సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలన్నదే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ పనితీరును ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తోంటే చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇంట్లో టైంపాస్ కాక లేఖలు రాస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరిస్తోంటే చంద్రబాబు బాధపడుతున్నారని, పచ్చమీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు.
(ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా)
ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిని తీసుకువచ్చిందని ప్రశంసించారు. సొంత బంధువులా సీఎం జగన్ బాధిత కుటుంబాలను ఓదార్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే వందకోట్లు పబ్లిసిటి కోసమే ఖర్చు చేసేవారని శ్రీనివాస్ విమర్శించారు. (ఆన్లైన్లో బుకింగ్కు సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment