సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్‌లో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌లు తేటతెల్లం చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు సురేష్‌బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్‌లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు.
విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్‌కే సాధ్యం..
విభజన హామీలు సాధించడం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్‌సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment