phone call
-
మీ కొడుకు రేప్ కేసులో దొరికాడు
బొంరాస్‌పేట: ‘హలో..ఆప్ కా బేటా రేప్ కేస్ మే మిల్గయా. ఛోడ్దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో.. నైతో జైల్‌మే దాల్దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్ కట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్ భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్కు ఓ నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్లో పోలీస్ వాహనాల సైరన్ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు. హడలిపోయిన శ్యామలయ్యగౌడ్ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్‌స్టేషన్ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్ అని భావించి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘‘వ్యాపారం, వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై జిన్‌పింగ్‌తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్‌లో చైనాతో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
నేను అండగా ఉంటా.. జగన్ పరామర్శ
-
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్‌లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్‌కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
ట్రంప్ నాకేం ఫోన్ చేయలేదు: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్అవీవ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఓ కథనం వెలువడింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ఈ ఫోన్‌కాల్ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే.. తాజాగా ఈ కథనాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (బుధవారం).. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడలేదు’’ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.ట్రంప్.. ఫోన్ చేసిన హమాస్‌తో కాల్పుల విరమణ కోసం నెతన్యాహును పోత్సహించినట్లు యాక్సిస్ నివేదిక పేర్కొంది. మరోవైపు.. ఈ విషయంపై ట్రంప్ ప్రచార బృందం కూడా స్పందించకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈజిప్ట్, అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇవాళ గాజా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలను ఎక్కడ జరుపుతారనే విషయంపై స్పష్టత లేదు. -
ట్రంప్ కు బైడెన్ ఫోన్ కాల్..
-
కమలా హారీస్‌తో రాహుల్ ఫోన్.. క్లారిటీ ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్
ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ మాట్లాడుకున్నారనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం స్పందించింది. కమలా హారీస్‌తో రాహుల్ మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది.కాగా, కమలా హారీస్‌తో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం శనివారం స్పందించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా..‘కమలా హారీస్‌తో రాహుల్ మాట్లాడలేదు. ఇదంతా ఫేక్ ప్రచారం మాత్రమే’ అని ఖండించింది. దీంతో, రాజకీయ దుమారానికి తెరపడినట్టు అయ్యింది. అయితే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో రాహుల్ ఫోన్లో మాట్లాడారనే వార్త రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. Moye moye ho gya ye to The US Vice President's office has denied reports of a phone conversation between Kamala Harris and Indian politician Rahul Gandhi, contradicting earlier claims made by some media outlets and social media posts. This has led to accusations of spreading… pic.twitter.com/8vz3eV09vY— Manisha Singh (@ManiYogini) July 13, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య దౌత్యపరంగా, రాజకీయంగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. పలుమార్లు మోదీకి అనుకూలంగానే బైడెన్ మాట్లాడారు. ఇక, మోదీ రష్యా పర్యటన సందర్భంగా కూడా అమెరికా.. భారత్, మోదీకి అనుకూలంగానే కామెంట్స్ చేశారు. -
India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
లండన్: భారత్– బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్‌మ్యాప్‌పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి. -
చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకుగానూ అభినందనలు తెలియజేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, అలాగే విభజన హామీలు.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్‌తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఆయనను సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన -
కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్ కాల్స్..!?
-
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. ఆడియో షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రచార ముగింపు వారం రోజులే ఉండటంతో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 119 నియోజవర్గాల్లోని గల్లీగల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ వాడ, ఊరిలో చూసిన ప్రచార సభలు, రోడ్‌షోలే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్లీక్ అయ్యిందంటూ కాంగ్రెస్ ఓ ఆడియో కలఇప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్ వాయిస్‌తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది. ఈ ఆడియోలో.. వారం రోజుల్లో ప్రచారం ముగిస్తుందని.. ఈ కొన్ని రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా.. కౌన్సిలర్లు, సర్వంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు వినిపిస్తుంది. గతంలో కాకుండా వచ్చే ఎన్నికల తర్వాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండంటూ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ ఫోన్ కాల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCR pic.twitter.com/PXOvRujqt4 — Telangana Congress (@INCTelangana) November 22, 2023 -
మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్‌తో రూ.లక్ష మాయం..
టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్‌తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్‌కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది. తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు. మాజీ టెలికాం మంత్రి.. దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, డెల్‌తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి. -
పోయి కేసీఆర్ ని అడుక్కో..హోమ్ గార్డ్ ఆడియో లీక్ వైరల్
-
జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నా
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే జీ20 కీలక సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సహకారం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ప్రస్తావనకు వచ్చింది. సెపె్టంబర్ 9, 10న జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో తన అశక్తతను పుతిన్ తెలియజేశారు. ఈ సదస్సుకు రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. జీ20కి సారథ్యంలో భాగంగా భారత్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు గాను పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు. -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్‌కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. No Dream Too Small! 🫡 Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2 — BCCI (@BCCI) July 21, 2023 Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF — FanCode (@FanCode) July 22, 2023 చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. ఈ ఏడాదిలో రెండోసారి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంత్రి కార్యాలయం నుంచి నితిన్ గడ్కరీకి ప్రాణహాని ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివరాల ఆధారంగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో, మహారాష్ట్రలోని అతని నివాసం, కార్యాలయానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం -
కర్ణాటక బీజేపీ నేతకు మోదీ ఫోన్ కాల్
బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ మరుసటి రోజే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్ చేయడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో.. పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్ చేశారు మోదీ. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్ చేయడం గొప్పగా భావిస్తున్నా అని ఈశ్వరప్ప, మోదీతో పేర్కొన్నారు. దానికి ప్రతిగా.. ‘మీరు పార్టీ పట్ల వీరవిధేయతను కనబరిచారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని ప్రధాని మోదీ ఆ కాల్లో ఆయనకు బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని, కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోదీకి హామీ ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఈశ్వరప్ప.. ఆరో దఫా సైతం పోటీ చేయాలని భావించగా, పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతూ ఆయన ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీతో ఫోన్‌కాల్ మాట్లాడిన అనంతరం.. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: వివాదాల పుట్ట.. ఈశ్వరప్ప మోదీగారు తనకు ఫోన్ చేస్తారని జీవితంలో అనుకోలేదని, ఆయన చేసిన పని తనకెంతో స్ఫూర్తినిచ్చిందని మీడియాకు ఈశ్వరప్ప బదులిచ్చారు. कुर्सी, सत्ता, दबदबा किसी भी हाल में बना रहना चाहिए… जो फोन पर बात कर रहे है वो BJP के #Eshwarappa है जिन्होंने 40% कमीशन की मांग कर एक कांट्रेक्टर को आत्महत्या के लिए मजबूर किया, बाद में मंत्री से इस्तीफा और टिकिट कटा देश के #PM उन्हें भरोसा देते हुए pic.twitter.com/uml1QCnl9I — Chhaya Thakur (@ChhayaThakurInc) April 21, 2023 బీజేపీ మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువగా కొత్త ముఖాలను, యూత్ లీడర్లను దించుతోంది. దీంతో పార్టీ దిగ్గజాల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కూడా. అయితే మొదట ఈశ్వరప్ప సైతం పార్టీతీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడిచినప్పటికీ, తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ గురువారం ఈశ్వరప్ప ఒక ప్రకటన చేశారు కూడా. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. పాతికేళ్లుగా శివమొగ్గ ప్రజలకు సేవలందించా. ఇకపైనా వాళ్లకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఈశ్వరప్ప కొడుకుకూ దక్కని సీటు -
అబ్బే!.. రాంగ్ డయల్ కూడా కాదయా!
అబ్బే!.. రాంగ్ డయల్ కూడా కాదయా! -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్.. వ్యక్తి మృతి..
భోపాల్: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్ సడన్‌గా కట్ కావడంతో దినేశ్ దయారామ్కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్‌హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్ మార్క్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు. చదవండి: హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు -
ప్రీతి ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్ చేసి తన బాధను ఫోన్‌కాల్‌లో చెప్పుకుంది. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది. కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చదవండి: నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్ -
నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం.. బాంబు బెదిరింపు కాల్..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. -
అయోధ్య రామమందిరాన్ని పేలుస్తామంటూ బెదిరింపు కాల్.. పోలీసులు అలర్ట్!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం.. గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు. అయితే, మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ కాల్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాగా, కాల్ ట్రాకింగ్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక, బాంబు బెదిరింపు నేపథ్యంలో అయోధ్యలో పోలీసు బందోబస్తు పెంచినట్టు పోలీసు ఉన్నాతాధికారులు స్పష్టం చేశారు. आज दिनांक 02.02.2023 को रामलला सदन के एक शिष्य के मोबाइल पर अज्ञात व्यक्ति द्वारा श्री रामजन्मभूमि को बम से उड़ाने की धमकी देने के सम्बन्ध मे #ayodhyapolice द्वारा की जा रही कार्यवाही के सम्बन्ध मे पुलिस अधीक्षक नगर की बाईट। #UPPolice pic.twitter.com/cp9EcJmMtd — AYODHYA POLICE (@ayodhya_police) February 2, 2023 ఇదిలా ఉండగా.. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్భగుడిలో కొలువుతీరే బాలరాముడి విగ్రహ తయారీకి వినియోగించే పవిత్ర సాలగ్రామ శిలలను నేపాల్ నుంచి తెప్పించారు. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల పురాతన శిలలుగా చెప్పబడే ఈ శిలలను నేపాల్‌లోని మస్తాంగ్ జిల్లాలోని ముక్తినాథ్కు సమీపంలో కాళీ గండకీ నదీ ప్రవాహప్రాంతం నుంచి సేకరించారు. జానకీరాముల విగ్రహాలను చెక్కేందుకు 26 టన్నులు, 14 టన్నులు బరువైన ఈ రెండు శిలలను రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి అయోధ్యకు తీసుకొచ్చారు. 51 మంది వైదికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శిలలను ఆలయానికి సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కరసేవక్‌పురంలో గురువారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలలను చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చారు. అంతకుముందు, సీతాదేవి జన్మస్థలంగా పేరొందిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి ఈ శిలల రోడ్డుమార్గ ప్రయాణం మొదలైంది. -
షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు. అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం. షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు. చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు -
బ్రిటన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్–3తో ఫోన్లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. 27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సెక్స్ కాల్ దుమారం
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ యూట్యూబ్‌లో ఆ ఆడియో క్లిపులను షేర్ చేశారు. దీంతో పాక్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్ ఖాన్ వాయిస్ అనేది ఆరోపణ. విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్ అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్ క్లిప్స్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్ ఖలీద్ పేర్కొన్నారు. ఇక ఆ ఆడియో క్లిప్‌లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కాస్త ఇమ్రాన్ హష్మీ(బాలీవుడ్ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్ ఏషియా కరస్పాండెంట్, జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఎద్దేవా చేశారు. -
రష్యా అధ్యక్షుడికి మోదీ ఫోన్.. అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసింది. ఈ ఫోన్ సంభాషణపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది. మీడియా సమావేశంలో పుతిన్, మోదీ ఫోన్ సంభాషణపై ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్. ‘భారత ప్రధాని మోదీ మాటలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆయన సూచనలు ఆచరణలోకి వచ్చినప్పుడు వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేము మిత్రదేశాలతో సమన్వయంతో పని చేస్తాం. యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటుపడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు వేదాంత్ పటేల్. పుతిన్‌తో మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని పునరుద్ఘాటించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రష్యా, భారత్ దేశాధినేతల మధ్య ఈ ఏడాది ఐదుసార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. ఇదీ చదవండి: భారత ప్రధానమంత్రి కసాయి -
షాకింగ్ ఘటన: ఊహకే అందని ఫోన్ కాల్...కంగుతిన్న పోలీసులు
ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్ కాల్ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్ అయ్యారు పోలీసులు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్ కుమార్ అనే వ్యక్తి సుశీల్ గార్డెన్లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్ కుమార్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్‌కి లేని అభ్యంతరాలు మీకెందుకు?) -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్‌గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ..
