
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్‌గా రోహిత్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను కేవలం 181 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 197 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన ఆరో ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
కాగా వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఏకంగా తన కెరీర్‌లో మూడు డబుల్ సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 270 వన్డేలు ఆడిన రోహిత్..48.89 సగటుతో 11049 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 32 సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్విక్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సచిన్ టెండూల్కర్-15310
సనత్ జయసూర్య- 12740
క్రిస్ గేల్-10179
ఆడమ్ గిల్‌క్రిస్ట్- 9200
సౌరవ్ గంగూలీ- 9146
రోహిత్ శర్మ 9000
చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment