సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంగళవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా టెస్టులో స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022
Comments
Please login to add a commentAdd a comment