నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | PM Narendra Modi Arrives In Nigeria Capital Abuja, Receives Grand Welcome On Historic Visit | Sakshi
Sakshi News home page

వీడియో: నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Published Sun, Nov 17 2024 7:37 AM | Last Updated on Sun, Nov 17 2024 12:47 PM

PM Narendra Modi Arrives In Nigeria

అబుజా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. నైజీరియాలో ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో మోదీ వారికి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ నేడు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్​ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.

 

అలాగే, ఈ నెల 19న మోదీ గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్​ ఇర్ఫాన్​ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్​ ఆఫ్​ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.


నవంబర్​ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్‌లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement