమర్చారు. ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. పారిస్‌లోని జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో బుధవారం ఈ చరిత్రాత్మకమైన శస్త్రచికిత్స జరిగింది. రోగి స్పృహలోకి వచ్చి, చికిత్సకు భేషుగ్గా స్పందిస్తున్నట్లు వైద్య నిపుణులు ప్రకటించారు. ఫ్రాన్స్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి మారిసోల్ టౌరేనె, కృత్రిమ గుండెను తయారుచేసిన బయో మెడికల్ సంస్థ ‘కార్మాట్’ సహ వ్యవస్థాపకుడైన శస్త్రచికిత్స నిపుణుడు అలైన్ కార్పెంటీర్, ‘కార్మాట్’ అధినేత మార్సెలో కాన్విటీ శనివారం జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఈ శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. తొలి కృత్రిమ గుండె అమర్చే శస్త్రచికిత్స విజయవంతం కావడంపై కాన్విటీ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ గుండె కంటే కృత్రిమ గుండె మూడురెట్లు ఎక్కువ బరువు ఉంటుందని, ఐదేళ్ల వరకు ఇది ఎలాంటి ఢోకా లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కృత్రిమ పరికరాలను తాత్కాలికంగా ఉపయోగిస్తుంటారని, అయితే, తాము కొత్తగా రూపొం దించిన కృత్రిమ గుండెను అసలు గుండె స్థానంలో పూర్తిస్థాయిలో అమర్చవచ్చని వివరించారు. దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల ఏటా వేలాది మంది మరణిస్తున్నారని, అలాంటి వారి ప్రాణాలను నిలపడంలో ఈ కృత్రిమ గుండె ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కృత్రిమ గుండెకు ఎయిర్‌బస్ పేరెంట్ కంపెనీ ‘ఈఏడీఎస్’ ఇంజనీర్ల బృందం రూపకల్పన చేసింది. దీని ధర దాదాపు 1.50 లక్షల పౌండ్లు (రూ.1.50 కోట్లు) వరకు ఉంటుంది. వెలుపల ధరించే లీథియం అయాన్ బ్యాటరీల ద్వారా ఈ కృత్రిమ గుండె పనిచేస్తుంది. రక్త ప్రసరణకు ఉపయోగపడే దీని లోపలి భాగాలను కృత్రిమ పదార్థాలతో కాకుండా, జంతు కణజాలంతో రూపొందించారు. -
సీమాంధ్రలో బంద్ సంపూర్ణం
-
అదే స్ఫూర్తి.. అదే దీప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తాత్కాలికంగా ధూళి అంటినా వజ్రం వజ్రమే. దాని వెలుగూ, విలువా ఎన్నటికీ తగ్గవు. అలాగే కుట్రలు, కుతంత్రాల కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు అన్యాయంగా నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా- వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గల జనాదరణ, జనంపై ఆయన ప్రభావం అణుమాత్రం తగ్గలేదు. బుధ, గురువారాల్లో జిల్లాలో ఆయనపై పోటెత్తిన జ నాభిమానమే అందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర పరిరక్షణకు త్వరలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ‘సమైక్యాంధ్ర శంఖారావం’ పేరిట పర్యటిస్తానన్న ఆయన ప్రకటనతో సమైక్యవాదుల్లో నిండిన ఉత్తేజమే అందుకు సాక్ష్యం.బుధవారం రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత నేత జక్కంపూడి విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో త్వరలో ‘సమైక్య శంఖారావం’ పేరిట రాష్ట్రమంతటా పర్యటిస్తానని జగన్ చేసిన ప్రకటన సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. కేంద్ర మంత్రుల బృందం విభజనకు సిఫార్సు చేసిన పక్షంలో తిరిగి ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్న సమైక్యవాదులకు జగన్ ప్రకటన కొండంత సై్థర్యాన్ని కలిగించింది. జగన్ రెండు రోజుల పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమాలకే పరిమితమైనా పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఇనుమడించింది. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల కుట్ర రాజకీయాలతో ప్రజలకు దూరమైన జగన్ ఏడాదిన్నర తరువాత జరిపిన పర్యటనలో ఆద్యంతం ప్రజాభిమానం ఉప్పొంగడంతో పార్టీ నేతలకు ధైర్యాన్ని నింపింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ మధురపూడి ఎయిర్‌పోర్టులో దిగింది మొదలు రాజమండ్రి చేరుకునే వరకు అడుగడుగునా జనవాహిని పరవళ్లు తొక్కడంతో జగన్ గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అర్ధరాత్రి దాటినా తరగని అభిమానఝరి బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి చేరుకున్న జగన్ అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు అభిమానులు, ప్రజల మధ్యనే గడిపారు. చాలా కాలం తరువాత రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, న్యాయవాదులు, వైద్యులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు జగన్‌ను కలుసుకున్నారు. తమ సమస్యలను వివరించారు. ఆయనతో ఫొటోలు దిగి, కరచాలనంచేస్తూ సంబరపడ్డారు. తిరిగి గురువారం ఉదయం ఏడు గంటలకే జగన్ బసచేసిన చంద్రశేఖరరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆయనను కలవకుండా వెళ్లేది లేదని పట్టుబట్టారు. ఫలితంగా కాకినాడ నుంచి ఏడు గంటలకు బయలుదేరాలనుకున్న జగన్ ఎనిమిది గంటల వరకు బయలుదేరలేకపోయారు. ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న అభిమాన నాయకుడు తిరిగి తమ మధ్యకు రావడం, చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా పేరుపేరునా పలకరించడంతో పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో కేరింతలు కొట్టాయి. కుట్రల ఫలితంగా జగన్ జైలులో ఉండటంతో పార్టీ నేతలకు దశ, దిశ నిర్దేశం కొరవడుతుందని ఇతరపక్షాలు భావించాయి. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు జరిపినా పార్టీ జిల్లాలో పట్టు సాధించగలిగింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జిల్లాలో జరిపిన తొలి పర్యటన విజయవంతం కావడంతో తూర్పు సెంటిమెంట్ రాష్ట్రమంతటా కొనసాగుతుందని పార్టీ జిల్లా నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్ పర్యటన విజయవంతం : కుడుపూడి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడం ఆయనపై నానాటికీ జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. జగన్‌కు వీడ్కోలు పలికేందుకు గురువారం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన కుడుపూడి ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పర్యటనలో తమ నేతకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారన్నారు. ప్రతి గ్రామంలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చి తమ అభిమాన నేతతో కరచాలనం చేస్తే చాలని ఉర్రూతలూగారన్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు, కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నేతలు, జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు క్రమశిక్షణతో సైనికుల్లా కృషి చేశారని పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
రహదారుల దిగ్బంధం సక్సెస్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమం రెండో రోజైన గురువారం శతశాతం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు కదలికదం తొక్కారు. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలతో నిరనస తెలిపారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, ఇచ్ఛాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబుతో పాటు పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నర్సన్నపేట, శ్రీకాకుళం పట్టణాల్లో 79 మంది అరె స్ట్ అయ్యారు. వీరిలో నర్సన్నపేట నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది సర్పంచ్‌లు ఉన్నారు. నర్సన్నపేటలో జరిగిన రహదారి దిగ్బంధంలో ధర్మాన కృష్ణదాస్‌తో పాటు 26 మంది అరెస్ట్ కాగా శ్రీకాకుళంలో పిరియా సాయిరాజ్‌తో పాటు 35 మందిని, టెక్కలిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి తరువాత విడిచిపెట్టారు. ప్రధానంగా నియోజకవర్గ ఇన్చార్జిల నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రవాణా స్తంభించింది. హైవేపై వాహనాలు వేల సంఖ్యలో ఆగిపోయాయి. శ్రీకాకుళం పట్టణంలో సాయంత్రం వైఎస్ఆర్ కూడలి వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలగడంలో సీఐ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వరుదు కల్యాణి, వైవీ సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పరవీంద్ర, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు, జిల్లా అడహక్ కమిటీ సభ్యులు అంధవరపు సూరిబాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషోత్తం, ప్రధాన రాజేంద్ర, కె.వి.వి. సత్యనారాయణను అరెస్టు చేశారు. నరసన్నపేట ఎన్‌హెచ్-16 రహదారిపై ఆ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం జరిగింది. రోడ్డుకు రెండువైపులా సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రాఘవరావు సిబ్బందితో వచ్చి కృష్ణదాస్‌తోపాటు అనుచరులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దాసన్నను పోలీసులు విడిచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతు కిరణ్‌కుమార్, ఆరంగి మురళి, కరిమి రాజేశ్వరరావు, కనుజు సీతారాం, యాళ్ల కృష్ణంనాయుడు, ఆర్.అప్పన్న, ఎం.బైరాగినాయుడు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక వాడ వద్ద జరిగిన రహదారులు దిగ్బంధంలో సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస మండలాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మో హణరావు, పార్టీ మహిళా విభాగం సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, జిల్లా కమిటీ సభ్యులు పైడి కృష్ణప్రసాద్, కూన మంగమ్మలు పాల్గొన్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం మధ్య నడిచే బస్‌లు రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు కలిగాయి. సమన్వయకర్త బొడ్డేపల్లి మాధురి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం కొత్తరోడ్ జంక్షన్ వద్ద జరిగింది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామం వద్ద జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ పాల్గొన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో మండల కన్వీనర్ కొల్ల గోవిందరావు నేతృత్వంలో అలికాం-బత్తిలి రోడ్డులో, పాతపట్నంలో కొండాల అర్జునుడు నేతృత్వంలో నీల మణి దుర్గ అమ్మవారి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజవర్గంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు ఇచ్ఛాపురం - బెల్లుపడ జాతీయ రహదారి పై రహదారి దిగ్బం ధనం జరిగింది. సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసి, రహదారి దిగ్బంధనం ఆపాలని నాయకులను హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయలేదు. పాలకొండ ఆంజనేయసెంటర్లో పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి, నాయకులు కనపాక సూర్యప్రకాశరావు తదితరులు దాదాపు అరగంట సేపు రహదారిని గ్బంధించారు. సీతంపేట మండలంలో పాలకొండ-సీతంపేట ప్రధాన రహదారిలో కుశిమి జంక్షన్ వద్ద పార్టీ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో, భామిని మండలం సతివాడలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకోట ఆంజనేయులు, సతివాడ సర్పంచ్ పాత్రుకొండ రాంబాబు నేతృత్వంలో రాస్తారోకో చేపట్టారు. రాజాం వైఎస్ఆర్ కూడలి వద్ద సమన్వయకర్త పీఎంజేబాబు ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం జరిగింది. మాజీ ఎమెమల్యే కం బాల జోగులు పాల్గొన్నారు. పలాసలో కోసంగిపురం జాతీయ రహదారి కూడలి వద్ద రహదారి దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. ఈసందర్భంగా సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం, సమన్వయకర్త వజ్జ బాబూరావు, జిల్లా కమిటీ సభ్యుడు నర్తు ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం సమీపంలోని కుశాలపురం బైపాస్ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల రోడ్డు దిగ్భంధం కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచి పోయింది. యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. నియోజక వర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని రణస్థలం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నియోజక వర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. టెక్కలిలో జగతిమెట్ట హైవేపై రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. వాహనాలు నిలిచిపోవడంతో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, సంపతి రావు రాఘవరావు, కోత మురళీధర్, చింతాడ గణపతి, తిర్లంగి జానకిరామయ్య ఉన్నారు. సోనియాగాంధీ వేషధారిణిని శవయాత్ర నిర్వహించారు.నందిగాం మండలం జాతీయ రహదారి వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, సీజీసీ సభ్యుడు కణితి విశ్వనాథం పాల్గొన్నారు. -
పోరుబాటలో దారుల దిగ్బంధం
సాక్షి, రాజమండ్రి :ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా, రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తెలుగుగడ్డను నిలువునా చీలుస్తున్న తరుణంలో ప్రజల పక్షాన మేమున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. ప్రజల తరఫున ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చారు. అందులో భాగంగా బుధవారం జిల్లాలో జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులను పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. తుని నుంచి రావులపాలెం వరకూ 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోట్లాది విలువైన సరుకు రవాణాకు అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచి పోయాయి. మరో వంక 216 నంబరు జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలను పార్టీ కార్యకర్తలు, సమైక్య వాదులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో 99వ రోజు సమైక్య ఉద్యమం సెగలు కక్కింది. ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ పార్టీ నేతలు అంచెలంచెలుగా రహదారుల దిగ్బంధం చేశారు. రహదారుల దిగ్బంధం సందర్భంగా జిల్లావ్యాప్తంగా 611 మందిని అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. లాలాచెరువు సెంటర్లో.. రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో 16వ నంబరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుమారు గంట పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించాలని నేతలు నినాదాలు చేశారు. పోలీసులు ఆదిరెడ్డి, బొమ్మన, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, సమైక్య ఉద్యమం అర్బన్ పర్యవేక్షకులు ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి తదితర 25 మంది నేతలను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో జాతీయ రహదారిని రెండు గంటల పాటు దిగ్బంధం చేశారు. వేమగిరి వరకూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తూర్పు మండల డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో పోలీసులు 19 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ షిరిడీ సాయిబాబా పాత్ర ధరించి, సమైక్యాంధ్రకు మద్దతుగా లఘునాటిక ప్రదర్శించారు. సినీనటులు శోభన్‌బాబు, ఎన్టీఆర్, అక్కినేని వేషధారణలతో పార్టీ అభిమానులు నృత్యాలు చేసి సమైక్య వాదులను ఉత్తేజపరిచారు. రోడ్డుపై వాలీబాల్.. జగ్గంపేట నియోజక వర్గంలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కుమార్, ఇతర నేతల నేతృత్వంలో పార్టీ శ్రేణులు పలుచోట్ల జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కిర్లంపూడి మండలం సోమవరం వద్ద ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకూ రాస్తారో కో చేశారు. 12.00లకు బూరుగుపూడి చేరుకుని రోడ్డుపై వాలీ బాల్ ఆడారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రామవరం చేరుకుని 3.30 వరకూ రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి జగ్గంపేట చేరుకుని సాయంత్రం 4.00 నుంచి 5.00 వరకూ ఆందోళన కొనసాగించారు. కాగా రావులపాలెం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజక కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జిల్లా పార్టీ కన్వీనర్ చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ మార్గన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి కళా వెంకటరావు సెంటర్‌కు ర్యాలీగా చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. 20 మంది నేతలను అరెస్టు చేశారు. ఎర్రవరం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేరు కాలువల వంతెనలపై టెంట్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టారు. తునిలో పార్టీ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని-కొట్టాం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి అక్కడే వంటా వార్పూ చేపట్టారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. అనంతరం కార్యకర్తలు రాజా ఆధ్వర్యంలో తొండంగి మండలం బెండపూడి చేరుకుని మరోసారి రహదారిని దిగ్బంధం చేశారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగల లక్ష్మి పాల్గొన్నారు. రాజానగరం వద్ద జాతీయ రహదారిపై మండల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. యువనేత జక్కంపూడి గణేష్, మండల కన్వీనర్ మందారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కెనాల్ రోడ్‌లోనూ ఆందోళన.. అనపర్తి వద్ద రాజమండ్రి- కాకినాడ కెనాల్ రోడ్డుపై ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, పార్టీ నేత సత్తి సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. 40 మందిని పోలీసులుఅరెస్టు చేశారు. సామర్లకోట వద్ద ఫ్లై ఓవర్‌పై కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు 200 మందిని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలారు. పెద్దాపురం-జగ్గంపేట రహదారిలో పెట్రోల్ బంకు వద్ద జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి సాయిప్రసాద్, తాడి రాజశేఖర్ తదితర నేతలు రోడ్డును దిగ్బంధం చేయగా 60 మందిని అరెస్టు చేశారు. మండపేట బైపాస్ రోడ్డు సమీపంలో కాకినాడ -రావులపాలెం రహదారిపై కో ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకటప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ తదితర నేతల నాయకత్వంలో ఆందోళన చేశారు. 35 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజమండ్రి- భద్రాచలం రోడ్డుపై.. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజమండ్రి- భద్రాచలం రోడ్డులో కోరుకొండలో రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు.ఆమెతో పాటు 25 మందిని అరెస్టు చేశారు. రాజమండ్రి-సీతానగరం రహదారిని సీతానగరంలో మండల కన్వీనర్లు అడ్డుకున్నారు. రంపచోడవరం నియోజక వర్గ పరిశీ లకులు కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో రాజమండ్రి- భద్రాచలం రహదారిని ఐ. పోలవరం జంక్షన్ వద్ద దిగ్బంధించారు. పార్టీ ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ పల్లాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద 16వ నంబరు జాతీయరహదారిపై బుధవారం అర్ధరాత్రి కట్టెలు, టైర్లు తగలబెడుతూ రాకపోకలను అడ్డుకున్నారు. కాగా పార్టీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం గురువారం కూడా కొనసాగనుంది. కోనసీమలో కదలని వాహనాలు కోనసీమలో 216 జాతీయ రహదారిని పార్టీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ఎర్రవంతెన వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు గంటపాటు దిగ్బంధం చేశారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు బుచ్చిమహేశ్వరరావు, మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు 55 మంది నేతలను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై గంటన్నర పాటు ధర్నా చేసి, సమైక్య నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. నియోజక వర్గ కో ఆర్డినేటర్ గుత్తులసాయి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు పాల్గొన్నారు. వంద మందినిపోలీసులు అరెస్టు చేశారు. మురమళ్లలో పార్టీ నాయకుడు సుదర్శన బాబు ఆధ్వర్యంలో రహదారిని ముట్టడించారు. పి.గన్నవరం వద్ద అక్విడెక్టుపై పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. పి.గన్నవరం పోలీసులు రంగంలోకి దిగి నేతలను అరెస్టు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, కొండేటి చిట్టిబాబు, మందపాటి కిరణ్‌కుమార్, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, ఇండస్ట్రియల్ సెల్ జిల్లా కన్వీనర్ మంతెన రవిరాజు తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో చేస్తున్న సుమారు 16 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దిండి వద్ద జాతీయ రహదారిపై ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, కో ఆర్డినేటర్ చింతలపాటి వెంకటరామరాజు, మట్టా శైలజ, బొతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇటుకలతో గోడ కట్టి.. మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నేతలు పిఠాపురం వద్ద 216 జాతీయ రహదారికి అడ్డంగా ఇటుకలతో గోడ కట్టి రాకపోకలను స్తంభింప చేశారు. రాస్తారోకో చేసి అక్కడే వంటా వార్పూ చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆందోళన కొనసాగించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి 31 మందిని అరెస్టు చేసి స్వంత పూచీ కత్తుపై విడుదల చేశారు. ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ రావూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ-యానాం రోడ్డులో ఉప్పలంక వద్ద రూరల్ కో ఆర్డినేటర్ వేణుగోపాలకృష్ణ, పార్లమెంటు నియోజక వర్గ నేత చలమలశెట్టి సునీల్‌ల ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధం చేశారు. చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, బీసీ విభాగం కన్వీనర్ గుత్తుల రమణ పాల్గొన్నారు.