తొర్రూరు బంద్‌ విజయవంతం | successful bandh of thorrur | Sakshi
Sakshi News home page

తొర్రూరు బంద్‌ విజయవంతం

Aug 24 2016 12:18 AM | Updated on Sep 4 2017 10:33 AM

తొర్రూరు బంద్‌ విజయవంతం

తొర్రూరు బంద్‌ విజయవంతం

తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తొర్రూరు మండల బంద్‌తో పట్టణంలోని షాపులు, విద్యా సంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, బ్యాంక్‌లు మం గళవారం మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకొని జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, కాం గ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, స్వ చ్ఛంద సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా

తొర్రూరు : తొర్రూరును  రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తొర్రూరు మండల బంద్‌తో పట్టణంలోని షాపులు, విద్యా సంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, బ్యాంక్‌లు మం గళవారం మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకొని జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన ర్యాలీలో వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, కాం గ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, స్వ చ్ఛంద సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం  బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. తర్వాత  ర్యాలీగా గాంధీ సెంటర్‌కు వస్తున్న నాయకులు, కార్యకర్తలను సీఐ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు.
 
ఈ సం దర్భంగా డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, జేఏసీ చైర్మన్‌ ప్రవీణ్‌రాజు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, బీజేపీ, టీడీపీ, వామపక్షాల నాయకులు పల్లె కుమార్, బిజ్జాల శంకర్, వై. వెంకటయ్య, ఓమ బిక్షపతి, పాడ్య బీకు మాట్లాడుతూ అన్ని వనరులతో అర్హత కలిగిన తొర్రూరు మండలాన్ని రెవెన్యూ డివి జన్‌గా ప్రభుత్వం గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కోటగిరి కృష్ణమూర్తి, జాటోతు ధర్మ, కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మిత్తింటి వెంకటేశ్వర్లు, చిత్తలూరి శ్రీనివాస్, రవీంద్రాచారి, పూర్ణచందర్, అమీర్,  రాయిశెట్టి వెంకన్న, మేకల కుమార్, బొల్లం అశోక్, ముద్దం మహబూబ్‌రెడ్డి, చీక టి శ్రీనివాస్, రంగు రాములు, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కస్తూరి పులేం దర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement