bandh
-
ఉస్మానియా ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ: ఆందోళనలు.. రాస్తారోకోలు.. దిష్టి»ొమ్మ, బడ్జెట్ ప్రతుల దహనాలు.. సంతకాల సేకరణ.. విద్యార్థి నాయకుల అరెస్టులతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బుధవారం అట్టుడికింది. క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన సర్క్యులర్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, వైస్‌చాన్స్‌లర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సర్క్యులర్‌ను వెనక్కు తీసుకునేలా వర్సిటీ యాజమాన్యాన్ని ఒప్పించాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌ను కలసి విద్యార్థి జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇదే డిమాండ్‌తో ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ శాతం నిధులు కేటాయించారని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఓయూలో 2018లో ప్రవేశం పొందిన పీహెచ్డీ స్కాలర్స్‌కు మరో ఏడాదిపాటు గడువు పొడింగించేలా వీసీతో మాట్లాడాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం సమర్పింపంచారు. ఆందోళన చేపట్టిన 23 మంది విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ఓయూ, అంబర్‌పేట, లాలాగూడ పోలీసు స్టేషన్లకు తరలించినట్లు సీఐ రాజేందర్ తెలిపారు. కాగా, నిషేధాజ్ఞల సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి సంఘాలు గురువారం ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐదు రోజులుగా వీసీ ఆఫీస్ గేటు మూసివేత క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనతో వీసీ కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని గత ఐదు రోజులుగా మూసివేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో వివిధ పనులపై వీసీ, రిజి్రస్టార్, ఇతర అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. పట్టు వీడని విద్యార్థులు.. బెట్టు వీడని అధికారులు ఓయూలో ఆందోళనలపై విధించిన నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ వర్సిటీ క్యాంపస్‌లో ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తుండగా, అధికారులు ససేమిరా అంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సాధారణ విద్యార్థులు కోరుతున్నారు. ఓయూలో జరుగుతున్న పరిణామాలపై వీసీ ప్రొ.కుమార్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
మన్యం బంద్ .. పాల్గొన్న YSRCP MLA విశ్వేశ్వర రాజు
-
పంజాబ్‌లో రైతుల బంద్
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో జనజీవనం స్తంభించింది. పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్–ఢిల్లీ రూట్లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, బఠిందా, పఠాన్కోట్లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్ టోల్‌ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. VIDEO | Punjab: Shops remain closed, and buses are off the roads in Moga in the wake of shutdown called by protesting farmers.#PunjabBandh #PunjabNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bxerq4Pm7u— Press Trust of India (@PTI_News) December 30, 2024అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్‌సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ ధల్లేవాల్‌కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్ కోరారు. -
నేడు హిమాచల్ బంద్.. హిందూ సంస్థల పిలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ -
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న బంద్..
-
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న బంద్..
-
నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత
Updates బెంగాల్లో బీజీపీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్‌కు పంపుతాము. ఆయన ఆమోదించకపోతే మేము రాజ్‌భవన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది. గవర్నర్ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.Kolkata | West Bengal CM Mamata Banerjee says, "Next week, we will call an Assembly session and pass a Bill within 10 days to ensure capital punishment for rapists. We will send this Bill to the Governor. If he doesn't pass, we will sit outside Raj Bhavan. This Bill must be… pic.twitter.com/GQFPvTStZX— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్సోల్ రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.#WATCH | Asansol, West Bengal: BJP workers stage a protest demanding justice for woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital pic.twitter.com/ZBKJzdOYuG— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ బీజేపీ బంద్ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారు’’ అని అన్నారు. #WATCH | Union Minister and West Bengal BJP President Sukanta Majumdar says, "Kolkata HC has given us the permission for seven-day Dharna. We will start it from tomorrow...We welcome their verdict...There is no democracy here, police cannot stop firing but only stop BJP's… https://t.co/5ASm6Tg990 pic.twitter.com/zfzKuGmIK1— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్‌లో బీజేపీ నేత కారుపై జరిగిన కాల్పుల్లో డ్రైవర్ మృతి చెందాడు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.#WATCH | Kolkata: Union Minister and West Bengal BJP President Sukanta Majumdar joins the protest. BJP has called for a 12-hour 'Bengal Bandh'. (Visuals from Baguiati Mor) pic.twitter.com/n4uXjilIQE— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.West Bengal | Two people got injured in the attack and firing incident on the BJP leader Priyangu Pandey's car, earlier today, in Bhatpara of North 24 Parganas pic.twitter.com/MO2x3vxabB— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ హింసాత్మకంగా మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్ సింగ్ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 "Bombs thrown, vehicle fired on": BJP's Priyangu Pandey claims TMC workers attacked him during Bengal BandhRead @ANI Story | https://t.co/GUPWv28WrO#BJP #TMC #BengalBandh #PriyanguPandey pic.twitter.com/TGlNUNugOg— ANI Digital (@ani_digital) August 28, 2024 పశ్చిమ బెంగాల్లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు. #WATCH | Nandigram | West Bengal LoP Suvendu Adhikari joins BJP's protest, call for 12-hour 'Bengal Bandh'.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna… pic.twitter.com/iLDff6ra2H— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతా బాటా చౌక్‌లో బంద్ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బంద్‌లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.#WATCH | West Bengal | Police detains protesting BJP party workers at Kolkata's Bata Chowk12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/vt7MaQjZCv— ANI (@ANI) August 28, 2024 #WATCH | West Bengal | Police detains BJP leader Locket Chatterjee who joined protest after BJP's call for 12-hour 'Bharat Bandh' at Kolkata's Bata Chowk pic.twitter.com/Zd8eAiH0mF— ANI (@ANI) August 28, 2024 బంద్ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్ బంద్‌ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.#WATCH | West Bengal: BJP MLA Ashok Kirtania says, "Bandh is going on...Police were not able to do anything, therefore, the workers of TMC are here, Mamata sent them...We will not move from here, we will continue the fight..." pic.twitter.com/z4YubShK3h— ANI (@ANI) August 28, 2024సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.#WATCH | Siliguri, West Bengal: 12-hour 'Bengal Bandh' called by the BJP to protest against the state government; security deployed in the area The bandh has been called after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/K8oIGYs5tx— ANI (@ANI) August 28, 2024 బీజేపీ చేపట్టిన బంద్‌ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.#WATCH | North 24 Parganas | TMC Party workers protest against BJP's 12-hour 'Bengal Bandh' call for today.Train services were disrupted between Bangaon-Sealdah which is now being reinstated pic.twitter.com/ISyiQqBlv6— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్ ధరించారు. ‘‘ఈ రోజు బంద్ ఉంది. కావున తాను హెల్మెట్ ధరించాను’’ అని బస్ డ్రైవర్ తెలిపారు.#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of Government bus in Howrah seen wearing helmetsA bus driver says, "Today is bandh, so we are wearing helmets..." pic.twitter.com/b5GHHD4Ocq— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో బీజేపీ బంద్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది#WATCH | West Bengal | Police detains protesting BJP workers at Alipurduar.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/tJuKKgMGum— ANI (@ANI) August 28, 2024పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ బెంగాల్లో కొనసాగుతోంది.పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్‌కు సహరించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.#WATCH | Kolkata, West Bengal: BJP leader Agnimitra Paul says, "They are going around with a disgusting attitude. They have all become spineless. Police have invalidated the orders of the Supreme Court... They used water canons mixed with chemicals on the protestors... They are… https://t.co/MP0SU69Wwc pic.twitter.com/Dkhj7g5e2Y— ANI (@ANI) August 28, 2024 పశ్చిమ బెంగాల్‌ల్లో ఇవాళ(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.#WATCH | Kolkata: BJP leader Agnimitra Paul reviews the 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government. pic.twitter.com/AAvoFWrjuj— ANI (@ANI) August 28, 2024ఈ బంద్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్‌ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.बंगाल कल बंद है#KolkataDoctorDeathCase #bengal_band_haipic.twitter.com/IIUK0rMY0Q— Rastra Janmat (@Rastrajanmat360) August 27, 2024 కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం. -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
మెదక్ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/ మెదక్‌జోన్/శంషాబాద్: మెదక్ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. బీజేపీ నేతల ఆదివారం బంద్‌కు పిలుపునివ్వగా, వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నేత సతీ‹Ùతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం వారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించగా మెదక్ సబ్ జైలుకు తరలించారు. ఎవరినీ ఉపేక్షించం: ఐజీ రంగనాథ్ గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించమని, ఇందుకు కారణమైన 45 మందిపై కేసులు నమోదు చేశామని మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 23 మందితోపాటు 22 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఒక్కవర్గం వారిని మాత్రమే రిమాండ్ చేశారని, మరోవర్గం వారిని చేయలేదంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని, ఘటనకు బాధ్యులైన ముస్లింలను కూడా రిమాండ్ చేస్తామన్నారు. » మెదక్‌లో రెండువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. » మెదక్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎలాంటి మత కల్లోలాలకు తావు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేదని గుర్తు చేశారు. » గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మెదక్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అల్లర్లలో గాయపడిన వారిని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం రాజాసింగ్ తన నివాసానికి వెళ్లేంత వరకు ఆర్జీఐఏ పోలీసులు ఆయన వెంటే ఉన్నారు. -
వెహికల్స్ బంద్.. సినిమా షూటింగ్స్‌కి అంతరాయం
టాలీవుడ్లో మరో సమ్మె సైరన్ మోగింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కి పిలుపునిచ్చాయి. దీంతో పలు సినిమాల షూటింగ్స్‌కి అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఈ బంద్‌ని కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ చెప్పారు. ‘దాదాపు 900 వెహికల్స్ మా అసోసియేషన్‌లో ఉన్నాయి. 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించినా.. పట్టించుకోలేదు. ఈ రోజు లేదా రేపు మరోసారి నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. వెహికల్ రెంట్ పెంచడంతో పాటు మా సమస్యలను తీర్చేవరకు ఈ బంద్ కొనసాగిస్తాం’అని హనీఫ్ అన్నారు. తమ సమస్యలు వెంటనే పర్కిరించాలని అని చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ అన్నారు. -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
ఆధునిక మగ్గాలు ఆగాయి
సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్క్‌లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు. వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఉపాధి లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్టైల్ పార్క్‌లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. విద్యుత్ చార్జీలూ భారమే టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్‌లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. నెలకు రూ.12వేలు వచ్చేవి పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉంది మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
తమిళనాడుకు కావేరి నీటి విడుదల.. నేడు కర్ణాటక బంద్
శివాజీనగర: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కన్నడ ఒక్కూట అఖండ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు 100కు పైగా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారమే బెంగళూరు బంద్ దాదాపు జయప్రదమైంది. రాష్ట్ర బంద్ సందర్భంగా వాహన సంచారం, అంగళ్లు, హోటల్, సినిమా థియేటర్లు, మాల్స్, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నీ బంద్ అయ్యే అవకాశముంది. ఒక్కూట వాటాళ్ నాగరాజ్ మాట్లాడుతూ శాంతియుతంగా బంద్ జరుగుతుందన్నారు. బెంగళూరుతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా ధర్నా, ర్యాలీలు జరుపుతామని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ శెట్టి తెలిపారు. హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల సంఘాలు సంఘీభావం తెలిపాయి. వాహనాలు ఉండకపోవడం వల్ల స్కూళ్లు కూడా మూతపడవచ్చు. ఆర్టీసీ రవాణా బస్సుల సంచారం కూడా తక్కువగా ఉండవచ్చు. రాష్ట్రమంతటా అన్ని సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అనేకమంది నటీనటులు మద్దతు తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు చేయాలని సంఘాలు నిర్ణయించాయి. బంద్ చట్టవిరుద్ధం: నగర సీపీ కర్ణాటక బంద్ నేపథ్యంలో బెంగళూరులో గట్టి పోలీస్ బందోబస్తు కల్పించినట్లు పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం ఎక్కడా ధర్నా, ర్యాలీ, ఊరేగింపులకు అవకాశం లేదు. గురువారం రాత్రి నుండే 144 సెక్షన్ జారీలోకి వచ్చింది. బంద్ అనేవారికి నోటీసులు ఇస్తాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం బంద్‌కు పిలుపునివ్వడం చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ పనిచేస్తుందని చెప్పారు. బంద్ సమయంలో ప్రభుత్వ ఆస్తిపాస్తులకు నష్టం కలిగిస్తే పిలుపునిచ్చినవారే బాధ్యులవుతారన్నారు. నగరవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు. యథావిధిగా ఆర్టీసీ, సిటీ బస్సులు క్రవారం కర్ణాటక బంద్ అయినప్పటికీ కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను యథావిధిగా నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉద్యోగులు మామూలుగానే డ్యూటీలకు రావాలని ప్రకటించారు. ఎవరూ కూడా బంద్‌లో పాల్గొనరాదని, విధులకు రాకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్టాపులు, బీఎంటీసీ డిపోలకు పోలీస్ భద్రత కల్పిస్తారు. -
కావేరి జలాల వివాదం.. నేడు బెంగళూరు బంద్
బెంగళూరు: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటినివిడుదల చేయాలని కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు నాయకుడు కురుబూర్ శాంతకుమార్ నేతృత్వంలోని రైతు సంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ పేరుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళన కారుల పిలుపు మేరకు బెంగుళూర్ బంద్ కొనసాగుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. అలాగే నేడు నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా బంద్‌ను పాటించాలని, బలవంతంగా బంద్‌ను అమలు చేయకూడదని బెంగళూరు పోలీస్ కమిషనర్ సూచించారు. స్కూల్స్, కాలేజీలు బంద్ బంద్ నేపథ్యంలో మంగళవారం బెంగుళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు అర్భన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దయానంద్ కేఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఆటోలు, ట్యాక్సీ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మెట్రో, ఆర్టీసీ సేవలు యధాతథం అయితే మెట్రో సేవలు బంద్ పిలుపుతో ప్రభావితం కాకుండా యథాధావిధిగా పనిచేయనున్నాయి. ఓలా, ఉబర్ వంటి సర్వీసులు సైతం పనిచేయనున్నాయి. తాము బంద్‌కు మద్దతు తెలపడం లేదని, తమ సర్వీసులు పనిచేస్తాయని ఓలా ఉబర్ యాజమాన్యాలు ప్రకటించాయి. హోటళ్ల యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కూడా తెరుచుకొని ఉండనున్నాయి. #WATCH | Karnataka: Bengaluru Bandh has been called by various organizations regarding the Cauvery water issue. According to BMTC, all routes of Bengaluru Metropolitan Transport Corporation will be operational as usual. (Visuals from Majestic BMTC Bus stop, Bengaluru) pic.twitter.com/fSZSeLyKMh — ANI (@ANI) September 26, 2023 వీటితోపాటు బెంగుళూరు ఆర్టీసీ బస్సులు కూడా బంద్‌తో సంబంధం లేకుండా యథావిధిగా తమ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తమిళనాడు బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశారు. బెంగళూరు బంద్ దృష్ట్యా తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విమాన ప్రయాణికులను అభ్యర్థిస్తూ బెంగళూరు విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. #WATCH | An auto driver at Majestic BMTC Bus stop, Bengaluru, Naseer Khan says "We support the bandh called by various organisations. When the Cauvery water issue comes, we have a very clear stand that Karnataka will not provide water to anyone. Only night drivers are here, autos… pic.twitter.com/jMeVz3GeB8 — ANI (@ANI) September 26, 2023 విమానాశ్రయానికి ప్రయాణించేటప్పుడు విలైనంత త్వరగా బయలుదేరాలని ఇండిగో సూచించింది. బంద్ కారణంగా సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని.. డొమెస్టిక్ ప్రయాణానికి రెండున్నర గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి మూడున్నర గంటల ముందు చేరుకోవాలని ట్విటర్లో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపింది. బెంగళూరు బంద్‌కు జేడీఎస్ కూడా మద్దతు తెలిపింది. బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కాగా, తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో మంగళవారం చేపట్టిన నిరసనలను నిషేధించేలా కేంద్రం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు కావేరి రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిరసనలకు ప్రభుత్వం అనుమతి అయితే బెంగళూరు బంద్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ప్రభుత్వం నిరసనలను అడ్డుకోబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని హామీ ఇచ్చింది. అయితే బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పారు. కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది. ఏంటీ కావేరి వివాదం? తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
స్కిల్ స్కాం ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్టు అక్రమమంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇన్నాళ్లు స్టేలతో కాలం గడిపారని. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కూడా నడుస్తోందని అన్నారు. స్కిల్‌స్కాం కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని అన్నారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని రామచంద్రా రెడ్డి అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని చెప్పారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడం దారుణం అని అన్నారు. ఇదీ చదవండి: పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు.. స్కిల్ కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయ్: ఏపీ సీఐడీ -
కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్ అసోసియేషన్ బెంగళూరులో బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా ఈ బందుకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్స్ ఈ బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. The Federation of Karnataka State Private Transport Association had placed 28 demands in front of the #Karnataka government. With no consensus between the two parties, more than 10,000 members will gather for a protest march to Freedom Park in #Bengaluru.https://t.co/dw8rGmm4su — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 బంద్‌కు కారణం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు. ప్రధాన డిమాండ్.. బంద్ అమలుతో బెంగళూరులో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో లేవు. శక్తీ స్కీంను ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలనేది యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండనున్నాయి. Members 32 unions part of the Federation of Karnataka State Private Transport Association protest at Freedom Park in #Bengaluru demanding a ban on bike taxis. Around 7 lakh vehicles operated by private persons or companies will stay off the roads on Sept 11 📹: @photomurali1 pic.twitter.com/LOmi0awTLL — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 ప్రభుత్వం చర్యలు.. బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ.. -
#KhaidiNo7691 : ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్ విఫలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైంది. యధావిధిగా ప్రజా జీవనం కొనసాగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్.. రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఈ పరిణామాలను నిరసిస్తూ.. టీడీపీ, అనధికారిక మిత్రపక్షం జనసేన పార్టీలు ఇవాళ(సోమవారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్ట్లాగానే.. ఈ బంద్ పిలుపును కూడా ఏపీ ప్రజలు అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ జనం నుంచి స్పందన కరువైంది. బంద్‌కు మద్దతుగా వ్యాపార, విద్యా సంస్థల నుండి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. సోమవారం వేకువ జాము నుంచే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ రోజూ వారిలాగే నడుస్తున్నాయి. అదే విధంగా.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు సైతం మాములుగానే నడుస్తున్నాయి. అదే సమయంలో.. తెలుగు తమ్ముళ్లు రోడ్లపైన కనిపించ లేదు. ఇంకోవైపు ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపుగా ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కి హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు అతి చేష్టలకు దిగగా.. అరెస్టుల పర్వం కొనసాగింది. టీడీపీ సంగతి ఏమోగానీ.. జనసేన కార్యకర్తలు బంద్‌ను అసలు పట్టించుకోలేదు. విజయవాడ: నగరంలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధాతధంగా తిరుగుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా.. పండిట్ నెహ్రూబస్ స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి.. రాజమండ్రి నగరంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమండ్రిలో ఉదయాన్నే దుకాణాలు షాపులు తెరుచుకున్నాయి. బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. ప్రజల రోజు వారి కార్యకలాపాలు మాములుగానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉన్న సంగతీ తెలిసిందే. ఏపీలో 144 సెక్షన్ విధింపు ఇదిలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి తెగబడే అవకాశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లాలో సెక్షన్30 అమలు టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో ఎటువంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదు. ఈ నిబంధనలు 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నామని తెలిపారు. కాగా, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహ నాలతో ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించారు. విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన కొరవడింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు కొందరు టిడిపి కార్యకర్తలు చేరుకొని బస్సులను ఆపాలని ప్రయత్నించారు. బంద్‌కు అనుమతి లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బస్సులు రాకపోకలకు ఆటంకం లేకుండా నియంత్రించారు. ఈ చర్యలతో బస్సు ప్రయాణికుల కు ఎక్కడా అసౌకర్యం కలగలేదు. బస్ లు యధావిధిగా గా నడుస్తున్నాయి. చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సులు యధావిధిగా తిరుగుతుండగా.. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. రోడ్డు మీద కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలతో హడావిడి చేస్తున్నా.. అవేం పట్టించుకోని జనాలు తమ పనులు తాము చేసుకుంటున్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఓవరాక్షన్ టీడీపీ బంద్ పిలుపులో భాగంగా.. కుప్పంలో టీడీపీ శ్రేణులు బస్సు అద్దాలు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి: జిల్లాలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సుల రాకపోకలు యధావిదిగా కనిపిస్తున్నాయి. పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల పట్టణాల్లో తెరుచుకున్న దుఖానాలు.. యధావిధిగా జనజీవనం నడుస్తోంది. తిరుపతి: శ్రీకాళహస్తి లో టిడిపి బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు యధావిధిగా తెరచుకున్నాయి. ప్రజాజీవనం యధాతధంగా నడుస్తోంది. పలాసలో బందు విఫలం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకిస్తూ,టీడీపీ పార్టీ సోమవారం చేపట్టిన బంద్ శ్రీకాకుళంలో పూర్తిగా విఫలమైంది. జన జీవనం యధావిధిగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులను ఆపడానికి ప్రయత్నించిన టీడీపీ క్యాడరును అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
TSRTC Bandh Protests Photos: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా.. ప్రయాణికుల ఇక్కట్లు (ఫొటోలు)
-
టీడీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో చంద్రబాబు అను చరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాగా, అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. -
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ దాడులకు నిరసన.. రేపు చిత్తూరు బంద్
సాక్షి, అన్నమయ్య: పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా, పుంగనూరులో శుక్రవారం టీడీపీ శ్రేణులు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఇక, చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతూ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. పోలీసులపై అసభ్యకర పదజాలం వాడుతూ దూషించారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: టీడీపీ దాడులపై ఎస్పీ రిషాంత్ సంచలన కామెంట్స్ -
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌పై రాకపోకలు బంద్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఘాట్ రోడ్ మీదుగా వెళ్లే భక్తుల రాకపోకలను నిలుపుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండపై ఉన్న రాళ్లు మెత్తబడటంతో మంగళవారం రాత్రి కొండపై నుంచి చిన్నపాటి రాళ్లు ఘాట్ రోడ్‌పై జారి పడ్డాయి. కొండ చరియలు విరిగి కింద పడకుండా ఘాట్ రోడ్లో కొండ చుట్టూ మెష్ ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను బంద్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో దర్భముళ్ల భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. పోలీసులకు ఫిర్యాదు.. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్.. -
నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్న బంద్
-
ప్రశాంతంగా నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్
-
రాజాసింగ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆదిలాబాద్ బంద్ కు పిలుపు
-
రాజాసింగ్ అరెస్ట్ ఎఫెక్ట్.. షాపులు, పాఠశాలలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి? -
అగ్నిపథ్ ఎఫెక్ట్: బీహార్ బంద్.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్ 18) బీహార్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్‌కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది. కాగా, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి మెమోరాండం సమర్పిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాశ్వాన్..‘అగ్నిపథ్ పథకం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని.. యువతలో అసంతృప్తిని రగిల్చుతుందని’ అన్నారు. ఇదే విధమైన ఆందోళనలను లేవనెత్తుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పాశ్వాన్ లేఖ రాసినట్టు తెలిపారు. ఇక, బంద్ ఎఫెక్ట్ ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరోవైపు.. బీహార్‌లో బంద్‌కు ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్న వారిలో రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు.. బీహార్‌లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీనే కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రజా ఆస్తులను తగలబెట్టే ఆర్జేడీ ఆగ్రహ నిరసనలలో బీహారీలు చనిపోతున్నారు. దీనికి ఆర్జేడీనే సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక శనివారం తలపెట్టిన బీహార్ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై ఆర్మీ రిటైర్డ్ జనరల్స్ సూచనలు ఇవే.. -
Telangana: మే 19న ఆటో, లారీ, క్యాబ్‌లు బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 19న బంద్‌రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యూవల్ రోజుకు 50 పెనాల్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: (మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం) -
రామాయంపేటలో బంద్ ప్రశాంతం
రామాయంపేట (మెదక్)/సాక్షి, కామారెడ్డి: గంగం పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయనందుకు నిరసనగా మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రెండు పార్టీల కార్యకర్తలు పట్టణంలో వేర్వేరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. హోం శాఖ ఏం చేస్తోంది?: జగ్గారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని.. డీజీపీ, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడితే డీజీపీ, హోం శాఖ మంత్రి స్పందించరా’ అని ప్రశ్నించారు. కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయకపోతే బుధవారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇవి ప్రభుత్వ హత్యలే: ఈటల తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో కలిసి రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. సుదీర్ఘమైన అనుభవమున్న డీజీపీ ఐపీసీకి లోబడి పనిచేయట్లేదని, అయన సీఎం దగ్గర గులాంగిరి చేస్తున్నట్టు ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. దహన సంస్కారాలకు వచ్చిన వాళ్లను బెదిరిస్తున్నారు: కుటుంబీకులు అధికార పార్టీకి చెందిన నేతలను కేసు నుంచి తప్పించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సంతోష్, పద్మ కుటుంబీకులు ఆరోపించారు. అందుకే పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. కారకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. పద్మ భర్త అంజయ్య, కుమారులు శ్రీధర్, శ్రీనివాస్, కూతురు పావని, అల్లుడు తాటికొండ సతీశ్‌కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘నేతల భయంతో మా సామాజిక వర్గానికి చెందిన సభ్యులు కూడా పరామర్శకు రావడానికి జంకుతున్నారు. దహన సంస్కారం రోజు వచ్చిన వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు కొందరు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు. తమను పరామర్శించేందుకు లోకల్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా రాలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. చైర్మన్లు ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన చేయాలని అన్నారు. అదుపులో ఆరుగురు తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన నేతలు నిందితులు కావడంతో పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మంగళవారం రామాయంపేట బంద్ పాటించడం, విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వ పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. వెంటనే నిందితులు లొంగిపోయేలా ఆదేశాలివ్వడంతో వారు సరెండర్ అయినట్టు తెలుస్తోంది. నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా మీడియా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆరుగురిని వేరే ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం రిమాండ్‌కు పంపుతామని డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ బంద్
-
నిజామాబాద్: బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు
-
కొత్తగూడెం బంద్ కు విపక్షాల పిలుపు
-
అమరావతిలో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌కమల్ చౌక్‌తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం -
టీడీపీ బంద్‌ను పట్టించుకోని ప్రజలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: చంద్రబాబు ఇచ్చిన బంద్ పిలుపును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు. జనంలో కనీస స్పందన కూడా కనిపించలేదు. టీడీపీ శ్రేణులే దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అక్కడక్కడా కొందరు నాయకులు మాత్రం హడావుడి చేసి సరిపెట్టుకున్నారు. అవి కూడా చాలా స్వల్పమేనని ఆ పార్టీ అంతర్గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బంద్‌లో పాల్గొనాలని చంద్రబాబు మంగళవారం రాత్రి నుంచి పార్టీ నేతల్ని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు అదేపనిగా ఫోన్లు చేసి ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం కనిపించలేదు. చాలామంది పార్టీ ఇన్‌చార్జ్‌లు చేతులెత్తేసి నియోజకవర్గాలకే రాలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. దీంతో కొద్దిచోట్ల ఉత్సాహంగా ఉండే కొందరు స్థానిక నేతలు హడావుడి చేశారు. తమకు పట్టుందని చెప్పుకొనే విజయవాడలోనే బంద్‌లో ఆ పార్టీ శ్రేణులు అరకొరగా పాల్గొన్నాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చొక్కా చించుకుని, కర్ర పట్టుకుని హల్చల్ చేసినా అది అరగంట కూడా లేదు. ఆయన వెనుక పట్టుమని పదిమంది కూడా లేరు. నాలుగైదుచోట్ల టీడీపీ జెండాలు చూపిస్తూ ఫొటోలు దిగి వెళ్లిపోయారు. పోలీసులు హౌస్ అరెస్టులు చేశారని ఆరోపిస్తున్నా అది కూడా లేదని క్షేత్రస్థాయి వాస్తవాల్ని బట్టి స్పష్టమైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన అనుచరులు దీనిగురించి అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి చెందిన మెజారిటీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బంద్‌కు దూరంగా ఉన్నారు. దీన్నిబట్టి పార్టీలోనే బంద్‌కు మద్దతు లేదని స్పష్టమైంది. మరోవైపు సాధారణ ప్రజలకు టీడీపీ బంద్ గురించే తెలియని పరిస్థితి నెలకొంది. తిరుమల బైపాస్‌రోడ్డు శివజ్యోతినగర్ వద్ద టీడీపీ నేత కిరాణ దుకాణం జన జీవనం యథావిధిగా కొనసాగింది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు సహా అన్ని రవాణా వ్యవస్థలు ఎప్పటిలానే నడిచాయి. విద్య, వ్యాపారసంస్థలు మామూలుగా తెరుచుకున్నాయి. టీడీపీకి మద్దతు ఇచ్చేది లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించడంతో వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా జరిగాయి. ఒకటి రెండు చోట్లకు టీడీపీ నేతలు వెళ్లి షాపులు మూసేయాలని చెప్పినా వాణిజ్యవర్గాలు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ బంద్ ప్రభావం సాధారణ జనంలో ఏమాత్రం లేదని స్పష్టమైంది. బంద్ పూర్తిగా విఫలమైనా విజయవంతమైందని టీడీపీ ప్రకటించుకోవడం గమనార్హం. ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని మద్దతు ఇచ్చారని అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు, ఇబ్బందులకు గురిచేసినా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు బంద్‌ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. బంద్‌కు ఎవరి నుంచి మద్దతు లభించకపోవడంతో చంద్రబాబు కోటరీ అసహనానికి లోనైంది. ఈ నేపథ్యంలో మైలేజి కోసం చంద్రబాబు దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. నామమాత్రంగానైనా కనిపించని బంద్ ప్రభావం టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపుని విశాఖ జిల్లా ప్రజలు పట్టించుకోలేదు. అసలు బంద్ ప్రభావమే కనిపించలేదు. జనజీవనం యథావిధిగా సాగింది. ఏజెన్సీ, రూరల్ మండలాల్లో బలవంతంగా దుకాణాలు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, కార్పొరేటర్లు, టీడీపీ స్థానిక నేతల్ని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని, మధ్యాహ్నం వారి సొంత పూచీకత్తుతో విడిచిపెట్టారు. టీడీపీ కార్యాలయంపై మంగళవారం వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడికి కారణమైన రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును అరెస్టు చేయాలంటూ భీమిలి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజెన్సీలో ఉన్న టీడీపీ వర్తకులు మధ్యాహ్నం 12 గంటల తరువాత దుకాణాలు తెరిచారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ సహకరించకపోవడంతో వెనుదిరిగారు. అరకు పాడేరు నియోజకవర్గాల్లో వారాంతపు సంతలు యధావిధిగా నడిచాయి. చిత్తూరు జిల్లాలో బంద్ ప్రభావం కనిపించలేదు. అక్కడక్కడా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రజాజీవనం మామూలుగానే కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దుకాణాలను మూయించే ప్రయత్నం చేశారు. ఆ వెనుకే వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ, పట్టణ అధ్యక్షుడు చందక సత్తిబాబు, మండల కన్వీనర్ ఎం.మైఖేల్‌రాజు షాపులను తెరిపించారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన డీమార్ట్ షోరూం హెరిటేజ్ ఫ్రెష్‌లో యథావిధిగా వ్యాపారం కృష్ణాజిల్లాలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పట్టించుకోలేదు. ఎక్కువమంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు నాయకులు.. పోలీసులు తమను హౌస్ అరెస్టు చేసినట్టు ప్రకటించుకున్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ దుకాణాలు కూడా మూసివేయలేదు. విజయవాడ మొగల్రాజపురంలో హెరిటేజ్ ఫ్రెష్‌లో వ్యాపారం మామూలుగానే కొనసాగింది. ప్రకాశం జిల్లాలో బంద్‌కు సహకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్లను గృహనిర్బంధం చేశారు. టీడీపీ కార్యకర్తలు కొందరు ఒంగోలులోని డీమార్ట్ షోరూం సిబ్బందితో గొడవపడి మూసేయాలంటూ షోరూం అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలో జాతీయ రహదారిపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టైర్లకు నిప్పుపెట్టారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన కొందరిని ముందస్తు సమాచారంతో త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, మరికొందరు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నాయకులను అరెస్టు చేసి ఓడీచెరువు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాప్తాడు మండలం ఎర్రగుంటలో వైఎస్సార్సీపీ కార్యకర్త గొర్ల సుదర్శన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరుల్లో టీడీపీ నేతలు లింగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్ రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పార్టీ నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అనంతరం విడిచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూలతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తిరగబడిన ప్రయాణికులు గుంటూరులో టీడీపీ నాయకుడు షేక్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బస్టాండ్‌లో బస్సులను ఆపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గృహ నిర్భంధం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లి గ్రామంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు జెండాలతో ఆర్టీసీ బస్సును అడ్డుకుని ప్రయాణికులను దిగాలని కోరగా వారు తిరగబడ్డారు. చొక్కాచించుకుని బుద్దా వెంకన్న హైడ్రామా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం తమ ఇంటి సమీపంలో తన చొక్కా తానే చించుకుని కొద్దిసేపు హైడ్రామా నడిపారు. బంద్‌కు ప్రజల మద్దతు లేకపోవడంతో ఏదో విధంగా హడావుడి సృష్టించి మీడియాలో హైలెట్ కావాలని ప్రయత్నించారు. అందులో భాగంగా విజయవాడ అర్జునవీధిలోని తన ఇంటి దగ్గరికి వచ్చిన కొద్దిమందితో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన్ని వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆపి తమకు సహకరించాలని కోరారు. వెంటనే బుద్దా వెంకన్న తన చొక్కాను చించుకుని పోలీసులపై చిందులు వేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. వెంకన్న స్వయంగా చొక్కా చించుకున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు చేశారు. తాను ఒకటనుకుంటే మరొకటి కావడంతో వెంకన్న అవాక్కయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలపై టీడీపీ వర్గీయుల దాడి బంద్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని తూర్పుచోడవరం గ్రామ సచివాలయంపైన, కృష్ణాజిల్లా గంపలగూడెంలోని వైఎస్సార్ క్రాంతిపథం (వెలుగు) కార్యాలయంపైన టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడిచేశారు. తూర్పుచోడవరం సచివాలయంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ గ్రామసభ వద్ద అలజడి సృష్టించారు. కుర్చీలను విరగ్గొట్టారు. అడ్డువచ్చిన కూలీ కత్తుల గంగరాజుపై దాడిచేసి గాయపరిచారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన సర్పంచ్ శంఖవరపు వెంకటలక్ష్మి, వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు చోడసాని సునీత అక్కడే ఉన్నారు. ఈ దాడిపై సచివాలయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, ఉద్యానశాఖ అసిస్టెంట్ సత్యనారాయణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు గంగరాజు కూడా పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ గ్రామ సచివాలయంపై టీడీపీ శ్రేణులు దాడిచేయడం ఈఏడాది ఇది రెండోసారి. పంచాయతీ ఎన్నికలు జరిగిన ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాత్రి సచివాలయంపై ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్పట్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జరిగిన దాడిని కూడా వారు వీడియో తీశారు. గంపలగూడెంలోని వైఎస్సార్ క్రాంతిపథం కార్యాలయంలో వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తుండగా వెళ్లిన టీడీపీ కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సంఘటనపై డిజిటల్ అసిస్టెంట్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్.ఐ. వి.సతీష్ తెలిపారు. ఘటనాస్థలాన్ని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, తిరువూరు సీఐ శేఖర్‌బాబు పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మీ ప్రతాపం ప్రజల మీద చూపిస్తారా?
-
టీడీపీ బంద్ పిలుపును పట్టించుకోని ప్రజలు
సాక్షి, అమరావతి: టీడీపీ బంద్ పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. కొంతమంది కార్యకర్తల హడావుడి తప్ప స్పందన కరవైంది. టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బంద్‌కు మద్దతు ఇవ్వలేమని వ్యాపార, విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. టీడీపీ బంద్ వల్ల ప్రజలకు ఉపయోగం లేనందున బంద్‌కు సహకరించలేమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. -
ఎక్కడ కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
-
ఉద్రిక్తంగా ‘పరకాల జిల్లా పోరాటం’.. పోలీసుల దాడి
పరకాల: రజాకార్లను తరిమికొట్టిన పోరాటాల గడ్డగా పేరొందిన పరకాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ‘పరకాల జిల్లా సాధన సమితి’ ప్రతినిధులు శనివారం ఆందోళన కొనసాగించారు. పది రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులు శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం కూడా మద్దతు ప్రకటించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా పరకాలలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు వారిపై దాడులు చేశారు. వారి నిరసనను తీవ్రంగా అణచివేస్తున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులను పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్‌స్టేషన్‌కు లాకెళ్లారు. పోలీసుల దౌర్జన్యంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మహేందర్ రెడ్డి తీరు సర్వత్రా ఆగ్రహం తెప్పిస్తోంది. ఉద్యమం నేపథ్యం పరకాల డివిజన్‌ను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని పరకాలవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా అనుమకొండ జిల్లా ప్రస్తావన తెరపైకి వచ్చిన తర్వాత పరకాల రెవెన్యూ డివిజన్లో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను హనుమకొండలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలింది పరకాలలో దామెర, నడికూడా మండలాలు మాత్రమే. ఈ రెండు మండలాలతో పరకాలను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించడం సాధ్యపడుతుందా లేదా డివిజన్ కూడా కనుమరుగు చేస్తారా అనే అనుమానం ఏర్పడింది. ఈ సమయంలోనే రాష్ట్రంలో మళ్లీ జిల్లాల విభజన వార్తలు రావడంతో పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేస్తున్నారు. గతంలోనూ ఉద్యమం చేయగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదనే ఆరోపణ ఉంది. అప్పట్లో కేవలం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ జిల్లా ప్రకటిస్తారనే వార్తలు రావడంతో పరకాల జిల్లా ఉద్యమం ఊపందుకున్నది. అందులో భాగంగానే శనివారం పరకాల బంద్‌కు పిలుపునిచ్చారు. -
బంగ్లా బంద్ హింసాత్మకం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ సంస్థ హెఫాజత్–ఇ–ఇస్లామ్ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. భారత ప్రధాని మోదీ పర్యటనపై హెఫాజత్–ఇ–ఇస్లామ్ తదితర సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు మృతి చెందటాన్ని నిరసిస్తూ ఈ బంద్ జరిగింది. నారాయణ్‌గంజ్ జిల్లా సనర్‌పారాలో పోలీసు కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాజధాని ఢాకాతో తీరప్రాంత నగరం చిట్టగాంగ్‌తో కలిపే ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. బ్రహ్మణ్‌బారియా జిల్లాలో ఆందోళనకారులు రైలుపై దాడికి దిగారు. ఇంజిన్ రూం సహా అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది వరకు గాయాలపాలయ్యారు.ఇదే జిల్లా సరైల్‌లో భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల అనంతరం ఈ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బంద్ కారణంగా రాజధాని ఢాకాలో వీధులు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ నేరుగా మద్దతు ప్రకటించలేదు. కాగా, హెఫాజత్–ఇ–ఇస్లామ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా మత విద్యాసంస్థలు నడుపుతోంది. -
బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు కార్మిక వర్గం కదం తొక్కింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రయత్నాలు విరమించుకోవాలని, ఉక్కు పరిశ్రమ సొంతంగా నిలదొక్కుకుని లాభాల బాటలో పయనించేలా చూడాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ స్టీల్‌ప్లాంట్ కార్మికులను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికి అండగా నిలవడంపై కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. బంద్‌కు బీజేపీ పూర్తిగా దూరంగా ఉండగా.. జనసేన విశాఖలో మాత్రమే మద్దతు పలికి రాష్ట్రవ్యాప్తంగా దూరంగా ఉండటం గమనార్హం. బంద్‌లో వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలతోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్తక, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశాఖలోని మద్దెలపాలెం జంక్షన్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పాల్గొని బంద్‌కు సంఘీభావం తెలిపారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాలకు సంధానకర్తగా వ్యవహరించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు ఎం.రాజశేఖర్, వై.మస్తానప్ప, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు అన్నివర్గాల సంఘీభావం రాష్ట్రవ్యాప్త బంద్‌కు అన్ని వర్గాలు సంఘీభావంగా నిలిచాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్క లేదు. డిపోల నుంచి బస్సులు బయటకు తీయబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకటించాయి. బంద్‌లో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు సైతం బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు ఆర్టీసీలో మొత్తం 10,057 బస్సులు ఉండగా.. 8,619 బస్సులు డిపోల నుంచి కదల్లేదు. హైకోర్టు, సచివాలయాలకు వెళ్లే వారికి మాత్రం ఇబ్బందుల్లేకుండా బస్సుల్ని తిప్పారు. మధ్యాహ్నం వరకు బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీకీ రూ.8 కోట్ల నష్టం వాటిల్లింది. దూర ప్రాంత సర్వీసులను మధ్యాహ్నం నుంచి కొనసాగించారు. బంద్‌కు మద్దతు పలికిన లారీ యాజమానుల సంఘం ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో లారీ యజమానుల సంఘం రాష్ట్ర నాయకులు వైవీ ఈశ్వరరావు, గోపిశెట్టి వీర వెంకయ్య పాల్గొన్నారు. కడపలో వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు పార్టీల నిరసన ఉద్యమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మద్దతు పలికింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. బంద్ కారణంగా కాకినాడ జేఎన్టీయూలో పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతపురంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంద్‌కు అమరావతి సచివాలయ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. బంద్‌కు జర్నలిస్టు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఏపీ బంద్‌కు అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం
సాక్షి, కర్నూలు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్మికులు చేపడుతున్న బంద్‌కు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఖండిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని పట్టణానికి బయలుదేరిని ఆయన.. మార్గమధ్యంలో కోడుమూరు పట్టణంలో ఆగి అక్కడ శాంతియుతంగా బంద్‌ను పాటిస్తున్న కార్మికులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్థావించి, కేంద్రంపై ఒత్తిడి తెస్తానని హామీనిచ్చారు. ఇదిలా ఉండగా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పలువురు అభ్యర్ధులు రంగంలో నిలిచారు. వీరికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఆదోనికి వెళ్లారు. కాగా, పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం పార్టీ ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పలు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బెజవాడ కృష్ణలంకలో బంద్
సాక్షి, విజయవాడ: కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన కారణంగా విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో సోమవారం బంద్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. కృష్ణలంకలో ఉన్న 16, 17, 18, 20, 21, 22 డివిజన్లలో పూర్తిగా బంద్ పాటించాలని, ఇళ్లలో నుంచి జనాలు బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. అత్యవసరం అయితే మాస్క్‌లు, శానిటైజర్లతో బయటకు రావాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. (కరోనా 'లాక్డౌన్'పై సీరియస్‌నెస్ ఏదీ?) రాణిగారితోటలో హైఅలర్ట్ స్థానిక కృష్ణలంక రాణిగారితోటలో శనివారం 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ అవ్వటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం హైఅలర్ట్‌గా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు ఆదివారం చుట్టుపక్కల రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య సిబ్బంది కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయా వీధుల్లో హైడ్రోక్లోరైడ్ క్రీమిసంహారక మందులు, బ్లీచింగ్ చల్లించారు. ప్రజలు రోడ్లమీద తిరుగకుండా పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. (ఉ.11 గంటల తర్వాత బయటకు రావద్దు) -
24 గంటలు బంద్
-
‘విడిచిపెట్టే వరకు ఆందోళనలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ అధ్యాపకుడు డా.కాశింను విడిచిపెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. గురువారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాశీం విడుదల కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రధాన కార్యదర్శి రవినాయక్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, డా.అన్సారీ, ఎంఎల్ పార్టీ నేత గోవర్ధన్, రమా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మేడిపాపయ్య, ఓయూ అధ్యాపకుడు డా.గాలి వినోద్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. కాశింపై కొత్త కేసులను బనాయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉపా కేసు పెట్టి జైల్‌కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు. కాశింపై పోలీసులు చేసిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డా.గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ బంద్ చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. -
బంద్ ప్రశాంతం
-
ఇంటర్ ఫలితాల అవకతవకలపై బీజేపీ బంద్‌కు పిలుపు
-
ఇంటర్ వైఫల్యాలపై నేడు రాష్ట్ర బంద్
-
బ్యాంకింగ్‌పై బంద్ ప్రభావం పాక్షికం
న్యూఢిల్లీ: ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రెండు రోజుల బంద్‌తో మంగళవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఒక వర్గం ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) ప్రాబల్యం ఉన్న బ్యాంకుల్లో బంద్ ప్రభావం కనిపించింది. అయితే, బ్యాంకింగ్ రంగంలోని మిగతా ఏడు యూనియన్లు బంద్‌లో పాల్గొనకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీఈఏ, బీఈఎఫ్‌ఐల్లో సభ్యత్వమున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో వాటి ప్రాబల్యమున్న పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ 10 కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ, జీతభత్యాల పెంపు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గత నెల 21న, 26న సమ్మెకు దిగాయి. -
కడపలో వామపక్షాల బంద్
-
సర్కారు తీరుకు నిరసనగా వామపక్షాల బంద్
-
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన కన్యాకుమారి జిల్లా బంద్ కొనసాగుతుంది. బంద్‌లో భాగంగా బీజేపీ నేతలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్లు ఆందోళనకారులు కేరళ రవాణా సంస్థకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలను నిలిపివేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, రాధాకృష్ణన్ ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం బుధవారం శబరిమలైకి వెళ్లారు. ప్రైవేటు వాహనంలో రాధకృష్ణన్ పంబన్‌కు వెళ్లడంతో ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు ఆయనతో వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. దీంతో రాధాకృష్ణన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్యాకుమారిలో బీజేపీ నేడు బంద్ చేపట్టింది. -
షట్ డౌన్
సాక్షి, జనగామ: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీ సేవ కేంద్రాల్లో వసూలు చేసే కమీషన్ రుసుం పెంచాలని మీ సేవ నిర్వాహకులు(ఆపరేటర్లు) ఆందోళన బాటపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పోరాటానికి సిద్ధమయ్యారు. ఆందోళనలో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి సామూహికంగా మీ సేవా కేంద్రాలను బంద్ చేయాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం కమీషన్ ధరలను సవరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 500 రకాల సేవలు.. ధ్రువీకరణ పత్రాల జారీలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు 2011లో మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 662 కేంద్రాలు ఉన్నాయి. 50 రకాల ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధించిన 500 రకాల సేవలను మీ సేవ ద్వారా అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆర్జీదారులకు మీసేవ ద్వారా నిర్దిష్ట గడువులోగా ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కులం, ఆదాయం, నివా సం, పహాణీలు, జనన, మరణ పత్రాలతోపాటు పలు రకా ల ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా జారీ చేస్తున్నారు. కమీషన్ కోసం ఆందోళన బాట.. మీ సేవ కేంద్రాల్లో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్ తక్కువగా ఉందని నిర్వాహకులు ఆందోళన బాటపడుతున్నారు. 2011లో ఖరారు చేసిన కమీషన్‌నే ఇప్పటికీ చెల్లిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ రాకపోవడంతో నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. పేపర్ ధరలు పెరగడంతో జీఎస్టీతో మరింత ఆర్థికభారం పడుతోంది. కమీషన్‌ను ప్రభుత్వం సవరించకపోవడంతో ఆందోళన మార్గం తప్ప మరోదారి లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవ నిర్వాహకుల డిమాండ్లు ఇవే.. ప్రైవేటు ఎస్‌సీఏలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి మీసేవ కేంద్రాలను తీసుకోవాలి. మీ సేవ నిర్వాహకుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించాలి. యూజర్ చార్జీలను పెంచాలి. సేవలపై కమీషన్ 80 శాతం వచ్చేలా చూడాలి. మీ సేవ నిర్వాహకులకు వచ్చే కమీషన్‌పై జీఎస్టీ పడకుండా నిర్ణయం తీసుకోవాలి. ఫిజికల్ కాపీలను అడుగుతున్న అధికారులకు ప్రభుత్వపరంగా సూచనలు చేయాలి. ప్రతి సంవత్సరం మీ సేనను రెన్యూవల్ చేసుకునే విధానాన్ని తొలగించాలి. అప్లికేషన్లు తప్ప మిగితా కాపీలకు స్కానింగ్ చార్జీలను విధించాలి. నోటిఫికేషన్లు లేకుండా మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నోటిఫికేషన్లు లేకుండా అనుమతి ఇచ్చే అధికారులపై చర్య తీసుకోవాలి. మీ సేవ ఉన్న గ్రామాల్లో సమగ్ర సమాచార కేంద్రాలను మూసివేయాలి. మీ సేవ కేంద్రాలకు ఆధార్ సెంటర్లివ్వాలి. ప్రతి మీసేవ నిర్వాహకుడికి సీఎస్సీ లాగిన్ ఇవ్వాలి. స్టాంప్ వెండర్స్ విక్రయాలతోపాటు యూనివర్సిటీ ఫీజుల చెల్లింపునకు అవకాశమివ్వాలి. ప్రభుత్వం స్పందించకపోతే బంద్ పాటిస్తాం మీ సేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు సందర్భాల్లో నివేదించాం. ఇటీవల ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందించాం. నవంబర్ 1 నుంచి మీ సేవ కేంద్రాలను బంద్ చేసి మా కనీస హక్కులను సాధించుకుంటాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ రాక కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. రూం రెట్లు, జీఎస్టీ భారంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా న్యాయపరమైన సమస్యలను తీర్చాలి. లేకపోతే కేంద్రాలను బంద్ చేసి ఆందోళన కార్యక్రమాలను చేపడుతాం. – రావిపాటి దేవేందర్, తెలంగాణ మీ సేవ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
-
బీజేపీ బంద్..బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
27న రాష్ట్ర వ్యాప్త ప్రైవేట్ జూనియర్ కాలేజీల బంద్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లోని టీపీజేఎంఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. వి.నరేందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గౌరి సతీశ్, ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డిలతో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇంటర్ బోధన రుసుమును పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. -
మరాఠాల బంద్ హింసాత్మకం
ముంబై: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోరుతూ మరాఠా సంఘాలు మరోసారి బంద్ నిర్వహించాయి. ఆందోళనకారులు రాష్ట్రంలోని లాతూర్, జాల్నా, సోలాపూర్, బుల్దానా, అహ్మద్‌నగర్, నాసిక్ జిల్లాల్లో ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో పాటు టైర్లను కాల్చి నిరసన తెలిపారు. పుణే కలెక్టర్ కార్యాలయం సెక్యూరిటీ గార్డు గది అద్దాలు, బల్బులు పగలగొట్టారు. దీంతో వదంతులు వ్యాపించకుండా పుణే జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఔరంగాబాద్‌లో ఆందోళనకారులు ఓ పోలీస్ కారుతో పాటు 2 ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు.. అల్లరిమూకల్ని చెదరగొట్టారు. నాందేడ్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ నడుపుతున్న దినపత్రిక ‘సత్యప్రభ’తో పాటు మరో మరాఠీ పత్రిక పుధారి ఆఫీసులపై రాళ్లు రువ్వారు. లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రిబంక్రావ్ భింసేను చుట్టుముట్టిన ఆందోళనకారులు ఆయన్ను పక్కకు నెట్టివేశారు. బారామతిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిముందు మరాఠాలు ధర్నాకు దిగగా.. శరద్ బంధువు అజిత్ పవార్ వారికి సంఘీభావంగా ధర్నాలో కూర్చున్నారు. మరాఠా సంఘాల ఐక్యవేదిక ‘సకల్ మరాఠా సమాజ్’ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. మరోవైపు బంద్‌కు సంఘీభావంగా రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ బంకులు, షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం మరాఠాల రిజర్వేషన్‌పై తాము పనిచేస్తున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ మరాఠా>లు శాంతించలేదు. మహారాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న మరాఠాలు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తుండటం తెల్సిందే. -
కశ్మీర్లో ‘35ఏ’ సెగ
న్యూఢిల్లీ: కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ అంశం ఆ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపింది. సుప్రీం విచారణకు నిరసనగా వేర్పాటువాదుల పిలుపు మేరకు బంద్‌తో కశ్మీర్, చీనాబ్ లోయలో జనజీవనం స్తంభించింది. 35ఏపై సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభం కావాల్సిన విచారణ జస్టిస్ వైవీ చంద్రచూడ్ లేకపోవడంతో 28వ తేదీకి వాయిదాపడింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించే అంశాన్ని పరిశీలించనున్నట్లు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కశ్మీర్లో రెండు రోజుల బంద్ ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ చేపట్టరాదంటూ గత కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్ పిలుపు మేరకు ఆది, సోమవారాల్లో బంద్ పాటించారు. వివిధ వర్గాలు మద్దతు తెలపడంతో రెండు రోజులుగా కశ్మీర్, చీనాబ్‌లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు నిలిచిపోయాయి. కీలక ప్రాంతాల్లో సైన్యం, పోలీసులను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అమర్నాథ్ యాత్రను రెండు రోజులుగా నిలిపివేశారు. కశ్మీరీల ప్రత్యేక హక్కులేమిటి? రాష్ట్రంలో శాశ్వత నివాసితులను కశ్మీర్ శాసనసభ నిర్ధారిస్తుంది. స్థానికేతరులు లేదా ప్రవాసులు స్థిరాస్తులు కొనుగోలు చేసి స్థిరపడేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు పొందడానికి అనర్హులు. వీరు అసెంబ్లీ మొదలుకుని మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అనర్హులే. 1911కు ముందు ఆ రాష్ట్రంలో పుట్టిన, స్థిరపడిన లేదా అంతకు పదేళ్ల ముందు న్యాయబద్ధంగా స్థిరాస్తి పొందిన, పాక్‌కు వలస వెళ్లిన వారితో పాటు జమ్మూకశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారు స్థానికులు. వలసవెళ్లిన వారి తర్వాతి 2 తరాల వరకూ ఇదే వర్తిస్తుంది. పాక్ పౌరుడై ఉండి కశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయగలిగిన విచిత్ర పరిస్థితికి ఇది అవకాశం కల్పిస్తుండగా, ఇతర రాష్ట్రాల్లోని భారత పౌరులకు ఆ హక్కులేదు. స్థిరనివాస సర్టిఫికెట్ లేని వారిని కశ్మీరీ మహిళలు భర్తలుగా ఎంచుకుంటే ఆమె ఆస్తిపై హక్కు కోల్పోతుంది. వారి పిల్లలకు తదుపరి హక్కులు లభించవు. ఈ హక్కులు ఎలా వచ్చాయి ? 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్–35ఏను చేర్చారు. పార్లమెంట్లో చర్చించకుండా, రాజ్యాంగ సవరణ రూపంలో కాకుండా రాజ్యాంగానికి అనుబంధంగా దీనిని చూపడంపై అభ్యంతరాలున్నాయి. 35ఏపై చర్చ అంటే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370పై చర్చగా భావించాలి. ఇది తేనెతుట్టెను కదిపినట్లేనని నిపుణుల భావన. రాజ్యాంగం కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హక్కులు, వాటి చెల్లుబాటును ప్రశ్నించకుండా ఆర్టికల్ 35ఏ చెల్లుబాటును, 1954లోని రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని వారంటున్నారు. సుప్రీంలో పిటిషన్లు ఎవరివి? అక్కడివారికి 35ఏ ద్వారా సంక్రమించే హక్కులు, అధికారాలను రద్దు చేయాలంటూ ఢిల్లీకి చెందిన ‘ వీ ది సిటిజన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ, 35ఏ కారణంగా తమ పిల్లలు ఓటు హక్కును కోల్పోయారంటూ ఇద్దరు కశ్మీరీ మహిళల పిటిషన్లతోపాటు ఇతర పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. -
బీహార్ బంద్ ప్రశాంతం
-
బాలికలపై అకృత్యాలు.. బిహార్ బంద్
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసుకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్లో ఈ దారుణం వెలుగుచూసింది. చిన్నారులకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడటం, వారిని తీవ్రంగా హింసించడం వంటి చర్యలతో షెల్టర్ హోంను బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. కాగా బిహార్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని, హేయమైన ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసింహ్ గోహిల్ ట్వీట్ చేశారు. నితీష్ ప్రభుత్వ ఊతంతో చిన్నారి బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి అత్యంత హేయమని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. -
మరాఠా ఆందోళనలో మళ్లీ హింస
సాక్షి, ముంబై/పుణె/ఔరంగాబాద్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని పుణెలో మరాఠాలు సోమవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల కోసం నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇద్దరు మరాఠాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పుణెలోని చకన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 40 బస్సులకు నిప్పంటించారు. మరో 50 బస్సులతో పాటు పలు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా అల్లరిమూకలు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆందోళనలు షోలాపూర్, ముంబైకి కూడా విస్తరించాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. ఫడ్నవిస్ క్షమాపణ కోరుతూ.. రాష్ట్రంలో కొందరు మరాఠాలు హింసకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ చెప్పాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా అనే సంస్థ పుణె బంద్‌కు పిలుపునిచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి దిగారన్నారు. దీంతో పలువురు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారనీ, కొందరైతే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దాక్కున్నారని వెల్లడించారు. నగరంలో అల్లర్లను అణచేసేందుకు ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ కోరుతూ వారం రోజుల క్రితం ఇదే సంస్థ పుణెలో ఆందోళన నిర్వహించిందన్నారు. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ మరాఠాల ఆందోళన హింసాత్మక రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ నేతృత్వంలో గవర్నర్‌ను కలసిన నేతలు.. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి ప్రాణత్యాగం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మరాఠా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. కానీ రాష్ట్రంలో కొన్నిచోట్ల అవి హింసాత్మక రూపం దాల్చడంతో ఆందోళనల్ని విరమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఔరంగాబాద్ వాసి ప్రమోద్ జైసింగ్(35).. ఆదివారం రాత్రి ముకుంద్వాడీ ప్రాంతంలో ఓ రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా స్నేహితులకు తెలియజేశాడు. మరోవైపు నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆగస్టు 9న బంద్‌కు సీపీఎం మద్దతు: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే చర్యలకు వ్యతిరేకంగా భారత్ అంబేడ్కర్ మహాసభ పిలుపిచ్చిన ఆగస్టు 9న బంద్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా కుల వివక్ష, అంటరానితనం యథేచ్ఛగా కొనసాగటం సభ్య సమాజానికి మాయని మచ్చగా ఉందన్నారు. దేశవ్యాప్త నిరసనల తర్వాత కేంద్రం ఆలస్యంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గోరక్షక దళాల ముసుగులో అరాచక శక్తుల దాడులు, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. దళిత సమస్యలపై జరుగుతున్న బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
మదనపల్లెలో కొనసాగుతున్న బంద్
సాక్షి, అమరావతి/చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడి మృతికి సంతాపంగా ఆదివారం మదనపల్లెలో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా మన హక్కు అని శనివారం సుధాకర్ అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడికి సంతాపంగా ఆదివారం మదనపల్లె బంద్‌కు ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మిథున్‌రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. సుధాకర్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. -
మహారాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఊరట
-
మరాఠా బంద్ అసంపూర్ణం
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరు తూ ముంబైలో మరాఠాలు బుధవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పలు సంస్థలు ముంబై బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మధ్యాహ్నానికే బంద్‌ను విరమిస్తున్నట్లు చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. -
మరాఠాల బంద్ హింసాత్మకం
ముంబై: గత కొద్ది రోజులుగా దేశ అర్థిక రాజధాని అందోళనలు, బంద్‌తో అట్టుడికిపోయింది. రెండేళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న మరాఠ ఉద్యమం మంగళవారం ఉప్పెనలా ఎగిసి పడింది. మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో విద్యా, ప్రభుత్వ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరాఠాలు ‘జల్ సమాధి’ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాకాసాహెబ్ షిండే(27) అనే యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. మరాఠా క్రాంతి మోర్చా బుధవారం ముంబై బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే. బంద్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేశారు. మరికొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ఐదారుగురు ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. నేటి ముంబై బంద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో నవీ ముంబైతోపాటు పన్వేల్, థానేలో బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు మరాఠా నాయకులు ప్రకటించారు. నిలిచిన రవాణా వ్యవస్థ బంద్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. అందోళనకారులు రైలు పట్టాలపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే ఆందోళనాకారులు రోడ్లపై భైఠాయించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే శివాజీ చౌక్, ములంద్ చౌక్ల వద్ద బంద్ ప్రభావం ఎక్కవగా కనబడింది. పాత ముంబై- పుణె, ముంబై-గోవా రహదార్లపై రాస్తారోకాలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన బస్సుల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. రహదార్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. బంద్‌లో స్వచ్చందంగా పాల్గొనాల్సిందింగా ఆటో యూనియన్స్‌కు ఆందోళనకారులు ముందే హెచ్చరించడంతో రోడ్లపై ఆటోలు తిరగలేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాలు, ఆన్లైన్ క్యాబ్ ఏజన్సీలు ఇష్టానుసారంగా ధరలు పెంచేశాయి. బంద్ విజయవంతం: మరాఠ మోర్చా నేత ముంబై బంద్ విజయవంతంగా ముగిసిందని మరాఠ క్రాంతి మోర్చ నేత వీరేంద్ర పవార్ పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగుకుండా ముందస్తు జాగ్రత్తగా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో యువత స్వచ్చందంగా ఆందోళనలు చేపట్టిందని స్పష్టం చేశారు. బంద్‌లో అక్కడక్కడా జరిగిన అవాంఛనీయ ఘటనలకు కారణం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిసేనని వీరేంద్ర పవార్ స్పష్టంచేశారు. -
మహరాష్ట్రలో కొనసాగుతున్న రిజర్వేషన్ల బంద్
-
బంద్ సంపూర్ణం
యర్రగొండపాలెం(ప్రకాశం): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దుకాణాలు, బ్యాంకులు, హోటళ్లు పలు విద్యా సంస్థలు తెరవలేదు. ఈ పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగింది. సీఐ, ఎస్సైలతోపాటు ప్రత్యేక పోలీసులు రోడ్ల వెంట పహారా కాసినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వారి కళ్లు కప్పి మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన వాహనాన్ని పోలీసులు మార్కాపురం నుంచి వెంటాడినప్పటికీ ఎమ్మెల్యే ప్రధాన రోడ్డుగుండా కాకుండా పల్లె ప్రాంతాలనుంచి యర్రగొండపాలెం చేరారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే అక్కడ పోలీసులు భారి ఎత్తన మోహరించి ఉన్నారని తెలుసుకున్న ఆయన స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్దకు చేరారు. అక్కడి నుంచి ఆయన మోటారు బైక్‌పై ర్యాలీగా బయల్దేరి సెంటర్‌కు చేరుకున్నారు. టీషర్ట్ వేసుకొని ఉండటం వలన ముందుగా పోలీసులు ఆయనను గుర్తించలేదు. కార్యకర్తలు గుంపుగుంపులుగా చేరి వైఎస్సార్ విగ్రహం వదకు చేరుకునే సరికి పోలీసులు వారిని మోహరించి అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే సురేష్‌ను ఎస్సై లాక్కొని వెళ్లారు. అనంతరం పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బైండవర్ చేసుకొని వదలివేశారు. పార్టీ మండల అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్ ఇంట్లోకి వెళ్లిన సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికి వెళ్లకుండా కాపలా కాశారు. అరెస్ట్ అయిన వారిలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్ సీపీ మండల, పట్టణ అధ్యక్షులు డి.కిరణ్‌గౌడ్, షేక్.జబీవుల్లా, పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎన్.వెంకటరెడ్డి, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యుడు పాత్లావత్ రాములు నాయక్, సర్పంచ్ అప్పారావు, మాజీ సర్పంచ్ గాలి శ్రీనివాసరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, బి.బాలచెన్నయ్య, ఎం.ఎస్రాలు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేశ్వరరెడ్డి, వి.మోహన్‌రెడ్డి, మేడగం వెంకటరెడ్డి, ముసలారెడ్డి, గజనీ వెంకటేశ్వరరెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, డి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. బంద్ విజయవంతం త్రిపురాంతకం: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసేసి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకులు అనంతపురం –అమరావతి హైవేపై ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న నిరసనకారులను ఎస్ఐ కమలాకర్ అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బంద్ చేపట్టేందుకు సిద్ధమైన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌లో పార్టీ మండల అధ్యక్షుడు పి.చంద్రమౌళిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిబాయి, పిచ్చయ్య, కోట సుబ్బారెడ్డి, గుడిమెట్ల రంగయ్య, రంగబాబు, కోట్ల గురవారెడ్డి, రాజయ్య, ఖాన్, పోలిరెడ్డి, వెంగళ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, లింగయ్య పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు పెద్దారవీడు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి వ్యతిరేకంగా పార్టీ మండల కన్వీనర్ పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పెద్దారవీడులో మార్కాపురం– పెద్దదోర్నాల రోడ్డుపై నిరసన చేపట్టారు. నిరసన తెలుపుతున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని ఎస్ఐ పి.ముక్కంటి బలవంతంగా అరెస్టు చేశారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దివంగతనేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రాహానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బంద్‌లో పాల్గొనేందుకు మండలంలోని 19 పంచాయతీల నుంచి నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, విద్యార్థులు, రైతులు, యువకులు భారీగా తరలివచ్చారు. అరెస్టు చేసిన వారిలో పార్టీ కన్వీనర్ పాలిరెడ్డి, క్రిష్ణారెడ్డి, జిల్లా సేవాదళ్ కార్యదర్శి కాసు వెంకటరెడ్డి, మండల యూత్ కన్వీనర్ తమ్మిశెట్టి తిమ్మరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఓద్దుల లక్ష్మిరెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మూల వెంకటరెడ్డి, నాయకులు అల్లు వెంకటేశ్వరరెడ్డిలను ఎస్ఐ అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పంపించారు. నియోజవర్గ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను యర్రగొండపాలెంలో జరగబోయే బంద్‌లో పాల్గొంటారని ముందుగానే అరెస్ట్ చేయాలని హనుమాన్‌జంక్షన్‌కుంటలో పోలీసులు కాపుకాశారు. ముందుగానే ఆయనకు నాయకులు ఎప్పటికప్పడు సమాచారం అందించడంతో చాకచక్యంగా యర్రగొండపాలెం చేరుకొని బంద్‌లో పాల్గొన్నారు. తంగిరాలపల్లె పంచాయతీలో పాఠశాలలు బంద్ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలోని తమ్మడపల్లె, తంగిరాలపల్లె, ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలను మూయించారు. ప్రత్యేకహోదా కోసం విద్యార్థులు కూడా మద్దతు పలికి సంతోషం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ వీరాంజనేయులు, నాయకులు గిరిప్రసాద్, యూత్ నాయకులు పి శ్రీను, జి గాలెయ్య, కె రామయ్య, కె యల్లరాజు, తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాలలో.. పెద్దదోర్నాల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించటంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో నిర్వహించిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. బంద్ సందర్భంగా మండల కేంద్రంలో వాణిజ్య సముదాయాలతో పాటు, విద్యా సంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, పలు వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా దుకాణాలను మూసి బంద్‌కు మద్దతు పలికారు. బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు లాలూనాయక్, మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ, నాయకులు చిట్యాల యోగిరెడ్డి, యక్కంటి మల్లారెడ్డి, లింగారెడ్డి, చిట్యాల లక్ష్మీరెడ్డి, వెన్నా కాశిరెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, మాండ్ల వెంకటేశ్వర్లు, సాదం పిచ్చయ్య, కొండెపోగు ఆశీర్వాదం, దుగ్గెంపూడి వెంకటనారాయణరెడ్డి, ఒంటేరు నాగేశ్వరరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో నిర్బంధించారు. బంద్ సంపూర్ణం పుల్లలచెరువు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో అలుపెరగని పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్సార్ సీపీనే అన్నారు. 15 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఎం.సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ బి.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్.రాములు, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్యారావు, ఏఎంసీ మాజి వైస్ చైర్మన్ కె.వీరయ్య, ప్రచార కార్యదర్శి రోసిరెడ్డి, జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు కె.యల్లయ్య, డివిజన్ కాపు నాయకులు ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎల్.ప్రసాద్, టౌన్ అధ్యక్షులు జి.ఆంజనేయులు, సేవాదళ అధ్యక్షుడు సుందరరావు, నాయకులు సిద్ధనపాలెం సుబ్బయ్య, జానీకీరఘు, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, డిష్ వెంకటరెడ్డి, హనుమంతరావు, కోటిరెడ్డి, దేవదానం, కాశయ్య, హనుమంతరావు, జక్కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న చంద్రబాబు సర్కారు, మరో వైపు హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా బంద్‌ను పోలీసులను అడ్డుపెట్టి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీస్ 30 యాక్ట్‌తో పాటు 144 సెక్షన్‌ను విధించింది. ప్రభుత్వం ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. గృహ నిర్బంధం, అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బంద్ కారణంగా ఉదయం కొద్దిసేపు బస్సులు నడవలేదు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో కొందరు దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు సహకరించగా మరి కొందరు దుకాణాలు తెరిచారు. విద్యాసం్థలు మూసివేశారు. మొత్తంగా పోలీసుల నిర్భందంతో జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న బంద్ పాల్గొనకుండా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. అనంతరం బాలినేని పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కెవి.రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, రామానాయుడు, అంజిరెడ్డి, తదితర నేతలు, కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఇంటి ఆవరణలో పోలీసులు అడ్డుకున్నారు. బాలినేనిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను ఇంటి లోపలికి తరలించేందుకు ప్రయత్నించారు. దీనిని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలతో పాటు పోలీసులు తొక్కిసలాటలో పడిపోయారు. అనంతరం బాలినేనితో పాటు కార్యకర్తలు అక్కడే బైటాయించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోదా కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. సాయంత్రం వరకు బాలినేని గృహ నిర్భంధంలోనే ఉంచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని బాలినేని విలేకరుల సమావేశంలో విమర్శించారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు. ఎంత మందిని నిర్భంధించి, అరెస్టులు చేసిన హోదా సాధించి తీరుతామన్నారు. బాలినేనిని గృహ నిర్భంధంలో ఉంచడాన్ని నిరసిస్తూ నేతలు, పార్టీ కార్యకర్తలు బాలినేని ఇంటి సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారొకో చేపట్టారు. రాస్తారోకోకు నేతృత్వం వహించిన పార్టీ నేతలు కుప్పం ప్రసాద్, కెవి. రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, యనమల నాగరాజు తదితరులను పోలీసులు అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలో విద్యార్థి, మహిళా విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేశారు. దుకాణ దారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. తొలుత తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండులో బస్సులను అడ్డుకున్నారు. గంటపాటు బస్సులు నిలిచి పోయాయి. అనంతరం పోలీసులు సింగరాజును అరెస్టు చేసి జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2 మార్కాపురంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పార్టీ శ్రేణులు మార్కాపురం ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని జంకే వెంకటరెడ్డితో పాటు పార్టీ నేత వెన్న హనుమారెడ్డి తదితరులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై వారి స్వగృహాలకు తరలించి హౌస్ అరెస్టు చేశారు. 2 యర్రగొండపాలెంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. తొలుత ఎమ్మెల్యేను మార్కాపురంలోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి యర్రగొండపాలెం వెళ్లారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేతలు బంద్ నిర్వహించారు. యర్రగొండపాలెంలో సంపూర్ణంగా బంద్ జరిగింది. 2 కందుకూరులో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు బంద్‌లో పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహీధర్‌రెడ్డితో పాటు తూమాటి మాధవరావును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2 అదంకిలో సమన్వయకర్త బాచిన గరటయ్య ఆధ్వర్యంలో హోదా బంద్ జరిగింది. ఉదయాన్నే గరటయ్యను జె పంగులూరులోని ఆయన స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన కుమారుడు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ నిర్వహించారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2 చీరాలలో సమన్వయకర్త యడం బాలాజి నేతృత్వంలో హోదా బంద్ జరిగింది. పోలీసులు ఉదయాన్నే పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణిని హౌస్ అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సమన్వయకర్త సురేష్ పాల్గొన్నారు. 2 దర్శిలో సమన్వయకర్త బాదం మాధవరెడ్డి ఆధ్వర్యంలో హోదా బంద్ జరిగింది. మాధవరెడ్డిని పోలీసులు సంతమాగూలూరులోని ఆయన స్వగృహంలో అరెస్టు చేశారు. దీంతో దర్శితో పాటు తాళ్లూరు, దొనకొండ, కురిచేడుతో పాటు అన్ని మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్ నిర్వహించారు. కురిచేడు పోలీస్ స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. 2 కనిగిరిలో సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్‌ను నిర్వహించాయి. ఉదయాన్నే ఆర్టీసీ వద్ద నేతలు బస్సులను ఆపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు బుర్రాతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ జరిగింది. 2 గిద్దలూరులో సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐవీరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డిలు ఆందోళన నిర్వహించారు. బస్సులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి వారి స్వగృహాలకు తరలించి హౌస్ అరెస్టు చేశారు. అనంతరం కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పిడతల అభిషేక్ నిరసనలో పాల్గొన్నారు. 2 సంతనూతలపాడులో సమన్వయకర్త సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో హోదా బంద్ జరిగింది. ఆయనను ఒంగోలులోని నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడులలో పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. 2 పర్చూరులో సమన్వయకర్త రావి రామనాధంబాబు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయాన్నే బంద్ నిర్వహించేందుకు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు రామనాధం బాబును అరెస్టు చేసి పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. పార్టీ నేత గొట్టిపాటి భరత్ బొమ్మల సెంటర్లో టైర్లు తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. వైఎస్ విగ్రహం వద్ద గంటపాటు నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2 కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. సింగరాయకొండలో పార్టీ నేతలు, కార్యకర్తలు దుకాణాలను మూయించారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జరుగుమల్లి మండలం చిరకూరపాడు, కొండపి మండలం పెట్లూరు, మర్రిపూడి మండలం జివ్వుగుంట తదితర గ్రామాల్లో పార్టీ శ్రేణులు విద్యా సంస్థలు, బ్యాంకులు మూయించి బంద్ నిర్వహించారు. -
ప్రభుత్వ కుట్రను ప్రజలు తిప్పికొట్టారు
ఆదోని (కరర్నూలు): వైఎస్ఆర్సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజలు తిప్పికొట్టారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ డిపో వద్ద ఆయన ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న వంచనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడం ద్వార ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రభుత్వం కాలరాయాలని చూసిందని విమర్శించారు. అయితే విజ్ఞులైన ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక హోదా కోసం నిజాయితీతో పోరాడాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ప్రజలను వంచించడం మానుకోవాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని హెచ్చరించారు. అక్రమ సంపాదన కోసం ప్యాకేజికి ఒప్పుకుని, కుట్ర రాజకీయాలలో భాగంగా బీజేపీతో కలిసి నాటకాలాడుతున్నారని ఆయన సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, అయితే చంద్రబాబే అడ్డుకుంటున్నట్లు ప్రజలకు అర్థం అయినందు వల్లే వైఎస్ఆర్సీపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తోందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని, ఇకపై చంద్రబాబు ఆటలు సాగవని హెచ్చరించారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
పత్తికొండ (కర్నూలు): రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ పత్తికొండ నియోజకవర్గంలో విజయవంతమైంది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు మండల కన్వీనర్ బజారప్పతో పాటు నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా గేట్లను మూసేసి ఆందోళన చేశారు. అక్కడి నుంచి బైపాస్‌రోడ్డు వద్దకు చేరుకొని హోసూరు క్రాస్ రోడ్డులో ధర్నాకు దిగారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోకి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి హరిజన వాడ మీదగా చాక్రళ్ల రోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి తేరు బజారు వెంట ర్యాలీ సాగుతుండగా ఎస్.ఐ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లు కంగాటి శ్రీదేవిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ విక్రమ సింహ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని శ్రీదేవితో పాటు నాయకులు శ్రీరంగడు, ప్రహ్లాదరెడ్డి, మురళీధర్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లు తగదు ప్రత్యేక హోదా కోసం శాంతి యుతంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించడం సిగ్గుచేటని కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేడయం చంద్రబాబును మించిన నాయకుడు రాష్ట్రంలో లేరన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆగవని, మరింత ఉధృతమవుతాయని చెప్పారు. బంద్‌లో నాయకులు జూటూరు బజారప్ప, నాగేష్, మద్దికెర మురళీధర్‌రెడ్డి, నరసింహయ్య, బనావత్ లక్ష్మిదేవి, గణపతి, కారుమంచప్ప, బనగాని శ్రీనివాసులు, తిప్పయ్య, కృష్ణారెడ్డి, కారం నాగరాజు, రహిమాన్, మధుసూదన్‌నాయుడు, మధు, జయ చంద్రారెడ్డి, ఇమ్రాన్, హరీష్‌రెడ్డి, నజీర్, గాంధీరెడ్డి, దాసు, భాస్కర్ నాయక్, మధుసూదన్‌రెడ్డి, తిమ్మరాజు, దేవన్న పాల్గొన్నారు. -
ప్రశ్నించండి.. నిలదీయండి..
-
నాలుగో రోజు కొనసాగుతున్న లారీల బంద్
-
ఏపీ బంద్‌కు మద్ధతుగా విశాఖలో మహిళల వినూత్న నిరసన
-
బంద్‌కు సిద్ధమవుతున్న అనంత వైఎస్అర్సీపీ నేతలు
-
పూర్తిగా నిలిచిన రవాణా సేవలు
ఖిలా వరంగల్: భవిష్యత్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన నిబంధనలు, ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం రవాణా సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సమ్మెలో సుమారు 2వేల లారీలను ఎక్కడికక్కడే సరుకులతో నిలిపి వేశారు. వివిధ జిల్లాలకు చెందిన వందలాది లారీలు రోడ్డుపైన బారులు తీరాయి. ఈ మేరకు జిల్లాకు వచ్చిన సరుకులు, నిత్యావసరాల లోడులను మాత్రం కలెక్టర్ ఆదేశం మేరకు యాజమాన్యాలు రవాణా, దిగుమతికి అనుమతించాయి. ఈ సందర్భంగా నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా జిల్లా ఆధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లారీ ఓనర్లు రోడ్లపై వినూత్న నిరసనలు రోడ్లపై లారీలను యాజమానులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ అందోళన, ఆర్ధనగ్న ప్రదర్శనలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకపక్క వర్షం కురుస్తున్న లారీ యజమానులు రోడ్లపై బైఠాయించి అందోళనలు చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి అసోసియేషన్ నాయకులకు నచ్చ చెప్పి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. దూర ప్రాంతాల డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డు పక్కనే వంటా వార్పు చేస్తూ కనిపించారు. సమ్మె ఎప్పటికీ ముగస్తుందో ఆర్థం కావడం లేదని, ఎక్కువ రోజుల పడితే తమ వద్ద ఖర్చులకు చేతిలో డబ్బులేవని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె మరింత ఉధృతం చేస్తాం..సమ్మిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి లారీ యజమానుల సమస్య పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వరంగల్ డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సమ్మిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె.మధుసుధన్‌రావు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ నగర ప్రధాన రోడ్లపై వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్, ఓరుగల్లు లోకల్ లారీ, వరంగల్ లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అందోళనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగం పట్ల ఆత్యంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని లారీ యజమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రధానమైన 11డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఆదివారం నుంచి నిత్యవసర సరుకులను సరఫరా చేసే వాహనాలను కూడా ఆడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజాపాషా,వరంగల్ లోకల్ లారీ అధ్యక్షుడు వేముల భూపాల్, ఓరుగల్లు లారీ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఎండి గోరేమియా,సప్లై అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి బాబర్, కొండా సత్యనారాయణ, ఎండీ యూసూఫ్, ఎండి ఫీరోజ్, సద్దాం హుస్సేన్,రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, నారాయణ, వేముల క్రాంతి, సాధిక్, వాడికే విద్యాసాగర్, రాజు,సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
24న రాష్ట్ర బంద్
-
టీడీపీ, బీజేపీ పాపపరిహారం చేసుకోవాలి
సాక్షి, కడప : కడప ఉక్కు - రాయలసీమ హక్కు అంటూ వైఎస్సార్ జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తమ హక్కులను సాధించుకోవడానికి అఖిల పక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పూటకో మాట మాట్లాడుతున్న టీడీపీ.. : బంద్ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు బంద్ చేపట్టామని అన్నారు. విభజన హామీలను బీజేపీ విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి లేదని, అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల్లో పరిశ్రమపై బలమైన ఆకాంక్ష ఉందని, అందుకే బంద్‌కు అందరూ సహకరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా పాపపరిహారం చేసుకోవాలి : జిల్లాకు ఉక్కు పరిశ్రమ ప్రకటించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి పాపాలను మూటగట్టుకున్నాయని, ఉక్కు పరిశ్రమ స్థాపించి చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాఉద్యమంలో టీడీపీ, బీజేపీలు కొట్టుకు పోతాయిని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశత్వం విడిచి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచు కోవాలంటూ సూచించారు. హామీలు అమలయ్యే వరకూ పోరాటం : విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకూ వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే ఆకాంక్షను బలంగా తెలియచేశారని అన్నారు. గత నాలుగేళ్లుగా విభజన చట్టం హమీల కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
వైఎస్ఆర్ జిల్లా బంద్ చేపట్టిన వైఎస్ఆర్సీపీ,వామపక్షాలు
-
కడప బంద్ : హోరెత్తిన ఉక్కు నినాదం
సాక్షి, కడప : ఉక్కు ఉద్యమం హోరెత్తుతోంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు తగుదనమ్మా అంటూ దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్ అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష నేతలు నిర్ణయించామన్నారు. మైదుకూరు : మైదుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీతో పాటు ఇతర అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరంగం రెడ్డి, వామపక్ష నేతలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో ఉక్కు నినాదం హోరెత్తింది. విభజన చట్టంలో హామీల అమలను డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బైఠాయించారు. అనంతరం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బద్వేలు : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా బంద్‌కు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బద్వేలు నేతలు బంద్ నిర్వహించారు. బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నినాదాలతో బద్వేల్ హోరెత్తింది. ఈ మేరకు బస్సులు డిపోలకు పరిమితం అవ్వగా ప్రవేటు వాహనాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రాయచోటి : అఖిలపక్షం పిలుపు మేరకు ఉక్కుసంకల్పం పేరుతో రాయచోటిలో బంద్ జరుగుతోంది. ఆర్టీసి డిపో ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు భైఠాయించారు. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు ఒక రోజు ముందే సెలవు ప్రకటించాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్మోహన్ రేడ్డి, జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, సీపీఐ నాయకులు విశ్వనాథ్, వైఎస్సార్ మున్సిపల్ కౌన్సిలర్లు బంద్‌లో పాల్గోన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఇతర నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు : వైఎస్సార్సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బంద్ నిర్వహించారు. వామపక్షాలు, జనసేనలు వైఎస్సార్సీసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట : ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలతో పాటు ఇతర విద్యార్ధి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ దీక్ష నిజమైతే టీడీపీ బంద్‌లో ఎందుకు పాల్గొనడం లేదని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు. కడప : ఆర్టీసీ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే అన్ని పార్టీల నేతలు రోడ్డు మీదకు వచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అంజాద్ బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జనసేన జిల్లా నాయకుడు రంజిత్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు. -
29న జిల్లా బంద్
కడప వైఎస్ఆర్ సర్కిల్ :రాష్ట్ర విభజన చట్టంలో తెలిపిన విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ ఈ నెల 29న అఖిల పక్షం తలపెట్టిన జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల సమయంలో దోస్తీగా ఉన్న బీజేపీ, టీడీపీలు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చుతామని సృష్టంగా చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదన్నారు. నాలు గేళ్లు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోకుండా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగపోరాటాలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తూ అధికారులను సైతం తమ పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం దారుణమన్నారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలక ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేసి నేడు పరిశ్రమ ఏర్పాటుకు ïఫీజు బిలీటీ లేదని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిసరుకు, విద్యుత్, రవాణా, నీటి సౌకర్యం వంటివి మెండుగా ఉన్నా.. టీడీపీకి జిల్లాలో ఓట్లు, సీట్లు రాలేదనే అక్కసుతోనే జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడకుండా నాలుగు సంవత్సరాలు అసమర్దపు పాలన చేసి రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఈ నెల 28న తలపెట్టిన రహదారుల దిగ్బంధనం, 29న తలపెట్టిన ఉక్కు బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, విద్యా, వ్యాపార సంస్దలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి లారీల బంద్
సాక్షి, బెంగళూరు: రకరకాల బాధలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు, లారీల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలను భారీగా పెంచిందని ఆరోపిస్తూ సోమవారం నుంచి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా లారీలు, ట్రక్కుల యజమానులు సమ్మెకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోనున్న తొమ్మిది లక్షల లారీలు, ట్రక్కులతో పాటు దేశవ్యాప్తంగా సుమారు కోటి లారీలు, ట్రక్కులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్‌లు తగ్గించాలంటూ అనేకసార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నట్లు లారీ, ట్రక్కు ఓనర్స్ అసోసియేన్స్ ప్రతినిధులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి వరకు రూ.27 వేలుగా ఉన్న థర్డ్‌పార్టీ ప్రీమియమ్‌ను ధరను ఒకేసారి రూ.48 వేలకు పెంచడంతో లారీల యజమానులపై తీవ్రభారం పడుతోందన్నారు. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అఖిల భారత లారీ సరుకు సేవా వాహనాల యజమానుల సంఘం,రాష్ట్ర లారీ యజమానుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్ ధరలు తగ్గించే వరకు లారీల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు లారీల స్ట్రైక్‌తో పాలు, బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్,డీజిల్ రవాణా నిలిచిపోయే ప్రమాదముంది. ఆదివారం నుంచే అనేక నగరాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె సాకు చూపి అధిక ధరలతో దోచుకోవడానికే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించారంటూ ప్రజలు పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి లారీ సమ్మె కారణంగా పెట్రోల్ కోసం ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. -
ఊపందుకుంటున్న రైతుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ : రుణాల మాఫీ తదితర డిమాండ్లపై మధ్యప్రదేశ్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైన రైతుల పది రోజుల సమ్మె శనివారం నాటికి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు విస్తరించింది. ‘గావ్ బంద్’ పేరిట ప్రారంభించిన ఈ సమ్మె ప్రభావం మొదటి రోజు పెద్దగా కనిపించలేదు. రెండోరోజు కొద్దిగా కనిపించింది. మరికొన్ని రోజుల్లో కూరగాయలు, పాల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయి గ్రామీణ జీవనం పూర్తిగా స్తంభించిపోతుందని, దాని ప్రభావం పట్టణ ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో సమ్మెకు సమన్వయకర్తగా పనిచేస్తున్న రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ తెలిపింది. దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతోపాటు భూ సంస్కరణలను అమలు చేయాలని, పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో సమ్మె ప్రభావం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తోంది. గతంలో నాసిక్ నుంచి ముంబై వరకు దాదాపు 40 వేల మంది రైతులతో భారీ ర్యాలీ జరిగిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కారణంగానే రైతుల నుంచి ఈసారి అంతగా స్పందన లేనట్లుంది. మధ్యప్రదేశ్‌లో కూడా సమ్మె ప్రభావం ఈ రోజు అంతంత మాత్రంగానే కనిపించింది. పలు కూరగాయల మార్కెట్లు యథావిధిగానే తెరచి ఉన్నాయి. గతేడాది జూన్ నెలలో పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులు మరణించిన మండసార్‌లో సమ్మె ప్రభావం కొద్దిగా కనిపించింది. మార్కెట్‌కు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ధరలు కొద్దిగా పెరిగాయి. కొన్ని చోట్ల కూడళ్లలో రైతులు సింబాలిక్‌గా పాలను, కూరగాయలను వీధుల్లో పారబోస్తున్నారు. ఈ ఆందోళన తీవ్రమైతే పాలు, కూరగాయలకు కొరత ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సమ్మె తీవ్రం కానుట్లు సమ్మెకు సంఘీభావం ప్రకటించిన అన్ని రైతు సంఘాలు తెలియజేస్తున్నాయి. -
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణం
-
నేడు తమిళనాడు బంద్‌కు విపక్షాల పిలుపు
-
తూత్తుకుడిలో బంద్, స్టాలిన్, కమల్ పర్యటన
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు. కాగా తూత్తుకుడి స్టెర్లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. -
రాష్ట్రవ్యాప్త బంద్‌కు 108 ఉద్యోగుల పిలుపు
అమరావతి : 108 నిర్వహణా సంస్థతో 108 ఉద్యోగుల చర్చలు విఫలం కావడంతో వారు రాష్ట్రవ్యాప్తంగా రేపు(గురువారం) బంద్‌కు పిలుపునిచ్చారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, 50 శాతం జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవీకే సంస్థ నుంచి రావాల్సి ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. గత ఆరు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 8 గంటల పని సమయం కేటాయించాలని లేదంటే తామే 8 గంటలు పని చేసి ఆ తర్వాత ఫోన్లు స్విఛ్ ఆఫ్ చేస్తామని హెచ్చరించారు. -
హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా బిజిలీ బంద్
-
25 నుంచి మద్యం షాపుల బంద్
సాక్షి, అమరావతి: మద్యం వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు దిగనున్నారు. మద్యం షాపులు మూసేయడంతోపాటు సరుకును కూడా ఏపీబీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) గోడౌన్ల నుంచి తీసుకెళ్లకుండా నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అధ్యక్షతన శనివారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం సిండికేట్లు హాజరయ్యారు. ఈ నెల 25 నుంచి మద్యం షాపుల బంద్ పాటించేందుకు నిర్ణయించారు. మద్యం వ్యాపారులకు ఇస్తున్న 10 శాతం కమీషన్‌ను 18 శాతానికి పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రతి మద్యం షాపు నుంచి రూ.5 వేల వంతున వసూలు చేశారు. చివరకు సీఎం కార్యాలయం అధికారులు కూడా జోక్యం చేసుకుని కమీషన్‌ను పెంచాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావుకు మెమో జారీ చేశారు. అయితే గతంలో కమీషన్ 10 శాతానికి మించి ఉండకూడదని జీవో ఉండటంతో 18 శాతానికి పెంచడం సాధ్యం కాదని తేల్చారు. పెంపు ప్రతిపాదనలు నిలిచిపోవడంతో వైన్ డీలర్స్ అసోసియేషన్ గత నెలలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు నాలుగు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసి నిరసన తెలిపింది. మళ్లీ ఈ నెల 25 నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు. ప్రభుత్వం దిగొస్తుంది.. సహకరించండి: విజయవాడలో సమావేశమైన మద్యం సిండికేట్లు అన్ని జిల్లాల్లో వ్యాపారుల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. వారం రోజులు బంద్ పాటించి నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందని, 18% కమీషన్ పెంచేందుకు అంగీకరిస్తుందని సిండికేట్లు పేర్కొనడం గమనార్హం. వ్యాపార దృక్పథంతో చూడకుండా అందరూ షాపుల్ని మూసేయాలని సూచించారు. వారంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అసోసియేషన్ పెద్దలు చెబుతున్నారు. కాగా, మద్యం వ్యాపారులు బంద్ పాటిస్తే ఏర్పడే డిమాండ్‌ను బట్టి ప్రభుత్వమే ఔట్లెట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టాలని యోచిస్తోంది. -
హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం
సాక్షి, నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చేస్తున్న ఉద్యమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న జరిగిన రాష్ట్రబంద్‌ను కూడా విజయవంతం కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పోలీసులతో అరెస్టులు చేయించారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే.. హోదా తాకట్టు పెట్టి చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేశారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు చంద్రబాబు తహతహ లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి,విశాఖసిటీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో అఖిలపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, ఏపీ హోదా సాధన సమితితోపాటు విద్యా, విద్యార్థి సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలతో పాటు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌తో నగరంతో పాటు జిల్లా స్తంభించిపోయింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే రహదారులపైకి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు వచ్చి నిరసనలు తెలిపారు. మద్దిలపాలెం జాతీయ రహదారిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్నాథ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ, సీపీఎం నగర కార్యదర్శి గంగారాం సహా వివిధ పార్టీల నేతలు పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్ వద్దకు చేరుకొని నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు హోదా ర్యాలీ నిర్వహించారు. జగదాంబ జంక్షన్ నుంచి సరస్వతీ పార్క్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దారిలో అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. డాబాగార్డెన్స్‌లోని బీఎస్ఎన్ఎల్, తపాలా కార్యాలయాలకు వెళ్లి.. ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరుతూ సంస్థలను మూయించివేశారు. జగదాంబ జంక్షన్లో వామపక్షాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శలు చేపట్టారు. గాజువాకలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు అర్థనగ్నప్రదర్శనలు నిర్వహించి బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాత గాజువాక జంక్షన్లో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించగా, వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. సీపీఎం, వైఎస్సార్సీపీ మహిళా ప్రతినిధులు రోడ్డుపైనే కబడ్డీ ఆడారు. సీపీఎం కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. భీమిలిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం ఆరు గంటలనుంచే బస్సులు, ఆటోలు తిరగలేదు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తూ బంద్‌కు మద్దతు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలు, కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. మెయిన్‌రోడ్డు గంటస్తంభం వద్ద వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావ్, ఇతర అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయనిర్మల, ఇతర పార్టీల ఆధ్వర్యంలో కొమ్మాది కూడలి, కార్ షెడ్ కూడలి, మధురవాడ, ప్రధాన వాణ్యి కూడలి వేమువలస జంక్షన్లో తదితర ప్రాంతాలలో దఫదఫాలుగా రాస్తారోకోలు నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామీణ వైద్యుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేపట్టింది. సింహాచలంలో ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ, దేవస్థానం పరిపాలనా కార్యాలయాన్ని ఆందోళనకారులు మూయించివేశారు. బస్సులు లేకపోవడంతో సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వెలవెలబోయింది. పెందుర్తిలో అన్ని పార్టీల శ్రేణులతో పాటు ఐద్వా తదితర ప్రజాసంఘాల నాయకులు రోడ్డెక్కి హోదాపై తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. పెందుర్తి కూడలి వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థులు, మహిళలు, సామాన్యులు రోడ్లపై బైటాయించి ప్రత్యేకహోదా ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మద్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. మరోవైపు బంద్‌ను విచ్చిన్నం చేసేందుకు టీడీపీ నాయకులు తెరచాటు ప్రయత్నాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలు సత్తిరామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో గురుద్వారా కూడలిలో రహదారుల దిగ్బంధనం చేశారు. ఊర్వశీ జంక్షన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. మరోవైపు.. జిల్లా అంతటా బంద్ సందర్భంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ బంద్ విజయవంతమైంది. రాంబిల్లిలో రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. మునగపాకలోనూ పోలీసులు జులూం ప్రదర్శించారు. ఆందోళనకారుల్ని రోడ్డుపై నుంచి బలవంతంగా నెట్టేశారు. మాడుగుల నియోజకవర్గంలో బంద్ ఉద్రిక్తంగా మారింది. మాడుగులలో రోడ్డుఅడ్డంగా బంద్‌లో ప్రత్యేక హోదా నినాదాలు చేస్తుంటే ఎస్.ఐ ధనుంజయ్‌తో సిబ్బంది వైఎస్సార్సీపీ నాయకులు పెదబాబును, కొట్యాడలను బలవంతంగా తీసుకెళ్లారు. -
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
కావేరీ వివాదం : బంద్‌తో తమిళనాట టెన్షన్
సాక్షి, చెన్నై: కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటులో కేంద్రం వైఫల్యాన్ని నిరసిస్తూ డీఎంకే పిలుపు మేరకు గురువారం తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. రోడ్డు, రైల్ ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడటంతో జనజీవనం స్థంభించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు మిన్నంటాయి. అన్నా సలై, కొడంబాక్కం, నంగంబాక్కం తదితర ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శనలతో హోర్తెతించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు సర్వీసులపై బంద్ ప్రభావం కనిపించింది. హోసూర్, తిరుచ్చిలోనూ బస్సుల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేఎస్ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను కూడా పలు చోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిరసనలతో తమిళనాడు నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బంద్ నేపథ్యంలో స్ధానిక వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎంకే బంద్ పిలుపునకు రైతులు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. చెన్నైలోని మౌంట్ రోడ్డులో ప్రతినక్ష నేత స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో వీసీకే, ఎండిఎంకె, వామపక్షాలు పాల్గొనటంతో నగరం స్తంభించింది. వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలతో మౌంట్ రోడ్డు జనసంద్రమైంది. ర్యాలీగా ఆందోళనలతో ముందుకు సాగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్, వైగో, తిరుమావళవన్, వామపక్ష నేతలను అరెస్టు చేసి స్థానిక పోలీస్టేషన్లకు తరలించారు. ఇక వేలూరు, పుదుచ్చేరిలో బంద్ హింసాత్మకంగా మారింది. బస్సుల ధ్వంసం ఆందోళనకారులు ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేయగా పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పంటించటం ఉద్రిక్తతకు దారితీసింది. పుదుచ్చేరి, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఆరు బస్సులను ఆందోళనకారులు ద్వంసం చేశారు.వేలూరులో ఆందోళనకారుల ఆగ్రహానికి 15 బస్సులు ద్వంసమయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులను ఆందోళన కారులు ద్వంసం చేయటం గమనార్హం. పలుజిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగినా, వేలూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. -
సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఆందోళన
సాక్షి, కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు తప్పుడుగా నమోదవుతున్నాయంటూ, ఇందులో ప్రాథమిక విచారణ అవసరమని, తక్షణ అరెస్టులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సోమవారం దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైనట్లు దళిత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే దళిత, ప్రజా సంఘాలకు చెందిన నేతలు పెద్దఎత్తున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రం గప్రవేశం చేసి దళితులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు దళితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పో లీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. దళిత సంఘాల నేతలు సుద్దాల లక్ష్మణ్, మేడి మహేశ్, ఇంజం వెంకటస్వామి, కల్లెపల్లి శంకర్, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, మేడి అంజయ్య, గోష్కి అజయ్, గంటల రేణుక, మాల మాలతి, యనమల మంజుల, తీట్ల ఈశ్వరి, సముద్రాల అజయ్, బడుగు లింగయ్య, గసికంటి కుమార్, బొలుమాల సదానందం, బొగ్గుల మల్లేశం, కోహెడ వినోద్, గాలిపెల్లి శ్రీనివాస్, సానది వెంకటేష్, గంటల మహేందర్, గోర్రె రాజయ్య, పోత్తూరి రమేశ్, మైసని మనోహర్, చిన్న రుద్రవరపు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో.. కేవీపీఎస్, ఆర్పీఐ, టీఎంఆర్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, చందు, చిరంజీవి, రాజయ్య, కుతాడి శివరాజ్, లింగంపల్లి బాబు, వెంకన్న, కృష్ణ, ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు చుక్కెదురు..
అమలాపురం టౌన్, రాజమహేంద్రవరం క్రైం:ట్రేడ్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు చేపట్టిన నిరసన రెండో రోజు బుధవారం మరింత ఉద్ధృతమైంది. తొలి రోజు జిల్లాలోని మూడు ప్రభుత్వ లిక్కర్ గోడౌన్ల నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపేసి ఆ గోడౌన్ల వద్దే నిరసనలు తెలిపిన మద్యం వ్యాపారులు రెండో రోజు నుంచి తమ తమ మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. దీంతో జిల్లాలో బుధవారం 530 మద్యం దుకాణాలు, 40 బార్లు మూతపడ్డాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి ఇంతటి స్థాయిలో, ఇన్ని రోజులు ఎక్సైజ్ శాఖకు నిరసనలు వెల్లువెత్తడం ఇదే ప్రథమం. ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ మార్గమైతే, వాటి అమ్మకాల కోసం లైసెన్సులు పొందిన తమ లాభాలు, ఆదాయాలను మాత్రం ప్రభుత్వం హరిస్తోందని ఆ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు, బార్లు తెరుచుకోక, మద్యం దొరకక జిల్లా అంతటా మద్యం దుకాణాలు, బార్ల వద్ద బంద్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండో రోజూ కూడా జిల్లాలో సుమారు రూ.20 కోట్ల మద్యం సరఫరాకు, దాదాపు రూ. ఆరు కోట్ల మద్యం అమ్మకాలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరం, అమలాపురం, సామర్లకోటల్లో గల బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ల కొనుగోళ్లు, బిల్లింగ్‌లు లేక పూర్తిగా మూతబడ్డాయి. మద్యం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. రాజమహేంద్రవరంలో మద్యం వ్యాపారులు సంబంధిత ఎక్సైజ్ డివిజన్ కార్యాలయంలో ఈఎస్‌కు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమలాపురంలో లిక్కర్ గోడౌన వద్ద వంటా వార్పు పెట్టి వినూత్న నిరసనకు తెర తీశారు. వ్యాపారులు అక్కడే వంటలు వండుకుని అక్కడే సామూహికంగా భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఇలా జిల్లా అంతటా మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు నిరసనలు హోరెత్తించారు. ఈనెల 31వ తేదీ వరకూ మద్యం దుకాణాలను మూసి వేసి బంద్ పాటించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. 31వ తేదీ వరకు రోజుకో తీరుతో నిరసనలను వినూత్నంగా నిర్వహించేందుకు జిల్లాలోని దాదాపు 600 మంది మద్యం లైసెన్సుదారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో బుధవారం మందు దొరకక కొందరు మందుబాబులు ఆందోళన చెందారు. నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలిసి కొందరు మందుబాబులు ముందుచూపుతో మంగళవారమే స్పందించారు. -
ఢిల్లీలో వ్యాపారుల బంద్
సాక్షి, న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన దుకాణాల మూసివేత (సీలింగ్ డ్రైవ్)కు వ్యతిరేకంగా వ్యాపారులు ఇచ్చిన బంద్ పిలుపుతో బుధవారం ఢిల్లీలో 2500 మార్కెట్లు మూతపడ్డాయి. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ర్టీస్ (సీటీఐ), అఖిలభారత వ్యాపారుల సంఘాల సమాఖ్య బంద్‌కు పిలుపు ఇచ్చింది. మరోవైపు రాంలీలా మైదాన్‌లో ఢిల్లీ వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, వేలాది చిన్న మధ్యతరహా సంస్థలు మద్దతివ్వడంతో బంద్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీటీఐ కన్వీనర్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ చెప్పారు. నగరంలోని చాందినీ చౌక్, సదర్‌బజార్, జనక్ పురి సహా పలు కీలక ప్రాంతాల్లోని మార్కెట్లు మూతపడ్డాయని తెలిపారు. ఢిల్లీ అధికారులు చేపట్టిన షాపుల మూసివేతతో 40 లక్షల మంది వ్యాపారులు, వారి కుటుంబాలు వీధినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణాలను సీల్ చేయడాన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లును లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దుందుడుకుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని విడిచిపెట్టిన అధికారులు కేవలం వ్యాపారులపై మాత్రమే విరుచుకుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
రేపటి నుంచి మద్యం బంద్..!
తిరుపతి రూరల్: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం అమ్మకాలపై మార్జిన్‌ను సగానికి పైగా తగ్గించేసి, తమను నిలువునా ముంచిందని చిత్తూరు జిల్లా వైన్స్, బార్స్ డీలర్ల అసోసియేషన్ నేతలు మండిపడ్డారు. షాపుల నిర్వహణ భారంగా మారడంతో ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిలుపుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అందులో భాగంగా మంగళవారం మద్యం డిపోల నుంచి స్టాక్ కొనుగోలును నిలుపుదల చేస్తారు. ఆమేరకు సోమవారం తిరుపతి రూరల్ మండలం పద్మావతీపురం పంచాయతీలోని ఓ ప్రైవేటు హోటల్లో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుమ్మల.గుణశేఖర్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 415 వైన్ షాపులు, 17 బార్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా రోజుకు దాదాపు రూ.2.5 కోట్లు నుంచి రూ.3 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అమ్మకాలపై 18శాతం మార్జిన్ ఉండేదన్నారు. గత ఏడాది షాపుల టెండర్ల ప్రక్రియ గెజిట్‌లో ప్రభుత్వం మార్జిన్‌ను నమోదు చేయలేదని, కొత్త విధానంలో లైసెన్సు ఫీజులు తగ్గిం చామంటూ, మద్యం అమ్మకాలపై వ్యాపారులకు ఇచ్చే మార్జిన్‌ను గణ నీయంగా తగ్గించిందని వాపోయారు. అమ్మకాలపై సరైన మార్జిన్ లేకపోవడంతో వ్యాపారులకు లాభాలు రాకపోగా, షాపుల అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, ఇతర నిర్వాహణ ఖర్చులతో ఒక్కో దుకా ణానికి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ద్వారా లాభాలు ఆర్జిస్తున్న సర్కారు తమను నష్టాల్లోకి నెట్టేస్తోందని పలువురు వ్యాపారులు మండిపడ్డారు. నష్టాలకు తోడు అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తూ ఎవరైనా పట్టుపడితే ఆ ప్రాంతంలోని మద్యం షాపును సీజ్ చేసి, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైనా మార్జిన్ ఇవ్వకుండా వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్న ప్రభుత్వం తీరుకు నిరసనగా ఉద్యమించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నేడు స్టాక్ కొనుగోలు బంద్...రేపటి నుంచి మద్యం షాపుల మూత..! ప్రభుత్వం చేతకాని తనానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం మద్యం డిపోల నుంచి మద్యం షాపులకు స్టాక్ కొనుగోలును వ్యాపారులు నిలుపుదల చేస్తున్నారు. అంటే మంగళవారం షాపులో ఉన్న స్టాక్‌ను మాత్రమే విక్రయిస్తారు. అలాగే బుధవారం నుంచి జిల్లాలోని అన్ని వైన్స్, బార్లను మూసి వేసి మద్యం విక్రయాలను బంద్ చేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుణశేఖర్‌నాయుడు తెలిపారు. అమ్మకాలపై మార్జిన్‌ను 18 శాతానికి పెంచాలని, వేధింపులను ఆపాలని, బెల్టుషాపు నిర్వహిస్తూ పట్టుబడితే వారిపైనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు పరంధమ్రెడ్డి, మునస్వామిరెడ్డి, ప్రహ్లాదరెడ్డి, వెంకటేష్, కుమారస్వామిరెడ్డి, నాధమునిరెడ్డి, మునెయ్యనాయుడు, మద్యం డీలర్లు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మద్యం వ్యాపారులు -
ఏపీలో జాతీయ రహదారుల దిగ్బంధం
-
థియేటర్ల బంద్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం
-
టాలీవుడ్లో ముదురుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. వీపీఎఫ్ ఫీజులు రద్దు చేయాలనే డిమాండ్‌తో నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన నిర్మాతలు.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ సంస్థలకు కంటెంట్ నిలిపివేశారు. దీంతో సాధారణ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్స్ల్లోను నేడు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని 1700 థియేటర్లతోపాటు హైదరాబాద్ లోని 250కిపైగా థియేటర్ల యాజమానులు... నిర్మాతల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. థియేటర్ల ముందు పోస్టర్లు అంటించి ప్రేక్షకులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయి. వర్చువల్ ఫీజు రద్దు చేయడంతో పాటు ప్రకటన నిడివి తగ్గించడం, ప్రతి ఆటకు రెండు కొత్త సినిమాల ప్రచార చిత్రాలను ఉచితంగా ప్రదర్శించాలనే డిమాండ్లతో నిర్మాతలు బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగిరాకపోవడంతో నిరవధికంగా థియేటర్లు బంద్ చేయాలని నిర్మాతతలు భావిస్తున్నారు. ఈ మేరకు థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సినిమాల ప్రదర్శన నిలిపివేత కారణంగా ఒక్కో థియేటర్ కనిష్టంగా రూ. 50 వేల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. నిర్మాతలు, డిజిటల్ సర్వీసుల మధ్య నెలకొన్న సమస్యను సతర్వమే పరిష్కరించేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ పాక్షికంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల డిమాండ్లపై డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. రాజేంద్రనగర్: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్‌ఫుల్‌ఈవెంట్‌లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్‌సైన్స్ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది. రంగులు లభించే ప్రాంతాలు.. సైఫాబాద్ హోమ్‌సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్ స్వీట్ హౌస్, హైదర్‌నగర్‌లోని 24మంత్ర ఆర్గానిక్ షాప్ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. కిలో రూ.400 హోమ్‌సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్‌లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058. పెరుగుతున్న డిమాండ్.. ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం. – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్ ప్రిన్సిపల్, హోమ్‌సైన్స్ కాలేజీ ఉపయోగాలు... ♦ ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ♦ శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు. ♦ పర్యావరణంపై ప్రభావం చూపవు. ♦ శుభ్రపరుచుకోవడం చాలా తేలిక. ♦ నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ. ♦ భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక వాడం.. సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్లో రంగులు కొనుగోలు చేశాం. – కె.వనజ, హైదర్‌గూడ -
కపట నాటకాలు టీడీపీ కట్టిపెట్టాలి
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా కపట నాటకాలు కట్టిపెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద వామపక్షాలు చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. బాలినేని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వరప్రసాదినైన ప్రత్యేక హోదాను కాదని ఎవరికీ తెలియకుండా ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోపే ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని టీడీపీ నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, తద్వారానే పరిశ్రమలు వస్తాయని, అవి వస్తేనే నిరుద్యోగ యువతకు ఉపాది లభిస్తుందన్నారు. మరో వైపు జీఎస్టీ వంటి పన్నులు ఉండకపోవడం వల్ల వస్తువులు ప్రజలకు తక్కువ ధరకే లభ్యమవుతాయని వివరించారు. దాని ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పారిశ్రామిక వేత్తలే తాము పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకు వస్తారనే వాస్తవాన్ని కేంద్రం పట్టించుకోక పోవడంతో నేడు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు పార్లమెంట్లో తమ ఎంపీలు చేస్తున్న వాదనకు మద్దతుగా నిరసన దీక్ష చేస్తున్నామని చెబుతున్నారు తప్ప రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంతో మిత్రపక్షంగా తెగతెంపులు చేసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి ప్రేమే ఉంటే ముందుగా కేంద్రంలోని మంత్రులను ఉపసంహరించుకోవాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో టీడీపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఇచ్చిన పిలుపుకు తాము కూడా మద్దతు తెలిపామని బాలినేని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మంగమూరు రోడ్డు, లాయరుపేట సాయిబాబా ఆలయం, జయరాం సెంటర్, సీవీఎన్ రీడింగ్ రూమ్, నగరపాలక సంస్థ కార్యాలయం, చర్చి సెంటర్ మీదుగా నెల్లూరు బస్టాండ్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు బైకుపై ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. పలు కాలేజీల హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేతులు ఊపుతూ బాలినేనికి జయజయధ్వానాలు పలికారు. దారిపొడవునా షాపులు మూసేయించారు. నెల్లూరు బస్టాండ్ నుంచి మళ్లీ కలెక్టరేట్ వద్దకు చేరుకొని వామపక్షాలు చేపట్టిన బంద్ కార్యక్రమానికి సంఘీభావం పలుకుతూ వారితో పాటు బైఠాయించి ప్రజలను ఉద్దేశించి బాలినేని మాట్లాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రాష్ట్ర నాయకులు పురిణి ప్రభావతి, ధూళిపూడి ప్రసాద్‌నాయుడు, దేవరపల్లి అంజిరెడ్డి, పటాపంజుల శ్రీనివాసులు, వేమూరి సూర్యనారాయణ, వరికూటి కొండారెడ్డి, దామరాజు క్రాంతికుమార్, అన్నెం వెంకట్రామిరెడ్డి, యనమల నాగరాజు, గోలి తిరుపతిరావు, బడుగు ఇందిర, పోకల అనూరాధ, బడుగు కోటేశ్వరరావు, కొమ్ము శ్యామేలు, కొఠారి రామచంద్రరావు, కఠారి శంకర్, జజ్జర ఆనందరావు, కేవీ ప్రసాద్, మీరావలి, ఓబుల్‌రెడ్డి, చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, మోరబోయిన సురేష్‌యాదవ్, రామకృష్ణారెడ్డి, రాయిని వెంకట్రావు, పల్లా అనూరాధ, యశ్వంత్‌వర్మ, కాకుమాను సునీల్‌రాజ్, జలీల్, రఫీ, వల్లెపు మురళి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, అంగిరేకుల గురవయ్య, నత్తల భీమేష్, తోటపల్లి సోమశేఖర్, బాకా శివారెడ్డి, సువర్ణ, జమ్ము రత్తయ్య, వర్దు శేషయ్య పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరగడంతో గురువారం వామపక్షాలు తలపెట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ మద్దతు ఇచ్చి, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లా కేంద్రం నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. నెల్లూరు రూరల్: జిల్లాలో గురువారం వామపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాలయాలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. గురువారం జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షను వాయిదావేశారు. సినిమాహాళ్లు, హోటళ్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు కదలలేదు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టౌన్బస్సులు ఒక్కటీ తిరగలేదు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నగరంలోని ప్రధాన కూడళ్లయిన ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జాతీయ రహదారులపై లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు స్వచ్ఛందగా నిలిపివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. వామపక్షపార్టీల నాయకులు, వైఎస్సార్ సీపీ నేతలు ప్రదర్శనగా బయలు దేరి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బంద్‌కు అనూన్యంగా ప్రజా మద్దతు లభించడం, బంద్ విజయవంతం కావడంతో ఆలస్యంగా టీడీపీ నేతలు బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, సీపీఐఎంఎల్ నాయకులు సాగర్, న్యూడెమోక్రసీ నాయకులు కిశోర్‌బాబు బంద్‌ను పర్యవేక్షించారు. బంద్‌కు మద్దతుగా నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన, అనంతరం వీఆర్సీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్ నుంచి గాంధీబొమ్మ వరకు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ జరిగింది. పొదలకూరులో నిర్వహించిన బంద్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వామపక్షాలతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, అవాంతరాలు సృష్టించినా జనం ఖాతరు చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని నినదించారు. బంద్‌కు మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా, జనసేన, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు నిరసన గళాలు వినిపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టాయి. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం విశ్రమించబోమని ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా బంద్‌తో రవాణా స్తంభించింది. సుమారు 13 వేల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్స్‌ను, యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. సినిమా థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం ఆటలు రద్దయ్యాయి. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. రహదారులు జనం లేక బోసిపోయాయి. కిటకిటలాడే హోటళ్లలో నిశ్శబ్దం తాండవించింది. బంద్‌కు ససేమిరా సహకరించేది లేదన్న అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాభీష్టానికి తలొగ్గారు. ర్యాలీలు నిర్వహించండని దుబాయి నుంచి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్టు ప్రకటించి ధర్మాగ్రహానికి తలొంచారు. శాంతియుత బంద్‌కు సహకరించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజాము నుంచే బైఠాయింపులు వామపక్షాల కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలు తెల్లవారు జాము నుంచే బస్ డిపోల ఎదుట ఆందోళన ప్రారంభించారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా గేట్ల ముందు బైఠాయించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు గేట్లకు అడ్డంగా నిలబడి బస్సులను కదలనీయలేదు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా ఉద్యమ కారులు ఖాతరు చేయలేదు. కార్మిక సంఘాలు మద్దతు పలకడంతో ఆటోలు, రిక్షాలు సైతం రోడ్లపై తిరగలేదు. ద్విచక్ర వాహనాల రాకపోకలు సైతం గణనీయంగా తగ్గాయి. వామపక్షాల ముందస్తు హెచ్చరికతో ప్రయాణీకులు సైతం ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచే వచ్చే బస్సులను గమ్యస్థానాలు చేరేందుకు అనుమతించారు. కొన్ని జాతీయ రహదారులపై లారీలు బారులు తీరి నిలిచాయి. హోరెత్తిన నిరసనలు.. బంద్ సందర్భంగా ఆందోళనకారులు రాష్ట్రంలో వినూత్న ప్రదర్శనలు, నిరసనలు చేపట్టారు. రోడ్లపై కబడ్డీ ఆడిన వారు కొందరైతే.. కర్రా బిళ్లా, క్రికెట్ ఆడిన వారు మరికొందరు. ఇంకొందరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సిందంతా చేస్తుందన్న హామీని ఎగతాళి చేస్తూ చెవుల్లో గులాబీ పూలు, చేతుల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్‌తో వినూత్న నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. విజయవాడలో కొందరు యువతీ యువకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపగా కర్నూలులో బంగి అనంతయ్య తదితరులు భిక్షాటన చేశారు. ఏలూరు, తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. విశాఖలో న్యాయవాదులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ ఎక్కడని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నరేంద్ర మోదీ డౌన్ డౌన్, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, బాబు, మోదీ జోడితో అన్యాయం అంటూ నినాదాలు చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విజయవాడలో వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంద్‌లో పాల్గొని నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకోలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బైక్ ర్యాలీని నిర్వహించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవాణి పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు కడపలో వామపక్ష, అఖిలపక్ష నేతలతోపాటు వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. పులివెందులలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల వద్ద నిరసన చేపట్టారు. కడప పార్లమెంటరీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డిల ఆ«ధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సారథ్యంలో ఆందోళనలు కొనసాగాయి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, పత్తికొండలో సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరులో సమన్వయకర్త ఎర్రకోట జగన్మోహన్రెడ్డి పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటు ఇన్చార్జి శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. గుంటూరులో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బంద్ నిర్వహించారు. విశాఖలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు బైటాయించి రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. మూతపడిన సంక్షేమ శాఖలు.. రాష్ట్ర బంద్ సందర్భంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ శాఖలు మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు సంక్షేమ శాఖల కార్యాలయాల వద్దకు వెళ్లి ఉద్యోగులను బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావుతో సహా ఉద్యోగులందరూ బయటకు వెళ్లారు. మైనార్టీ సంక్షేమ శాఖ, క్రిష్టియన్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు మూతపడ్డాయి. కార్యాలయాలు ఉదయం ప్రారంభమైనా ఆందోళన కారులు అక్కడికి వెళ్లగానే తాళాలు వేసి బయటకు వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్లకు ఉద్యోగులు మద్దతు పలికారు. కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే మద్దతు నిచ్చాయి. చాలా ప్రాంతాల్లో జర్నలిస్టులు బంద్‌కు మద్దతు పలుకుతూ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి నేతృత్వంలో కేవీపీఎస్, తుడుందెబ్బ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. గృహ నిర్బంధాలు, చిత్రీకరణలు.. బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించింది. పలు చోట్ల వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసింది. పలువుర్ని గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని ప్రాంతమైన అమరావతిలో సెక్షన్ 144ను, విశాఖ, తిరుపతి, అనంతపురం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాలలో సెక్షన్ 30ను విధించింది. ర్యాలీలు జరక్కుండా నిరోధించే ప్రయత్నం చేసింది. బలవంతంగా బస్సులు నడపాలని చూసిన అనంతపురం జిల్లాలో వామపక్షాల కార్యకర్తలు తిరగబడి బస్సు అద్దాలను పగులగొట్టారు. ఏలూరులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరిని, పలువురు వైఎస్సార్సీపీ, సీపీఐ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాలో అరెస్టయిన వారిలో రాజాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్ ఉన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతిలను శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క పోలీసులు తమ బాడీ కెమెరాలతో ర్యాలీలను చిత్రీకరించారు. ధర్మాగ్రహానికి తలొంచిన ప్రభుత్వం ఆంక్షలు, నిర్బంధాలతో బంద్‌ను ఆపాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ధర్మాగ్రహానికి తలొగ్గాల్సి వచ్చింది. రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ బంద్ జరుగుతుంటే జనం మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్లడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సందర్భంలో బంద్ జయప్రదం కావడం, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ముఖ్యమంత్రి ఫ్లేట్ ఫిరాయించి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆత్మగౌరవ పోరాటానికి ఆటంకాలు కల్పించవద్దంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. జనం సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామన్నారు. ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ర్యాలీలు జరపాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలను విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంబేడ్కర్ విగ్రహాల ఎదుట ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రదర్శనలు చేశాయి. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బంద్ జయప్రదమైందని, ప్రజావాణి ఢిల్లీకి చేరిందని, ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు లెఫ్ట్ పార్టీలు కృతజ్ఞతలు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు, రాజధానికి నిధులు వంటి అంశాల సాధనకు మున్ముందు కూడా కలిసి కట్టుగా పోరాటాలు చేద్దామని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేద్దామని పిలుపిచ్చాయి. ఆర్టీసీకి రూ.12.32 కోట్ల నష్టం బంద్ కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారు. సుమారు రూ.12.32 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రధాన నగరాలైన చెన్నై, బెంగుళూరుకు వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపేసింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను పోలీసులు ఆపివేశారు. కాగా, బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాల్లో లారీల ద్వారా సరుకు ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. అత్యవసర సరుకుల రవాణా మాత్రం కొనసాగింది. 693 మంది అరెస్ట్ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 693 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్టు డీజీపీ ఎం.మాలకొండయ్య గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు తప్ప పెద్ద ఘటనలు నమోదు కాలేదన్నారు. అమరావతి ప్రాంతం అంతా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. వెలగపూడి చెక్‌పోస్ట్ వద్ద నుంచి సచివాలయం రెండో ప్రవేశ ద్వారం వరకు ప్రత్యేక బలగాలు మోహరించాయి. హోదా పోరులో అందరినీ కలుపుకుపోతాం: జగన్ బంద్‌కు మద్దతుగా తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలగుంటపల్లి సమీపంలోని తన శిబిరం వద్ద విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. హోదా పోరులో అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో సీఎం విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీపీఎం నాయకుడు పి.మధు విజయవాడలో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలులో ప్రదర్శన నిర్వహించారు. కడపలో.. -
మార్చి1 నుంచి సినీ పరిశ్రమ బంద్
సాక్షి, చెన్నై: డిజిటల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేపడుతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లు, సినిమాల విడుదలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం మండలి సభ్యులు ప్రటించారు. కాగా, డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు మండిపడ్డారు. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చారు. -
మార్చి1నుంచి సినిమా థియేటర్లు బంద్..!
డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ మండిపడింది. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయమై దక్షిణాది రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్ల పెద్దలు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి. కిరణ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. మురళీ మోహన్, చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఎల్.సురేష్, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సియాద్ కొక్కర్‌లు ఈసమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్లు అన్యాయంగా చార్జీలు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తక్కువ ధరకే సేవలు అందించడానికి ముందుకు వస్తున్న డిజిటల్ ప్రొవైడర్లను సైతం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై మరో వారం రోజుల్లో రెండో సమావేశాన్ని నిర్వహించి ధరల తగ్గుదల, ఇతరత్రా విషయాలపై పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. ఒకవేళ కుదరని పక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మార్చి 1 నుండి థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
శ్రీనగర్‌లో ఆంక్షలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
శ్రీనగర్ : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు పౌరుల మరణించడంతో ఆదివారం అధికారులు ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో అధికారులు పలుచోట్ల ఆంక్షలు విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. శనివారం షోపియాన్ జిల్లాలోని గనోపోరా గ్రామంలో జరిగిన అల్లర్లలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ఎనిమిది మంది నిరసనకారులు గాయపడ్డారు. ఈ ఘటనపై రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విచారణకు ఆదేశించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ గిలానీ, మిర్విజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్‌లు ఆదివారం కాశ్మీర్ వ్యాలీ బంద్‌కు పిలుపునిచ్చారు. శ్రీనగర్‌లోని ఖనీర్, రైనీవారీ, నౌహాటా, ఎంఆర్ గుంజ్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిబంధనలు విధించారు. బారాముల్లా, బన్నిహాల్ పట్టణాల మధ్య రైల్వే సేవలను ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. గస్తీకి వెళ్లిన ఆర్మీ కాన్వాయ్‌పైకి 100 మందితో కూడిన నిరసన కారుల గుంపు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని రక్షణ శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. కాన్వాయ్‌లో 4 వాహనాలు ఉన్నాయని, నిరసనకారులు రాళ్లు విసురుతూ వాహనాలను చుట్టుముట్టి నిప్పుపెట్టడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే ఓ జూనియర్ ఆర్మీ అధికారి వద్ద నున్న ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో జావేద్ అహ్మద్ భట్(20), సోహైల్ జావిద్ లోనె(24) అనే ఇద్దరు మృతిచెందారని ఆయన తెలిపారు. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్: వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్
-
ప్రభుత్వం ఉక్కుపాదం - సడలని సంకల్పం
సాక్షి, కడప : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్సీపీ కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామునుంచే వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులను డిపోలు దాటి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళనల్లో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, ఆర్సీపీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే వైసీపీ నాయకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతి యుతంగా చేపట్టిన బంద్‌ను అణచివేయడానికి జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఎక్కడ పడితే అక్కడ బంద్‌లో పాల్గొన్నవారిని బలవంతంగా అరెస్టు చేశారు. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం నేతలు నారాయణ, ఆంజనేయులులు పోలీసులు నిర్భందించారు. కడపలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న యువజన విభౠగం రాష్ట్ర కార్యదర్శి పాకా సురేష్, విద్యార్థి నేత ఖాజా రహంతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టులపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా బంద్ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటుందని ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రానా ఉక్కుపోరాటం ఆగదని అంజాద్బాష, సురేష్‌బాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపుతో "కడప ఉక్కు- మాహక్కు" అంటూ పెద్దఎత్తున ప్రజలు, యువత బంద్‌లో పాల్గొన్నారు. రాయచోటిలో వైసీపీ నేతల అరెస్టు ఉక్కు కర్మాగారం కోసం తలపెట్టిన బంద్ రాయచోటిలో విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర బీసీ యువజన నాయకులు మదన్మోహన్ రెడ్డి, విజయభాస్కర్, ఇతర పార్టీల శ్రేణులు ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించారు. కడప ఉక్కు, రాయలసీమ హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో వద్దకు చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. బద్వేలులో విద్యాసంస్థల స్వచ్ఛంద మూసివేత : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలనుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూసివేశారు. యువత తమ భవిష్యత్తు బాగుండాలంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టితీరాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల, కలసపాడు మండల పార్టీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. -
ఉక్కుపై గళమెత్తిన అఖిలపక్షం
కడప కార్పొరేషన్ : విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈనెల 25న నిర్వహించే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ‘ఉక్కు సాధన ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని రకాల ఖనిజాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలంటే ఉక్కు పరిశ్రమ కావాలని దివంగత వైఎస్ఆర్ బ్రహ్మణి స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఉలుకూపలుకూ లేకుండా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ఒత్తిడి తెచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. మేధావి సమాఖ్య అధ్యక్షులు ఎం. వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలవాలని సూచించారు. న్యాయవాదుల తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు మస్తాన్‌వలీ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ కరస్పాండెంట్ల సంఘం నాయకులు జోగిరామిరెడ్డి, ఇలియాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బండి జకరయ్య, అవ్వారు మల్లికార్జున, దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సీఆర్వీ ప్రసాద్, బీఎస్పీ అధ్యక్షుడు సగిలి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు చొరవ తీసుకోవాలి ఈనెల 25న బంద్‌కు సంబంధించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అన్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిరోజూ రెండు గంటల పాటు వీధుల్లో ప్రదర్శనలు చేయాలని తెలిపారు. ముందే విద్యాసంస్థలను మూసేయకుండా, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తర్వాత బంద్‌లో పాల్గొనే విధంగా చేయాలని సూచించారు. మద్దతు ఉపసంహరించవచ్చు కదా! కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు కమిటీలు వేయడం కాలయాపన చేసేందుకేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సీఎం చెప్పడం సరికాదని, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే సరిపోతుందన్నారు. రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయాం–సీహెచ్ రాయలసీమ ప్రజలు రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయారని రాయలసీమ, కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ ఎందుకు నిర్వహిస్తున్నది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని, ఎన్జీఓ నాయకులను కలసి ప్రభుత్వ కార్యాలయాలు మూయించాలన్నారు. ఓటుకు కోట్లు కేసువల్లే గట్టిగా నిలదీయలేని పరిస్థితి– ఎమ్మెల్యే ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కడప ఉక్కు పరిశ్రమ గూర్చి కేంద్రాన్ని అడగకపోవడం దారుణమని తెలిపారు. -
భగ్గుమన్న మహారాష్ట్ర
సాక్షి, ముంబై: భీమా కోరేగావ్ బంద్ మహారాష్ట్రలో ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలావుండగా థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. ప్రస్తుతం పూణేలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. పూణెలో అందోళనకారులు బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను నిలవరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూణే అడిషనల్ కమిషనర్ రవీంద్ర సెంగోన్కర్ తెలిపారు. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణిచారు. దీంతో మంగళవారం రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. హింసాత్మక ఘటనలను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. అంబేద్కర్ మనవుడు ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది. థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. దీంతో యథావిధంగా రైళ్లు నడుస్తున్నాయి. థానేలో గురువారం అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ముంబై నగరంలో బస్సులు, ఆటోలు, ప్రయివేట్ క్యాబ్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బాంబే ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మాత్రం పాక్షికంగా తిరుగుతున్నాయి. దళితలు బలంగా ఉన్న బీడ్, లాతూర్, షోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో బుధవారం సున్నితమైన ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు నిలిపేశారు. రాజ్యసభలో వాడివేడి చర్చ భీమా కోరేగావ్ ఘటనపై రాజ్యసభలో బధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు బాధ్యులు మీరంటే.. మీరని సభ్యులు అరుచుకున్నారు. దీంతో సభ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. జీరో అవర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సభలో పరిస్థితి ఇలాగే ఉండడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ ప్రసారాలను నిలిపేశారు. -
రాళ్లు.. కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థి సంఘాలు
-
రణరంగంగా ‘శాతవాహన’
శాతవాహన యూనివర్సిటీ : కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. సోమవారం పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్ప రం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇరుసంఘాల నేతలు నినాదాలు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. భరతమాత చిత్రపటాన్ని దహనం చేస్తున్నారన్న సమాచారం మేరకు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు రావటంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బీజేపీ నాయకులతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. నాలుగు గంటలపాటు వర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన సీపీ కమలాసన్‌రెడ్డి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీపీ అనుమతించలేదు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవం తంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు సహకరించాలని సీపీ కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. వర్సిటీ బంద్: ఎం.కోమల్‌రెడ్డి, రిజిస్ట్రార్ గొడవల నేపథ్యంలో వర్సిటీని నిరవధికంగా బంద్ చేసినట్లు రిజిస్టార్ ఎం. కోమల్‌రెడ్డి ప్రకటించారు. ఎంబీఏ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. వర్సిటీ సైన్స్, ఆర్ట్స్, ఫార్మసీ కళాశాలలతో పాటు సంబంధిత మెస్‌లు, çహాస్టళ్లు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వర్సిటీలో శాంతిని నెలకొల్పాలని కోరారు. జనవరి 2న జరగనున్న పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ల పరీక్షలపై ఈ నెల 27న ప్రకటిస్తామని తెలిపారు. దాడులకు నిరసనగా రేపు బంద్ దాడులకు నిరసనగా బుధవారం (27న) విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సం ఘాలు పిలుపునిచ్చాయి. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. 27న జరుగనున్న బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. వర్సిటీలో శాంతియుతంగా కార్యక్రమం చేపడుతుంటే బీజేపీ నేతలు వచ్చి ఆటకం కల్పించడంతో పాటు గొడవలకు కారణమయ్యారని ఆరోపించారు. విచారణకు ఆదేశించాం విద్యార్థులు అల్లర్లకు పాల్పడితే వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుంది. వర్సిటీ ఘటనపై గురించి విచారణకు ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలగా లను ఏర్పాటు చేశాం. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడుల గురించి యూనివర్సిటీ అధికారులతో సమీక్షించి తెలుసుకున్నాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ వామపక్ష విద్యార్థి సంఘాలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోం దని పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. విద్యార్థులపై ఏబీవీపీ దాడులను నిరసిస్తూ సీపీఐ కార్యాలయంలో ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. మనుధర్మశాస్త్ర దిష్టిబొమ్మను శాంతియుతంగా దహనం చేసేందుకు యత్నిస్తున్న వామపక్ష, బహుజన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులు హేయమైనచర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. కాగా, 27న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాడులను ఖండించాలని కోరారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలి బీజేపీ నేతలు బండి సంజయ్, కొత్త శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అల్లర్లకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సూరేపెల్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. వర్సిటీలో దేశభక్తి, మంచి నడవడిక నేర్పాల్సిన ప్రొఫెసర్లు విద్యార్థులను చెడుమార్గంలోకి మళ్లీస్తూ గొడవలకు కారకులవుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ సుజాత విద్యార్థులను రెచ్చగొట్టి భరతమాత చిత్రపటాలను దహనం చేసేందుకు ప్రేరేపించడం వల్లే సంఘటన జరిగిందని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ఎంపీ కవిత తీరుకు నిరసనగా మెట్పల్లి బంద్
సాక్షి, మెట్పల్లి : తమ పట్ల ఎంపీ కవిత అవమానకరంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి బంద్‌కు చెరకు రైతులు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని కోరుతూ ఎంపీకు వినతిపత్రం ఇవ్వడానికి యత్నిస్తే పట్టించుకోలేదని చెరకు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు హెచ్‌సీయూ బంద్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్‌పై మళ్లీ అగ్గి రాజుకుంది. విద్యార్థుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా ఐదు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో హెచ్‌సీయూ విద్యార్థి సంఘం మంగళవారం యూనివర్సిటీ బంద్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల సస్పెన్షన్‌కు యాజమాన్యం కక్షపూరిత వైఖరే కారణమని, దీనికి నిరసనగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించాలని కోరింది. వైస్ చాన్స్‌లర్ అప్పారావు కక్షపూరిత వైఖరి విద్యార్థుల భవిష్యత్‌ను బలితీసుకుంటున్నదని ఆరోపించింది. సోమవారం యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడారు. వార్డెన్లు తాగి వచ్చి అనవసర రాద్ధాంతం చేయగా తమను సస్పెండ్ చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. వార్డెన్లపై దాడి జరిగితే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే బేషరతుగా సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థి సంఘం కార్యదర్శి ఆరిఫ్ అహ్మద్, నాయకులు బషీర్, భాస్కర్ డిమాండ్ చేశారు. ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న మగాళ్లందర్నీ మీ అమ్మాయిల హాస్టల్‌కి రానిస్తేనన్నా మీరు సంతృప్తి చెందుతారా’అంటూ ఓ వార్డెన్ నాతో అసభ్య ప్రేలాపన చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపే. దీనిని యాజమాన్యం నిలదీయకపోగా, రోహిత్ ఉద్యమంలో చురుకుగా ఉన్న 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. – అథిర ఉన్ని, విద్యార్థిని ప్రొక్టోరల్ కమిటీని ఎందుకు మినహాయించారు? ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్చేయడంలో ఉద్దేశం విద్యార్థులను భయపెట్టడమే. రోహిత్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారినే టార్గెట్ చేశారు. ప్రొక్టోరల్ కమిటీ క్యాంపస్‌లో ఉన్నతమైన కమిటీ, మరి దాన్నెందుకు విస్మరించారు. వీసీ అప్పారావు వైఖరికి టీడీపీ రాజకీయ అండదండలే కారణం. - మున్నా, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్డెన్లను దుర్భాషలాడింది ఎవరు? పది మందిపై వేటు వేశారు. వారినెలా గుర్తించారో తెలియదు. వారిలో ఎవరెవరు ఏం నేరం చేశారని కానీ, ఏం జరిగిందని కానీ రిపోర్టు ఇవ్వలేదు. మరి కమిటీ ఎందుకు వేసినట్టు..? - వెంకటేష్ చౌహాన్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇక్కడ ప్రశ్నించడమే నేరం.. ఆరోజు జరిగింది భౌతిక దాడి కాదు. కేవలం వాగ్వాదం. లైట్స్ ఆర్పి దాడికి దిగారనడం ఒఠ్ఠి అబద్ధం. తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇదంతా చేస్తున్నారు. రోహిత్ ఉద్యమంలో ఉన్నందుకే ఇదంతా. ఇక్కడ ప్రశ్నించడమే నేరమైంది. - సాయి యామర్తి, సస్పెండైన విద్యార్థి -
ఖమ్మం బంద్‌కు మిశ్రమ స్పందన
-
విద్యాసంస్థలు బంద్ : ఏబీవీపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అఖిల భారత విద్యా పరిషత్(ఏబీవీపీ) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా నిలుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. బ్రాండ్ పేరుతో వందల కోట్ల వ్యాపారం చేస్తున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో వందల మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నా ఒక్క అరెస్టు కూడా జరగలేదని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నారాయణ, చైతన్య కాలేజీల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బంద్ కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ కాలేజీలు మూతపడ్డాయి. కడపలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం బైక్ ర్యాలీ నిర్వహించింది. కోటిరెడ్డి సర్కింల్, అంబేడ్కర్ సర్కిల్‌లలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూలు ఆందోళన నిర్వహించాయి. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. బంద్ నేపథ్యంలో అనంతపురం నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థి నేతలు చేరుకోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. విజయవాడలోని బెంజ్‌సర్కిల్ వద్ద విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. కార్పొరేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ, అధికారులు పాల్గొననున్నారు. -
కార్పోరేట్ విద్యాసంస్థలపై YSRCP సమరశంఖం
-
కొనసాగుతున్న కామారెడ్డి బంద్
కామారెడ్డి: గణనాధుడి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్‌రోడ్‌లో గత ప్రధాన రహదారిపై వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలాది మందితో భారీర్యాలీ చేపట్టారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతలను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కేరళలో ప్రశాంతంగా సాగిన బంద్
-
కార్యకర్త హత్య, స్ట్రైక్‌కు పిలుపు
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరవనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. 34 ఏళ్ల రాజేశ్ శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి ఎడమ చేతిని నరికేశారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీఎం కార్యకర్తలే రాజేశ్‌పై దాడి చేశారని ఆరోపించింది. హత్యకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితమే కేరళలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్
హైదరాబాద్: విద్యారంగంలో తిష్టవేసిన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులకు ఉపకారవేతనాలు సకాలంలో చెల్లిచండంతో పాటు, ప్రైవేటు విద్యాసంస్థల దోపడీని అరికట్టాలంటూ అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. నగరంలోని నారాయణగూడలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రేపటి నుంచి వస్త్ర దుకాణాల బంద్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జీఎస్టీ విధింపునకు నిరసనగా శుక్రవారం నుంచి కర్నూలు నగరంలోని వస్త్ర దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర, శని, ఆది వారాల్లో నగరంలో వస్త్ర దుకాణాల బంద్ నిర్వహించనున్నట్లు కర్నూలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జి.ప్రసాద్, కె.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జీఎస్టీని ఉపసంహరించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసమే బంద్ పాటిస్తున్నామని, కార్యక్రమానికి నగరంలోని వస్త్ర వ్యాపారులంతా సహకరించాలని వారు ఆ ప్రకటనలో విజ్ఙప్తి చేశారు. -
డార్జిలింగ్‌లో చెలరేగిన హింస
► పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి! ► పోలీస్ అవుట్‌పోస్టు, రైల్వే స్టేషన్‌కు నిప్పు డార్జిలింగ్/కోల్‌కతాæ: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో గత 24 రోజులుగా జరుగుతున్న బంద్ శనివారం హింసాత్మకంగా మారింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఆర్మీ బలగాలను వీధుల్లో మోహరించింది. పోలీసులు శుక్రవారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం కార్యకర్తలు మరణించారని పార్టీ నేతలు ఆరోపించారు. అందుకు ప్రతీకారంగా కార్యకర్తలు శనివారం ఓ పోలీస్ ఔట్‌పోస్ట్, టాయ్ ట్రైన్ స్టేషన్‌ను తగులబెట్టడంతోపాటు పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఉద్యమ పార్టీలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనీ, ముందు వారు హింసను విడనాడాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు.అయితే ఇక మమతతో తాము మాట్లాడేదేమీ ఉండదనీ, కేంద్రం చర్చలకు పిలిస్తే వెళ్తామని జీజేఎం ఒక ప్రకటనలో తెలిపింది. గతనెలలోనూ పోలీసుల కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు చనిపోవడం తెలిసిందే. ముగ్గురు కార్యకర్తలు చనిపోతే ఒక్కరే అని చెబుతున్నారని అప్పట్లో జీజేఎం ఆరోపించింది. బదురియా అల్లర్లపై న్యాయ విచారణ బదురియా, బసీర్హాట్లో మత ఘర్షణలపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ మహిళా ఎంపీ రూపా గంగూలీ మహమ్మద్ ప్రవక్తపై పెట్టిన వివాదాస్పద ఫేస్బుక్ పోస్టు కారణంగా ఈ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ పోస్టుతో ఆగ్రహించిన కొందరు ముస్లింలు బసీర్హాట్లో హిందువుల ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై జ్యుడీషియల్ కమిషన్ పూర్తిగా విచారణ చేపడుతుందని, నిష్పాక్షిక నివేదికను అందజేస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఘటనలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అలాగే తప్పుడు వీడియోలు ప్రసారం చేసినందుకు రెండు టీవీ చానళ్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రశాంతను దెబ్బతీయాలని బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. -
తమిళనాట సినీ థియేటర్ల బంద్ విరమణ
చెన్నై: తమిళనాడులో గత 4 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమి స్తున్నట్లు సినిమా థియేటర్ల సంఘం అధ్య క్షుడు అభిరామి రామనాథన్ గురువారం మీడియాకు తెలిపారు. సినీ థియేటర్ల యా జమాన్యం బంద్‌ను ప్రకటించిన నేపథ్యం లో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో గురు వారం రాష్ట్ర సీఎం పళనిస్వామి, మంత్రులు చర్చలు జరిపారు. పన్ను వ్యవహారంపై ప్రభుత్వం తరఫున 8 మంది, చిత్ర పరిశ్రమకు చెందిన ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అభిరామి తెలిపారు. -
గ్రామీణ బ్యాంకుల బంద్ నేడు
దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నేడు (శుక్రవారం) బంద్ కానున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. అన్ని స్థాయిలకు చెందిన 91,000 మంది శాశ్వత, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేస్తున్న బ్యాంకులకు సమానంగా పే స్కేలు, ప్రమోషన్, రిక్రూట్మెంట్ రూల్సు, పెన్షన్లు ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టాల్నది వీరి ప్రధాన డిమాండ్. దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 22,000 పైచిలుకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ఏటా ఇవి రూ.6 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. స్పాన్సర్ బ్యాంకుల ఉద్యోగులకు సమానంగా పే స్కేలు, విధులు ఉండాలన్న నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 1990లో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణకై జూలై 10న ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు తెలిపారు. -
షట్టర్ క్లోజ్!
శ్రీకాకుళం అర్బన్: వస్త్రాలపై వస్తు వినియోగ పన్ను 5 శాతం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. వస్త్ర వ్యాపారుల సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు మంగళవారం బంద్ పాటించారు. దీంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. బుధ, గురువారాల్లో కూడా వ్యాపారులు బంద్‌ను పాటించనున్నారు. దేశ వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి అమలుకానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వస్త్రంపై పూర్తిగా పన్నును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర వస్త్రవ్యాపార సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపింగ్‌మాల్స్, షాపులను మూసేశారు. జిల్లా వ్యాప్తంగా.. శ్రీకాకుళం నగరంతోపాటు నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పట్టణాల్లోని వస్త్రదుకాణాలు తెరుచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా వస్త్ర దుకాణాల్లో సుమారు కోటిన్నర రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు జిల్లా వస్త్ర వ్యాపార సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. వస్తవానికి తొలుత నాలుగు రోజులు బంద్ నిర్వహించాలని నిర్ణయించిన వస్త్రవ్యాపార సంఘ ప్రతినిధులు సోమవారం రాత్రి సమావేశమై మూడు రోజులు చేయాలని నిర్ణయించుకున్నారు. వస్త్ర దుకాణాలను మూసివేయడంతో కొంతమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డాయి. అయితే తొలిరోజు బంద్ విజయవంతమైంది. వస్త్రాలపై విధించిన పన్నును ఎత్తివేయాలి వస్త్రాలపై విధించిన 5 శాతం పన్నును ఎత్తివేయాలని వస్త్రవ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోణార్క్ శ్రీను డిమాండ్ చేశారు. చిన్నబజారు రోడ్డులోని వస్త్రవ్యాపారుల సంఘ కార్యాలయంలో మంగళవారం వస్త్రవ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వస్త్రవ్యాపారులంతా జీఎస్టీను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీన ఒకరోజు బంద్ పాటించామన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మూడు రోజులపాటు బంద్ చేస్తున్మాన్నారు. ఇచ్ఛాపురం నుంచి గ్రామస్థాయిలో వ్యాపారులంతా బంద్‌లో పాల్గొన్నారన్నారు. స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకూ వస్త్రాలపై పన్ను లేదని, ఇపుడు కొత్తగా అమలు కానున్న జీఎస్టీలో 5 శాతం విధించడం దారుణమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వస్త్రాలపై పన్ను విధిస్తే వస్త్రవ్యాపారులంతా దీటుగా ఎదుర్కొని ఉద్యమించి పన్నును ఎత్తివేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చామన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికశాతం వస్త్రవ్యాపారమేనన్నారు. దీనిపై పన్ను విధించడం దారుణమన్నారు. వస్త్రవ్యాపారుల సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులతో బుధవారం సమావేశాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కల్యాణమండపంలో ఏర్పాటు చేయనున్నామని, అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తామని.. అనంతరం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ ర్యాలీలో వస్త్రవ్యాపారులు, షాపులు, దుకాణాల్లో పనిచేసే కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధి అంధవరపు రఘు మాట్లాడుతూ వ్యాపారులంతా ఐకమత్యంగా ఉండి పోరాడితేనే సమస్యను సాధించుకోగలమన్నారు. సమావేశంలో వస్త్రవ్యాపారుల సంఘ ప్రతినిధులు బరాటం చంద్రశేఖర్, శిల్లా వేణుగోపాల్, శిల్లా కాళి, డి.సతీష్, మావూరి శ్రీనివాసరావు, లక్ష్మణ్, గుడ్ల శ్రీను, బి.ముత్యాలరావు, బరాటం మురళి, బరాటం నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వస్త్ర వ్యాపారం బంద్
నిలిచిన రూ.5 కోట్ల మేర వ్యాపారం మరో మూడు రోజుల పాటు మూత రాజమహేంద్రవరం సిటీ : వస్తు,సేవల పన్ను చట్టం నుంచి వస్త్ర వ్యాపారాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోల్‌సేల్, రిటైల్ వస్త్ర వ్యాపారులు చేపట్టిన నాలుగు రోజుల బంద్ మంగళవారం ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో వస్తుసేవల పన్ను కలవడం వలన సామాన్యులు సైతం ఇబ్బంది పడే పరిస్ధితి ఏర్పడుతుందని తద్వారా వ్యాపారులపై అ«ధికారులు వత్తిడి లంచగొండి తనం ఎక్కువైపోతుందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నగరంలో మహాత్మాగాంధీ హోల్ సేల్ మార్కెట్లో 600 షాపులు, మెయిన్‌రోడ్లు 15 పెద్దషోరూమ్లు, మిగిలిన షాపులు వెరసి సుమారు 700 షాపుల వరకూ వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాయి. జీఎస్టీ ప్రమేయాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన నాలుగురోజుల పాటు వస్త్ర వ్యాపారాన్ని నిలుపుదల చేస్తూ బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి. ఈ బంద్‌తో మొదటి రోజు రూ.5 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు అవాంతరం ఏర్పడనుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వస్త్ర సమాఖ్య ఉపాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో జీఎస్టీ ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేంది లేదన్నారు. జీఎస్టీతో వస్త్ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వస్త్ర వ్యాపారులు పన్నులకు వ్యతిరేకం కాదని, కేవలం జీఎస్టీ ప్రవేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు 30వ తేదీ వరకూ వ్యాపారాలు బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వస్త్ర హోల్‌సేల్ వర్తకుల సంఘం అధ్యక్షులు బిళ్లా రాజు పేర్కోన్నారు. ఈ బంద్‌లో పలు వస్త్ర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు స్థానిక మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. -
30న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌ను పాటించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమన్యాలు సహకరించాలని కోరారు. శుక్రవారం కార్మిక, కర్షక భవన్లో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కమిటీ ఉపాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ..కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను పెట్టడంలేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి నిరసనగా బంద్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, శంకర్, ఆర్.శంకర్, అక్బర్, వీరేంద్ర, చంద్ర, ప్రకాష్, వెంకటేశ్, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు. -
బంద్ హింసాత్మకం
డార్జిలింగ్‌లో పోలీసులపైకి పెట్రోల్ బాంబులు విసిరిన ఆందోళనకారులు డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాల బంద్ నాలుగోరోజైన గురువారం హింసాత్మకంగా మారింది. ఓ మీడియా సంస్థకు చెందిన కారును ఆందోళనకారులు తగులబెట్టారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. కాల్పులు కూడా జరిపారని ఐజీ చెప్పారు. ప్రతిగా పోలీసులు కూడా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. బాష్పవాయువును ప్రయోగించారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు బిమల్ గురుంగ్‌కు చెందిన ప్రదేశాల్లో సోదాలు చేసిన పోలీసులు దాదాపు 300 దాకా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విల్లులు, బాణాలు, పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం మరో 400 మంది పారామిలిటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు పంపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) పార్టీ మంగళవారం పొత్తును తెంచుకుని జీజేఎంతో చేతులు కలపడం తెలిసిందే. డార్జిలింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అహ్లూవాలియాతోపాటుగా జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిని కాపాడాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ‘డార్జిలింగ్‌లోని ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. భారీ సంఖ్యలో పోలీసు దళాలను ఉపయోగించి మమ్మల్ని అణచివేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఆయుధాలన్నీ సంప్రదాయంగా మేం వాడుతున్నవి. ’ అని రోషన్ గిరి అన్నారు. హింసను అడ్డుకుంటాం: మమత డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో ఉద్యమం పేరుతో చెలరేగుతున్న హింసను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో అన్నారు. డార్జిలింగ్‌లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందనీ, ప్రజల పనులకు ఆటంకం కలిగించి రాజకీయాలు చేయాలని చూస్తే ఉపేక్షించబోమని జీజేఎంను ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. మమత మాట్లాడుతూ ‘పర్వతాల్లో ఒకప్పుడు శాంతి నెలకొని ఉండేది. కొందరు నాయకులు గూండాగిరీ చేస్తున్నారు. బాంబులు, తుపాకులతో ఎవరూ రాజకీయాలు చేయలేరు’ అని అన్నారు. -
నేడు వస్త్ర వ్యాపారుల బంద్
► వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మూతపడనున్న 10 వేల దుకాణాలు ► నిలిచిపోనున్న రూ.100 కోట్ల మేర లావాదేవీలు వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ) : కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై గూడ్స్, సర్వీస్ టాక్స్(జీఎస్టీ)కు వ్యతిరేకంగా గురువారం వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహించనున్నారు. వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా జీఎస్టీ సంఘర్షణ సమితి ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన వస్త్ర దుకాణాలను మూసివేసి బంద్ పాటించాలని నిర్ణయించారు. దానికి ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సుమారు పది వేల దుకాణాలు మూతపడనున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలో టెక్స్టైల్, రెడీమేడ్ దుకాణాలు మొత్తం ఐదు వేల వరకు ఉంటాయని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి దుకాణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మరో ఐదు వేల దుకాణాలు ఉన్నట్లు అంచనా. ఒకేసారి రెండు జిల్లాల్లో వస్త్ర దుకాణాలు మూసివేయడం వల్ల సుమారు రూ.100 కోట్ల వరకు లావాదేవీలు నిలిచిపోతాయని వ్యాపార సంఘ నాయకులు తెలిపారు. కేవలం రెండు మూడు శాతం లాభాలతోనే వస్త్రాలు విక్రయిస్తామని, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా లాభ శాతం తక్కువగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. జీఎస్టీ వల్ల 50 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని, వ్యాపారులతోపాటు కొనుగోలుదారులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేడు వస్త్ర వ్యాపారుల ప్రదర్శన వస్త్రాలపై జీఎస్టీని నిరసిస్తూ గురువారం వ్యాపారులు విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. వన్‌టౌన్ పంజా సెంటర్లోని కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ నుంచి వ్యాపారులు ప్రదర్శనగా బయలుదేరి వస్త్రలతకు చేరుకుంటారు. అక్కడ నుంచి నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీని కలిసి వినతిపత్రాలను అందజేస్తారు. ఏ మేరకు ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ నేతలు ఏర్పాట్లు చేశారు. -
రేపటి నుంచి రోజువారీ పెట్రోల్ ధరలు
బంద్‌పై వెనక్కు తగ్గిన పెట్రో డీలర్లు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం నుంచి రోజువారీగా సవరించనున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ధరలను ప్రతిరోజూ అర్ధరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో బంద్ చేయకూడదని నిర్ణయించామని పెట్రో డీలర్లు చెప్పారు. జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలని గతంలో చమురు సంస్థలు నిర్ణయించగా, దీనిని వ్యతిరేకిస్తూ బంద్ చేస్తామని డీలర్లు గతంలో ప్రకటించారు. ఈ అంశంపై పెట్రో డీలర్లు బుధవారం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో భేటీ అయ్యారు. ధరలను ఉదయం నుంచి మార్చేందుకు అవకాశం ఇవ్వాలని డీలర్లు కోరారు. మంత్రి ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. డీలర్లు బంద్‌ను ఉపసంహరించడంతో ముందుగా నిర్ణయించినట్లుగానే శుక్రవారం నుంచి ధరలను రోజువారీ సమీక్షిస్తామని ధర్మేంద్ర చెప్పారు. -
జిల్లా వ్యాప్తంగా హోటళ్ల బంద్
– నగరంలో ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు(టౌన్): హోటళ్ల రంగంపై పెంచిన జీఎస్టీని భారీగా తగ్గించాలని కర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా హోటళ్లను బంద్ చేశారు. హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కురాడి మురళీధర్ కల్కూర ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో తిరుగుతూ హోటళ్లను బంద్ చేయించారు. రెండు రోజులు ముందుగానే బంద్ సమాచారం ఉండటంతో పలువురు స్వచ్ఛందంగా హోటళ్లను మూసివేశారు. స్థానికంగా రాజ్‌విహార్ సెంటర్లో పుల్లారెడ్డి స్వీట్స్ షాపు తెరచి ఉంచడంతో వారితో మాట్లాడి మూయించారు. నగరంలో ర్యాలీ అనంతరం స్థానిక కలెక్టరేట్ ఎదుట అసోసియేషన్ నాయకులు ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు. ధర్నా నుద్దేశించి అసోసియేషన్ అధ్యక్షుడు మురళీధర్ కల్కూర మాట్లాడుతూ పెంచిన పన్నుతో హోటల్ రంగం కుదేలవుతుందన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా కర్నూలు నగరంలో హోటళ్లు పూర్తిగా బంద్ కావడంతో ప్రయాణికులు, పాదాచారులు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెస్‌లు సైతం మూత పడ్డాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు భోజనం దొరక్క అవస్థలు పడ్డారు. -
ప్రశాంతంగా బంద్
తాడితోట,(రాజమహేంద్రవరం) : కేంద్ర ప్రభుత్వం విధించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పన్ను విధానాన్ని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్ యాజమాన్యం పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్రం హోటళ్లపై ఐదు శాతం ఉన్న పన్నును 18 శాతానికి పెంచడాన్ని నిరసనగా రాష్ట్ర హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ, చిన్న తరహా హాటళ్లు మూసి వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోసూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు కె. దుర్గా ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, పి.సత్యనారాయణ, సూర్య నారాయణ రాజు, రాయుడు వెంకట స్వామి, ఆర్కే కుమార్, సుభాన్ దోనేపూడి సుమన్ తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టి పన్ను విధానాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పన్ను వల్ల వినియోగదారులపై పెనుభారం పడుతుందన్నారు. గతంలో మాదిరిగా ఐదు శాతం టాక్స్ కొనసాగించాలని ఆరు రాష్ట్రాల అసోసియేషన్లు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతి పత్రాలిచ్చారని తెలిపారు. జూన్ మూడో తేదీన జరిగిన జీఎస్టీ నిర్ధారణ కమిటీ చివరి సమావేశంలో హోటల్ రంగం, వినియోగదారుడిపై పడే ఈ అదనపు భారాన్ని కేంద్రం పరిశీలించాలని బంద్ పాటించామని అన్నారు. మధ్యతరగతి ఆదాయం అంతంత మాత్రంగా ఉండి కనీసం అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉన్న నేటి ధరల విధానానికి అదనంగా ఈ జీఎస్టీ తోడైతే మరింత ఆర్థిక భారం వినియోగదారుడి పై పడుతుందన్నారు. హోటల్ రంగంపై ఆధారపడి బతుకుతున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్ల బంద్‌తో జిల్లాలో కొన్ని చోట్ల ప్రజలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. మందుల వర్తకుల బంద్ ప్రశాంతం – జిల్లాలో రూ.కోటిపైనే వ్యాపార నష్టం కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసగా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాల్లో ఉదయం నుంచి మందుల వర్తకసంఘం నాయకులు హడావుడి కనిపించింది. అసోసియేషన్ అనుమతి ఇచ్చిన దుకాణాలు మినహా మిగతా మందులషాపులు, ఆయా దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలో మొత్తం 2500 మందుల దుకాణాలుండగా, వాటిలో సుమారు రెండు వేలకు పైగా మూతపడ్డాయి. దీంతో ఒక్కరోజులో సుమారు రూ.కోటి పైనే నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు సాధారణంగా తెరిచారు. అయితే ప్రజలు మందులు కొనుగోలులో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. జిల్లా ఔషధ నియంత్రణశాఖ ఏడీ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ సందర్బంగా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ జిల్లా అ«ధ్యక్షులు కొత్త చలపతిరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మందుల అమ్మకాలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయం అంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోడమేనన్నారు. -
జీఎస్టీ సెగ: 40వేల హోటల్స్ ‘బంద్’
-
జీఎస్టీ సెగ: 40వేల హోటల్స్ ‘బంద్’
హైదరాబాద్ : జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు కృషిచేస్తున్న జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) పన్ను రేటులపై నిరసనల సెగలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హోటళ్లు మూతబడే దశకు చేరుకుంటా యని ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్య శ్రేణి హోటళ్ల నుంచి వసూలు చేసే 18 శాతానికి వ్యతిరేకంగా దక్షిణాది రాషా్ట్రల హోటల్స్ అసోసియేషన్ బంద్‌కుపిలుపునిచ్చింది. దీనికి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ మద్దతు పలికి బంద్ లో పాల్గొంటోంది. దాదాపు 40 వేల హోటళ్ళు, రెస్టారెంట్లు మంగళవారం బంద్ పాటిస్తున్నాయి. అయితే స్టార్ హోటళ్లు బంద్‌కు మద్దతు ప్రకటించలేదు. హోటళ్లపై పెను భారం మోపే విధంగా ఉన్న జీఎస్టీ పన్ను రేటును తగ్గించి, స్టార్- నాన్‌స్టార్ హోటల్స్ ప్రాతిపదికన పన్ను రేటు నిర్ణయించాలని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. జీఎస్టీ వల్ల సామాన్యులతో పాటు, ఆతిథ్య రంగం పెనుప్రభావానికి గురవుతుందని తెలిపారు. ఈ మేరకు దక్షిణాది హోటల్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సంయుక్తంగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘జీఎస్టీ రేటు, హోటల్స్‌పై ప్రభావం’ అనే అంశంపై చర్చించారు. కేంద్ర నిర్ణయంతో తీవ్ర ప్రభావం పడుతున్నందునే హోటల్స్ బంద్‌కు మద్దతు ఇచ్చినట్టు వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇతర దేశాలు పన్ను రేట్లు తగ్గించి పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ మాత్రం పన్నులు పెంచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పునరాలోచించి హోటల్ రంగం చిన్నాభిన్నం కాకుండా కాపాడాలని కోరారు. హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సేవల రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న హోటల్స్ ప్రస్తుత జీఎస్టీని భరించలేవని, ఇదే కొనసాగిస్తే త్వరలో కుదేలవటం ఖాయమని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని సుమారు 2 లక్షల హోటళ్ల సిబ్బంది బంద్‌లో పాల్గొంటారని దక్షిణాది రాష్ట్రాల్లోల హోటళ్ల సంఘం ఉపాధ్యక్షుడు సోమరాజ్ తెలిపారు. మరోవైపు ఒకటే దేశం ఒకటే పన్ను లక్ష్యంగా కేంద్రం సర్కారు అమలు చేయనున్న జీసీటీ చట్టం ప్రకారం హోటల్స్ లో సర్వీస్ చార్జ్ తప్పనిసరికాదు. వినియోగదారులకు ఫుడ్ సర్వీస్ చేసినందుకు గాను వివిధ హోటల్ యాజమాన్యాలు ముక్కుపిండి సర్వీస్ చార్జ్ వసూలు చేసేవి. అయితే సర్వీస్ చార్జ్ తప్పని సరి కాదని, ఇది కస్టమర్ల ఇష్టంమీద ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం కార్యాచరణలోకి దిగింది. తూనికలు కొలతల శాఖకు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జిఎస్టి కౌన్సిల్ 12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్‌లను హోటళ్లలో, రెస్టారెంట్లలో నిర్ణయించింది. అయితే హోటళ్ళు, రెస్టారెంట్లు మాత్రం పరిశ్రమ పన్ను యూనిఫాంగా 5 శాతంగా ఉండాలని కోరుతున్నాయి. -
నేడు మెడికల్ షాపులు బంద్
-
నేడు మెడికల్‌షాపులు బంద్
కర్నూలు(హాస్పిటల్): ఆన్లైన్ ఈ-ఫార్మసీ వ్యాపారానికి వ్యతిరేకంగా డ్రగ్ యాక్ట్‌లో చేస్తున్న మార్పులకు నిరసనగా ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా మెడికల్షాప్ల బంద్ పాటిస్తున్నట్లు సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణారావు తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం కర్నూలులోని కెమిస్ట్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ ఈ-ఫార్మసీ అమలుతో ప్రస్తుత డ్రగ్స్, కాస్మోటిక్స్ యాక్ట్ 1940, రూల్స్ 1945కి వ్యతిరేకంగా చట్టబద్ధత, నాణ్యతలేని మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వైద్యుల పర్యవేక్షణలేని మందులు వాడటం వల్ల డ్రగ్ రియాక్షన్‌కు సంబంధించి దుష్ఫలితాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 30వతేదీ రాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 600 హోల్‌సేల్, 1470 రిటైల్ మెడికల్‌షాప్‌లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర మందుల కోసం ఫోన్( 9989766966, 9246472006, 9848024555)లో సంప్రదించాలన్నారు. విలేకరుల సమావేశంలో కర్నూలు జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి వై. పుల్లయ్య, కోశాధికారి ఎస్. మధుసూదన్‌గుప్త పాల్గొన్నారు. -
30న హోటళ్లు బంద్
కర్నూలు (టౌన్): దక్షిణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల హోటల్స్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్స్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 30వ తేదీ హోటళ్లను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ కల్కూర వెల్లడించారు. శనివారం స్థానిక ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎసీటీ (జనరల్ సేల్స్ టాక్సు) పేరుతో హోటల్ రంగంపై పన్ను భారీగా పెంచిందన్నారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి నాన్ ఏసీ రెస్టారెంట్‌కు 12 శాతం, ఏసీ రెస్టారెంట్‌కు 18 శాతం నిర్ణయించారన్నారు. దీంతో వినియోగదారులపై పెనుభారం పడుతుందన్నారు. ఇప్పటికే హోటల్ రంగంపై 5 శాతం విధించాలన్న డిమాండ్‌తో హోటల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ చైర్మన్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిలను కలిసి విన్నవించినట్లు చెప్పారు. ఫుడ్ సేఫ్టి యాక్ట్ సైతం హోటల్స్ యజమానులకు ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు హోటళ్లను బంద్ చేస్తున్నామని, ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విన్నవించారు. సమావేశంలో హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ తిరుపతిరెడ్డి, హనుమంతరావు, సుధాకర్, రామకృష్ణ, శ్రీధర్ పాల్గొన్నారు. -
సీమ బంద్ సక్సెస్
-
సీమ బంద్ సక్సెస్
– డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు – స్వచ్ఛందంగా వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల మూసివేత – శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకుల అరెస్టు – రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే సీఎంకు గుణపాఠం తప్పదని హెచ్చరిక కల్లూరు (రూరల్)/కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందంటూ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉదయం ఆరు గంటల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో నిరసనకారులు కదం తొక్కారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా ఆటోలు మధ్యాహ్నం వరకు రోడ్డుపైకెక్కలేదు. దీంతో ప్రయాణికులకు కాలినడక తప్పలేదు. వాణిజ్య సమూదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. చిరువ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బస్టాండ్ కేంద్రంగా నిరసనలు హోరు... ఉదయం ఆరు గంటల నుంచి బస్టాండ్ పరిసరాలు సీపీఎం, సీపీఐ నాయకులు నినాదాలతో హోరెత్తాయి. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, సీపీఐ నగర కమిటీ కార్యదర్శి రసూల్ ఆధ్వర్యంలో నిరసన కారులు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను కదలనివ్వలేదు. దుకాణాలను బంద్ చేయించి బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీలు నిర్వహించారు. పుర్రెలతో నిరసన... కర్నూలు చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నాయకులు వినూత్నంగా పుర్రెలతో నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రైతులకు చివరికి పుర్రెలే మిగిలాయని చెప్పారు. మరోవైపు చౌరస్తా నుంచి బస్టాండ్, రాజ్‌విహార్, పాతబస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. మరోవైపు ఉభయ కమ్యూనిస్టులు గుంపులు గుంపులుగా విడిపోయి నగరంలో బైక్ ర్యాలీలను నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించి సర్కారుపై తమ నిరసన తెలిపారు. ఆందోళనకారుల అరెస్టు... ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బస్టాండ్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రామకృష్ణ, గఫూర్‌తోపాటు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. బాబు రాజధాని జపం చేస్తున్నారు .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల పరిపాలన కాలంలో రాజధాని అమరావతి జపం చేస్తూ రాయలసీమను తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం కేంద్ర కమిటీసభ్యుడు ఎంఏగఫూర్ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. వరుస కరువుల నుంచి జిల్లాను గట్టెక్కించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక రైతులు, కూలీలు వలస బాట పటా్టరని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేసిన ప్రభుత్వం జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
రాయలసీమ బంద్ : నిలిచిన ఆర్టీసీ బస్సులు
-
కొనసాగుతున్న కర్నూలు జిల్లా బంద్
కర్నూలు: అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం జిల్లాలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతోంది. బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. -
నేడు జిల్లా బంద్
– పిలుపునిచ్చిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ – అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా బంద్ – అంత్యక్రియల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రోజురోజుకీ అధికార పార్టీ హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేవలం హత్యారాజకీయాలతో అధికారం చెలాయిద్దామంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. ఇందుకు అధికారులు వంత పాడటం సమంజసం కాదని హితవు పలికారు. కర్నూలు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, మేధావులకు పిలుపునిచ్చారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అంత్యక్రియలకు జగన్ రాక చెరకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అధికార పార్టీ హత్యారాజకీయాలపై గవర్నర్‌కు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కర్నూలుకు బయలుదేరి చెరకులపాడులో జరిగే నారాయణ రెడ్డి అంతక్రియల్లో పాల్గొంటారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెరకులపాడు నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని తెలిపారు. సోమవారం ఉదయం నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. అనంతరం ఆయన మృతదేహాన్ని సొంత గ్రామం చెరకులపాడుకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ధవళేశ్వరం బంద్ విజయవంతం
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : ఏకపక్షంగా ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్ కారణంగా గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. తొలుత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. ఆకుల వీర్రాజు ఇరిగేషన్ కార్యాలయాలకు వెళ్లి బంద్‌కు సంఘీభావం తెలపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ కార్యాలయాల బంద్ కారణంగా వరుసగా రెండో రోజు కూడా మూతపడ్డట్టు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు మాట్లాడుతూ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. అమలాపురం వెళ్లాలంటే వంద కిలోమీటర్లు పైబడి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాన్ని మార్చడం పలు అనుమానాలకు బలం చేకూరుతుందన్నారు. వాస్తవ పరిస్థితులు చూడకుండా కార్యాలయ మార్పునకు అధికారులు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం ఇరిగేషన్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. ధవళేశ్వరంలోనే సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ఉంచాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ కార్పొరేటర్ మింది నాగేంద్ర, మాజీ ఎంపీటీసీ సాధనాల చంద్రశేఖర్(శివ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఏజీఆర్ నాయుడు, షట్టర్ భాషా, బర్రి కామేశ్వరరావు, రామరాజు, మోహన్‌బాబు, గపూర్, సత్యం వెంకటరమణ, ముత్యాల జాన్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమళ్ల ఆంజనేయులు, బోడపాటి సత్యనారాయణ, బోడపాటి మూర్తి, బొబ్బిలి భాస్కరరావు, అయితిరెడ్డి అయ్యప్ప పాల్గొన్నారు. కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం : సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి తరలించి కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదన్నారు. వందేళ్ల క్రితం కాటన్ నెలకొల్పిన కార్యాలయాలను వేరేచోటకు తరలించి ఆయన అపార అనుభవాన్ని అవమానించవద్దని జక్కంపూడి విజయలక్ష్మీ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగింది కోనసీమలోనే అన్నారు. రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టకుండా ఉన్న వాటిని తూట్లు పొడవడం దారుణమన్నారు. సెంట్రల్ డివిజన్ ఈఈ కోనసీమలోని డెల్టా రైతాంగానికి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. అటు డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. కనీసం కార్యాలయ సిబ్బందికి కూడా తెలయకుండా కార్యాలయ మార్పుకు ప్రయత్నించడం ఏమిటని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరు ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏ విధమైన జీవో రానప్పటికీ 1988 నాటి జీవోను తెరమీదకు తీసుకురావడం వెనుక ఇరిగేషన్ అధికారలు అత్యుత్సాహం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం రైతులను ,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయవద్దని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. -
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
-
నేడు పెట్రోలు బంక్‌లు పనిచేస్తాయి
కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో ఉన్న పెట్రోలు బంకులు పనిచేస్తాయని కర్నూలు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఇస్తున్న కమీషన్ మార్జిన్ తమకు పెంచాలనే డిమాండ్‌తో ఆదివారం బంకుల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీన అన్ని బంకులు రోజులాగే పనిచేస్తాయని అసోసియేషన్ ప్రకటించింది. -
సమస్యలు పరిష్కరించకపోతే ‘రేషన్’ బంద్
డీలర్ల సంఘం అల్టిమేటం పరకాల: రేషన్డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ.30 వేల చొప్పున వేతనమివ్వాలని.. దీనిపై 2 నెలల్లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలోని అన్ని షాపులను బంద్ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండ లం కోనాయమాకుల వద్ద మంగళవారం రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సభ జరి గింది. సభలో సంఘం రాష్ట్ర అధ్య క్షుడు బత్తుల రమేశ్‌బాబు మాట్లాడుతూ మంత్రి ఈటల హామీలు కూడా నెరవేరకపోవడంతోనే రేషన్‌షాపుల బంద్‌ను నిర్ణయించి నట్లు చెప్పారు. రేషన్ డీలర్లు అందరూ 27న హన్మకొండలో జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తరలిరావాలన్నారు. -
మార్చి 30న లారీల బంద్
- పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా ఈ కార్యక్రమం - సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా మార్చి 30వ తేదీన దక్షిణ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ కార్మికులకు పిలుపునిచ్చారు.ఆదివారం కేకే భవన్లో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రైవేట్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గఫూర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న ఇచ్చిన 894 ఉత్తర్వుల ద్వారా రవాణా రంగంలో ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, లేటు చలానా ఫీజులు రోజుకు రూ.50 చొప్పున 500 రెట్లకుపైగా పెంచిందన్నారు. అంతటితో ఆగక 2017 మార్చి 3వ తేదీన మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం పెంచుతూ ఐఆర్డీఏ ద్వారా ప్రతిపాదన పెట్టిందన్నారు. ఈ రెండు నిర్ణయాలు రవాణా రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉందన్నారు. వెంటనే చలానా ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముజఫర్, చిత్తూరు జిల్లా నాయకుడు గంగాధర్, నెల్లూరు జిల్లా నాయకుడు «శ్రీనివాసులు, కర్నూలు నాయకులు పుల్లారెడ్డి, సుబ్బారాయుడు, ఆటో యూనియన్ నాయకులు బి.రాధాకృష్ణా, ప్రభాకర్ పాల్గొన్నారు. 26కేఎన్ఎల్39 : సమావేశంలో మాట్లాడుతున్న గఫూర్ -
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సోమవారం బంద్ పాటిస్తున్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ.. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని కాలేలు బంద్‌లో పాల్గొంటున్నాయి.