-
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
మణిపూర్ హింసకు స్టార్‌లింక్ వినియోగం.. మస్క్ ఏమన్నారంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో అగంతకులు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు.మణిపూర్‌లో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా మృతి చెందడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. 24 గంటల్లోపు హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌లో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై కొందరు దుండగులు దాడిచేసి నిప్పుపెట్టారు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లు సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేశారు. Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024అయితే, ఈ ఆందోళన అనంతరం,భద్రతా బలగాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. కైరావ్ ఖునౌ అనే ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంటర్నెట్ శాటిలైట్ యాంటెన్నా, ఒక ఇంటర్నెట్ శాటిలైట్ రూటర్, 20 మీటర్ల ఎఫ్టీపీ కేబుల్స్ లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు ధృవీకరించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పరికరాలలో ఒకదానిపై స్టార్‌లింక్ లోగో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సంఘ విద్రోహ శక్తులు స్టార్‌లింక్ శాటిలైట్‌ను వినియోగిస్తున్నారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ ఈ దుర్వినియోగాన్ని నియంత్రిస్తారని ఆశిస్తున్నాము’అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘ఇది తప్పు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు!
విజ్ఞాన, వినోదాల మహాసాగరం సోషల్ మీడియా. ప్రతీ నిత్యం వేల కొద్దీ వీడియోలు ఇన్‌స్టా, ట్విటర్, ఫేస్బుక్ తదితర వేదికల్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి. మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంకొన్ని వోర్నీ యేశాలో అనేలా ఉంటాయి. తాజాగా ఒక యువ జంట ముద్దుల వీడియో ఒకటి ‘అరే..ఏంటిరా ఇది’’ అని కుర్రకారు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో ఏకంగా 70 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం భలే ట్రిక్ వాడాడుగా అంటున్నారు నెటిజన్లు. అదేంటో మీరూ చూసేయండి!నోట్ : ప్రేమ అనేది వ్యక్తిగత అంశం. ఇది ఫన్నీ వీడియో అని మాత్రం గమనించగలరు. Bro unlocked new technique to get more kiss😭 pic.twitter.com/0CgkECwAsw— Bey (@beyya1202) December 11, 2024 -
దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్‌ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు. అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను. పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి. గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.దయనీయంగా వైద్య రంగంవైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిల పడుతున్నాయి. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.కుదేలైన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!దోచుకోవడం.. పంచుకోవడం రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. -
ట్విటర్ వాడొద్దు.. శివ కార్తికేయన్ లాజికల్ కామెంట్స్
'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్.. ట్విటర్ వాడొద్దని సలహా ఇస్తున్నాడు. దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని చెప్పాడు. ఇదేదో ఆషామాషీగా చెప్పకుండా లాజిక్‌తో సహా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. గోవాలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)'ఎలన్ మస్క్ నన్ను బ్లాక్ చేసినా సరే ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫెయిల్ అయినప్పుడు సోషల్ మీడియాలో చూసి తప్పొప్పులు తెలుసుకునే వాడిని. అయితే ఇది ఫలితం ఇవ్వడం సంగతి అటుంచితే మరింత నెగిటివిటీ పెంచింది. నేను యాంకర్‌గా పనిచేసినప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి నిజంగా మనుషుల్ని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడిని. తద్వారా తప్పుల్ని సరిదిద్దుకునేవాడిని. కానీ ట్విటర్(ఎక్స్)లో అలా సాధ్యం కాదు' అని శివకార్తికేయన్ చెప్పాడు.మూలాలని గుర్తుచేసుకోవడం వల్ల గత రెండేళ్లుగా మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చానని శివకార్తికేయన్ చెప్పాడు. ట్విటర్ (ఎక్స్) గురించి ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తీసుకున్నా సరే ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కువైపోయాయి. ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, అనవసరమైన వీడియోలపై కామెంట్స్ చేసి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చిక్కుల్లో ఇరుక్కోవడం లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాంగా!(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
ఎక్స్‌కు బై చెబుతున్న యూజర్లు.. మస్క్ వైఖరి మారిందా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ట్రంప్ విజయం ఖరారు అయినప్పటి నుంచి క్రమంగా ఇలాన్‌మస్క్ ఆధ్యర్యంలోని ఎక్స్ వినియోగదారులు తగ్గిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే అందుకు మస్క్ అవలంభిస్తున్న విధానాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే తయారు చేసిన ‘బ్లూస్కై’ వినియోగదారులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.డొనాల్డ్ట్రంప్ విజయానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. రిపబ్లికన్ పార్టీకి తన వంతుగా దాదాపు రూ.900 కోట్లకు పైనే విరాళం అందించారు. ఎన్నికల ప్రచారంలోనూ యాక్టివ్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ తటస్థతపై ప్రశ్నలొస్తున్నాయి. 2022లో ట్విటర్ చేజిక్కించుకున్న సమయంలో మస్క్ మాట్లాడుతూ..‘ప్రజల్లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)పై విశ్వాసం పెరగాలంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలి’ అన్నారు. కానీ, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో తన వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుకు ముందు ‘ఈసారి తన పదవీకాలం ముగిసే సమయానికి ట్రంప్‌నకు 82 ఏళ్లు వస్తాయి. దాంతో ఏ కంపెనీకు తాను సీఈఓగా ఉండేందుకు వీలుండదు. తర్వాత అమెరికాకు సారథ్యం వహించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అన్నారు. మస్క్ ఎక్స్‌ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి అందులో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోందనే వాదనలున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు ప్రసారం జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.వారంలో 10 లక్షల వినియోగదారులు ఇదిలాఉండగా, ట్విటర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థాపించిన బ్లూస్కై యాప్‌కు వినియోగదారులు పెరుగుతున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వీరి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఎన్నికల తర్వాత వారం రోజుల్లోనే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త వినియోగదారులను సంపాదించినట్లు కంపెనీ ప్రతినిధి ఎమిలీ లియు తెలిపారు. వీరిలో అధికంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగ ప్రకటనలో వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపుబ్లూస్కై అంటే ఏమిటి?జాక్ డోర్సే 2019లో బ్లూస్కైను ప్రారంభించారు. ఇది ఎక్స్, ఫేస్బుక్ మాదిరిగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. 2022లో మస్క్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీని ప్రచారాన్ని పెంచారు. ఈ ప్లాట్ఫామ్లో తాజాగా రాపర్ ఫ్లేవర్ ఫ్లావ్, రచయిత జాన్ గ్రీన్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, చస్టెన్ బుట్టిగీగ్, మెహదీ హసన్, మోలీ జోంగ్-ఫాస్ట్ వంటి ప్రముఖులు చేరారు. ప్రస్తుతం ఈ యాప్ 14.7 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. యూఎస్ ఎన్నికల తర్వాత అమెరికా, యూకేలో యాపిల్ స్టోర్ డౌన్లోడ్ చార్ట్‌ల్లో తరచుగా ఇది అగ్రస్థానంలో నిలుస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. -
నాన్నకు ఓటేయని కూతురు!
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగ్వేశ్వర్కు ఇంట్లోనే సెగ తగిలింది. ఆయన కుమార్తె నిశా ఈ ఎన్నికలో తాను ఓటు వేయలేదు. అందుకు కారణం తన తండ్రి యోగేశ్వర్ పోటీ చేయడమే అంటూ చెప్పారామె.చెన్నపట్టణలో యోగేశ్వర్ తన హక్కులను కాలరాశాడని, కాబట్టి ఎందుకు ఓటు వేస్తానని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో కూడా చేరలేదని, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. యోగేశ్వర్‌తో కుమార్తెకు ముందు నుంచి వివాదాలున్నాయి. తండ్రిపై తరచూ ఆమె విమర్శలు చేస్తూ ఉంటారు. -
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.‘కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా; నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై...పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే. కనీసం సమీక్ష అయినా నిర్వహించారా?విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి. కాంగ్రెస్ వచ్చింది. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితం.. తెలంగాణను వెంటాడుతోంది పాపం’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం...విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS— KTR (@KTRBRS) November 7, 2024 -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్సార్ నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో త్యాగాలు చేస్తే ఆంధ్రరాష్ట్రం అవతరించిందన్నారు. 2019-24 మధ్య పొట్టిశ్రీ రాములు ఆశయాలకు వైఎస్ జగన్ జీవం పోశారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను వైఎస్ జగన్ చేసి చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు జరగకపోవడం బాధాకరమని దేవినేని అవినాష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2024 -
ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘ఈ దివ్యమైన దీపాల పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ దేవి, శ్రీ గణేషుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. देशवासियों को दीपावली की अनेकानेक शुभकामनाएं। रोशनी के इस दिव्य उत्सव पर मैं हर किसी के स्वस्थ, सुखमय और सौभाग्यपूर्ण जीवन की कामना करता हूं। मां लक्ष्मी और भगवान श्री गणेश की कृपा से सबका कल्याण हो।— Narendra Modi (@narendramodi) October 31, 2024 దీనికిముందు ప్రధాని మోదీ.. ఒక పోస్టులో అయోధ్యలోని నూతన ఆలయంలో రామ్ లల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇది మొదటి దీపావళి అని, 500 సంవత్సరాలుగా రామభక్తులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత ఈ శుభ ఘట్టం వచ్చిందని పేర్కొన్నారు. अलौकिक अयोध्या!मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के अपने भव्य मंदिर में विराजने के बाद यह पहली दीपावली है। अयोध्या में श्री राम लला के मंदिर की यह अनुपम छटा हर किसी को अभिभूत करने वाली है। 500 वर्षों के पश्चात यह पावन घड़ी रामभक्तों के अनगिनत बलिदान और अनवरत त्याग-तपस्या के बाद… https://t.co/e0BwDRUnV6— Narendra Modi (@narendramodi) October 30, 2024ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు -
నువ్వా! కేసీఆర్ పేరును తుడిచేది?: రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్దం నెలకొంది. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన సంచలన వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ చెప్పులు మోసిన నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. పదవులు కోసం రేవంత్ పరితపిస్తున్న కాలంలో.. కేసీఆర్ తనకు ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడని గుర్తుచేశారు. ‘నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్’ అంటూ ఘాటుగా స్పందించారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్.. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడు. చిట్టినాయుడు. నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర కేసీఆర్.’ అని పేర్కొన్నారు.నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు…— KTR (@KTRBRS) October 30, 2024కాగా కేసీఆర్‌కు రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. ‘కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’ అంటూ పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్‌పై ట్వీట్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్స్ ఖాతా సస్పెండ్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
ఆలియా భట్ సినిమా డిజాస్టర్.. డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్ సెర్చ్ చేస్తే ట్విటర్లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. -
ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి,తాడేపల్లి : బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బద్వేల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024 ‘చంద్రబాబు మీరు వైఎస్సార్సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్ జగన్.AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి -
తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1— KTR (@KTRBRS) October 7, 2024 -
'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ సంతతికి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య అగర్వాల్ కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం సమయం వృధా అంటూ ట్వీట్ చేశారు.చాలామంది తమ వద్ద పాత ఐఫోన్స్ స్థానంలో కొత్త ఐఫోన్స్ భర్తీ చేస్తున్నారు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధా అంటూ తన ఎక్స్ వేదికగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు మారినట్లు వెల్లడించారు. కొత్త ఫోన్ తనను చాలా నిరాశపరిచింది అన్నారు.ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 16 ప్రో మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పలేను, అయితే ఏఐ సామర్థ్యాల పరంగా ఐఫోన్ 15, 16 మధ్య ఎక్కడ తేడా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. కొత్త ఫోన్ సరిగ్గా సెట్ చేయడానికి తనకు 24 గంటల సమయం పట్టిందని అన్నారు. టెక్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఇందులో ఒకరు కేవలం యూఎస్బీ-సీ ప్లగ్ కోసం మాత్రమే మారానని చెప్పుకొచ్చారు. మరొకరు కూడా కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధానే అంటూ పేర్కొన్నారు.I "upgraded" from the iPhone 14 Pro to the iPhone 16 Pro.I literally cannot tell the difference. It took me 24 hours to set up the new phone properly etc. It just feels like a waste of time.And I do not understand where this "Apple Intelligence" is????— Aditya Agarwal (@adityaag) October 3, 2024ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ఈ నెలాఖరు నాటికి మరికొన్ని ఫీచర్స్యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. డిజిటల్ జీవితాలను సులభతరం చేయడానికి సంస్థ లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది. ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఈ నెలాఖరు నాటికి వస్తాయని తెలుస్తోంది. -
‘ఎక్స్’లెంట్ ఫాలోయింగ్! అత్యధిక ఫాలోవర్లున్న ప్రముఖులు (ఫొటోలు)
-
ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం.