‘ఎక్స్’(ట్విటర్) ప్లాట్‌ఫామ్ నుంచి కంటెంట్‌ను తొలగించకపోతే తమ అధికారులను అరెస్ట్ చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఎక్స్ ప్రకటించింది. బ్రెజిల్‌లో చట్టపరమైన ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను అక్కడి అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉన్న అలెగ్జాండ్రే డి మోరిస్ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇదీ చదవండి: ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, వెంటనే ఆ సమాచారాన్ని తొలగించాలని గతంలో బ్రెజిల్ న్యాయస్థానం తెలిపింది. స్థానికంగా ఎక్స్‌లో కొందరి ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఆయా ఖాతాలను ‘ఎక్స్’ తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సైతం తొలగించకుండా న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను న్యాయమూర్తి మోరిస్ బెదిరిస్తున్నట్లు ప్రకటనలు వెలిశాయి. అయితే దీనిపై బ్రెజిల్ న్యాయస్థానం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment