
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జూన్‌లో జపాన్‌లో జరిగే జీ–20 సమావేశంలో ప్రత్యేకంగా భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలు శుక్రవారం నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. జపాన్‌లో ఇండియా, అమెరికా, జపాన్‌ల మధ్య త్రైపాక్షిక భేటీ ఉంటుందని శ్వేతసౌధం అధికారులు చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై వారు ప్రధానంగా చర్చిస్తారంది. జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ–20 సదస్సు జరగనుంది.
ప్రపంచ దేశాల నేతల అభినందనలు
ఎన్నికల్లో ఘనవిజయానికి అభినందిస్తూ మోదీకి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్లు చేశారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, సౌదీ అరేబియా రాజు సల్మాన్‌బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్, నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొ, నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సహా పలువురు నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment