Brazil
-
Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!
బ్రెజిల్లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nations Climate Change Conference)(కాప్-30) కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా రోడ్డును నిర్మించేందుకు బ్రెజిల్ అమెజాన్ అడవులలోని వేలాది చెట్లను నరికివేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. 50 వేలమంది హాజరయ్యే ఈ సదస్సు కోసం రోడ్డుమార్గాన్ని నిర్మించే పేరుతో పర్యావరణ పరిరక్షణ నిబద్ధతను బ్రెజిల్ ఉల్లంఘించిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం అమెజాన్(Amazon) వర్షారణ్యం.. అధిక మొత్తంలో కార్బన్‌ను గ్రహించడంతో పాటు, అసాధారణ జీవవైవిధ్యాన్ని కలిగివుందనే ఘనతను దక్కించుకుంది. కాప్ సదస్సు కోసం నిర్మిస్తున్న నూతన రహదారి తమ జీవనోపాధిని దూరం చేస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే వన్యప్రాణులకు ఇది ప్రమాదకరమని జంతు ప్రేమికులు అంటున్నారు. కాగా ఈ నాలుగు లేన్ల రహదారి 50 వేల మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చే ‘బెలెమ్’కు చేరేందుకు ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుందని బ్రెజిల్ పేర్కొంది. అయితే వాతావరణ శిఖరాగ్ర సమావేశం నిర్వహణ ఉద్దేశ్యానికి విరుద్ధంగా బ్రెజిల్ నిర్ణయం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ సదస్సు అమెజాన్ అడవుల గురించి ప్రపంచానికి మరింతగా తెలియజేస్తుందని బ్రెజిల్ పేర్కొంది. ఈ ఆడవులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఏమి చేస్తున్నదీ అందరికీ తెలుస్తుందని, కాప్-30 సదస్సు చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం అవుతుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా? -
మార్కో ఫినిష్డ్
అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. క్యూలికాన్లో జరిగిన గ్రూప్వార్లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్ వద్దు! -
మహిళ ప్యాంట్ జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్: ఒక్కసారిగా మంటలు
బ్రెజిల్‌లోని అనపోలిస్లోని ఒక సూపర్ మార్కెట్ లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్ ఫోన్లు అసలెందుకు పేలతాయి?షాపింగ్ మాల్ భర్తతో కలిసి షాపింగ్‌లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాద ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో, పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల వారు భయంతో పరుగులుతీశారు. దీంతో పక్కనే ఉన్న భర్త పోన్ తీసి బైట పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. View this post on Instagram A post shared by JahTop (@jahtop_)ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఎవరు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే పేలిన ఫోన్ మోటరాలా కంపెనీదని తేలింది. పేలుడుకు కారణమేమిటి?ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్లెబర్ డా సిల్వీరా మోరీరా లిథియం-అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయని, కొన్ని పరిస్థితులలో అవి వేడెక్కడంపల్ల ఒక్కోసారి పేలతాయని నిపుణులు తెలిపారు. ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలుబ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి : ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకు రావడం వల్ల, పేలవచ్చు. షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు.డూప్లికేట్ ఛార్జర్లు: చౌకైన లేదా నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో, బ్యాటరీ దెబ్బతింటుంది.బాగా వేడెక్కడం: ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు.ఛార్జింగ్‌లో ఉండగా వాడకం: గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఫలితంగా మంటలు వ్యాపించవచ్చు.పేలుడుపై కంపెనీ స్పందనపేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు మోటరోలా రంగంలోకి దిగింది. బాధితురాలితో మాట్లాడినట్టు కంపెనీ ధృవీకరించింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల ద్వారా మార్కెట్‌కు వెడతాయని, భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక విశ్లేషణ చేస్తున్నట్టు తెలిపింది. -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
చేతులు కట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి.. వలసదారులపై ట్రంప్ క్రూరత్వం
-
టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్‌గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయితాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్‌తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్‌స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.ఎవరీ గొడోయ్ ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by RICARDO GODOI (@ricardo.godoi.oficial) -
ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..
సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తులు గురించి విన్నా..ఆ వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నా ఓ సెన్సెషన్ అవుతోంది. ప్రస్తుతం జస్ట్ ముప్పై దాటగానే ఏవో వ్యాధుల బారినపడుతోంది యువత. నలభై, యాభైలకే వృద్ధుల కంటే దారుణంగా అయిపోతున్నారు. కడుపు నిండా తినలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితులో కొందరు ఏజ్‌లో సెంచరీ దాటి మరి జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నటిదాక జపాన్‌లోని బామ్మ..ఇవాళ బ్రెజిల్‌లోని మరో బామ్మ సుదీర్ఘకాలం జీవించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ బామ్మ వయసు ఎంతంటే..బ్రెజిల్‌కు చెందిన నన్ ఇనా కానబారో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జీవిస్తున్న వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవిస్తున్న సూపర్సెంటెనరియన్లను ట్రాక్ చేసే లాంగేవిక్వెస్ట్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. వీల్‌చైర్‌లో ఉండే ఆ బామ్మ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు 117 ఏళ్లు. ఆమె సుదీర్ఘజీవిత కాలం బతకడానికి గల కారణం తెలిస్తే విస్తుపోతారు. ఎందకంటే ఆమెకు నలుగురుని నవ్వించేలా జోక్స్ వేయడం అంటే ఇష్టమే. ఇదే తన హెల్త్ సీక్రెట్ అని అంటోంది బామ్మ ఇనా. ఖాళీ సమయాల్లో పూలతో సూక్ష్మ చిత్రాల తయారు చేయండం, ప్రార్థనలు చేయడం అంటే ఆమెకు ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే నన్‌గా మారి భక్తిమార్గంలోకి వెళ్లిపోయింది ఈ బామ్మ. పైగాభగవంతుడిపై ఉండే విశ్వాసం మనల్ని ఆయురారోగ్యాలతో బతికేలా చేస్తుందని నమ్మకంగా చెప్పింది. నిజానికి ఆమె ఇన్నేళ్లు బతుకుతుందని అస్సలు అనుకోలేదని ఆమె మేనల్లుడు క్లెబర్ కానబారో అన్నారు. ప్రస్తుతం ఈ బామ్మ రిటైర్మెంట్ హోమ్‌లో ఉంటుంది. ప్రతి శనివారం ఆమె మేనల్లుడు తనను చూడటానికి వస్తుంటాడు. ప్రస్తుతం ఆమె బలహీనంగా, మాట్లాడలేని స్థితిలో ఉంది. కానీ మేనల్లుడు క్లెబర్ వాయిస్ వినగానే ఉత్సాహంగా మాట్లాడే యత్నం చేస్తుందట. ఇదిలా ఉండగా, లాంగేవిక్వెస్ట్ పరిశోధకుల ప్రకారం, ఆమె జూన్ 8, 1908న దక్షిణ బ్రెజిల్‌లోని ఒక పెద్ద కుటుంబంలో జన్మించారు. ఆమె ముత్తాత 19వ శతాబ్దంలో బ్రెజిల్ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న బ్రెజిలియన్ జనరల్. ఇక ఈ బామ్మ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైరయ్యింది. ఆ తర్వాత రియో గ్రాండే డో సుల్లో స్థిరపడింది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రశాంతమైన జీవన విధానమే తన సుదీర్ఘకాల జీవన రహస్యమని అంటోంది బామ్మ ఇనా. డిసెంబరులో జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా మరణం తర్వాత ఈ బామ్మ సుదీర్ఘకాలం జీవించిన వృద్ధురాలిగా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం) -
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్ ఫెయిటస్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్ ఫెయిటస్. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్ జర్నీ పాపులర్ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ‘‘హాయ్.. నాపేరు గాబ్రియల్(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా. View this post on Instagram A post shared by Gabriel Freitas (MUP) (@mupgabriel)అయితే ఆ తర్వాత ఆ ఫేమ్ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్స్పిరేషన్. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను. VIDEO CREDITS: Headline Stream -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది దుర్మరణం
రియో డిజనీరో: బ్రెజిల్లో క్రిస్మస్ వేళ విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టి తర్వాత అందులో కింది ఫ్లోర్లో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. -
ట్రక్కును ఢీకొన్న బస్సు.. 38 మంది మృతి
బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లోని మినాస్గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortosÔnibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024 -
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
G-20 Summit: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
రియో డీజెనిరో: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. సోమవారం తెల్లవారుజామున బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. నేడు పలు దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ-20 సదస్సుకు మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది.ఇదిలా ఉండగా, జీ-20 సదస్సు అనంతరం మోదీ.. గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.#WATCH | Prime Minister Narendra Modi lands in Rio de Janeiro, Brazil.During the second leg of his three-nation tour, PM Modi will attend the 19th G20 Leaders’ Summit in Brazil, scheduled on November 18 and November 19.(Video source - ANI/DD News) pic.twitter.com/5it1R8cpXP— ANI (@ANI) November 18, 2024 -
నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
అబుజా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. నైజీరియాలో ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో మోదీ వారికి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ నేడు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.#WATCH | Prime Minister Narendra Modi lands in Abuja, the capital city of the Federal Republic of Nigeria; receives a grand welcomeHe is on a three-nation tour to Nigeria, Brazil and Guyana from November 16 to 21. On the first leg of his visit, PM is in Nigeria. In Brazil, PM… pic.twitter.com/0LWi0beBWU— ANI (@ANI) November 16, 2024 అలాగే, ఈ నెల 19న మోదీ గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.#WATCH | Nigeria: Prime Minister Narendra Modi greeted members of the Indian Diaspora as he received a grand welcome from them when he arrived at a hotel in Abuja(Source - ANI/DD News) pic.twitter.com/9Q9krfzQaP— ANI (@ANI) November 16, 2024నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది. #WATCH | Ritu Agarwal, a member of Indian Diaspora in Nigeria says, " PM said that my drawing is very good and he took the pen from me and signed the drawing. He was very happy..." pic.twitter.com/OzKdsezE07— ANI (@ANI) November 16, 2024 -
మూడు దేశాల టూర్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం(నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్‌తో పాటు భాగంగా నైజీరియా,గ్వామ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.ఐదు రోజులపాటు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. భారత్‌తో ఆయా దేశాల బంధాన్ని బలపరిచే దిశగా ప్రధాని ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలతో పాటు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను కలుస్తారు. ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’ -
Brazil: సుప్రీంకోర్టు వద్ద పేలుడు.. ఒకరు మృతి
బ్రసీలియా: బ్రెజిల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో రెండుసార్లు పేలుడు జరగడంతో ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే, పేలుడు సంభవించిన ప్రాంతానికి దగ్గరలోనే ప్రెసిడెంట్ లూలా డెసిల్వా భవనం కూడా ఉంది. పేలుడు జరిగిన సమయంలో ప్రెసిడెంట్ భవనంలో లేరని అధికారులు వెల్లడించారు.🚨🇧🇷 EXPLOSIONS ROCK BRAZIL’S SUPREME COURT, 1 DEADTwo blasts near Brazil's Supreme Court left one dead. Justices safely evacuated as police secure the area. Investigations are ongoing.pic.twitter.com/g6CRmcL6CT— Mario Nawfal (@MarioNawfal) November 13, 2024 -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
బ్రెజిల్ అధ్యక్షుడి తలకు గాయం.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనాల్సిన ఆయన బాత్రూంలో జారిపడిపోవటంతో తలకు గాయం అయింది. తలకు రక్తస్రావం కారణంగా సుదూర విమానాలను తాత్కాలికంగా నివారించాలని వైద్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన బ్రిక్స్ సమావేశాలు జరిగినే రష్యా పర్యటను రద్దు చేసుకున్నారు. అయితే.. ఆయన కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రష్యాకు ఆయన బయలుదేరాల్సింది.Lula cai no banheiro, bate a cabeça, na região occipital, que permite a visão, e tem de ficar em observação, p/ descartar coágulos de sangue.Não poderá estar na cúpula dos BRICS, na Rússia, nem na Campanha de Boulos em SP.https://t.co/TFZ4o766pM #domingoespetacular #richardrios pic.twitter.com/dxa5TOHOG4— Grupo do bem estar (@Grupodobemestar) October 20, 2024 లూయిజ్ డాక్టర్ రాబర్టో కలీల్ మీడియాతో మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు లూయిజ్ బాత్రూంలో జారీపడిపోయారు. దీంతో ఆయన తల వెనుక భాగంలో గాయం అయింది. గాయానికి కుట్లు వేయవలసి వచ్చింది. తలకు రక్తస్రావం అయింది. వారం రోజులు పాటు చికిత్స అందిస్తూ.. పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని అన్నారు. మరోవైపు.. బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి మౌరో వియెరా నేతృత్వం వహించనున్నారు. -
తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..
తండ్రిని చంపిన వాడిని హతమార్చేందుకు పోలీసుగా మారి పట్టుకోవడం వంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. ప్రతికారం తీర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడి హీరో పైకి వచ్చి విలన్ని చంపుతాడో చూసి హ్యాపీగా ఫీలవ్వుతాం. అంతే కానీ ఇదే ఘటన రియల్ లైఫ్‌లో జరిగితే..ఔను మీరు వింటుంది నిజమే. ఓ మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసుగా మారింది. మరీ ఆ హంతకుడిని పట్టుకుని హీరోలా శిక్షించిందా అంటే..ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్లో రోరైమాలోని గిస్లేనే సిల్వా డి డ్యూస్ అనే 35 ఏళ్ల మహిళ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసుగా మారింది. దారుణ హత్యకు గురైన తండ్రికి ఎట్టకేలకు న్యాయం జరిగేలా చేసింంది. అందుకోసం ఆమె 25 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి నిందితుడిని పట్టుకుని తన కుటుంబం పడ్డ బాధకు తెరపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..సదరు మహిళా పోలీసు అధికారి తండ్రి జోస్ విసెంటే ఫిబ్రవరి 1999లో జస్ట్ 20 పౌండ్ల అప్పు కోసం కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన స్థానిక బార్లో చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోస్ సూపర్ మార్కెట్ యజమాని. ఆయన స్థానిక బార్లో తన స్నేహితుడితో కలిసి పూల్ ఆడుతున్న సమయంలో ఈ దిగ్బాంతికర ఘటన జరిగింది. తన తండ్రి మార్కెట్‌కి సంబంధించిన సరఫరదారుడు రైముండో అల్వెస్ గోమ్స్ చేతిలోనే హత్యకు గురయ్యాడు. నిజానికి గోమ్స్ తన అప్పు చెల్లించాలని డిమాండ్ చేయగా ఫ్రీజర్‌తో సరిపెట్టుకోమని సూచించాడట జోస్. అయితే అందుకు గోమ్స్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో గోమ్స్ క్షణికావేశంలో తుపాకీతో జోస్ తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కేడే చనిపోయాడు జోస్. అయితే 2013లో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి గోమ్స్‌ని పట్టుకుని 12 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేస్తూ జైలు శిక్షను తప్పించుకున్నాడు. 2016లో అతని చివరి అప్పీల్‌ను తిరస్కరణకు గురై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే గోమ్స్ పట్టుబడకుండా తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇదంతా జరిగినప్పుడూ జోస్ కూతురు డ్యూస్‌కు తొమ్మిదేళ్లు. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది ఎలాగైన తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించాలని తీవ్రంగా నిశ్చయించుకుంది.అందుకోసం బోయా 18 ఏళ్ల వయసుకే న్యాయశాస్త్రం అభ్యసించింది. తర్వాత పోలీసు దళంలో చేరింది. తన తండ్రిని హతమార్చిన వాడిని ఎలాగైన న్యాయస్థానానికి తీసుకురావలన్న సంకల్పంతో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించింది. నిందితుడి ఆచూకీకై అలుపెరగని పోరాటం చేసింది డ్యూస్. చివరికి నిందితుడు బోయా విస్టాకు సమీపంలో ఉన్న నోవా సిడేడ్ ప్రాంతంలోని ఒక పొలంలో దాక్కున్నట్లు గుర్తించి సెప్టెంబర్ 25న అరెస్టు చేసింది. 60 ఏళ్ల వయసులో గోమ్స్‌ని జైలుకి పంపిచాను. అంతేగాదు అతడితో నా కారణంగానే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతడి చెంప పగిలేట్టు చెప్పగలిగాను అని ఉద్వేగంగా చెప్పింది డ్యూస్.తన తండ్రిని హతమార్చిన వాడిని పట్టుకుని సంకెళ్లు వేసిన క్షణంలో డ్యూస్కి కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేశాయి. నిజాయితీపరుడైన తండ్రిని కోల్పోవడంతో తన కుటుంబం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో మర్చిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన అమ్మ ఎట్టిపరిస్థితుల్లోనూ సరైన మార్గంలోనే పయనించండి అదే మీకు మంచి చేస్తుంది అనేది. అదే ఇవాళ నిజమయ్యింది అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది డ్యూస్. సెప్టెంబర్ 26, 2024న అల్వెస్ గోమ్స్ నేరారోపణకుగాను 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజం నిప్పులాంటిది అంటే ఇదే కదూ..!. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి
సావోపాలో: బ్రెజిల్‌లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల (108 కిలోమీటర్లు) వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు.తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. వేలాది ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయి. సావోపాలో మహానగరంలో 2 కోట్ల 10 లక్షల మంది తుపానుకు ప్రభావితమయ్యారు. ఇది కూడా చదవండి: సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా -
‘ఊపిరితిత్తు’లకు చిల్లు!
ఎండి పగుళ్లిచ్చిన నేల. నీటిచుక్క ఆనవాలు కూడా లేని తీరాల్లో బారులు తీరిన బోట్లు. కొంతకాలంగా బ్రెజిల్‌లోని ప్రధాన నదులన్నింట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలివి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వీటి దెబ్బకు ఈ సీజన్లో దాదాపుగా ప్రతి నదీ రికార్డు స్థాయిలో కుంచించుకుపోయింది. రాజధాని బ్రెజీలియాతో పాటు పలు ప్రధాన నగరాలు వరుసగా 140 రోజులుగా వాననీటి చుక్కకు కూడా నోచుకోని పరిస్థితి! దేశంలో 60 శాతానికి పైగా వరుసగా రెండో ఏడాది కరువు గుప్పెట్లో చిక్కింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి చందంగా విషమిస్తున్నాయి. ఫలితంగా 1950 తర్వాత అతి పెద్ద కరువుతో బ్రెజిల్ అల్లాడుతోంది. దీన్నిప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెజాన్ వర్షారణ్యాలకు పుట్టిల్లయిన బ్రెజిల్లో ఈ అనూహ్య పరిస్థితి సైంటిస్టులను ఆందోళనపరుస్తోంది. అయ్యో.. రియో... అమెజాన్ ఉపనదుల్లో అతి పెద్దదైన రియో నెగ్రో అయితే ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నదిలో నీటిమట్టం కొద్ది నెలలుగా ఏకంగా రోజుకు ఏడంగుళాల చొప్పున తగ్గిపోతూ కలవరపెడుతోంది. దాంతో నలుపు రంగులో నిత్యం అలరించే అపార జలరాశి మాయమై ఏకంగా నదీగర్భమే బయటపడింది. రియో నిగ్రోలో కలిసే సొలిమెస్ నదిదీ ఇదే దుస్థితి. దాని నీటిమట్టం ఈ నెలలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ రెండు నదులు కలిసిన మీదట అమెజాన్‌గా రూపొందుతాయి. వీటిలో నిత్యం తిరగాడే రవాణా నౌకలు కొంతకాలంగా నదీగర్భాల్లోని విస్తారమైన ఇసుకలో కూరుకుపోయి కని్పస్తున్నాయి. సొలిమెస్ తీరాన ఉండే టెఫ్ సరస్సులో కూడా నీళ్లు దాదాపుగా నిండుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ సరస్సు ఊహాతీతంగా చిక్కిపోయిన తీరు పర్యావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది రికార్డు ఎండలు, కనీవినీ ఎరగని కరువు దెబ్బకు ఈ సరస్సులో 200కు పైగా డాలి్ఫన్లు మృత్యువాత పడ్డాయి. ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా కనీసం రోజుకొకటి చొప్పున డాల్ఫిన్లు మరణిస్తున్నాయి. మరో నెలన్నర దాకా ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఫలితంగా బ్రెజిల్ చరిత్రలోనే తొలిసారిగా జల వనరుల్లో అత్యధికం పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దారుణ పర్యవసానాలు బ్రెజిల్లో నదులు, సరస్సులు అడుగంటితే పర్యవసానాలు దారుణంగా ఉండనున్నాయి. ఆహారం మొదలుకుని రవాణా దాకా అన్నింటికీ వీటిపైనే ఆధారపడే స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్ర్ గుయ్మే ర్స్. ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎన్న డూ చూడలేదని చెప్పుకొచ్చారు. నదీ ప్రవాహాలు దాదాపుగా ఎండిపోతున్న పరిస్థితులు చరిత్రలో బహుశా ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తీవ్రమైన వేడి పరిస్థితులు అమెజాన్ అడవులతో పాటు పొరుగునే ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చిత్తడి నేలలైన పంటనల్స్లో కూ డా కార్చిచ్చులకు కారణంగా మారుతున్నాయి.అమెజాన్. ఈ పేరు వింటూనే సతత హరితారణ్యాలు, అపారమైన జీవవైవిధ్యం, అంతులేని జలవనరులు గుర్తుకొస్తాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా అమెజాన్‌కు పేరు. కానీ వాటికిప్పుడు నిలువెల్లా చిల్లులు పడుతున్నాయి. ప్రపంచ నదుల్లోకెల్లా పెద్దదైన అమెజాన్ క్రమంగా కుంచించుకుపోతోంది. దాని ప్రధాన జల వనరులైన అతి పెద్ద ఉపనదులన్నీ కనీవినీ ఎరగనంతగా ఎండిపోతున్నాయి. అమెజాన్ పరీవాహక ప్రాంతాల్లో ప్రధాన దేశమైన బ్రెజిల్లో ఈ ధోరణి కొట్టిచి్చనట్టుగా కాన్పిస్తోంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలనే గాక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులను కూడా ఎంతగానో కలవరపెడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ కారణమేమిటి?కరువు పరిస్థితులకు దారి తీసే ఎల్ నినో గతేడాది బ్రెజిల్‌ను అల్లాడించింది. ⇒ ఈ ఏడాది దాని తీవ్రత తగ్గినా దేశవ్యాప్తంగా వాతావరణంలో వేడి పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అసాధారణ వేడి పరిస్థితులు సమస్యను మరింత పెంచుతున్నాయి. ⇒ అమెజాన్ అంతటా విచ్చలవిడిగా కొనసాగుతున్న అడవుల నరికివేత తాలూకు దుష్పరిణామాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. ⇒ పచ్చదనం విపరీతంగా తగ్గిపోతుండటంతో ఎండలు పెరుగుతున్నాయి. వానల క్రమం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ⇒ అమెజాన్ బేసిన్లో గతేడాది వచ్చిన తీవ్ర కరువుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్వర్క్ తేల్చింది. ⇒ బ్రెజిల్లో జరుగుతున్నది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల తాలూకు స్థానిక ప్రభావమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. -
అమెజాన్‌లో కార్చిచ్చులు..బ్రెజిల్‌ను కమ్మేసిన పొగ
బ్రసిలియా: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుల దెబ్బకు 80శాతం బ్రెజిల్‌ను పొగకమ్మేసింది. రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కొవిడ్ మాస్కులకు బ్రెజిల్ ప్రజలు మళ్లీ పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. గత 14 ఏళ్లలో ఇంతటి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది. ఓవైపు బ్రెజిల్ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు ఉన్న పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి. అమెజాన్ పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయి.భూమిపై అమెజాన్ బేసిన్‌కు అత్యంత తేమ ప్రాంతంగా పేరుంది. కార్చిచ్చులతో కమ్మేసిన పొగ పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల రాజధాని బ్రసిలియాలో ఆస్పత్రులకు చాలామంది రోగులు శ్వాస సంబంధ ఇబ్బందులతో చికిత్స కోసం వస్తున్నారు. బ్రసిలియాలో దాదాపు 160 రోజులుగా చుక్క వర్షం పడలేదు. దీంతో ప్రజలు తడి గుడ్డలపై ఫ్యాన్ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాగుకు వినియోగించేందుకుగాను అటవీభూమికి ప్రజలు నిప్పుపెడుతున్నట్లు గుర్తించారు. సోమవారం(సెప్టెంబర్30) బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాలో కార్చిచ్చులను నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం -
స్థూలకాయంపై పోరాటం.. 19 ఏళ్ల బాడీబిల్డర్‌ను వదలని గుండెపోటు
ఆకస్మిక గుండెపోటు మరణాలు.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా లాగేసుకుంటుంది. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువ బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివిసిస్తున్న 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు బాడీ పెంచడం ప్రారంభించాడు. కేవలం అయిదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.బాడీబిల్డింగ్‌లో పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాక 2023లో యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని తన గ్రామస్థులు అందరూ మిస్టర్ బ్లమెనౌ అని పిలుస్తుంటారు.అయితే మాథ్యూస్ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగయ సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మందుల వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని పావ్లాక్ సన్నిహితులు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఈ లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని చెబుతున్నారు. -
బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?
యువతలో బాడీ బిల్డింగ్ క్రేజ్ ఎంతలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల బాడీబిల్డర్ల వరుస మరణాలతో ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు తలెత్తాయి. వాళ్లంతా చిన్న వయసులోనే మరణించడం రకరకాల ఊహగానాలకు తెరలేపింది. అదీగా బాడీబిల్డర్‌గా అయ్యేందుకు అధిక బరువుతో చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. కొందరూ కండరాలు ధృఢంగా అయ్యేందుకు కొన్ని రకాల మందులు వాడతుంటారని ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఈ బాడీబిల్డింగ్ క్రీడ అనేది ప్రమాకరమైనదా? ఆరోగ్య సమస్యలు తప్పవా అంటే..?.బ్రెజిల్‌కి చెందిన 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. గుండెపాటు కారణంగా చనిపోయినట్లు సమాచారం. నిజానికి మాథ్యూస్ బాల్యంలో స్థూలకాయ సమస్యతో బాధపడేవాడు. దీన్ని అధిగమించేందుకు బాడీబిల్డింగ్ క్రీడను ఎంచుకున్నాడు. కేవలం ఐదేళ్లు ఆహోరాత్రులు కఠోర శ్రమతో కండలు తిరిగిన దేహంగా మార్చుకున్నాడు. అలా బాడీ బిల్డింగ్ కమ్యూనిటీలో ఒక సాధారణ పోటీదారుగా దిగి పలు కాంపీటీషన్ విజయకేతనం ఎగురవేశాడు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ బాడీబిల్డర్ చిన్న వయసులోనే కానరాని లోకలకు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తెరలేపింది. సోషల్ మీడియాలో ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నవయసులోనే అందమైన శరీరాకృతిని పొందడం అనేది అంత ఈజీ కాదని, ఏవో మందుల వాడి ఉంటారంటు అనుమానాలు లేవెనెత్తారు. మరికొందరూ మాత్రం చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం తగదని వ్యాఖ్యనించారు. అయితే అతడి కోచ్ మాత్రం గొప్ప క్రీడాకారుని పొగొట్టుకున్నానంటూ పోస్ట్ పెట్టారు. అతడి జ్ఞాపకాలతో హృదయం బరువెక్కిందంటూ బాధగా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇలా ప్లావక్లా ఏప్రిల్‌లో జోనాస్ ఫిల్హో అనే మరో బాడీ బిల్డర్ 29 ఏళ్ల వయసులో మరణించాడు. అంతకముందు మేలో బాడీబిల్డర్, క్యాన్సర్ సర్వైవర్ మేజర్కాన్ 50 ఏళ్ల వయసులో చనిపోయాడు. వారంతా బాడీబిల్డర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులే. పైగా చిన్న వయసులోనే తనువు చాలించడం బాధకరం. ఎందుకంటే ఇలా..?మంచి వ్యాయామం హృదయాన్ని బలపరుస్తుంది.కానీ బాడిబిల్డర్గా మారే క్రమంలో మితిమీరి చేసే వ్యాయామాలు గుండెపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. హృదయానికి సంబంధించిన కొరోనరీ ధమనుల కణజాలాలు దెబ్బతింటాయి. ఒక అమెరికన్ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి తన శరీర బరువులో సగానికి పైగా ఎత్తితే, గుండె జబులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని పేర్కొంది. అలాగే కండరాలు ధృఢంగా అవ్వడం కోసం స్టెరాయిడ్స్ వంటి మందులు వాడితే ఆ ప్రమాదం మరింత ఎక్కువ అని వెల్లడించింది. బాడీబిల్డర్లు తరచుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటారు. ఫలితంగా మూత్రపిండాలు, గుండె తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇక స్టెరాయిడ్స్ అంటే శరీరంలోకి నేరుగా ఇంజెక్ట్ చేసే పోషకాలు. ఇది పురుషుల స్ఖలనాన్ని తగ్గించడమే కాకుండా కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. నిజానికి బాడీబిల్డర్‌గా అవ్వాలనుకునేవారు మంచి ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. తొందరగా అవ్వాలనే క్రమంలో మందులు వంటి వాటి జోలికి పోవద్దని చెబుతున్నారు నిపుణలు. అలాగే మన శరీరం ధర్మం, పరిస్థితిని అనుసరించి బాడీ బిల్డర్‌గా అయ్యేందు కొంత సమయం పడుతుందనే విషయాన్ని గ్రహించాలని అంటున్నారు నిపుణులు. (చదవండి: స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!) -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
సావొ పౌలో: ఎలాన్ మస్క్‌కు చెందిన సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను నిషేధించేందుకు బ్రెజిల్ యంత్రాంగం నడుం బిగించింది. శని వారం నుంచి ఇంటర్నెట్తోపాటు మొబైల్ యా ప్ ద్వారా కూడా ‘ఎక్స్’అందుబాటులో లేకుండా పోయింది. బ్రెజిల్లో ‘ఎక్స్’కు న్యాయ ప్రతి నిధిని నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అలెగ్జాండర్ డీ మొరెస్ ఇచ్చిన ఆదేశాలపై నెల రోజులుగా వివాదం నడుస్తోంది. వాక్ స్వా తంత్య్రం, దుష్ప్రచారం, అతివాదులు దుర్విని యోగం చేస్తుండటం వంటి కారణాలపై జడ్జి ‘ఎక్స్’ను తప్పుబట్టారు. నెల రోజులుగా బ్రెజిల్లో ‘ఎక్స్’కు ప్రతినిధంటూ ఎవరూ లేకపోవడమేంటని ప్రశ్నించారు. 24 గంటల్లోగా ప్రతినిధిని నియమించకుంటే దేశంలో ‘ఎక్స్’ను నిషేధిస్తామని జడ్జి బుధవారం రాత్రి అల్టిమేటం జారీ చేశారు. ‘బ్రెజిల్ సార్వభౌమాధికారం, ప్రత్యేకించి న్యాయవ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేనట్లుగా ఎలాన్ మస్క్ వ్యవహ రిస్తున్నారు. తనను తాను అత్యున్నతంగా, దేశాల చట్టాలకు అతీతుడిగా భావించుకుంటున్నారు’అని డీ మోరెస్ శుక్రవారం వెలువరించిన ఉత్తర్వుల్లో తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘నా ఉత్తర్వులను అమలు చేసేదాకా నిషేధం కొనసాగుతుంది. కాదని ఎవరైనా వీపీఎన్ల ద్వారా ‘ఎక్స్’ను వాడుకునేందుకు చూస్తే రోజుకు రూ. 7.47 లక్షల జరిమానా విధిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్‌కే చెందిన స్టార్‌లింక్ ఆస్తులను స్తంభింపజేయాలని కూడా గత వారం జడ్జి ఆదేశాలిచ్చారు. జరిమానాలు చెల్లించేందుకు ‘ఎక్స్’ఖాతాల్లో చాలినంత డబ్బు లేనందున, ఒకే యాజమాన్యంలోని స్టార్‌లింక్‌పై ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్‌కు బ్రెజిల్లో 2.50లక్షల మంది ఖాతాదారులు న్నారు. కాగా, శనివారం అర్ధరాత్రిలోగా కోర్టు ఉత్తర్వు లను అమలు చేయాలని టెలి కమ్యూనికేషన్ల నియంత్ర ణ విభాగం అనాటెల్ దేశంలోని టెలికం సంస్థలకు స్ప ష్టం చేసింది. ‘ఎక్స్’కున్న అతిపెద్ద మార్కెట్లలో బ్రెజిల్ ఒకటి. దేశ జనాభాలో ఐదో వంతు, సుమారు 4 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. నిషేధం అమలు చేయడంతో వేలాది మంది బ్రెజిల్ యూజర్లు వీపీఎన్ల ద్వారా ఎక్స్‌ను వాడుకునే పనిలో పడ్డారు. ఇటువంటి వారిని గుర్తించి, జరిమానా వసూలు చేయడమెలాగనే ప్రశ్న తాజాగా అధికారులను వేధిస్తోంది.తీవ్రంగా స్పందించిన ఎలాన్ మస్క్బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలపై ‘ఎక్స్’యజమాని ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జడ్జి ముసుగులో కొనసాగుతున్న అత్యంత తీవ్ర నేరగాడు అంటూ డీ మొరెస్పై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు తమ స్టార్ లింక్ బ్రెజిల్ వినియోగదారు లకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుందన్నారు. -
‘ఈత’కు చేతులు కావాలా!.. స్వర్ణాల వీరుడు
పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనే వారంతా వివిధ రకాల వైకల్యాలతో ఇబ్బంది పడేవారే. నిబంధనలకు అనుగుణంగా దాదాపు తమలాంటి శారీరక లోపాలతో ఉన్న వ్యక్తులతోనే వారంతా పోటీ పడటం కూడా వాస్తవమే. అయినా సరే కొందరు ఆటగాళ్ల శారీరక లోపాలు అయ్యో అనిపిస్తాయి. మరికొందరి పోరాటం కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాంటి జాబితాలో ఉండే ప్లేయర్ గాబ్రియెల్ డాస్ సాంతోస్ అరాజో.డాల్ఫిన్ తరహాలో దూసుకుపోతాడుబ్రెజిల్కు చెందిన ఈ స్విమ్మర్ ఈత కొలనులో దూసుకుపోతున్న తీరు చూస్తే ఎలాంటి వైకల్యమైనా తలవంచి అభివాదం చేస్తుంది. పుట్టుకతోనే ‘ఫోకోమెలియా’ అనే వ్యాధి బారిన పడటంతో గాబ్రియెల్ రెండు చేతులూ పూర్తిగా కోల్పోయాడు. కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. ఇలాంటి స్థితిలోనూ అతను స్విమ్మింగ్‌పై ఆసక్తి చూపించి కొలనులోకి దిగాడు. మిగిలిన శరీరాన్ని మాత్రమే కదిలిస్తూ డాల్ఫిన్ తరహాలో ఈతలో దూసుకుపోయే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తీవ్ర సాధనతో పారాలింపిక్ స్విమ్మర్‌గా ఎదిగాడు. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల గాబ్రియెల్ బ్రెజిల్ దేశానికి తొలి పతకాన్ని అందించాడు. ఎస్2 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దూసుకుపోయిన అతను స్వర్ణం గెలుచుకున్నాడు. స్వర్ణాల వీరుడుఅంతేకాదు.. 1 నిమిషం 53.67 సెకన్లలోనే అతను దీనిని పూర్తి చేయడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన ఘనత గాబ్రియెల్ అతని సొంతం. విజయం సాధించిన తర్వాత తమ దేశ సాంప్రదాయ ‘సాంబా’ నృత్యాన్ని అతను ప్రదర్శించిన తీరు గాబ్రియెల్ ఘనతకు మరింత ప్రత్యేకతను తెచ్చింది. View this post on Instagram A post shared by Paralympics (@paralympics) -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
బ్రసీలియా: ఎలాన్ మస్క్ ‘ఎక్స్’(పూర్వపు ట్విట్టర్)పై నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్‌ను కోరింది. అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేశారు. దీంతో.. సేవలు నిలిపివేయాలంటూ అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎక్స్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ మస్క్‌ను బ్రెజిల్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఆపై ఈ వ్యవహారం నెలల తరబడి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి అలెగ్జాండ్రే డె మోరాయిస్ ఆదేశాలు వెల్లడించారు. 24 గంటల్లోగా ఆ ఆదేశాలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ ఏజెన్సీని ఆదేశించారాయన. -
‘ఎక్స్’ అధికారుల అరెస్టు తప్పదు!
‘ఎక్స్’(ట్విటర్) ప్లాట్‌ఫామ్ నుంచి కంటెంట్‌ను తొలగించకపోతే తమ అధికారులను అరెస్ట్ చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఎక్స్ ప్రకటించింది. బ్రెజిల్లో చట్టపరమైన ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను అక్కడి అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉన్న అలెగ్జాండ్రే డి మోరిస్ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఇదీ చదవండి: ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలుసామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, వెంటనే ఆ సమాచారాన్ని తొలగించాలని గతంలో బ్రెజిల్ న్యాయస్థానం తెలిపింది. స్థానికంగా ఎక్స్‌లో కొందరి ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఆయా ఖాతాలను ‘ఎక్స్’ తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సైతం తొలగించకుండా న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోతే అరెస్ట్‌లు తప్పవని ఎక్స్ అధికారులను న్యాయమూర్తి మోరిస్ బెదిరిస్తున్నట్లు ప్రకటనలు వెలిశాయి. అయితే దీనిపై బ్రెజిల్ న్యాయస్థానం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
వధువు ఫ్రం.. బ్రెజిల్
యశవంతపుర: మంగళూరు నగర కరంగల్పాడికి చెందిన ఆదిత్య, బ్రెజిల్‌కు చెందిన తాత్యానా ఒక్కటయ్యారు. ఆదిత్య 8 ఏళ్ల క్రితం ఐటీ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడే పనిచేసే తాత్యానాతో పరిచయమై ప్రేమ మొదలైంది. మతం, జాతి వేరైనా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకోవడంతో హిందూ సంప్రదాయం ప్రకారం మంగళూరులో ఓ ఫంక్షన్హాల్లో వైభవంగా పెళ్లి జరిగింది. -
బ్రెజిల్లో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత!
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
బ్రెజిల్ ముందుకు...
సాంటాక్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ విజేత బ్రెజిల్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రెజిల్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. బ్రెజిల్ తరఫున రాఫినా (12వ ని.లో), కొలంబియా తరఫున డేనియల్ మునోజ్ (45+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఏడు పాయింట్లతో కొలంబియా గ్రూప్ ‘టాపర్’గా నిలువగా... ఐదు పాయింట్లతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఈక్వెడార్‌తో అర్జెంటీనా; వెనిజులాతో కెనడా; పనామాతో కొలంబియా; ఉరుగ్వేతో బ్రెజిల్ తలపడతాయి. -
బ్రెజిల్ టు బెంగాల్ – ప్రేమకు దూరం తెలియదు
ఎక్కడి బ్రెజిల్? ఎక్కడి బెంగాల్? అయితే ప్రేమ బలంతో సుదూరప్రాంతాలు కూడా ఇరుగు పొరుగు గ్రామాలు అవుతాయి. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి బ్రెజిల్ అమ్మాయి పశ్చిమ బెంగాల్‌లోని తన ప్రియుడిని వెదుక్కుంటూ వచ్చింది. బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన కార్తీక్‌కు నాలుగు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో బ్రెజిల్‌కు చెందిన మాన్యులా డి సిల్వాతో పరిచయం అయింది. గూగుల్ సాక్షిగా ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. భాష సమస్య వల్ల కార్తీక్ తల్లిదండ్రులు మాన్యులాతో మాట్లాడడానికి గూగుల్ ట్రాల్సేలెట్ యాప్‌ను ఉపయోగించేవారు. ఈ యాప్‌లో బెంగాలీలో టైప్ చేసి మాన్యులా కోసం ఇంగ్లిష్‌లోకి కన్వర్ట్ చేసేవారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. కాబోయే అత్తారింటికి వచ్చిన డి సిల్వా ఇప్పుడిప్పుడే బెంగాలీ వంటకాల రుచులకు అలవాటు పడుతోంది. బెంగాలీ పదాలు నేర్చుకుంటోంది. బెంగాల్లో జరగబోయే కూతురు పెళ్లికి హాజరు కావడానికి బ్రెజిల్‌లోని మాన్యులా తల్లిదండ్రులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంట.. ఇంట్రెస్టింగ్ ఫోటోలు!
-
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆరెంజ్ పండ్ల సీజన్ మొదలవుతుంది. బ్రెజిల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్‌లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్‌వేవ్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్ జ్యూస్దే అవ్వడం గమనార్హం. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. నిరాశ్రయులైన ప్రజలు (ఫొటోలు)
-
పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
రియోడిజెనెరియో: బ్రెజిల్లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. దక్షిణ బ్రెజిల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రియో గ్రాండేలో వరదలు పోటెత్తాయి. బ్రెజిల్ గత 80 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందిపైగా చనిపోట్లు అధికారికంగా ప్రకటించారు.వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. లక్షల మంది చెల్లాచెదురయ్యారు. తాగునీరు, కరెంటు లేకుండా పోయాయి. టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. వీధులు నదుల్లా మారిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడటం లేదు.A devastating flood has hit Rio Grande do Sul in Brazil impacting more than 1 million people, of which 41,000 had already been forced to flee.UNHCR is working with local authorities and civil society to respond to this climate emergency. https://t.co/Ewm4e1IprO pic.twitter.com/IypsMLTV7s— UNHCR, the UN Refugee Agency (@Refugees) May 9, 2024తమ ఇళ్లలో దోపిడీ జరుగుతుందేమో అన్న భయంతో వారు పునరావాస కేంద్రాలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్యూబా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మొత్తం ఐదు డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. స్పందించిన బిలీయనీర్ ఎలాన్ మస్క్...బ్రెజిల్ రియో గ్రాండేలో పోటెత్తిన భీకర వరదలపై టెస్లా అధినేత, పాపులర్ బిలియనీర్ ఎలాన్‌మస్క్ స్పందించారు. స్టార్‌లింక్‌కు చెందిన 1000 టర్మినల్స్‌ను విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ కోసం ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెజిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Horse stranded on rooftop amidst the floodwater in the city of Canoas, Brazil. The city’s mayor said they were hoping to rescue the horse with a helicopter.pic.twitter.com/4CDfpA2Lst— Mahatma Gandhi (Parody) (@GandhiAOC) May 9, 2024ఇంటి మీదకు ఎక్కిన గుర్రం.. వీడియో వైరల్ రియో గ్రాండేలోని పోర్టో అలెగ్రెలోని కానోస్ పట్టణంలో పోటెత్తిన వరదల నుంచి తప్పించుకోవడానికి ఒక గుర్రం ఏకంగా ఇంటిపైకి ఎక్కి నిల్చుంది. ఈ గుర్రాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కారామెలో అని నిక్‌నేమ్‌తో నెటిజన్స్ పిలుచుకుంటున్న గుర్రాన్ని ఫైర్ ఫైటర్స్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కారామెలో వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. Man searching for survivors during the devastating floods in Brazil smashes through the roof of a fully inundated house to rescue a dog after he hears barking and whimpering. 🇧🇷🙏pic.twitter.com/51Kv6gylSM— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 9, 2024 -
బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
బ్రెజిల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 57కి చేరింది. స్థానిక అధికారులు మీడియాకు పలు వివరాల తెలిపారు.ఉరుగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లోని రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా 67 మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. 32 వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని 497 నగరాల్లో మూడింట రెండొంతుల మందిపై తుఫాను ప్రభావం పడింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఆనకట్ట పాక్షికంగా దెబ్బతింది. బెంటో గోన్సాల్వ్స్ పట్టణంలోని ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.పోర్టో అలెగ్రేలోని గైబా సరస్సులో నీరు పెరిగింది. వీధులను వరద నీరు ముంచెత్తింది. పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. రాగల 36 గంటల్లో రియో గ్రాండే దో సుల్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత
ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్ శాంటోస్ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.గాయని, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది. ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్ అయింది. 1960లో క్వీన్ ఆఫ్‌హైట్ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్. వీరికి ముగ్గురు పిల్లలు. మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట. -
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్‌కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్‌కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్‌గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్‌గా ఉంటూనే తన క్లబ్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయసు్కరాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. -
19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?
కొందరు అత్యంత చిన్న వయసులోనే కోటీశ్వరులుగా అవతరిస్తారు. తరతరాల నుంచే వచ్చే ఆస్తుల కారణంగా ఒక్కసారిగా చిన్న వయసులోనే ధనవంతులుగా అయిపోతుంటారు. చెప్పాలంటే కోటీశ్వరులు తమ ఆస్తులను వృద్ధి చేస్తూ మనవళ్లు లేదా మనవరాళ్ల పేర్ల మీద రాయడం వల్ల లేదా మరణం కారణంగానో వాళ్ల వారసులు ఇలా ధనవంతులుగా అయిపోతారు. అలానే ఇక్కడొక విద్యార్థి చిన్నవయసులోనే బిలీయనీర్‌గా అవతరించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..? 19 ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థి లివియా వోయిగ్ట్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆ జాబితాలో 33 ఏళ్ల వయసున్న దాదాపు 25 మంది యువ బిలియనీర్లు ఏకంగా రూ. 11000 కోట్లు సంపదను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఈ లివయా వోయిగ్ట్ ఎవరంటే.. ఈ ఏడాది 2024లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిన్నవయస్కురాలిగా టైటిల్‌ని గెలుచుకుంది లివయా వోయిగ్ట్. ఇంతకుమునుపు ఆ టైటిల్‌ని అందుకున్న ఎస్సిలర్ టుక్సోటికా వారసుడు డెల్ వెచియా నుంచి లివయా ఆ టైటిల్‌ని అందుకోవడం విశేషం. ఇక ఈ డెల్ వెచియా లివియా కంటే జస్టే రెండు నెలలే పెద్దవాడు. అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్ల తయారీ కంపెనీ వెగ్(WEG)ని ఆమె తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్, దివగంత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్హాస్లతో కలిసి స్థాపించారు. ఆ కంపెనీలో లివియా అతి పెద్ద వాటాదారు. ఇక లివియా సంపద నికర విలువ ఏకంగా రూ. 9 వేల కోట్లు. అలాగే ఆమె అక్క డోరా వోగ్ట్ డి అస్సిస్ కూడా ఫోర్బ్స్ అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు. ఇక డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పూర్తి చేసింది కాగా, లివియా వెగ్(WEG) కంపెనీ బహుళ జాతి కంపెనీగా దాదాపు 10కి పైగా దేశాల్లో కర్మాగారాలు ఉన్నాయి. ఆమె కంపెనీ 2022లో సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే లివియా ప్రస్తుతం బ్రెజిల్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇంకా ఆమె WEGలో బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో సాగకపోయినా అందులో అతిపెద్ద వాటాదారు కావడంతో బిలియనీర్‌గా అవతరించింది. ఇక ఈ బిలియనీర్ ర్యాంకులో చాలామంది యువ వారసులు చేరారు. అందులో ఇద్దరు ఐర్లాండ్ మిస్త్రీ సోదరులు కూడా ఉన్నారు. (చదవండి: మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!) -
ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ రాకెట్ చిక్కుముడిని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్ మ్యాప్ వివరాలను పిన్ టు పిన్ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైఈస్ట్ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పది రోజుల ప్రయాణం.. అసలు ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? ఓషన్ నెట్వర్క్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్‌తో కూడిన కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగ్ కార్గో షిప్ హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్ టెర్మినల్‌కు, ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్ కాలింగ్’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్వెర్ప్ గేట్‌వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్లోని సీఎన్ఎం టెర్మినల్‌కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది. అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోని టెర్మినల్–2కి 16వతేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్ ఇచ్చారు. కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్ టాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్రెజిల్‌కు బృందాలు.. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్లో డ్రైఈస్ట్ ఆర్డర్ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్ బెర్తింగ్ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ అవశేషాలతో వచ్చిన కంటైనర్‌ని విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోనే భద్రపరిచారు. -
అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!
దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..? బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..) -
బ్రెజిల్లో తుపాను బీభత్సం
రియోడిజెనెరియో: బ్రెజిల్లో తుపాను బీభత్సం సృష్టించింది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుపాను సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పెట్రోపోలిస్ పట్టణంలో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని, క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయని రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బబ్రెజిల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. పపువా న్యూ గినియాలో భూకంపం -
'మత్తు' బంధం బహిర్గతం
కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కలగలిసిన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం చంద్రబాబు అండ్ గ్యాంగ్ వ్యాపార పునాదులను కదిలిస్తోంది. డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలు దేరడం.. ఆ సమాచారం ఇంటర్‌పోల్ చెవిన పడటం.. వారు సీబీఐకి చేరవేయడం.. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్ట్‌కు రావడం.. ఆ కంటైనర్‌ను గుర్తించి సోదాలు, పరీక్షలు చేయడం.. అందులో కొకైన్ తదితర డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం కావడం.. అంతా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ చంద్రబాబు, ఆయన బంధుగణంపైనే చూపిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, అమరావతి: విశాఖ డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన సంధ్యా ఆక్వా కంపెనీ కూనం కోటయ్య చౌదరి వెనుక ఉన్నది తమ కోటరీయేనని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుట్రకు పదును పెడుతున్నాయి. అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను, అభూతకల్పనలను ప్రచారంలోకి తెస్తున్నాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా.. ఫ్లెక్సీలను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరిలతో దగ్గుబాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సంధ్యా ఆక్వా కంపెనీతో టీడీపీ నేతల వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఏమీ తెలీనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది. కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్ దందాచంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాల మెడకు ఇప్పటికే చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం. మసిపూసి మారేడుకాయ చేయాలన్న కుతంత్రాలు బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణలోపడిపోయారు. అంతా చౌదరి కుటుంబమే.. డ్రగ్స్ దందాలో పాత్రధారులు కూనం కోటయ్య చౌదరి కుటుంబం కాగా, సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులేనన్నది బట్టబయలైంది. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కాగా ఈ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, డ్రగ్స్ భారత్‌కు చేరుకున్నాక మార్కెటింగ్ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యుల వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. అసలు సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులోనే దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగానే ఆ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందన్నది తాజాగా సీబీఐ సోదాల్లో వెల్లడైంది. మరోవైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి నిర్వహించారన్నది వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేశ్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్ చేస్తారనే ఫొటోలు సోషల్ మీడియాలో రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఆలపాటి రాజాకూ లింకు చంద్రబాబు గీచిన గీత జవదాటరనే పేరున్న ఆలపాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలతో ఆరి్థక బంధం ఉందని నిరూపించే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు నిగ్గు తేలింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందాను విస్తరించిన సంధ్యా ఆక్వా కంపెనీతో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. బాలయ్య చిన్న అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ కుటుంబం విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం కోటయ్య చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించింది. భరత్ కుటుంబ సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్యా ఆక్వా వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా భరత్ కుటుంబంతో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిందన్నది గమనార్హం. ఈ వాస్తవాలు, పరిణామాలన్నీ కూడా డ్రగ్స్ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టంచేస్తున్నాయి. పచ్చ గ్యాంగ్ నాడు అలా.. నేడు ఇలా భారీ డ్రగ్స్‌ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఈ) కోసం విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జోనల్ కార్యాలయానికి సంధ్యా ఆక్వా దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలేమీ పాటించలేదని తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2019 సెపె్టంబర్ 18న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. నిజానికి అంతకు ముందు కూడా దరఖాస్తు చేయగా తిరస్కరించామని, ఇదే కంపెనీ అదే మళ్లీ అలానే దరఖాస్తు చేసినందున తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. సంధ్యా ఆక్వాలో నీరు, గాలి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగినంత భూమి వారి వద్ద అందుబాటులో లేదని తెలిపింది. వ్యర్థాలను సమీపంలోని కాలువలో వదిలేస్తున్నట్లు తాము గుర్తించామని ఆర్డర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. అప్పటికే ఏవైనా కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే వెంటనే వాటన్నింటినీ నిలిపివేయాలని కూడా హెచ్చరించింది. దీనిని బట్టి సంధ్యా ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందనేది సుస్పష్టం అవుతోంది. అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురదజల్లడానికి పచ్చ గ్యాంగ్, పచ్చ మీడియా విఫలయత్నం చేస్తోంది. తమ సన్నిహిత సంస్థ అని ఆ రోజు భుజానకెత్తుకుని, ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా.. ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం బయట పడేసరికి ప్లేటు ఫిరాయించాలని చూస్తోంది. కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నది టీడీపీ యత్నం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. అయోమయానికి గురై వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతున్నారు. కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు ఉన్న ఓ ఫ్లెక్సీని చూపిస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామంప్రకాశం జిల్లాలోని ఈదుమూడి వెళ్లారు. ఆ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలో కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు వేశారు. అదేమీ వైఎస్సార్సీపీ రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం అంత కంటే కాదు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది. అందులో ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు కూడా లేదు. అయినా ఆ ఫ్లెక్సీలో ఫొటో ఉంది కాబట్టి కూనం ప్రభాకర్ చౌదరి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ దు్రష్పచారం చేస్తుండటం విడ్డూరం. డ్రగ్స్ దందాలో నిండా మునిగిన చంద్రబాబు ఈ ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా భావిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘మేత’వన్నె పులి
సాక్షి, అమరావతి: డ్రై ఈస్ట్ మాటున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ పేరిట దిగుమతి చేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. రొయ్యల మేత మాటున రూ.లక్షల కోట్ల డ్రగ్స్ దందా సాగిస్తూ ‘మేత’వన్నె పులిగా ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్’ ఖ్యాతిపొందింది. ఈ క్రమంలో అసలు డ్రై ఈస్ట్ అంటే ఏమిటి? ఎలా తయారవుతుంది.? ఏయే అవసరాల కోసం ఎంత మోతాదులో వినియోగిస్తారు. ఆక్వా ఫీడ్ తయారీలో నిజంగానే వాడతారా? ఫీడ్ తయారీలో ఈ సంస్థ ఎప్పుడు అడుగు పెట్టింది ? ప్లాంట్ సామర్థ్యం ఎంత ? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది 90 శాతానికిపైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే డ్రై ఈస్ట్ అనేది సజీవ సూక్ష్మజీవుల సమాహారం. ఇదొక ఇమినో బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం సక్కరో మైసెస్. ప్రధానంగా యాక్టివ్ డ్రై ఈస్ట్, ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, ఫాస్ట్ యాక్టింగ్ ఇన్స్టంట్ ఈస్ట్, బ్రెడ్ మెషిన్ ఈస్ట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బేకరీ, ఆహార ఉత్పత్తుల తయారీలో వాటి ఆకృతి, రుచి, పెరుగుదలకు వాడుతుంటారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలోనూ కొద్దిగా వాడతారు. ఈస్ట్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయంగా చాలా ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ ఆహార ఉత్పత్తుల తయారీదారులు విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయంగా క్వాలిటీని బట్టి కిలో రూ.200 నుంచి రూ.480 వరకు ఉంటే, ఒక్క బ్రెజిల్‌లోనే కిలో రూ.70కు అందుబాటులో ఉంటుంది. కారణం ఇక్కడ ఎక్కువగా పండే బార్లీ నుంచి ఈస్ట్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఒక్క బ్రెజిల్ నుంచి ఏటా 500 టన్నుల ఈస్ట్ మన దేశానికి దిగుమతి అవుతుంది. దిగుమతి అయ్యే డ్రై ఈస్ట్‌లో నూటికి 90 శాతానికి పైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే ఉపయోగిస్తారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలో వాడకం ఐదు శాతం లోపే ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువగా ఫీడ్ సప్లిమెంట్ కోసం వాడతారు. ఆక్వా సాగులోనూ హెక్టారుకు 5 గ్రాములకు మించి వాడరు ఆక్వాసాగులో ఈస్ట్‌ను రైతులు ఉపయోగిస్తుంటారు. సాగుకు ముందు చెరువులను సిద్ధం చేసే సమయంలో వాటర్ ఫ్యూరిఫికేషన్ చేస్తారు. ఈ సమయంలో వరిపిండి, తవుడు, బెల్లం, నీరు కలిపిన ద్రావణంలో 1–2 గ్రాములు ఈస్ట్‌ను కలిపి 24 గంటలపాటు పులియబెట్టి ఆ తర్వాత చెరువులో కలుపుతారు. దీనివల్ల పైటో ప్లాంటన్ (వృక్ష సంబంధమైన ప్లవకం), జూ ప్లాంటన్ (జంతు సంబంధమైన ప్లవకం) తయారవు తుంది. వీటిని తినేందుకు రొయ్యలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇలా హెక్టార్‌కు ఐదు గ్రాములకు మించి వినియోగించరు. ఆ తర్వాత వ్యాధికారక క్రిములను తట్టుకొని మెరుగైన రోగనిరోధకశక్తిని పొందేందుకు, నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రో బయోటిక్స్గానూ వాడుతుంటారు. వీటి తయారీలో కూడా ఈస్ట్‌ను ఫీడ్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. రొయ్యల మేత తయారు చేసే ఫీడ్ కంపెనీలు దేశీయంగా 16 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 14 లక్షల టన్నుల మేత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క అవంతి ఫీడ్ కంపెనీయే ఏటా 5–6 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత సీపీఎఫ్ కంపెనీ 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే, మిగిలిన కంపెనీలన్నీ ఏటా 50 వేల నుంచి లక్ష టన్నులలోపు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏకంగా 25 టన్నులెందుకు? ఇక సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెట్ పేరిట అధికారికంగా పామర్రులో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నెల్లూరులో బ్లాక్‌వాటర్ షల్ ఫిష్ హేచరీ ఉంది. రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా మూలపేట వద్ద మరో ప్రాసెసింగ్ ప్లాంట్, వజ్రకూటం వద్ద ఏటా 60వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్వా ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మార్కెట్లోకి రాలేదు. కేజీ మేత తయారీ కోసం కేవలం 5 గ్రాములకు మించి డ్రై ఈస్ట్‌ను వాడరు. అంటే 25 టన్నుల డ్రై ఈస్ట్ ద్వారా కనీసం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మేత తయారు చేయొచ్చు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 60 వేల టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంత పెద్ద ఎత్తున డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ ఇవ్వడం వెనుక చాలా గూడుపుఠాణి ఉందని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పెద్దల సహకారంతోనే డ్రై ఈస్ట్ పేరిట డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రైతులకు రూ.కోట్లలో బకాయిలు మరోవైపు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ రోజుకు 80 టన్నుల నుంచి 150 టన్నుల రొయ్యలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తుంది. గతంలో ఎక్స్పోర్ట్ కంపెనీలు చెప్పిందే ధర.. ఇచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్సడా చట్టం చేయడం, పైగా కౌంట్ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రతి 15రోజులకోసారి పర్యవేక్షిస్తుండడంతో కంపెనీల ఆటలు సాగడం లేదు. స్థానిక ఆక్వా రైతులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈక్వెడార్ నుంచి 17 కంటైనర్లలో రొయ్యలను దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి తిరిగి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలియడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కంపెనీని కొంతకాలం పాటు సీజ్ చేసింది. ఎగుమతులకూ బ్రేకులేసింది. ఇటీవల కాలంలో ఈ సంస్థ రైతులకు రూ.కోట్లలో బకాయి పడింది. రొయ్యలు సరఫరా చేసినందుకు ఈ కంపెనీ తనకు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని భీమవరానికి చెందిన ఓ రైతు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లించేలా చూడాలి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను ప్రాసెస్ చేసి అమెరికాకు పంపుతున్న సమయంలో అప్సడా ఉక్కుపాదం మోపింది. చట్టపరంగా చర్యలు తీసుకుని కంపెనీని చాన్నాళ్లు మూసేసింది. ఇటీవల ప్రారంభించిన ఫీడ్ ప్లాంట్ తయారీకి ఎలాంటి అనుమతులూ లేవని చెబుతున్నారు. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించని ఈ సంస్థకు ఇంతపెద్ద ఎత్తున డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా ముందుగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు అణాపైసలతో సహా చెల్లించి తీరాల్సిందే. ఈ సంస్థను అడ్డంపెట్టుకుని డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న టీడీపీ, బీజేపీ పెద్దలెవరో తెలియాలంటే సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చేప చర్మం: కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్ అల్సర్లకు కూడా!
కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్ఫ్లాంటబుల్ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. Did you know? Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers. Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP — Massimo (@Rainmaker1973) March 3, 2024 -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్‌లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్‌లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్‌బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్‌లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్‌ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చివరిసారిగా బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
రోజుల వ్యవధిలో ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాల కన్నుమూత
మ్యూనిక్: రోజుల వ్యవధిలో రెండు ఫుట్‌బాల్ దిగ్గజాలు నేలరాలాయి. శనివారం బ్రెజిల్ మాజీ ఆటగాడు, నాలుగు సార్లు వరల్డ్‌కప్ విన్నర్ మారియో జగల్లో (92) తుది శ్వాస విడువగా.. ఆదివారం జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్బాయెర్ కన్నుమూశారు. 78 ఏళ్ల ఈ జర్మన్ మాజీ కెప్టెన్ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. జర్మనీ ఫుట్‌బాల్‌లో బెకెన్బాయెర్ శిఖరం. డిఫెండర్ పొజిషన్లో ఆడే ఆయన తొలుత కెప్టెన్‌గా తదనంతరం కోచ్‌గా విజయవంతమై జర్మనీకి రెండు ప్రపంచకప్ టైటిళ్లను అందించారు. పశ్చిమ జర్మనీ కెప్టెన్‌గా 1974లో ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన ఆయన 1990 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జర్మనీకి కోచ్‌గానూ వ్యవహరించారు. -
ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) తుది శ్వాస్ విడిచారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో కన్నుమూశారు. నాలుగు సార్లు వరల్డ్‌కప్ విన్నర్ అయిన మారియో.. మునుపటి తరం మేటి ఆటగాళ్లలో చివరివాడు. మారియో మరణవార్త తెలిసి ఫుట్‌బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మారియో అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. మారియో బ్రెజిల్ ఫుట్‌బాలర్‌గానే కాకుండా ఆ జట్టుకు కోచ్‌గా కూడా సేవలందించాడు. మరో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే సమకాలీకుడైన మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్‌లు గెలిచాడు. 1970లో వరల్డ్‌కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్‌గా పని చేశాడు. ఆ జట్టుకు పీలే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో కో ఆర్డినేటర్‌గా పని చేశాడు. 2002లో వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ ప్రపంచకప్ గెలిచిన ప్రతి సందర్భంలో మారియో ఆ బృందంలో ఏదో ఒక రకంగా భాగమై ఉన్నాడు. -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్‌కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్‌కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్‌కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్‌టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్‌మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్‌కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్‌తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
బ్రెజిల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న మహాత్మాగాంధీ!
రియో డీ జెనెరో : బ్రెజిల్లో కుర్రాళ్లు ఫుడ్‌బాల్ ఆడడంలో వింతేం లేదు. ఆ దేశంలో ఫుట్‌బాల్‌కు ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆట తీరో ఇంకొకటో కాదు.అతని పేరులోని గొప్పతనం. బ్రెజిల్‌లోని ట్రిండేడ్ ఫుట్‌బాల్ క్లబ్లో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్న 31 ఏళ్ల ఆ ఆటగాడి పేరు మహాత్మాగాంధీ హెబెర్పియో మట్టోస్ పిరెస్.దీంతో అందరి దృష్టి అతడిపై పడుతోంది.2011 నుంచి మహాత్మా గాంధీ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. మహాత్మాగాంధీ ఒక్క పేరే కాకుండా బ్రెజిల్‌లోని ఫుట్‌బాల్ క్లబ్బుల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల పేర్లుండడం విశేషం.ఒక ఆటగాడికి బీటిల్స్ సింగర్ జాన్ లెన్నన్ పేరుండగా మరో ఆటగాడు బ్రెజిల్ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటైన పికాచు అనే పేరు పెట్టుకున్నాడు.ఇవే కాకుండా మర్లన్ బ్రాండో,మస్కిటో లాంటివి ఇంకా చాలా అందరి దృష్టిని ఆకర్షించే పేర్లున్న ఆటగాళ్లున్నారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకారం జాతిపిత మహాత్మాగాంధీ 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫఫ్రికాలో ఉన్నపుడు అక్కడ మూడు ఫుట్‌బాల్ టీమ్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జోహెన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ ఫుట్‌బాల్ క్లబ్లును గాంధీ స్వయంగా స్థాపించారు.దీంతో ఫుట్‌బాల్ క్రీడపై గాంధీ చెరగని ముద్ర వేసినట్లయింది. ఇదీ చదవండి.. ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? -
సాలీడు కాటుతో పాపులర్ సింగర్ మృత్యువాత!
ప్రముఖ బ్రెజిల్ సింగర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. సాలీడు కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన తీవ్రంగా పోరాడిన మోరైస్ చివరికి మృత్యువాత పడ్డాడు. ముఖంపై సాలీడు కుట్టడంతో చనిపోయాడని అతని భార్య అతని భార్య జులెన్నీ లిసోబ (Jhullenny Lisboa) స్థానిక మీడియాతో వెల్లడించింది. మోరైస్ భార్య జులినీ లిసోబ అందించిన వివరాల ప్రకారం సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించింది. ఆ తరువాత ముఖం ఉబ్బిపోయింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీలా వచ్చింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మోరైస్ సోమవారం తుదిశ్వాస విడిచాడని లిసోబ తెలిపింది. అంతేకాదు మోరైస్ సవతి కూతురు (18)ని కూడా సాలీడు కుట్టిందని, అయితే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపింది. దీనిపై మోరైస్ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ కష్టసమయంలో తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఖలీజ్ టైమ్స్ ప్రకారం, మోరైస్ 15 సంవత్సరాల వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించాడు. తనదైన స్టయిల్‌తో ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో సోదరుడు ,స్నేహితుడితో కూడిన ముగ్గురు సభ్యుల బ్యాండ్ టోకాంటిన్స్, గోయాస్, మారన్హావో, పారా రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రదర్శనలతో ఆకట్టుకునేది. ఎపుడూ సంతోషంగా, నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాడని , నలుగురికీ సాయం చేసే వాడంటూ మోరైస్‌ను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు సమీప బంధువు వెస్లేయా సిల్వా. మోరైస్ ప్రతిభను గుర్తు చేసుకుంటూ తన సహచర గాయకుడికి స్నేహితులు నివాళులర్పించారు. ఇది ఇలా ఉంటే బ్రెజిల్లో, కొన్ని రాష్ట్రాల్లో యాంటీ-వెనమ్ సీరమ్‌లు ఉత్పత్తి అవుతాని ఆరోగ్య సేవల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా బాధితులకు ఉచితంగా అందిస్తామని తెలిపింది. డార్లిన్ మోరైస్ మరణానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (SES-TO) తెలిపింది. View this post on Instagram A post shared by DARLYN MORAIS (@darlynmorais) -
General Motors: 1,245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేసిన ప్రఖ్యాత సంస్థ
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధభయాలు, అనిశ్చితి వాతావరణంలో కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు కంపెనీలకు భారంగా మారుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా జనరల్ మోటార్స్ సంస్థ 1245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్ దేశంలోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న సావో జోస్ డోస్ క్యాంపస్, సావో కేటానో డో సుల్, మోగి దాస్ క్రూజెస్లోని ఫ్యాక్టరీల్లో జనరల్ మోటార్స్ 1,245 ఉద్యోగుల తొలగింపును రద్దు చేయనున్నట్లు అక్కడి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇటీవల తెలిపింది. ముందుగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా కార్మికులు బ్రెజిలియన్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగుల తొలగింపును కొనసాగించడానికి అనుమతి కోసం సంస్థ సైతం కోర్టుకెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విచారించిన కోర్టు..కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో మరుసటి రోజు జనరల్‌మోటార్స్ ఈ ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఎలాన్‌మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు జనరల్ మోటార్స్ అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిచిగాన్‌లో ఉంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్, జీఎంసీ, కాడిలాక్, బ్యూక్ తో సహా పలు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్లను తయారుచేస్తుంది. 2022 నాటికి జనరల్ మోటార్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2016లో కంపెనీ ఉద్యోగులు 2,25,000 మంది ఉండేవారు. -
ఐరాసలో వీగిపోయిన తీర్మానం
ఐరాస: గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం బ్రెజిల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడం తమను అసంతృప్తికి గురి చేసిందని అమెరికా వెల్లడించింది. ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు వేశాయి. రష్యా, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. -
బ్రెజిల్లో విమానం కూలి..14 మంది మృతి
రియో డి జనిరో: బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో చిన్న ప్యాసింజర్ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా చెప్పారు. -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి
రియో డి జెనారో: అమెజాన్ అడవుల్లో బార్సెలోస్ ప్రాంతానికి వెళ్తోన్న టూరిస్టు విమానం కుప్పకూలడంతో సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులతోపాటు ఇద్డరు సిబ్బంది కూడా మృతిచెందారు. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని మృతుల్లో స్పోర్ట్ ఫిషింగ్ నిమిత్తం బయలుదేరిన 12 మంది మగవారితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఒక స్టేట్మెంట్లో తెలిపింది అక్కడి ప్రభుత్వం. మృతుల కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సానుభూతులు తెలిపిన గవర్నర్ విల్సన్ లిమా ప్రమాదం గురించి తెలిసిన మరుక్షణం నుండి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మీడియా కథనాల ప్రకారం ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10 12 మంది టూరిస్టులతో మనౌస్ నుంచి బార్సెలోస్‌కు బయలుదేరింది.. మనౌస్ నుంచి బార్సెలోస్‌కు గంటన్నర ప్రయాణ సమయం పడుతుందని వాతావరణంసరిగ్గా లేనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. #Breaking A small plane crashed in Amazonas, Brazil, leaving at least 14 people dead, including the pilot and co-pilot. Among the victims were several American tourists. pic.twitter.com/RZ0GrYbfe6 — Bowner (@agentbowner) September 16, 2023 ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే.. -
G20 Summit: జీ20 సమావేశాల ముగింపు వేళ ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కన్నులపండుగగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఈరోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన భారత దేశం తదుపరి సమావేశాలకు బ్రెజిల్ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో ఆ దేశాధినేత లూలా డా సిల్వా చేతికి బ్యాటన్ అప్పగించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. నమ్మకముంది.. జీ20 సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం స్ఫూర్తిపై మాకు పూర్తి నమ్మకముంది. బ్రెజిల్‌కు మేము పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మా తదనంతరం వారి నాయకత్వంలో జీ20 భాగస్వామ్య లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని విశ్వసిస్తున్నామన్నారు. ఓవర్ టు బ్రెజిల్.. బ్రెజిల్ అధ్యక్షుడు నా స్నేహితుడు లూలా డా సిల్వాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తున్నాను. అయితే నవంబర్‌లో జరగబోయే వర్చువల్ సెషన్ వరకు భారత్ జీ20 ప్రెసిడెన్సీ దేశంగానే కొనసాగుతుందన్నారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను మా బృందం అతిత్వరలోనే మీతో పంచుకుంటుందన్నారు. ఈ విడత సమావేశాల్లో మీరంతా అనేక అంశాలపై మీ అభిప్రాయాలను తెలిపారు మన పురోగతిని వేగవంతం చేయడానికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు, మరెన్నో ప్రతిపాదనలు చేసారు. థాంక్ యూ.. మిత్రులారా..! దీంతో ఈ జీ20 సమావేశం ముగిసిందని నేను ప్రకటిస్తున్నాను. 'ఒక్కటే భూమి, ఒక్కటే కుటుంబం, ఒక్కటే భవిష్యత్తు' అనే నినాదంతో మనం వేసుకున్న బాటను కొనసాగించాలని కోరుతున్నానన్నారు. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో మీ అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty — ANI (@ANI) September 10, 2023 శభాష్ భారత్.. రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలను అధ్యక్ష హోదాలో భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. దక్షిణ బౌగోళానికి చక్కటి ప్రాతనిధ్యం లభించిందని అన్నారు. #WATCH | G 20 in India: "I think it (craft exhibition) is wonderful...I think the presidency has done a very good job of being a voice of the global south & the fact that they managed to get a consensus is a testament to the leadership of G 20...," says Stephane Dujarric,… pic.twitter.com/ooYqTqGfKy — ANI (@ANI) September 10, 2023 ఇక నుంచి జీ21.. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు. నిన్న(శనివారం) 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. దాంతో ఇక నుంచి జీ20 కాస్తా జీ21 కానుంది. ఇది కూడా చదవండి: జీ20 సమ్మిట్: కనువిందు చేస్తున్న రిషి సునాక్ దంపతులు.. -
బ్రిక్స్‌కు కొత్త బలం!
కాలం అందరికీ... వ్యక్తులకైనా, సంస్థలకైనా అన్నీ నేర్పుతుంది. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఆర్థికంగా జవసత్వాలు పుంజుకుంటున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన సహకార కూటమి అనంతరకాలంలో దక్షిణాఫ్రికాను కూడా కలుపుకొని బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసే సమయానికి మరో ఆరు దేశాలకు– సౌదీ అరేబియా, యూఏఈ, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టులకు ఈ సారి సభ్యత్వం లభించింది. ఈ దేశాల భాగస్వామ్యం వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇకపై దీన్ని బ్రిక్స్–11గా వ్యవహరిస్తారు. ఆరంభంలో ఆ కూటమి వైపు పెద్దగా దృష్టి సారించని దేశాలు అందులో భాగస్వాములై ఎదగాలని ఇప్పుడు తహతహలాడటం అనివార్య పరిణామం. కరోనా మహమ్మారితో, ఉక్రెయిన్ యుద్ధంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పశ్చి మార్ధ గోళ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా అమెరికా పెత్తనాన్ని బలహీన పరచాలని చూస్తున్న రష్యా, చైనాలకు ఈ పరిణామం సహజంగానే బలాన్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిశంసనకు గురయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. ఆ కోర్టులో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉండటం వల్ల అది పుతిన్‌పై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను అమలుపరచక తప్పదు. నిజంగా దక్షిణాఫ్రికా ఆ పని చేస్తుందా లేదా అన్న సంగతి అటుంచితే ఈ స్థితిలో హాజరు కావటం పుతిన్‌కే అవమానకరమవుతుంది. దాంతో ఆయన శిఖరాగ్ర సదస్సును ద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ దేశాలు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే స్థితి లేదు. మన దేశం, బ్రెజిల్ అమె రికాకూ, ఇతర పాశ్చాత్య దేశా లకూ సన్నిహితంగా ఉంటున్నాయి. ఆ మాటకొస్తే చైనా సైతం వివిధ అంశాల్లో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, దానితో బాహాటంగా ఘర్షణకు దిగాలనుకోవటం లేదు. రణరంగంలో నిలిచిన రష్యా ఒక్కటే ఇందుకు మినహాయింపు. సదస్సు ప్రారంభంలోనే ఈ ధోరణి కనబడింది. బ్రిక్స్ దేశాధినేతల్లో ఇతరులు సమానత్వం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలుండాలని మాట్లా డితే... పుతిన్ మాత్రం ఏ రకమైన పెత్తందారీ పోకడలకైనా తాము బద్ధ విరోధులమని కుండ బద్దలు కొట్టారు. తన శత్రువులు నయా వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు. పనిలో పనిగా ఉక్రెయిన్‌లో వర్తమాన సంక్షోభానికి పాశ్చాత్య దేశాల పెత్తందారీతనమే కారణమన్నారు. కూటమి విస్తరణ, దాని అమరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమి సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు చెల్లాచెదురు కావొచ్చు. కొత్త దేశాలొచ్చి అందులో చేరవచ్చు కూడా. తన ప్రయోజనాలకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరణ ఉండాలని చైనా ఏడాదిగా ప్రయత్నిస్తోంది. మన దేశం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. నిరుడు బీజింగ్‌లో జరిగిన సదస్సులోనే విస్తరణపై ఆలోచన బయల్దేరింది. సభ్యత్వానికి అర్హతలు, కూటమిలో చేరాక ఆ దేశాలు అనుసరించాల్సిన విధానాలు వగైరాలకు ఈ ఏడాదికాలంలో తుది రూపం ఇచ్చారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన వృద్ధి రేటు ఉండేవాటినే సభ్యదేశాలుగా చేర్చుకోవాలని బ్రిక్స్ మూలవిరాట్టు లైన అయిదు దేశాలూ ఏకాభిప్రాయానికొచ్చాయి. అలాగే ఇకపై కూడా అయిదు దేశాలూ ఏకాభి ప్రాయానికొస్తే తప్ప ఏ దేశానికీ సభ్యత్వం ఇవ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు అంగీకారం లభించింది. బహుళత్వం, సుస్థిర, శాంతియుత అభివృద్ధి, పరస్పర సహకారంతో ఎదుగుదల, సంస్థాగత అభివృద్ధి, బ్రిక్స్ దేశాల ప్రజానీకం మధ్య సంబంధాలు నెలకొల్పటం వగైరాల సాధనకు కృషి చేయాలన్న జోహన్నెస్‌బర్గ్ డిక్లరేషన్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడితే సంస్థ భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ఎప్పటిలాగే ఘర్షణల విషయం వచ్చేసరికి డిక్లరేషన్ ఆచితూచి వ్యవహరించిందనాలి. నిర్మాణాత్మక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చి ఊరుకుంది. అంతేతప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు. బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛా వాణిజ్య కూటమి వంటిది కాదు. దేశాల మధ్య సమన్వయం సాధించి, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినబడినా అదేం జరగలేదు. అయితే 2015లో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సమర్థవంతంగానే పనిచేస్తోంది. కూటమిలో కొంత వెనకబడిన దేశాలకు ఈ సంస్థ ద్వారానే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికైతే బ్రిక్స్‌లో చేరడానికి దక్షిణార్ధ గోళ దేశాల ఉత్సాహాన్ని సంపన్న దేశాలు ఒక హెచ్చరికగా పరిగణించక తప్పదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న దేశాల ఆకాంక్షలను గుర్తించి తగినవిధంగా వ్యవహరించకుంటే బ్రిక్స్ మాత్రమే కాదు... భవిష్యత్తులో మరిన్ని కూటములు ఉనికిలోకొస్తాయి. ఒకటైతే నిజం – ఆవిర్భవించి పదిహేనేళ్లయినా బ్రిక్స్ సంస్థాగత స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆ దేశాలమధ్య పరస్పర ఐక్యతగానీ, ఉమ్మడి లక్ష్యాలుగానీ లేవు. ఆ లోపాన్ని సవరించుకుంటే బ్రిక్స్ మరింత పటిష్టవంతమైన కూటమిగా రూపుదిద్దుకోవటం ఖాయం. -
BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!
బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది! సరిగ్గా 11 రోజుల తర్వాత..
ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్ సర్టిఫికేట్లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు. వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది. అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది. (చదవండి: మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!) -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్‌ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం. బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్‌బాలర్‌ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్‌పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది. Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu — Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023 చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్‌కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్‌తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి
బ్రెసిలియా: బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఓ నాలుగు అంతస్తుల భవనం పేకమేడను తలపిస్తూ క్షణాల వ్యవధిలో నేలకూలింది. భారీ శబ్దం చేస్తూ బిల్డింగ్ నేలకూలిన ఈ వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో అందులోని వారంతా నిద్రావస్థలో ఉండి ఉంటారని.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. శిధిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. విపత్తు నిర్వహణ బృందాలు శరవేగంగా శిధిలాలను తొలగించి మిగిలినవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు స్థానిక అధికారులు. ఇటీవల బ్రెజిల్లో జోరుగా కురిసిన వానలే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని వారంటున్నారు. ఇది కూడా చదవండి: అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా? 🔴 BRAZIL 🇧🇷| At least 3 residents killed and 15 trapped under the rubble after the collapse of a building in the Janga district, outskirts of the city of #Recife, State of Pernambuco (northeast). The heavy rains of last few days in the coastal city may have caused the accident. pic.twitter.com/DhDBNh6nfU — Nanana365 (@nananamedia365) July 8, 2023 -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇంకా తెల్లవెంట్రుక కూడా రాలేదట
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్‌బుక్ ఈమెను గుర్తించలేదు. గిన్నిస్‌బుక్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్ మహిళ పేరు బ్రాన్యాస్ మోరేరా. అయితే, గిన్నిస్ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. -
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్‌కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు. -
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Neymar Could Be Fined $1 Million: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రధాన పట్టణం రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనం నిర్మిస్తున్న నేమార్‌కు మిలియన్ డాలర్ మేర ఫైన్ వేయనున్నారు. ఈ విషయం గురించి స్థానిక మేయర్ కార్యాలయం.. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. భవనం నిర్మిస్తున్న క్రమంలో అతడు పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేకూర్చాడు. కాబట్టి మిలియన్ డాలర్ల మేర జరిమానా విధించే అవకాశం ఉంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. నేమార్ చేపట్టిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిపింది. రెండున్నర ఎకరాలు కాగా నేమార్ మాన్షన్ వద్దకు వచ్చి అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని చెప్పగా.. అతడి తండ్రి వారితో గొడవతో దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' -
సడెన్‌గా విమానం డోర్ ఓపెన్.. ప్రముఖ సింగర్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
బ్రెసీలియా: ఇటీవలి కాలంలో విమానం గాల్లో ఉన్న సమయాల్లో ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఇక, ఈ విమానంలో ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్‌తో పాటు వారి బ్యాండ్ బృందానికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఎన్హెచ్ఆర్ టాక్సీ ఏరియోకు చెందిన ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్(కార్గో డోర్) తెరుచుకుంది. దీంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. కాగా, ఈ విమానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. అయితే, మారన్ హావోలోని సావో లూయిస్‌లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో డోర్ ఓపెన్ కావడంతో వారంతా కంగారు పడ్డారు. వారి మ్యూజిక్ పరికరాలు చెడిపోతాయేమోనని టెన్షన్‌కు గురయ్యారు. అయితే, విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, విమాన సంస్థకు చెందిన అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్నొన్నాడు అలాగే, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రయాణికులు, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, డోర్ తెరుచుకున్న సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్స్ చేయగా, భయకరంగా ఉందని మరో వ్యక్తి కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు -
డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!
సాక్షి,ముంబై:డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా టాప్‌లో నిలిచింది. రికార్డు కలెక్షన్స్‌తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో భారత దేశం ఐదు దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు మొత్తం నాలుగు దేశాల లావాదేవీలను కలిపిన దానికంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వివరాలు మైగోవ్ఇండియా ట్విటర్లో షేర్ చేసింది. ఈ డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశం గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపులలో 46 శాతం వాటాను సొంతం చేసుకుంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ఇతర నాలుగు ప్రముఖ దేశాలతో కలిపిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డిజిటల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం ఆధిపత్యం కొనసాగిస్తోందని ట్వీట్ చేసింది. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) ఈ జాబితాలో 29.2 మిలియన్లతో బ్రెజిల్ రెండో స్థానంలో, చైనా 17.6 మిలియన్ల లావాదేవీలతో మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక 16.5 మిలియన్లతో 4వ స్థానంలో థాయిలాండ్ ఉండగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో అయిదో స్థానంలో ఉందని MyGovIndia డేటా పేర్కొంది. ఇదీ చదవండి: తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు! 📈 India keeps dominating the digital payment landscape! 💸🇮🇳 With innovative solutions and widespread adoption, we're leading the way towards a cashless economy. 💻#9YearsOfTechForGrowth #9YearsOfSeva@GoI_MeitY @AshwiniVaishnaw @Rajeev_GoI@alkesh12sharma @_DigitalIndia pic.twitter.com/cSfsFsq0mW — MyGovIndia (@mygovindia) June 9, 2023 -
అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ అందాల పోటీల్లో తన భార్యని కాకుండా వేరే యువతిని విజేతగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త ఒక్క ఉదుటున డయాస్ మీదకు దూకి విజేతకు ధరింపజేసే అందాల కిరీటాన్ని లాక్కుని నేలకేసి బలంగా విసిరికొట్టాడు. అందాల భామ నెత్తిన వయ్యారంగా ఒదిగిపోవాల్సిన ఆ కిరీటం కాస్తా ముక్కలు ముక్కలైపోయింది. వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలామంది అందగత్తెలు ఈ పోటీల్లో హొయలొలికించారు. రౌండ్ల వారీగా పోటీదారులను జల్లెడ పట్టగా, విజేతను ప్రకటించే సమయానికి పోటీలో చివరికి నథాలీ బెకర్, ఇమాన్యులీ బెలి అనే ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో వీరిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో కిరీటాన్ని చేత్తో పట్టుకుని విజేతకు ధరింపజేసే క్రమంలో న్యాయ నిర్ణేత కొంత డ్రామా నడిపించింది. ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు. నా భార్య ఓటమిని తట్టుకోలేకపోయా.. న్యాయనిర్ణేతలు నిర్ణయం సరైనది కాదని.. తన భార్యే ఈ పోటీల్లో గెలిచిందని, కానీ చివర్లో విజేతను తారుమారు చేస్తున్నారని అనిపించి ఆలా చేశానని నథాలీ బేకర్ భర్త వివరించాడు. అనంతరం ఈ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ.. అందాల పోటీ ముగింపు దశలో ఇలా జరగడం విచారకరమని, తమ నిర్ణయం సరైనదేనని చెప్పి ఇమాన్యులీ బెలినిని మిస్ గే బ్రెజిల్ 2023 విజేతగా ప్రకటించారు. Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn — Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023 -
భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్.. చివరికి!
పుట్టినరోజు, పెళ్లి వేడుక వంటి సందర్భాలను అందరితో కలిసి వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో బాధకరంగా ఫీల్ అవ్వాల్సిన విషయాలను కూడా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మలయాళ నటి భర్తతో విడాకులు పొందిన క్రమంలో ఫోటోషూట్ చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే మరోవ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నందుకు సంతోషంగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడ బంగీ జంప్ చేశాడు. అయితే అక్కడే అతడి ప్లాన్ అడ్డం తిరిగింది. ఊహించని ప్రమాదం ఎదురైంది. అసలేం జరిగిందంటే.. బ్రెజిల్‌కు చెందిన రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా అనే యువకుడు 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి సంతోషంగా ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలే అయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య పోరు తట్టులేక డాకులు ఇప్పించాలంటూ కోర్టుకు వెళ్లాడు. చివరికి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఎంజాయ్‌గా గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను 70 అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెగి నీటి మడుగులో జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి. ముఖంపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలోగల లగోవా అజుల్ అనే టూరిస్ట్ స్పాట్ వద్ద గత ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి మూడు నెలలైనా రఫేల్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. చదవండి: బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ఇద్దరమ్మాయిలు.. -
Neymar: శుభవార్త చెప్పిన నేమార్.. ఫొటోలు వైరల్
Neymar and Bruna Biancardi: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్, పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ప్లేయర్ నేమార్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘నీ రాక కోసం మేము కలగన్నాం. ఎన్నెన్నో ప్రణాళికలు రచించాం. నీ రాక మా జీవితాలను పరిపూర్ణం చేయడంతో పాటు రానున్న రోజులను మరింత సంతోషకరంగా మారుస్తుందని మాకు తెలుసు. నువ్వొక అందమైన కుటుంబంలో అడుగుపెట్టబోతున్నావు. తోబుట్టువులు, బామ్మ-తాతయ్యలు, అత్తమ్మలు, పిన్నమ్మలు ఇప్పటికే నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు’’ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంది. పుట్టబోయేది కూతురైనా, కొడుకైనా తమ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని.. తన గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను తొందరగా చూడాలని ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా ఈ ఫొటోల్లో నేమార్ తన భాగస్వామి బ్రూనాను, పుట్టబోయే బిడ్డను ముద్దాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో నేమార్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలో నేమార్- డావీ లుకాతో కలిసి 2011లో కూతురికి జన్మనిచ్చాడు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఈ బ్రెజిలియన్ స్టార్‌కు రెండో సంతానం. ఇదిలా ఉంటే.. 2021 నుంచి డేటింగ్ చేస్తున్న నేమార్- బ్రూనా 2022లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడు నెలల తర్వాత విడిపోతున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా ఇలా తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు. కాగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న 30 ఏళ్ల నేమార్ కల ఫిట్నెస్ సమస్యల కారణంగా కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. -
ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం!
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్ ఆన్లైన్లో పోకర్(పేకాట) గేమ్ ఆడి 1 మిలియన్ యూరోలు(భారత కరెన్సీలో దాదాపు రూ. 9 కోట్లు) పోగొట్టుకోవడం ఆసక్తి రేపింది. తన డబ్బు పోగొట్టుకోవడంతో నెయ్మర్ కన్నీటిపర్యంతం అవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొడ కండరాల గాయంతో మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న నెయ్మర్ ఇంట్లోనే ఉంటుండడంతో పోకర్ గేమ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్మర్ బుధవారం రాత్రి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో భాగంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతే తన డబ్బులు పోయాయంటూ లబోదిబో మన్న నెయ్మర్ గుక్కపట్టి ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. అయితే కాసేపటికే ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా కేవలం సరదా కోసమే అంటూ క్యాప్షన్ జత చేశాడు. పేకాటలో డబ్బులు పోవడం, రావడం సహజం. ఒకసారి పోతే.. మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత గేమ్‌లో నెయ్మర్ తాను పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన నెయ్మర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీలతో కలిసి నెయ్మర్ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Neymar é o rei do entretenimento até fazendo live slk, o cara é foda kkkkkkkkkkkkkkkkk pic.twitter.com/EGV6C5ygP0 — Portal do Neymar 🇧🇷 | Fan account (@portaldonjr) March 28, 2023 చదవండి: అమెరికాను గెలిపించిన సాయితేజ రెడ్డి -
రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి
బ్రెజిల్లో జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ రసాభాసగా మారింది. మ్యాచ్ ఓడిపోయామన్న కోపంతో ఆటగాళ్లు, జట్టు ప్రెసిడెంట్ కలిసి రిఫరీపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఫోర్త్ డివిజన్ టోర్నమెంట్లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సెర్గిపె, బొటాపొగోల మధ్య మ్యాచ్ జరిగింది. 90 నిమిషాల ఆట ముగిసిన తర్వాత సెర్గిపె ఆధిక్యంలో ఉంది. అయితే అదనంగా తొమ్మిది నిమిషాలు కేటాయించారు. ఈ సమయంలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలం కావడంతో మరో 30 సెకన్లు అదనంగా కేటాయించారు. ఎక్స్ట్రా సమయంలో రియో డి జెనెరియో క్లబ్‌కు చెందిన బొటాపొగో గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. అయితే బ్రెజిలియన్ కప్‌లో ఏదైనా మ్యాచ్ డ్రాగా ముగిస్తే ముందు ఆధిక్యంలో ఉన్న టీమ్ ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఈ లెక్కన సెర్గిపె మ్యాచ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు రిఫరీ బ్రాలియో ద సిల్వా ప్రకటించారు. ఇదంతా గమనించిన సెర్గిపె ప్రెసిడెంట్ ఎర్నన్ సేనా గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. ఆటగాళ్లతో కలిసి రిఫరీతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో రిఫరీపై ఆటగాళ్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆటగాళ్లపై లాఠీచార్జీ చేసి అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Presidente do Sergipe deitou o Bráulio da Silva Machado na porrada pic.twitter.com/QPspml5Q1q — CENTRAL DA NAÇÃO ᕦ😎ᕤ (@centraldanacao) March 3, 2023 చదవండి: 'నీకోసం ఎదురుచూస్తున్నాం'.. మెస్సీకి బెదిరింపులు మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్ -
ఓటమి అవమానంతో.. ఏడుగురి ప్రాణాలు తీశాడు
క్రైమ్: ఆటలో ఓడిపోయాడు. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆవేశంలో మళ్లీ ఆడాడు. ఈసారి చిత్తుగా ఓడాడు. దీంతో అక్కడున్నవాళ్లు హేళన చేస్తూ నవ్వారు. అది అతనికి పట్టరాని పిచ్చికోపం తెప్పించింది. ఆ క్షణికావేశంలో ఉన్మాదిగా మారిపోయి ఏడుగురి బలిగొన్నాడు. బ్రెజిల్లో దారుణం జరిగింది. పూల్ గేమ్ ఓడిన వ్యక్తి.. అందరూ నవ్వారనే కోపంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతనికి మరో వ్యక్తి సాయం చేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. బ్రెజిల్ రాష్ట్రం మాటో గ్రోస్సోలోని సినోప్ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు ఎడ్గర్ రికార్డో డె ఒలివెయిరా. సహనిందితుడి పేరు ఇజెక్వియాస్ సౌజ రిబెయిరోలు. ఇద్దరూ ఘటన తర్వాత ఓ కుగ్రామంలో తలదాచుకుని.. అక్కడి నుంచి మరో చోటుకి పరారైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. ఒలివెయిరా తొలుత ఓ వ్యక్తి చేతిలో పూల్ గేమ్ ఓడిపోయి 4,000 రియస్(776 డాలర్లు) పోగొట్టుకున్నాడు. ఆ కోపంలో అక్కడి నుంచి వెళ్లి.. ఇజెక్వియాస్ను వెంట తెచ్చుకున్నాడు. మళ్లీ ఆడదామంటూ.. గెలిచిన వ్యక్తికి సవాల్ విసిరాడు. అయితే ఈసారి కూడా గేమ్ ఓడిపోయాడు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లంతా బిగ్గరగా నవ్వడంతో కోపం ఆపుకోలేకపోయాడు. ట్రక్కులోకి వెళ్లి షాట్ గన్ తీసుకొచ్చి పూల్ ఓనర్‌తో సహా అక్కడున్న ఏడుగురిని కాల్చి చంపాడు. డబ్బులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పూల్ హాల్లోని సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు వైరల్ అయ్యాయి. -
విమానంలో విండో సీటు కోసం ఫైట్..ఏకంగా జుట్లు పట్టుకుని మరీ..
విమానంలో విండో సీటు కోసం ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. దీని కారణంగా ఫ్లైట్ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని గోఫస్ట్ ఎయిర్‌లైన్‌లో ఇద్దరు మహిళలు విండో సీటు కోసం ఘోరంగా గొడవపడ్డారు. వాస్తవానికి ఒక బిడ్డ తల్లి విండో సీటు కావాలని తన సహ ప్రయాణికురాలిని కోరింది. అందుకు ఆ ప్రయాణికురాలు తిరస్కరించింది. అంతే ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళా ప్రయాణికులిద్దరూ జుట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఫ్లైట్ అటెండెంట్, స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ విమానంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గొడవకు దిగారు. దీంతో భద్రత సిబ్బంది సదరు ప్రయాణకులందర్నీ విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు ట్విట్టర్లో పోస్ట్‌్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy — Mike Sington (@MikeSington) February 3, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బోల్సోనారోపై విచారణకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఓకే
రియోడీజనీరో: జనవరి 8వ తేదీన బ్రెజిల్ రాజధానిలో జరిగిన విధ్వంసానికి కారకులను గుర్తించేందుకు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తదితరులపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత బోల్సోనారో ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగానే లులా డిసిల్వా అధ్యక్షుడయ్యారే తప్ప, ప్రజల ఓట్లతో కాదు’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బోల్సోనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ విచారణకు అనుమతి మంజూరు చేశారు. కాగా, ఆ వీడియోను అనంతరం బోల్సోనారో తొలగించారు. -
ప్రజాస్వామ్య పరిహాస క్రీడ
కింద పడ్డా పైచేయి నాదే అనడమంటే ఇదే. బ్రెజిల్లో ఎన్నికల తుది ఫలితాలొచ్చి రెండున్నర నెలలైనా వాటిలో మతలబు ఉందంటున్న తాజా మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో మాటలు, ఆయన మద్దతుదారుల చేష్టలు అచ్చంగా అలాగే ఉన్నాయి. ఆ దేశ రాజధాని బ్రసీలియాలోనే సైనిక శిబిరాల సమీపంలో మకాం వేసిన బోల్సనారో భక్తులు సైనిక జోక్యంతోనైనా కొత్త దేశాధ్యక్షుడైన వామపక్ష లూలాను పదవి నుంచి తప్పించాలని పట్టుబట్టడం విడ్డూరం. పది వారాలైనా ఫలితం లేక వందల మంది జనవరి 8వ తేదీ ఆదివారం విధ్వంసానికి దిగిన దృశ్యాలు నివ్వెరపరుస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియపై బురద జల్లి, ప్రజాస్వామ్యానికి పాతర వేసే ప్రయత్నాలు ఆందోళనకరం. సరిగ్గా రెండేళ్ళ క్రితం అధ్యక్ష ఎన్నికల అనంతరం అమెరికాలో జరిగిన పరిణామాలను బ్రెజిల్‌లోని తాజా దాడులు గుర్తుచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైనప్పుడు 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు ఇలాగే వ్యవహరించారు. వాషింగ్టన్‌లోని ఆ దేశ పార్లమెంట్ భవనంపై వారు దాడికి దిగితే, తాజాగా బ్రెజిల్లో బోల్సనారో సమర్థకులు అధ్యక్ష భవనం, పార్ల మెంట్ భవనం, సుప్రీమ్ కోర్ట్లలో చొరబడి, విధ్వంసం సృష్టించారు. ఓటమి పాలయ్యాక జనంలోకి రాకుండా కాలక్షేపం చేస్తున్న బోల్సనారో జనవరి 1న లూలా పదవీ ప్రమాణానికి రెండు రోజుల ముందే అమెరికాకు చెక్కేశారు. కొత్త దేశాధ్యక్షుడికి దండాన్ని అందించే సంప్రదాయాన్నైనా పాటించక ముఖం చాటేయడం ఆయన మనోభావాలకీ, వాస్తవ నిరాకరణ దృక్పథానికీ అద్దం. గత అక్టోబర్ 30న ముగిసిన బ్రెజిల్ ఎన్నికల్లో అతివాద ఛాందస నాయకుడు, అప్పటి దేశాధ్య క్షుడు బోల్సనారో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దేశానికి మరోసారి ఘనకీర్తి కట్టబెడతానని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన ఆయన ఓ పట్టాన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటకొస్తే ఎన్నికల్లో ఓటమికి చాలాకాలం ముందు నుంచే ఆయన ఓ పల్లవి అందుకున్నారు. తానంటూ తిరిగి ఎన్నిక కాకపోతే, అది ఎన్నికల్లో మోసం వల్లేనని పాట పాడసాగారు. ప్రజాతీర్పు ప్రతికూలంగా వచ్చాకా ఆ మాటే ప్రచారంలో పెడుతున్నారు. ఆయన సమర్థకుల్లో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు – ధని కులు, పేదలు – యువకులు, వృద్ధులు... ఇలా అందరినీ కలిపిన సూత్రం – కమ్యూని జమ్‌పై విద్వేషం. అంతా కలసి పార్లమెంటరీ చిహ్నాలపై దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఈ ఘర్షణల్లో తన ప్రమేయం లేదని బోల్సనారో చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలు విరుద్ధంగా ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ‘దొంగలు’గా పేర్కొంటూ, తాను ఓడిపోతే హింస తప్పదని ఎన్నికలప్పుడే ఆయన సెలవిచ్చారు. ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి నేటికీ సాగుతున్న ఆయన సమర్థకుల నిరసనలు, విధ్వంసాలు అందుకు ఆచరణరూపమే. వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా అనేక రోజుల క్రితమే ఈ దాడులకు వ్యూహం, నిర్వహణ జరిగిందట. బ్రెజిల్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి పదులకొద్దీ బస్సుల్లో వచ్చి, విధ్వంసం రేపిన వ్యక్తుల వెనుక బోల్సనారో పాలనలో యథేచ్ఛగా సాగిన పర్యావరణ విధ్వంసక వర్గాల డబ్బు ఉందనీ వినిపిస్తోంది. ప్రజా స్వామ్య పాలనను అడ్డుకోవాలనే ఈ తెర వెనుక వ్యక్తుల వ్యవహారం మరింత ఆందోళనకరం. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి, 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కల్పించిన చరిత్ర లూలాది. కమ్యూనిజాన్ని బూచిగా చూపి, అవినీతి ముద్ర వేసి ఓటర్ల దృష్టి మరల్చి, పబ్బం గడుపుకోవాలన్న బోల్సనారో పాచిక తాజా ఎన్నికల్లో పారలేదు. అదీ స్వయంకృతమే. దేశంలో 7 లక్షల పైగా మరణాలతో కరోనా కట్టడిలో వైఫల్యం, అమెజాన్ అడవుల నరికివేత, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ వగైరా ఆయనకు శాపాలయ్యాయి. అయితే, వర్గాలుగా చీలిన సమాజంలో లక్షలాది ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై అపనమ్మకం, లూలా అన్నా, వామపక్షమన్నా లేనిపోని భయం కలిగించడంలో బోల్సనారో కొంత విజయవంతమైనట్టే ఉన్నారు. ఇప్పుడదే దేశానికి పెనుశాపం. తాజా విధ్వంసాలను ఆ కోణంలోనూ చూడాలి. బాధ్యులను గుర్తించి, దురంతాలను ఉక్కుపాదంతో అణచాలి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్ బయటపడినా, బోల్సనారోకు సైనిక నియంతృత్వం పైనే మక్కువ. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేని ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర మితవాదులతో, సంపన్న వర్గాలతో అంటకాగారు. ఆ ప్రయోజనాలకు లూలా అడ్డు అన్నదే ఆయన కడుపు మంట. ఈ సవాలును కొత్త అధ్యక్షుడు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారో చూడాలి. ఫాసిస్టు ధోరణులకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం, గౌరవం కలిగించడం తక్షణ లక్ష్యం. ట్రంప్ ప్రవర్తన నుంచి ప్రేరణ పొందిన బోల్సనారో ఇకనైనా మూర్ఖత్వం వీడాలి. ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజ్యాంగానికి కట్టుబడేలా తన మద్దతుదారులకు నచ్చజెప్పాలి. ఆగని ఈ ఎన్నికల సంక్షోభం నుంచి ఎంత తొందరగా బయటపడితే 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ అంత మంచిది. ‘బ్రిక్స్’ గ్రూపులో çసభ్యదేశంగా, ద్వైపాక్షికంగా బ్రెజిల్‌తో భారత్‌కు సత్సంబంధాలు న్నాయి. బోల్స్‌నారోను గతంలో మిత్రుడిగా భావించిన ప్రధాని మోదీ సైతం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన తాజా ఘటనల్ని ఖండించారు. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్యాలూ ముందుకొచ్చి, మితవాద విద్రోహులకు ఊతమివ్వబోమని తెలిసేలా చేయాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకు భంగం కలిగే ఏ పరిణామం వాంఛనీయం కాదు. ఎందుకంటే, బ్రెజిల్ హింసాత్మక గతాన్ని విస్మరించలేం. నియంతృత్వాలకూ, నిరంకుశత్వానికీ పేరుబడ్డ దక్షిణ అమెరికాలో కేవలం కొన్ని పదుల వసంతాల ఈ యువ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలు, పార్టీలదే! -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..
బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్‌పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
బ్రెజిల్ అల్లర్లపై ప్రధాని మోదీ ఆందోళన
న్యూఢిల్లీ: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీం కోర్టుపై మెరుపుదాడికి దిగారు. ఈ క్రమంలో బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘బ్రెసిలియాలోని ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేయడం, అల్లర్లు సృష్టించిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. Deeply concerned about the news of rioting and vandalism against the State institutions in Brasilia. Democratic traditions must be respected by everyone. We extend our full support to the Brazilian authorities. @LulaOficial — Narendra Modi (@narendramodi) January 9, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్లో రణరంగం.. ఫాసిస్ట్ ఎటాక్‌గా అధ్యక్షుడి అభివర్ణన.. సంబంధం లేదన్న బోల్సోనారో -
రణరంగంగా బ్రెజిల్.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన
రియో డీ జనీరియో: బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసంచేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్‌చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది. ఫాసిస్టు శక్తుల విలయం: డసిల్వా ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే. ప్రపంచ దేశాధినేతల ఆందోళన బ్రెజిల్లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనకారులనుద్దేశిస్తూ.. ‘ఎన్నికలు అనే ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందే. ఈ విషయంలో డ సిల్వా సర్కార్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని మోదీ అన్నారు. ⚠️#BREAKING | 📍#BRAZIL THE NATIONAL CONGRESS BUILDING IS BEING TOTALLY OCCUPIED BY PROTESTERS pic.twitter.com/tDKIMcIkiR — Direto da América (@DiretoDaAmerica) January 8, 2023 Some police officers of Rio de Janeiro refuse to disperse Bolsonaro supporters and clearly express their support for the protestors, according to the Clash Report. #Brazil pic.twitter.com/lLkduuBvPD — Stephiereine28🇺🇲🍊 (@stephiereine) January 9, 2023 -
Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు
Brazil Legend Pele Funeral- సాంటోస్: బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యుల మధ్యే ఈ లాంఛనం ముగించారు. అంతకుముందు విలా బెల్మిరో స్టేడియంలో పీలే భౌతికకాయాన్ని వేల మంది బ్రెజిలియన్లు సందర్శించుకొని కడసారి వీడ్కోలు తెలిపారు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా తమ దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తడంతో అంతిమయాత్ర నిర్ణీత షెడ్యూల్‌కు కాస్త ఆలస్యంగా మొదలైంది. సాంటోస్ వీధుల గుండా పీలే అంతిమయాత్ర సాగుతుండగా ‘పీలే జెర్సీ నంబర్ 10’ను అభిమానులు ప్రముఖంగా ప్రదర్శించారు. ప్రజలంతా భారమైన హృదయంతో తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ను తలచుకొని విలపించారు. తమ దేశాన్ని మూడుసార్లు ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిపిన హీరోకు విషణ్ణ వదనంతో వీడ్కోలు పలికారు. అనంతరం మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనిక వద్దకు తీసుకొచ్చారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగించారు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్’ దూరం?! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం
Pele Visit India 3 Times: బ్రెజిల్ దిగ్గజం పీలేకు భారత్‌తో చక్కని అనుబంధమే ఉంది. కెరీర్లో, అనంతరం బిజీబిజీగా ఉండే పీలే మూడు సార్లు భారత పర్యటనకు వచ్చాడు. ముందుగా 1977లో కలకత్తా (ఇప్పటి కోల్‌కతా)కు వచ్చిన పీలే... న్యూయార్క్ కాస్మోస్ టీమ్ తరఫున మోహన్ బగాన్ క్లబ్ జట్టుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. పీలే రాకతో కలకత్తా సాకర్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్! సాకర్ మేనియాలో నగరం తడిసిముద్దయ్యింది. అనంతరం మళ్లీ 2015లోనూ ఇక్కడికొచ్చాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహ యజమానిగా ఉన్న అట్లెటికో డి కోల్‌కతా క్లబ్‌కు చెందిన కార్యక్రమానికి పీలే హాజరయ్యాడు. గంగూలీతో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌లతో కలసి ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమైన పీలే.. స్కూల్ విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడాడు. ‘భారతీయ చిన్నారులతో ప్రపంచ ప్రఖ్యాత క్రీడ ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ సందర్భంగా అన్నాడు. 2018లో కూడా పీలే వచ్చినప్పటికీ ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ఎలాంటి హడావుడి చేయకుండా వెళ్లిపోయాడు. చదవండి: Rishabh Pant: ఫ్యామిలీ కోసం పంత్ కొన్న విలువైన వస్తువులు చోరీ? పోలీసుల క్లారిటీ Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! -
Pele: తల్లి కంటే ముందుగానే వెళ్లిపోయిన పీలే.. కడసారి చూసేందుకు
Pele Funeral: ప్రపంచానికి తన సత్తా చాటిన విలా బెల్మిరా స్టేడియంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే పార్థీవదేహాన్ని ఉంచుతారు. సావోపాలో శివారులో ఉన్న ఈ స్టేడియంలో సోమవారం అభిమానులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సాంటోస్లోని మెమోరియల్ నెక్రొపోలె ఎక్యుమెనికలో జనవరి 3న అంత్యక్రియలు పూర్తవుతాయి. కేవలం పీలే కుటుంబసభ్యులే దీనికి హాజరవుతారు. మాతృమూర్తి చూసేందుకు వీలుగా ఇక మంచానికి పరిమితమైన పీలే మాతృమూర్తి సెలెస్టె అరాంట్స్ చూసేందుకు వీలుగా ఆయన అంతిమయాత్రను పీలే ఇంటిముందు నుంచి తీసుకెళ్తారు. కాగా ఈ ఏడాది నవంబరు 20లో తల్లి 100వ పడిలో అడుగుపెట్టిన సందర్భంగా పీలే భావోద్వేగ నోట్ షేర్ చేస్తూ ఆమెకు విషెస్ తెలియజేశాడు. కానీ.. ఆమెను ఒంటరిని చేస్తూ తల్లి కంటే పీలే నిష్క్రమించడం బాధాకరం. ఇదిలా ఉంటే.. పీలే మరణం నేపథ్యంలో ఈ దిగ్గజానికి నివాళిగా బ్రెజిల్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అవయవాలన్నీ పాడైపోయి మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ను గెలిపించిన బ్రెజిలియన్ సాకర్ కింగ్ పీలే గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సావోపాలోలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో 82 ఏళ్ల పీలే కన్నుమూశాడు. గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన అతను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు. గతనెల ఆరోగ్యం విషమించడంతో అతన్ని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అవయవాలన్నీ క్రమంగా పాడైపోవడంతో అతని శరీరం చికిత్సకు స్పందించ లేదు. చివరకు గురువారం క్యాన్సర్‌తో పోరాటాన్ని విరమించి లోకాన్ని వీడాడు. పీలే అసలు పేరు ఇదే పీలే అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ View this post on Instagram A post shared by Pelé (@pele) -
Pele: అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
ఆటే అతని లోకం... ఆటే అతని ప్రాణం... చురుకుదనంలో అతనో పాదరసం... గోల్ చేస్తే లోకమే దాసోహం... అతను డ్రిబ్లింగ్ చేస్తే బిత్తరపోవాల్సిందే... అటాకింగ్‌కు దిగితే చేతులెత్తేయాల్సిందే... ఫార్వర్డ్‌గా అతని విన్యాసాలకు సలాం కొట్టాల్సిందే... ఇంత గొప్ప ఆటగాడు ఫుట్‌బాల్‌లో ఉన్నందుకు ఆ క్రీడే మురిసింది. తమ జట్టులో ఆటగాడైనందుకు బ్రెజిల్ అదృష్టం చేసుకుంది. దీంతో ఈపాటికే అందరికి అర్థమై ఉంటుంది... అతనేవరో కాదు సాకర్ సమున్నత శిఖరం పీలే అని! నిజం... అతని ఆట అద్భుతం. అతని గోల్స్ అసాధారణం. అతని అంకితభావం నిరుపమానం. వరం పొందిన బ్రెజిల్‌కు... అంకితమైపోయిన ఫుట్‌బాల్‌కు... మెప్పించిన గోల్స్‌కు... అతనితో ఆడి అలసిన ప్రత్యర్థులకు... తమకిది భాగ్యమనుకున్న ప్రేక్షకులకు... కురిపించిన ఆదరాభిమానాలకు సెలవు చెప్పాడు పీలే! గతేడాది పెద్దపేగు క్యాన్సర్ బారిన పడిన పీలే.. మహమ్మారి ముందు ఓడి.. 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పది దేశాలు (శాశ్వత) ఆడే క్రికెట్లో విశిష్ట క్రికెటర్లు (ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్) ఎంతో మంది ఉన్నారు. కానీ రెండొందల దేశాలు ఆడే ఫుట్‌బాల్ లో మాత్రం అత్యుత్తమ ఆటగాళ్లు అతికొద్ది మందే! అదికూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందే సాకర్ సూపర్స్టార్లు ఉన్నారు. వారిలో పీలే మాత్రం కచ్చితంగా అగ్రగణ్యుడు అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేనేలేదు. అందుకే అతన్ని ‘ద కింగ్’ అంటారు. బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్... గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్... గోల్‌పోస్ట్ వద్ద ఎగిరొస్తే హెడర్... కింది నుంచి పాస్ అయితే చక్కని కిక్ షాట్... ఇలా బంతి ఎటునుంచి వచ్చినా... తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా... డిఫెండర్లు గోడ కట్టినా... గోల్ కీపర్ కంచెలా నిలుచున్నా... పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి మంత్రముగ్ధమైన ప్రదర్శనతో, ప్రత్యర్థి శిబిరాన్ని నిశ్చేష్టుల్ని చేసే ఆటతీరుతో గోల్స్ కొట్టే నైపుణ్యం పీలేకు మాత్రమే సాధ్యం. అచ్చుతప్పు పిలుపుతో... మినాస్ గెరయిస్ రాష్ట్రంలోని చిన్న గ్రామం ట్రెస్ కొరకోస్లో 1940 అక్టోబర్ 23న జన్మించిన పీలే అసలు పేరు అది కాదు. నిజానికి అది పేరులోంచి తెచ్చుకున్న పదం కూడా కాదు. పీలే పేరు... ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో! ఇతనికి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. తండ్రి ఫుట్‌బాలర్ కావడంతో ఆ పిచ్చి కాస్త వయసుతో పాటే పెరిగింది. 11 ఏళ్ల ప్రాయంలో అతని నైపుణ్యాన్ని గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్ ప్లేయర్ ఒకరు సాంటోస్ యూత్ క్లబ్లో చేర్పించాడు. అచిరకాలంలోనే సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. స్కూల్లో చదివే రోజుల్లో వాస్కోడి సావో లౌరెంకో క్లబ్ గోల్ కీపర్ ‘బిలే’ పీలే ఫేవరెట్ ఆటగాడు. అతడిని ‘బీలే’గా కాకుండా పీలేగా తప్పుగా పిలిచేవారు. ఆ తర్వాత సహచర విద్యార్థులు ఈ పేరును పీలేకు పెట్టేశారు. ఆ పేరు ఇప్పుడు ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని సంతకం చేసింది. అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! ఆతని ఆటన్న... అతనికి ఉన్న క్రేజన్న ఎంటో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తుంది. 1969లో నైజీరియా అంతటా అంతర్యుద్దంతో అట్టుడుకుతోంది. పీలే అప్పటికే విశ్వవ్యాప్త ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. కానీ ఏమూలో అనుమానం... ఈ అగ్గితో సాంటోస్ క్లబ్, స్టేషనరీ స్పోర్ట్స్ క్లబ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుందా? అని... అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ నైజీరియాలోని రెండు వర్గాలు పీలే ఆట కోసం విరామం ప్రకటించాయి. దీంతో కాసేపు అంతర్యుద్దం అటకెక్కగా ... ఆట మైదానంలో ఉరకలెత్తించింది. అట్లుంటది పీలేతోని! ఖాళీగా కూర్చోలేదు రిటైర్మెంట్ తర్వాత... ఇన్ని పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు సాధించాక ఇక ఆటపాట నాకెందుకని ప్రశాంతంగా కూర్చోలేదు. ఆటగాడిగా బిజీగా గడిపిన తర్వాత డాక్యుమెంటరీ నటుడిగాను మెప్పించాడు. ఆల్బమ్‌లను రూపొందించాడు. పలు ఆటోబయోగ్రఫీలను కూడా ప్రచురించాడు. వ్యాపారవేత్తగాను విజయవంతమయ్యాడు. అనంతరం ఈ విశిష్ట ఫుట్‌బాలర్‌ను 1994లో యునెస్కో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. మరుసటి ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు... తమ దేశ క్రీడల మంత్రిగాను నియమించారు. 1997లో క్వీన్ ఎలిజబెత్ –2 చేతుల మీదుగా ‘నైట్‌హుడ్’ను కూడా అందుకున్నాడు. ఇంత చేసినా... ఇతనికి తప్పలేదు ఫుట్‌బాల్ ఆట ప్రభను పెంచి... బ్రెజిల్ సాకర్ సత్తాను చాటి... క్రీడకే నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పీలేకు ‘నల్లజాతి’ అవమానాలు తప్పలేదు. అభిమానులు, సాకర్ లోకం అతన్ని వేనోళ్ల స్తుతిస్తే మతిలేని మంద, గిట్టని ప్రబుద్ధులు కొందరు అతని వర్ణం సాకుతో గేలిచేశారు. నల్ల కోతిలాంటి వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. కానీ దీపం మండే కొద్దీ వెలుగును ప్రభవించినట్లే... ఆడే కొద్దీ తన ఆటతీరుతో పీలే ఫుట్‌బాల్ క్రీడకే వన్నె తెచ్చాడు తప్ప తలొగ్గే పని, తలదించుకునే పని ఏనాడూ చేయలేదు. మూడు వరల్డ్‌కప్ విజయాల్లో... బ్రెజిల్ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్ కోసం స్వీడన్‌కు రిజర్వ్ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు. 17 ఏళ్ల టీనేజ్‌లో ప్రపంచకప్ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్ చాంపియన్‌షిప్‌లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్ (1962) నాటికి స్టార్ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్ డమ్’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు. 1966 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన బ్రెజిల్ గ్రూప్ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్ అని పీలే ప్రకటించాడు. తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్ ఆడి బ్రెజిల్ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేశాడు. మూడు ప్రపంచకప్ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. 3: పీలే గెలిచిన ప్రపంచకప్‌ల సంఖ్య. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గడంలో పీలే కీలకపాత్ర పోషించాడు. మూడు ప్రపంచకప్‌లు సాధించిన ఒకే ఒక్క ఫుట్‌బాలర్‌గా పీలే రికార్డు నెలకొల్పాడు. 17: బ్రెజిల్ తొలిసారి 1958లో విశ్వవిజేతగా నిలిచినపుడు జట్టులో సభ్యుడిగా ఉన్న పీలే వయస్సు. ప్రపంచకప్‌లో పాల్గొన్న, ప్రపంచకప్‌ను సాధించిన పిన్న వయస్సు ప్లేయర్‌గా పీలే పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కెరీర్ విశేషాలు 92: అధికారిక, అనధికారిక మ్యాచ్‌ల్లో కలిపి పీలే సాధించిన ‘హ్యాట్రిక్’ల సంఖ్య. 30: మ్యాచ్‌లో పీలే నాలుగు గోల్స్ చొప్పున 30 సార్లు సాధించాడు. 1283: పీలే 1954 నుంచి 1977 మధ్య కాలంలో అధికారిక, అనధికారిక, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి మొత్తం 1363 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 1283 గోల్స్ సాధించాడు. 6: మ్యాచ్‌లో పీలే కనీసం ఐదు గోల్స్ చొప్పున ఆరుసార్లు నమోదు చేశాడు. 77: బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున 92 మ్యాచ్‌లు ఆడి పీలే చేసిన గోల్స్. 12: ప్రపంచకప్ టోర్నీలలో పీలే సాధించిన గోల్స్. వ్యక్తిగత వివరాలు జన్మదినం: అక్టోబర్ 23, 1940 ఎక్కడ: ట్రెస్ కొరకోస్, బ్రెజిల్. అసలు పేరు: ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్ నాసిమియాంటో. పెళ్లిళ్లు 3: రోజ్మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. పీలేకు ప్రముఖుల నివాళులు ►ఆటను అందంగా తీర్చిదిద్దిన యోధుడు. ఫుట్‌బాల్‌ను కళాత్మకంగా మార్చిన లెజెండ్ పీలే. –నెమార్ జూనియర్ (బ్రెజిల్) ►ఆల్‌టైమ్ సాకర్ సూపర్ స్టార్ పీలే. మీరే మా అందరికీ స్ఫూర్తి. –మెస్సీ (అర్జెంటీనా) ►సాకర్ స్టార్, ఫుట్‌బాల్ కింగ్ పీలే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. నాపై మీరు కురిపించిన ప్రేమానురాగాలు నేనెప్పటికీ మరచిపోలేను. –క్రిస్టియానో రొనాల్డో ►(పోర్చుగల్) అతడిక లేడన్నది చేదు నిజం... కానీ అతని ఆట చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ పీలే. –ఎంబాపే (ఫ్రాన్స్) ►స్పోర్టింగ్ లెజెండ్ పీలే. ఫుట్‌బాల్ కింగ్‌కు ఘనమైన నివాళి. – బోల్ట్ (దిగ్గజ స్ప్రింటర్) ►పీలే లేని లోటు పూడ్చలేనిది. తన ఆటతో, అద్భుత విన్యాసాలతో ఎల్లలెరుగని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అతని స్ఫూర్తిమంతమైన జీవితం భావి తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. –భారత ప్రధాని మోదీ చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్ అలా బతికిపోయింది! Pele Old Goals Video: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే -
అసమాన ఆటతీరుకు సలాం.. చెక్కుచెదరని రికార్డులకు గులాం
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించాడు పీలే. సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన కొన్ని రికార్డులు ఇవి... ► బ్రెజిల్‌కు మూడు వరల్డ్ కప్‌లను పీలే అందించాడు. 1958, 1962, 1970 మూడు సార్లు బ్రెజిల్ వరల్డ్ కప్ గెలవడంతో పీలే కీలక పాత్ర పోషించాడు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ అందుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ► 1958 వరల్డ్ కప్ తో పీలే ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభమైంది. అప్పటికీ పీలే వయసు 17 ఏళ్లు మాత్రమే. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా పీలే రికార్డ్ సృష్టించాడు. ► 1958 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో పీలే ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కేవలం 23 మూడు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి బ్రెజిల్‌ను విజేతగా నిలిపాడు. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ చేసిన యంగెస్ట్ ప్లేయర్ అతడే కావడం గమనార్హం. ► వరల్డ్ కప్‌లో గోల్ చేసిన 18 కంటే తక్కువ వయసున్న ఏకైక ఆటగాడు కూడా పీలే కావడం విశేషం. ► బ్రెజిలియన్ క్లబ్ సాంటోస్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు పీలే కావడం గమనార్హం. 659 మ్యాచ్‌లలో 643 గోల్స్ చేశాడు పీలే. కెరీర్ మొత్తంగా 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే 1283 గోల్స్ చేశాడు. ► బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పీలే 12 గోల్స్ చేశాడు. ► పీలే బ్రెజిల్ తరుఫున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పీలే ఒలింపిక్స్‌లో మాత్రం ఒక్కసారి కూడా బరిలో దిగలేదు. ► ఒక ఏడాదిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్ పీలేనే. 1959వ ఏడాదిలో పీలే 127 గోల్స్ చేశాడు. ► పీలే కెరీర్లో మొత్తం 92 రెండు సార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. -
'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి?
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ ఆటకే వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పీలే 82 ఏళ్ల వయసులో డిసెంబర్ 29న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. మరి మనం ఇంతలా ఆరాధిస్తున్న పీలే అసలు పేరేంటో తెలుసా? అదేంటి పీలే అసలు పేరు కాదా అనే అనుమానం రావొచ్చు. ఆయన అసలు పేరు పీలే కాదు.. అది కేవలం ముద్దుపేరు. పీలే అసలు పేరు 'ఎడిసన్ అరాంట్స్ డో నాసిమియాంటో'. పేరు పలకడమే కష్టంగా ఉంది కదూ.. కానీ పీలే అసలు పేరు మాత్రం ఇదేనండి. అమెరికా శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్పై ప్రేమతో తండ్రి డోండిన్హో ఆ పేరు పెట్టుకున్నాడు. అయితే పాఠశాలలో స్నేహితులు పెట్టిన పీలే అనే పేరు ఆ తర్వాత స్థిరపడిపోయింది. అదే పేరుతోనే ఫుట్‌బాల్ ఆటలో చరిత్ర సృష్టించాడు. తన అసలు పేరు అర్థం తనకే తెలియదని పీలే ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే పీలే అనే పేరు మాత్రం ఎలా వచ్చిందనేది గుర్తుందన్నాడు. ''పోర్చుగీస్ భాషలో ఫుట్‌బాల్‌ను పాదంతో కిక్ కొడితే 'పీ' అని.. అదే సమయంలో నేను చేసిన తప్పులను ఎత్తిచూపుతూ పోర్చుగీసు భాషలో 'లే' అని పదం వాడారు. ఆ తర్వాత స్కూళ్లో అందరూ ''పీలే.. పీలే'' అని పిలిచేవారు. ఆ తర్వాత నా అసలు పేరు పోయి ''పీలే''గా సిర్థపడిపోయాను. కానీ పీలే అనే పేరు నాకు ఇష్టం ఉండదు. అసలు పేరు పలకడానికి కష్టంగా ఉన్నప్పటికి.. కుటుంబసభ్యులు, ఆప్తులు.. ''డీకో'' అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఫీలయ్యేవాడిని'' అని పేర్కొన్నాడు. ఇక పీలే బాల్యం కడు పేదరికంలో సాగింది. తండ్రి ఫుట్‌బాల్ ప్లేయర్ అయినప్పటికి సొంతంగా ఫుట్‌బాల్ కొనిచ్చేంత స్థోమత మాత్రం లేదు. దీంతో సాక్సుల్లో పేపర్లు నింపి బంతిలా తయారు చేసి ఫుట్‌బాల్ ఆడేవాడు. అలా చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌పై మమకారం పెంచుకున్న పీలే తన బాల్యంలో చాలా స్థానిక ఫుట్‌బాల్ క్లబ్స్‌లో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో రేడియం అనే స్థానిక ఇండోర్ ఫుట్‌బాల్(ఫుట్సల్) జట్టులో సభ్యుడయ్యాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే. 14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడడం గొప్ప విషయం అయినప్పటికి వారితో అతను ఎలా నెట్టుకురాగలడని అంతా సందేహపడ్డారు. ఇండోర్ ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు చాలా దగ్గరగా ఉంటారు. దీంతో మెరుపు వేగంతో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడే పీలే ఫుట్‌బాల్‌ను ఎంత వేగంగా ఆడాలనేది నేర్చుకొని రాటుదేలాడు. అక్కడి నుంచి పీలే వెనుదిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. ఇక ఆ ఏడాది పీలే జట్టు ఇండోర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. టోర్నీలో మొత్తంగా పీలే 15 గోల్స్ చేయడం విశేషం. ఆ తర్వాత పీలే చిన్ననాటి కోచ్ డి బ్రిటో.. అతన్ని శాంటోస్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌కు పరిచయం చేశాడు. ఆ జట్టు తరపున 15 ఏళ్ల వయసులో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే పీలే వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. ఇక పీలే తన మొదటి ఫిఫా వరల్డ్‌కప్ ఆడే సమయానికి వయస్సు 17 ఏళ్లు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఒక కుర్రాడు ఆ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. పైగా టోర్నీలో అడుగుపెట్టే సమయానికి పీలే మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కానీ నొప్పిని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగిన పీలే మొత్తం ఆరు గోల్స్ చేసి బ్రెజిల్‌ను తొలిసారి చాంపియన్స్‌గా నిలబెట్టాడు. ఆ తర్వాత 1962 ఫిఫా వరల్డ్‌కప్ బ్రెజిల్ గెలిచినప్పటికి పీలే పెద్దగా మెరవలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల్లో తన మార్క్‌ను చూపెట్టాడు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1970 ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం మరోసారి పీలే తన మ్యాజిక్ చూపెట్టాడు. అద్భుత ప్రదర్శనతో గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్న పీలే ముచ్చటగా మూడోసారి బ్రెజిల్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. పీలే తన కెరీర్ మొత్తంలో(ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి) 1363 మ్యాచ్‌ల్లో 1281 గోల్స్ చేయడం విశేషం. ఇక అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్ చేశాడు. ఇప్పటితరంలో గొప్ప ఆటగాళ్లుగా పేరు పొందిన మెస్సీ, రొనాల్డోలు ఇన్ని గోల్స్ చేయడానికి దాదాపు వెయ్యి మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. చదవండి: Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ -
దివికేగిన దిగ్గజం.. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే అరుదైన ఫోటోలు
-
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
FIFA: విజేత అర్జెంటీనా మాత్రం కాదు.. 'అంత కుళ్లెందుకు'
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ రొనాల్డో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2022 గెలుచుకునేది ఎవరనే దానిపై అంచనా వేశాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా మాత్రం టైటిల్ కొట్టే అవకాశం లేదని.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఫ్రాన్స్ మరోసారి కప్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రొనాల్డో పేర్కొన్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. మంగళ, బుధవారాల్లో రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా, క్రొయేషియా తలపడుతుండగా.. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, ఆఫ్రికన్ సెన్సేషన్ మొరాకో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో రొనాల్డో ఇంటర్య్వూలో మాట్లాడాడు. ''మెస్సీ ఈసారైనా తన వరల్డ్‌కప్ కల నెరవేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. సెమీఫైనల్లోనే క్రొయేషియా చేతుల్లో అర్జెంటీనా ఓడిపోయే అవకాశం ఉంది. అయితే ఒక కపట వ్యక్తిలాగా ఉంటూ అర్జెంటీనా గెలిస్తే సంతోషిస్తానని చెప్పను. నేను ఫుట్‌బాల్‌ను రొమాంటిక్ యాంగిల్లో చూస్తా. ఎవరు ఛాంపియన్ అయినా సంతోషమే. అయితే మొదటి నుంచి నా ఫేవరెట్స్ లిస్ట్‌లో బ్రెజిల్, ఫ్రాన్సే ఉన్నాయి. ఇప్పుడు బ్రెజిల్ లేదు.. లిస్ట్‌లో ఉన్న ఫ్రాన్స్ రోజురోజుకు ఫెవరెట్ అనే ట్యాగ్‌ను మెరుగుపరచుకుంటూ వస్తోంది. ఇప్పటికీ ఆ టీమ్‌నే నేను ఫెవరెట్స్ అని చెప్పగలను. ఇక రెండో సెమీఫైనల్లో మొరాకోనే గెలవాలని అనుకుంటున్నా. కానీ అది జరుగుతుందని అనుకోవడం లేదు. ఫ్రాన్స్ టీమ్ చాలా బలంగా ఉంది. డిఫెన్స్, అటాక్, మిడ్‌ఫీల్డ్ ఇలా ఏది చూసుకున్నా ఫ్రాన్స్ బలంగా కనిపిస్తోంది" అని రొనాల్డో పేర్కొన్నాడు. చదవండి: క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్ 'మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.. చర్చ అవసరమా?' -
వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్మర్.. కథ ముగిసినట్లే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఫుట్‌బాల్ అభిమానుల గుండెలు బరువెక్కాయి. టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో క్రొయేషియా 4-3 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. అంతే అంతవరకు నెయ్మర్.. నెయ్మర్ అంటూ మారుమోగిన స్టేడియం ఒక్కసారిగా నిశబ్దంగా మారిపోయింది. ఒకపక్క క్రొయేషియా సంబరాలు జరుపుకుంటుంటే.. బ్రెజిల్ ఆటగాళ్లు మాత్రం నిరాశలో మునిగిపోయారు. బ్రెజిల్ గుండెబలం అయిన నెయ్మర్ ఓటమి బాధతో ఒక్కక్షణం చిన్నపిల్లాడిలా మారిపోయాడు. మ్యాచ్ ఓటమితో మైదానంలోనే కూలబడిన నెయ్మర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తమ అభిమాన ఆటగాడు అలా ఏడుస్తుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పండి. పీలే, రొనాల్డో, రొనాల్డినో తర్వాత బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నెయ్మర్ ఈ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా దిగ్గజం పీలే రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు నెయ్మర్ బ్రెజిల్ తరపున 77 గోల్స్ చేశాడు. ఈ ఆనందం అతనికి ఎక్కువసేపు కూడా నిలవకుండా పోయింది. మరి నెయ్మర్ వెక్కి వెక్కి ఏడ్వడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్లు. మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉన్నప్పటికి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే తరచూ గాయాల బారిన పడుతూ ఆటకు దూరమవుతున్న నెయ్మర్ మరో నాలుగేళ్లు ఇదే ఫిట్నెస్తో ఉంటాడా అంటే చెప్పలేం. ఇక గాయం కారణంగా 2014 ఫిఫా వరల్డ్‌కప్‌కు నెయ్మర్ పూర్తిగా దూరమయ్యాడు. ఆ తర్వాత 2015లో కోపా అమెరికా కప్ ఆడకుండా నిషేధం, 2018లో సెమీస్‌లో ఇంటిబాట పట్టడం, 2019 కోపా అమెరికా కప్‌ను బ్రెజిల్ తృటిలో మిస్ చేసుకుంది. తాజాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్మర్.. రౌండ్ ఆఫ్ 16 ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అతని ఆటతీరు చూసి బ్రెజిల్ మరోసారి ఛాంపియన్ అవుతుందని అంతా భావించారు. ఇక క్వార్టర్ ఫైనల్లోనూ నెయ్మర్ అదే దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న గాయాలతో చాలా ఇబ్బంది పడుతున్న నెయ్మర్ వచ్చే వరల్డ్‌కప్ ఆడుతానో లేదో అన్న సందేహం అతనిలో ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక నెయ్మర్ కథ దాదాపు ముగిసినట్లే. ఫుట్‌బాల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ 2002లో చివరిసారి ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. 2014లో సెమీఫైనల్లో ఇంటిబాట పట్టిన బ్రెజిల్.. మిగతా మూడుసార్లు క్వార్టర్స్‌కే పరిమితమైంది. Million heart brokes neymar crying 💔💔 #FIFAWorldCup #Neymar pic.twitter.com/ENHlraFJJG — Henry 🇧🇩 (@shoaibA21211051) December 9, 2022 -
FIFA WC: బ్రెజిల్ గుండె పగిలింది
పెనాల్టీ షూటౌట్... అప్పటికే బ్రెజిల్ 2–4తో వెనుకబడి ఉంది. నాలుగు ప్రయత్నాల్లోనూ క్రొయేషియా స్కోరు చేయగా, బ్రెజిల్ రెండు సార్లే సఫలమైంది. ఇలాంటి సమయంలో మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. స్టేడియం మొత్తం ఉత్కంఠ, ఈ షాట్ సరిగా పడకపోతే... ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు... గోల్‌పోస్ట్ కుడి వైపు గురి పెడుతూ మార్కినోస్ కిక్ కొట్టాడు. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ ఎడమ వైపు దూకాడు... దాంతో బంతి లక్ష్యం చేరినట్లే అనిపించింది. కానీ నేరుగా గోల్ పోస్ట్‌కు తాకి వెనక్కి వచ్చింది ! అంతే...మార్కినోస్ కుప్పకూలిపోగా, బ్రెజిల్ ఆటగాళ్లంతా అచేతనంగా ఉండిపోయారు. మరోసారి హీరోగా మారిన లివకోవిచ్ను చుట్టుముట్టి క్రొయేషియా సంబరాల్లో మునిగిపోగా, స్టేడియంలో బ్రెజిల్ అభిమానుల గుండె పగిలింది. విషాదంతో నిండిపోయిన ‘సాంబా’ బృందం కన్నీళ్లపర్యంతమైంది. ఐదుసార్లు విజేత, టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో రిక్త హస్తాలకే పరిమితమైన తమ జట్టు పరిస్థితిపై ఫ్యాన్స్ వేదన చూసి సగటు ఫుట్‌బాల్ అభిమానీ అయ్యో అంటూ బాధపడిపోయాడు! దోహా: వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్ మరోసారి టైటిల్‌కు బహు దూరంలో నిలిచిపోయింది. గెలుపు అవకాశాలు సృష్టించుకున్నా, చివర్లో తడబాటుకు లోనై ఆపై షూటౌట్లో నిష్క్రమించింది. అవును...ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆట క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా పెనాల్టీలతో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం కలిపిన తర్వాత ఇరు జట్టు ఒక్కో గోల్ చేసి 1–1తో సమంగా నిలిచాయి. దాంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో 4–2 తేడాతో నెగ్గిన క్రొయేషియా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్రెజిల్ తరఫున నెమార్ (105+1వ నిమిషంలో) గోల్ కొట్టగా, క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్కోవిచ్ (117వ నిమిషం)లో స్కోరు సమం చేశాడు. హోరాహోరీగా... తొలి అర్ధభాగంలో ఇరు జట్లు బంతిపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. బ్రెజిల్ కొంత దూకుడు కనబర్చినా, క్రొయేషియా పదునైన డిఫెన్స్‌తో నిలువరించగలిగింది. ముఖ్యంగా బ్రెజిల్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రత్యర్థి తలవంచలేదు. మిడ్‌ఫీల్డర్లు బ్రొజోవిచ్, కొవాసిచ్, మోడ్రిచ్ అద్భుత ఆటతో బ్రెజిల్‌కు అవకాశం ఇవ్వకుండా వ్యూహాన్ని సమర్థంగా అమలు చేశారు. కీపర్ లివకోవిచ్ కూడా కీలక పాత్ర పోషించాడు. వినిసియస్ కొట్టిన షాట్‌ను అతను సమర్థంగా ఆపగలిగాడు. నెమార్ కూడా చురుగ్గా కదల్లేకపోవడం బ్రెజిల్‌కు ప్రతికూలంగా మారింది. రెండో అర్ధభాగంలో మాత్రం పరిస్థితి మారింది. నెమార్ కూడా లయ అందుకోగా రిచార్లీసన్ కూడా జత కలిశాడు. అయితే 55వ నిమిషంలో రిచార్లీసన్ చేసిన ప్రయత్నాన్ని, 66వ నిమిషంలో పక్వెటా సృష్టించిన అవకాశంతో పాటు 76వ నిమిషంలో నెమార్ కొట్టిన కిక్‌ను కూడా లివకోవిచ్ నిర్వీర్యం చేయడం విశేషం. 90 నిమిషాల ఆటలో స్కోరు నమోదు కాకపోగా, ఆట అదనపు సమయానికి చేరింది. ఇందులో నెమార్ అద్భుత గోల్ బ్రెజిల్‌ను ముందంజలో నిలిపింది. క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన అతను గోల్ కీపర్ తప్పించడంలో సఫలం కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కెరీర్లో 77వ గోల్‌తో అతను పీలే రికార్డును సమం చేయడం విశేషం. అయితే క్రొయేషియా వెంటనే కోలుకుంది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మోర్సిచ్ అందించిన పాస్‌ను సూపర్ కిక్‌తో గోల్‌గా మలచడంలో పెట్కోవిచ్ విజయం సాధించాడు. ఈ ఆసక్తికర సమరం తుది ఫలితం మాత్రం చివరకు షూటౌట్తోనే తేలింది. వరుసగా రెండో వరల్డ్‌కప్‌లోనూ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ని్రష్కమించింది. -
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్‌లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
FIFA WC: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్‌లోనే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ అనూహ్యంగా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2014లో ఛాంపియన్స్ అయిన జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే వెళ్లిపోవడం సగటు అభిమానిని బాధించింది. అయితే ఓటమికి తోడూ దురదృష్టం కూడా తోడయ్యి జర్మనీని ఇంటిబాట పట్టించింది. కాగా జట్టు ఓటమితో గోల్‌కీపర్ కెవిన్ ట్రాప్స్ సొంత దేశానికి వెళ్లిపోయాడు. అయితే అతని భార్య ఇజాబెల్ గౌలర్ట్ మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది. అదేంటి భర్త వెళ్లిపోయాడు.. భార్య వెళ్లకపోవడం ఏంటి అనేగా మీ డౌటు. నిజానికి ఇజాబెల్ గౌలర్ట్కు తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ కంటే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టు అంటే ప్రాణం. అంతేకాదు ఇజాబెల్ బ్రెజిల్‌లోనే పుట్టి పెరిగింది. అందుకే తన స్వంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం భర్త వెళ్లిపోయినప్పటికి ఆమె మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది. ఇక ప్రీక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో బ్రెజిల్ తలపడగా.. మ్యాచ్‌కు ఇజాబెల్ గౌలర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెజిల్ స్టార్ నెమ్మర్ జూనియర్ తండ్రి పక్కన కూర్చొని ఇజాబెల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేసింది. అనుకున్నట్లుగానే బ్రెజిల్ క్వార్టర్స్‌కు చేరడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. భర్త అనుమతితోనే ఖతర్‌లో ఉండిపోయిన ఇజాబెల్ బ్రెజిల్ విజేతగా నిలిస్తే చూడాలని ఉందని పేర్కొంది. అలా మొత్తానికి తన భర్త వెళ్లిపోయినా.. సొంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం ఇజాబెల్ ఖతర్‌లోనే ఉండిపోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక దక్షిణ కొరియాను 4-1తో మట్టికరిపించిన బ్రెజిల్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నవంబర్ 9న జరగనున్న క్వార్టర్ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్ అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా? -
FIFA World Cup 2022: బ్రెజిల్ గర్జన
దోహా: తమ నంబర్‌వన్ ర్యాంక్‌కు తగ్గ ఆటతో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఈ మెగా ఈవెంట్లో 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్రెజిల్ తరఫున వినిసియస్ (7వ ని.లో), నెమార్ (13వ ని.లో), రిచార్లీసన్ (29వ ని.లో), లుకాస్ పక్వెటా (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున 79వ నిమిషంలో పాయిక్ సెంగ్హో ఏకైక గోల్ సాధించాడు. ఈనెల 9న జరిగే క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషి యాతో బ్రెజిల్ తలపడతుంది. ఏడో నిమిషంలో రఫిన్హా ఇచ్చిన పాస్ ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లను దాటుకుంటూ వినిసియస్ జూనియర్ వద్దకు రాగా అతను గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను నెమార్ గోల్ చేయడంతో ఆధిక్యం 2–0కు చేరింది. మరోవైపు కొరియన్లు కూడా గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో వాంగ్ హిచన్ కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ లెఫ్ట్కార్టర్లో ఎంతో ఎత్తు నుంచి దూసుకొచ్చింది. కానీ బ్రెజిల్ గోల్‌కీపర్ అలీసన్ ఎడంవైపునకు హైజంప్ చేసి కుడిచేతి పంచ్‌తో బయటికి పంపాడు. ఇలా కొరియా స్కోరు చేయాల్సిన చోట అలీసన్ అడ్డుగోడ కట్టేశాడు. 29వ నిమిషంలో రిచార్లీసన్ కొరియా డిఫెండర్లను బోల్తా కొట్టించిన తీరు అద్భుతం. ‘డి’ ఏరియాకు ముందు బంతిని హెడర్‌తో నియంత్రించిన రిచార్లీసన్ కాలితో దగ్గరే ఉన్న మార్కిన్హస్కు పాస్ చేయగా... అతను దాన్ని రఫిన్హాకు అందించాడు. ఈలోపే రిచార్లీసన్ ‘డి’ ఏరియాలోని గోల్‌పోస్ట్ ముందుకు దూసుకొచ్చాడు. రఫిన్హా వెంటనే బంతిని పాస్ చేయడంతో రిచార్లీసన్ గోల్ చేశాడు. ఇదంతా ఏడు సెకన్లలోనే జరిగిపోయింది. ఇలా అరగంటలోపే బ్రెజిల్ ఎదురే లేని ఆధిక్యం సంపాదించింది. కాసేపటికి మళ్లీ 36వ నిమిషంలో నెమార్, రిచార్లీసన్ పాస్‌లతో బంతి కొరియా ‘డి’ ఏరియాలోకి వచ్చింది. అక్కడ వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బ్రెజిల్ స్ట్రయికర్లు కూడా వచ్చినప్పటికీ కొరియన్ డిఫెండర్లు ఈ నలుగురిని కాచుకున్నారు. అయితే అనూహ్యంగా ఆఖరుగా ‘డి’ ఏరియాలోకి ప్రవేశించిన లుకాస్... బంతి అధీనంలో ఉన్న వినిసియస్ జూనియర్‌కు చేతితో సైగ చేశాడు. వెంటనే అతను కొరియన్ డిఫెండర్ల తలపై నుంచి బంతిని లుకాస్‌కు చేరవేశాడు. అతను కొరియన్ల కాళ్ల సందుల్లోంచి బంతి ని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఇలా తొలి అర్ధభాగంలోనే 4–0తో మ్యాచ్‌ను ఏకపక్షంగా లాగేసిన బ్రెజిల్ రెండో అర్ధభాగంలోనూ జోరు కొనసాగించింది. 5 వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నెమార్ నిలిచాడు. గతంలో మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), షాకిరి (స్విట్జర్లాండ్), పెరిసిచ్ (క్రొయేషియా) ఈ ఘనత సాధించారు. 2 వరుసగా ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు చేరిన రెండో జట్టు బ్రెజిల్. గతంలో జర్మనీ (1986 నుంచి 2014 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఓవరాల్‌గా 14వసారి బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి జర్మనీ (14 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. 26 ఈసారి ప్రపంచకప్‌లో బ్రెజిల్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 26 మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం కల్పించింది. మొత్తం ఎంపిక చేసిన 26 మంది ఆటగాళ్లకు ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించిన తొలి జట్టుగా బ్రెజిల్ నిలిచింది. 2 గత 60 ఏళ్లలో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లోని తొలి అర్ధభాగంలోనే నాలుగు అంతకంటే ఎక్కువ గోల్స్ సాధించిన రెండో జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. గతంలో నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ జట్టు మాత్రమే (2014 సెమీఫైనల్లో బ్రెజిల్‌పై ఐదు గోల్స్) ఈ ఘనత సాధించింది. -
రాహుకేతు పూజల్లో 22 మంది బ్రెజిల్ దేశస్తులు.. అందుకోసమే ఇక్కడికి!
సాక్షి, శ్రీకాళహస్తి(తిరుపతి): శ్రీకాళహస్తీశ్వరాలయానికి బ్రెజిల్ దేశస్తులు 22 మంది యువతీ, యువకులు సోమవారం విచ్చేశారు. రూ.500 టికెట్ తీసుకుని రాహుకేతు పూజలు చేయించుకున్నారు. గతంలో తమ దేశానికి చెందిన వారు ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకున్నారని, వారికి మంచి జరగడంతోనే తాము వచ్చామని తెలిపారు. ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: (AP: 66 డిప్యూటీ కలెక్టర్ పోస్టులపై కసరత్తు!) -
పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!
పీలే, డీగో మారడోనా.. ఇద్దరు దిగ్గజాలే. ఫుట్‌బాల్‌లో తమకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు. ఒకరు బ్రెజిల్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపితే.. మరొకరు అర్జెంటీనాను ఒకసారి విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇద్దరిలో మారడోనా రెండేళ్ల క్రితమే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ప్రస్తుతం పీలే పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ తనకేం కాలేదని.. బాగానే ఉన్నట్లు పీలే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సోమవారం బ్రెజిల్, దక్షిణ కొరియాల మధ్య ప్రీ క్వార్టర్స్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 4-1 తేడాతో కొరియాను చిత్తు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కాగా ఈ మ్యాచ్‌ను పీలే ఆసుపత్రి నుంచి వీక్షించినట్లు ఆయన కూతురు పేర్కొంది. మ్యాచ్ విజయం కూడా పీలేకు అంకితమిచ్చిన బ్రెజిల్ జట్టు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంది. ఇక మ్యాచ్ జరిగిన స్టేడియం 974లో బ్రెజిల్ ఫ్యాన్స్.. పీలే తొందరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు ప్రదర్శించారు. బ్రెజిల్ గోల్ కొట్టిన ప్రతీసారి పీలే.. పీలే అంటూ గట్టిగా అరిచారు. అలా పీలేపై తమకున్న గౌరవాన్ని గొప్పగా చాటుకున్నారు. పీలేకు ఎక్కడైతే గౌరవం లభించిందో అక్కడే మారడోనాకు అవమానం జరుగుతుందంటూ మారడోనా కూతురు జియానిన్ని మారడోనా పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే అర్జెంటీనా జట్టును తప్పుబట్టలేదు కానీ.. కనీసం మారడోనా గౌరవార్థం ఆయనకు ఒక మ్యాచ్ విజయాన్ని అంకితమిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. అయితే మారడోనాను అర్జెంటీనా జట్టు ఎప్పుడు అవమానపరచలేదంటూ ఒక వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల తర్వాత మారడోనా సేవలకు గుర్తుగా పాటలు, బ్యానర్లు ప్రదర్శించడం చేస్తున్నారని పేర్కొంది. ఇక పీలే, మారడోనా జెర్సీ నెంబర్లు 10 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. డిసెంబర్ 7న జరిగే క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా.. నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుండగా.. డిసెంబర్ 9న బ్రెజిల్.. క్రొయేషియాతో అమితుమీ తేల్చుకోనుంది. 💛💚 pic.twitter.com/9CXaglvuHR — FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022 Brazil turned 🆙 the 🔥 in #BRAKOR 💪 Catch the best moments from the 4-1 win over South Korea 📹 Watch @CBF_Futebol in action next 🆚 @HNS_CFF on Dec 9, 8:30 pm 👉🏻 #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/45n9yL6YIl — JioCinema (@JioCinema) December 6, 2022 View this post on Instagram A post shared by Gianinna Maradona 🧿 (@giamaradona) చదవండి: FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్.. మొరాకో, స్పెయిన్లు చివరి ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. దీంతో ప్రీక్వార్టర్స్ దశ ముగియనుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈసారి ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని ఊహాగానాలు వస్తున్న వేళ కచ్చితంగా టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో అర్జెంటీనా ముందుకు సాగుతుంది. డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు మూడు గోల్స్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది గోల్స్ కొట్టాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉన్న నాలుగు జట్ల పేర్లను రివీల్ చేశాడు. మెస్సీ ఏంచుకున్న నాలుగు జట్లలో అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్లు ఉన్నాయి. ''నేను ఆడుతుంది అర్జెంటీనాకు కావడంతో మా జట్టు తొలి ఫెవరెట్ అని చెప్పలేను. అర్జెంటీనా ఎప్పుడూ బెస్ట్ టీమ్స్‌లో ఒకటిగా ఉంటుంది. మేము బెస్ట్ టీమ్స్‌లో ఒకటని మాకు తెలిసినా.. దానిని ఫీల్డ్‌లో నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో దానిని మరోసారి నిరూపించుకున్నాం. మాకంటే బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్లు బాగా ఆడుతున్నాయి. కామెరూన్ చేతుల్లో ఓడినా బ్రెజిల్ కూడా బాగా ఆడుతోంది. ఇప్పటికీ ఫేవరెట్స్‌లో ఒకటి. ఫ్రాన్స్ కూడా బాగానే ఉంది. జపాన్ చేతుల్లో ఓడినా స్పెయిన్నూ తక్కువ అంచనా వేయలేం. వాళ్లు ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. వాళ్ల నుంచి బాల్‌ను దూరంగా తీసుకెళ్లడం కష్టం. స్పెయిన్ టీమ్ బాల్‌ను ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకుంటారు. వాళ్లను ఓడించడం కష్టం" అని పేర్కొన్నాడు. చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: నెయ్మర్ అడుగు పడింది.. దర్జాగా క్వార్టర్స్‌కు బ్రెజిల్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 4-1తో గెలిచిన బ్రెజిల్ దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బ్రెజిల్ తరపున విని జూనియర్(ఆట 7వ నిమిషం), నెయమర్(ఆట 13వ నిమిషం), రిచర్లీసన్(ఆట 29వ నిమిషం), లుకాస్ పెక్వెటా(ఆట 36వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఇక సౌత్ కొరియా తరపున పైక్ సాంగ్ హూ(ఆట 76వ నిమిషం) గోల్ సాధించాడు. కాగా బ్రెజిల్ తొలి అర్థభాగంలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌టైమ్‌లో దక్షిణ కొరియా గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడులు చేసినప్పటికి సఫలీకృతం కాలేకపోయింది. ఆ తర్వాత ఆట అదనపు సమయంలోనూ ఇరుజట్లు గోల్స్ చేయలేకపోయాయి. ఇక చీలమండ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు నెయ్మర్ రీఎంట్రీలో అదరగొట్టాడు. ఆట 13వ నిమిషంలో బ్రెజిల్‌కు వచ్చిన పెనాల్టీని నెయ్మర్ చక్కగా వినియోగించుకున్నాడు. గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి అద్బుత గోల్ సాధించాడు. కాగా ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో సెర్బియాతో మ్యాచ్‌లో పాల్గొన్న నెయ్మర్ చీలమండకు గాయం అయింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక డిసెంబర్ 9న(శుక్రవారం) జరగనున్న క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్.. క్రొయేషియాతో తలపడనుంది. 🎦 CAN'T. MISS. THESE. 😍@CBF_Futebol run riot as they score 4️⃣ past @theKFA to set up a q/f fixture with @HNS_CFF ⚔️ Watch #Brazil in action on Dec 9 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#BRAKOR #Qatar2022 #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/bpIjF1tn3k — JioCinema (@JioCinema) December 6, 2022 -
భయానక దృశ్యం.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు!
నీటిలో దిగినప్పుడు చిన్న పురుగు కనిపించినా భయంతో ఒడ్డుకు చేరతాం. అలాంటిది భారీ ఆకారంతో మొసలి దాడి చేస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్) అతడిపై దాడి చేసింది. చేతిని పట్టి లాగింది. అయితే, దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు ఆ వ్యక్తి. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘ద సన్’ అనే యూట్యూబ్ ఛానల్లో 2021లో పోస్ట్ చేయగా.. 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చిన మొసలి అతని చేతిని పట్టి లాగేందుకు యత్నించింది. ఒడ్డుకు వేగంగా ఈదేందుకు బాధితుడు ప్రయత్నించగా చేతిని కరిచింది. దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్నాక తన చేతిని పరిశీలించి చూడగా.. రక్తం కారుతూ కనిపించింది. ఇదీ చదవండి: మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ -
దిగ్గజం పీలే పరిస్థితి విషమం.. వార్తలను ఖండించిన కూతురు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం హల్చల్ చేయడంతో పీలే కూతురు కెలీ నాసిమెంటో వార్తలను ఖండించింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. "మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తాను" అని నాసిమెంటో ఇన్‌స్టాలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్ బ్రెజిల్ తన కథనంలో పేర్కొంది. ఇక ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. -
FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్
FIFA World Cup 2022- Group G- Brazil Vs Switzerland- దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ వరుసగా రెండో విజయం సాధించి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0 గోల్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. ఆట 83వ నిమిషంలో కేస్మిరో చేసిన గోల్ బ్రెజిల్‌ను గెలిపించింది. ఈ గెలుపుతో బ్రెజిల్ ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి 2002లో ఆసియా వేదికపైనే జరిగిన ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో సెర్బియాపై 2–0తో నెగ్గిన బ్రెజిల్ జట్టుకు ఈ మ్యాచ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే పలుమార్లు స్విట్జర్లాండ్ ‘డి’ ఏరియాలోకి బ్రెజిల్ ఆటగాళ్లు వెళ్లినా ఫినిషింగ్ చేయలేకపోయారు. దాంతో తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలోనూ బ్రెజిల్ దూకుడుగానే ఆడింది. చివరకు 66వ నిమిషంలో వినిసియస్ కొట్టిన షాట్ స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో బ్రెజిల్ ఆటగాళ్లు సంబరం చేసుకున్నారు. ఏడు నిమిషాల ముందు గోల్ చేసి అయితే ‘వీఏఆర్’ రీప్లేలో ఆఫ్‌సైడ్‌గా తేలడంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత బ్రెజిల్ ఆటగాళ్లు నిరాశపడకుండా ఉత్సాహంతోనే ఆడారు. చివరకు నిర్ణీత సమయం ముగియడానికి ఏడు నిమిషాల ముందు గోల్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యాచ్ మొత్తంలో బ్రెజిల్ ఐదుసార్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టగా... స్విట్జర్లాండ్ ఒక్క షాట్ కూడా బ్రెజిల్ గోల్పోస్ట్పైకి సంధించలేకపోయింది. చదవండి: Ruturaj Gaikwad: రుతు విధ్వంసకర ఇన్నింగ్స్! గొప్ప, చెత్త రికార్డు.. రెండూ మనోళ్లవే కదా! ఇక సెమీస్‌లో.. అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Round of 16 ✅ Casemiro was the difference maker today for Brazil 🇧🇷#FIFAWorldCup | #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 -
మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!
రియో డీ జెనీరో: బ్రెజిల్ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్ బయాలజిస్ట్ ఎరిక్ కోమిన్ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. -
FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం రాత్రి సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే బ్రెజిల్ స్టార్ నెయ్మర్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనే సంశయం మొదలైంది. కానీ నెయ్మర్ స్థానంలో వచ్చిన రిచర్లీసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రెజిల్ చేసిన రెండు గోల్స్ రిచర్లీసన్ కొట్టినవే కావడం విశేషం. అతను కొట్టిన రెండు గోల్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు 25 ఏళ్ల రిచర్లీసన్ పేరు ఫిఫా వరల్డ్‌కప్‌లో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు ఆరో టైటిల్ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రిచర్లీసన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అయితే రిచర్లీసన్ అనుకున్నంత ఈజీగా ఫుట్‌బాలర్ అవ్వలేదు. ఫుట్‌బాలర్ అవ్వడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు స్టార్‌గా పేరు సంపాదించినప్పటికి ఒకప్పుడు పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మాడు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రిచర్లీసన్ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఉన్నాయి. తన స్నేహితులు డ్రగ్స్ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అలా చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం" అని చెప్పుకొచ్చాడు. అప్పటికి రిచర్లీసన్ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్ గుర్తు చేసుకున్నాడు. అలా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచకున్న రిచర్లీసన్ ఒక వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతని ప్రాత్సాహంతోనే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు. ఇక రిచర్లీసన్ అమెరికా మినీరో క్లబ్‌కు వెళ్లాకా అతని దశ మారిపోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే ఎవర్టన్ క్లబ్ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఏది ఏమైనా సెర్బియాతో మ్యాచ్‌లో నెయ్మర్ లేని లోటును రిచర్లీసన్ తీర్చాడని బ్రెజిల్ అభిమానులు కామెంట్ చేశారు. On the biggest night of his career, Richarlison turned opportunity into greatness. Can Brazil’s number 9 fire his way to the Golden Boot in Qatar? 🇧🇷 #BRASER 🇷🇸 #POTM #YoursToTake @Budweiser @Budfootball pic.twitter.com/TYCYXUSQz0 — FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022 Richarlison! What have you done?! 🤯#FIFAWorldCup | @richarlison97 pic.twitter.com/kCKFdlINXq — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని -
FIFA WC: ఫిఫా వరల్డ్‌కప్‌లో ధోని హవా! గెలుపొందిన బ్రెజిల్‌కు ఊహించని షాక్!
FIFA WC 2022 Brazil vs Serbia: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ మిస్టర్ కూల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఓ అభిమాని ఫిఫా ప్రపంచకప్-2022 వేదికపై ధోనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఫ్యాన్స్ సందడి.. బ్రెజిల్ ఘన విజయం బ్రెజిల్ జట్టు మద్దతుదారుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. సాకర్ మెగా ఈవెంట్లో భాగంగా గ్రూప్- జిలోని మాజీ చాంపియన్ బ్రెజిల్ గురువారం సెర్బియాతో తలపడింది. దోహాలోని లుసైల్ స్టేడియంలో ఇరు జట్లు పోటీ పడగా.. నేమార్ బృందం సెర్బియాను చిత్తు చేసింది. 2-0తో ప్రత్యర్థిని ఓడించి ఘనంగా టోర్నిని ఆరంభించింది. ఇక బ్రెజిల్ జట్టును ఉత్సాహపరిచే క్రమంలో ఫ్యాన్స్ ఎల్లో జెర్సీలతో దర్శనమిచ్చారు. ధోని జెర్సీతో అభిమాని ఇందులో భాగంగా నాబీల్ అనే వ్యక్తి బ్రెజిల్‌కు సపోర్టుగా ఎల్లో జెర్సీ వేసుకోవడం సహా ధోని పేరిట ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ జెర్సీని చేతబట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలను సీఎస్కే ఫ్యాన్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన చెన్నై ఫ్రాంఛైజీ .. ‘‘ఎక్కడికెళ్లినా.. అక్కడ ఎల్లో’’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. బ్రెజిల్‌కు ఊహించని షాక్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా బ్రెజిల్ కెప్టెన్ నేమార్ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి కుడి పాదానికి దెబ్బ తగిలినట్లు సమాచారం. మ్యాచ్ రెండో అర్ధ భాగంలో 80వ నిమిషంలో సెర్బియా ఫుట్‌బాలర్ నికోలా మిలెన్‌కోవిచ్ ఢీకొట్టగా నేమార్ నొప్పితో విలవిల్లాడాడు. అతడు మైదానాన్ని వీడగా ఆంటోని నేమార్ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా తమ తదుపరి మ్యాచ్‌లో బ్రెజిల్ స్విట్జర్లాండ్‌తో పోటీ పడనున్న తరుణంలో సారథి ఇలా గాయం బారిన పడటం గమనార్హం. చదవండి: FIFA WC 2022: వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్ IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! Everywhere we go, there’s always Yellove! 💛 https://t.co/xMRix13Ea1 — Chennai Super Kings (@ChennaiIPL) November 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వావ్ వాట్ ఏ గోల్.. రిచర్లిసన్ అద్భుత విన్యాసం! వీడియో వైరల్
ఫిఫా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ యువ సంచలనం రిచర్లిసన్ రెండు గోల్స్‌తో బ్రెజిల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కాగా మ్యాచ్ తొలి భాగంలో బ్రెజిల్‌ను సెర్బియా తమ అద్భుతమైన ఢిపెన్స్‌తో అడ్డుకుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్స్ సాధించలేదు. సెకెండ్ హాఫ్ 63వ నిమిషంలో రిచర్లిసన్ బ్రెజిల్‌కు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం 73వ నిమిషంలో రెండో గోల్‌ను కూడా రిచర్లిసన్ సాధించాడు. దీంతో బ్రెజిల్ అధిక్యం 2-0 చేరుకుంది. అనంతరం బ్రెజిల్ పటిష్టమైన ఢిపెన్స్ సెర్బియాకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. తద్వారా గ్రూప్-జి నుంచి బ్రెజిల్ అగ్ర స్థానంలో నిలిచింది. సంచలన గోల్‌తో మెరిసిన రిచర్లిసన్ ఈ మ్యాచ్‌లో రిచర్లిసన్ సంచలన గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ సెకెండ్ హాఫ్ 73వ నిమిషంలో వినిసియస్ జూనియర్ పాస్ చేసిన బంతిని అద్భుతమైన అక్రోబాటిక్ సిజర్ కిక్‌తో రిచర్లిసన్ గోల్ సాధించాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా రిచర్లిసన్ అద్భుతమైన గోల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. RICHARLISON WHAT A GOALL! pic.twitter.com/9SyAhhCPGj — TC (@totalcristiano) November 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: FIFA WC 2022: బోణీ కొట్టిన బెల్జియం.. కెనడాకు పరాభవం -
వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?
సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు. చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26 -
తగ్గేదేలే.. బ్రెజిల్లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే..
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ యాప్ బ్రెజిల్లో రికార్డు సృష్టించింది. అక్కడి మార్కెట్లో ఆవిష్కరించిన 48 గంటల్లో 10 లక్షలకుపైగా డౌన్లోడ్స్ నమోదు చేసింది. ప్రస్తుతం 11 భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంది. మరిన్ని దేశాల్లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ముమ్మరం చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. “ప్రపంచంలో కేవలం 20% మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలోని 80% మంది తమ దేశానికి చెందిన భాషను మాట్లాడుతున్నారు. చాలా గ్లోబల్ ప్రోడక్ట్‌లు వివిధ భాషలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఒక్క బ్రెజిల్ యూజర్ల నుంచి Koo ఇటీవల 2 మిలియన్ కూస్ (లేదా పోస్ట్‌లు), 48 గంటల్లో 10 మిలియన్ లైకులను సంపాదించిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రోజుకో అంశం తెరపైకి వచ్చి రచ్చ చేస్తోంది. అంతేకాకుండా బ్లూ టిక్ వివాదం నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ట్విటర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ట్విటర్, మెటా ఉద్యోగుల తొలగింపు.. రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. రతన్ టాటా బంపరాఫర్! -
ఖతర్‌లో వరల్డ్‌కప్.. కేరళలో తన్నుకున్న అభిమానులు
భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెద్దగా అభిమానులు ఉండరు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. తాజాగా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన రోజున కేరళలో పెద్ద సందడి నెలకొంది. సందడి మాట పక్కనబెడితే కేరళలోని కొల్లాం జిల్లాలోని సక్తిఉలంగర గ్రామంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు తీశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్ అభిమానులుండగా.. కొందరు అర్జెంటీనాకు మద్దతుగా ఉన్నారు. ఈ ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరంటే.. లేదు అర్జెంటీనాదే కప్ అని అరుచుకోవడం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు, ఇనుప రాడ్లు అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉండగా ఫ్యాన్స్ కొట్టుకున్న ఈ ఘటనలో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. A fight between fans of Brazil and Argentina in Kerala! Begaane ke shaadi me...! 🤦🤦🤦 #QatarWorldCup2022 #Brazil #Argentina #Kerala pic.twitter.com/0mUnxO2ajs — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2022 చదవండి: గాయాలు కొత్త కాదు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి -
FIFA WC 2022: ఆరో టైటిల్ వేటలో బ్రెజిల్
ఫుట్‌బాల్ అనగానే వినిపించే దేశం పేరు బ్రెజిల్... ప్రపంచవ్యాప్తంగా తమ జాతీయ జట్టుతో సంబంధం లేకుండా బ్రెజిల్‌ను అభిమానించేవారే పెద్ద సంఖ్యలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఆటకు పర్యాయపదంగా నిలిచిన బ్రెజిల్ ఐదు సార్లు విశ్వవిజేతగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పీలే కాలంనుంచి రొనాల్డో వరకు ఎందరో బ్రెజిల్ స్టార్లు ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేశారు. 2002లో చివరి సారి చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆ జట్టు తర్వాతి నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. గ్రూప్ ‘జి’లో ఇతర జట్ల అవకాశాలను చూస్తే... –సాక్షి క్రీడా విభాగం బ్రెజిల్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ఐదు సార్లు చాంపియన్ (1958, 1962, 1970, 1994, 2002) ‘ఫిఫా’ ర్యాంక్: 1 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ దశలో ఆడిన 17 మ్యాచ్‌లలో 11 విజయాలతో అర్హత సాధించింది. 3 మ్యాచ్‌లలో ఓడగా, మరో 3 డ్రా అయ్యాయి. వరుసగా గత నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ టాప్–3 లో నిలవడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు కోచ్ టిటె జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. కొత్తతరం అటాకింగ్ ఆటగాళ్లతో అతను జట్టును నింపడం సత్ఫలితాలు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ నెమార్ జట్టును ముందుండి నడిపించగలడు. అలీసాన్ ప్రస్తుతం అత్యుత్తమ గోల్కీపర్లలో ఒకడు. థియాగో, రఫిన్హా ఇతర కీలక ఆటగాళ్లు. గ్రూప్ టాపర్ ఖాయం. సెర్బియా ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (1930, 1962) ‘ఫిఫా’ ర్యాంక్: 21 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో పోర్చుగల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంతో అర్హత సాధించడం విశేషం. అటాకింగ్ ప్రధాన బలం కాగా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. కోచ్ స్టొకోవిచ్ జట్టులో కొత్త స్ఫూర్తిని నింపాడు. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ డ్యుసాన్ టాడిక్ ప్రదర్శనే కీలకం కానుంది. పావ్లొవిక్, ల్యూకిక్ ఇతర ప్రధాన ఆటగాళ్లు. అయితే గ్రూప్‌లో పోటీని బట్టి చూస్తే నాకౌట్ చేరడం అద్భుతమే అవుతుంది. స్విట్జర్లాండ్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు క్వార్టర్ ఫైనల్ (1934, 1938, 1954) ‘ఫిఫా’ ర్యాంక్: 15 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో తమ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 15 గోల్స్ చేసి 2 మాత్రమే ఇచ్చి అనూహ్యంగా అగ్రస్థానంలో నిలిచింది. కొత్త కోచ్ మురాత్ యకీన్ పర్యవేక్షణలో డిఫెన్స్‌లో బలంగా మారింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టితత్వంతో మ్యాచ్‌లు నెగ్గడమే స్విస్ జట్టు ప్రధాన బలం. బ్రెజిల్‌ను వదిలేస్తే రెండో స్థానం కోసం సెర్బియాతో పోటీ ఉంటుంది కాబట్టి ఆ మ్యాచ్‌తోనే ముందంజ వేయడం తేలుతుంది. కామెరూన్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1990) ‘ఫిఫా’ ర్యాంక్: 43 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో ఒక దశలో నిష్క్రమించేలా కనిపించినా...ప్లే ఆఫ్స్‌లో అల్జీరియాపై చేసిన ఏకైక గోల్‌తో గట్టెక్కి అర్హత సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో కామెరూన్ చరిత్రను చూస్తే ఎన్నో పెద్ద జట్లను ఓడించిన సంచలన విజయాలు కనిపిస్తాయి. ఆఫ్రికా నేషన్స్ టోర్నీలో గోల్డెన్ బూట్ గెలిచిన అబూబకర్ ప్రమాదకరమైన ఆటగాడు. అయితే స్టార్లు లేని ఈ జట్టు సహజంగానే ఒత్తిడికి చిత్తయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే దీనిని అధిగమిస్తే మరో సంచలనాన్ని ఆశించవచ్చు. చదవండి: FIFA WC 2022: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష
మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్ మురకివాడల్లో పెరిగింది. ఆమెను 1994లో పాస్టర్ ఆండర్సన్ డో కార్మో కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మురికివాడల్లోని డజన్ల కొద్ది పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ఆదర్శంగా నిలిచారు. బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో కూడా ఈ జంట మంచి పేరుగాంచారు. అంతేగాదు శాంటోస్ 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది కూడా. ఐతే ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాల కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదీగాక ఆమె ఎప్పుడైతే రాజకీయవేత్తగా ఎదగడం ప్రారంభమైందో అప్పటి నుంచి శాంటోస్ తన భర్తను హతమార్చేందుకు యత్నించింది. ఇలా ఆమె అతన్ని సుమారు 6 సార్లు విషప్రయోగం చేసి హతమార్చేందుకు యత్నించింది. ఇక చివరికి తన బంధువు సాయంతో ఆయుధాన్ని కొనుగోలు చేసి మరీ 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు యత్నించింది. ఐతే ఆ సమయంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాలేదు. ఆమె ఇటీవల 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోవడంతో పోలీసులు ఈ కేసును చేధించే మార్గం సుగమం అయ్యింది.తదనంతర విచారణలో ఆమె తన కుటంబ సభ్యులు, పిల్లల సాయంతో తన భర్తను హతమార్చినట్లు తేలింది. దీంతో బ్రెజిల్ కోర్టు ఆమెకు 50 ఏళ్లు జైలు శిక్షవిధించింది. ఆమెకు ఈ హత్యలో సహకరించి తన కుమార్తెకి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో ఆమెకు ఆయుధం కొనుగోలు చేసి సాయం అందించిన బంధువుకి కూడా ఏడాది క్రితమే జైలు శిక్ష విధించింది. (చదవండి: చైనాలో టెస్లా కారు బీభత్సం.. రెప్పపాటులో ఎంత ఘోరం) -
అరుణారుణ ఆశాకిరణం
వర్గాలుగా చీలిన ఓటర్లు... హోరాహోరీ పోరు... అతివాద ఛాందస దేశాధ్యక్షుడు బోల్సనారో ఒక వైపు, వామపక్ష ప్రజాస్వామ్యవాది లూలా మరోవైపు... 34 ఏళ్ళ బ్రెజిల్ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా దేశాధ్యక్ష ఎన్నికలు. అలాంటి సందర్భంలో ఆదివారం లూలా దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశానికి అధ్యక్షుడిగా గెలుపొందడం చరిత్రాత్మకం. 580 రోజులు జైలులో ఉండి బయటపడి, రాజకీయ విరోధుల అంచనాల్ని అధిగమించి, బలమైన ప్రత్యర్థి బోల్సనారోను ఓడించడం వామపక్ష వర్కర్స్ పార్టీకి లూలా సృష్టించిన అపూర్వ సందర్భం. 2020 నుంచి పొరు గున బొలీవియా, చిలీ, పెరూ, కొలంబియా, హోండురస్లలో ఎగిరిన ఎర్ర జెండాకు బ్రెజిల్ గెలుపు మరో ఊపు. అరుణారుణమవుతున్న లాటిన్ అమెరికాకు ఇది ప్రతీక. స్థానికవాద సెంటిమెంట్లను పెంచిపోషించే ఛాందస మితవాద ప్రభుత్వాలు ఐరోపాలో ఎన్నికవుతున్న వేళ మరో ఆశాకిరణం. లూలాకు దేశాధ్యక్ష పదవి కొత్త కాదు. ఆయన పగ్గాలు చేపట్టడం బ్రెజిల్ చరిత్రలో ఇది మూడోసారి. 2003 నుంచి 2010 దాకా నాలుగేసి ఏళ్ళ వంతున రెండు తడవలు ఆయన ఆ పదవిలో ఉన్నారు. సంక్షేమ చర్యలు చేపడుతూనే, దేశంలో ఆర్థికాభివృద్ధి, సామాజిక చేర్పు సాధించిన ప్రజాదరణ గల నేతగా నిలిచారు. మళ్ళీ పుష్కరకాలానికి పీఠమెక్కారు. మధ్యలో పదవి చేపట్టిన ఆయన శిష్యుడు 2016లో అభిశంసనకు గురికావడం, కాంట్రాక్టుల్లో అవినీతిపై 2017లో లూలా జైలు పాలవడం, 2018 ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కావడం, వీటన్నిటితో దేశంలో మితవాద పార్టీల విజృంభణ అంతా ఓ పెద్ద కథ. తాజాగా అక్టోబర్ 2 నాటి తొలి విడత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాని ఆయన ఆదివారం తుది విడతలో పదవిని స్థిరం చేసుకున్నారు. లూలాకు 50.9 శాతం, ప్రత్యర్థి బోల్సనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్ బయటపడ్డాక ఇంత స్వల్ప తేడాతో ఎన్నికల గెలుపు నమోదైంది ఇప్పుడే! తాజా మాజీ అధ్యక్షుడు బోల్సనారో, ఆయన మద్దతుదారులు సాగించిన నాటకీయ, విద్వేష ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినట్టే బోల్సనారో బృందం మీడియానూ, ఎన్నికల ప్రక్రియనూ దుమ్మెత్తిపోసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఔదలదాల్చేది లేదు పొమ్మని బెదిరించింది. లూలా మాత్రం బోల్సనారో ప్రాచుర్యాన్ని అధిగమించేందుకు తన మాజీ ప్రత్యర్థి జెరాల్డో అల్క్మిన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టి, వామపక్షాల నుంచి మధ్యేవాద మిత వాదుల దాకా పది పార్టీలతో జాగ్రత్తగా కూటమి కట్టారు. గెలుపు తీరాలకు చేరారు. బోల్సనారో హయాంలో 7 లక్షల పైగా మరణాలతో కోవిడ్ కట్టడిలో వైఫల్యాన్నీ, అమెజాన్ అడవుల నరికి వేతనూ, కునారిల్లిన ఆర్థికవ్యవస్థనూ బ్రెజిల్ చవిచూసింది. ఒకప్పుడు 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చిన లూలా లాంటి సమర్థుడికి సైతం దేశాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం సవాలే! కలసి పోటీ చేసిన పార్టీల కూటమిని రేపు అధికారంలోనూ లూలా ఎంత కలసికట్టుగా ఉంచగలుగుతారనేది కీలకం. అది ఆయన ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. పర్యావరణం, ప్రజారోగ్యం, విద్య, విదేశాంగ విధానం, మానవహక్కుల లాంటి అంశాల్లో పాత పాలకుడు చేసిన నష్టాన్ని పూడ్చడానికి అనుసరించే విధానాల్లో భాగస్వాములతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఆకలి, దారిద్య్రాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, పారిశ్రామిక రంగాన్ని పరిపుష్ఠం చేయడం తమ ప్రభుత్వ తక్షణ లక్ష్యాలని ఆయనే చెప్పారు. కానీ, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగం, అప్పులు, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయి. ఖజానా ఖాళీ అయింది. ఉత్పత్తి స్తబ్ధమైంది. అనేక రంగాల్లో అంతర్జాతీయ పోటీలో నిలిచే పరిస్థితి లేదు. ఇవి చాలదన్నట్టు రాజకీయంగానూ తిప్పలున్నాయి. సెనేట్‌లో అధిక స్థానాలు బోల్సనారోకు చెందిన లిబరల్ పార్టీకే ఉన్నాయి. దిగువ సభలోనూ ఆ పార్టీయే అతి పెద్ద పార్టీ. ఇక, 27 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో, అందులోనూ రియో డి జనీరో సహా కీలకమైన, మూడు అతి పెద్ద రాష్ట్రాల్లో ప్రత్యర్థి బోల్సనారో సమర్థకులే వచ్చే ఏటి నుంచి గవర్నర్లు. అలాగే, 1964 – 1985 మధ్య బ్రెజిల్‌ను ఏలిన సైనిక వ్యవస్థ, అమెజాన్ వర్షారణ్య దోపిడీ వ్యవస్థల శక్తిమంతమైన వ్యాపార ప్రయోజనాల్ని ఢీకొనాల్సి వస్తుంది. ఇన్నింటినీ అధిగమిస్తూ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, జనరంజకంగా పాలించడం ఎవరికైనా కత్తి మీద సామే. సహజ వనరులపైనా, చమురుతో ముడిపడ్డ ఆర్థిక విజృంభణ పైనా అతిగా ఆధారపడ్డా కష్టమేనని పొరుగున ఉన్న వెనిజులా పాఠం చెబుతోంది. విజయోత్సవ ప్రసంగాన్ని ఆరంభిస్తూ, లూలా అన్న మాట ఒకటే... ‘వారు నన్ను సజీవ సమాధి చేయాలనుకున్నారు. కానీ, ఇదుగో ఇప్పుడు మీ ముందు సజీవంగా నిలిచాను.’ క్లిష్టసమయంలో పదవి చేపట్టిన ఈ 77 ఏళ్ళ పోరాటయోధుడు ఇక ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షల్ని సజీవంగా నిలపాలి. ఒబామా శైలిలో ‘నాకు ఓటేసిన వారికే కాదు, మొత్తం 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ సుపరిపాలన అందిస్తాను’ అన్న మాటల్ని నిజం చేసి, విభజన రాజకీయాలకు విరుద్ధంగా దేశాన్ని ఒక్కటి చేయాలి. మునుపటిలా ప్రభుత్వ సంపదను ప్రజలకు పునఃపంపిణీ చేసే ప్రజాకర్షక సంక్షేమ విధానాలకూ, వర్తమాన ఆచరణాత్మకతకూ మధ్యన ఈ కొత్త ప్రయాణం రాజకీయ పునరుత్థానం పొందిన ఈ కురువృద్ధుడికి అసలు సిసలు అగ్నిపరీక్ష. -
బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్ 30) జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు. Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi — PMO India (@PMOIndia) October 31, 2022 ఇదీ చదవండి: Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం -
కనుగుడ్లను బయటకు పెట్టి చూస్తే గిన్నిస్ రికార్డు
ఫొటో చూస్తుంటేనే భయం వేస్తోంది కదూ.. బ్రెజిల్‌కు చెందిన సిడ్నీ డీ కార్వల్హో అనే పెద్దాయన స్పెషాలిటీ ఇదే. అదేనండి.. గుడ్లురుమి చూడటం.. అంటే కనుగుడ్లను ఇలా అసాధారణంగా బయటకు పెట్టగలగడం అన్నమాట.. అందుకే గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఆయన్ను ప్రపంచంలోకెల్లా అత్యంత దూరంపాటు కనుగుడ్లను బయటకు ప్రదర్శించగల (పురుషుల్లో) వ్యక్తిగా గుర్తిస్త రికార్డు కట్టబెట్టారు. ఇంతకీ సిడ్నీ తన కనుగుడ్లను ఎంత దరం బయటకు చూపగలరో తెలుసా? కనుగుంటల నుంచి ఏకంగా 18.2 మిల్లీమీటర్లు లేదా 0.71 అంగుళాల దూరంపాటు కనుగుడ్లను బయటకు ప్రదర్శించగలరు. ఇలా సుమారు 30 సెకన్లపాటు ఆయన ఉండగలరట. అయితే ఆయన కనుగుడ్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే దాకా ఆయనకు ఏమీ కనిపించదట! అమెరికాకు చెందిన కిమ్ గుడ్‌మ్యాన్ అనే మహిళ సైతం ఇదే రకమైన ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. కనుగుడ్లను కనుగుంటల నుంచి 12 మిల్లీమీటర్లు లేదా 0.47 అంగుళాల దూరంపాటు ప్రదర్శించగలదు. అందుకే మహిళల కేటగిరీలో ఈ రికార్డు గతంలోనే ఆమెను వరించింది. Sidney loves to scare people on the street with his incredible eye-popping ability! 👀 pic.twitter.com/QpBJXmh9tJ— Guinness World Records (@GWR) October 19, 2022 -
ముసుగులో వచ్చి.. ఈ-సెలబ్రిటీపై ఘాతుకం
ముసుగులో వచ్చిన దుండగులు.. ఓ సోషల్ మీడియా స్టార్‌పై ఘాతుకానికి పాల్పడ్డారు. బ్రెజిల్ ప్రముఖ మోడల్, ఇంటర్నెట్ సెలబ్రిటీ నూబియా క్రిస్టియానా బ్రగ దారుణ హత్యకు గురైంది. 23 ఏళ్ల ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ను ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోనే కాల్చి చంపేసి పారిపోయారు. సెర్గిపే రాష్ట్రంలో అరకాజు శాంటా మరియా ప్రాంతంలోని ఆమె ఇంట్లో.. అక్టోబర్ 14వ తేదీనే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హత్య ఘటనకు కొద్దిగంటల ముందు ఆమె హెయిర్ సెలూన్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తున్న క్రమంలో.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో రక్తపు మడుగులో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దుండగలు అక్కడి నుంచి పారిపోయారు అని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల వయసున్న నూబియా క్రిస్టియానా బ్రగ.. ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, తన సొంత దుస్తుల కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకంటూ పేరు దక్కించుకుంది. ఆమె మరణ వార్తతో అభిమానులు.. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు దుండగులు ఎవరు? ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు? అనేది తెలియాల్సి ఉంది. ఆమెకు శత్రువులు ఎవరూ లేరని.. బెదిరింపులు కూడా ఏం రాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. Núbia Cristina Braga (¿?-2022) Muere la influencer brasileña Núbia Cristina Braga a los 23 años de edad. Ella compartía contenido relacionado con viajes, consejos de belleza y moda.#NúbiaCristinaBraga #nathzzi #Brasil pic.twitter.com/3wOsenchvd — nathzzi (@nathzzi) October 20, 2022 కిందటి నెలలో మెక్సికోలోనూ పాపులర్ టిక్‌టాక్ సెలబ్రిటీ కార్లా పార్దిని.. దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురైంది. ఇదీ చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉంటే ఫసక్ -
యాపిల్‌కు భారీ షాక్.. అవి లేకపోతే ఐఫోన్లు అమ్మకండి!
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ వేరు. అంతేకాకుండా ఫోన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంది యాపిల్.అయితే నిబంధనలు తప్పితే ఎంత పెద్ద కంపెనీకైనా జరిమాన తప్పదని బ్రెజిల్ కోర్టు నిరూపించింది. బ్రెజిల్లో ఛార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు ఆపిల్‌కు భారీ జరిమానాను విధించింది. దీనిపై స్పందించిన యాపిల్ సంస్థ కోర్టు తీర్పుని అప్పీల్ చేస్తామని తెలిపింది. భారీ జరిమానా! BRL 100 మిలియన్లు ( భారత కరెన్నీ ప్రకారం సుమారు రూ. 150 కోట్లు) చెల్లించాలని కంపెనీని బ్రెజిల్ కోర్టు ఆదేశించింది. యాపిల్ బ్రాండ్ తన ఐఫోన్లను దేశంలో విక్రయించాలంటే ఇకపై స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను చేర్చాలని తీర్పు ఇచ్చింది.దీనిపై యాపిల్ స్పందిస్తూ.. వాతావరణ కాలుష్యం ప్రధాన కారణంగా తాము చార్జర్లను ఇవ్వడం లేదని తెలిపింది. కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగా అడాప్టర్‌ను అందించడం నిలిపివేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ, రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించడం పర్యావరణానికి మేలు చేస్తుందని ఎటువంటి ఆధారాలు లేవని" ఉన్నత అధికారులు యాపిల్‌తో విభేదించారు. ఇదే సమస్యపై ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్‌కు కోర్టు దాదాపు 2.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఫోన్బాక్స్లో ఛార్జర్‌ను కూడా అందించాలని అలా కుదరకపోతే తన కంపెనీ ఐఫోన్లను బ్రెజిల్లో విక్రయించకుండా నిషేధిస్తామని కూడా ఆదేశించింది. కాగా అడాప్టర్ అనేది ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసే ముఖ్యమైన ప్రాడెక్ట్. అది లేకుండా ఫోన్ పని చేయదన్న సంగతి అందరికీ తెలిసిందే. చదవండి: బంధన్ బ్యాంక్ ప్రచారకర్తగా సౌరవ్ గంగూలీ -
జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్
ఇటీవల కాలంటో స్టంట్ల క్రేజ్ మామాలుగా లేదు. కొంతమంది సోషల్ మీడియా స్టార్డమ్ కోసం ఎలాంటి స్టంట్లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్ చేసే స్టంట్‌కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే... బ్రెజిల్‌కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్‌ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో బ్రైజిల్ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంతేగాదు బ్రెజిల్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్ 25న మాటో గ్రాస్ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. É sério que acharam uma boa ideia colocar corante numa cachoeira?! Tantas maneiras de fazer um chá revelação e conseguiram escolher justo uma com impacto ambiental. pic.twitter.com/YePJ0lPhhQ — A Eng. Florestal do YouTube 🌳 (@vanecosta10) September 26, 2022 (చదవండి: ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్) -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
26 ఏళ్లుగా అడవిలో ఒంటరి జీవనం.. అంతరించిపోయిన అరుదైన తెగ
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని ఆదివాసీ తెగకి చెందిన ఒక ఒంటరి మనిషి తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోనే ఒంటరి వ్యక్తిగా పిలిచే ఆ మనిషి ఇటీవల మరణించినట్టు బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అతని పేరేంటో తెలీదు. బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధాలు లేవు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుంది. గత 26 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అడవి జంతువుల్ని బంధించడంతో పాటు ఆత్మ రక్షణ కోసం అడవిలో ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ వెళతాడని అతనిని ‘‘మ్యాన్ ఆఫ్ ది హోల్’’ అని పిలుస్తారు. దూరం నుంచే అతని బాగోగుల్ని పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల సంస్థ అధికారికి ఆగస్టు 23న ఒక గుడిసెలో అతని మృతదేహం కనిపించింది. అతని మీద దాడి చేసి ప్రాణాలు తీసినట్టుగా ఆధారాలేవీ కనిపించలేదు. అప్పటికే ఆ వ్యక్తి మరణించి 40 నుంచి 50 రోజులై ఉంటుందని అతని మృతదేహం పడి ఉన్న తీరుని బట్టి అంచనా వేశారు. అతని మృతదేహంపైన రంగు రంగుల పక్షి ఈకలు ఉన్నాయి. దీంతో అతను తన మరణాన్ని ముందుగానే ఊహించి ఈకలు కప్పుకొని ఉంటాడని ఆదివాసీ నిపుణుడు మార్కెల్ డోస్ శాంటో తెలిపారు. రోండానియా రాష్ట్రంలోని టనూరు ఆదివాసీ ప్రాంతంలో నివసించే ఒకానొక ఆదివాసీ తెగలో ఇతను చివరి వాడు కావడంతో మానవజాతిలో ఒక తెగ అంతరించినట్టయింది. నాలుగేళ్ల క్రితం అతను బ్రెజిల్ అధికారుల కెమెరాలకు చిక్కాడు. పదునైన ఆయుధంతో చెట్లు నరికే దృశ్యాలు అందులో ఉన్నాయి. ఆ వ్యక్తి అధికారులకి కనిపించడం అదే చివరిసారి. టనూరులో ఆదివాసీ తెగపై కొందరు భూ ఆక్రమణదారులు 1970 నుంచి దాడులు చేస్తూ ఈ తెగకి చెందిన వారిని చాలా మందిని బలి తీసుకున్నారని ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఆ తెగలో మిగిలిన ఆరుగురిని 1995లో అక్రమ గనుల తవ్వకదారులు దాడులు చేసి చంపేశారు. అతనొక్కడే ప్రాణాలతో మిగిలిపోవడంతో ఒంటరివాడైపోయాడు. అప్పట్నుంచి అతని రక్షణని ఎప్పటికప్పుడు బ్రెజిల్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఈ మిస్టరీ మ్యాన్ మరణించడంతో ఆ తెగకు చెందిన వివరాలన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. -
యమహా గుడ్‌న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్‌జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
మారణహోమానికి ఆనవాలు.. పాతికేళ్లపైనే ఒంటరిగా బతికి..
నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు రానీయకుండా ‘ఒంటరి’ జీవనం గడిపి.. చివరకు అడవితల్లి ఒడిలో దిక్కుమొక్కులేకుండా ప్రాణం విడిచాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన.. అదే సమయంలో ఆలోచింపజేసిన ది మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు. బ్రెజిల్ పశ్చిమ ప్రాంతం రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా దాదాపు పాతికేళ్లకు పైనే(వీడియో, ఫొటో రికార్డింగ్‌ల ఆధారంగా) ఈ ఒంటరి మనిషి జీవనం కొనసాగింది. పేరు, ఏ తెగకు చెందిన వ్యక్తి అనే విషయాలపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ, 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. చాలా ఆలస్యంగా 2018లో ఆ వీడియోను బయటి ప్రపంచానికి విడుదల చేశారు. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. చాలా కాలం అతన్ని వెంబడించాక.. చివరకు అతని ముఖం కెమెరాకు చిక్కింది. కానీ.. దగ్గరికి వెళ్తే.. దాడి ఎవరైనా అతన్ని చూసినా.. దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే.. దాడి చేసేవాడు. బాణాలు, ఈటెలు విసరడం లేదంటే.. అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు. అయితే.. చంపేవాడు మాత్రం కాదు. తనకు దూరంగా ఉండాలని హెచ్చరించడమే అతని ఉద్దేశంగా ఉండేది. 1970 నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదివాసీ తెగలకు చెందిన వ్యక్తనే అభిప్రాయం మాత్రం ఇన్నాళ్లూ నడుస్తూ వచ్చింది. ఆ అభిప్రాయం ఏర్పడడానికి ప్రధాన కారణం.. అతని జీవన శైలి. గొతులు తవ్వి వాటిలో దాక్కోవడం, వాటి ద్వారానే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం చేస్తూ వచ్చాడు కాబట్టి. అంతేకాదు.. అక్కడొక గుడిసె వేసుకుని కొన్నాళ్లపాటు జీవించాడతను. 2018లో ప్రభుత్వం అతన్ని చిత్రీకరించిన తర్వాత.. అది గమనించి అక్కడి నుంచి మకాం మార్చాడతను. విషాదం ఉండొచ్చు..! పేరు, ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసీకి.. మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే పేరు మాత్రం ముద్రపడిపోయింది. కానీ, మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం.. వాళ్లు అతని తెగను బలిగొనడమే!. బ్రెజిల్లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు 30కిపైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం ఒక అంచానికి వచ్చింది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనేది మరో అంచనా. ఆహార సాయం కూడా వద్దనే.. తనారు ప్రాంతంలో 1970 నుంచి ఈ దండకారణ్యంలో భూ ఆక్రమణలతో మారణ హోమం కొనసాగింది. అమెజాన్ అడవులనే నమ్ముకుని బతికిన ఆదివాసీ జాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను కావొచ్చని అధికారులు అంటున్నారు. ఆహార సాయం అందించినా కూడా.. ఎవరినీ నమ్మేవాడు కాదతను. వాటిని చీధరించుకుని దూరంగా వెళ్లిపోవడం అందుకు మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు సర్వైవల్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ డైరెక్టర్ ఫియానా వాట్సన్. 80వ దశకంలో ఆదివాసీలకు సాయం పేరిట చక్కెర, ఇతర దినుసుల్లో ఎలుకల మందు కలిపి ఘోరంగా హత్యలు చేసుకుంటూ వెళ్లారని ఆనాటి మారణహోమాన్ని గుర్తు చేస్తున్నారామె. An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO — philip lewis (@Phil_Lewis_) August 28, 2022 అమెజాన్ పట్ల నిర్లక్ష్యం, ఆదివాసీల పట్ల చిన్నచూపుతో అధ్యక్షుడు బోల్సోనారో.. ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాడు. కానీ, ఆ అడవినే నమ్ముకున్న తెగలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వినాశనాన్ని అడ్డుకుని తీరతామంటూ శపథాలు చేస్తున్నాయి. అలా పోరాటంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ కన్నుమూసి.. కూలిపోయిన స్థితిలో ఓ పాకలో ఆగస్టు 23న కనిపించాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరావాల్సి ఉన్నప్పటికీ.. నాగరికత నేర్చిన మనిషి తన మారణహోమం మాత్రం ఎట్టకేలకు పూర్తి అయ్యిందని ఫియానా బాధతో చెప్తోంది. ఇదీ చదవండి: మేకప్ లేకుండా అందాలపోటీలో ఆమె.. చరిత్రలో తొలిసారి -
Monkeypox: బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం
బ్రెసిలియ: మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. మంకీపాక్స్ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 👉🏽 బ్రెజిల్ రాష్ట్రం మినాస్ గెరాయిస్ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 👉🏽 ఇదిలా ఉంటే.. జూన్ 10వ తేదీన యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. 👉🏽జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్‌పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 👉🏽డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి. 👉🏽 మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్ నుంచి బయటపడొచ్చు. 👉🏽 అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన WHO.. సెక్స్ పార్ట్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది. చదవండి: మంకీపాక్స్‌తో సీరియస్ అయితే ఈ టీకా వాడొచ్చు! -
బ్రెజిల్లో బీపీసీఎల్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్రెజిలియన్ ఆయిల్ బ్లాక్‌లో అదనంగా 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం, బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (పీపీఆర్ఎల్) బ్రెజిల్‌లోని బీఎం–సీల్–11 కన్సెషన్ ప్రాజెక్ట్‌లో మరో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ బ్లాక్‌లో 2026–27లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ బ్లాక్‌లో బీపీఆర్ఎల్కు 40 శాతం వాటా ఉంది. బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్ 60 శాతం వాటాతో ఆపరేటర్‌గా ఉంది. చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
ఉమ్మనీటి సంచితో కవలల జననం
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది. -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు -
లక్కీ ఫెలో.. అనకొండ దాడిలో జస్ట్ మిస్ అయ్యాడు
పామును చూస్తేనే ఒక్కసారిగి భయాందోళనకు గురవుతుంటాము. అలాంటిది ఏకంగా భారీ అనకొండ నుంచి ప్రాణాలకు కాపాడుకోవడమంటే మాములు విషయం కాదు. కాగా, ఓ వ్యక్తి అదృష్టవశాత్తు అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన గైడ్ జోవో సెవెరినో(38).. అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. కాగా, జోవో సెరియన్.. అరగుయా నదిలో పర్యాటకుల బృందంతో విహారయాత్రలో ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సెవెరినోకు నదిలోని నీటిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడంతో సరదాగా వీడియో తీశాడు. అదే సమయంలో అదును చూసి అనకొండ అతడిపై దాడి చేసే క్రమంలో కాటు వేసింది. ఈ క్రమంలో తృటిలో పాము నుంచి అతను తప్పించుకున్నారు. దీంతో పడవలో ఉన్న ప్రయాణీకులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక, గ్రీన్ అనకొండ.. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. కాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగ గ్రీన్ అనకొండ కంటే.. ఆడ అనకొండలు చాలా పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా ఇవి.. చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. View this post on Instagram A post shared by João Severino (@lavaginha_) ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
వికటించిన సర్జరీ.. మృత్యువుతో పోరాడి ఓడిన మోడల్
బ్రెసిలియ: విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో. ఒక సాధారణ సర్జరీ అనూహ్యంగా ఆమె ప్రాణం తీసింది. కోలుకుంటుందనుకున్న టైంలో.. ప్రాణం మీదకు వచ్చింది. ఫలితం.. రెండు నెలలు కోమాలో ఉన్న ఆ మాజీ సుందరి(27) కన్నుమూసింది. మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రెజిల్ మాజీ సుందరి గ్లెసీ కొర్రెయియా మోడల్, బ్యూటీషియన్. 2018లో ఆమె మిస్ బ్రెజిల్ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా రాణిస్తోంది ఆమె. అయితే.. గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీన ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది. నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. ఓ ప్రైవేట్ క్లినిక్‌లోనే రెండు నెలలపాటు కోమాలో ఉన్న ఆమె.. జూన్ 20వ తేదీన కన్నుమూసింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది కొర్రెయియా. ఒక సాధారణ గొంతు టాన్సిల్స్ సర్జరీకి ఆమె మృతి చెందడం.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. -
కాంస్య పతక పోరులో ఓటమి
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతక పోరులో ఓడిపోయింది. వెన్నం జ్యోతి సురేఖ, ప్రియా గుర్జర్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 228–231తో సోఫీ డోడిమోంట్, లోలా గ్రాండ్‌జీన్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందిన భారత్ 230–227తో బ్రెజిల్ జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 228–231తో బ్రిటన్ జట్టు చేతిలో పరాజయంపాలై కాంస్య పతకం బరిలో నిలిచింది. అభిషేక్ వర్మ, మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్, అమన్ సైనీలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో 234–235తో టర్కీ చేతిలో ఓడింది. -
చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ
ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపి ముక్కలుగా నరకడమే కాదు.. విడి భాగాలు దొరక్కుండా పూడ్చిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అమెజాన్ అడవుల్లో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలను బయటపెడతారనే భయంతోనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో తాజాగా ఘోరం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్, అక్రమ చేపల వేట, డ్రగ్స్ రవాణా నేరాలకు నెలవైన ప్రాంతంలో ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన వెంట ఉన్న ఆదిమ తెగకు చెందిన బ్రూనో పెరెయిరా(అమెజాన్ ఆదిమ తెగల హక్కుల పరిరక్షకుడు) హత్యకు గురయ్యారు. వీళ్లిద్దరినీ అక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు(చేపల వేట, డ్రగ్స్ మాఫియా) నడిపించే ఒలీవెరియా బ్రదర్స్ హతమార్చినట్లు తేలింది. తొలుత ఈ కేసులో.. అమరిల్డో ఒలీవెరియాను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా అమెజోనాస్లోని ఇటాక్యూవాయి నదీ తీరం వెంట పాతిపెట్టిన మృతదేహాల శకలాలను అతికష్టం మీద వెలికి తీశారు బ్రెజిల్ పోలీసులు. ఇందుకోసం నాలుగు రోజులపాటు గాలింపు చర్యలు సాగాయి. ఇక ఈ జంట హత్యల్లో ఒలీవెరియా సోదరుడు ఒసెనే ఒలీవెరియాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో జరుగుతున్న అక్రమ దందాలను బయటపెట్టే ఉద్దేశంతో.. ఫిలిప్స్,పెరెయిరా విచారణ కోసం వెళ్లారు. అయితే జూన్ 5వ తేదీ నుంచి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫిలిప్స్ భార్య అలెస్సాండ్రా సంపాయో న్యాయం కోసం పోరాటానికి దిగారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు పెరిగింది. మిస్టరీని త్వరగా చేధించాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే.. ఆ ప్రాంతంలో ఇల్లీగల్ వ్యవహారాలకు కారణమయ్యే అమరిల్దోను అరెస్ట్ చేశారు. ఆపై అతన్ని, అతని సోదరుడైన ఒసెనేను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఇద్దరూ కూడా మత్స్యకారులనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిలిప్స్(57) గార్డియన్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ పత్రికలకు పని చేశారు. ఇక పెరెయిరా(41) ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త, న్యాయవాది. బ్రెజిల్ ఆదిమ తెగల వ్యవహారాల సంస్థలో పని చేస్తున్న ఆయన.. సెలవులు తీసుకుని మరీ ఫిలిప్స్ వెంట అమెజాన్ అడువుల్లోకి వెళ్లారు. బోల్సోనారో బలుపు వ్యాఖ్యలు ఇదిలా ఉంటే.. ఈ జంట హత్యల మీద బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ఆయన(ఫిలిప్స్‌ను ఉద్దేశించి)కు వేరే పని లేదేమో. ఏం దొరకనట్లు.. పర్యావరణ సంబంధిత కథనాలు, ఇల్లీగల్ మాఫియాల మీద స్టోరీలు రాశారు. యూరప్వాడు కదా! బహుశా అందుకే అక్కడి వాళ్లకు నచ్చక.. ఆయన్ని చంపి ఉంటారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రభుత్వం పని అడవుల్ని పరిరక్షించడం.. అక్కడి క్రిమినల్స్‌ను నియంత్రించడం కాదు అంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘ఒకవేళ వాళ్లిద్దరినీ చంపి ఉంటే.. కచ్చితంగా నీళ్లలో పడేసి ఉంటారు. ఆ నీళ్లలో పిరానా(రాక్షస చేపలు)లు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు’’ అంటూ తిక్క తిక్క ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు బోల్సోనారో. అమెజాన్ మీద పుస్తకం రాస్తున్న తరుణంలోనే ఫిలిప్స్ ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. ఇక పరెయిరాకు గతంలోనూ ఇల్లీగల్ మాఫియాల నుంచి బెదిరింపులు వచ్చాయి. అమెజాన్ అడవుల్లో ఇల్లీగల్ దందాలు, కార్యకలాపాలు జరుగుతున్నా.. ఆయా దేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రెజిల్ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. -
Viral Video : ఒక్క అడుగూ.. ఆ ఒక్క అడుగు తేడా వస్తే శాల్తీ ఔట్!
భూమిపై నూకలు బాకీ ఉంటే పెను ప్రమాదాల నుంచి సైతం ప్రాణాలతో బయటపడొచ్చు అంటారు. ఇక్కడ వీడియోలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం చూస్తే నిజమే అనిపిస్తుంది. లేదంటే అంత భారీ వాహనం ఒక్కసారిగా ఎగిరిపడి.. ఆ వ్యక్తి వైపునకు దూసుకెళ్లడం.. అతని దగ్గరగా వెళ్లి ఢీకొని రాసుకుంటూ ముందుకుసాగడం.. అతను గోడ, ట్రక్కు మధ్యగా ఇరుక్కుపోయి బయటపడటం.. ఇవన్నీ భయంగొలిపే దృశ్యాలే! చదవండి👉 యువతి చేతిలో ఫోటో చూడగానే.. కారు ఆపిన ప్రధాని మోదీ! ఈ ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చేతిలో హెల్మెట్, కొన్ని పత్రాలతో ఓ వ్యక్తి నిలుచున్నాడు. అటుగా వస్తున్న ఓ ట్రక్కు చెట్టు కొమ్మలకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరిపడింది. వేగంగా కుడివైపునకు దూసుకెళ్లింది. అమాంతం పైకిలేచి ఫుట్‌పాత్‌మీదుగా పరుగులు పెట్టింది. అక్కడే ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చచ్చాన్రా దేవుడో అనుకుంటూ కొద్దిగా వెనక్కి అడుగేశాడు. అప్పటికే అతన్ని సమీపించిన ట్రక్కు ముందుభాగం అతనికి టచ్ ఇచ్చింది. ఆ దెబ్బతో అతను గోడవైపునకు మరింత కదిలాడు. అతన్ని రాసుకుంటూ వెళ్లిన ట్రక్కు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఊహించని ప్రమాదంతో అటు బాధితుడు, ఇటు ట్రక్కు డ్రైవర్ కంగారెత్తిపోయారు. అయితే, అదృష్టం కొద్దీ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. 56 సెకండ్లు ఉన్న ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 Viral Video: అటు చూడు బే! -
మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సెర్గిప్‌లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు. కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్‌ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాంటోస్‌ని పోలీస్‌స్టేషన్‌కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు. (చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్) -
బధిరుల ఒలింపిక్స్ గోల్ఫ్ ఫైనల్లో దీక్ష
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత క్రీడల్లో (2017)లో రజతం గెలిచిన ఆమె ఈ సారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో భారత గోల్ఫర్ అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో తలపడుతుంది. -
Deaflympics 2022: అదరగొట్టిన ధనుష్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: మరోసారి తన గురితో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించాడు. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని వేసింది. ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి విజేతగా నిలిచింది. వరుసగా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం తోపాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ మేటి షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కావడం విశేషం. ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్–ప్రియేషా జంట 414 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాంస్య పతక పోరులో శౌర్య సైనీ–నటాషా జోషి (భారత్) జంట 8–16తో వయోలెటా–అలెగ్జాండర్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది. -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్‌కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్‌లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్‌కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్‌ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్‌ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్‌లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్‌ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్‌పై సెస్‌ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!
సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్‌లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి స్లమ్ పెయింటింగ్స్ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్‌గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
అత్యద్భుతమైన ప్రపంచ రికార్డు...చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!
సాహసోపేతమైన ప్రపంచ రికార్డులు చూస్తే.. అవి నిపుణుల పర్యవేక్షణలో సాధన చేస్తే సాధ్యమనిపిస్తుంది. మరికొన్ని ఫీట్లు సాధ్యమేనా ? అనే సందేహన్ని కలిగిస్తాయి. చాలా వరకూ ఆయా వ్యక్తుల అభిరుచి, ఒక విభిన్నమైన వ్యక్తిగా నిలవాలనే తపన వంటి లక్ష్యాలతోనే ఇలాంటి ప్రపంచ రికార్డులను నెలకొల్పగలరేమో !. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సాధించిన ప్రపంచ రికార్డును చూస్తే చేయగలమా? అని సందేహం కచ్చితంగా వస్తుంది. ప్రయత్నించాలన్నా భయంగానే ఉంటుంది. ఎందుకంటే అది అత్యంత భయంకరమైన సాహసోపేతమైన ప్రపంచ రికార్డు. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి రెండు పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెం.మీ. అంతేకాదు అతను సుమారు ఒక వెయ్యి మీటర్లు(6,236 అడుగుల) ఎత్తులో తాడు పై నడిచాడు. అంటే బుర్జ్ ఖలీప్ కంటే రెంట్టింపు ఎత్తులో గాల్లో రెండూ పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండేలో చోటుచేసుకుంది. నిజానికి ఆఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్‌ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ఫీట్ చూస్తే కాళ్లల్లో వణుకు కుపుడుతోందని ఒకరు, ఇది ప్రపంచం గుర్తించదగ్గ రికార్డు అంటూ బ్రిడిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఓరిని తెలివి.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా.. అయినా దొరికిపాయే!) -
Viral: పాపం ఆ బుడ్డోడు.. నిజంగా నువ్వు లేకపోయి ఉంటేనా!
చంటిపిల్లలతో ప్రయాణాలు అంటే తల్లిదండ్రులకు కష్టమే. ఏమాత్రం అసౌకర్యం అనిపించినా చాలు వెంటనే ఏడుపు మొదలెట్టేస్తారు చిన్నారులు. ఆ చికాకులో నచ్చిన బొమ్మలు ఇచ్చినా విసిరి అవతల పారేస్తారు. వారిని ఊరుకోబెట్టాలంటే ఒక్కోసారి తలప్రాణం తోకకు వస్తుంది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు కాసేపు ఆగైనా సరే.. వారిని శాంతపరిచి ముందుకు సాగవచ్చు. ఏ బస్సో, రైలో ఎక్కినా కాస్త పర్లేదు. మధ్యలో దిగిపోయినా పెద్దగా నష్టం ఉండదు. అదే విమానమైతే ఇలాంటి వెసలుబాట్లు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ కుటుంబానికి! గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడిని ఊరుకోబెట్టడం ఎవరి వల్లా కాలేదు. అంతలో రంగంలోకి దిగింది ఫ్లైట్ అటెండెంట్. ఆడుకోవడానికి అతడికి బొమ్మలు ఇచ్చింది. కాసేపు కబుర్లు చెప్పింది. అయినా, ఆ బుడ్డోడు ఊరుకుంటేనా! ఇక లాభం లేదనుకుని వాడిని భుజాన వేసుకుని లాలించింది. తల్లిలా అక్కున చేర్చుకుని తన ఆత్మీయ స్పర్శతో ఊరట కలిగించింది. కాసేపటి తర్వాత ఆ పిల్లాడు ఏడుపు ఆపి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని బ్రెసీలియా నుంచి కుయీబా పట్టణానికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అరె మంత్రం వేసినట్లుగా ఆ పిల్లాడు నిద్రపోయాడు. నిజంగా మీరు గ్రేట్. తల్లి ప్రేమను పంచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ మహిళ.. మాక్కూడా విమాన ప్రయాణంలో ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. అప్పుడు నేను ఏడు నెలల గర్భవతిని. ఫ్లైట్ అటెండెంట్ నా బిడ్డను గంటల పాటు ఎత్తుకుని ఆడించారు. వారి వల్లే నాకు కాస్త ఉపశమనం దొరికింది. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ తన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేసింది. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) -
టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించిన బాలుడు... గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ..
Boy Managed To Travel Almost 3000 kilometres Alone: ఇంతవరకు మనం బస్సు లేక రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం గురించి విని ఉంటాం. అదృష్టం బావుంటే పట్టుబడం లేదంటే ఫైన్ కట్టి బయటపడతాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బుడ్డోడు ఒంటరిగా అదికూడా టికెట్టు లేకుండా ఏకంగా విమానం ఎక్కి వచ్చేశాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌లోని ఇమాన్యుయెల్ మార్క్వెస్ ఒలివేరా అనే 9 ఏళ్ల బాలుడు ఒంటరిగా లేకుండా విమానంలో ప్రయాణించాడు. అంతేకాదు తన ఇంటి నుంచి సుమారు 3వేల కి. మీ దూరంలో ఉన్నఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్హోస్కు విమానంలో పయనించాడు. ఈ మేరకు అతని తల్లి డేనియల్ మార్క్వెస్ ఆ రోజు కొడుకుని ఉదయం 5 గంటల ప్రాంతంలో చూశానని చెప్పారు. ఆ తర్వాత అతను కనిపించక చాలా ఆందోళన చెందామని వివరించారు. ఆ బాలుడు గూగుల్‌లో టికెట్ లేకుండా, ఎవరి కంటపడకుండా విమానం ఎక్కడం ఎలా అనే దానిపై సర్చ్ చేసి మరీ వెళ్లాడు. ఆ బాలుడి తల్లికి అతని ఆచూకి తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్లకంటే ఈజీగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్‌ని ఆపరేట్ చేసేస్తున్నారు. కానీ ఈ బాలుడిని చూస్తే మరీ ఇంత అడ్వాన్స్డ్గా పిల్లలు ఉంటారా? అని ఆశ్చర్యం కలగకమానదు. అంతేకాదు పెద్దల్లో గుబులు కూడా కాస్త ఎక్కువ అవుతుంది. ఈ మేరకు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా లగేజీ లేకుండా బాలుడు ఎలా ఎక్కగలిగాడనే విషయంపై మనౌస్ విమానాశ్రయ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో) -
బ్రెజిల్ వరద బీభత్సం: ఎటు చూసిన అల్లకల్లోలం.. 204కు చేరిన మృతుల సంఖ్య
బ్రస్సెల: బ్రెజిల్ దేశంలో సంభవించిన వరద విపత్తు వల్ల మృతుల సంఖ్య 204కు పెరిగింది. బ్రెజిల్ దేశంలోని ఆగ్నేయ రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరంలో భారీ వరదల కారణంగా 204 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతోపాటు బురద ప్రవాహంలో చిక్కుకొని మరో 51 మంది గల్లంతు అయినట్లు రియో డిజెనీరో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రతినిధి చెప్పారు. వరదల వల్ల బ్రెజిల్‌లోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన పెట్రోపోలిస్ నగరంలో ఇప్పటికీ 810 మంది నిర్వాసితులు గత వారం రోజులుగా పాఠశాల శిబిరాల్లో నివశిస్తున్నారు.అతి భారీవర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించడంతో ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం సంభవించింది. వేలాది ఇళ్లు వరదల్లో దెబ్బతిన్నాయి. -
భీకర వర్షాలు.. 58 మంది మృతి
రియో డీ జనీరియో: భీకర వర్షాలతో బ్రెజిల్ దేశంలోని రియో డీ జనీరియో రాష్ట్రంలో కొండప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పెట్రోపోలిస్ ప్రాంతంలో వర్షాలకు కొండల నుంచి భారీ స్థాయిలో బురదచరియలు కిందనున్న జనావాసాలపై పడ్డాయి. దీంతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పెట్రోపోలిస్ మేయర్ రూబెన్స్ చెప్పారు. జనావాసాలను బురద ముంచెత్తింది. అందులోని 21 మందిని కాపాడారు. ఇదే ప్రాంతంలో 11 ఏళ్ల క్రితం భారీ వర్షాల ధాటికి వందల మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. వరదలు, బురద చరియలు పడిన ప్రాంతంలో 180కి పైగా జవాన్లు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని పెట్రోపోలిస్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చదవండి: (వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఆమె ఎయిడ్స్‌ను జయించింది!)