సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8866288662....నా పేరు అరోహి త్రిపాటి. నన్ను కలుసుకోవాలంటే 8866288662కు ఫోన్ చేయండి....నన్ను ప్రేమించాలన్నా, నాతో డేటింగ్ చేయాలన్నా, ఇదే సమయం ఫోన్ నెంబర్ 8866288662...సన్నీ లియోన్ అభిమానులారా! ఆమెను 8866288662 ఫోన్ నెంబర్‌లో కలుసుకోవచ్చు.....ఇలాంటి ట్వీట్లతోపాటు 15 జీబీ డేటా ఉచితంగా కావాలంటే.....నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఆరు నెలలపాటు ఆరు నెలల పాటు ఉచితం. మొదటి వెయ్యి కాల్స్‌కు మాత్రమే పరిమితం....అమెజాన్‌ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం....ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఉచితం, ఈ ఫోన్ నెంబర్ 8866288662కు ఫోన్ చేయండి....’ అంటూ ఒకే నెంబర్‌తో అనేక ఆఫర్లు ట్విట్టర్‌లో శనివారం నుంచి వచ్చి పడుతున్నాయి.
ఇంతకు ఈ టోల్‌ఫ్రీ నెంబర్ ఎవరిదంటే...‘పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను సమర్థించేవాళ్లు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి!’ అంటూ భారతీయ జనతా పార్టీ ఇటీవల దీన్ని ఆవిష్కరించింది. సీఏఏను అపహాస్యం చేయడానికా లేదా ఈ రీతిగానైనా సీఏఏకు మద్దతు సమీకరించాలన్న ఉద్దేశమా తెలియదుగానీ ఇది ట్విటర్ల చేతిలో మాత్రం వ్యంగ్యాస్త్రం అయింది.
Comments
Please login to add a commentAdd a comment