srikanth reddy
-
YSRCP కార్యకర్త శ్రీకాంత్ రెడ్డిపై రాళ్లు, రాడ్లతో దాడి
-
ఇంద్రుడు, చంద్రుడు అంటూ కట్టుకథలు
-
చంద్రబాబు శ్వేత పత్రాలపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
తిరుపతి ఎస్వీయూలో టీడీపీ నేతల వీరంగం
-
నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్
-
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు. టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్‌లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్‌రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి కోరారు. 2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని 2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్‌గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా?
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..
కామారెడ్డి: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై రాజారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన అల్లి శ్రీకాంత్‌రెడ్డి(35) కొన్నేళ్లుగా కామారెడ్డిలో కార్ డెకార్స్ నడుపుతూ హౌజింగ్ బోర్డు కాలనీలో భార్య, పిల్లలతో నివాసముంటున్నాడు. ఆయన ఇద్దరు మిత్రులతో కలిసి తన కారులో ఫరీదుపేటలో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరై కామారెడ్డి వెళ్తున్నాడు. ఆరేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్య రేఖ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
Maa Awara Zindagi Movie: ‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ
టైటిల్: మా ఆవారా జిందగీ నటీనటులు: బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు నిర్మాణసంస్థ: విభా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి దర్శకుడు:దేపా శ్రీకాంత్ రెడ్డి సంగీతం-ప్రతీక్ నాగ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి ఎడిటర్: సాయిబాబు తలారి విడుదల తేది: జూన్ 23, 2023 ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే? భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ (ఎల్బీ), జస్వంత్ (లంబు) నలుగురు కుర్రాళ్లు పనీపాట లేకుండా ఖాళీగా, అవారాగా తిరుగుతుంటారు. ఎప్పుడూ తాగడం, జల్సాలు చేయడమే వీరి పని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షియాజీ షిండే) ప్రతీ సారి వీరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. ఎస్సై కూతురు కిడ్నాప్‌కు గురవుతుంది. కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్‌లో ఆ నలుగురి ప్రమేయం ఉందా? చివరకు ఆ నలుగురు చేసిన పనులేంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే?.. శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు అల్లరి చిల్లరగా కనిపించే యువకుల పాత్రలో చక్కగా నటించారు. వీరు నలుగురు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హీరోయిజాలు చూపిస్తూ తెగ యాక్షన్ సీక్వెన్సులు చూపించే కారెక్టర్లు కాకపోవడంతో మరింత ఈజీగా నటించేశారు. ఆ నలుగురి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగానే ఉంది. అయితే ఆ పాత్రకు డబ్బింగ్ మాత్రం అంతగా సూట్ అయినట్టు కనిపించదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఎలా ఉందంటే? ఈ మధ్య కామెడీ అడల్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ తీస్తోన్న ఈ సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలకు కొదవే లేకుండాపోతోంది. ఓటీటీలో అడల్ట్ జానర్లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆవారా జిందగీ అటువంటి జానర్లోకే వస్తుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది. తినడం,తిరగడం, తాగడం అనే సీన్లతోనే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి కాస్త కథనం మారుతుంది. చేజింగ్ సీన్లు, అడల్ట్ సీన్లు ఎక్కువగా వస్తుంటాయి. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగా కాకుండా రియాల్టీకి దగ్గరగా ఉండేలా చేశాడు. అక్కడే దర్శకుడి టేస్ట్ కనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ నాచురల్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ సహజంగానే వచ్చినట్టుగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బూతు డైలాగ్‌లకు బీప్ సౌండ్లు పడ్డాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం నిర్వీర్యం అయిపోయింది : శ్రీకాంత్ రెడ్డి
-
ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?
'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. (చదవండి: First Day First Show Trailer: ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ చూశారా?) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో ప్రధానంగా పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపైనే కథను రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలు పెంచినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. Relive the nostalgia of cinema and celebration 🎥 #FirstDayFirstShow will be streaming on @ahavideoIN from Sept 23rd.#FirstDayFirstShowOnAHA #FDFS @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty @anudeepfilm @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms pic.twitter.com/dtbNM2A6FO — Srija Entertainments (@SrijaEnt) September 14, 2022 -
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డా: అనుదీప్
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ కథని చెబుతున్నాం. ► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. మహేశ్‌బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. ► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. ► ఈ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది. ► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. ► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. ► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది. ► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు ఉంటాయి. సినిమా అంటే క్రేజీ ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది. ► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. ► శివకార్తికేయన్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా ఉంటుంది. ► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్ గారితోనే ఉంటుంది. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్‌బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్‌రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్‌ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్‌రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్‌పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్‌రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మానవత్వం కడప సొంతం.. ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు. దిక్కుతోచకే బాబు విమర్శలు.. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
సీఎంను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి
తిరుపతి క్రైం: ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మానవ బాంబై చంపేస్తానని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైలం శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ ఇన్చార్జి వళిగల మోహన్ ఈస్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో బిజినెస్‌మ్యాన్ అనే అకౌంట్లో కన్నాబాయి యూజర్ ఐడీ ఫేక్ అకౌంట్ నుంచి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎంపీ గురుమూర్తి ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్టు వారు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివేకా హత్యకేసుపై ఎల్లో మీడియా అబద్దాలు ప్రచారం చేస్తోంది
-
అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరం
-
ఏ పీ కి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోంది
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
సాక్షి, వైఎస్ఆర్ కడప: ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే టీడీపీ నేతలు విమర్శించడం దారుణమని వాపోయారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే బాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని, తన అనుకూల మీడియాతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 3 బ్యారేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బ్యారేజీల ఏర్పాటుతో సముద్రంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, రాయలసీమ లిఫ్ట్ ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
తిరుపతిలో హత్యకు గురైన భువనేశ్వరి దీనగాథ
తిరుపతి క్రైం: ఆమె జీవితమంతా కష్టాలూ.. కన్నీళ్లే అలముకున్నాయి. అందరూ ఉన్నా కొన్నాళ్లు అనాథగా మారింది. సరైనా ఆలనా, పాలనా లేకపోయినా కష్టపడి చదువుకుంది. చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదురైనా తట్టుకుని నిలబడింది. ఉద్యోగమొచ్చాక ప్రేమ పేరుతో మోసపోయింది. ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా మునిపంటి కింద అదిమిపెట్టి జీవితాన్ని సాగిస్తుంటే.. చివరకు కట్టుకున్నవాడే కాలయముడై ఆమె జీవితాన్ని అంతమొందించాడు. తిరుపతిలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి దీనగాథ ఇది. భువనేశ్వరిని ఆమె భర్త మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఉదంతం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అడుగడుగునా ఆమె ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. భువనేశ్వరి నేపథ్యమిదీ.. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సరోజమ్మ, మునివెంకటప్ప దంపతుల ఐదో కుమార్తె భువనేశ్వరి. ఆ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా.. వారిలో ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలే. కూలి పనులు చేసే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భువనేశ్వరి చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉంటూ చదువులో బాగా రాణించింది. ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే భువనేశ్వరి జీవితానికి సరిపడా సమస్య ఎదుర్కొంది. అప్పట్లో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. ఎక్కడకు తీసుకెళ్లాడో తెలియదు. దాదాపు రెండేళ్లపాటు ఆమెను లైంగికంగా వేధించి.. చివరకు గ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆ దుర్మార్గాన్ని తల్లిదండ్రులు గానీ, గ్రామస్తులు గానీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మౌనంగానే భరించిన భువనేశ్వరి చదువుపైనే దృష్టిపెట్టి మంచి మార్కులతో టెన్త్ పాసైంది. ఆ తరువాత పై చదువులు కూడా చదివింది. ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భువనేశ్వరి జీవితంలో మరో సమస్య మొదలైంది. ఈ సారి ప్రేమ పేరుతో ఆమె జీవితంలో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన క్రూరత్వాన్ని బయటపెట్టి ఆమె నుంచి డబ్బు గుంజుకునే పని మొదలు పెట్టాడు. దీంతో భువనేశ్వరి అతన్ని దూరం పెట్టింది. ఉద్యమం ముసుగులోనూ వంచనే ప్రేమ పేరిట మోసపోయిన భువనేశ్వరి మగవాళ్లంతా ఇంతేనా? అని తనను తాను ప్రశ్నించుకుంది. తనను మోసం చేసిన వ్యక్తి గురించి లోకానికి చాటుతూ.. తనలాంటి వారికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని నడిపింది. ఆ సమయంలో ఎంతోమంది భువనేశ్వరికి అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. ఏ ఇబ్బంది ఉన్నా తాము సహకరిస్తామన్నారు. అదిగో.. అదే సమయంలో ఎంటరయ్యాడు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి. ఆమె చేపట్టిన ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటూ భువనేశ్వరికి సన్నిహితుడిగా మారాడు. మోటివేషన్ క్లాసులు చెబుతూ ఐఏఎస్, ఐపీఎస్‌ల దగ్గరకు సూటు, బూటు వేసుకుని తిరుగుతూ కన్పించే శ్రీకాంత్‌రెడ్డి విసిరిన వలలో పడింది భువనేశ్వరి. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డి నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. శ్రీకాంత్‌లోని మరో క్రూరుడిని ఆమె గుర్తించలేకపోయింది. డబ్బు కోసమే.. నిజానికి శ్రీకాంత్‌రెడ్డికి కావాల్సింది తన విలాసాలకు అవసరమైన డబ్బు మాత్రమేనని భువనేశ్వరి గ్రహించలేకపోయింది. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భువనేశ్వరికి నెలకు రూ.90 వేల జీతం వస్తుండటంతో ఆమెను చేసుకుంటే తన జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చన్నది శ్రీకాంత్‌రెడ్డి ప్లాన్. మూడేళ్ల క్రితం అతడిని వివాహం చేసుకున్న భువనేశ్వరి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సొంత ఇల్లు కూడా కొనుగోలు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్రెడ్డిలోని మోసగాడు బయటకొచ్చాడు. ఆమెకొచ్చే జీతాన్ని మింగేస్తూ.. ఎక్కడికక్కడ భారీగా అప్పులు చేయిస్తూ వచ్చాడు. భర్త బలవంతం చేయడంతో ఇటీవల తన బంధువుల వద్ద రూ.10 లక్షలు అప్పుతెచ్చి ఇచ్చింది. ఆమె పీఎఫ్ సొమ్ము, బంగారం సహా అన్నీ కాజేశాడు. చివరకు పద్ధతి మార్చుకోవాలని భువనేశ్వరి గట్టిగా చెప్పడంతో శ్రీకాంత్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి చంపేసి.. ఆమె కరోనాతో మరణించిందనే నాటకమాడాడు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య.. నిందితుడి అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది. కట్టుకున్న వాడే కిరాతకంగా కడతేర్చాడు తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్‌కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు
తిరుపతి క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఓ భర్త దుర్మార్గమిది. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్యకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ తిరుపతిలోని ఓ అపార్టుమెంట్లో భర్తతో కలిసి నివసిస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి అతడికి ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో ఆమెను హత్య చేశాడని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్‌ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. వెబ్సైట్లో శ్రీకాంత్‌రెడ్డి కారును బుక్ చేసుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. ఓ పెద్ద సూట్‌కేసును తెచ్చి తన భార్య రుయా ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ అని, ప్రస్తుతం తనకు కరోనా సోకిందని తెలిపాడు. సూట్‌కేసులో వెంటిలేటర్ ఉందని డ్రైవర్‌ను నమ్మించాడు. అనంతరం ఆస్పత్రి వెనుక ముళ్ల పొదల వద్ద డ్రైవర్‌కు అనుమానం రాకుండా కారును ఆపమని చెప్పి సూట్ కేసును అక్కడ దించాడు. డ్రైవర్ ప్రశ్నించడంతో మేడమ్‌కు కరోనా వచ్చిందని.. ఇక్కడ పెట్టి వెళ్తే ఈ వెంటిలేటర్‌ను ఆమె తీసుకుంటుందని చెప్పాడు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో భార్యని హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆస్పత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. డెల్టా వేరియంట్‌తో మరణించిందని.. బంధువుల వద్ద శ్రీకాంత్‌రెడ్డి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని.. రుయా ఆస్పత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులను, బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. అనంతరం భువనేశ్వరి మరణించిందని.. కరోనాతో మృతి చెందడం వల్ల మృతదేహాన్ని ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాకుండా బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు నటించాడు. కాగా, నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి. -
‘మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యం’
లక్కిరెడ్డిపల్లె : మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లె మండలంలో రెండవ విడత వై ఎస్ ఆర్ చేయూత ప్రారంభ కార్య క్రమాన్ని ఎం.ఎల్.సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి రెడ్డేయ్య ,తదితరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలోనే ఏ రాష్ట్రము లోను కూడా అమలు చేయలేని విధంగా మన రాష్ట్రములో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ, సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి , ఏ పథకాన్నైనా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. మహిళలకు మహిళా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు,దిశ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందుతూ పైకి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లును కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాల పై బడిన వారికి ఇస్తానన్న పెంచన్ బదులు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18 వేల 5 వందలు నేరుగా మహిళల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. జగనన్నకు జేజేలు... ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ జీవితాలలో సీఎం జగనన్న వెలుగులు నింపుతున్నారని మండలంలోని పలు గ్రామాల అక్క చెల్లెమ్మలు తెలిపారు. మీ మేలు మరువలేము జగనన్న అంటూ జై జగన్, జై శ్రీకాంతన్న అంటూ పెద్ద ఎత్తున జేజేలు పలికారు. మెగా చెక్కు అందచేత... లక్కిరెడ్డిపల్లె మండలంలోని 1497 మంది లబ్ధిదారులకు రూ.265.875 లక్షల మెగా చెక్కును లబ్దిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపిపి రెడ్డెయ్య లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ్ రాఘవ రెడ్డి, ఏ.పి.ఎం శ్రీనివాసులు రెడ్డి, సింగిల్ విండో మాజి ప్రెసిడెంట్ యర్రంరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, మహిళలు,వెలుగు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్‌రెడ్డి -
కోవిడ్ పేషెంట్స్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
-
మాక్ అసెంబ్లీ అంటూ బాబు నీచరాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీకి రాకుండా పక్కరాష్ట్రంలో ఉండి.. మాక్ అసెంబ్లీ అంటూ నీచరాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్ నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి. అర్హులైన ప్రతి రైతుకూ వేరుశనగ విత్తనాలు అందాలి. పంటల బీమాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నాడు-నేడు కింద రూ.వందల కోట్లతో ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఏమైనా చేశారా?. ఆయన నిర్లక్ష్యానికి నేడు ప్రాణాలు పోతున్నాయి. ఏపీ ప్రజలకు టీకాలు అవసరమని గ్లోబల్ టెండర్లు పిలవడం తప్పా?. వందల కోట్ల హెరిటేజ్ సంస్థ నుంచి ఒక్కరికైనా ఆక్సిజన్ దానం చేశారా?. పక్కరాష్ట్రాల్లో అన్ని పార్టీలు సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లు వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి’’ అని అన్నారు. చదవండి : కోవిడ్ కట్టడికి ప్రభుత్వం రాజీలేని పోరాటం: శ్రీకాంత్‌రెడ్డి -
కోవిడ్ కట్టడికి ప్రభుత్వం రాజీలేని పోరాటం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కోవిడ్ కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం శ్రీకాంత్‌రెడ్డి చేతులమీదుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆక్సీ ఫ్లో మీటర్ వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో రాయచోటి ఏరియా ఆస్పత్రికి మరో 10 ఆక్సిజనేటర్లు అందాయని అన్నారు. కోవిడ్ బాధితులకు సహాయం చేయడంలో మిథున్‌రెడ్డి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తోందని, అలాగే 100 పడకల ఆస్పత్రి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: కరోనా చికిత్సలో వాడే మందులు ఫ్రీగా ఇస్తాం: నాట్కో ఫార్మా -
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం - శ్రీకాంత్ రెడ్డి
-
పక్క రాష్ట్రానికి పారిపోయింది బాబు, లోకేష్ కాదా ?
-
ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రతిపక్షం ఇష్టానుసారంగా ఏదిపడితే అది మాట్లాడుతోందని, సేవ చేసే చిత్తశుద్ధి ఉంటే బాధ్యతగా ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా.. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తోందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. -
ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అద్భుతమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన ప్రతిమాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్‌తోనే అంతా అయిపోయినట్లుగా చూపించారని విమర్శించారు. ఆయన హయంలో 108 వాహనాలు మూలన పడ్డాయని దుయ్యబట్టారు. (సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108, 104 వాహనాలను తీసుకురావాలనే గొప్ప ఆలోచన సీఎం జగన్‌దేనని చెప్పారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ‘ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది పలికిన రోజు. ఏపీ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మా లక్ష్యం. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మాది చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నాం’ అని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రశంసించారు. (1.15 లక్షల మందికి కొత్తగా పెన్షన్) ‘పేద ప్రాణాలను కాపాడేందుకు దివంగతనేత వైఎస్సార్ నాడు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ నేడు వాటిని అపర సంజీవినిలుగా రూపుదిద్దారు. పేదల ప్రాణాలకు భరోసా కల్పించేలా ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని ఎమ్మెల్యే జోగిరమేష్ కొనియాడారు. -
రోజంతా అందుబాటులో వైద్యులు
-
చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలి?
సాక్షి, తాడేపల్లి: కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న ఇంద్రభవన్లో విశ్రాంతి తీసుకొని 65 రోజుల తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని విమర్శించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ‘రెండు నెలలు హైదరాబాద్‌లో ఉండి జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లాడు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలను దేశం మొత్తం ప్రశంసించింది. రెండు నెలల తరువాత ఇప్పుడు చంద్రబాబు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. కుల, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు? మహానాడు పెద్దడ్రామా, ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తోంది. విజయవాడలోని కరకట్టకు రోడ్ మార్గాన వచ్చిన చంద్రబాబు వైజాగ్ ఎందుకు రాలేదు. కళా వెంకట్రావు లేఖలు రాయడం కాదు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదు. చంద్రబాబు మొదట పెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇవ్వాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేశారు. ఇంటికి వెళ్లక ముందే జగన్మోహన్ మొదటి సంతకాన్ని అమలు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు’ అని అన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) ఇంకా ఆయన మాట్లాడుతూ....‘పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు భౌతిక దూరం పాటించలేదు. టీడీపీ నేతలు మాస్క్‌లు కూడా ధరించలేదు. చంద్రబాబు ఏపీకి రాగానే పూలు జల్లించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలి. తాగి తిడితే ఎల్లో మీడియా డిబెట్లు పెడుతుంది. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పాలనపైనా, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్దం’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. (‘సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు’) -
‘భౌతిక దూరం అంటే బాబు 600 కి.మీ. వెళ్లారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలన్నదే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ పనితీరును ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తోంటే చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇంట్లో టైంపాస్ కాక లేఖలు రాస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరిస్తోంటే చంద్రబాబు బాధపడుతున్నారని, పచ్చమీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. (ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా) ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిని తీసుకువచ్చిందని ప్రశంసించారు. సొంత బంధువులా సీఎం జగన్ బాధిత కుటుంబాలను ఓదార్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే వందకోట్లు పబ్లిసిటి కోసమే ఖర్చు చేసేవారని శ్రీనివాస్ విమర్శించారు. (ఆన్లైన్లో బుకింగ్‌కు సిద్ధం) -
‘ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది’
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘‘మనబడి నాడు - నేడు’’ కార్యక్రమం ద్వారా మూడు విడతల్లో.. ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 126 పాఠశాలలకు 30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల మరమ్మతులకోసం ఒక్కోక్క జిల్లాకు 60 కోట్లు, ‘‘మనబడి నాడు-నేడు’’ కింద 2 నుంచి 3 వందల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కో జిల్లాకు సంవత్సరానికి 6 నుంచి 7వందల కోట్లను ప్రభుత్వ పాఠశాలల ఆభివృద్దికి ఉపయోగించనున్నామని తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక్కోక్క నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల మంది తల్లుల ఖాతాలోకి రూ.15,000 చొప్పున నగదు జమ చేశామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని తెలిపారు. నాణ్యత కలిగిన భోజనం అందించేందుకు సీఎం జగన్ గోరుముద్దను ఆవిష్కరించారన్నారు. లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ మనబడి నాడు-నేడు కార్యక్రమం పూర్తి చేయాలని, లేకుంటే నాబార్డు నిధులు వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నారు. జగనన్న కానుక పేరుతో విద్యార్థులకు స్కూల్ డ్రస్, బ్యాగులు అందజేయనున్నామని తెలిపారు. -
లోకేష్ హడావుడిగా ఆస్తులెందుకు ప్రకటించారు?
-
‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’
తాడేపల్లి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆందోళనలు ప్రజలు గురించి కాదనీ, తన బినామీల కోసమేనని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా అవినీతి ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ఆరోపించారు. గత ఐదేళ్లలో రైతులకు ఎటువంటి మేలు చేయని చంద్రబాబు.. ముందు రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలే గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి చెందారని, భ్రమరావతి ముసుగులో రైతులతో కృత్రిమ ఉద్యమం సృష్టించారన్నారు. బినామీల కోసం ఆరాట పడుతున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరహాలోనే చంద్రబాబు వ్యవహరించడమే ఆయన మోసాలకు నిదర్శనమన్నారు. గతంలో ఈ-ఇటుక పేరుతో చంద్రబాబు చేసిన వసూళ్లకు లెక్కలు లేవని, ఇప్పుడ మరో జోలె పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు నివాసము ఉన్న కరకట్ట వద్దకు వెళ్లి రైతులు నిలదీయాలి. గత ఐదేళ్లలో చంద్రబాబు రైతుల్ని మోసం చేశారు. 4వేల 70 ఎకరాలు ఇన్ సైడర్ కు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది.ఇన్ సైడర్ అక్రమాలు వెలుగుచూశాయి కాబట్టే చంద్రబాబు ఆందోళన చేపట్టారు. ప్రాంతాలు వారీగా వివాదాలు సృష్టించి అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ముందుకు రావాలి. పక్క రాష్ట్రాలు మధ్య సత్సంబంధాలు ఉండాలని చూస్తుంటే మీరు వక్ర భాష్యం చేస్తున్నారు.తెలంగాణా రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అభివృద్ధి పథంలో కనిపిస్తుంటే.. గత ఐదేళ్లలో ఏపీ లో ఏమి చేశారు. రాయలసీమ వాసులు చేసిన త్యాగాలు మీకు గుర్తుకు రావడం లేదు. శ్రీశైలం 82 వేల ఎకరాలు రైతులు ఆనాడు త్యాగం చేశారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం చేసిన ఘనత సీమ వాసులది. ప్రాంతాలు మధ్య విభేదాలు సృష్టించడం చంద్రబాబు నైజం. ఒక్కో ప్రాంతంలో ఒకోతరహలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సమగ్రమైన అభివృద్ధి జరగాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు.. ఏడు నెలలు పాలనలో ఏ ఒక్క అవినీతి జరగలేదు.పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా పాలనలో పూర్తి చేస్తాం. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అడగకముందే ఇస్తున్నందుకు గర్వపడుతున్నాం
సాక్షి, వైఎస్సార్ కడప: అమరావతిలో భూములు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్లో కేవలం అమరావతికే లక్ష కోట్లకు పైగా కేటాయించడమంటే మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినవారమవుతామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌లు జిల్లాలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్ రావు కమిటీల నివేదికలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారని విమర్శించారు. కనపడని రాజధాని కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ స్వార్థపరుడైతే కడపను రాజధానిగా చేసేవారని చెప్పుకొచ్చారు. కానీ 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సినిమా యాక్టర్లతో జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. మేము అడగకముందే మాకు హైకోర్టు ఇస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధి పట్ల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి కొనుగోలు చేసిన భూముల విలువలు కాపాడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడింది లేదని విమర్శించారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ నాయకులకు బయట తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, లోకేష్‌కు టైం అయిపోయింది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మార్షల్ అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూజ్లెస్ ఫెలోస్ అని దూషించడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయనతో పాటు విప్ కొరముట్ల శ్రీనివాసులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా చీఫ్ వీప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు, లోకేష్‌కు టైమ్ అయిపోయిందని, ప్రజలు తమను గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే టీడీపీ వాళ్లు వాకౌట్ చేయడం దారుణమన్నారు. అలాగే కొరముట్లు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు. -
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఏన్టీఆర్ భవన్ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్ మీడియం కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని విమర్శించారు. అదే విధంగా మహిళలకు అండగా ఉండాలని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఆలోచనతోనే సీఎం జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల్లో రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్ధేశంతోనే సెక్రటరీ, వాలంటరీ ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనదని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో కూడా అలాగే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించి వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేలా చేస్తూ సీఎం జగన్ రైతు బాంధవుడయ్యాడని కొనియాడారు. -
త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. జిల్లాల పర్యటనల్లో ఆయన తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అయిదేళ్లు మోసం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు రౌడీ షీటర్లను, మాఫియాను వెనకేసుకు వస్తున్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తప్పులు చేశారు కనుకే కేసులు పెడుతున్నారు. అయిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తనకు తాను కరకట్ట బాబా అనుకుంటున్నారేమో...?. ఇక చింతమనేని ప్రభాకర్‌పై 18 కేసులు ఉన్నాయి. ఆయనేమైనా దెందులూరు బాబానా?. చట్టం ముందు అందరూ సమానమే. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకు కనిపించడం లేదా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మతానికి ముడిపెట్టడం సరైనదా?. కేసులకు భయపడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజకీయ అవసరాల కోసం గతంలో సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది. త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు అవుతుంది. చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్, ఇక నారా లోకేష్ అప్డేట్ కాని లీడర్. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నిప్పు అయితే ఆయన తనపై ఉన్న స్టేలను వెనక్కి తీసుకోవాలి. స్టేలను వెనక్కి తీసుకుంటే చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు ఉండరు’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు రాజకీయ దళారి...
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఒక రాజకీయ దళారి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుంటే మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు. ఆయన తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బాబు హయాంలో టీడీపీ నేతలు ఇసుకను వేలకోట్లలో దోచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దివాళా తీయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వనరులు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి అంశంలో ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళుతున్నారు. 5 నెలల సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక కొరతను శాశ్వతంగా లేకుండా చేస్తాం. డైటింగ్ కార్యక్రమంలా లోకేష్ దీక్ష చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇస్తున్నాం. తప్పుడు మాటల వినొద్దు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ కుటుంబాల శ్రేయస్సు మా బాధ్యత.’ అని హామీ ఇచ్చారు. -
ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్ విస్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. -
ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
-
టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు
-
అనైతిక సంబంధం, విస్తుగొలిపే విషయాలు
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు యువకుల అనైతిక బంధంతో ...ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. మూడు రోజుల క్రితం ఎస్ఆర్ నగర్‌లోని ఓ హోటల్లో యువకుడి అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని క్రిష్ ఇన్ హోటల్ లాడ్జీలో 4వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్‌రెడ్డి (29) హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయ్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల తన స్వగ్రామానికి వచ్చాడు. గత నెలలో అతడికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని తన స్నేహితుడైన మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం, మూసల్‌పూర్ గ్రామానికి చెందిన డబ్బి నరేశ్‌కు తెలిపాడు. అయితే ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ మధ్య అనైతిక సంబంధానికి దారి తీసింది. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డికి పెళ్లి కుదరటాన్ని నరేశ్ జీర్ణించుకోలేక పోయాడు. నిశ్చితార్థం అనంతరం తిరిగి దుబయ్‌కి బయలుదేరిన శ్రీకాంత్‌రెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరులోని స్వగ్రామం నుంచి నగరానికి వచ్చి నరేశ్‌ను కలుసుకున్నాడు. ఇద్దరు లాడ్జి తీసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ఎందుకు అంగీకరించావని, తనను విడిచి వెళ్లి పోతావా అంటూ నరేశ్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో నరేష్ ఆగ్రహంతో గురువారం మధ్యాహ్న సమయంలో కత్తిలో శ్రీకాంత్‌రెడ్డి గొంతు కోశాడు. అయితే శ్రీకాంత్ మృతి చెందటంతో భయంతో సాయంత్రం నరేశ్ కూడా గొంతు కోసుకోవడంతో రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందడం, నరేష్ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం, ఇద్దరి గొంతులపై కత్తిపోట్లు ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన నరేశ్ శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన విషయమై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారుల అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేశారు
-
అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించినా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో గత ఐదేళ్లు టీడీపీ పాలన దుర్మార్గంగా సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేసిందనీ, ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయకపోగా, వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీనే అధికారంలో ఉన్నట్లు వైసీపీ సభ్యులు భ్రమ పడుతున్నారనీ, దాని నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై శ్రీకాంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. -
ఆర్టీసీకి బిల్లులు చెల్లించకుండా నష్టపరిచారు
-
‘చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ఓటేశారు’
సాక్షి, కడప: ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్‌కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో దుర్మంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని అభిప్రాయపడ్డారు. రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇటువంటి సమస్య రావడానికి టీడీపీయే కారణం. ప్రభుత్వ నిధులను టీడీపీ సొంత ప్రచారానికి ఉపయోగించుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అధికారంలో లేకపోయిన, ఆర్థిక సమస్యలున్నా.. వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, వారందరి ఋణం తీర్చుకుంటాం’’ అని అన్నారు. -
చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
-
‘ఓట్ల కోసం బీజేపీ మత చిచ్చు పెడుతోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లౌకిక దేశంలో ఓట్ల కోసం బీజేపీ మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ఆర్డినెన్స్‌పై పార్లమెంట్, సుప్రీం కోర్టులు వ్యతిరేకించినా..బీజేపీ మొండిగా వెళ్తుందని విమర్శించారు. అభివృద్ధితో ఎన్నికలకు వెళ్లాలి కానీ.. మతాల మధ్య చిచ్చు పెట్టి కాదని హితవు పలికారు. లౌకిక ఆశయాలు కలిగిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. దేశ సమగ్రత విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్నారు. బీజేపీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోకుంటే నిలదీస్తామని హెచ్చరించారు. విభజన సమయంలో ఏపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
అధర్మానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
-
కుమార్తెను హతమార్చిన తండ్రి అరెస్టు
చిత్తూరు, ములకలచెరువు: కన్నకూతురుని హతమార్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. ములకలచెరువు మండలం బోరెడ్డిగారిపల్లెలో చెందిన శ్రీకాంత్‌రెడ్డి(44), పుణ్యవతి దంపతులకు లక్ష్మీప్రసన్న (14) ఒక్కగానొక్క కుమార్తె. బాలిక ములకలచెరువులోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శ్రీకాంత్‌రెడ్డి బోర్‌వెల్‌లో పనిచేస్తున్నాడు. భర్త తరచూ గొడవ పడుతుండడంతో పుణ్యవతి ఎనిమిదేళ్లుగా భర్తకు దూరంగా బెంగళూరులో ఉంటోంది. పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ప్రయోజనం లేదు. శ్రీకాంత్‌రెడ్డి గత ఏడాది బోర్‌వెల్‌లో పనిచేస్తూ నాలుగు నెలలు మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కుమార్తెను కూడా అక్కడికే తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించాలని భావించాడు. ఈ నెల 2వ తేదీన కుమార్తెను తీసుకుని స్వగ్రామం నుంచి మెదక్ బయలుదేరాడు. 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తుఫ్రాన్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సు దిగేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళదామని కుమార్తెతో చెప్పాడు. చీకటిలో ఎలా వెళ్లేదని కుమార్తె నిలదీయడం, ఇంటికి వెళ్లిపోదామని గట్టిగా కోరడంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన తండ్రి గతంలో భార్య దూరమైందని, ఇప్పుడు కుమార్తె కూడా దూరమవుతుందేమోనని భావించాడు. దారి పక్కనే ఉన్న క్వారీలో బండరాయితో బాలిక తలమీద బాది చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 5వ తేదీ ఉదయం క్వారీలోకి రాళ్లు కొట్టడానికి వెళ్లిన కూలీలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను గమనించి తుఫ్రాన్ పోలీసులకు సమాచారం అందించారు. తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు అక్కడికి చేరుకుని బాలికను 108 ద్వారా సికింద్రాబాదు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. అరెస్టు చూపించిన తుఫ్రాన్ పోలీసులు కుమార్తె హత్యకు కారణమైన శ్రీకాంత్‌రెడ్డిని తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు సోమవారం అరెస్టు చూపించారు. పలు సెక్షన్లు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేసు ఛేదించిన ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది వెంకటేష్, కుమార్‌ను అక్కడి ఉన్నతాధికారులు అభినందించారు. హత్య బయటపడతాదనిపారిపోయిన నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బోరెడ్డివారిపల్లెకు వచ్చాడు. కుటుంబ సభ్యులు కుమార్తె గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. అతను కుమార్తె హత్య విషయం బయటపడతుందని గ్రహించి పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి భార్య పుణ్యవతిని బెంగళూరు నుంచి పిలిపించి ములకలచెరువు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఈశ్వరయ్య బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ లొకేషన్ ద్వారా శ్రీకాంత్‌రెడ్డిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుమార్తెను తానే హత్య చేసినట్లు శ్రీకాంత్‌రెడ్డి అంగీకరించాడు. -
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు బాగోలేదు
-
యూటర్న్ తీసుకోవడం ఆయన అలవాటు
-
‘టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బంద్‌కు సహకరించాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరిట ప్రజల సోమ్ము వృథా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్షల కోసం దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమ పార్టీ సమావేశాలకు వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ ఎప్పటికి మిత్రులేనన్న విషయం పార్లమెంట్ సాక్షిగా స్పష్టమయిందన్నారు. ఉపాధి, డ్వాక్రా, అంగన్వాడీ మహిళలను మభ్యపెట్టి దీక్షలకు తరలించి చంద్రబాబు డ్రామాలు ఆడుతారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ విఫలమైనందుకు నిరసనగా రేపటి(మంగళవారం) బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌కు సహకరించాలన్నారు. టీడీపీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్‌బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్‌కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
ముఖ్యమంత్రులకు భజన చేయడం జేసీకి అలవాటే
-
‘జేసీవి భజన రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివి భజన రాజకీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులకు భజన చేయడం జేసీకి అలవాటేనంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచేందుకే జేసీ మాట్లాడతారని చెప్పారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో వైఎస్సార్ దయ వల్లే జేసీ మంత్రి అయ్యాడని, ఆయన నియోజకవర్గం తాడిపత్రిలో అరాచకాలకు అంతేలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పోటీ చేయలేని పరిస్థితిలో జేసీ ఉన్నారని అన్నారు. అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని చెప్పారు. పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారని, సభల కోసం ప్రభుత్వ సొమ్మును కోట్ల కొద్దీ ఖర్చు చేస్తున్నారని అన్నారు. మహానాడులో టీడీపీ మ్యానిఫెస్టో గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. నాయకులను చంద్రబాబు ఏవిధంగా వాడుకుని వదిలేస్తారో.. నాగం జనార్ధన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహుల ఉదంతాలే ఉదాహరణలని చెప్పారు. ఇవన్నీ తెలియని టీడీపీ నాయకులు చంద్రబాబు ట్రాప్‌లో పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల మనసును గెల్చుకున్న వైఎస్ జగన్‌పై ఎన్ని కుట్రలు పన్నినా అవి పటాపంచలు అవుతాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. కాపులు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే దాడులకు దిగడం దారుణమని అన్నారు. -
‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం.. డైనమిక్ లీడర్ కావాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉందని, ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వం అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామం హోటల్లో కార్యకర్తలతో కలసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, టిక్కెట్ల కోసం వైఎస్సార్ సీపీలోకి రాలేదని అన్నారు. పార్టీ ఆదేశాలు, అవసరాల మేరకు తన అనుభవంతో సేవ చేస్తానని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన జనరంజక పథకాలు రూపు మాపి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యం మితిమీరాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు చివరకు దేవాలయాలను కూడా వదలడం లేదని విమర్శించారు. టీటీడీలో స్వామి వారి నగలు, వజ్రాలు మాయమైన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కర్నూల్ జిల్లా డోన్‌లో దారుణం
-
వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శిగా కడపల
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి కడపల శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కడపల శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 4న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం, పెద్దకడపవాండ్లపల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మేనల్లుడు. -
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..
సాక్షి, కడప : రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థపై టీడీపీ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ కంటే ముందు టీడీపీ వ్యవస్థ మార్చుకో అని హితవు పలికారు. అసెంబ్లీ స్పీకర్ పచ్చ కండువాలు కప్పుకొని సైకిల్ యాత్రలు చేస్తే తప్పు కాదా అని ప్రశ్నించారు. ఒక్క రోజు దీక్ష చేసి 30 కోట్లరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. దీక్షలో డేరా బాబా స్థాయిలో ప్రతి ఒక్కరితో కాళ్లు మొక్కించుకొని చంద్రబాబు.. బాబాగా వెలిశాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చెప్పిన మాటాలు ఏ రోజు అయిన విన్నావా అని ప్రశ్నించారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని ఆ పార్టీ మంత్రి భార్యకు టీటీడీ పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ లేకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేసే వాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం బస్సులో పడుకున్నానని చెబుతున్న చంద్రబాబు ఆ బస్సు ఖరీదు 10 కోట్లు అని మాత్రం చెప్పడం లేదన్నారు. నిత్యం బీసీల జపం చేసే చంద్రబాబు స్వయంగా బీసీలను అవమానించేలా లేఖ రాయడం దౌర్భాగ్యకరమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
‘మెంటల్ ఎక్కిస్తున్న చంద్రం’
సాక్షి, అమరావతి : శాసనసభలో మెటల్ లేని అంశాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెంటల్ ఎక్కిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకూ ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ జరగలేదని అన్నారు. మీడియా చంద్రబాబు ప్రసంగాలను ఎక్కువగా ప్రసారం చేయకపోవడం వల్ల ఆయన శాసనసభలో డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాలకు అసెంబ్లీని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలను పొడిగించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల తాలూకూ ఏ అంశం కూడా దొరక్కుండా చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆఖరి బడ్జెట్లోనైనా అందరికీ న్యాయం జరగుతుందని భావిస్తే.. దాన్ని నీరుగార్చరన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మీహయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి
లక్కిరెడ్డిపల్లె: మీ తండ్రి హయాం నుంచి లక్కిరెడ్డిపల్లెకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిపై వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అభివృద్ధి పేరుతో బురదజల్లే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయంలో లక్కిరెడ్డిపల్లె మండలానికి వేల పక్కాగృహాలు మంజూరు చేసిన విషయం మీరు మరిచారా అని ప్రశ్నించారు.నాలుగేళ్లలో మీరెన్ని పక్కాగృహాలు మంజూరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మండలంలో కస్తూర్బా,వెలుగు,ఆదర్శ పాఠశాలలు ఎవరి హయాంలో వచ్చాయో మీకు తెలియదా అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో రూ.40 లక్షల మేర బోర్లు వేసి ప్రజలకు దాహార్తి తీర్చిన విషయాన్ని మీరు గర్తుంచుకోవాలన్నారు. తాను ఎనిమిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఆరు నెలలు మాత్రమే ఉన్నామన్నారు.ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు రావాల్సిన ఏసీడీపీ నిధులను కూడా ఇవ్వలేదని, అవి తీసుకునే అర్హతలు ముఖ్యమంత్రి మీకు కల్పించినా ఎంత వరకు అభివృద్ధి చేశారో తెలుపాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.ఏనాడైనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చాడా అన్ని అడిగారు. పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా చూస్తోంది మీరు కాదా అని అన్నారు.అంతేకాక తమ ఎంపీ నిధుల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల పనులకు పంచాయితీ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకుంటోంది మీరు కాదా అని అన్నారు. అభివృద్ధి విషయంలో సీఎంతోనైనా పోరాడేండుకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే తేదీని ఖరారు చేయండంటూ సభ సాక్షిగా సవాల్ విసిరారు. సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన ఆర్ఆర్ జన్మభూమి గ్రామసభల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదంటూ సాక్షి మీడియా ఎత్తి చూపించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్‌రెడ్డి(ఆర్ఆర్) అక్కసు వెళ్లగక్కారు. జన్మభూమి గ్రామ సభల పేరుతో అధికారులు ప్రభుత్వ పథకాలు వివరించి చేతులు దులుపుకొని పోతున్న విషయం పాలకులకు తెలిసినా ఒక్క సాక్షి మాత్రం ప్రజల దృష్టికి తీసుకొస్తోందని, అలాంటి సాక్షిపై టీడీపీ నాయకుడు అక్కసు వెళ్లగక్కడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,ఎంపీపీ రెడ్డెయ్య,ఎంపీటీసి సభ్యులు సైయ్యద్ అమీర్, రాజేంద్రారెడ్డి, సర్పంచ్ రవి రాజు,తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్పెక్టర్ స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ!
-
రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా?
-
టీడీపీ నేతలకు ఉలుకెందుకు
-
‘బాబు కమీషన్లు దక్కితే చాలనుకుంటున్నారు’
-
‘బాబు కమీషన్లు దక్కితే చాలనుకుంటున్నారు’
హైదరాబాద్: పోలవరంపై తాము లేవనెత్తిన అనుమానాలు నిజమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయమంతా కేంద్రమే భరించాలని చెప్పారు. అనుమతులన్నీ కేంద్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడతుందని చంద్రబాబునాయుడు ప్రకటించారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.42వేల కోట్లకు చేరిందని, కేంద్రం మాత్రం 2014నాటి వ్యయాన్ని మాత్రమే భరిస్తామని చెబుతోందని అన్నారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలిసినా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తికావడం పట్టించుకోకుండా తనకు కమీషన్లు దక్కితే చాలన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. పెరిగిన అంచనా వ్యయాన్ని ఎవురు భరిస్తారో చెప్పడం లేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. -
అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు దారుణం
► 41 సమస్యలను లేవనెత్తాం.. ► రాయచోటి సమస్యలపై మాట దాటవేసిన ప్రభుత్వం ► మదరసాలకు బోర్టు, యూనివర్సిటీకి డిమాండ్ చేశాం ► రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి రూరల్: అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు దారుణమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు . శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యవహరించిన తీరు చూస్తే బాధగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో 41 ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే అందులో ఏ ఒక్క సమస్యకూ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల విషయం, తాగునీటి సమస్యలు, అగ్రిగోల్డ్, పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ వంటి విషయాల్లో సరైన సమాధానాలు ఇవ్వలేక మంత్రులు , ముఖ్యమంత్రి ఇరుకునపడ్డారని చెప్పారు. సరైన సమాధానం లేక ప్రతిపక్షంపై వ్యక్తిగత విషయాల్లో ఎదురుదాడికి దిగిందని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాయచోటికి సంబంధించిన రింగ్‌రోడ్డు పెండింగ్ పనులు, కృష్ణ జలాలు తీసుకురావడం వంటి విషయాలతో పాటు రాయచోటి ప్రాంతం నుంచి వలస వెళ్లే వేలాది మంది రైతులు, కూలీలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో యాచించే పరస్థితిని వివరించేందుకు అవకాశం దొరికిందన్నారు. అయితే ప్రభుత్వం అందుకు రైతులను కించపరిచే విధంగా ఇతర ప్రాంతాలకు మెరుగైన జీవనం వెళ్లారంటూ అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు. జనాలకు తాగడానికి, రైతులకు సాగు చేసుకోవడానికి నీరు లేకపోవడం, పశువులకు కనీసం గడ్డి లేకపోవడం వంటి విషయాలు నిత్యం మన కళ్లకు కనబడుతున్నా, ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు వ్యతిరేకంగానే పనిచేస్తోందని గుర్తు చేశారు. జోన్-4 ఉద్యోగుల పట్ల వివక్ష: రాయలసీమను జోన్-4 గా గుర్తిస్తూ అందులో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు, కానీ ఉద్యోగుల నియామక వాటాలను కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అన్ని శాఖల్లోనూ సీనియారిటీ ప్రకారం పదోన్నతలు కల్పించడం లేదన్నారు. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించినా సంబంధిత మంత్రి గారు స్పందించలేదన్నారు. ఇన్ని విషయాలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్కదానికి సరైన సమాధానం రాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై బాధ కలుగుతోందన్నారు. మదరసాలకు బోర్టు ఏర్పాటు చేయాలి..: మైనార్టీ పిల్లల అబివృద్థి కోసం, వారి ఇస్లామిక్ చదువుల కోసం ఏర్పాటు చేసిన మదరసాలు అన్నింటినీ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మదరసాలకు బోర్డు గుర్తింపు ఇచ్చి, ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. మదరసాల్లో నాణ్యమైన విద్యను పిల్లలను అందించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగులపై దాడులు చేస్తూ అవమానిస్తున్నారు
-
మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ
రవాణా శాఖ అధికారులపై తమ పార్టీ నాయకులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాన్ని వివాదం చేయడం దారుణమని, తమవాళ్లు సారీ చెప్పారు కాబట్టి అంతా అయిపోయినట్లేనని చెప్పారు. అయితే, ఉద్యోగులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు అసెంబ్లీలో ప్రస్తావించారు. అధికారులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. మొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నడివీధిలో రౌడీయిజం చేశారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
ఈ సినిమాతో హిట్ గ్యారంటీ
– పూరి జగన్నాథ్ ‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్ శంకర్‌కు హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో గోపీచంద్ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్ కుమార్ ఈ సినిమా చేశారు. మహిత్ పాటలు, రీ–రికార్డింగ్ హైలెట్. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్ శంకర్ కెరీర్లో ‘నేనో రకం’ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు. -
నిజాయితీ కలిగిన మేధావులకే ఓటు వేయాలి
► ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటిటౌన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి నిజాయితీతో పాటు మంచి మేధావిగా కూడా తనకు పరిచయం ఉందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సాక్షితో ఫోన్ లో మాట్లాడారు. త్వరలో జరగున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని అన్నారు. నిజాయితీతో కూడిన మేధావులకు ఓటు వేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘనేతగా, శాసన మండలి సభ్యుడిగా, విద్యాక్షేత్రాల శ్రేయస్సు కోరే వ్యక్తిగా తనకు పరిచయం ఉందన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై అధికారులతో, ప్రభుత్వ పాలకులతో నిర్భయంగా మాట్లాడగలరని అన్నారు. గతంలో పోచంరెడ్డి సుబ్బారెడ్డి శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తను ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ వర్గానికి సంబధించి 172 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించి జవాబులు రాబట్టిన ఘనత ఆయన సొంతమన్నారు. అప్పటి ప్రభుత్వం ఆయనకు యునిసెఫ్ అవార్డును ప్రదానం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే నైజం ఆయన సొంతమన్నారు. శాసన మండలి సభ్యుడిగా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అప్రెంటీస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటీస్ రద్దు చేయించడానికి కృషి చేశారని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తుల్లో సుబ్బారెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు. మేధావి వర్గమైన ఉపాధ్యాయులు అందరూ పోచం రెడ్డి సుబ్బారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. -
వీరభద్రుని ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
-
రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలు కింద పడి చిన్నకోట్ల సుబ్బరాయుడు(32) అనే ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్నకోట్ల వీరన్న కుమారుడు చిన్నకోట్ల సుబ్బరాయుడు జమ్ము కాశ్మీర్లో సిగ్నిల్ డిపార్టుమెంట్లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతని ఆత్మహత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం
► విద్యార్థులకు కడుపునిండా తిండి ► ఆక్రమాలకు అడ్డుకట్ట ► సంచులపై టీఎస్ఎస్సీఎల్ ముద్ర ఆదిలాబాద్ టౌన్ : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి, దీంతో అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు సరిగా తినలేక పోయేవారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. సన్నబియ్యం రాక అక్రమార్కులకు వరంగా మారింది. ఇటు చౌక దుకాణాలు, అటు పాఠశాలలు, వసతి గృహలకు ఒకే రకమైన సంచుల్లో సన్న, దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇన్నాళ్లు అక్రమార్కులకు కాసులు కురిపించారుు. ఈ క్రమంలో అవి పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. అక్రమాలను నిరోదించడానికి పాలిథీన్ సంచుల్లో బడి బియ్యం సరఫరా చేస్తున్నారు. నియోజక వర్గంలో.. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ఆదిలాబాద్ మండలంలో101 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీఎస్, 21 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. జైనథ్ మండలంలో 39 పీఎస్‌లు, 9 యూపీఎస్‌లు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. బేల మండలంలో 34 పీఎస్‌లు, 11 యూపీఎస్, 5 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటితో పాటు నియోజక వర్గంలోని ఆశ్రమ, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని వడ్డిస్తున్నారు. మొత్తం నియోజక వర్గంలో 20 వేల వరకు విద్యార్థులు ఉన్నారు. పక్కదారి పట్టించకుండా... ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఇప్పటిదాకా పాఠశాలలు, వసతి గృహలు, రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం అన్ని సంచులు ఒకే విధంగా ఉండేవి. 50 కిలోల గోనే సంచుల్లో అందజేసేవారు. దీంతో ఏవి దొడ్డు రకం..ఏవి సన్న రకమో.. సంచి తెరచి పరిశీలిస్తే కానీ తెలిసేది కాదు. దీన్ని ఆసరాగా చేసుకోని అక్రమార్కులు పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నారుు. అలాగే సంచుల్లో బియ్యం తూకం తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి 50 కిలోల ప్రత్యేక సంచి (తెలుపురంగు)లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. సంచులపై టీఎస్ఎస్సీఎల్ (తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ)ముద్రతో పాటు వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం బియ్యం, ప్యాకింగ్ చేసిన తేదిని ముద్రించారు. ఆక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఇది వరకు గోనే సంచుల్లో చౌకదరల దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో ఇవి కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన పాలిధీన్ సంచుల్లో 50 కిలో సంచుల్లో సరఫరా చేస్తున్నాం. దీంతో దొడ్డు బియ్యం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు. -శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
సెటిల్మెంట్లకు వేదికగా కేబినెట్ మీటింగ్
- భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ‘మీకెంత.. మీకెంత’ అని వాటాలు పంచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. గురువారం తాత్కాలిక రాజధానిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్‌ని.. సెటిల్మెంట్లకు వేదికగా మార్చారని విమర్శించారు. కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గడికోట విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై చర్యలు తీసుకోకుండా టీడీపీ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాల్సిన కేబినెట్లో వారి తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. కనీసం నోట్ల రద్దుపైన కూడా చర్చే జరగలేదన్నారు. కేబినెట్లో ఆమోదం తెలిపిన 12 అంశాలలో ఏడు అంశాలు భూ కేటారుుంపులేనని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భూ కేటారుుంపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డట్టా..? పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విశాఖలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన సదస్సుతో ఎంత వరకు పెట్టుబడులు రాబట్టారని నిలదీశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు: రాష్ట్రంలో రైతుల కష్టాలు ఈ సర్కారుకు పట్టడం లేదని, రబీ గురించి అసలు ఆలోచించడం లేదని గడికోట మండిపడ్డారు. బ్యాంకుల నుంచి రుణాలు దొరక్క.. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారుల వద్ద డబ్బు లేదని, బ్యాంకుల్లో ఖజానా ఖాళీ అరుు్యందన్నారు. ఇవి చాలవన్నట్లు మహిళల్లో కొత్త అనుమానాలు పుట్టించారని, ఉన్న బంగారాన్ని లాగేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. -
'కేబినెట్ మీటింగ్ కాదు.. సెటిల్మెంట్ మీటింగ్'
-
డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు
జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి గుడిహత్నూర్ : రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుకులు దుర్వినియోగానికి గురైతే వేటు తప్పదని హెచ్చరించారు. డీలర్లు కాకుండా ఇతరులు దుకాణం నడిపించడానికి వీలు లేదని, అలా జరిగితే లెసైన్స్ రద్దు చేసి దుకాణం మూరుుస్తామని పేర్కొన్నారు. సకాలంలో సరుకులు అందుబాటులో ఉంచి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్ఫోర్సమెంట్ డీటీ రాజ్‌మోహన్, డిప్యూటీ తహసీల్దార్ నలంద ప్రియ, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
మట్టారెడ్డికి గట్టు పరామర్శ
బొత్తలపాలెం (నేరేడుచర్ల) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు మట్టారెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల మట్టారెడ్డి తండ్రి కుందూరు నర్సిరెడ్డి మృతి చెందగా శ్రీకాంత్‌రెడ్డి బొత్తలపాలెంలో ఆయన నివాసంలో పరామర్శించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తల్లి ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల పల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ మండల అధ్యక్షుడు జడ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్టల ముత్తయ్య, సుందర్‌బాబు, లింగారెడ్డి, గోవింద్ గౌడ్, మట్టయ్య, ఉపేంద్రచారి, గజ్జల కోటేశ్వరరావు, పాపయ్య, రాంరెడ్డి, సైదా నాయక్, తదితరులు పాలొన్నారు. -
'ఎంతసేపూ మీకు పబ్లిసిటీ పిచ్చేనా?'
-
'ఎంతసేపూ మీకు పబ్లిసిటీ పిచ్చేనా?'
హైదరాబాద్: తన వల్లే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఆయనకు ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చేనా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణ నదికి పుష్కరాలు తానే తీసుకొచ్చానని, పుష్కరాలను తానే సాగనంపుతానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, ఆయన పబ్లిసిటీ స్టంట్లు మితిమీరిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన వల్లే పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో కరువుతో రైతులు, నిరుద్యోగం వల్ల యువత అల్లాడుతున్నారని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, గోదావరి పుష్కరాల పేరిట దాదాపు రూ. 3,500 కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని, పుష్కరాల కోసం 10శాతం నిధులను ఖర్చు చేస్తే.. 90శాతం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నామని, కానీ సినీఫక్కీలో నిర్వహిస్తూ ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య గురించి, గ్యాంగ్ స్టర్ నయీం గురించి సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో ఓటుకు నోటు కేసును నీరుగార్చాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్ మెంట్ చేసుకోమన్నాడంటే.. ఇంకెంతమంది ఆంధ్రా మంత్రులతో నయీంతో సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోందని చెప్పారు. బిల్లీరావు, తెల్గీ వంటివాళ్లను తయారుచేసింది చంద్రబాబేనని విమర్శించారు. -
దడపుట్టిస్తున్న వరుస చోరీలు
-45 రోజుల్లో 15 ఇళ్లల్లో దొంగతనాలు -ఇద్దరు పోలీసుల ఇళ్లలోనూ చోరీలకు తెగబడ్డ దుండగులు బోడుప్పల్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నది ఒక ముఠానా లేక వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గడిచిన 50 రోజుల్లో 15 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇళ్ల తాళాలు పగుల కొట్టి సుమారు రూ. 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒక దోపిడీ సైతం జరిగింది. దాతల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోడుప్పల్, చెంగిచర్లలో సీసీ కెమోరాలు ఏర్పాటు కేవలం అలంకార ప్రాయంగా మారింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలోను, దొంగలను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 50 రోజుల్లో 15 దొంగతనాలు జరిగినా ఒక్క దొంగను కూడా పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోయారు. దీంతో ఉద్యోగస్తులు, ఊరికి వెళ్లే వారు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇద్దరు పోలీసుల ఇళ్లలో దొంగతనానికి తెగబడి చోరులు పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారనే చెప్పొచ్చు. జరిగిన చోరీలు ఇవీ... బోడుప్పల్ సరస్వతి కాలనీలో బాలమణి తన చిన్న కుమారుడుతో నివాసం ఉంటుంది. జూలై 6వన తన కుమారుడు దైవ దర్శనానికి వెళ్లగా రాత్రిపూట బాలమణిని నోటికి ప్లాస్టర్ వేసి కిచెన్ బంధించి ఆగంతకులు రూ. 37,50,000 (బంగారం వస్తువుల, నగదు) దోచుకెళ్లారు. చెంగిచర్ల ఎంఎల్ఆర్ కాలనీలో నివసించే యాస శ్రీకాంత్‌రెడ్డి జూలై 1న నల్లగొండ జిల్లా తుర్కపల్లి గ్రామంలో తాతయ్యకు అనారోగ్యం ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. తెల్లవారి వచ్చే సరికి ఇంట్లో ఉన్న 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి కనిపించలేదు. చెంగిచర్ల క్రాంతి కాలనీలో నివసించే కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్వేర్ ఉద్యోగి. కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి రాగా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసుకోగా 4 తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. సాయిభవానీనగర్లో నివసించే పోలిశెట్టి రాజేందర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్ఐ. (ఆర్పీఎఫ్) ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. 14న ఇంటికి వచ్చి చూసుకోగా 7 తులాల బంగారం, రూ. 28 వేలు కనిపించలేదు. బోడుప్పల్ పద్మావతి కాలనీలో నివసించే కొంగర శ్రీనివాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తారు. ఈ నెల 18న అశోక్‌నగర్‌లో రాఖీ కట్టడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉంచిన 7 తులాల బంగారం, రూ. 28 వేలు, రెండున్నర తులాల వెండి మాయమైంది. -
ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు
నల్లగొండ టూటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి. ఫయాజ్, పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి యాదయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు శ్రీకాంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి. అజారొద్దీన్, ఎండి. రియాజొద్దీన్, జాని, ఎండి. రషీద్, పైయెద్ బేగం, అఫాన్, షాదప్, భరత్, అనిల్‌కుమార్, రఫి, అయితరాజు రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నాం: మేకపాటి, గట్టు
తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్ ఆగాపురాలోని జై మహంకాళి దేవాలయాన్ని ఆదివారం వారు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా జై మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మెట్టు విజయ కుమార్, డాక్టర్ మెట్టు శ్రీకాంత్‌లు మేకపాటి రాజమోహన్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డిలను సత్కరించి, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి బి. బ్రహ్మానందరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకట రమణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, నాయకులు ఇమాన్ హుస్సేన్, అభిలాష్, జాతీయ మత్స్య సమాఖ్య చైర్మన్ మెట్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బంధువుల ఇంటికెళ్లి వచ్చేసరికి...
బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే లోపు ఇంటి తాళాలు పగులకొట్టి 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి దోచుకెళ్లిన సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ఎంఎల్ఆర్ కాలనీలో ఉండే యాస శ్రీకాంత్‌రెడ్డి కుటుంబం కలసి గత శనివారం నల్లగొండ జిల్లా తుర్కపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆయన తమ్ముడు మహిపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బట్టలు, వస్తువులు అన్ని చిందర వందరగా ఉన్నాయి. వెనక వైపు వెళ్లి చూడగా తలుపు గడి గడ్డపారతో విరగకొట్టి ఉంది. బీరువాలోని 13 తులాల బంగారు నగలు, 30 తులాలు వెండి కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన అన్న శ్రీకాంత్‌రెడ్డికి చెప్పాడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాంత్‌రెడ్డి మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్‌టీంతో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
'ఆ హంగు ఆర్భాటాలు అవసరమా?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆ హంగు ఆర్భాటాలు అవసరమా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానా లేక సింగపూర్‌కు రాజధానా? అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న ఎమ్ఓయూ లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీకి కోటీశ్వరుల రాజధాని కాదు సామాన్యుల రాజధాని కావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
నకిలీ బంగారం విక్రేత అరెస్టు
నాసిరకం బంగారం అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టైర్ల దుకాణం యజమాని శ్రీకాంత్‌రెడ్డికి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంజనప్ప అనే వ్యక్తి గత నెలలో పలుమార్లు ఫోన్ చేశాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలికాడు. శ్రీకాంత్‌రెడ్డి కోరిక మేరకు గత నెల రూ.5 లక్షల బంగారాన్ని సూర్యాపేటకు వచ్చి అందజేశాడు. అయితే, రూ.10 లక్షల బంగారం కావాలని శ్రీకాంత్‌రెడ్డి కోరటంతో అంజనప్ప సోమవారం సూర్యాపేటకు చేరుకున్నాడు. తను తెచ్చిన 750 గ్రాముల బంగారాన్ని శ్రీకాంత్‌రెడ్డికి చూపారు. అనుమానం వచ్చిన ఆయన స్థానిక బంగారం వ్యాపారులకు చూపాడు. వారు నకిలీదని తేల్చటంతో వెంటనే శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అంజనప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అంజనప్ప వెంట వచ్చిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కా రం, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హితబోధ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారన్నది పరిశీలించుకోవాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తొందరపాటు తగదని... ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ప్రజల మౌలిక అవసరాలు, ప్రభుత్వ పాలన సరిగా అందేలా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణలో తమ పార్టీ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తోందని... ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై, మహిళాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకటరమణ, భగవంత్‌రెడ్డి తదితరులతో కలసి శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగానే ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకుంటామన్నారు. పార్టీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లారని, శ్రేణులు మాత్రం పార్టీ వెంటే ఉన్నాయన్నరు. టీఆర్ఎస్లో చేరిన వారంతా అభివృద్ధి కోసమే చేరామని చెబుతున్నారని.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఏమాత్రం అభివృద్ధి జరిగిందో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అనేకసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. కానీ ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన విలీన పత్రంపై రాత్రికి రాత్రే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిం చారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని, 18-28 తేదీల మధ్య అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 9 జిల్లాల అధ్యక్షులను, 7 జిల్లాల్లో కమిటీలను నియమించామని వెల్లడించారు. -
'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ'
చికాగో: ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం అని చెప్పారు. ఏపీలోని దుష్ట శక్తుల గుప్పెట్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించి సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. అమెరికాలోని చికాగో నగరం ఆరోరాలో టామరిండ్ ఇండియన్ కుసిన్ లో 'శేషు రెడ్డి & కొండపల్లి సత్య (కేఎస్ఎన్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. వందలాదిమంది ప్రవాసాంధ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతూ భారత రాజకీయ వ్యవస్థకు ఒక గట్టి సందేశాన్ని అందిస్తున్నారని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ అధికారంలో వున్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేందుకు కృషిచేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ పాలనతో తిరిగి రాజన్న స్వర్ణయుగం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని ఆయన చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని ఇలాంటివి ఆపకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రస్తుతం నేను నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నాను. మీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతాను' అంటూ ఆయన చెప్పారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, 2019లో ప్రజలు తప్పక గుణపాటం చెప్పడం ఖాయమన్నారు. రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,34,295 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన 31 కుంభకోణాల వివరాలతో కూడిన ఎంపరర్ ఆప్ కరప్షన్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చికాగో సిటి కమిటీ ఇంచార్జీ ఆర్ వెంకటేశ్వర రెడ్డి, గంగాధర్, బక్తియర్ ఖాన్ తో పటుపలు రాష్టాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ తెలుగువారు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సభలో అమెరికా తెలుగు అసోసియేషన్ (అట) కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, కేకే రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జూలై తొలివారంలో చికాగోలో జగరనున్న అట 25వ వార్షికోత్సవ సభకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా శ్రీకాంత్ రెడ్డి ద్వారా విన్నవించారు. -
ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు
రాష్ట్ర ప్రభుత్వంపై శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పుడూ కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని ఉద్యోగులపైకి నెడుతోందని విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మరో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలసి ఆయన మాట్లాడారు. తాము చెప్పినట్టు చేయని ఉద్యోగులను విధుల నుంచి తొల గించడం, బదిలీ చేయడం, పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టించి వేధించే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ‘ఏం బాలేదు’ అన్న శీర్షికన ఓ పత్రిక (సాక్షి కాదు)లో ప్రచురితమైన కథనాన్ని శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు చూపిం చారు. ఉద్యోగుల విధులకు అడుగడుగునా ఆటంకం కలిగించడం, తమకు అనుకూలంగా పనిచేయని వారిని బదిలీ చేయడం టీడీపీ సర్కార్‌కి పరిపాటైందన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి..: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఏపీఎండీఎస్, ఏపీఎస్ఆర్టీసీ తదితర కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. టీడీపీ ఎన్నికల ముందు ప్రతి ఉద్యోగికీ ఇంటి కోసం స్థలమిస్తామని, అందులో తక్కువ వడ్డీతో ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలన్నారు. -
రూ. 32 వేల కోట్ల జీతాలు దండగ అంటారా?
హైదరాబాద్: అగ్రిగోల్డ్ అంశం 32 లక్షల మందికి సంబంధించిన అశం అని, దీనిపై అసెంబ్లీలో తక్షణమే చర్చ జరపాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు ఎక్కడ సీబీఐ విచారణ జరుపుతుందో అని భయపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీఐడీ విచారణకు ఆదేశించిందని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలకు సంబంధించిన ఆస్తులను ఎటాచ్మెంట్ నుంచి తప్పించి లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల పొట్టగొట్టారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం గతంలోని మాదిరిగానే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గత 9 ఏళ్ల పాలనలో ఉద్యోగులను చాలా రకాలుగా అవమానించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారన్నారు. మంత్రులు మాట్లాడుతూ.. 32 వేల కోట్ల జీతాలు దండగ అని వ్యాఖ్యానించడంలో ఉద్దేశం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పోలీసు అధికారులపై వత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులను బనాయిస్తూ చివరకు పోలీసు వ్యవస్థను కూడా టీడీపీ బ్రష్టు పట్టిస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 42 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జిల్లా, మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాల హామీని నిలబెట్టుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కార్పోరేషన్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును వెంటనే పెంచాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
పార్టీ ఫిరాయింపుదారులను కాపాడేందుకే..
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కనీసం తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తమకు కల్పించలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తన విక్షణాధికారంతో ముందుకు పోయిందని, కేవలం పార్టీ ఫిరాయించిన వాళ్లను కాపాడే ఉద్దేశంతోనే ఇలా చేసిందని ఆయన అన్నారు. కనీసం ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినా బీఏసీలో ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఇది అనైతిక, అప్రజాస్వామిక విధానమని, చెడు సంప్రదాయాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. అయితే తాము నోటీసు ఇచ్చాము కాబట్టి చర్చలో పాల్గొంటామని ఆయన తెలిపారు. చర్చలో పాల్గొనేందుకు కొంత సమయం కావాలని, అలాగే శాసన సభ్యులకు సమాచారం అందించాల్సి ఉందని చెప్పినా.. ఇప్పటికిప్పుడే దీనిపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినరోజే దానిపై చర్చ చేపట్టడం జరగదు. ఫోన్లు చేశామని, అది కాక ఇంకా ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలోను విప్ జారీ చేసినట్లు ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అందులో తెలిపామన్నారు. విప్ జారీచేసిన దానికి అనుకూలంగా సభ్యులు ఉండాలని తెలిపామని, దానికి ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు
హైదరాబాద్: రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం రాజీవ్ స్వగృహను ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. నిర్ణీత ప్లాన్ ప్రకారమే ఇళ్ల నిర్మాణం జరగాలని సూచించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
'కళ్లు మూసినా, తెరిచినా జగన్ నామస్మరణే'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కళ్లు మూసినా, తెరిచినా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు చుక్క నీరైనా ఇచ్చావా అని చంద్రబాబును నిలదీశారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'కేబినెట్ మీటింగ్‌కు, టీడీపీ మీటింగ్‌కు తేడా లేకుండాపోయింది. చంద్రబాబు ప్రభుత్వం పంచభూతాల్ని అవినీతిమయం చేసింది. ఏపీని స్కామాంధ్రప్రదేశ్‌గా మార్చారు. రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబూ.. మీ అవినీతి చూస్తూ ప్రజలు ఊరుకోరు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ఏపీ రాజధానిలో టీడీపీ నాయకులు పాల్పడ్డ భూదందా దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మరో ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవారు. చంద్రబాబూ..తక్షణం విచారణకు సిద్ధం కావాలి' అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే
♦ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులే లేవు ♦ పార్థసారథి, గడికోట ధ్వజం సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగినన్ని కేటాయింపులు రాబట్టకపోవడం సీఎం చంద్రబాబు వైఫల్యమేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దగా కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్రప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారన్నారు. కేంద్రబడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీలుగానీ, ప్రత్యేక హోదాగానీ కనిపించట్లేదని.. రాష్ర్టంలోని వారందరికీ కనిపిస్తున్నదల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అందజేస్తున్న ప్యాకేజీలు మాత్రమేనని పార్థసారథి ఎద్దేవా చేశారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వచ్చి మట్టి, నీరు అందజేసినపుడే చంద్రబాబు తన నిరసనను తెలిపివుంటే ఈరోజు బడ్జెట్లో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మొన్నటిదాకా 2018 నాటికి పోలవరం, 2019 నాటికి ప్రపంచస్థాయి రాజధాని, విజయవాడ మెట్రోరైలును నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని, ఇపుడు బడ్జెట్లో కేంద్రం కేటాయింపులు చేయని నేపథ్యంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ వాయిదా(రీషెడ్యూలింగ్) చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తమ పార్టీని వీడని ఎమ్మెల్యేల్ని కూడా వెళ్లిపోతున్నారంటూ పదేపదే టీవీల్లో ప్రసారం చేస్తూ, కథనాలు రాస్తున్న మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీనుంచి మరో పార్టీకి వెళుతుంటే అందులోని అనైతికతను ప్రశ్నించకుండా వెళ్లిపోతున్నారంటూ ఊదరగొట్టేలా ప్రచారం చేయడం దారుణమన్నారు. -
శాసన సభ్యత్వాలను తాకట్టు పెట్టం
♦ పార్టీలోనే ఉంటాం...జగనన్న వెంటే నడుస్తాం ♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాళ్లం తాము కానేకాదని, మంత్రి పదవులకోసమో.. కోట్ల కోసమో తమ శాసన సభ్యత్వాలను తాకట్టు పెట్టేవారం కాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మార్చి 5 నుంచి ప్రారంభమవనున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని పురస్కరించుకుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఆయన నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నీతిమాలిన చర్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తమకు పార్టీ మారే ఆలోచన లేకున్నా ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తమ ఫొటోలు వేసి మరీ ప్రచారం చేయడం, ఊహాగానాలు రాయడం దారుణమన్నారు. ఏ ఆధారంతో ఈవార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అలా దుష్ర్పచారం చేస్తున్న టీవీ చానళ్లు, పత్రికలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. జగన్ వల్లే ఎమ్మెల్యేలమయ్యాం: కాకాని ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే అది జగన్ వల్లేనని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ జిల్లాలోని ఎమ్మెల్యేలంతా జగన్ వెంటే ఉంటారని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రకటించారు. సహచర ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి వెళ్లొచ్చు గానీ.. తాము ప్రజలకు, పార్టీ నేతకు ద్రోహం చేసేవాళ్లం కానేకాదన్నారు. కల్లబొల్లి కబుర్లా: ఈశ్వరి టీడీపీ ప్రలోభాలకు లొంగి వైఎస్సార్సీపీని వీడుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధికోసమే అక్కడకు వెళుతున్నామనడం కల్లబొల్లి కబుర్లేనని గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు. కంబాల జోగు లు, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, వంతెల రాజేశ్వరితో కలసి ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవులిస్తామని,రూ. కోట్లు ఇస్తామని అధికారపార్టీ నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయన్నారు. బానిసలుగా వెళ్లారు: నారాయణస్వామి పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు బానిసలుగా వెళ్లారని చిత్తూరుజిల్లా ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. అసలు భూమానాగిరెడ్డి ఎందుకు టీడీపీలోకి వెళ్లారంటూ పలు ప్రశ్నలు సంధించారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హతకు కృషిచేస్తామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలను తెస్తే కమీషన్లు: ఉప్పులేటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి టీడీపీలోకి ఎమ్మెల్యేల్ని తెచ్చేవారికి చంద్రబాబు కమీషన్లు కూడా ఇస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నేత ఉప్పులేటి కల్పన అన్నారు. ఎమ్మెల్యేల్ని తెచ్చినందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటివరకూ ముడుతున్నాయన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనను తాను రాజనీతిజ్ఞుడుగా చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి నీతిమాలిన రాజకీయాలకు పాల్పడ్డం దారుణమన్నారు. ప్రభుత్వం తన ఆదరణ కోల్పోతున్నపుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారంటూ ప్రచారం లేవదీయడం పరిపాటైందని కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. కృష్ణా జిల్లాలో తామంతా జగన్ వెంటే ఉన్నామని మేకా ప్రతాప అప్పారావు స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాల్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామని ఆదిమూలపు సురేష్ అన్నారు. -
రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోండి
ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసిన ‘మండలి’ కమిటీ నిరసన తెలిపిన శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోవాల్సిందిగా శాసనసభ నైతిక విలువల కమిటీ(ఎథిక్స్)కి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. శాసనసభ సజావుగా జరగకుండా అడ్డుకునే వారిపట్లా కఠినంగా వ్యవహరించాలని కోరింది. శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22న జీరో అవర్‌లో జరిగిన చర్చలతోపాటు, అంతకుముందు సభలో జరిగిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావటంపై విచారణ జరిపేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీని వేయడం తెలిసిందే. ఇందులో గడికోట శ్రీకాంత్‌రెడ్డి(వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్(టీడీపీ), పి.విష్ణుకుమార్‌రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. కమిటీ తుది సమావే శం శుక్రవారం జరిగింది. నివేదికను రూపొందించింది. సమావేశానికి బుద్ధప్రసాద్తోపాటు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. విష్ణుకుమార్‌రాజు రాలేదు. తుది నివేదికలోని అంశాల్ని ఫోన్లో వివరించగా ఆయన తన సమ్మతి తెలిపారు. నివేదికలో వైఎస్సార్సీపీ సభ్యులపై చర్య తీసుకునే అంశాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు గడికోట పేర్కొంటూ కమిటీకి తన నిరసనను తెలియజేశారు. అసెంబ్లీ సమావేశ వివరాలు మీడియాలో లీకయ్యాయని చెప్పినా పట్టించుకోకపోవటం పట్ల ఆయన నిరసన తెలిపారు. రోజా, నానిలతోపాటు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని శ్రావణ్‌కుమార్(టీడీపీ) కోరా రు. నివేదికను ఈనెల 22లోగా స్పీకర్ శివప్రసాదరావుకు అందచేస్తారు. ఆయన దాన్ని ఎథిక్స్ కమిటీకి పంపుతారు. అది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా పూర్తిచేసే వీలుంది. విచారణకు గడికోట పట్టు.. అసెంబ్లీ సమావేశాల వివరాలు సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం కావటంపై విచారణ జరపాల్సిందిగా గడికోట కమిటీ సమావేశంలో పదేపదే కోరారు. అయితే ఏ సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమయ్యాయో వివరాలు చెబితే విచారణ జరుపుతామని కమిటీ చైర్మన్, మిగిలిన సభ్యులు, అధికారులు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులను గుర్తించటంతోపాటు వారిపై చర్య తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఇందుకు కమిటీలోని సభ్యులు స్పందించలేదు. సమావేశానంతరం గడికోట విలేకరులతో మాట్లాడుతూ తమ సభ్యులపై బురద చల్లటంతోపాటు వారిని లక్ష్యంగా చేసుకుని కమిటీ పనిచేసిన ట్లుగా ఉందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన నోట్‌ను అందించానని తెలిపారు. -
పవిత్రతకు భంగం కలిగించొద్దు
ఆరోగ్యమిత్రల పొట్టకొట్టడం దారుణం: గడికోట ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల పవిత్రతకు భంగం కలిగిస్తోందని, చట్ట సభ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలను హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తామని, కోనేరు లక్ష్మయ్య ప్రైవేటు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామని రకరకాలుగా ప్రభుత్వం చెప్పడం అర్థం కాకుండా ఉందని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాటాడారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లో మనకు అన్ని హక్కులూ ఉండగా తాత్కాలిక అసెంబ్లీ సమావేశాలంటూ ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాల్లో నిర్వహించడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని, మౌలిక సదుపాయాలు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయడంపైనే అభ్యంతరమని చెప్పారు. ఆరోగ్యమిత్రల తొలగింపు దారుణం ఉదాత్తమైన లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగులను జీవో నెంబర్-28 ద్వారా తొలగించి వారి పొట్ట కొట్టడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తమ్ముడి అసంతృప్తి
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తమ్ముడి అసంతృప్తి
హైదరాబాద్ : గ్రేటర్ నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసినా పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. కాంగ్రెస్, టీడీపీ ఆశావాహులు తమకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అక్బర్‌బాగ్ డివిజన్ టికెట్ ఆశించిన తెలుగుదేశం విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తనకు టికెట్ దక్కకపోవడంతో చెలరేగిపోయారు. అనుచరులతో కలిసి బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై దాడికి దిగారు. పార్టీ ఫ్లెక్సీలు చించేసి బీభత్సం సృష్టించారు. విద్యార్థులు, యువజనులను పార్టీ అవసరాలకు వాడుకొని ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వమంటే విద్యార్థులు రాజకీయాలకు పనిరారంటు అవమానించారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. ఇతర పార్టీల్లో విద్యార్థి విభాగం నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలవుతుంటే టిడిపిలో మాత్రం కనీసం కార్పోరేటర్ టికెట్ కూడా దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీ భవన్ సాక్షిగా ఇద్దరు మహిళ నేతలు కొట్లాటకు దిగారు. నేతల ఎదురుగానే బాహాబాహీకి సిద్ధం అయ్యారు. ఫలక్‌నూమా డివిజన్ టికెట్ కోసం మహిళా నేతలు గొడవకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు పార్టీనేతలు సర్ధి చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
'అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చోద్దు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తామని చెప్పడం ద్వారా అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సమావేశాలను హాయ్‌ల్యాండ్‌లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కోరిన ఆయన ప్రైవేటు స్థలాల్లో అసెంబ్లీ నిర్వహిస్తే భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీస్, సచివాలయాన్ని ఆధునీకరించి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
27న మరోసారి బుద్ధప్రసాద్ కమిటీ భేటీ
-
27న మరోసారి బుద్ధప్రసాద్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, అసెంబ్లీ వీడియో లీకేజీలపై కమిటీ సమీక్షించింది. సుమారు మూడు గంటలపాటు అసెంబ్లీలో పలు వీడియోలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. శీతాకాల సమావేశాల్లో ఐదో, ఆరో రోజు జీరో అవర్‌లో లేవనెత్తిన వీడియోలను కమిటీ నేడు పరిశీలించింది. అయితే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయాక కూడా ఈ భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించిన విషయం అందరికీ విదితమే. ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులు. -
'సోషల్ మీడియాకు ఆ ఫుటేజీ ఎలా లభించింది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలలో జరిగిన అన్ని పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుని కలిశారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...సోషల్ మీడియాకు అసెంబ్లీ సెషన్స్ ఫుటేజీ ఎలా లభించిందన్న అంశంపై విచారణ జరపాలని కోరామన్నారు. డిసెంబర్ 21వ తేదీన జరిగిన పరిణామాలపై విచారణ జీరో అవర్కే పరిమితం చేయడం సరికాదని స్పీకర్‌కు తెలిపామని చెప్పారు. అన్ని అంశాలను కమిటీ విచారిస్తుందని స్పీకర్ స్పష్టత ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
అవిశ్వాసం నోటీసు ఉండగానే కమిటీ వేస్తారా?
దాని ఆంతర్యం ఏమిటి?.. స్పీకర్‌ను ప్రశ్నించిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఉండగానే సభలో జరిగిన పరిణామాలపై విచారణకు హడావుడిగా కమిటీని నియమించడం వెనుక అంతర్యం ఏమిటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించా రు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై కమిటీ వేస్తానని ప్రకటించిన స్పీకర్ అందుకు భిన్నంగా అసెంబ్లీ బులెటిన్‌లో విచారణాంశాలను పేర్కొన్నారని విమర్శించారు. టీడీపీ సభ్యురాలితో స్క్రిప్ట్ చదివించారు కమిటీ ఏర్పాటుపై స్పీకర్ విలేకరుల సమావేశంలో ఏం చెప్పారో తెలియజేసే వీడియో దృశ్యాలను గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీవీలో ప్రదర్శించారు. ‘‘ సాధారణంగా జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించడానికి ఒక నిమిషం సేపు సమయం ఇస్తారు. అలాంటిది ఆ రోజున ఉద్దేశపూర్వకంగా రాసిచ్చిన స్క్రిప్ట్‌ను టీడీపీ సభ్యురాలితో గంటల తరబడి చదివించి, ఏడుపు రాకపోయినా ఏడ్పించి మాట్లాడించారు. ఈ అంశంపై కమిటీ ఏర్పాటు అంటే దాని ప్రాధాన్యత ఏమిటో ఇట్టే తెలిసిపోతోంది’’ అని ఆయన మండిపడ్డారు. అవిశ్వాసంపై సమాధానం చెప్పాలి తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ తక్షణమే సమాధానం చెప్పాలని గడికోట డిమాండ్ చేశారు. దానిపై ఎప్పుడేం చేయాలనేది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కమిటీని తాము బహిష్కరించబోమని తెలిపారు. తాము లేవనెత్తే అన్ని అంశాలపై కమిటీలో చర్చ జరగాలని, సమాధానం రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. -
అసెంబ్లీలో ఏకపక్ష ధోరణి
♦ అందుకే స్పీకర్‌పై ‘అవిశ్వాసం’ ♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాల్లో ఏకపక్ష ధోరణి కొనసాగుతున్నందుకే స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో తాము(వైఎస్సార్సీపీ సభ్యులు) మాట్లాడినపుడు ఒక విధంగా, వాళ్లు(టీడీపీ సభ్యులు) మాట్లాడితే మరో విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. శాసనసభ నుంచి ప్రత్యక్ష ప్రసారం కాని దృశ్యాలను స్పీకర్ అనుమతితోనే విడుదల చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఓవైపు చెబుతూ ఉండగా మరోవైపు తనకు తెలియదని స్పీకర్ చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు రోజా శాసనసభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల్లో ఆమె అనని మాటలు అన్నట్లుగా ఎడిటింగ్ చేశారని ఆరోపించారు. స్పీకర్, శాసనసభ కార్యదర్శి, అసెంబ్లీ ప్రసార హక్కులు తీసుకున్న టీవీ... అందరూ కలిసి కుట్ర పన్ని, వైఎస్సార్సీపీ నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. స్పీకర్ గారూ! టీడీపీ వాళ్ల తిట్లు వినిపించవా? ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కావా? అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. అధికారపక్షం సభ్యులు అసెంబ్లీలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన టీవీలో ప్రదర్శించారు. వారంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా స్పీకర్ కనీసం నియంత్రించే ప్రయత్నం చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేతను దూషించినా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను దుర్భాషలాడినా స్పీకర్‌కు తప్పనిపించలేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని విమర్శించారు. వాటిని ప్రస్తావించడానికి పోడియం వద్దకు వెళితే స్పీకర్ ఇష్టానుసారంగా అధికారపక్ష సభ్యులతో తిట్టిస్తున్నారని విమర్శించారు. -
'స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు'
-
పాలన బాగుంటే ‘పత్రా’లెందుకు?
చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ ధ్వజం ♦ నిజాలు కప్పిపుచ్చడానికి న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లను నమ్ముకున్నారు ♦ ఇసుక దోపిడీలో టీడీపీ నేతల పాత్ర లేదని నమ్మించడానికి సీఎం తంటాలు ♦ {పభుత్వానికి 12 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన బాగుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిదానికీ శ్వేతప్రతాలతో హడావుడి చేయడం ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా అన్నీ చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. అవన్నీ నిజమేనని నమ్మించడానికి రెండురకాల పేపర్లను నమ్ముకున్నారని పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అందులో ఒకటి న్యూస్ పేపర్ కాగా రెండోది వైట్ పేపర్ (శ్వేతపత్రం) అని ఎద్దేవా చేశారు. ‘వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోయినా పూర్తిగా మాఫీ చేశానంటారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేశానంటారు. విద్యుత్ నిరంతరాయంగా వస్తోందంటారు..’ ఇలాంటివి మరెన్నో రాయటానికి, నిజాలను కప్పిపుచ్చటానికి చంద్రబాబు న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లను ఆశ్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, గ్రామస్థాయి నాయకుల పాత్ర లేదని నమ్మించడానికి శ్వేతపత్రం పేరుతో ముఖ్యమంత్రి నానా తంటాలు పడ్డారన్నారు. ఇసుక ధరను సామాన్యుడి అందుబాటులోకి తేలవాలన్న పట్టుదల, జరుగుతున్న దోపిడీని అరికట్టాలనే చిత్తశుద్ధి ఉండాలే గానీ శ్వేతపత్రాల పేరుతో డ్రామాలెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఇసుక ధర అమాంతం పెరిగి నిర్మాణ ఖర్చులు ఆకాశాన్నంటాయన్నారు. నిర్మాణాలన్నీ మధ్యలో ఆగిపోవడంతో కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతప్రతానికి సంబంధించి వైఎస్సార్సీపీ పరంగా 12 ప్రశ్నలను సంధించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క మహిళనైనా లక్షాధికారిగా మార్చారా? ► డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు అప్పగించి, ఇసుక వేలం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వారికి ఇవ్వడం ద్వారా వారందర్నీ లక్షాధికారులను చేస్తామని పదే పదే ప్రకటించారు. ఈ 18 నెలల్లో ఎంతమందిని లక్షాధికారులుగా చేశారు? కనీసం ఒక్కరినైనా లక్షాధికారిగా మార్చగలిగారా? ► ఇసుక బాధ్యతలతోపాటు ఇసుక అక్రమాలకు సంబంధించిన కేసులు డ్వాక్రా మహిళల మీద పెట్టించిన ఘనత మీ ప్రభుత్వానిది కాదా? దోపిడీ సొమ్ములు మీవి, కేసులు మాత్రం డ్వాక్రా మహిళలవి అనే విధానంలో మీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడటం అందరికీ తెలిసిన విషయం కాదా? ► నిజాలు చెప్పే ప్రభుత్వ పత్రాన్ని శ్వేతపత్రం అంటారు. అబద్ధాలు చెప్పే పత్రాన్ని కూడా శ్వేతపత్రం అనే అంటారా? ► ఇసుకపై ప్రభుత్వానికి వచ్చే రాయల్టీని వంద శాతం పెంచినమాట వాస్తవం కాదా? ఏటా రూ.2.5 వేల కోట్ల మేరకు ఇసుక రీచ్‌ల ద్వారా ఆదాయం వస్తుందని గతంలో మీరే చెప్పారు. అలాంటిది గత 15 నెలల్లో ఇసుక ద్వారా పొందిన ఆదాయం కేవలం రూ.831 కోట్లు మాత్రమే అంటే.. మిగతా ఇసుకనంతా ఎవరు దోచేశారు? ఎక్కడికి పోయాయి వేల కోట్లు? ► 18 నెలలుగా మీ ప్రభుత్వం సహజ సంపద లూటీలో ప్రపంచ రికార్డును నెలకొల్పటం నిజం కాదా? చివరికి ఇసుకను కూడా వదలని అధికార పార్టీని ఇంతకుముందు ఏనాడైనా చూశామా? ‘మీ మీడియా’ కథనాలకేం జవాబు చెబుతారు? ► మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటూ భారీగా సొమ్ములు మూటకట్టుకుంటున్నారని మీకు అనుకూల మీడియానే పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. మరి వాటికేం సమాధానం చెబుతారు? ► మీరు విడుదల చేసిన శ్వేతపత్రం 4వ పేజీలో జిల్లాల వారీగా ఇసుక ద్వారా వచ్చిన ఆదాయాన్ని బార్ డయాగ్రమ్‌లో ఇచ్చారు. అక్కడ జిల్లాల పేర్ల బదులు శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడుకు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమకు, చింతమనేని ప్రభాకర్‌కు, తూర్పు గోదావరిలో యనమల రామకృష్ణుడు కుటుంబానికి... ఇలా జిల్లాల వారీగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అంతకు పదింతలు దోపిడీ సొమ్ము దక్కిందని కూడా బార్ డయాగ్రమ్‌లో ఇస్తే బాగుండేది కదా? ► మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛోటా మోటా నాయకులపై.. ఇసుక దోపిడీకి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే జనవరి 1 నుంచి ఇసుక విధానంలో మార్పులు అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నది నిజం కాదా? ► కొత్త విధానానికి అర్థం.. డ్వాక్రా మహిళలను తప్పించి టీడీపీ నేతలు, మీకు కావాల్సిన వ్యక్తులకు ఇసుక దోపిడీకి లెసైన్స్‌లు ఇవ్వటమే కాదా? ► ఏడాదిన్నర క్రితం ట్రాక్టర్ ఇసుక ఖరీదు రూ.1,000 లోపుంటే ఇప్పుడది రూ.3 వేలకు పైగా పలుకుతోంది. అంటే ఇల్లు కట్టుకునే సామాన్యుడి మీద 3 రెట్లు భారం పడింది. మరి ప్రభుత్వ ఆదాయం ఇదే నిష్పత్తిలో కనపడటం లేదంటే ఇసుకను తెలుగుదేశం శ్రేణులు నిలువుదోపిడీ చేస్తున్నట్టు రుజువు అవుతోంది కదా. ► ‘మా గ్రామం లేదా జిల్లాలో ఎటువంటి ఇసుక దోపిడీ జరగటం లేదు, అధికార పార్టీ వారి అండదండలు ఇసుక దోపిడీకి లేవు..’ అని చెప్పగలిగే పరిస్థితి 13 జిల్లాల్లో ఒక్కచోటనైనా ఉందా? ► ఒకప్పుడు మాఫియా అనే పదం వింటే ముంబై గుర్తొచ్చేది. దావూద్ ఇబ్రహీం లేదా ఛోటా రాజన్ గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు గ్రామ గ్రామాన ఇసుక మాఫియాను వ్యవస్థీకృతం చేసిన ఘనత మీది కాదా? చివరికి చింతమనేని ప్రభాకర్‌ను చట్టాన్ని పరిరక్షిం చే వ్యక్తిగా, డ్వాక్రా మహిళల్ని రక్షించే బాధ్యతలో ఉన్న వ్యక్తిగా చిత్రించేందుకు శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీరు చేసిన ప్రయత్నం చూసినప్పుడు బిన్ లాడెన్‌ను కూడా మీరు గాంధేయవాదిగా చెప్పే ప్రయత్నం చేస్తారేమోనని మాకు భయమేస్తోంది. -
’ఏపీలో తాలిబాన్ పాలన కొనసాగుతోంది’
-
ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటి?
-
’వైఎస్ కృషి వల్లే నేడు ప్రాజెక్టులు జలకళ’
-
ప్రాజెక్టుల్లో అవినీతి విపరీతంగా జరిగింది
-
120ను రద్దు చేయాలి:శ్రీకాంత్‌రెడ్డి
-
'అసెంబ్లీ సమావేశాలు 15రోజులు జరగాలి'
-
ఏపీ సర్కార్‌పై మండిపడ్డ MLA శ్రీకాంత్‌రెడ్డి
-
కలెక్టరుపై లోకాయుక్తలో ఫిర్యాదు
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ జిల్లా కలెక్టరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కలెక్టరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అదే విధంగా అధికారుల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జిల్లాకు వస్తున్నపుడు కనీసం సమాచారం కూడా అందిచడం లేదని వాపోయారు. కలెక్టరుకు ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదన్నారు. ప్రతి పనికీ కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి కలెక్టరు లేరని.. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కలెక్టర్ అవినీతికి పాల్పడ్డారని సస్పెండ్ చేసిన చంద్రబాబు ఏ విధంగా వైఎస్ఆర్ జిల్లాకు నియమించారని ప్రశ్నించారు. -
'రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోంది'
వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతోందని రాయచోటి ఎమ్మెల్యేశ్రీకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీనాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై ప్రజలకి ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోతున్నారన్నారు. కృష్ణాజలాల నుంచి 200టీఎంసీల నీటిని రాయలసీమకు విడుదల చేయాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శ్రీశైలంలో నీటి మట్టం పూర్తిగా ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కాబట్టి ప్రస్తుతానికి లాభంలేని పట్టిసీమ ప్రాజెక్టుకు బదులు పోలవరం ప్రాజెక్టుతో పాటు హంద్రీ-నీవా సుజల స్రవంతి మెయిన్ కాలువ పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తిగా రాజధాని పనులే కాకుండా రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ జిల్లా పేరు కూడా ఉచ్చరించరా?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర ఎమ్మెల్యేలు తిరువీధి జయరాములు, షేక్ బేపారి అంజాద్బాషాతో కలిసి మాట్లాడుతూ ‘రాయలసీమలో కరువు ఉందంటూనే చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1200 అడుగుల లోతుకు వెళ్లినా బోర్లకు నీరందడం లేదని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపర్చింది. మరి వైఎస్సార్ జిల్లాలో 1600 అడుగులు తవ్వినా నీరందడం లేదన్నది ఎందుకు విస్మరించారు’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా జిల్లాలో 50 మండలాలకు గాను 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. అక్కడ మామిడి, చీనీ తోటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అంటూ వైఎస్సార్ జిల్లా పేరును కూడా ఉచ్చరించక పోవడం దారుణం. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా మనుషులపైప్రాంతాల వారీగా, పార్టీల వారీగా వివక్ష చూపించడం తగదు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ కరపత్రంలాగా రూపొందించిన గవర్నర్ ప్రసంగంలో తమ జిల్లా ఊసే ఎత్తక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రజలు ఏపీలో అంతర్భాగం కాదా...ఎందుకింత వివక్షను చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారు అన్ని ప్రాంతాలను ప్రజలను సమాన దృష్టితో చూడాలని హితవు పలికారు. తమ జిల్లాకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ప్రజలు కూడా సహించరని గడికోట హెచ్చరించారు. తమ జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌ను ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పెట్టారు. మళ్లీ రెండు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట పెడతామని ప్రాంతీయ విభేదాలు తలెత్తేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నూలులో కూడా ఇలాంటి ప్రాజెక్టునే నిర్మిస్తామని చెప్పారని అందుకు తాము వ్యతిరేకం కాదని తమ జిల్లాలో మాత్రం చెప్పిన విధంగా సెయిల్ ద్వారానో, ప్రభుత్వ రంగంలోనో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పుతామన్న చంద్రబాబు ఇతర జిల్లాల్లో పర్యటించేటప్పుడు అక్కడ కూడా పెడతామని నాలుగు చోట్ల వాగ్దానం చేశారని ఇదెక్కడి విడ్డూరమని ఆయన ప్రశ్నించారు. ఉర్దూ యూనివర్సిటీని ఇతర జిల్లాల్లో పెట్టడానికి తమకు అభ్యంతరం లేదని అయితే తొలుత తమకు హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్ జిల్లాలోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇలా చేయడం అనేది జిల్లాల మధ్య తగాదాలు పెట్టడమేనన్నారు. వైఎస్సార్ జిల్లాను టీడీపీ చిన్న చూపు చూడటం దారుణమని అంజాద్‌బాషా అన్నారు. -
ప్రజల తరఫున నిలదీస్తాం
ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మొత్తం 22 అంశాలను తాము సభ దృష్టికి తీసుకొచ్చామని, అన్నింటిపైనా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారన్నారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి సభలో చర్చించాలని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. -
ఉద్యమించాల్సిన తరుణమిదే
‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో పాటు కరువు కూడా వస్తుందని నిరూపించారు. ఇలాంటి సమయంలో చేతులు కట్టుకొని ఉండకూడదనుకున్నాను.. ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది’.. అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గాలేరు-నగరి, సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో పాటు జిల్లా, మండల నాయకులు దీక్షా ప్రాంగణానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. వీరపునాయునిపల్లె/ కమలాపురం: సాగు, తాగునీటికోసం తాను చేపట్టిన ఈ పోరాటం అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో అయితే వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకపోతే ఉరిశిక్ష విధిస్తారని, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని, అలాంటి చట్టాలు ఇండియాలో లేకనే చంద్రబాబును ప్రజలు వదిలేశారని స్పష్టం చేశారు. అందుకే త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో నైనా అవసరమైన నిధులు కేటాయించి జీఎన్ఎస్ఎస్ను పూర్తి చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకులు ఉంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని, కాని ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఉద్యమించక తప్పదని ఆయన పిలుపునిచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షకు డీసీసీబీ ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్ తులసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నేడు నాయకుల రాక వీరపునాయునిపల్లె: కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు సోమవారం పలువురు నాయకులు రానున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డి, సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి కరువుతో అల్లాడుతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బడ్జెట్ సమావేశాల్లో జీఎన్ఎస్ఎస్కు నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టడం శుభ పరిణామం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. అఖిలపక్షం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించినప్పుడు అక్కడ పనులన్నీ వైఎస్ హయాంలో జరిగినవేనని రైతులు చెబుతున్నారు. 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు వైఎస్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏ మాత్రం నిధులు విడుదల చేయలేదు. - వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ నిరాహార దీక్ష చేయడం అభినందనీయం మరో నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేక పోయినా ప్రజలు, రైతుల తాగు-సాగు నీటి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేయడం అభినందనీయం. జీఎన్ఎస్ఎస్ పథకానికి శిలాఫలకం వేసింది ఎన్టీఆర్ అయితే ఆ పనులను ప్రారంభించింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ కేవలం మూడేళ్ల కాలంలోనే జీఎన్ఎస్ఎస్కు రూ.4వేల కోట్లు కేటాయించారు. ప్రతి ప్యాకేజీలో పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ తర్వాతే గండికోటకు సీఎం వచ్చి వెళ్లారు. సర్వరాయసాగర్ పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
పోతిరెడ్డిపాడు టు గండికోట
సాక్షి, కర్నూలు: ‘‘తాగు, సాగునీరులేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కళ్లారా చూశారు. ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పూర్తిచేసి తెలుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల కింద ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీటిని అందించారు. రాయలసీమను సస్యశ్యామలంగా మార్చారు. అందువల్లే ఆయన్ను రాయలసీమ ప్రజలు తమ గుండెల్లో ఉంచుకున్నారు’ అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయలసీమకు వరప్రదాయినగా ఉన్న పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో పనులు అడ్డంకిగా ఉన్నాయన్న వివరాలను తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ, డీఈల ద్వారా తెలుసుకున్నారు. వచ్చే వర్షకాలంలోని వరదలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సజావుగా నీటిని తరలించడానికి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులుపై చర్చించారు. విస్తరణ పనులు పూర్తికానందు వల్లే.. ప్రస్తుతం ఎస్ఆర్ఎంసీ కాల్వ 10, 12, 14, 16 కిలోమీటర్ల వద్ద పెండింగ్‌లో ఉండటంతోపాటు ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు పూర్తికానందు వల్ల పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయలేకపోతున్నట్లు టీజీపీ ఎస్ఈ సన్యాసీనాయుడు తెలిపారు. కాల్వల విస్తరణ పూర్తికాకపోవడంతో సాగునీటిని సవ్యంగా సరఫరాచేయలేకపోతున్నట్లు వారు వివరించారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసుకుంటే పూర్తిస్థాయిలో నీటిని తరలించొచ్చన్నారు. లేనిపక్షంలో పోతిరెడ్డిపాడు నుంచి 20వేల క్యూసెక్కులను విడుదల చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక చొరవ చూపాలి.. భానకచర్లతోపాటు గోరుకల్లు రిజర్వాయరును అఖిలపక్షం నాయకులు పరిశీలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు నంద్యాలకు వచ్చిన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌తో అఖిలపక్షం నేతలు మాట్లాడారు. పోతిరెడ్డిపాడు-భానకచర్ల, భానకచర్ల-గోరుకల్లు, గోరుకల్లు-ఆవుకు, ఆవుకు-గండికోట రిజర్వాయర్లు వరకూ మధ్యలో ఉన్న చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక చొరవ చూపాల్సిందిగా కోరారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆధికారం చేపట్టి ఎనిమిది నెలలైనా రాయలసీమకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాకమ్మ కబుర్లు చెప్పొద్దు.. కడపజిల్లా సీపీఎం పార్టీ జిల్లాకార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రాజెక్టులనిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోపాటు కాకమ్మ కబుర్లుచెబుతుందని ఆయన విమర్శించారు. దీంతో తాగు, సాగునీరులేకుండా పోయిందని ఆయన తెలిపారు. అనంతరం కడపజిల్లా సీపీఐ సెక్రెటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి నీటివిడుదల పెంచి రాయలసీమ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించాలని ఆయన కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కృష్ణాబోర్డును కర్నూల్లో ఏర్పాటుచేసి రాయలసీమ ప్రాంతాల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు కృష్ణాబోర్డును ఇతర ప్రాంతాలకు తరలించటం హేయమైన చర్యగా ఆయన ఖండించారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు నిర్మాణంలో 2.75లక్షల మంది నిర్వాసితులు కాగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి సాగు, తాగునీటిని అందించాలని కోరారు. నేడు గండికోటకు.. శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి అఖిలపక్ష బృందం బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డారాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, పోచా జగదీశ్వర్‌రెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు. ఉద్యమిస్తేగాని చలనం రాదా..? ప్రతిపక్షాలు ఉద్యమిస్తేకానీ ప్రభుత్వానికి చలనం వచ్చే పరిస్థితి లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సీఎం చంద్రబాబునాయుడు రైతులకు ప్యాకేజీని ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే కడపలో జీఎన్‌ఎస్‌ఎస్‌తోపాటు మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ రివ్యూమీటింగ్ నిర్వహించి అఖిలపక్షం అధ్వర్యంలో ఉద్యమించేందుకు సిద్ధమవగా చంద్రబాబు కూడా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పరిశీలనకు సన్నద్ధమవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయివుంటే ఉద్యమాలు చేపట్టకుండానే ప్రాజెక్టు పూర్తయ్యేవన్నారు. పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి భానకచర్ల వద్ద నుంచి నిత్యం 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్ఆర్బీసీ, టీజీపీ, కేసీ ఎస్కేప్ కాల్వ ద్వారా తరలించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇది సాధ్యం కావడం లేదన్నారు. చిన్నచిన్న పనులన్నింటినీ తక్షణమే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇవి పూర్తయితే 30 రోజుల్లో రాయలసీమకు 114 టీఎంసీల నీటిని తరలించొచ్చని, తద్వారా చాలా ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని తెలిపారు. -
పోతిరెడ్డిపాడు టు గండికోట
సాక్షి, కర్నూలు: ‘‘తాగు, సాగునీరులేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కళ్లారా చూశారు. ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పూర్తిచేసి తెలుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల కింద ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీటిని అందించారు. రాయలసీమను సస్యశ్యామలంగా మార్చారు. అందువల్లే ఆయన్ను రాయలసీమ ప్రజలు తమ గుండెల్లో ఉంచుకున్నారు’ అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయలసీమకు వరప్రదాయినగా ఉన్న పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో పనులు అడ్డంకిగా ఉన్నాయన్న వివరాలను తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ, డీఈల ద్వారా తెలుసుకున్నారు. వచ్చే వర్షకాలంలోని వరదలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సజావుగా నీటిని తరలించడానికి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులుపై చర్చించారు. విస్తరణ పనులు పూర్తికానందు వల్లే.. ప్రస్తుతం ఎస్ఆర్ఎంసీ కాల్వ 10, 12, 14, 16 కిలోమీటర్ల వద్ద పెండింగ్‌లో ఉండటంతోపాటు ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు పూర్తికానందు వల్ల పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయలేకపోతున్నట్లు టీజీపీ ఎస్ఈ సన్యాసీనాయుడు తెలిపారు. కాల్వల విస్తరణ పూర్తికాకపోవడంతో సాగునీటిని సవ్యంగా సరఫరాచేయలేకపోతున్నట్లు వారు వివరించారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసుకుంటే పూర్తిస్థాయిలో నీటిని తరలించొచ్చన్నారు. లేనిపక్షంలో పోతిరెడ్డిపాడు నుంచి 20వేల క్యూసెక్కులను విడుదల చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక చొరవ చూపాలి.. భానకచర్లతోపాటు గోరుకల్లు రిజర్వాయరును అఖిలపక్షం నాయకులు పరిశీలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు నంద్యాలకు వచ్చిన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌తో అఖిలపక్షం నేతలు మాట్లాడారు. పోతిరెడ్డిపాడు-భానకచర్ల, భానకచర్ల-గోరుకల్లు, గోరుకల్లు-ఆవుకు, ఆవుకు-గండికోట రిజర్వాయర్లు వరకూ మధ్యలో ఉన్న చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక చొరవ చూపాల్సిందిగా కోరారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆధికారం చేపట్టి ఎనిమిది నెలలైనా రాయలసీమకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాకమ్మ కబుర్లు చెప్పొద్దు.. కడపజిల్లా సీపీఎం పార్టీ జిల్లాకార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రాజెక్టులనిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోపాటు కాకమ్మ కబుర్లుచెబుతుందని ఆయన విమర్శించారు. దీంతో తాగు, సాగునీరులేకుండా పోయిందని ఆయన తెలిపారు. అనంతరం కడపజిల్లా సీపీఐ సెక్రెటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి నీటివిడుదల పెంచి రాయలసీమ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించాలని ఆయన కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కృష్ణాబోర్డును కర్నూల్లో ఏర్పాటుచేసి రాయలసీమ ప్రాంతాల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు కృష్ణాబోర్డును ఇతర ప్రాంతాలకు తరలించటం హేయమైన చర్యగా ఆయన ఖండించారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు నిర్మాణంలో 2.75లక్షల మంది నిర్వాసితులు కాగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి సాగు, తాగునీటిని అందించాలని కోరారు. నేడు గండికోటకు.. శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి అఖిలపక్ష బృందం బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డారాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, పోచా జగదీశ్వర్‌రెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు. ఉద్యమిస్తేగాని చలనం రాదా..? ప్రతిపక్షాలు ఉద్యమిస్తేకానీ ప్రభుత్వానికి చలనం వచ్చే పరిస్థితి లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సీఎం చంద్రబాబునాయుడు రైతులకు ప్యాకేజీని ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే కడపలో జీఎన్‌ఎస్‌ఎస్‌తోపాటు మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ రివ్యూమీటింగ్ నిర్వహించి అఖిలపక్షం అధ్వర్యంలో ఉద్యమించేందుకు సిద్ధమవగా చంద్రబాబు కూడా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పరిశీలనకు సన్నద్ధమవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయివుంటే ఉద్యమాలు చేపట్టకుండానే ప్రాజెక్టు పూర్తయ్యేవన్నారు. పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి భానకచర్ల వద్ద నుంచి నిత్యం 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్ఆర్బీసీ, టీజీపీ, కేసీ ఎస్కేప్ కాల్వ ద్వారా తరలించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇది సాధ్యం కావడం లేదన్నారు. చిన్నచిన్న పనులన్నింటినీ తక్షణమే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇవి పూర్తయితే 30 రోజుల్లో రాయలసీమకు 114 టీఎంసీల నీటిని తరలించొచ్చని, తద్వారా చాలా ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని తెలిపారు. -
అన్యాయం చేస్తే ఒప్పుకోం
రాయచోటి టౌన్: రాయచోటి నియోజక వర్గ ప్రజలను కరువు బారి నుంచి శాశ్వతంగా కాపాడేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడటానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని రూ.4500 కోట్లుతో పనులు మొదలు పెట్టించారని చెప్పారు. ఆయన చేపట్టిన పనులు 70శాతం వరకు పూర్తయ్యాయన్నారు. తర్వాత పనులు సాగుడం లేదని చెప్పారు. అయితే ఇప్పుడే రాజకీయ దురుద్దేశంతో కొంత మంది పాలకులు రాయచోటి ప్రాంతానికి దాని ఫలాలు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో మనకు రావాల్సిన నీటిని పక్కదారి మళ్లించి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయమై రాయచోటి నియోజక వర్గ ప్రజలకు అవగాహన కలిగించేదుకు హంద్రీ- నీవా ప్రాజెక్టు కాలువ వెంబడి ఉండే ప్రాంతాలలో పాదయాత్ర చేయన్నుట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిలో వెలుగల్లు ప్రాజెక్టుకు 4టిఎంసిలు, శ్రీనివాస రిజర్వాయర్‌కు 1.2 టిఎంసిలు, ఝరికోన ప్రాజెక్టుకు 1/2 టిఎంసి నీరు వస్తుందని చెప్పారు. వైఎస్సార్ అప్పట్లోనే వెలుగల్లుకు 3 టిఎంసిలు ఇవ్వాలని జివో పాస్ చేయించారని చెప్పారు. వెలుగుల్లు ప్రాజెక్టు నిండితే కుడి ఎడమ కాల్వల ద్వారా 24000 ఎకరాల భూమి సాగు అవుతందని వివరించారు. ప్రతి నాయకుడు ఆశయంతో రాజకీయాలలోకి రావాలని, ఎలాంటి ఆశయాలు లేకుండా రాజకీయాలు చేస్తే ఏమిటి లాభమన్నారు. రాయచోటి ప్రాంతాన్ని సుభిక్షం చేసే వరకు పోరాడతానని చెప్పారు. అందుకోసం ఎవరితోనైనా కలసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయని, మన జిల్లాలో మాత్రం లేదని, వెంటనే ఏర్పాటుకు తన వంతు కషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపిటిసి సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, పల్లపు రమేష్, ఎంపిపి గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జనం దాహం అంటున్నా.. దయలేని ప్రభుత్వం
చిన్నమండెం(రాయచోటి): జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేయలేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం తన కార్యాలయానికి పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే ఈ విధంగా స్పందించారు. నిర్మాణాలు జరుపుకొంటున్న పలు ప్రాజెక్టులు కూడా గత ప్రభుత్వంలో విడుదలైన నిధులతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, దీంతో ప్రజలు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. రాయచోటి పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో తాగునీటి కోసం నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయూలన్న దయ కలగడంలేదని విమర్శించారు. రెండేళ్ల పాటు గ్రామాలకు నీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రోళ్లమడుగు, వెలిగల్లు జలాశయాల నుంచి త్వరలోనే లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మండలాలకు తాగునీరు అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వం తమదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పలువురు నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీటి ఎద్దడి తీర్చడానికి కృషి చేయాలని కోరారు. గతంలో నాలుగేళ్లు అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగి, ఇప్పుడు పార్టీ మారి అధికారం తమదే అంటున్న నాయకులు ఒక్కటంటే ఒక్క గ్రామానికి కూడా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాయచోటి ప్రాంతంలో అన్ని మండలాలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పోరాడేందుకు, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు కలిసి రావాలని ఆయన కోరారు. ఇప్పటికే అవసరమైన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. దీంతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ నిధులను మొత్తం కేటాయిస్తామన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాగునీటి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని వివరించారు. -
చంద్రబాబుది బాధ్యతారాహిత్యం
-
చంద్రబాబుది బాధ్యతారాహిత్యం
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ...దేశంలో ప్రతి ముగ్గురి పిల్లల్లో ఒకరు పౌష్టకాహారలోపంతో పుడుతున్నారన్నారు. అదే విధంగా అక్షరాస్యతలోనూ వెనకబడ్డామని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సీఎం ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఉపాధి, ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. -
పెట్రో ధరలపై బాబు నోరుమెదపరేం?
అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా ఎన్డీయే సర్కారు ఆ మేరకు ఎందుకు తగ్గించట్లేదని వైఎస్సార్సీపీ సూటిప్రశ్న సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ముడి చమురు(క్రూడ్ ఆయిల్) ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడంలేదని తప్పుపట్టారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడూ ఏమీ మాట్లాడ్డం లేదన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందని, కానీ దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ ధర 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రూ.45, రూ.50ల మధ్య ఉండాలని, అయితే అదింకా రూ.67, రూ.68ల మధ్యే ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించకుండా ఎన్డీయే ప్రభుత్వం ఆ భారాన్ని ఇంకా దేశప్రజలపై మోపుతోందని వారు విమర్శించారు. వాస్తవానికి వీటి ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపెట్టిందే గతంలో ఎన్డీయే ప్రభుత్వమేనని వారు గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు, ఇక్కడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచిన కేంద్రం... ఇపుడు తగ్గిన ధరలకనుగుణంగా వీటి రేట్లను ఎందుకు తగ్గించట్లేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు. సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌లోనూ భారత్‌కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందేతప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. బాబు మాట్లాడరేం? దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాల్సిన అవసరముందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరట్లేదని వారు ప్రశ్నించారు. మనమే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదని నిలదీశారు. ముడిచమురు ధరల ప్రకారం ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లను ఉద్దేశపూర్వకంగానే ఎన్డీయే ప్రభుత్వం తగ్గించడం లేదేమోనని వారు అనుమానం వెలిబుచ్చారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటినీ ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు ఆకాశానికి అంటాయని, ఇపుడు వాటిని తగ్గించడానికీ చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు. -
క్రూడ్ ఆయిల్‌కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడం లేదని తప్పు పట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు. సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు. -
కేంద్ర ప్రభుత్వంపై ఫైరైన శ్రీకాంత్ రెడ్డి
-
ఎన్డీఏపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఫైర్
హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎ.రామకృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రజలకు మేలు జరగలేదని వారు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని వారు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మొక్కుబడిగా తగ్గించారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే రూ. 45, 50లకే పెట్రోల్ అందించాలని కానీ అలా జరగడం లేదని వారు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధర మరీ అధికంగా ఉందని గుర్తు చేశారు. పెంచిన ఛార్జీలన్ని తగ్గించాలని వారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రజాధనంతో విహార యాత్రలా ?!
-
ప్రాంతానికో నిర్ణయమా!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రాంతానికొక నిర్ణయం, జిల్లాకో ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తోందని, తద్వారా ప్రజలు తీవ్ర అసౌకర్యాలు గురవుతున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించారన్నారు. అంతకంటే దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో వెసులుబాటు కల్పించాలని కోరారు. వృద్ధులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా జిల్లాలో తాగునీటి పరిస్థితులు దుర్భరంగా మారాయని వివరించారు. రాయచోటిలో ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో తాగునీటి సమస్యను అధిగమించామని తెలిపారు. అయితే కరువు నేపధ్యంలో ట్రాన్సుఫోర్టు ద్వారా నీటిని తరలిస్తున్నారని వివరించారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అయితే ట్యాంకరుకు రూ.350 మాత్రమే కేటాయిస్తున్నారని తెలిపారు. దాంతో నీటి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వివరించారు. ట్రాక్టర్ ట్యాంకర్‌కు రూ.500 లకు పెంచితే అవసరమైన గ్రామాలకు తాగునీరు కొరత లేకుండా అందించవచ్చునని, ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంట రుణాలతో పాటు బంగారు ఆభరణాలపై రుణాలు పొందిన రైతులకు కూడ రుణమాఫీ వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వానికి వివరించారు. తాళిబొట్టు సరుడులు సైతం బ్యాంకుల్లో రైతులు పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పసుపు రైతుల్ని ఆదుకోండి.... ఎమ్మెల్యే జయరాములు రాయలసీమలో పసుపు పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారని, ఏడాది పసువు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేయాలని బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో పసుపు పండించే రైతులకు ఈ ఏడాది ప్రకృతి సహకరించలేదని, పెపైచ్చు పెస్టిసైడ్స్ కంపెనీల నిర్వాకం కారణంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పసుపు పంట రుణాలకు సైతం రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధిక పెట్టుబడితో కూడిన పసుపు రైతులు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారని, తక్షణమే ఎకరాకు రూ.20వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలే ఎజెండాగా ధ్వజం... అసెంబ్లీలో ప్రజాసమస్యలే ఎజెండాగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ వ్యవహరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, జయరాములు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అధికార పక్షం వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయం కారణంగా రైల్వేకోడూరులో 200 చిన్నతరహా పరిశ్రమలు మూత పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే శ్రీనివాసులు శాసనసభలో వివరించారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి మృగ్యమైందని తెలిపారు. ప్రభుత్వం భూనిర్వాసితులు, చిన్నతరహా పరిశ్రమల యజమానుల కడుపు కొట్టిందని వివరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ ఉద్యోగుల తొలగింపు నేపధ్యంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖర్ని తప్పుబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందనుకుంటే ఉన్నది ఊడుతోందని వివరించారు. అసెంబ్లీలో బయట ప్రభుత్వ వైఖరి ఏకపక్షంగా ఉంటుందని ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సహించరాని చర్యగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చేయని తప్పుకు ఏకపక్షంగా తనను గతంలో సస్పెన్షన్ చేశారని, అయితే తెలుగుదేశం సభ్యులు అడ్డదుడ్డంగా వ్యవహరిస్తున్నా, తోటి సభ్యుల పట్ల అవమానంగా మాట్లాడుతోన్న సాక్షాత్తు స్పీకర్ సైతం నియంత్రించకపోవడం దారణమని వివరించారు. జిల్లా ఎమ్మెల్యేలు పలు అంశాలపై మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పీకర్ అందరికీ అవకాశం కల్పించకపోవడం విశేషం. -
'సభను నడిపిన తీరుకు అధికార పక్షం సిగ్గుపడాలి'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం వ్యవహరించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్బాషా, నారాయణస్వామి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద వారు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి... సభను ఏకపక్షంగా నడిపారని విమర్శించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, నూతన రాజధాని, ఉద్యోగుల తొలగింపు, నిరుద్యోగులు, ఐకేసీ, అంగన్వాడీ వంటి ప్రజా సమస్యలపై సభలో తాము లేవనెత్తిన ఏ అంశానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. మైనారిటీ సమస్యలు లేవనెత్తడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశృ఼రు. సభను నడిపిన తీరుకు అధికారపక్షం సిగ్గుపడాలని అన్నారు. -
వైఎస్సార్ ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం
-
మేం రాజధానికి వ్యతిరేకం కాదు:వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్: తాము రాజధానికి వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత రైతుల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. మార్కెట్ యార్డ్ బిల్లును దొంగచాటుగా సభలో ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. -
కరువు ప్రాంతాలను ఆదుకోండి!