
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చేస్తున్న ఉద్యమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న జరిగిన రాష్ట్రబంద్‌ను కూడా విజయవంతం కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పోలీసులతో అరెస్టులు చేయించారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే.. హోదా తాకట్టు పెట్టి చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేశారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు చంద్రబాబు తహతహ లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment