బ్రసీలియా: ఎలాన్ మస్క్ ‘ఎక్స్’(పూర్వపు ట్విట్టర్)పై నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్‌ను కోరింది. అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేశారు. దీంతో.. సేవలు నిలిపివేయాలంటూ అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఎక్స్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ మస్క్‌ను బ్రెజిల్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఆపై ఈ వ్యవహారం నెలల తరబడి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి అలెగ్జాండ్రే డె మోరాయిస్ ఆదేశాలు వెల్లడించారు. 24 గంటల్లోగా ఆ ఆదేశాలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ ఏజెన్సీని ఆదేశించారాయన.
Comments
Please login to add a commentAdd a comment