సాక్షి, పెద్దపల్లి: ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఆ నియోజకవర్గాలకు భారీ మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేయడం జరిగింది. దీంతో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలతో చేదు అనుభవం ఎదురైంది. కొందరు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నియోజకవర్గానికి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో.. పెద్దపల్లి అభివృద్ధి కావాలంటే మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ.. మంచిది.. నువ్వు ఇక్కడకు వచ్చి మాట్లాడు.. అన్నారు. కాగా, వీరిద్దరూ మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ/ లండన్: ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్లో రిషి సునాక్‌తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇదీ చదవండి: Rishi Sunak: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత -
అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఫోన్ నెంబర్ కోసం ముంబైలోని ఆ పార్టీ యాక్టివిస్ట్‌ను సంప్రదించాడు. అతడు తిరస్కరించడంతో దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేస్తామంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం అక్కడి శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లడంతో కేసు నమోదై నగర వాసి అరెస్టు అయ్యాడు. దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షికి తెలిపారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ వ్యాపారి. ఈయన సోషల్ మీడియా ద్వారా ముంబైలోని శాంత క్రుజ్ వాసి రఫత్ హుస్సేన్ ఫోన్ నెంబర్ సంగ్రహించాడు. గత మంగళవారం ఆయనకు వీడియో కాల్ చేసిన రంజిత్ తనకు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ ఫోన్ నెంబర్ కావాలంటూ అడిగాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంజిత్ ముంబైలో ఉండే తనకు ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీ నెంబర్ అడగటంతో హుస్సేన్ అనుమానించారు. దీనికి తోడు తనకు రంజిత్‌తో పరిచయం లేకపోవడంతో ఫోన్ నెంబర్ ఇవ్వనంటూ స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన రంజిత్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. తాను అడిగిన ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తిరస్కరించావని, ఫలితంగా బుధవారం (మరుసటి రోజు) దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు తప్పవంటూ బెదిరించి ఫోన్ పెట్టేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న హుస్సేన్ విషయాన్ని అక్కడి క్రైమ్స్ విభాగం డీసీపీ బాల్సింగ్ రాజ్‌పుత్‌కు ఫిర్యాదు చేశారు. వస్త్ర వ్యాపారి అయిన హుస్సేన్ ఫిర్యాదు ఆధారంగా శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత గురువారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం రంజిత్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో రోజుల పోలీసు కస్టడీకి తీసుకుంది. దీనిపై ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షితో మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో రంజిత్ తనకు అసదుద్దీన్ అంటే అభిమానమని, ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికే ఫోన్ నెంబర్ అడిగానని చెప్పాడు. హుస్సేన్ తిరస్కరించడంతో పాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంతోనే అలా వార్నింగ్ ఇచ్చానని వివరించాడు. రంజిత్ ఆకతాయి తనంతోనూ ఇలా చేశాడని అనుమానం ఉంది. -
ఇండియాకు వెళ్లిపో.. ప్రమీలా జయపాల్‌పై దూషణ పర్వం
సియాటెల్: ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్‌ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు. Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm. We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B — Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022 చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్(డెమొక్రటిక్ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్లో.. సియాటెల్‌లోని ఆమె ఇంటి బయట గన్‌తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆ డాక్టర్ ఏకంగా హౌస్ కీపర్‌ని పెళ్లి చేసుకుంది! -
హలో బదులు.. వందేమాతరం చెప్పండంటూ అధికారుల ఆదేశం.. ఎక్కడంటే!
సాక్షి, ముంబై: విధుల్లో ఉన్న సమయంలో వచ్చే ఫోన్ కాల్స్‌కు హలో.. బదులుగా వందేమాతరం.. అని చెప్పాలంటూ మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది. ‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అందులో ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమా తరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్ ముంగంటివార్ అంతకుముందు మీడియాతో అన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు -
పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు
నెల్లూరు (క్రైమ్) : లోన్ యాప్స్‌కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. పదేపదే ఫోన్లుచేసి.. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్‌ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్‌రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను అరెస్టుచేశారు. మాజీమంత్రికి సైతం.. మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్‌కుమార్ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డు ఆడియో సోషల్ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒకౖవెపు ఆయన పార్టీని విడిచి వెళ్లకుండా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది అనుచరులు కూడా పార్టీని వీడొద్దని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఆయన పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన పార్టీ మారడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తోంది. దిగ్విజయ్ ఫోన్ పార్టీ వీడే అంశంపై నియోజకవర్గ అనుచరగణంతో రాజగోపాల్‌రెడ్డి వరుస సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా.. పార్టీ వీడొద్దని కొంతమంది అనుచరులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివరించినట్లు సమాచారం. కాగా బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర నేతలు.. రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తద్వారా అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేయడం హైకమాండ్ ఆలోచనను స్పష్టం చేసింది. పార్టీ మారవద్దని సూచించడంతో పాటు ఏదైనా ఉంటే రెండురోజుల తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేపు రాజగోపాల్‌తో భేటీ! మరోవైపు ఉదయం ఢిల్లీలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా శనివారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెంచుతున్న బీజేపీ! మరోవైపు పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచి రాజగోపాల్‌పై ఒత్తిడి పెరిగి నట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన్ను ఎలాగైనా ఢిల్లీ తీసుకెళ్లాలని సంజయ్, ఈటల తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ అధిష్టానం బుజ్జగింపులతో రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా? పార్టీని వీడే విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతారా? అనే విషయమై కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి తాజా పరిణామాలకు ముందే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజాగా అధిష్టానం రంగంలోకి దిగడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అధిష్టానం బుజ్జగింపులు, అనుచరుల అభిప్రాయంతో రాజగోపాల్‌రెడ్డి కొంత సందిగ్ధంలో పడినా, ఏఐసీసీ దూతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ ఫోన్
-
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా విషయంలో ఇండియా వైఖరిని మరోసారి గుర్తుచేశారు. శాంతి చర్చలతోపాటు దౌత్య మార్గాల్లో ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మోదీ పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ, ఫుడ్ మార్కెట్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 2021 డిసెంబర్లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఇరువురూ సమీక్షించారని పేర్కొన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్–రష్యా పరస్పరం ఎలా సహకరించుకోవాలన్న దానిపై మోదీ, పుతిన్ సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తరచూ చర్చలు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికొచ్చారు. -
ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
అనంతపురం సిటీ: కుటుంబాన్ని వద్దనుకుని ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త... పిల్లల సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు భార్యాబిడ్డలతో కలసి నగరంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల వయస్సు కలిగిన కొడుకును చూసుకుంటూ రామానాయుడు రోజులు నెట్టుకొచ్చాడు. భార్య కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన అతను తన ఇద్దరు బిడ్డలతో కలసి నాయక్‌నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. వారిని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించడంతో నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ తక్షణమే స్పందించి బ్లూకోట్ సిబ్బందిని రైల్వే ట్రాక్ వద్దకు పంపారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని కాపాడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా బ్లూకోట్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్, రైల్వే సీఐ నాగరాజు అభినందించారు. (చదవండి: అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం) -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: మున్సిపల్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సురేష్‌తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ -
పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్యే మాతృమూర్తి సంతోషమ్మ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతోషమ్మ మృతికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చదవండి: (పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం) -
ఒక్క ఫోన్‌కాల్‌తో పీటలపై ఆగిన పెళ్లి; బావా.. ఎంత పని చేస్తివి!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్‌కాల్‌తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్‌చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు. బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్‌ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్‌లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్‌ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’ -
దోషులకు శిక్షపడేలా చూస్తాం
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డిలో తల్లీ కుమారులు గంగం పద్మ, గంగం సంతోష్‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు శిక్షపడేలా చూస్తామని బాధిత కుటుంబానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ నిచ్చారు. రామాయంపేటకు చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం ఆయన ఫోన్ చేసి పరా మర్శించారు. సంతోష్ తండ్రి అంజయ్య, సోదరు డు శ్రీధర్‌లతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఫోన్లో మాట్లాడించారని, ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని రేవంత్‌రెడ్డి వారికి చెప్పినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇంకా చాలా మంది తమలాంటి బాధితులున్నారని సంతోష్ కుటుంబసభ్యులు రేవంత్‌కు వివరించారని చెప్పాయి. -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, మేడ్చల్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చదవండి: ట్రాఫిక్ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు -
కొత్త మంత్రులకు సీఎంఓ నుంచి ఫోన్
-
తానే జీత ఇస్తానని యువతికి హామీ ఇచ్చిన మంత్రి పేర్నినాని
-
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. డెడ్‌లైన్ విధించిన రష్యా
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని కోరారు. ఇందుకు రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్‌లైన్ విధించింది. ఈలోగా తక్షణమే ఖార్కివ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గంటల పాటు కల్పించిన సేఫ్ ప్యాసేజిని వినియోగించాలని రష్యా సూచించింది. ఖార్కివ్‌ను చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది. చదవండి: (ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి) -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం
బీజింగ్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం మిత్ర దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి సంభాషణలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలపగా సంక్షోభం ముదరకుండా రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చెప్పారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని జిన్‌పింగ్‌కు వివరించారని తెలిపింది. భద్రతపై రష్యా వెలిబుచ్చుతున్న న్యాయపరమైన ఆందోళనలను అమెరికాతోపాటు నాటో కూటమి దేశాలు ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని పుతిన్ చెప్పారు. హామీలను మరిచి, రష్యా వ్యూహాత్మక భద్రతకు భంగం కలిగించేలా సైనిక మోహరింపులను పెంచుతూ వచ్చాయని చెప్పారు. బదులుగా జిన్‌పింగ్.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చైనా వైఖరి ఉందని వివరించారు. ‘ఈయూ, అమెరికాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి ఆలోచనలను పూర్తిగా విడనాడాలి. దేశాల న్యాయమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారని జిన్హువా వెల్లడించింది. -
మీది గొప్ప పోరాటం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ గళం విప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు క్రమంగా వివిధ రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్‌కు అండగా నిలవగా తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం కేసీఆర్‌కు మద్దతు పలికారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవ డానికి సరైన సమయంలో గళం విప్పారంటూ కేసీఆర్‌ను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఠాక్రే బుధవారం సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేశారు. ఈ నెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. ‘‘కేసీఆర్‌జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొన సాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం’’ అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఠాక్రే ఆహ్వానం మేరకు 20న ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. ఈ భేటీలో కేంద్రంపై ఏ విధమైన పోరాట పంథాను అనుసరించాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ సమావేశంలో ఏదైనా కార్యాచరణ రూపొందుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం.. ప్రజలకే సీఎం అభ్యర్థి ఎంపిక ఛాన్స్..
