
Roja Phone Call To Bala Krishna Goes Viral: బాలకృష్ణ, రోజా కలిసి బైరవ ద్వీపం, బొబ్బిలిసింహం సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. తాజాగా షో జరుగుతుండగానే నటి రోజా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. పాలిటిక్స్ పరంగా ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నా ఇద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ కామెడీ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా యాంకర్ అనసూయ కోరగా..వెంటనే అంగీకరించిన రోజా బాలయ్యకు ఫోన్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేద్దాం అని రోజా ప్రశ్నించగా..మన ఇద్దరి కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారంటూ బాలయ్య ఆన్సర్ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే షోకు కూడా వస్తానంటూ సరదాగా మాట్లాడారు. ప్రస్తతం వీరిద్దరి ఫోన్ సంబాషణ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి
Comments
Please login to add a commentAdd a comment