G-20 summit
-
నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
అబుజా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. నైజీరియాలో ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో మోదీ వారికి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ నేడు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.#WATCH | Prime Minister Narendra Modi lands in Abuja, the capital city of the Federal Republic of Nigeria; receives a grand welcomeHe is on a three-nation tour to Nigeria, Brazil and Guyana from November 16 to 21. On the first leg of his visit, PM is in Nigeria. In Brazil, PM… pic.twitter.com/0LWi0beBWU— ANI (@ANI) November 16, 2024 అలాగే, ఈ నెల 19న మోదీ గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.#WATCH | Nigeria: Prime Minister Narendra Modi greeted members of the Indian Diaspora as he received a grand welcome from them when he arrived at a hotel in Abuja(Source - ANI/DD News) pic.twitter.com/9Q9krfzQaP— ANI (@ANI) November 16, 2024నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది. #WATCH | Ritu Agarwal, a member of Indian Diaspora in Nigeria says, " PM said that my drawing is very good and he took the pen from me and signed the drawing. He was very happy..." pic.twitter.com/OzKdsezE07— ANI (@ANI) November 16, 2024 -
G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోరి్టంగ్ ఫ్రేమ్‌వర్క్ (సీఏఆర్ఎఫ్) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. -
G20 Summit: వృద్ధి విధానాలకు మద్దతు
న్యూఢిల్లీ: అందరికీ వృద్ధి, శ్రేయస్సు కారకాలుగా పనిచేయడానికి వాణిజ్యం, పెట్టుబడిని అనుమతించే విధానాలకు మద్దతు ఇవ్వాలని జీ–20 సభ్య దేశాలు అంగీకరించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా ఉన్న నిబంధనల ఆధారంగా వివక్షత లేని, న్యాయ, బహిరంగ, కలుపుకొని, సమాన, స్థిర, పారదర్శక బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అనివార్యం’ అని జీ–20 వేదికగా నాయకులు ప్రకటించారు. రక్షణవాదం, మార్కెట్‌ను వక్రీకరించే పద్ధతులను నిరుత్సాహపరచడం ద్వారా అందరికీ అనుకూల వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలన్న నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2024 నాటికి సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా పూర్తి, మెరుగ్గా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చర్చలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. వాణిజ్యం, పర్యావరణ విధానాలు ప్రపంచ వాణిజ్య సంస్థ, పర్యావరణ ఒప్పందాలకు అనుగుణంగా పరస్పరం మద్దతునిచ్చేవిగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
సంపన్న దేశాల కర్తవ్యం
నేటి నుంచి ప్రారంభం కాబోయే రెండు రోజుల జీ–20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సర్వసన్నద్ధమైంది. ఈ చరిత్రాత్మక సమావేశాలకు వివిధ దేశాధినేతలతోపాటు తరలివచ్చే వారి మంత్రులు, ఉన్నతాధికార గణం, వేలాదిమంది సిబ్బందితో దేశ రాజధాని నగరం సందడిగా మారింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు జీ–20లో సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్‌కు అధ్యక్ష హోదా వంతులవారీగా వచ్చిందే కావొచ్చుగానీ, వచ్చిన సమయం అత్యంత కీలకమైనది. కరోనా మహమ్మారి పర్యవసానంగా ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతో ఇంతో కోలుకుంటుండగా ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం మరింత కుంగదీసింది. పైకి రష్యా, ఉక్రెయిన్ల మధ్య పోరుగా కనబడుతున్నా అక్కడ వాస్తవంగా తలపడుతున్నది అమెరికా, రష్యాలే. ఇటు అమెరికా–చైనాల మధ్య తీవ్ర వైరుధ్యాలు న్నాయి. చైనాకూ మనకూ మధ్య ఉన్న సమస్యలు సరేసరి. సరిహద్దుల్లో ఏదో సాకుతో గిల్లికజ్జాలకు దిగటం, కొత్త మ్యాప్‌లు ముద్రిస్తూ కవ్వించాలని చూడటం చైనాకు రివాజైంది. ఈ సమస్యలేవీ జీ–20లో ప్రస్తావనకు రాకున్నా, ఎజెండాలో ఈ అంశాలే లేకున్నా, వాటి నీలినీడలు శిఖరాగ్ర సదస్సుపై పడకతప్పదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు హాజరు కాబోరని ఆ దేశం ప్రకటించింది. ఉక్రెయిన్ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యమే ఇందుకు కారణం. ఇక అమెరికాతోపాటు మనపైనున్న కంటగింపు పర్యవసానంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముఖం చాటేశారు. ఆయన బదులు పెద్దగా అధికారాలు లేని ప్రధాని లీ కియాంగ్‌ను ఆ దేశం పంపుతోంది. ప్రపంచ ఆర్థిక, ద్రవ్య సంబంధ అంశాలతోపాటు మారిన కాలానికి అనుగుణమైన నియంత్రణ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావటం, వాతావరణ సమస్యలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలపై విధించే పన్నులు, బహువిధ అభివృద్ధి బ్యాంకులను వర్తమాన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటం వంటి అంశాలు జీ–20లో ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. వీటన్నిటిపైనా ఎంతవరకూ ఏకాభిప్రాయం కుదురుతుందో, శిఖరాగ్ర సమావేశాల అనంతరం సంయుక్త ప్రకటన వెలువడేందుకు ఏమాత్రం అవకాశం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ‘ఒకే భూమి – ఒకే కుటుంబం – ఒకే భవిష్యత్తు’ మకుటంతో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సు విజయ వంతమైతే ఆ కీర్తిప్రతిష్ఠలు మనకే దక్కుతాయి. అయితే దేశాలు చీలికలు పేలికలుగా విడిపోయిన వర్తమాన యుగంలో అదెంతవరకూ సాధ్యమో చెప్పలేం. మారిన అంతర్జాతీయ పరిస్థితులు ఐక్యరాజ్యసమితి మొదలుకొని డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూటీవో వరకూ అనేకానేక వేదికలపై ప్రతిబింబిస్తున్నప్పుడు జీ–20 వాటికి భిన్నంగా ఉండాలనుకోవటం అత్యాశే కావొచ్చు. కానీ సామరస్యత కోసం ప్రయత్నించటం కొనసాగాలి. రష్యా, చైనా ఒక పక్క– అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాలు మరో పక్క మోహరించివున్న ప్రస్తుత వాతావరణంలో పేద దేశాల స్వరాన్ని గట్టిగా వినిపించాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉంది. ధనిక, బీద దేశాలకు సభ్యత్వం ఉండి, వాటిమధ్య సంభాషణలు సాగే అతి తక్కువ అంతర్జాతీయ వేదికల్లో జీ–20 ఒకటి. అగ్ర దేశాల పంచాయతీకే ఈ సంస్థ పరిమితమైతే పేద దేశాల సమస్యలకు చోటుండదు. పేద దేశాల సమస్యలు సాధారణమైనవి కాదు. ఇన్నేళ్లూ అభివృద్ధి పేరుతో, లాభార్జనే ధ్యేయంగా ధనిక దేశాలు విచ్చలవిడిగా వినియోగించిన శిలాజ ఇంధనాల కారణంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగి భూగోళం వేడెక్కింది. ఇందువల్ల దక్షిణార్ధ గోళంలో ఉన్న పేద దేశాలకే అధిక నష్టం సంభవిస్తోంది. వచ్చే నవంబర్ నెలాఖరులో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన దుబాయ్‌లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) సదస్సు జరగబోతోంది. పర్యావరణ సమస్యలన్నీ అక్కడే చర్చించవచ్చునని ధనిక దేశాలు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని సాగనీయకూడదు. 2021లో రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ‘అర్థవంతమైన చర్యల ద్వారా భూగోళానికి ముప్పు కలగకుండా చూస్తామనీ, విదేశాల్లోని బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కర్మాగారాలకు ఆర్థిక సాయం అందకుండా చూస్తామ’నీ ధనిక దేశాలు హామీ ఇచ్చాయి. ఈ వాగ్దానంలో ధనిక దేశాల్లోని కర్మాగారాల ఊసు లేదు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. వర్తమాన సంవత్సరంలో ఈ రంగంలో పెట్టు బడులు ఎన్నడూ లేనంతగా 15,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అంచనా. అంటే రోమ్‌లో చేసిన బాసలకు విలువే లేదన్న మాట. దీనిపై ప్రస్తుత సదస్సులో నిలదీయాలి. జీ–20 సభ్యత్వంలోనూ ఎన్నో తిరకాసులున్నాయి. నూతన ఆర్థిక శక్తిగా ఎదగటం మాట అటుంచి, కనీసం 20 ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఒకటిగా లేని అర్జెంటీనాకు సంస్థలో సభ్యత్వం ఉంది. పోర్చుగల్, ఈజిప్టు వంటి దేశాలకు చోటులేదు. ఒక సంస్థగా చెప్పుకోదగిన విజయాలు ఎందుకు సాధించలేదో, అందుకు అడ్డుపడుతున్నవేమిటో జీ–20 ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తరాలకు సురక్షితమైన భూగోళాన్ని అప్పగించాలంటే సంపన్న దేశాలుగా తాము చేయాల్సిందేమిటో అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు ఆలోచించాలి. అంతర్జాతీయ సంబంధాలు ఛిద్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తెరిగి ధనిక దేశాలు బాధ్యతగా మెలగాలి. -
G20 Summit: చిరుధాన్యలక్ష్మికళ
కలెక్టర్ పిల్లలు కలెక్టర్, హీరో పిల్లలు హీరో, రాజకీయ నాయకుడు పిల్లలు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటే, ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు... తమలా తమ పిల్లలు ఇబ్బందులు పడకూడదని, తిని, తినక ఒక్కోరూపాయి పోగుచేసి, కష్టపడి చదివించి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం తమ పిల్లలు తమలా రైతులు కావాలని అస్సలు కోరుకోవడం లేదు. ‘‘పెద్దయ్యాక రైతును అవుతాను’’ అని కూడా ఎవరూ చెప్పరు. ‘‘మేము వ్యవసాయం చేస్తాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ప్రపంచ దేశాధ్యక్షులు సైతం మేము చెప్పబోయేది ఆసక్తిగా వినబోతున్నారు అదీ వ్యవసాయం గొప్పతనం’’ అని చాటిచెబుతున్నారు ఇద్దరు మహిళా రైతులు. అవును గొప్పగొప్ప చదువులు చదివినవారికంటే..తమ పూర్వీకుల నాటి నుంచి ఆచరిస్తోన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న రైతులకు జీ–20 సదస్సుకు ఆహ్వానాలు అందాయి. పెద్దపెద్ద డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ.. కేవలం వ్యవసాయం చేస్తున్నారన్న ఒక్క కారణంతో ... ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే ‘జీ–20 సమితి’లో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది. ఒడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు ౖ‘రెమతి ఘురియా, సుబాసా మోహన్తా’లకు ఈ అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ–20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. కోరాపుట్ జిల్లాలోని నౌగుడా గ్రామానికి చెందిన రైతే 36 ఏళ్ల రైమతి ఘురియా. భూమియా జాతికి చెందిన రైమతికి ముగ్గురు పిల్లలు. మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తోంది. ఏళ్లపాటు వరిధాన్యాలు పండించే రైమతి... చిరుధాన్యాల సాగు మెళుకువలు నేర్చుకుని మిల్లెట్స్ సాగు మొదలు పెట్టింది. అధునాతన సాంకేతికతను జోడించి పంటలో అధిక దిగుబడిని సాధిస్తోంది. సాగులోలేని 72 దేశీయ వరి రకాలు, ఆరు చిరుధాన్యాలతో కలిపి మొత్తం 124 రకాల ధాన్యాలను అంతరించిపోకుండా కాపాడుతోంది. మంచి దిగుబడితో సాధిస్తున్న రైతుగానేగాక, తోటి గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగులో సాయం చేస్తూ వారికీ జీవనోపాధి కల్పిస్తోంది. సంప్రదాయ పంటలైన వరి, మిల్లెట్ రకాలను పండిస్తూనే తన గిరిజన మహిళలెందరికో ఆదర్శంగా నిలుస్తూ... మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ పంటల్లో తెగులు నివారణ మెళకువల గురించి, స్కూలును ఏర్పాటు చేసి ఏకంగా 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. చిరుధాన్యాల సాగులో రైమతి చేసిన కృషికిగా గుర్తింపుగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. 2012లో జీనోమ్ సేవియర్ కమ్యునిటీ అవార్డు, 2015లో జమ్షెడ్జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు, టాటా స్టీల్ నుంచి ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డులేగాక, ఇతర అవార్డులు అందుకుంది. చిరుధాన్యాల సాగులో అనుసరిస్తోన్న పద్ధతులు, దిగుబడి, తోటి రైతులను ఆదుకునే విధానమే రైమతిని జీ20 సదస్సుకు వెళ్లేలా చేసింది. ఈ సదస్సు లో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో వివిధ రకాల చిరుధాన్యాలు, ఈ ధాన్యాలతో చేసిన విభిన్న వంటకాలు, చిరుధాన్యాలతో వేసిన ముగ్గులను ప్రదర్శించనుంది. చిరుధాన్యాల సాగులో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అధిక దిగుబడి కోసం అవలంబిస్తోన్న విధానాలు వివరించనుంది. మిల్లెట్ సాగులో అనుసరించాల్సిన అధునాతన సాంకేతికత, దాని ఉపయోగాల గురించి ఎమ్ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ ఇచ్చిన శిక్షణ సంబంధిత అంశాలను ప్రస్తావించనుంది. సుబాసా మొహన్తా మయూర్భంజ్ జిల్లాలోని గోలి గ్రామానికి చెందిన చిరుధాన్యాల రైతే 45 ఏళ్ల సుబాసా మొహన్తా. తన జిల్లాలో ఎవరికీ చిరుధాన్యాల సాగుపై ఆసక్తి ఏమాత్రం లేదు. 2018లో ఒడిశా ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల సాగు చేయమని మిల్లెట్ మిషన్‌ను తీసుకొచ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చింది సుబాసా. ఏళ్లనాటి గిరిజన సాగుపద్ధతులను ఉపయోగిస్తూ రాగుల సాగును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లెట్స్‌ను పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోంది. ఇది చూసిన ఇతర రైతులు సైతం సుబాసాను సాయమడగడంతో వారికి సాగు పద్ధతులు, మెళకువలు నేర్పిస్తూ మిల్లెట్ సాగును విస్తరిస్తోంది. సుబాసాను ఎంతోమంది గిరిజన మహిళలు ఆదర్శంగా తీసుకుని చిరుధాన్యాలు సాగుచేయడం విశేషం. సుబాసా కృషిని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. జీ20 సదస్సుకు హాజరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల సాగు, ఈ ధాన్యాల ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతాను. గిరిజన మహిళగా గిరిజన సాగు పద్ధతులను మరింత విపులంగా అందరికీ పరిచయం చేస్తా్తను. – రైమతి ఘురియా చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిచేస్తాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు గిరిజనుల ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. కానీ ఇప్పుడు పొలాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. నేను ధాన్యాలు పండించడం మొదలు పెట్టిన తరువాత నన్ను చూసి చాలామంది రైతులు చిరుధాన్యాలు సాగుచేయడం ప్రారంభించారు. ఇతర రైతులకు వచ్చే సందేహాలు నివృత్తిచేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాను. వరికంటే చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు వస్తుండడంతో అంతా ఈ సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. – సుబాసా మోహన్తా -
జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా..
ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా శాంచెజ్..‘గురువారం నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20. Me encuentro bien. España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación. — Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023 ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు.. ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. ► మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. ► జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
కొత్త విశ్వ వ్యవస్థకు ఆశాదీపం
భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభా భాండాగారాన్ని కలిగి ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలుస్తామో అటువంటి ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. భారతదేశ అధ్యక్షతన జి–20 ఇతివృత్తం అయిన ‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’, మన ప్రాచీన విలువ ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. జ్ఞాన నాగరికతగా, భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభ భాండాగారాన్ని కలిగి ఉంది. భారతదేశ చరిత్ర చూస్తే– గణితం, ఖగోళ శాస్త్రం,వైద్యం, తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా వివిధ విజ్ఞాన రంగాల్లో గణనీయమైన కృషి చేసిన ప్రస్థానమే గోచరిస్తుంది. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలో అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జ్ఞాన నాగరికతగా భారతదేశ చరిత్ర దాని సమకాలీన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇది ప్రపంచ శ్రేయస్సుకు గణనీయమైన సహకారిగా నిలిచింది. విశ్వ శ్రేయస్సుకు జి–20 జి–20 అధ్యక్షతలో భారతదేశం మొత్తం వర్కింగ్ గ్రూపులు లేదా మంత్రుల సమావేశాలలో జరిగిన అన్ని చర్చలను కూడా గొప్ప ప్రపంచ శ్రేయస్సు అనే బంధంతో అనుసంధానం చేసింది. ‘‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’’ అనే జి–20 ఇతివృత్తం, మన ప్రాచీన విలువలైన ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలు స్తామో అటువంటి ప్రపంచ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగ పడాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని సహజసిద్ధమైన బలం, సామర్థ్యాలను ప్రపంచం స్పష్టంగా విశ్లేషించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ‘ప్రకాశవంతమైన ప్రదేశం’గా గుర్తించింది. భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పవనాలు ఎదురవుతున్నప్పటికే , భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతి తక్కువ సమయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శాలతో కూడిన విద్య విజ్ఞానం, నైపుణ్యం ద్వారా మానవ మూలధనాన్ని పెంచడం అనేది భారతదేశ సామర్థ్యానికి కీలకం. విద్య అనేది వృద్ధి, ప్రేరణలను నడిపించే, నిలబెట్టే ‘మదర్–షిప్’(కేంద్రం). విద్య అనేది పౌరులను శక్తిమంతం చేసే మాతృశక్తి. దానికి అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అన్నింటికీ మూల పత్రం. సమగ్ర జాతీయ విద్యా విధానం–2020, భారత్‌లో విద్యను సమగ్రంగా, భవిష్యత్తు మార్గదర్శకంగా, ప్రగతి శీలంగా ఒక ముందు చూపు ఉండేలా సంపూర్ణంగా రూపొందించడం జరిగింది. బలమైన విషయ అవగాహన, స్పష్టతను నిర్ధారించడం కోసం మాతృభాషలో నేర్చుకోవడానికి నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాతృభాషలో విద్య అనుసంధాన భాషలను భర్తీ చేయదు, కానీ వాటికి అనుబంధంగా ఉంటుంది. ఇది జ్ఞానపరంగా తక్కువ సమస్యలను అధిగమించే విద్యార్థులతోపాటు సజావుగా చదువుకొనే విద్యార్థులకు కూడా చక్కటి విద్యా మార్గాలను అందిస్తుంది. ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ ఇప్పుడు ప్రాధాన్యతను సంత రించుకుంది. ఎన్ఈపీ–2020, భారతదేశాన్ని అత్యుత్తమ అధ్యయన గమ్యస్థానంగా మార్చడానికిగానూ, అధ్యాపకులు/ విద్యార్థుల మార్పిడి, పరిశోధన, బోధనా భాగస్వామ్యాలు, విదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఎంఓయూలపై సంతకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐఐటీ– మద్రాస్, ఐఐటీ– ఢిల్లీ ఇప్పటికే తమ విదేశీ క్యాంపస్‌లను వరుసగా జాంజిబార్–టాంజానియా, అబుదాబి– యూఏఈలలో ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నాయి. విదేశాలతో విద్యా భాగస్వామ్యం పరిశోధనను ప్రోత్సహించడానికి పరిశ్రమ–అకాడెమియా సహ కారం అనేది ఎన్ఈపీలో చేర్చిన మరొక ప్రాధాన్యత అంశం. అకడమిక్ ఇన్ స్టిట్యూషన్ ్సలో తొలి అడుగు నుండి పరిశోధనల వరకు సులభతరం చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు అవుతోంది. భారతదేశాన్ని పరిశోధన–అభివృద్ధి హబ్‌గా మార్చ డంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సులభతర వ్యాపారం మాత్రమే కాకుండా సులభతర పరిశోధన కూడా ఉండేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యూరప్ దేశాలతో భారతదేశం విద్యా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ భారతదేశ ప్రతిభను గుర్తించి, దృష్టిలో ఉంచుకుంటారు. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్), క్వాడ్ ఫెలోషిప్ కింద హై–టెక్నాలజీ రంగాలలో మెరుగైన సహకారాన్ని ప్రోత్సహించడం జరగుతుంది. భారతీయ విద్యను ప్రపంచ విద్యతో సమలేఖనం చేయడంలో ప్రామాణీకరణ సహాయ పడుతుంది. జాతీయ విద్యా విదానం కింద, పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ విడుదల చేయడమైనది. ఇది నిర్దిష్ట అభ్యాస ప్రమాణాలు, కంటెంట్, బోధనాశాస్త్రం, మూల్యాంకనాలకు ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా, విభిన్న విద్యావేత్తల అభ్యాసాన్ని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పరిధిలోకి తీసుకు రావడానికి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ పనిచేస్తుంది. గొప్ప శ్రామిక శక్తి భారతదేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 60 కోట్ల జనాభా ఉంది. 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. బహుళ–క్రమశిక్షణ, బహుళ–నైపుణ్యం కలిగిన, విమర్శనాత్మకంగా ఆలోచించే, యువకులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భారతదేశం ఇప్పుడు మూడవ అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యావరణ వ్యవస్థ. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో నైపుణ్యం, వ్యవస్థాపక తకు ప్రతీకగా నిలిచింది. మెట్రో నగరాల్లో మాత్రమే కాదు, భారతదేశ ఆవిష్కరణలు, స్టార్టప్‌లు టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల ద్వారా కూడా ఆవిష్కారం అవుతున్నాయి. 6వ తరగతి నుండి పాఠశాల విద్యలో నైపుణ్యం ఏకీకృతం అయింది. సాంకేతికతతో నడిచే పారిశ్రామిక వాతావరణంలో నిల దొక్కుకోవడానికిగానూ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగిన మానవ శక్తిని రూపొందించడానికి సింగపూర్ స్కిల్ ఫ్రేమ్‌వర్క్ అనుసరించదగినది. అభివృద్ధి చెందుతున్న కొత్త క్రమంలో మానవ మూలవనరుల ప్రధాన పాత్రను భారతదేశం గుర్తించింది. విద్య, నైపుణ్యంతో కూడిన వ్యక్తులు నేటి జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మాత్రమే విజ్ఞాన సరిహద్దును విస్తరించడం, ఆర్థిక వృద్ధికి ఊత మివ్వడంతో పాటు, అద్భుతమైన ఆవిష్కరణలు అందించగలరు; శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణానికి అసాధారణమైన సహకారాన్ని అందించగలరు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఇప్పుడు భారత దేశం ఒక పెద్ద ప్రయోగశాల. జ్ఞాన శతాబ్దం అయిన 21వ శతాబ్దంలో కొత్త సాంకేతి కతలు కొత్త క్రమానికి నాంది పలుకుతాయి. భారతదేశం తన విస్తారమైన నైపుణ్య గనిని ఏర్పరచడంలో, కొత్త క్రమాన్ని రూపొందించడంలో ముందంజలో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాసకర్త కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపకత మంత్రి -
అధికారిక కార్లు వాడొద్దు
న్యూఢిల్లీ: జి–20 సమావేశాల్లో విందు వేదికను చేరుకోవడానికి అధికారిక కార్లను వాడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. బుధవారం జరిగిన భేటీలో మంత్రులకు విధినిõÙధాలను వివరించారు. భారత్‌కు వస్తున్న వివిధ దేశాల బృందాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మసలుకోవాలని సూచించారు. ప్రధాన వేదిక భారత మండపం, ఇతర వేదికలను చేరుకోవడానికి షటిల్ సరీ్వసును ఉపయోగించుకోవాలని చెప్పారు. తాము బాధ్యత వహిస్తున్న విదేశీ బృందాలకు సంబంధించి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలని మంత్రులను కోరారు. వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని.. అందుకు అనుగుణంగా అతిథ్యమివ్వాలని చెప్పారు. జీ–20 సమావేశాలకు సంబంధించి అధీకృత వ్యక్తులు తప్పితే మరెవరూ మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగే రాత్రి విందుకు ఆహా్వనించిన ముఖ్యమంత్రులందరూ సొంత కార్లలో రావాలని, వేదిక వద్ద షటిల్ సరీ్వసును ఉపయోగించుకొని విందు జరిగే ప్రదేశానికి చేరుకోవాలని ఇదివరకే సూచనలు వెళ్లాయి. కేంద్ర మంత్రులందరూ జీ–20 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇందులో జీ–20 దేశాల భాషలతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాద సదుపాయం ఉందని ప్రధాని వివరించారు. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 40 మంది ప్రపంచ నాయకులు సెప్టెంబరు 9, 10వ తేదీల్లో జరిగే జీ–20 సదస్సుకు హాజరవుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా మంత్రులకు తెలిపారు. పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధనల గురించి వివరించారు. భారత్, ఇండియా వివాదంపై అ«దీకృత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు సూచించారు. చరిత్రలోకి వెళ్లకుండా రాజ్యాంగానికి లోబడి వాస్తవాలను మాట్లాడాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలి్చన డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు తగురీతిలో సమాధానమివ్వాలని ప్రధాని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాజకీయ పారీ్టలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉదయనిధి స్టాలిన్, ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికి ప్రియాంక్ ఖర్గేలపై మతవిశ్వాసాలను దెబ్బతీశారనే అభియోగాలపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. -
అవనిని తోడ్కొని ఆఖరి మైలు వరకు!
వసుధైక కుటుంబం! ఈ రెండు పదాల్లో యావత్ ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అన్నదే ఈ రెండు మాటలు బోధించే విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకంతో మమేకం చేసే విశ్వ దృక్పథమిది. భారత్ జి–20 అధ్యక్షతన ఈ దృక్పథం ప్రాతిపదికగానే మానవ కేంద్రీకృత పురోగమనం అనే భావన ఒక పిలుపుగా రూపొందింది. ఒక భూమిపై నివసించేవారిగా మన గ్రహాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనమంతా ఏకమౌదాం. ఒకే కుటుంబంగా... అభివృద్ధి సాధనలో పరస్పరం మద్దతిచ్చుకుందాం. సమష్టి భవిష్యత్తే ఏకైక భవిష్యత్తు అన్నది ఈ పరస్పర అనుసంధాన యుగంలో తోసిపుచ్చలేని వాస్తవం. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమం అంతకు ముందున్న ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ఈ మేరకు సంభవించిన మార్పులలో ముఖ్యమైనవి మూడు ఉన్నాయి: మొదటిది, ప్రపంచ జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి మానవ కేంద్రీకృత దృక్పథానికి మారడం అవసరమనే అవగాహన పెరగడం. రెండవది, వస్తూత్పత్తి సరఫరా, పంపిణీల క్రమంలో ఒడిదుడుకులను తట్టుకుని కోలుకునే సామర్థ్యాన్ని, నమ్మకమైన నిలకడల ప్రాముఖ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుండటం. మూడవది, అంతర్జాతీయ వ్యవస్థలలో సంస్కరణల ద్వారా బహుపాక్షికతకు ఉత్తేజమిచ్చే దిశగా సామూహిక గళం వినిపిస్తుండటం. ఈ మూడు రకాల మార్పులకు సంబంధించి జి–20కి భారత అధ్యక్షత ఉత్ప్రేరక పాత్రను పోషించింది. ఈ మేరకు ఇండోనేషియా నుంచి 2022 డిసెంబరులో మనం అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన వేళ ప్రపంచ ఆలోచనా వైఖరులలో మార్పులకు జి–20 ఉత్ప్రేరకం కావాల్సి ఉంటుందని నేనొక వ్యాసంలో రాశాను. వర్ధ మాన, దక్షిణార్ధ గోళ దేశాలు సహా ఆఫ్రికా ఖండంలోని బడుగు దేశాల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలో చేర్చాల్సిన నేపథ్యంలో ఇదొక ప్రత్యేక అవసరం. ఈ మేరకు జి–20కి మన అధ్యక్షతన తొలి కార్యాచరణలో భాగంగా దక్షిణార్ధ గోళ దేశాల గళం వినిపించేందుకు నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణార్ధ గోళ దేశాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంలో అదొక కీలక కసరత్తు. అంతేకాకుండా మన అధ్యక్షత సమయాన ఆఫ్రికా దేశాలనుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనడంతోపాటు ఆఫ్రికా సమాఖ్యకు జి–20 శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదన కూడా వచ్చింది. పరస్పర సంధానిత ప్రపంచమంటే వివిధ రంగాల్లో మన సవాళ్లు కూడా పరస్పరం ముడిపడి ఉంటాయి. ఇక 2030 గడువుతో సాధించాల్సిన లక్ష్యాలకుగాను మనమిప్పుడు మధ్య కాలంలో ఉన్నాం. అయినప్పటికీ సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్.డి.జి.) దిశగా పురోగమనం లేదన్న ఆందోళన చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎస్.డి.జి. ప్రగతిని వేగిరం చేయడంపై జి–20 కూటమి 2023 కార్యాచరణ ప్రణాళిక అన్ని దేశాలనూ భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రకృతితో సామరస్యపూరిత జీవనశైలి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదే సమయంలో ఈ ఆధునిక యుగంలోనూ వాతావరణ కార్యాచరణకు మన వంతు సహకారం అందిస్తున్నాం. ప్రగతికి సంబంధించి దక్షిణార్ధ గోళంలోని అనేక దేశాలు వివిధ దశలలో ఉన్నాయి. అందువల్ల వాతావరణ కార్యా చరణ కావడం తప్పనిసరి. లక్ష్యసాధన ఆకాంక్షలు నెరవేరాలంటే ఇందుకు తగినట్లు వాతావరణ నిధుల సమీకరణ, సాంకేతికత బదిలీ కూడా అవశ్యం. ‘పరిస్థితి చక్కబడాలంటే మనం ఏం చేయకూడదు?’ అనే నిర్బంధాత్మక ధోరణి నుంచి మనం పూర్తిగా బయట పడాలన్నది మన దృఢ విశ్వాసం. అలాంటి ధోరణికి భిన్నంగా వాతావరణ మార్పుల పోరాటంపై చేయాల్సింది ఏమిటనే దిశగా నిర్మాణాత్మక ఆలోచనలపై మనం దృష్టి సారించాలి. సుస్థిర, నిలకడ గల నీలి ఆర్థిక వ్యవస్థ కోసం చెన్నై ‘హెచ్ఎల్పీ’లు మన మహా సముద్రాలను ఆరోగ్య కరంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. హరిత ఉదజని ఆవిష్కరణ కేంద్రంతోపాటు పరిశుభ్ర హరిత ఉదజని కోసం అంతర్జాతీయ పర్యా వరణ వ్యవస్థ మన జి–20 అధ్యక్షత నుంచి ఆవిష్కృతమౌతుంది. 2015లో మనం అంతర్జాతీయ సౌర కూటమికి నాంది పలికాం. నేడు ప్రపంచ జీవ ఇంధన కూటమి ద్వారా, వర్తుల ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు తగినట్లు ఇంధన పరివర్తనకు శ్రీకారం చుట్టడంలో ప్రపంచానికే మనం ఆసరా అవుతున్నాం. వాతావరణ ఉద్యమానికి ఊపునివ్వడంలో వాతావరణ కార్యాచరణను ప్రజాస్వామ్యీకరించడం ఉత్తమ మార్గం. వ్యక్తులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యం ప్రాతిపదికగా రోజువారీ నిర్ణయాలు తీసుకున్న రీతిలోనే మన భూమి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం ప్రాతిపదికగా జీవనశైలిపై నిర్ణయాలు తీసు కోవచ్చు. మానవ శ్రేయస్సుకు యోగాభ్యాసం ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపొందిన తరహాలోనే మనం కూడా ‘సుస్థిర పర్యావ రణం కోసం జీవనశైలి’(లైఫ్)తో ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చాం. వాతావరణ మార్పుల ప్రభావం నేపథ్యంలో ఆహారం–పౌష్టి కతల భద్రతకు హామీ ఇవ్వడం ఎంతో కీలకం. ఈ హామీతో పాటు వాతావరణ అనుకూల వ్యవసాయ వృద్ధికి చిరుధాన్యాలు లేదా ‘శ్రీ అన్న’ కూడా తోడ్పడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సర నేపథ్యంలో మనం చిరుధాన్యాలను అంతర్జాతీయ ప్రజానీకం కంచాల్లోకి తీసుకెళ్లగలిగాం ఆహార భద్రత–పౌష్టికతపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు కూడా ఇందుకు సాయపడతాయి. సాంకేతిక పరిజ్ఞానంలో పరివర్తన సర్వసాధారణమే. అదే సమ యంలో అది సార్వజనీనం కూడా కావాలి. లోగడ సాంకేతిక పురోగ మన ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అంద లేదు. అయితే, అసమానతల విస్తరణలోగాక తొలగింపులో సాంకే తి కత వినియోగం ఎంత ప్రయోజనకరమో కొన్నేళ్లుగా భారత్ ససా క్ష్యంగా నిరూపించింది. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగాబ్యాంకింగ్ సదుపాయం లేదా డిజిటల్ గుర్తింపు లేని కోట్లాది ప్రజలకు డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు (డి.పి.ఐ.) కల్పించడం ద్వారా ఆర్థిక సార్వజనీనతలో వారిని భాగస్వాములను చేయవచ్చు. ఈ మేరకు డి.పి.ఐ. ఆధారిత పరిష్కారాలకు నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్ధమాన దేశాలు సార్వజనీన వృద్ధి సాధనలో డి.పి.ఐ. ని స్వీకరించి, తమకు తగిన స్థాయిలో వాటిని రూపొందించుకునేలా మనం చేయూతనిస్తాం. భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం యాదృచ్ఛికమేమీ కాదు. బలహీన/అట్టడుగు వర్గాలు మన పురోగమన పయనాన్ని నడిపించగలిగేలా మనం అమలు చేసిన సరళ, అనుసరణీయ, సుస్థిర పరిష్కారాలు శక్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి క్రీడారంగం వరకు; ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఔత్సాహి కత దాకా భారత మహిళలు వివిధ రంగాల్లో ముందంజ వేశారు. మహిళల నేతృత్వంలో ప్రగతికి వారు సరికొత్త అర్థం చెప్పారు. ఈ విధంగా లింగపరంగా డిజిటల్ విభజన తొలగింపు, శ్రామిక శక్తి పరంగా అంతరం తగ్గింపు సహా నాయకత్వం–నిర్ణయాత్మకతలో మహిళలు కీలక పాత్ర పోషించేలా ఇవి ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌కు జి–20 అధ్యక్షత ఉన్నతస్థాయి దౌత్య కర్తవ్యం మాత్రమే కాదు; ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, వైవిధ్యానికి నమూనాగా యావత్ ప్రపంచం మన అనుభవాలను పంచుకునేందుకు ద్వారాలు తెరిచాం. వివిధ అంశాల్లో విజయసాధన అన్నది నేడు భారతదేశ సహజ లక్షణంగా మారింది. ఇందుకు జి–20 అధ్యక్ష బాధ్యత మినహాయింపు కాబోదు. ఇప్పుడీ బాధ్యత ప్రజాచోదక ఉద్యమంగా రూపొందటమే ఇందుకు కారణం. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. వీటితోపాటు మన అధ్యక్ష బాధ్యతలు ముగిసేలోగా వీటిలో పాలుపంచుకున్న 125 దేశాలకు చెందిన 1,00,000 మందికిపైగా ప్రతినిధులకు మన ఆతిథ్యం రుచి చూపాం. ఇప్పటిదాకా ఏ దేశమూ ఇంత భౌగోళిక వైవిధ్యంతో జి–20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది లేదు. భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, ప్రగతిపై ఇతరుల నుంచి ప్రశంసలు వినడం ఒక అంశమైతే, అంతకన్నా ముందే వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం పూర్తిగా భిన్నం. మన జి–20 ప్రతినిధులు దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మన జి–20 అధ్యక్షత ప్రధానంగా విభజన రేఖల తుడిచివేతకు, అడ్డంకుల ఛేదనకు, విభేదాలకు భిన్నంగా ప్రపంచంలో సామరస్యం దిశగా సహకార బీజాలు వేయడానికి కృషి చేస్తుంది. ‘ఎవరికివారే యమునాతీరే’ అనే పరిస్థితికన్నా ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడమే మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి స్వరం వినిపించేలా, ప్రతి దేశం సహకరించేలా అంతర్జాతీయ వేదిక విస్తరణకు మనం శపథం చేశాం. తదనుగుణంగా మన కార్యాచరణ, ఫలితాలు చెట్టాపట్టాలతో సాగుతున్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలను. నరేంద్ర మోదీ భారత ప్రధాని (సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జి–20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశం జరగనుంది.) -
భారత్‌కు రాలేనన్న పుతిన్.. అరెస్ట్ భయమే కారణమా?
వచ్చే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మరోవైపు.. జీ-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు. ఈ మేరకు పుతిన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. పుతిన్ బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరు కానున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. భారత్‌లో జీ-20 సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు పీఎంవో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని పుతిన్.. మోదీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొంటారని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా నిర్ణయంపై, భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమ్మిట్ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా పుతిన్ అరెస్ట్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే పుతిన్ ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరుకావడంలేదని తెలుస్తోంది. #BREAKING #Russia #India Russian President Vladimir Putin said during a telephone conversation with Indian Prime Minister Narendra Modi that he will not be able to attend the G20 summit, and that Russia will be represented by Foreign Minister Sergei Lavrov, the Indian PM's office… — The National Independent (@NationalIndNews) August 28, 2023 ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం -
ఆ మూడ్రోజులు ‘ఢిల్లీ’కి సెలవు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జి–20 శిఖరాగ్ర సదస్సుకు సమాయత్తమవుతోంది. సెపె్టంబర్ 8, 9, 10వ తేదీల్లో జరిగే ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సదస్సు దృష్ట్యా వచ్చే నెల 8 నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుకు హాజరవుతున్న భాగస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా ఆ మూడు రోజులూ లుటియన్స్ ఢిల్లీలోని అన్ని మాల్స్, మార్కెట్లను మూసి ఉంచాలన్న పోలీసు శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సుల రాకపోకలను గణనీయంగా తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యే ముఖ్యుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, యూకే ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ల తదితరులున్నారు. హోటళ్లకు పెరిగిన గిరాకీ... జీ20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ సహా, గురుగ్రావ్, నోయిడాల్లోని పెద్ద హోటళ్లకు గిరాకీ పెరిగింది. ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధి బృందాలు, భారీ రక్షణ, మీడియా బృందాలు ముందుగానే భారత్ చేరుకుంటుండటంతో టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు పెరిగాయి. సెపె్టంబర్ 6 నుంచి 12 మధ్య అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఏరోసిటీలోని హోటల్లో ఉత్తమమైన సూట్ ఒక రాత్రికి రూ.20 లక్షల చొప్పున కోట్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలోని జన్‌పథ్ సమీపంలోని ఒక హోటల్లో ప్రధాన సూట్‌కు ఒక్క రాత్రికి రూ.15 లక్షలకు బుక్ అయిందని అవి వెల్లడించాయి. -
ITPO complex: ‘భారత మండపం’ రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్ హాలు ఉంది. జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. -
కశ్మీర్లో జీ–20 సన్నాహకం షురూ
శ్రీనగర్: పాకిస్తాన్ పెడబొబ్బలను, చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జమ్మూ కశ్మీర్లో జీ–20 సన్నాహక సదస్సు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చైనా మినహా అన్ని సభ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. పర్యాటక రంగం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. వారికి సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం లభించింది. తొలి రోజు ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు సినీ టూరిజం’ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ప్రతినిధులంతా చారిత్రక దాల్ సరస్సులో బోట్ షికారు చేస్తూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు. కేంద్రం త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తుందని కేంద్ర సాంస్కృతి పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కశ్మీర్లో అద్భుతమైన అవకాశాలున్నాయని మీడియా తో చెప్పారు. పర్యాటకాభివృద్ధికి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ స్థాయికి చేరుకోలేమన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హర్తాళ్ పిలుపులు గత చరిత్ర కశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటి లాగా బంద్ పిలుపులకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘గతంలో కశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాక్ నుంచి వచ్చిన పిలుపుతో దుకాణాలు మూతబడేవి. ఇప్పుడు మాత్రం హర్తాళ్ చేపట్టాలంటూ ఎవరు పిలిపిచ్చినా పట్టించుకోవడం లేదు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే రెండు తరాలు నష్టపోయిన విషయం ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి బాటన ముందుకు సాగాలనుకుంటున్నారు’’ అని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఉపాధికి కశ్మీర్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. -
పరిశోధనా ఫలాలు రైతులకు చేరాలి
సాక్షి, హైదరాబాద్: పరిశోధనా ఫలాల్ని మారుమూల ప్రాంతాల్లో ఉండే సన్న చిన్న కారు రైతాంగాలకి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని అధికం చేయడానికి, నష్టాల్ని తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానం చేయడానికి టెక్నాలజీలని విరివిగా వినియోగించుకోవాలన్నారు. కిందిస్థాయి రైతాంగం వరకు శిక్షణ అందించాలన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ‘విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)’లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈఈఐ స్వరో్ణత్సవాల సందర్భంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 200 మంది కూర్చునే విధంగా ఈ ఆడిటోరియాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, అనేక పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలలో దేశం ప్రథమ శ్రేణిలో ఉందన్నారు. దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయికి దేశం ఎదిగిందని మంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం కూడా ఇతోధిక సాయం అందించాలని కోరారు. జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జీ–20 సదస్సు... జూన్ 15–17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జీ–20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో తెలంగాణ ముందున్న నేపథ్యంలోనే ఇక్కడ జీ–20 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సీఎస్ శాంతి కుమారితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి భేటీ... కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ అహూజా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనోజ్ అహూజా, జాయింట్ సెక్రటరీ యోగితా రాణాలను శాంతి కుమారి శాలువాతో సత్కరించారు. -
సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో జరిగే జి–20 శిఖరాగ్రంలో ఆయన పాల్గొంటారని సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ తెలిపారు. పర్యటనకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయన్నారు. జి–20 అధ్యక్షస్థానంలో ఉన్న భారత్ నాయకత్వ లక్షణాలు మరింత విస్తృతమై బలమైన దేశంగా నిలుస్తోందన్నారు. అమెరికా–భారత్ సంబంధాల్లో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అపెక్, జపాన్ జి–7తోపాటు క్వాడ్ కూటమి సదస్సులు వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటి తో భారత్–అమెరికా మరింత సన్నిహితమయ్యే అవకాశాలు పెరుగుతాయని లూ అన్నారు. -
రేపటి ఆర్థిక నగరాలపై సమగ్ర చర్చ
సాక్షి, విశాఖపట్నం: పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అందుకవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై జీ–20 దేశాల ప్రతినిధుల బృందం సమగ్రంగా చర్చించింది. జీ–20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మీడియాకు వెల్లడించారు. రేపటి ఆర్థిక నగరాలు మరింత వృద్ధి చెందేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను పెంచడం వంటి అంశాలపైనా ప్రతినిధులు విస్తృతంగా చర్చించారన్నారు. ఈ సదస్సుకు 14 జీ–20 సభ్యదేశాల నుంచి 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి మరికొంతమంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. మిగిలిన ఆరు సభ్య దేశాల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణాలు/నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక వనరుల కోసం వినూత్న మార్గాలను గుర్తించడం వంటి వాటిపై చర్చ జరిగిందని తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు సెషన్లు, ఒక వర్క్‌షాపు నిర్వహించారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతులపై.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికలను అన్వేషించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడం, ప్రైవేటు రంగానికి ఆ డేటా ఉపయోగపడేలా చేయడంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారని, వీటిపై కొన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చారని ఆరోఖ్యరాజ్ వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందన్నారు. సుపరిపాలనకు ఏ రకమైన నైపుణ్యం అవసరమవుతుందో నిపుణులు సూచనలు చేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్డీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన 13 మంది నిపుణులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గత జనవరిలో పూణేలో జరిగిన జీ–20 ఐడబ్ల్యూజీ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలపై విశాఖలో బ్లూప్రింట్ ఇచ్చామన్నారు. బీచ్‌లో యోగా, ధ్యానం.. రెండో రోజు బుధవారం ఉదయం సదస్సు నిర్వహిస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో ఉన్న బీచ్‌లో జీ–20 దేశాల ప్రతినిధులకు యోగా, «ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో నిర్వహించిన కార్యక్రమంలో సాత్విక ఆహారాన్ని పరిచయం చేశారు. రుషీకేష్‌లో మూడో సదస్సు.. జూన్ ఆఖరులో ఈ జీ–20 మూడో ఐడబ్ల్యూజీ సదస్సు రుషికేష్‌లో జరుగుతుందని ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. విశాఖ సదస్సులో చర్చించిన అంశాలను పైలట్ స్టడీస్ కింద అక్కడ సమర్పిస్తారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం ఎంతో బాగుందని అతిథులు ప్రశంసించారని ఆరోఖ్యరాజ్ తెలిపారు. అంతేకాదు.. సదస్సు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి మనసు దోచుకున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని తొట్లకొండ, కైలాసగిరి వ్యూపాయింట్, ఆర్కేబీచ్, సీహారియర్ మ్యూజియం, వీఎంఆర్డీఏ బీచ్‌లు అతిథులను కట్టిపడేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఏపీలో గృహనిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంగళవారం రాత్రి అతిథులకు ఇచ్చిన గాలా డిన్నర్లో వివరించారన్నారు. నేడు, రేపు ఇలా.. ఇక గురువారం జీ–20 దేశాల ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు జరుగుతుందని ఆరోఖ్యరాజ్ చెప్పారు. కొరియా, సింగపూర్‌లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపైన, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపైన చర్చిస్తారన్నారు. విశాఖ నగరంపై కూడా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే, శుక్రవారం జరిగే సమావేశానికి దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. -
విశాఖ.. కళాత్మక కీర్తి పతాక
సాక్షి, విశాఖపట్నం: వైవిధ్యభరితమైన విశాఖ వైభవాన్ని విదేశాలకు ఘనంగా చాటిచెప్పే అవకాశం జీ–20 సదస్సుతో సాక్షాత్కరించింది. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సుల్లో భాగంగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు అత్యంత కళాత్మకంగా నిలుస్తున్నాయి. జీ–20 దేశాల జెండాల వైభవంతో పాటు వసుదైక కుటుంబమనే థీమ్‌ను విశ్వవ్యాప్తం చేస్తూ.. భారతీయ సంప్రదాయాల డిజైన్లు, మ్యూరల్ ఆర్ట్స్‌ను గుంటూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ జాన్ రత్నబాబు బండికొల్ల ప్రపంచానికి పరిచయం చేశారు. రత్నబాబు కళాప్రతిభని చూసి విదేశీ ప్రతినిధులు అచ్చెరువొందుతున్నారు. విభిన్నంగా విశాఖ సదస్సు ఇప్పటివరకూ 20కి పైగా నగరాల్లో ఈ సన్నాహక సదస్సులు జరిగాయి. వీటన్నింటితో పోలిస్తే విశాఖ సదస్సు విభిన్నమైనదిగా గుర్తింపు పొందింది. సభా ప్రాంగణంతో పాటు నగరమంతా మురిసిపోయేలా రూపొందించిన డిజైన్లు అతిథులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీన్ని కళాత్మక సదస్సుగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన జాన్ రత్నబాబు ఏయూలో బీఎఫ్ఏ చేశారు. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జీ–20 విశాఖ లోగో కూడా అద్భుతః జీ–20 థీమ్ అయిన వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్ (వసుదైక కుటుంబం)ని చాటిచెప్పేలా జాన్ లోగో డిజైన్ చేశారు. ♦ ఒక గ్లోబ్లో అక్షర క్రమంలో జీ–20 దేశాల జాతీయ జెండాలను ఆయా దేశాల ప్రజలు పట్టుకుని ఉన్నట్లుగా చిత్రీకరణ చేశారు. మధ్యలో మన జాతీయ వృక్షం మర్రిచెట్టు, జాతీయ పక్షి పురివిప్పిన నెమలిని కూడా చిత్రీకరించారు. ఈ మర్రి వృక్షానికి జీ–20 దేశాల జాతీయ పక్షులు, పుష్పాలు జోడించారు. ♦ అదేవిధంగా వృక్షం చివర్లో వన్ ఫ్యామిలీకి గుర్తుగా నెమలి పింఛాలు, మర్రి వృక్షం మొదట్లో ఒక తండ్రి, తల్లి మధ్యలో బాలుడు, వారి ఇల్లుని, వన్ ఫ్యూచర్‌కి సింబాలిక్‌గా సీతాకోక చిలుకల పెయింటింగ్ వేశారు. ♦ సదస్సుకు ఆహ్వానం పలుకుతున్న విశాఖనగరానికి చిహ్నంగా సముద్రం, డాల్ఫిన్ నోస్, లైట్‌హౌస్, పక్కనే చర్చి, మధ్యలో గుడి, మసీద్‌ను వేశారు. ♦ మొత్తంగా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసి.. ప్రతి ఒక్కరూ వహ్వా అనేలా రూపొందించారు. ఈ తరహా డిజైన్లను ఎవరూ రూపొందించలేదని విదేశీ ప్రతినిధులు చెప్పారు. నగర వీధుల్లో వాల్ పెయింటింగ్స్ ఆకట్టుకునేలా చిత్రించారు. ఎప్పుడూ రాని సంతృప్తి ఇప్పుడు వచ్చింది విజువల్ ఆర్టిస్ట్‌గా 150కి పైగా అంతర్జాతీయ అవార్డులు సాధించినా రాని సంతృప్తి.. జీ–20 సదస్సు ప్రధాన లోగో డిజైన్ చేసినప్పుడు వచ్చింది. ప్రముఖుల నుంచి అందుతున్న ప్రశంసలు ఆత్మసంతృప్తినిస్తున్నాయి. విశాఖలో మొత్తం 2000 డిజైన్లతో కాన్సెప్ట్‌లను వాల్‌పెయింటింగ్స్‌గా మలిచాం. 34 రోజుల పాటు శ్రమించి విశాఖను కళాత్మక నగరంగా మలిచాం. – జాన్ రత్నబాబు బండికొల్ల, అంతర్జాతీయ విజువల్ ఆర్టిస్ట్ -
విశాఖలో రెండో రోజు జీ-20 సదస్సు
సాక్షి, విశాఖపట్నం: గత రెండు రోజులుగా జీ-20 సదస్సులో భవిష్యత్ లో నగరాల అభివృద్ది, పెట్టుబడులనే అంశంపై 8 సెషన్స్ జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సోలమన్ ఆరోఖ్య రాజ్ తెలిపారు. ఈ అర్థవంతమైన చర్చల్లో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారు చాలా విలువైన సలహాలు సూచనలు చేశారన్నారు. ఈ సూచనలను సదస్సులను రెండు నెలల పాటు అధ్యయనం చేసి జూన్‌లో జరిగే మూడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్‌లో భవిష్యత్ నగరాల నిర్మాణంపై ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తామన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా నుంచి వచ్చే నిపుణులచే చివరి రోజు విద్యార్థులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు శిక్షణా తరగతులు వుంటాయన్నారు. ఇదీ చదవండి: వైజాగ్‌లో జీ20 ప్రతినిధులు మెచ్చినవేంటో తెలుసా? -
మంచి ఆలోచనలు కావాలి.. సమస్యలకు పరిష్కారం చూపాలి: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ఉద్దేశమని, మేం అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీ–20 సదస్సు తొలి రోజు.. సీఎం జగన్ హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీ-20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ, 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని సీఎం జగన్ అన్నారు. ‘‘దీనిపై సరైన మార్గ నిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘కదులుతున్న ‘మార్గదర్శి’ అక్రమాల డొంక.. రామోజీ బెంబేలు’ -
జీ-20 సదస్సు అతిథులతో విందులో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: జీ–20 సదస్సు తొలి రోజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీ-20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం. మేం అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. ►జీ-20 సదస్సు అతిథులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విందులో పాల్గొన్నారు. కాసేపట్లో జీ-20 ప్రముఖులతో సీఎం భేటీ కానున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు ఆయన బయలుదేరారు. సీఎంకు ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో జీ-20 ప్రముఖులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం వారికి మర్యాద పూర్వక విందు ఇవ్వనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. జీ–20 సదస్సుకు హాజరైన ప్రతినిధులతో సీఎం జగన్ కాసేపట్లో సమావేశం కానున్నారు. అనంతరం వారికి మర్యాద పూర్వక విందు ఇవ్వనున్నారు. ► విశాఖలో ప్రారంభమైన జీ-20 సదస్సు ►నేటి నుంచి(మంగళవారం)జీ-20 దేశాల రెండో ఇన్ప్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్(ఐడబ్యూజీ) సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా జరుగుతున్న జీ-20 సదస్సుతో విశాఖ నగరం మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. ►ఈ సదస్సు వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. ►నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. ►అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు. 2,500 మందితో భద్రతా ఏర్పాట్లు ►జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు ►సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు. జీ–20 దేశాలివీ.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్. సదస్సుకు హాజరుకానున్న సీఎం జగన్ జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు.. జీ–20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. సదస్సు షెడ్యూల్ ఇలా.. ►28 ఉదయం రాడిసన్ బ్లూ హోటల్లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్లోని కన్వెన్షన్ హాలులో జరుగుతుంది. ►సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ►29న హోటల్ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది. ►30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరు, జిందాల్ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ తయారీ యూనిట్ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు. ►31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం..విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహా నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా.. మంగళవారం నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సు వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు వంటివి అధికారులు పూర్తిచేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు. పూణే, కడియంల నుంచి తెచ్చిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విద్యుత్ స్తంభాలకు విద్యుద్దీపాలను అలంకరించారు. ఇలా.. విశాఖ నగరం మునుపెన్నడూ లేని రీతిలో ఎటు చూసినా ఎంతో సుందరంగా కనిపిస్తోంది. ఇక జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్, ఆర్కే బీచ్ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్ ఎయిర్ సఫారీ కూడా నిర్వహించారు. గత కొన్నిరోజులుగా మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్ తదితరులు ఈ సదస్సు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2,500 మందితో భద్రతా ఏర్పాట్లు జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు. జీ–20 దేశాలివీ.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్. నేడు సదస్సు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం జగన్ జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు.. జీ–20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. రూ.157 కోట్లతో నగర సుందరీకరణ జి–20 సమావేశాలు పురస్కరించుకుని రూ.157 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. నగరంలో ఏ మూల చూసినా విద్యుద్దీపాలతో ధగధగలాడుతోంది. విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేశారు. రహదారులన్నీ మిలమిల మెరిసిపోతున్నాయి. ♦ 46 కి.మీల మేర రోడ్డు పనులు, 24 కి.మీల మేర పెయింటింగు పనులు, 10 కి.మీల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టారు. ♦ రూ.2.39 కోట్లతో సీతకొండపై బీచ్ వైఎస్సార్ వ్యూ పాయింట్‌ను ఆధునీకరించారు. ఐ లవ్ వైజాగ్ సెల్ఫీ పాయింట్, సోలార్ ట్రీ ఏర్పాటుచేశారు. ♦ సాగర్‌నగర్, గుడ్లవానిపాలెం, జోడుగుళ్లపాలెం బీచ్‌లను అభివృద్ధి చేశారు. రూ.1.31 కోట్లతో కైలాసగిరి రోప్‌వే నుంచి తిమ్మాపురం వరకు 11 కి.మీల మేర ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేసి టెర్రాకోట్ వేశారు. ♦ రోడ్ల పక్కన గోడలకు, కల్వర్టులకు విశాఖ, ఏపీ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. అందాల కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. ♦ ఎయిర్‌పోర్టు నుంచి బీచ్‌రోడ్డులో సదస్సు జరిగే రాడిసన్ బ్లూ హోటల్ వరకు ఇరువైపులా వివిధ రకాలతో వైఎస్సార్ జిల్లా మేదర నిపుణులు రూపొందించిన వెదురు ఆకృతులపై పూలమొక్కలను అమర్చారు. రోడ్ల మధ్యనున్న డివైడర్లు పచ్చని మొక్కలతో అలరిస్తున్నాయి. సదస్సు షెడ్యూలు ఇలా.. ♦ 28 ఉదయం రాడిసన్ బ్లూ హోటల్లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్లోని కన్వెన్షన్ హాలులో జరుగుతుంది. సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ♦ 29న హోటల్ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది. ♦ 30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరు, జిందాల్ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ తయారీ యూనిట్ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు. ♦ 31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం.. విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు. -
రూపాయిలో ట్రేడింగ్.. భారత్ ‘జీ 20’ అజెండా
ముంబై: భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ–20 సమావేశాల్లో ‘రూపాయిలో ట్రేడింగ్’ అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరెన్సీ ఒత్తిడిలో ఉన్న దేశాలకు రూపాయి వాణిజ్యం ఉపయోగపడుతుందని వాణిజ్య కార్యదర్శి ఇక్కడ విలేకరులతో అన్నారు. అయితే జీ–20 ఫోరమ్‌తో రూపాయి వాణిజ్యానికి నేరుగా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కీలక సమావేశం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ–20 దేశాలు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సమావేశం చర్చించే అంశాల్లో వాణిజ్యం– వృద్ది మధ్య మరింత సమతౌల్యత సాధించడం, ప్రపంచ సరఫరాల చైన్‌ను ఆటుపోట్లను తట్టుకునేలా చర్యలు తీసుకోవడం, వాణిజ్యంలో చిన్న వ్యాపారాలను ఏకీకృతం చేయడం, నిబంధనలలో ఏకరూపత సాధించడం, తద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడానికి మార్గాలు వంటి అంశాలు ఉన్నాయని బరŠాత్వల్ చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి భారత్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్న వాణిజ్య కార్యదర్శి, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశ ఎజెండాలో ఇదే ప్రధాన అంశమని తెలిపారు. రూపాయి మారకంలో అంతర్జాతీయంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించడంపై ఇతర దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 18 దేశాలకు చెందిన బ్యాంకులు.. భారతీయ బ్యాంకుల్లో 30 పైచిలుకు ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. లావాదేవీలూ స్వల్ప స్థాయిలో ప్రారంభమైనట్లు వివరించారు. రూపాయి మారకంలో చెల్లింపుల సెటిల్మెంట్కు వోస్ట్రో ఖాతాలు దోహదపడతాయి. రూపాయల్లో వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది జూలైలో ప్రకటించిన తర్వాత తొలుత రష్యాకు చెందిన సిబెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంక్ ఈ ఖాతాలు తెరిచాయి. -
జి–20 సదస్సుతో విశాఖకు ప్రపంచ గుర్తింపు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే జి–20 సదస్సు ద్వారా విశాఖ నగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ మరింత పెంచేలా, దేశం గర్వించేలా ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జరిగే జి–20 సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ తో కలిసి జిల్లా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జి–20 సదస్సుకు 40 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీన రాడిసన్ బ్లూ హోటల్లో బ్రేక్‌ఫాస్టు తర్వాత హోటల్లోని కన్వెన్షన్ హాలులో ప్రధాన సమావేశం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 వరకు మూడు రకాల సమావేశాలు జరుగుతాయి. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు అదే హోటల్ సమీపంలోని బీచ్‌లో డిన్నర్ ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి’ అని మంత్రి రజిని వివరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని కాబోయే విశాఖ నగరం అభివృద్ధి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. జి–20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
ఏకాభిప్రాయం సాధిద్దాం
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో గురువారం జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు. ‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో మనం కలుసుకున్నాం. మన మధ్య జరిగే చర్చలు భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల ప్రతినిధులుగా ఇక్కడ లేని వారి పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవస్థలు విఫలం ‘గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు..వంటి వాటిని ఎదుర్కొన్న విధానం చూస్తే అంతర్జాతీయ వ్యవస్థలు ఎలా దారుణంగా విఫలమయ్యాయో స్పష్టమవుతోంది. ఈ వైఫల్యం విషాదరకర పరిణామాలను అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా ఎదుర్కొన్నాయనే విషయం మనం అంగీకరించాలి. ఏళ్లపాటు సాధించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తిరోగమించే ప్రమాదం ఉంది’అని ప్రధాని హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు తమ ప్రజానీకానికి ఇంధన, ఆహార భద్రతను అందించే క్రమంలో తీవ్రమైన రుణ భారంతో అవస్థలు పడుతున్నాయన్నారు. ధనిక దేశాల కారణంగా వచ్చిన గ్లోబల్ వార్మింగ్తోనూ ఆయా దేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ వర్గం కూడా తమదే ప్రపంచ నాయకత్వమంటూ చాటుకోలేదని మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, యూకేల విదేశాంగ మంత్రులు వరుసగా ఆంటోనీ బ్లింకెన్, లావ్రోవ్, క్విన్, క్లెవెర్లీతోపాటు ఈయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు భారత్, ఇటలీలు రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్‌లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.