Punjab Assembly Election 2022: ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు పంజాబ్ ప్రజలు తమ ఎంపికను తెలియజేయడానికి కాల్/ మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు. 'పంజాబ్‌లోని 3 కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వాఆరా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: (10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్) పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్‌మాన్‌ను ఎంపిక చేస్తారని వస్తున్న ఊహాగానలపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. 'భగవంత్ మాన్ నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. తలుపులు మూసి నాలుగు గోడల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవద్దని ఆయనే నాకు సూచించారు. సీఎం ఎంపిక కోసం ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనే అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021: దేశంలో పెరిగిన పచ్చదనం..) -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు గురించి ఇరువురు నేతలు చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ముచ్చటించినట్లు ప్రధాని మోదీ అనంతరం ట్విట్టర్లో తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటనలో 28 ఒప్పందాలపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి: (ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్‌సభ ఓకే) -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, అమరావతి: ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు చదవండి: ‘చంద్రబాబు దొంగ ఏడుపులు.. ప్రజలు నమ్మరు’ Spoke to Andhra Pradesh CM @ysjagan Garu on the situation in the wake of heavy rainfall in parts of the state. Assured all possible support from the Centre. I pray for everyone’s well-being and safety. — Narendra Modi (@narendramodi) November 19, 2021 -
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీశారు. బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: (Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం) కాగా, 88 ఏళ్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయమైన దివ్యాంగురాలిని ఆర్టీసీ ఉద్యోగి ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. యాదగిరి తాలకా హుణసిగి బాగప్ప(34) బెంగళురు కేఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలిసినవారికి ఫోన్ చేస్తుండగా ఆ కాల్.. అనుకోకుండా.. విజయపుర ముద్దేబిహాళ్ తాలకా తరర్కు చెందిన రేణుక(32)కు వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లోనే మాట్లాడుకునేవారు. రేణుక దివ్యాంగురాలు. టెన్త్ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి శనివారం విజయపురలోని అంబేడ్కర్ భవన్లో వివాహం చేసుకున్నారు. -
వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా
Roja Phone Call To Bala Krishna Goes Viral: బాలకృష్ణ, రోజా కలిసి బైరవ ద్వీపం, బొబ్బిలిసింహం సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. తాజాగా షో జరుగుతుండగానే నటి రోజా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. పాలిటిక్స్ పరంగా ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నా ఇద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కామెడీ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా యాంకర్ అనసూయ కోరగా..వెంటనే అంగీకరించిన రోజా బాలయ్యకు ఫోన్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేద్దాం అని రోజా ప్రశ్నించగా..మన ఇద్దరి కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారంటూ బాలయ్య ఆన్సర్ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే షోకు కూడా వస్తానంటూ సరదాగా మాట్లాడారు. ప్రస్తతం వీరిద్దరి ఫోన్ సంబాషణ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్ కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరవ తరగతి విద్యార్థినికి ఫోన్ చేశారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను నవంబర్ 1 నుంచి తెరవనున్నట్లు ఆ అమ్మాయికి సీఎం స్టాలిన్ చెప్పారు. 'అయితే పాఠశాలకు వెళ్లేటపుడు టీచర్ సూచనలు పాటించండి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి' అంటూ సూచించారు. కాగా, గతంలో తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో గల హొసూరులోని టైటాన్ టౌన్‌షిప్‌కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడో తెలుసుకోవడానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో తన ఫోన్ నెంబర్‌ను కూడా రాసింది. చిన్నారి లేఖ చదివిన సీఎం స్టాలిన్ తనకున్న బిజీ షెడ్యూల్లోనూ ప్రజ్ఞాకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ప్రజ్ఞా మాట్లాడుతూ.. సీఎం తనతో ఫోన్లో మాట్లాడటాన్ని నమ్మకలేకపోయానని చెప్పింది. చదవండి: (బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం) -
'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్‌ను ముంచే విధ్వంసం
అక్టోబర్ 4న ఫేస్బుక్, దానికి అనుసందానంగా ఉన్న సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సైతం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లోని పరిణామాలతో భారతీయులు సైతం ఫోన్ కాల్స్, మెసేజెస్, గూగుల్ మ్యాప్స్‌ను విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేసిన మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఫ్రాన్సెస్ ఆరోపణలు చేసిన ప్రారంభంలో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ పెను విధ్వంసానికి దారితీసింది. దీంతో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఫేస్బుక్ ఉద్యోగులను బతిమాలడుడుకుంటుంది.అయినా పరిస్థితి చక్కబడేలా లేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్ హౌగెన్ పెట్టిన చిచ్చు..భారత్‌లో ఫేస్ బుక్ వినియోగం మరింత తగ్గిపోతున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ 'బాబుల్ ఏఐ' (Bobble AI) నివేదిక ప్రకారం..భారతీయులు కుటుంబ సభ్యుల్ని,స్నేహితుల్ని పలకరించేందుకు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించేవారు. కానీ వాటి వినియోగం ఇప్పుడు బాగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఫోన్ ద్వారా కమ్యునికేషన్ చేసే పద్దతి 75 రెట్లు పెరిగినట్లు చెప్పింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లలో గూగుల్ పేలో యూజర్ల వినియోగం 200 రెట్లు పెరిగిందని,యూజర్ల తాకిడి ఎక్కువై కొన్ని సార్లు స్తంభించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 4న, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాని మెసెంజర్ ప్రపంచంలోని 3.5 బిలియన్ వినియోగదారులకు ఆరు గంటల పాటు అందుబాటులో లేవు. ఈ అంతరాయంతో ఇతర సోషల్ నెట్వర్క్ సిగ్నల్‌కు 140రెట్లు, ట్విట్టర్‌కు 7రెట్ల యూజర్ల వినియోగం పెరిగింది. యూట్యూబ్‌లో 30రెట్లు, జియోప్లే వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌లలో 20రెట్ల ట్రాఫిక్ పెరిగింది. ఎఫ్ఎం రేడియో వినియోగం 20 రెట్లు, ఇతర మ్యూజిక్ యాప్స్ వాడకం 700 రెట్లు పెరిగినట్లు తేలింది. గేమింగ్ కేటగిరీలో బాటిల్ రాయల్ గేమ్స్ 70 సార్లు, టెంపుల్ రన్ 40 సార్లు, పార్కింగ్ జామ్ 3డి 15 సార్లు ట్రాఫిక్ పెరిగినట్లు స్టార్టప్ బాబుల్ ఏఐ చెప్పింది. చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
చాలా కాలం తర్వాత మాట్లాడుకున్న ఆ రెండు దేశాల అధినేతలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌కు ఫోన్లో మాట్లాడం ఇది రెండోసారి. సాధారణంగా అమెరికా, చైనా మధ్య పలు అంశాల్లో విపరీతంగా పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరు చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాట్లాడారు. ఆ సంభాషణలో.. ఇరువురు నాయకులు విస్తృతమైన, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకొన్నారు. వాటితో పాటు ఈ దేశాల మధ్య నెలకొన్న పోటీ వివాదంగా మారకుండా ఉండేలా అమెరికా తీసుకొంటున్న చర్యలను బైడెన్ జిన్‌పింగ్‌కు స్పష్టంగా వెల్లడించారని వాషింగ్టన్ అధికారులు తెలిపారు. ఈ ఫోన్‌కాల్‌పై చైనా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సీసీటీవీ స్పందిస్తూ.. ఇరు పక్షాలు వ్యూహాత్మక అంశాలపై లోతుగా చర్చించుకొన్నట్లు పేర్కొంది. వాషింగ్టన్ అభ్యర్థన మేరకు ఈ సంభాషణ జరిగిందని తెలిపింది. యూఎస్, చైనా విధానం ద్వైపాక్షిక సంబంధాలలో తీవ్రమైన ఇబ్బందులకు దారితీసిందని, రెండు దేశాలలోని ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు, అదే విధంగా అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు విరుద్ధంగా నడిచే అవకాశం ఉన్నట్లు జి- బైడెన్‌తో వెల్లడించినట్లు తెలిపింది. చైనా-అమెరికాల మధ్య సంబంధాలను సరైన మార్గంలో నడిపిస్తే అది ప్రపంచానికి చాలా ప్రయోజనకరమని షీజిన్‌పింగ్ అభిప్రాయడ్డారని వెల్లడించింది. చదవండి: అక్కడ క్షణాల్లో బైడెన్‌ని ఓడిస్తా: ట్రంప్ -
పారా ఒలింపిక్స్ విజేతలకు ప్రధాని ఫోన్ కాల్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్ చేసి.. యోగేశ్ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు. 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. -
పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతల ఆగడాలు
-
వైరల్: స్వేరోస్ పేరుతో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కి బెదిరింపులు
-
మరొకరితో వివాహేతర సంబంధం.. 25 నిమిషాలు ఫోన్లో మాట్లాడి..
సాక్షి, మునగాల(నల్లగొండ): ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ముకుందాపురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. పొలానికి వెళ్లిన భర్త తిరిగి వచ్చే సరికి మృతిచెందింది. సరిత అఘాయిత్యానికి ముందుకు 25 నిమిషాల పాటు మరొకరితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ లోతైన బావిలో.. కేకలు వేసినా ఫలితం లేదు
పలమనేరు: ఫోన్ మాట్లాడుతూ.. పరాకుగా కాలుజారి 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడిపోయాడు. ఈత రావడంతో కొద్దిసేపు ఈది చెట్ల వేర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. నిర్మానుష్యంగా ఉన్న అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దాదాపు 17 గంటల తర్వాత అతడి కేకలు పశువులు మేపుకొనే వ్యక్తికి వినిపించాయి. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి. మరో 3 గంటలకు అతడిని పైకి తీశారు. మొత్తం 20 గంటలపాటు మృత్యుపోరాటం చేశాడతడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్ దళారి చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఫోన్ మాట్లాడుతుండగా, దాబా వెనుక ఉన్న మెట్లు లేని బావిలో కాలుజారి పడ్డారు. 60 అడుగుల లోతైన ఆ బావిలో 12 అడుగుల నీరుంది. ఈదుకుంటూ కొంతసేపటి తర్వాత చెట్ల వేర్లను పట్టుకుని నీటిపైకి చేరుకున్నాడు. ఎవరైనా కాపాడాలంటూ గట్టిగా అరిచాడు. అటువైపు ఎవరూ రాకపోవడంతో అతని గోడు ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రంతా బావిలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం పశువులు మేపడానికి జీవన్ అనే యువకుడు వెళ్లాడు. బావిలోంచి అరుపులు రావడంతో వెళ్లి చూసిన జీవన్‌కుమార్‌కు చంద్రశేఖర్ కనిపించాడు. అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో చంద్రశేఖర్‌ను బావిలోంచి బయటకు లాగారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఓ యువతికి నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్‌లోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న (21) ఈ నెల 17న పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌కు టీకా తీసుకునేందుకు వెళ్లింది. ఆమెకు వ్యాక్సిన్ వేస్తుండగానే నర్సుకు ఫోన్ రావడంతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నను అక్కడే కూర్చోమని చెప్పింది. ఫోన్ మాట్లాడిన అనంతరం తిరిగొచ్చిన నర్సు మరోసారి వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న అక్కడున్న వారికి తెలుపడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచి వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనే నర్సుకు ఫోన్ వచ్చిందని, ఫోన్ మాట్లాడిన అనంతరం రెండో డోసు వేసిందని, ఆందోళన చేయడంతోనే తనను ఏరియా ఆస్పత్రికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. కాగా, లక్ష్మీ ప్రసన్నకు రెండు డోసులు వేశామన్నది అవాస్తవమని, యువతి ఆందోళన చేయడం వల్లనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించామని వైద్యాధికారులు అంటున్నారు. -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్‌ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్.