
సాక్షి, రాయచూరు(కర్ణాటక): అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయమైన దివ్యాంగురాలిని ఆర్టీసీ ఉద్యోగి ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. యాదగిరి తాలకా హుణసిగి బాగప్ప(34) బెంగళురు కేఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలిసినవారికి ఫోన్ చేస్తుండగా ఆ కాల్.. అనుకోకుండా.. విజయపుర ముద్దేబిహాళ్ తాలకా తరర్‌కు చెందిన రేణుక(32)కు వెళ్లింది.
అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్‌లోనే మాట్లాడుకునేవారు. రేణుక దివ్యాంగురాలు. టెన్త్ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి శనివారం విజయపురలోని అంబేడ్కర్ భవన్‌లో వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment