Toll Free Number
-
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్‌డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్‌ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్‌తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 24/7 ఇన్‌బౌండ్ కాంటాక్ట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ లైఫ్ ఆఫర్ చేసే పాలసీలకు సంబంధించి అన్ని రకాల విచారణలకు, కొనుగోలుకు ముందు, కొనుగోలు తర్వాత కావాల్సిన సమాచారాన్ని ఈ కాంటాక్ట్ సెంటర్ ద్వారా పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి చార్జీలు పడని 18002679090 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 24/7 కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు రంగ బీమా సంస్థ తమదేనని తెలిపింది. ఈ కాల్ సెంటర్ ఏడాదిలో అన్ని రోజులు, అన్ని సమయాల్లోనూ సేవలు అందిస్తుంది. (రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం) ఇదీ చదవండి: ఆటోసార్లో టాటా టెక్నాలజీస్ న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ తాజాగా ఆటోమోటివ్ ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో (ఆటోసార్) చేరింది. ఇంటెలిజెంట్ మొబిలిటీ కోసం ప్రామాణిక సాఫ్ట్వేర్ ఫ్రేమ్‌వర్క్, ఓపెన్ ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వ్యవస్థ అభివృద్ధి, స్థాపనకు వాహన, సాఫ్ట్వేర్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలతో అంతర్జాతీయంగా ఆటోసార్ వేదిక ఏర్పడింది. బీఎండబ్లు్య, ఫోక్స్‌వ్యాగన్, టయోటా, ఫోర్డ్, జీఎం, దైమ్లర్ క్రిస్లర్, బాష్, సీమెన్స్ వంటి 280కిపైగా సంస్థలు ఇందులో ఉన్నాయి. (పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం) -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. #BSNL has launched its 24/7 toll-free no. 1800-4444 for #BharatFibre Broadband customers.#G20India pic.twitter.com/T2yV1jyNpu — BSNL India (@BSNLCorporate) June 15, 2023 -
ఆధార్ కార్డులో సమస్యలా? ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్..
Aadhaar Card Toll Free Number: భారతదేశంలో ఉన్న అందరికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం, అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటి తప్పులను సవరించుకోవడానికి కొన్ని సార్లు అనేక ఇబ్బదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సెంటర్ల వద్దకు పదే పదే తిరగాల్సి కూడా వచ్చేది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కేవలం మీరు ఒక నెంబర్‌కి కాల్ చేస్తే సరిపోతుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఆధార్ కార్డులో పేరు, ఇంటి పేరు, అడ్రస్ వంటి తప్పులను మార్చుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ 1947 అనే నెంబర్ తీసుకువచ్చింది. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీ సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే 12 భాషల్లో సర్వీస్ ప్రతినిధులు అందుబాటులోఉంటారు. మీ సమస్యను వారికి తెలియజేస్తే వారు తగిన పరిష్కారం అందిస్తుంది. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మలయాళం, అస్సామీ, ఉర్దూ, మరాఠీ భాషల ప్రజలు ఈ నెంబర్ ద్వారా సమస్యలకు పరిస్కారం పొందవచ్చు. సంస్థ ఈ నెంబర్ అందించడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఈ సంవత్సరంలోనే కావున ఈ నెంబర్ అందించడం జరిగింది. అంతే కాకుండా ఇది అందరికి గుర్తుండే నెంబర్ కూడా. (ఇదీ చదవండి: ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!) ఇది పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్, కావున ఎలాంటి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు, పరిష్కారం పొందవచ్చు. అయితే ఆదివారం రోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేరు, అడ్రస్ మాత్రమే కాకుండా, ఆధార్ నమోదు కేంద్రాలు, ఎన్రోల్మెంట్ తర్వాత ఆధార్ కార్డు నంబర్ స్టేటస్ సహా ఆధార్‌కు సంబంధించి సమస్యలన్నింటికీ వారు పరిష్కారం అందిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా
‘కరోనాతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్‌లకు అటెండ్ అయ్యాను. అప్పట్లో సరిగా చదువుపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ క్లాస్‌లు నడుస్తున్నాయి. రోజూ కాలేజీకి వెళుతున్నాను. కానీ టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు’ – ఓ ఇంటర్ విద్యార్థి ‘ఓ వైపు ఆఫీస్, మరోవైపు ఇల్లు.. ఇలా రెండు చోట్లా సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను. ఒంటరిగా జీవించాలనే భావన పెరుగుతోంది’ – ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాక్షి, అమరావతి: వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తున్నారు. సమస్యలను వివరంగా తెలుసుకుంటున్న కాల్ సెంటర్లోని కౌన్సిలర్లు బాధితులకు సాంత్వన చేకూరుస్తున్నారు. అవసరం మేరకు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్యులకు రిఫర్ చేసి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. కరోనా మహమ్మారి, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చాలా మందిలో మానసిక శక్తిని దెబ్బతీసింది. దీనికి తోడు వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో సుమారు 15 కోట్ల మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతేడాది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సర్వే వెల్లడించింది. డిప్రెషన్‌కు లోనై.. రాష్ట్రంలో మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, సలహాలు, సూచనలివ్వడం కోసం గతేడాది అక్టోబర్‌లో వైద్య శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాల్ సెంటర్ ఉంది. ఈ కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ వివిధ సమస్యలతో 2,452 మంది ఫోన్ చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 30 వరకూ కాల్స్ వస్తున్నాయి. కాల్ సెంటర్‌ను సంప్రదించిన వారిలో ఎక్కువ మందిలో డిప్రెషన్ సమస్య ఉన్నట్టు కౌన్సెలర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి భయం, లాక్డౌన్ కారణంగా ఎక్కువ రోజులు ఒంటరిగా గడపడం, కుటుంబ సభ్యులు, సన్నిహతులు మృత్యువాత పడటం.. ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి డిప్రెషన్‌కు ముఖ్య కారణాలుగా బాధితులు చెబుతున్నట్టు వెల్లడైంది. కొందరిలో ఈ సమస్య ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టు తెలిసింది. మరికొందరిలో సమస్య తీవ్రమై.. తమ చుట్టూ ఉండే కుర్చీలు, బల్లలు, ఇతర వస్తువులు మాట్లాడుతున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు సైతం కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అకడమిక్ ఇయర్ దెబ్బతింది. దీనికి తోడు, కొందరు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలు పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులు రావాలి, ఐఐటీ, నీట్లో ర్యాంక్‌లు సాధించాలి.. అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం మార్కులు, ర్యాంక్‌ల కోణంలోనే విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ ధోరణుల మధ్య తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం మానసిక సమస్యలు ఉన్నవారు ప్రాథమిక దశలోనే కౌన్సెలర్లు, వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే చూసే వాళ్లు ఏమనుకుంటారోనని కౌన్సిలర్లు, వైద్యులను సంప్రదించడానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు 14416 లేదా 180089114416 నంబర్‌కు కాల్ చేసి మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. నచ్చిన పాటలు వినడం, సినిమాలు చూడటం, విహార యాత్రలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. – ఎ.అనంత్‌కుమార్, కౌన్సెలర్, సూపర్వైజర్ టెలీ మానస్ కాల్‌సెంటర్ -
కుక్క దాడుల ఎఫెక్ట్.. వారికి మంత్రి తలసాని వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కుక్కల దాడి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111 తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మున్సిపల్, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో జరిగిన ఘటన బాధాకరం. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయి. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్‌తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చనిపోయిన జంతువుల దహనానికి జీహెచ్ఎంసీ సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాలి. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. విమర్శలు చేసే వారికి మేము సమాధానం చెప్పాము. ట్రైనింగ్ క్యాంపు పెట్టి వీటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి(శుక్రవారం) నుండి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. రాత్రి సమయంలో స్పెషల్ టీమ్స్ తనిఖీల్లో ఉంటాయి. అక్కడే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. -
వినియోగదారులకు అండగా కాల్‌సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల సాధికారతే ధ్యేయంగా.. వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ పంపిణీలో జాప్యం, నాణ్యత లోపాలు, బరువులో వ్యత్యాసం, ఎండీయూల నిర్లక్ష్యం, డీలర్లపై ఫిర్యాదులు, కొత్త బియ్యం కార్డుల మంజూరు, సభ్యుల విభజన, చేర్పులు, మార్పులు, కొత్తకార్డు అప్లికేషన్ స్థితి, ఒకే దేశం – ఒకే రేషన్, గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయకపోవడం, అదనపు రుసుము వసూలు, రశీదులు లేని వ్యవహారాలు, వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయించడం, పెట్రోల్, డీజిల్ నాణ్యత, పెట్రోబంకుల్లో కనీస సౌకర్యాల కొరత, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ప్రతి వ్యవహారంపైనా ఈ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను బియ్యం పంపిణీచేసే ఎండీయూ వాహనాలపైన కూడా ముద్రించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల వినియోగదారుల సేవాకేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తూ వినియోగదారులకు హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారాలపై సూచనలు చేస్తారని తెలిపారు. -
టెలి మానస భరతం!
కంచర్ల యాదగిరిరెడ్డి అక్షరాలా.. ఒక లక్ష అరవై నాలుగు వేల ముప్పై మూడు. 2021 సంవత్సరంలో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇది! కొంచెం అటు ఇటుగా నిమిషానికి ఇద్దరు బలన్మరణానికి పాల్పడుతున్నారన్నమాట!! కుటుంబ సమస్యలు, తీవ్రమైన వ్యాధుల బారిన పడటం ఇందుకు ప్రధాన కారణాలని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నా, సంబంధిత నిపుణులు మాత్రం మానసిక సమస్యలే మూల కారణం అని స్పష్టం చేస్తుండటం గమనార్హం. చికిత్సలో వెనుకంజ.. ఎందుకీ పరిస్థితి? మానసిక సమస్యలంటే కేవలం పిచ్చి మాత్రమేనా? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ఏం చేయవచ్చు? అన్న దానిపై ప్రస్తుతం దేశంలో చర్చ కొనసాగుతోంది. భారతదేశం చాలా రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ, అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి సూచికలైన పలు అంశాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది. వైద్యంలో, ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స విషయంలో మరీ వెనుకంజలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న సైకియాట్రిస్టులు కేవలం 0.3, సైకాలజిస్టులు 0.07 మాత్రమే. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యల చికిత్సకు ఈ దేశంలో దాదాపు అవకాశం లేనట్టే! ఇక నర్సులైతే 0.12, ఆరోగ్య సిబ్బంది 0.07% ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు 5–18 శాతాన్ని మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుంటే భారత్‌లో ఇది 0.05 శాతాన్ని దాటడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభావం దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడు తున్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 5.6 కోట్ల మనో వ్యాకులత బాధితులు, ఇంకో 4.3 కోట్ల మంది యాంగ్జైటీ రోగుల కారణంగా దేశంలో ఉత్పాదకత గణనీయంగా పడిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. పనిచేసే సామర్థ్యమున్న 15– 39 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. 2012– 2030 మధ్యకాలంలో ఈ నష్టం సుమారు రూ.84 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మార్పు మొదలైంది మానసిక సమస్యలపై దేశం దృష్టి కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇంతకాలం మానసిక సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యలపైనే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించగా, తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపును పెంచింది. అంతేకాకుండా ఓ మోస్తరు మానసిక సమస్యల పరిష్కారానికి టెలి–మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 10న ‘టెలి–మానస్’ పేరుతో భారీ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 1–800–91–4416కు లేదా 14416కు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో, ఐఐఐటీబీ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. 23 టెలి–మానస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా మొత్తం 23 టెలి–మానస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం/ వైద్య కళాశాలల సిబ్బంది ద్వారా కన్సల్టేషన్లు నిర్వహిస్తారు. లేదంటే ఈ– సంజీవని ద్వారా ఆడియో, వీడియో సంప్రదింపులూ జరపవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సెలర్లు అన్నిరకాల మానసిక సమస్యలకు సంబంధించి సాయం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు ఈ టెలి–మానస్ కార్యక్రమం అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఆయా కేంద్రాల్లోని అత్యవసర సైకియాట్రిక్ సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి వస్తాయి. నిమ్హాన్స్ ఇప్పటికే దాదాపు 900 మంది టెలిమానస్ కౌన్సెలర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది. వ్యాయామం.. నిద్ర.. కీలకం ►రోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజుల పాటైనా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ►సంతులిత ఆహారం, తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరం. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుండ టం వల్ల చురుగ్గా ఉంటామన్నమాట. ►కంటినిండా నిద్రపోవాలి. నిద్ర నాణ్యత పెరిగిన కొద్దీ మనిషి మాన సిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించినట్లు 2021 నాటి ఓ సమీక్ష స్పష్టం చేసింది. ►ప్రాణాయామం, ధ్యానం, వెల్నెస్ అప్లికేషన్ల సాయంతో వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరగాలి. దినచర్యలను, సంఘటనలను రాసుకోవడం కూడా ఒత్తిడికి దూరం చేస్తుందని అంచనా. ►బంధుమిత్రులతో సత్సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నచూపు తగదు మానసిక సమస్యలను దేశంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. బాధితులను హేళన చేయడం, వెకిలి మాటలతో హింసించడం కూడా సర్వసాధారణమవుతుండటం దురదృష్టకరమైన అంశం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇది మరింత కుంగుబాటుకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ జీవితానికి ఓ సూచిక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం సంపూర్ణ జీవితానికి ఓ సూచిక అన్నారు ఢిల్లీకి చెందిన మానసిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ విశాల్ ఛబ్రా. పదిహేనేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఛబ్రాకు గడచిన నాలుగైదేళ్లుగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తున్నా 25% మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ‘ఇటీవల కాలంలో మానసిక వ్యాధుల బారినపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువ. పెరిగిపోతున్న పోటీతత్వం, విలాస వంతమైన జీవితాలు కావాలనుకోవడం, పొరుగు వారు లేదా సమీప బంధువులతో పోల్చుకోవడం వంటి వాటితో కుంగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బతకాలని అనిపించలేదు: దీపిక పదుకునె ‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. నృత్య దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి దీపిక కొద్దిరోజుల క్రితం ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థ్ధం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థ్ధకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు. -
సైబర్ మోసాలపై వెంటనే ఫిర్యాదు...లేదంటే! ఎస్బీఐ కీలక హెచ్చరిక
సాక్షి, ముంబై: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సూచనలు జారీ చేసింది. డిజిటల్ చెల్లింపు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అనధికారిక లావాదేలపై తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను అప్రమత్తం చేసింది. తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు ఫిషింగ్, ర్యాన్సమ్ దాడుల నుండి, సైబర్ కేటుగాళ్ల మోసాలనుంచి సురక్షితంగా ఉండవచ్చని పేర్కొది. ఎస్బీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా ఆర్థిక మోసం జరిగినట్లయితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అలా కాకుండా ఫిర్యాదుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. అనధికార లావాదేవీని గమనించిన వెంటనే తమ టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని వెల్లడించింది. తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకొనే అవకాశం తమకు ఉంటుందని, లేదంటే భారీ మూల్యం తప్పదని పేర్కొంది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిఎస్బీఐ బ్యాంకింగ్ అవసరాలను తీసు కోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సైబర్ నేరగాళ్ల ఎత్తులనుంచి, సైబర్ దాడులనుంచి కస్టమర్లు తమని తాము రక్షించు కోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. టోల్-ఫ్రీ నంబర్‌ను డయల్ చేయడంతో పాటు, కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ , భీమ్ ఎస్బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత ఛానెల్‌ను బ్లాక్ చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. Fulfill your banking needs, just call! Call SBI Contact Centre toll-free at 1800 1234 or 1800 2100.#SBI #SBIContactCentre #TollFree #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/RtrXf042KO — State Bank of India (@TheOfficialSBI) October 25, 2022 -
లోన్ యాప్స్ వేధింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ
సాక్షి, అమరావతి: లోన్ యాప్స్ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1930ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోన్ యాప్స్ వేధింపులపై 1930కి ఫిర్యాదు చేయాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బ్యాంక్ వివరాలు, ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని హెంశాఖ హెచ్చరించింది. -
పారిశుధ్య సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. బోర్లు, బావుల వద్ద అపరిశుభ్ర వాతావరణం, ఇళ్ల మధ్య చెత్త కుప్పలు, మురుగు కాల్వలలో పారే నీరు రోడ్లపైకి చేరడం వంటి సమస్యలతో పాటు ‘క్లాప్’ మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లోని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడతారు. ఫిర్యాదు అందిన వెంటనే దానిస్థాయి ప్రకారం 24 గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారులకు వేర్వేరు స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
రైల్వే ప్రయాణికులకు ‘139’ టోల్ ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే సలహా కమిటీ సూచించింది. రైల్వే పోలీసుల ప్రవర్తనపై సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సమావేశం వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్) సంజయ్ వర్మ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు, సహకారం కోసం 139 ఉపయోగపడుతుందన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్‌పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రైల్వే పోలీసుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారి పనితీరుపై అభినందనలు కూడా వచ్చాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులు వచ్చినా ప్రతి రైలులోను ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. -
వరంగల్: కరోనా పేషెంట్లకు ‘టెక్నికల్’ కష్టాలు
సాక్షి, వరంగల్: కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి, రెండో వేవ్‌లు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని ప్రచారమున్నా కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ మేల్కోవడం లేదు. జనవరి తొలివారం నుంచి ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. అధికారుల గణాంకాలు విడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో కరోనా పాజిటివ్ రోగులకు అవసరమైన సమయాల్లో సలహాలు, సూచనలిచ్చే ‘టోల్ ఫ్రీ నంబర్లు’ ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది. టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటే ఏ సమయాల్లో ఏఏ మందులు వాడాలి, ఎన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి, రాత్రి సమయాల్లో పరిస్థితి విషమిస్తే ఫోన్ ద్వారా వైద్య సిబ్బందితో మాట్లాడే వీలు లేకపోవడంతో వందల మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుడితో మాట్లాడితే వచ్చే భరోసా కనబడకపోవడంతో కలవరపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి పర్యవేక్షణ లోపంతోనే కరోనా కట్టడిపై సిబ్బంది కూడా సీరియస్‌గా లేరని ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. స్వీయ వైద్యం వద్దు.. జిల్లాలో వైరస్ బారిన పడిన వందలాది మంది ఇప్పుడు సొంత వైద్యం బాట పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక మంది రెండు దశల్లో మహమ్మారి సోకినప్పుడు వాడిన మందులనే ఇప్పుడూ వాడేస్తున్నారు. ఇలా సొంతంగా వాడడం ఆరోగ్యపరంగా మంచిది కాదని, దాని వల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం వైరస్ సోకిన వారిలో చాలా మందికి పెద్దగా లక్షణాలు ఉండడం లేదు. స్వల్పంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం ఉంటున్నాయి. ఇలా ఉండి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చిన వారు వెంటనే వైద్యుడ్ని సంప్రందించి మందులు వాడితే ఆరేడు రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు జ్వరం అలాగే ఉన్నా ఆక్సిజన్ 94 శాతం కంటే తగ్గితే వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అయితే చాలా మంది పాజిటివ్ అని తేలగానే పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో లేకుంటే పాత వేవ్‌ల్లో వాడిన మందులు తీసుకెళ్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తెలుసుకుందామన్నా.. అవి పనిచేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. భరోసానిచ్చే వైద్యమంత్రం లేక మాన సికంగా క్రుంగిపోతున్నార’ని సామాజిక కార్యకర్త శ్రావణి తెలిపారు. -
సైబర్ మోసాలకు గురయ్యారా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందిచకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. -
సైబర్ మోసాలకు గురయ్యారా? తక్షణం ఈ నంబర్‌కు కాల్ చేయ్యండి
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
Corona Vaccine:స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకున్నా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: 18004194961. ఇది కోవిడ్–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకున్నా ఈ నంబర్ ద్వారా టీకా కోసం కో–విన్ అప్లికేషన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌పీ ఇండియా, జుబిలియంట్ భార తీయ ఫౌండేషన్ (జేబీఎఫ్)లు సంయుక్తంగా ఒక టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశాయి. దేశంలోని ఏ మూల నుంచైనా 18004194961 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. టీకా వేయించుకో వాలను కునేవారికి అవసరమైన సమాచారం అందించేందుకు ఈ నంబర్‌తోనే ఓ వర్చు వల్ హెల్ప్‌డెస్క్ కూడా పనిచేస్తుంది. వినియోగదారులు తమ మాతృభాషలోనే సమాచారం వినే సౌకర్యం కూడా కల్పించారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో ఈ వర్చువల్ డెస్క్ సహాయం అందుతుంది. మరిన్ని భాషలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడ్డ వారందరూ టీకాలు వేయించుకునే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం కో–విన్ యాప్‌లో వివరాలు నమోదు చేసు కోవడం తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నవారు మాత్రమే యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఈ సౌకర్యాలు లేనివారికి యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. టీకా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది కొంత ప్రయాసతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్‌పీ ఇండియా, జేబీఎఫ్లు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ వంతు సాయంగా... కరోనా కష్టకాలంలో తమవంతు సామాజిక సేవ చేసే లక్ష్యంతోనే ఈ టోల్ ఫ్రీ నంబరు, వర్చువల్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు హెచ్‌పీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో టీకా కార్యక్రమం వేగం పుంజుకునేందుకు ఈ టోల్ ఫ్రీ నంబరు ఉపయోగపడుతుందని జేబీఎఫ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అన్నారు. -
టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందామా..
కడప కార్పొరేషన్: మన మేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు మీద ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్ నుంచి 108కి ఫోన్ చేసి సమాచారం అందిస్తాం. ఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రయివేటు సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. అలాంటి టోల్ ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం. 155333 (ఏపీఎస్పీడీసీఎల్): విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సమస్యలను ఈ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. 1910 (బ్లడ్ బ్యాంక్స్): అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 1950 (ఎన్నికల సంఘం): ఓటరు నమోదు, తొలగింపులు, పేరు మార్పిడి, ఓటు మార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 1100(మీ సేవ): ఆయా ప్రాంతాల్లో మీ సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 18004251110(వ్యవసాయ శాఖ): ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 18002004599 (ఏపీఎస్ఆర్టీసీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. 101(అగ్ని మాపక శాఖ): అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయ చర్యలు చేపడుతారు. విపత్తుల నిర్వహణలో సేవలు అందిస్తారు. 108 (ఎమర్జెన్సీ అంబులెన్స్): ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వచ్చి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తారు. ఇంటి వద్ద ఉన్న రోగులనూ అత్యవసరంగా ఆసుపత్రికి చేరవేస్తారు. 1997(హెచ్ఐవీ–కంట్రోల్ రూమ్): హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధులపై బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు. 100(పోలీసు శాఖ): పోలీసుల తక్షణ సాయం పొందేందుకు ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పోలీసుల ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. 131(రైల్వే శాఖ): రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ సమచారం తెలుస్తుంది. 1090 (క్రైం స్పెషల్ బ్రాంచ్): చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. అది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్‌కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 155361(అవినీతి నిరోధక శాఖ): ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వచ్చు. 155321 (ఉపాధి హామీ పథకం): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు. 198(బీఎస్ఎన్ఎల్): బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన టెలిఫోన్ సమస్యలపై వినియోగదారులు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 1098 (చైల్డ్ హెల్ప్ లైన్): ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకొనేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబర్‌కు తెలియజేయవచ్చు. 18004255314(ఐసీడీఎస్): స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థలో సిబ్బంది పనితీరు, పిల్లలకు ఆహార సరఫరాలో లోపాలుంటే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 18001208757(కడప కార్పొరేషన్): కడప నగరపాలక సంస్థలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి సమస్యలపై ఫోన్ చేసి తెలపవచ్చు. -
టోల్ ఫ్రీతో మోసాలకు చెక్!
సాక్షి, అమరావతి : వ్యాపారుల మోసాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 18004254202 వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. తూకాల్లో తేడా వచ్చినట్లు గుర్తించినా, నాసిరకం వస్తువులు ఇస్తున్నట్లు తెలిసినా, ధరల్లో తేడా ఉన్నట్లు అనుమానం వచ్చినా వినియోగదారులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 10,041 కాల్స్ వచ్చాయి. వీటి ఆధారంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. అలాగే మరికొందరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.13.14 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశారు. ఎమ్మార్పీ కాకుండా ఎక్కువకు విక్రయించడం, ధరల పట్టిక షాపుల్లో అందుబాటులో ఉంచకపోవడం తదితర వాటికి సంబంధించి అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. తూనిక యంత్రాలకు సంబంధించి ప్రమాణాలు పాటించని వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత సరుకుల పంపిణీకి సంబంధించి కొందరు రేషన్ డీలర్లు సరైన తూకం ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఒక్కో వస్తువుకు ఒక్కోసారి బయోమెట్రిక్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థలో గానీ లేదా బయట వ్యాపారస్తులు గానీ మోసం చేస్తే తప్పనిసరిగా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం.కాంతారావు వినియోగదారులకు సూచించారు. లైసెన్స్ లేకుండా ఎవరైనా తూనిక యంత్రాలను రిపేరు చేస్తే వ్యాపారులతో పాటు రిపేరు చేసిన వ్యక్తిపైనా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ పంపులకు సంబంధించి యంత్రాలను రిపేర్ చేసేందుకు రాష్ట్రంలో 727 మందికి మాత్రమే లైసెన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వ్యాపారుల నుంచి అపరాధ రుసుం రూపంలో జిల్లాల వారీగా వసూలు చేసిన మొత్తం... జిల్లా అపరాధ రుసుంగా వసూలు చేసిన మొత్తం(రూపాయల్లో విశాఖపట్నం 1,72,75,407 తూర్పు గోదావరి 1,61,06,135 కృష్ణా 1,50,99,741 గుంటూరు 1,34,18,585 చిత్తూరు 97,16,560 పశ్చిమ గోదావరి 96,58,665 అనంతపురం 95,94,610 ప్రకాశం 85,57,380 నెల్లూరు 74,11,975 కర్నూలు 69,22,750 వైఎస్సార్ 59,13,185 శ్రీకాకుళం 54,81,220 విజయనగరం 49,00,300 రాష్ట్ర స్థాయి ఎన్ఫోర్స్మెంట్ 14,22,000 మొత్తం 13,14,78,513 -
ప్రభుత్వ సేవలు.. హెల్ప్‌లైన్ నంబర్లు
సాక్షి, కాకినాడ: ధనిక, పేద, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రజలు పైసా ఖర్చు లేకుండా ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను, సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే వీటి ముఖ్యోద్దేశం. ఆ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ.. 14400 (అవినీతి నిరోధం): వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్ కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు. 1912 (విద్యుత్ సేవలు) విద్యుత్ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది 14500 (ఇసుక, మద్యం) ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. దీనిద్వారా మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందవచ్చు. అలాగే ఇసుక డోర్ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 108 (ప్రభుత్వ అంబులెన్స్) అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్ చేయవచ్చు. కాల్ సెంటర్ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. 1907 (వ్యవసాయం) వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు. 104 (వైద్యం, ఆరోగ్యం) ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నారు. 100 (పోలీసు సేవలు) ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్ 24 గంటలూ పని చేస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, మాట్లాడే ప్రతి మాటా రికార్డవుతుంది. 112, 181 (దిశ) లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన అమానవీయ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్ చేస్తే కంట్రోల్ రూము నుంచి వారు ఫోన్ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు. 1902 (ప్రజా సమస్యలు) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే లభిస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువు తేదీలోగా వాటిని పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. దీనివలన అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి. 101 (అగ్నిమాపక కేంద్రం) ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు. -
సిటీ పోలీసు హై అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ అందుబాటులో ఉండేలా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని గంటలూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలో, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమ సహకారం తీసుకోవాలంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. డయల్–100కు అదనంగా జోన్ల స్థాయిలో మరికొన్ని నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయా నంబర్లు ఇవి.. ప్రధాన కంట్రోల్ రూమ్: 040–27852333, 27852435, 27852436, 9490616690 సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852759, 9490598979 ఈస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853562, 9490598980 నార్త్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27853599, 9490598982 సౌత్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27854779, 9490616551, 7013299622 వెస్ట్ జోన్ కంట్రోల్ రూమ్: 040–27852483, 9490598981 ట్రాఫిక్ కంట్రోల్ రూమ్: 040–27852482, 9490598985 ట్రాఫిక్ హెల్ప్ లైన్: 9010203626 -
కరోనా : ఆంక్షలు మరింత కఠినం
సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రమ్, తాడేపల్లిగూడెం, భీమవరం లోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత లేదని, దుప్పట్లు ఇవ్వడం లేదని, బాత్రూమ్లు సరిగా శుభ్రం చేయడం లేదని బాధితులు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి సమస్యలలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. (బాబు తీరు రాజకీయాలకే మచ్చ) అంతేకాకుండా కోవిడ్ ఆసుపత్రుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా 18002331077 టోల్ ఫ్రీ నెంబర్‌కు, లేదా నేరుగా నా నెంబర్‌కు ఫోన్ చేయండంటూ మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజూ 500 రూపాయలు వెచ్చించి ప్రతీ కరోనా రోగులకు పౌష్టికాహారం అందించేలా సీఎం జగన్ ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు. కోవిడ్ సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నుంచి ఏలూరులోని 71 హాట్ స్పాట్లలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్ లక్షణాలు ఉంటే వేగంగా టెస్టులు నిర్వహించి ఫలితాలు వచ్చే వరకు వారిని వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆసుపత్రిలో ఉంచాలని ఆళ్ల నాని ఆదేశించారు. (‘సీఎం జగన్ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు’) -
స్థలాలు,పార్కుల రక్షణ కోసం ఫిర్యాదు అందించవచ్చు
-
దివ్యాంగులు, వృద్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో దివ్యాంగులు, వృద్ధులకు అత్యవసర సేవలందించేందుకు రాష్ట్ర దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేసింది. దివ్యాంగుల కోసం 1800 5728980, వృద్ధుల కోసం 14567 టోల్‌ఫ్రీ నంబర్లను ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందేందుకు నిర్దేశిత కార్యాలయానికి వెళ్లేవారికి, ఇంకా అత్యవసర సేవలు అవసరమైనవారికి ఈ టోల్‌ఫ్రీ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. సహాయకులకు పాస్‌లు జారీ: దివ్యాంగులు, వృద్ధులకు సహాయకులుగా ఉండే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా పాసులు ఇవ్వనుంది. అత్యవసర సమయంలో సహాయకులను తీసుకెళ్లేందుకు వీలుగా వీటిని వినియోగించుకోవచ్చు. దివ్యాంగులు/వృద్ధులు సూచించిన వారికి పాసులు జారీ చేయాలని సదరు మంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 1902కు కాల్ వచ్చిన గంటలోనే..
సాక్షి, అమరావతి: కంటికి కనిపించని కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అలుపెరుగని పోరాటం చేస్తోంది. లాక్డౌన్ తరుణంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా స్పందించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తోంది. డయల్ 1902 కు కాల్ వచ్చిన గంటలోనే ప్రత్యేక బృందాలు కార్యరంగంలోకి దిగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి 21 ప్రభుత్వ శాఖలను ఒకే చోటకు చేర్చడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రోజుకు సగటున వెయ్యికిపైగా కాల్స్ వస్తున్నాయి. వీటిలో చాలా వరకు ప్రజలకు అత్యవసర సేవలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజావసరాలు తీర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు ఐజీలు, ఇద్దరు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, అనేక మంది పోలీస్ సిబ్బంది కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్నారు. (డయల్ 1902) గంటలోనే పరిష్కారం కమాండ్ కంట్రోల్ సెంటర్ 1902కి కాల్ వచ్చిన గంటలోనే సమస్య పరిష్కరిస్తున్నామని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐజీ హరికుమార్ చెప్పారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల నుంచి వచ్చే కాల్స్‌ని కూడా వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందిస్తుందని ఆయన చెప్పారు. ఇలా స్పందిస్తున్నారు.. ► లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి జనం ఎక్కువగా వచ్చినా, వాహనాలు నిలిచిపోయినా, సరిహద్దుల్లో రద్దీ ఉన్నా, ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ఆయా ప్రాంతాల్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ► పొరుగు ప్రాంతంలో చిక్కుకున్నామని, తమ ఊరికి వెళ్లే అవకాశం కల్పించాలని అనేక మంది కోరడంతో రాష్ట్ర సరిహద్దుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి వైద్య పరీక్షలతో అనుమతించిన సందర్భాలున్నాయి. కరోనా తీవ్రతపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ► నిత్యావసర సరుకులు అందకపోవడం, ధరలు అందుబాటులో లేవనే ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా స్టాల్స్ విస్తారంగా ఏర్పాటు చేసి అధిక ధరలను నియంత్రించింది. ఈ విషయంలో జిల్లాల్లోనూ జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ► ఆక్వా ఉత్పత్తులు, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపై దృష్టి అలాగే ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లివచ్చిన 758మందిని గుర్తించి, వారి శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షలకు పంపారు. మరోవైపు ఢిల్లీలో సదస్సుకు వెళ్లిన వారితో కలిసి ప్రయాణం చేసిన వారిని, వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ 543 మంది కాంటాక్ట్‌ల నమూనాలను సేకరించారు. ఢిల్లీ వెళ్లినవారితో పాటు, వారు కలిసిన 1301మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 110మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఏపీలో గురువారం ఉదయం వరకూ 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. -
అవినీతి తగ్గించడానికి దృష్టి పెట్టాలి: సీఎం జగన్
-
అవినీతిని అంతం చేయాల్సిందే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన మంగళవారం విడుదల చేశారు. సీఎం జగన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. (ఎవరికీ అన్యాయం జరగకూడదు: సీఎం జగన్) వారిద్దరికీ అభినందనలు: సీఎం జగన్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకోనున్న బండి నారాయణస్వామి, పి. సత్యవతి (అనువాద విభాగం)లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురు విశేషమైన సేవలను అందించారని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ఈ అవార్డులు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. (నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం) చదవండి: (ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ) -
ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే లక్ష ఆఫర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8866288662....నా పేరు అరోహి త్రిపాటి. నన్ను కలుసుకోవాలంటే 8866288662కు ఫోన్ చేయండి....నన్ను ప్రేమించాలన్నా, నాతో డేటింగ్ చేయాలన్నా, ఇదే సమయం ఫోన్ నెంబర్ 8866288662...సన్నీ లియోన్ అభిమానులారా! ఆమెను 8866288662 ఫోన్ నెంబర్లో కలుసుకోవచ్చు.....ఇలాంటి ట్వీట్లతోపాటు 15 జీబీ డేటా ఉచితంగా కావాలంటే.....నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఆరు నెలలపాటు ఆరు నెలల పాటు ఉచితం. మొదటి వెయ్యి కాల్స్‌కు మాత్రమే పరిమితం....అమెజాన్ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం....ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఉచితం, ఈ ఫోన్ నెంబర్ 8866288662కు ఫోన్ చేయండి....’ అంటూ ఒకే నెంబర్‌తో అనేక ఆఫర్లు ట్విట్టర్లో శనివారం నుంచి వచ్చి పడుతున్నాయి. ఇంతకు ఈ టోల్‌ఫ్రీ నెంబర్ ఎవరిదంటే...‘పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను సమర్థించేవాళ్లు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి!’ అంటూ భారతీయ జనతా పార్టీ ఇటీవల దీన్ని ఆవిష్కరించింది. సీఏఏను అపహాస్యం చేయడానికా లేదా ఈ రీతిగానైనా సీఏఏకు మద్దతు సమీకరించాలన్న ఉద్దేశమా తెలియదుగానీ ఇది ట్విటర్ల చేతిలో మాత్రం వ్యంగ్యాస్త్రం అయింది. -
ఫీజుల నియంత్రణకు ‘టోల్ ఫ్రీ’ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ‘టోల్ ఫ్రీ’ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న స్కూళ్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఫీజులు షాక్ కొట్టేలా ఉన్నాయి ‘ప్రజలు మన నుంచి చాలా ఆశిస్తున్నారు. నాణ్యమైన విద్య, పాఠ్య ప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారు. అదే సమయంలో ఫీజులు తగ్గాలి. ఈ మూడు అంశాల్లో మార్పు రావాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు షాక్ కొట్టేలా ఉన్నాయి. ఫీజుల్ని నియంత్రించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయండి. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకున్నప్పుడు ఫోకస్ ఎక్కడ చేయాలో సులభంగా తెలుస్తుంది’ అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా జనవరి 9న గ్రామాల్లోని స్కూళ్లలో పేరెంట్స్ కమిటీలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు విద్య వ్యాపారం కాదని.. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించి విద్యను వ్యాపారంగా మార్చే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ‘విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. పేదల పిల్లలు మంచి కాలేజీల్లో, పెద్ద విద్యాసంస్థల్లో చదువుకోవాలి. ఈ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ కచి్చతంగా అమలు చేస్తాం. రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం సకాలంలో అందచేస్తుంది. అదే సమయంలో ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకున్నప్పుడు వాటిని ప్రచారం చేయండి. అందువల్ల ఇతరులు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. ఆటస్థలాలు లేని, అగ్ని ప్రమాదాల నివారణ ఏర్పాట్లు వంటి భద్రతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను మూసివేయించాలి’ అని సీఎం సూచించారు. ఇంగ్లిష్ మీడియంపై దుష్ప్రచారం ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం తల్లిదండ్రులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్నారు. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నిస్తుంటే.. అడ్డుకునేందుకు చాలామంది అనేక రకాలుగా ప్రయన్తస్తున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంగ్లిష్ మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పిస్తామంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు? చదువుకుంటున్నారు?’ అని సీఎం పేర్కొన్నారు. ఏపీని విద్యాధిక రాష్ట్రాంగా తీర్చిదిద్దాలంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని.. నాణ్యతా ప్రమాణాలు పెంచితేనే దేశంలో అగ్రస్థానంలో ఉండగలమని చెప్పారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్లా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డయల్ 100 112
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడానికి ఏర్పాటు చేసిన డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తేవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ రెండు నంబర్లకు ఇప్పటివరకు వేర్వేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఈ రెండు నంబర్లకు ఒకేసారి ఫోన్ చేస్తే.. రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ల పరిధిలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రక్షిస్తున్నారు. అయితే.. వేర్వేరుగా ఉండటం వల్ల రెండు సెంటర్ల మధ్య సమన్వయలోపం తలెత్తుతోంది. అలా కాకుండా ఈ రెండు టోల్ ఫ్రీ నంబర్లకు కలిపి ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే సమయం కలిసి రావడంతోపాటు సమన్వయలోపాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం చొరవతో పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మూడు రోజుల కిందట మంగళగిరిలో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100, 112కు ఎవరు ఫోన్ చేసినా ఒకే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చేలా చేయడంతోపాటు అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కాగా, దిశ ఘటన జరిగాక ఈ రెండు నంబర్లకు ఫోన్ కాల్స్ బాగా పెరిగాయి. డయల్ 100 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ 100కు నేరుగా ఫోన్ (వాయిస్ కాల్) చేసి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌కు రోజుకు 18 వేల నుంచి 20 వేల కాల్స్ వస్తున్నాయి. వీటిని స్వీకరించే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడతారు. డయల్ 112 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశమంతా నిర్వహిస్తున్న డయల్ 112కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మహిళలు ఉన్న చోటు, ఫోన్ నెంబర్, చిరునామా అన్నీ నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సిబ్బంది తిరిగి ఫోన్ చేసి సమస్య అడిగి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీనికి రోజూ 3.50 లక్షల కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 56,142 మంది ‘డయల్ 112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. వీరిలో 32 వేల మంది మహిళలే ఉండటం విశేషం. ఫోన్లో నేరుగా 112కు సందేశం పంపడంతోపాటు యాప్ ద్వారా కూడా డయల్ చేయొచ్చు. ఈ రెండూ కలిపి.. ప్రస్తుతం వాయిస్, మిస్డ్ కాల్‌తోపాటు ఐడియా నెట్వర్క్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్లే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఆపదలో ఉన్నవారు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. అలాగే మిస్డ్‌కాల్ ఇస్తే చాలు ఆటోమేటిగ్గా జీపీఆర్ఎస్ అనుసంధానంతో ట్రాకింగ్ చేసేందుకు వీలుగా వారిని త్వరగా చేరుకునే ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫోన్ నుంచి మొబైల్ వీడియో ఆప్షన్ ఆన్ అయ్యి సుమారు 10 సెకండ్ల వీడియో చిత్రీకరణ జరిగేలా కూడా సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల బాధితులకు తక్షణ సాయం అందించడంతోపాటు నేర స్థలంలో సాక్ష్యాలు, నేరస్తులను గుర్తుపట్టేందుకు వీలుంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. అన్ని సేవలకు ఒకే నంబర్ – డీజీపీ గౌతమ్ సవాంగ్ డయల్ 100, డయల్ 112 టోల్ ఫ్రీ నంబర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీపీఎస్ సిస్టమ్ అమర్చిన 1500 పోలీస్ వాహనాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. రెండు టోల్ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తెస్తే మరింత బాగా సేవలు అందించవచ్చని గుర్తించాం. 100, 112లలో దేనికి ఫోన్ చేసినా ఒకే చోటకు కాల్ వచ్చేలా చేయడంతోపాటు వాటిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని సేవలకు ఒకే నంబర్ ఉండేలా దశలవారీగా చర్యలు తీసుకుంటాం. -
టోల్‌ఫ్రీకి ఫేక్ బెడద
దిశ ఘటన అనంతరం పెరిగిన కాల్స్ దిశ ఘటన తరువాత డయల్ 100, 112లకు కాల్స్ గణనీయంగా పెరిగాయి. వాటిలో ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో నిజమైన బాధితులకు ఫోన్లైన్లు బిజీ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. డయల్ 112కు ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) రెండు లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో లైను ద్వారా సెకనుకు 30 కాల్స్ చొప్పున రెండు లైన్లకు మొత్తం 60 కాల్స్ మాట్లాడవచ్చు. అంతకు మించి వచ్చే కాల్స్‌తో లైన్స్ బిజీ అని వస్తోంది. పెరిగిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సమస్యను అధిగమించేలా మరో రెండు పీఆర్ఐ లైన్లు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లలో కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నుంచి నేరుగా డయల్ 112కు ఎమర్జన్సీ కాల్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం లేని వారు ఫోన్లోని పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్లి కట్ అవుతుంది. అనంతరం వారిలొకేషన్ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. వారు తిరిగి కాల్ చేసి సమస్య కనుక్కుంటారు. బేసిక్ మోడల్ ఫోన్ కీ ప్యాడ్‌లో 2 లేదా 9 అంకెను నొక్కి పెడితే డయల్ 112కు కాల్ వెళ్లిపోతోంది. ►టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. ►కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టోల్‌ఫ్రీ నెంబర్లకు పెద్దఎత్తున వస్తున్న ఫోన్‌కాల్స్‌తో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100, 112 నెంబర్లకు రోజూ లెక్కకు మిక్కిలి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో పోలీసులు పరిష్కరించదగ్గ అంశాలకు సంబంధించి కాల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగిలిన ఫిర్యాదులన్నీ టోల్‌ఫ్రీ నెంబర్ పనిచేస్తుందా? ఫిర్యాదులు తీసుకుంటున్నారా? సమాచారం కోసం, అవినీతిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ వివరాలు అందించాలి? అనే వివరాలు తెలుసుకునేందుకే చేయడం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫేక్ కాల్స్ బెడద పెరగడంతో అసలు ఆపదలో ఉన్నవారికి లైన్ కలవక ఇబ్బంది పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. –సాక్షి, అమరావతి సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళలు, ప్రజలు తమ సమస్యలను ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పిన అతి తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలను సది్వనియోగం చేసుకోవాలి. టోల్‌ఫ్రీ నెంబర్లపై అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం. –గౌతమ్ సవాంగ్, డీజీపీ అసలైన బాధితులు నష్టపోతారు టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసు సేవలు పొందే అవకాశం ఉంది. డయల్ 100, 112ను సద్వినియోగం చేసుకుంటేనే వాటి ఏర్పాటుకు సార్ధకత ఉంటుంది. దుర్వినియోగం చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం చేసినవారవుతాం. –ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి జాతీయ కమిషనర్ డిసెంబర్ 12న టోల్‌ఫ్రీ నెంబర్లకు నమోదైన ఫోన్కాల్స్విశ్లేషిస్తే ►16,207డయల్ 100కు వచ్చిన కాల్స్ ►533 వాటిలోపోలీసులు స్పందించదగినవి ►516 కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించినవి ►17 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులు 3.50లక్షలుడయల్ 112కు వచ్చిన కాల్స్ ►వాటిలో పోలీసులు స్పందించదగ్గవి1,779 ►కేసులు నమోదు చేసినవి2 ►రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు గత నెల 25న డయల్ 14400 నెంబర్‌ను ప్రారంభించారు ►డయల్ 14400కు తొలి రోజు వచి్చన కాల్స్ 5100 ►వాటిలో ఏసీబీకి వచి్చన ఫిర్యాదులు కేవలం 283 మాత్రమే -
'అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టం'
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టేది లేదని ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ హెచ్చరించారు. శుక్రవారం సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. 14400 నంబర్‌కు సమాచారం అందిస్తే చాలు.. వారి అవినీతికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. కాగా, టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వేల కాల్స్ వచ్చాయని తెలిపారు. కానీ అందులో 770 కాల్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. నిజాయితీపరులు పై ఎటువంటి కేసులు నమోదు చేయమని, అన్ని రకాలుగా విచారించిన తర్వాత అవినీతికి పాల్పడ్డారని తేలాకే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు విశ్వజిత్ పేర్కొన్నారు. -
టోల్ ఫ్రీ నంబరు ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరల విక్రయ నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్‌ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి, ఇసుక మాఫియాను అంతం చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డా, అధిక ధరలకు విక్రయించినా, పరిమితికి మించి కలిగి ఉన్నా నిందితులకు 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అగ్రిమిషన్‌పై సీఎం జగన్ సమీక్ష ఇదిలా ఉండగా సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిమిషన్‌పై సీఎం జగన్ సమీక్ష ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
అవసరానికో.. టోల్ ఫ్రీ
ఆపద, అవినీతి నిర్మూలన.. తదితర అవసరం ఏదైనా ఒక్క ఫోన్ కాల్‌తో సాయం పొందవచ్చు. ప్రమాదాల నుంచి రక్షణ పొందాలన్నా... తోటివారికి సాయపడాలన్నా.. సెల్ఫోన్లో బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మేలు చేయాలన్న తపన ఉంటే చాలు అత్యవసర సమయాల్లో వివిధ శాఖల సేవలను చాలా సులువుగా పొందవచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సేవలందించడంలో భాగంగా టోల్‌ఫ్రీ నంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నంబర్ల గురించి ప్రత్యేక కథనం...– యల్లనూరు,అనంతపురం జిల్లా అత్యవసర వైద్య చికిత్సల కోసం.. 108 ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినా.. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్య సేవల కోసం పరితపిస్తున్నా.. వెంటనే 108 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బంది క్షణాల్లో ప్రత్యేక వాహనం (అంబులెన్స్)లో అక్కడకు చేరుకుంటారు. క్షతగాత్రులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాథమిక చికిత్సలు నిర్వహిస్తూనే వాహనంలో ఆస్పత్రికి తీసుకెళతారు. మీ–సేవ సేవలకు - 1100 మీ–సేవ కేంద్రాల ద్వారా అమలవుతున్న సేవలను తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు డయల్ చేయాలి. సిబ్బంది వెంటనే సమాచారం అందిస్తారు. మీ సేవ కేంద్రాల్లో సిటిజన్ చార్ట్ ప్రకారం ఫీజులు వసులు చేయకపోయినా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. సమస్యకు వెంటనే పరిష్కారం దక్కుతుంది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రతి సేవలను ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలపడం ద్వారా పొందవచ్చు. పోలీసుల సాయం కోసం.. 100 సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా.. దౌర్జన్యాలకు గురవుతున్నా.. తక్షణ పోలీసుల సాయం కోరేందుకు ఏర్పాటు చేసిందే ఈ టోల్ ఫ్రీ నంబరు. ప్రతి ఒక్కరికి చాలా సులువుగా గుర్తుండేలా నంబర్‌ను కేటాయించారు. సమాజంలో ఎదురయ్యే అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు, దౌర్జన్యాలను అరికట్టేందుకు సమాజ హితం కోరే ఎవరైనా ‘100’ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు రంగంలోకి వచ్చేస్తారు. వైద్య సేవల సాయం పొందేందుకు 104 పేదలకు మెరుదైన వైద్య చికిత్సలు అందజేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి వైద్య సేవలు అందుతాయి. లేదా సంబంధిత ఆస్పత్రుల్లో అందుకున్న వైద్య సేవల్లో లోపాలు ఏమైనా ఉన్నా.. వెంటనే 104కు ఫోన్ చేసి సమాచారం చేరవేయవచ్చు. దీని వల్ల వెంటనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కావాల్సిన సమాచారం కూడా వెనువెంటనే అందజేస్తారు. విద్యుత్ సమస్యలకు 1912 విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1800–425–55–333/1912 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, లోవోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు, విద్యుత్ శాఖ అధికారుల పనితీరు తదితర సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం..1947 ప్రస్తుతం ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు. ఆధార్ నంబర్ లేనివారు దానిని పొందడానికి, సరైన వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 1947కు ఫోన్ చేయడం ద్వారా ఆధార్ కార్డు పొందడంలో ఉత్పన్నమయ్యే సమస్యలు తీరుతాయి. ఓటర్ కార్డునమోదు కోసం1950 భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఓటరు నమోదు ఎక్కడ చేస్తారో తెలియక ఇబ్బంది పడే వారికి వెసుటుబాటు కల్పించేలా 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఓటరు కార్డు ఎలా పొందవచ్చు, నమోదుకు అవసరమైన పత్రాలు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. రైల్వే సమాచారానికి 139 సమీప రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు 139కి ఫోన్ చేస్తే చాలు. మనకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని అందజేస్తారు. అంతేకాక రైలు ప్రయాణంలో మరుగుదొడ్ల సమస్య, నాసిరకం ఆహారం తదితర సమస్యలపై కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అవినీతి నిర్మూలనకు 1064 ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడితే వారి భరతం పట్టేందుకు 1064ను సంప్రదిస్తే చాలు. బాధితులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఏసీబీ అధికారులు అక్కడకు చేరుకుని అవినీతి అధికారుల ఆగడాలను కట్టడి చేస్తారు. అవినీతికి పాల్పడిన అధికారిని తగిన ఆధారాలతో అరెస్ట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. బేటీ బచావో.... బేటీ పడావో ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం 2015, జనవరి 22న బేటీ బచావో..బేటీ పడావో నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమలులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా బాలికల చదువు, ఆర్థిక అభివృద్ధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం గురించి తపాలా కార్యాలయంలో ఖాతా తెరవడం, విధివిధానాలు తదితర వివరాలను తెలుసుకోవాలనుకునేవారు 1800–180–1072ను సంప్రదించవచ్చు. -
కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్ చేసిన తల్లి
యాదగిరిగుట్ట (ఆలేరు) : తన కొడుకు పాఠశాలకు వెళ్ల డం లేదని.. ఓ తల్లి 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన యాదగిరిగుట్టలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం లోని అంగడిబజార్‌కు చెందిన గంధమల్ల మంజు ల భర్త గత ఐదేళ్ల క్రితం మరణించాడు. దీంతో పిల్లలను మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కుమారుడు లోకేష్ (14)ను మేడ్చల్‌లోని గురుకుల హాస్టల్లో 8వ తరగతిలో చేర్పించింది. దీంతో లోకేష్ 5 రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తిరిగి పాఠశాలకు వెళ్లమంటే మారం చేస్తున్నాడు. తన కుమారుడిని భయపెట్టడానికి మంజుల మంగళవారం 100కు డయల్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థి లోకేష్‌ను, తల్లి మం జులను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడివిగా కావా లని విద్యార్థికి పోలీసులు సూచించారు. -
సర్వీస్ నం.112
సాక్షి,సిటీబ్యూరో: ఆపదలో ఉన్నప్పుడు.. అత్యవసర సమయాల్లోను వివిధ ప్రభుత్వ శాఖల సహాయం అవసరమవుతుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ శాఖతోను, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వైద్య శాఖతోను, వరదలు వంటి సమయాల్లో మరోశాఖ సేవలు ప్రజలకు అవసరం. అయితే, అలాంటప్పుడు ఆయా శాఖలకు చెందిన అత్యవసర నంబర్లకు ఫోన్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ పనిచేయక పోయినా.. బిజీగా ఉన్నా మన అత్యవసరం ఏంటో అవతలి వాళ్లకు తెలియదు. ఈ సమస్య లేకుండా వివిధ మార్గాల ద్వారా సాయం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పౌరులకు కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు దేశ వ్యాప్తంగా ‘112’ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తున్నారు. మొన్నటి వరకూ పోలీసు శాఖ సేవల కోసం 100, అగ్నిమాపక శాఖ సేవలకు 101, ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యం కోసం 108, చిన్నారుల రక్షణకు 1090 నంబర్‌కు కాల్ చేయాల్సి వచ్చేది. అవి బిజీగా ఉంటే చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇకపై ఆ సమస్య లేకుండా ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్’(సీడీఏసీ) ద్వారా ‘ఎమర్జింగ్ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం’ (ఈఆర్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు సేవలందిస్తుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా క్షణాల్లో అత్యవసర సేవలను అందిస్తారు. ఈ 112 నంబర్‌పై అవగాహన లేక చాలా మంది ఈ సేవలకు దూరంగా ఉంటున్నారు. సేవలు పొందడం ఇలా.. ♦ ఫోన్ ఏదైనా (స్మార్ట్/ఫీచర్/ల్యాండ్)సరే ‘112’ నంబర్ నుంచి సేవలు పొందవచ్చు. వివిధ మార్గాల ద్వారా అత్యవసర వైద్యం, భద్రతా పరమైన సహాయం కోరవచ్చు. ♦ సంక్లిప్త సందేశం(ఎస్ఎంఎస్), వాయిస్ కాల్, ఈ–మొయిల్, ఈఆర్ఎస్ఎస్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సేవలందించేందుకు చర్యలు తీసుకుంటారు. ♦ ప్రత్యేక యాప్ రూపంలో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో యాప్‌ను నిక్లిప్తం చేసుకోవచ్చు. ♦ సాధారణ ఫోన్లో 5 లేదా 9 నంబర్లను ఎక్కువసేపు ప్రెస్‌చేసి ఉంచడం ద్వారా కూడా ‘112’ అత్యవసర సేవల విభాగం సిబ్బంది లైన్లోకి వస్తారు. జీపీఎస్ పరిజ్ఞానం ద్వారా సమస్యను గుర్తించి వివిధ ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసి సేవలందిస్తారు. -
నా రేషన్‌కార్డు పోయింది.. కినో మొక్క కావాలి!
హలో మేడమ్!.. ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకం జరుగుతోందట. రిక్రూట్మెంట్ వివరాలు చెప్పగలరా?..’‘సర్.. నా రేషన్ కార్డు పోయింది. కొత్తది కావాలంటే ఎవరి దగ్గరకెళ్లాలో చెబుతారా?’‘హలో మేడం..మా ఇంట్లో కినో మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నాను.. అవెక్కడ దొరుకుతాయో చెప్పండి..’ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్ నంబర్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్‌కు ఉదాహరణలివి. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, అనుమానాలను తీర్చడానికి ఎన్నికల సంఘం ఈ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ నంబర్‌కు ప్రజలెవరైనా ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు తీర్చుకోవచ్చు. ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్‌కు ఇంత వరకు 7,650 కాల్స్ వచ్చాయి. వాటిలో చాలా వరకు ఎన్నికలతో సంబంధం లేని కాల్సేనని సిబ్బంది చెబుతున్నారు. ‘ఎన్నికల విషయంలో ప్రజలెవరికీ ఎలాంటి అనుమానాలు వచ్చినా ఈ నంబరుకు ఫోన్‌చేసి అనుమానాలు తీర్చుకోవచ్చు. ఇందుకోసం 24 గంటలూ పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాకు రోజూ వందల కాల్స్ వస్తున్నాయి. అయితే, వాళ్లు ఎన్నికల విషయం తప్ప మిగతా సందేహాలన్నీ అడుగుతున్నారం’టూ వాపోతున్నారు సిబ్బంది. ఒకాయన ఫోన్ చేసి వాళ్లూర్లో కరెంటు లేదని, కరెంటు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అంటూ సుదీర్ఘ ప్రసంగం చేశాడు. వాళ్లూరికి కరెంటు ఇచ్చే వారికే ఓటేస్తానని చెప్పాడు’ అంటూ మరొకరు తమ అనుభవాన్ని వెల్లడించారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తాము ఒకందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. -
మీకు ఓటుందా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మీరు ఓటరుగా నమోదయ్యారా? ఓటు ఉంటే.. ఎక్కడ ఓటరుగా నమోదయ్యారు? అనేది మీకు తెలియదా. ఏం పర్వాలేదు. వెంటనే మీ మొబైల్ నుంచి 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. కాల్ సెంటర్ ప్రతినిధులు ఇట్టే చెప్పేస్తారు. ఇందుకోసం మీరు చేయాల్సింది.. మీ ఓటరు గుర్తింపు కార్డు నంబర్ చెప్పడమే. ఒకవేళ ఓటు కలిగి లేకుంటే ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కావడానికి ఈనెల 2, 3 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,300 పోలింగ్ బూత్‌లలో ఓటరు నమోదుగా కావొచ్చు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులు. వయసును నిర్దరించే ఏదేని ధ్రువీకరణ పత్రం ఉండటంతోపాటు స్థానికంగా నివసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారు చేర్పులు మార్పులు కూడా చేసుకోవచ్చని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. -
టోల్ ఫ్రీ నెం.1950
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకై అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈ నెల 3న ఆదివారం మరోసారి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అలాగే సలహాలు, సూచనలు ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు డయల్ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ లొకేషన్లలో బూత్‌లెవల్ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై హైదరాబాద్ జిల్లా ఓటర్ల నమోదు పర్యవేక్షక అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంయుక్త ఎన్నికల నిర్వహణ అధికారి అమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, జయరాజ్ కెనడిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 26వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని, ఈ జాబితాలో సవరణలు, చిరునామా మార్పిడి, 18 ఏళ్లు నిండినవారికి ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన బిఎల్ఓలు ఫారం–6, 7, 8, 8ఏ ఫారాలతో పాటు ఓటర్ల జాబితాను కలిగి ఉంటారని అన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు కూడా హాజరు కావాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. అందిన ప్రతి క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించి పత్రాలను విచారణ జరిపినట్లు బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఇఆర్ఓలు, ఇఆర్ఓలు ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. కాల్స్ స్వీకరించిన కమిషనర్ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు, సమాచారానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1950కు ఫోన్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఓటర్లకు కమిషనర్ దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నెంబర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1950కు వచ్చిన కాల్స్‌ను స్వీకరించి వారితో మాట్లాడారు. -
13 జిల్లాల్లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్లు
సాక్షి, విజయవాడు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా గురువారం నగరంలోని బారతీనగర్‌లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు 1950 నెంబర్‌కు ఫోన్ కాల్ చేసి తమ ఓటు కార్డు స్టేటస్‌తో పాటు ఈపీఐసీ నెంబర్‌ను 9223166166 లేదా 51969కు ఎస్ఎంఎస్ చేసి తమ ఓటు స్టేటస్ ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని 13 జిల్లాల్లో 13 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని సిసోడియా చెప్పారు. -
ఆ నెంబర్ మా పొరపాటే : గూగుల్
స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రమేయం లేకుండా.. వారి కాంటాక్ట్ లిస్ట్‌లోకి కొత్తగా జతచేరిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్... ఎక్కడ నుంచి వచ్చిందని యూజర్లు తలబద్దలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది తమ తప్పిదం కాదని యూఐడీఏఐ తేల్చేసింది. అయితే ఈ పని ఎవరు చేశారంటూ అని అనుకుంటుండగా.. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ అనూహ్య ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లోకి వచ్చిన యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ తమ తప్పిదమేనని గూగుల్ ప్రకటించింది. తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించింది. దీనిపై గూగుల్, ఆండ్రాయిడ్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. కోడింగ్ తప్పిదం కారణంగా పాత టోల్ ఫ్రీ నంబర్ 1800-300-1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్ 112 యూజర్ల సెటప్ విజార్డ్లోకి చేరిపోయాయని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇది తాము ఏ ఆండ్రాయిడ్ డివైజ్‌లలోకి అనధికారికంగా చొరబడాలని చేసింది కాదని స్పష్టంచేసింది. యూజర్లు తమ డివైజ్‌ల నుంచి ఈ నెంబర్‌ను మాన్యువల్‌గా డిలీట్ చేయొచ్చని పేర్కొంది. కాగ, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కాంటాక్ట్ లిస్టులో ఎవరి ప్రమేయం లేకుండా యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ జతచేరిన విషయం తెలిసిందే. ఆ నెంబర్ వేలాది ఫోన్లలో శుక్రవారం కనిపించింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. నెంబర్‌ను ఫోన్లో సేవ్ చేయకుండానే కాంటాక్ట్ లిస్టులోకి ఎలా వచ్చిందా అని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు టెన్షన్ పడ్డారు. ఓ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్టును స్క్రీన్‌షాట్ తీసి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అప్పటికీ ఈ గందరగోళంపై యూఐడీఏఐ ఇది అసలు తమ వాలిడ్ నెంబర్ కాదంటూ తేల్చేసింది. తమ టోల్‌ఫ్రీ నెంబర్ 1947 అని, రెండేళ్లకు పైగా దీన్నే వాడుతున్నామని ప్రకటించింది. -
ఫోన్లో డీఫాల్ట్‌గా ఆధార్ టోల్ ఫ్రీ నంబర్
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947 డీఫాల్ట్‌గా చేరింది. తమ ప్రమేయం లేకుండా ఫోన్ల కాంటాక్ట్ లిస్ట్‌లో టోల్ ఫ్రీ నంబర్‌ను చేర్చడం ఏంటని ప్రజలు సోషల్‌మీడియాలో మండిపడ్డారు. కాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో సేవ్ చేసిన పాత ఆధార్ నంబర్ 1947 కూడా 1800–300–1947గా మారింది. ఈ తతంగాన్ని ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఇలియట్ గుర్తించారు. వెంటనే ‘హాయ్ యూఐడీఏఐ. ఆధార్ ఉన్న, లేనివారు, ఎంఆధార్‌ను ఇన్స్టాల్ చేసుకున్న, చేసుకోని వారు ఇలా అందరి ఫోన్లలోకి టోల్‌ఫ్రీ నంబర్ వచ్చింది. దీనిపై ప్రజలకు సమాచారమే లేదు. ఎందుకో చెబుతారా?’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆధార్ టోల్ ఫ్రీ నంబర్‌ను ఫోన్లలో చేర్చాల్సిందిగా తాము ఏ మొబైల్ తయారీ సంస్థను, సర్వీస్ప్రొవైడర్ను కోరలేదని యూఐడీఏఐ తెలిపింది. తాము ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1947ను మార్చలేదనీ, ప్రస్తుతం దీన్నే వాడుతున్నామని స్పష్టం చేసింది. మరోవైపు తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించిన గూగుల్ యూజర్లను క్షమాపణలు తెలిపింది. కోడింగ్ తప్పిదం కారణంగా పాత టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్ 112 యూజర్ల సెటప్ విజార్డ్లోకి చేరిపోయాయని వెల్లడించింది. -
టోల్‌ఫ్రీ నెంబర్ ఇష్యూ : యూఐడీఏఐ క్లారిటీ
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్.. స్మార్ట్‌ఫోన్ యూజర్ల అనుమతి లేకుండా డిఫాల్ట్‌గా కాంటాక్ట్ లిస్ట్‌లోకి వచ్చి చేరుతుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ఫ్రెంచ్ హ్యాకర్ ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ ఆల్డెర్సన్ కనుగొన్న ఈ విషయంపై వేల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు స్పందించారు. నిజంగానే తమ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లోకి యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ వచ్చి చేరిందని, తమ అనుమతి లేకుండా ఎలా ఈ నెంబర్‌ను యాడ్ చేస్తారంటూ మండిపడుతున్నారు. తమ ఫోన్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోకుండా.. ఈ నెంబర్ వచ్చి చేరడం ఆందోళించదగ్గ విషయమని సీరియస్ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజర్ల మండిపాటుపై యూఐడీఏఐ స్పందించింది. మీడియాలో వస్తున్న ఈ రిపోర్టులను యూఐడీఏఐ కొట్టిపారేసింది. 1800-300-1947 అసలు తమ వాలిడ్ టోల్‌ఫ్రీ నెంబర్ కాదని తేల్చి చెప్పింది. ఆ నెంబర్‌ను వాడటం లేదని పేర్కొంది. ప్రస్తుతం తమ వాలిడ్ టోల్‌ఫ్రీ నెంబర్ 1947 అని పేర్కొంది. గత రెండేళ్లకు పైగా 1947 నెంబర్‌నే వాడుతున్నట్టు తెలిపింది. ప్రజల్లో అనవసరపు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొంది. ఏ సర్వీసు ప్రొవైడర్‌ను, స్మార్ట్‌ఫోన్ తయారీదారిని తమ యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ యాడ్ చేయాలని ఆదేశించలేదని కూడా స్పష్టం చేసింది. యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ తమ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ అయిందంటూ ట్విటర్ యూజర్లు షేర్ చేసిన స్క్రీన్ షాట్లలో 1800-300-1947 ఉంది. కానీ ఆ నెంబర్ అసలు యూఐడీఏఐ వాడటం లేదని తెలిసిన తర్వాత ఆ నెంబర్ ఇన్వాలిడ్ అని తెలిసింది. కాగ, ‘ ఆధార్ నెంబర్ అనుసంధానంతో లేదా అనుసంధానం లేకుండా.. వివిధ సర్వీసుల ప్రొవైడర్ల సేవలందుకుంటున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు... ఎంఆధార్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ లేదా ఇన్స్టాల్ చేసుకోనప్పటికీ వారి ఫోన్ నెంబర్ లిస్ట్‌లో డిఫాల్ట్‌గా మీ యూఐడీఏఐ నెంబర్ ఉంది. అది కూడా వారి సమ్మతి లేకుండానే. అది ఎలానో వివరించాలి? అంటూ ఇలియట్ ఆల్డెర్సన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
షాకింగ్ : మీ ఫోన్లోకి ఆ నెంబర్
మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు సేవ్ చేయకుండా.. ఓ ఫోన్ నెంబర్ వచ్చి చేరితే. అది నిజంగా షాకింగే. ఈ విషయంపై తొలుత మనకు వచ్చే సందేహం. ఎవరైనా మన ఫోన్‌ను తీసుకుని ఈ పని చేశారా? లేదా మన ఫోన్ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా? అని అనుమాన పడతాం. తాజాగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇదే షాకింగ్, అనుమానకర సంఘటన ఎదురైంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్ కాంటాక్ట్ లిస్టులోకి వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ ఆల్డెర్సన్ కనుగొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెలియజేశారు. ట్విటర్లో ఫ్రెంచ్ హ్యాకర్ పోస్టు చేసిన విషయాన్ని చూసి, యూజర్లు తమ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌ను చెక్ చేయగా.. నిజంగానే యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ తమ ఫోన్లోకి వచ్చిందని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గుర్తించారు. ఈ విషయంపై గంటల వ్యవధిలోనే వందల కొద్దీ స్క్రీన్ షాట్లు ట్విటర్లో షేర్ అయ్యాయి. తమ సమ్మతి లేకుండా.. ఎలా తమ ఫోన్లలో ఈ నెంబర్‌ను యాడ్ చేస్తారంటూ యూజర్లు మండిపడుతున్నారు. ‘ ఆధార్ నెంబర్ అనుసంధానంతో లేదాఅనుసంధానం లేకుండా.. వివిధ సర్వీసుల ప్రొవైడర్ల సేవలందుకుంటున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు... ఎంఆధార్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ లేదా ఇన్స్టాల్ చేసుకోనప్పటికీ వారి ఫోన్ నెంబర్ లిస్ట్‌లో డిఫాల్ట్‌గా మీ యూఐడీఏఐ నెంబర్ ఉంది. అది కూడా వారి సమ్మతి లేకుండానే. అది ఎలానో వివరించాలి? అని ఇలియట్ ఆల్డెర్సన్ ట్వీట్ చేశారు. దానిని అధికారిక యూఐడీఏఐ హ్యాండిల్‌కు ట్యాగ్‌చేశారు. అంతకముందు యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నెంబర్ 1800-300-1947గా ఉండేది. ప్రస్తుతం దీని కొత్త నెంబర్ 1947. పాత స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1800-300-1947 నెంబర్ కనిపిస్తుండగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1947 నెంబర్ డిస్ప్లే అవుతుంది. మా ఫోన్లో యూఐడీఏఐ నెంబర్ సేవ్ చేయమని ఎవరు చెప్పారు? మా సమ్మతి లేకుండా మీరేం చేస్తున్నారు? అంటూ ఓ ట్విటర్ యూజర్ మండిపడ్డారు. ఇప్పుడే మేము దీన్ని నోటీస్ చేశాం. చాలా కొత్త మొబైల్స్ యూఐడీఏఐ 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రీ-స్టోర్ చేసుకుని వస్తున్నాయి. శాంసంగ్, మైక్రోమ్యాక్స్ ఫోన్లలో దీన్ని గమనించాం. ప్రభుత్వ ఆదేశాలతో ఇలా చేస్తున్నారా? అని మరో యూజర్ ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా ఎలా యూఐడీఏఐ నెంబర్‌ను తమ కాంటాక్ట్ లిస్ట్‌లో స్టోర్ చేస్తారంటూ చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. దీనిపై యూఐడీఏఐ స్పందించాలని యూజర్లు సీరియస్ అవుతున్నారు. అయితే ఇప్పటికీ దీనిపై యూఐడీఏఐ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. Hi @UIDAI, Many people, with different provider, with and without an #Aadhaar card, with and without the mAadhaar app installed, noticed that your phone number is predefined in their contact list by default and so without their knowledge. Can you explain why? Regards, — Elliot Alderson (@fs0c131y) August 2, 2018 @UIDAI @ceouidai who asked you to get into my phone and store your number?!? What all are u doing without my knowledge? — Varun Kukreti (@Varunkukreti) August 3, 2018 -
బియ్యం ఇంకా రాలే..
ఆదిలాబాద్ అర్బన్ : జూలై ఒకటో తారీఖు గడిచిపోయింది. ఫస్టు కాకముందే ప్రతి నెల బియ్యం కంట్రోల్ దుకాణానికి వస్తుండే. కానీ ఈ నెల రేషన్ బియ్యం ఇంకా రాలేదు. రేపెళ్లుండి వసాయేమో.. అని గ్రామాల్లో కొందరు కార్డుదారులు చర్చించుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్ డీలర్లు సమ్మెలో ఉండడం, పంపిణీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం.. వెరసి ఈ నెల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ (మండలస్థాయి నిల్వ గిడ్డంగి)ల నుంచి ఇంకా గ్రామాలకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. డీడీలు కట్టిన డీలర్లకు ఒక్కో లోడ్ లారీ బియ్యం చొప్పున సరఫరా చేస్తున్న అధికారులు, డీడీలు కట్టని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29తో డీలర్ల డీడీల సమర్పణ గడువు ముగిసినా.. జూలై 1 ఆదివారం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ గడువు సైతం ముగియడంతో మహిళా సంఘాల ద్వారా డీడీలు తీసి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. 112 చోట్ల డీలర్లు.. 243 చోట్ల సంఘాలు.. జిల్లాలో ఎప్పుడు జరగని వింత పరిస్థితి చోటు చేసుకుంటోంది. జిల్లాలో 355 చౌక ధరల దుకాణాల పరిధిలో 1,81,922 కార్డుదారులకు నెలకు 4,020 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ఈ నెల రేషన్ బియ్యాన్ని 112 చోట్ల డీలర్లు, 243 చోట్లలో మహిళా సంఘాలు గ్రామాలో, విలేజ్ ఆర్గనైజర్లు (వీవో) పట్టణాల్లో పంపిణీ చేయనున్నారు. అయితే డీలర్లు ఇదివరకు పంపిణీ చేసిన స్థలాల్లోనే పంపిణీ చేయనుండగా, సంఘాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ, యూత్ భవనాల్లో పంపిణీ చేయనున్నారు. ఇందుకు అధికారులు సంబంధిత భవనాల వివరాలు సేకరించి బియ్యాన్ని నిల్వ చేసేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. బియ్యం పంపిణీకి గుర్తించిన మహిళా సంఘాలతో సోమవారం నుంచి డీడీలు కట్టించి అదే రోజు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే డీడీలు సంఘం డబ్బుల ద్వారా పంపిణీ చేయగా వచ్చిన డబ్బును తమకు జమ చేసుకోనున్నారు. సరిపడా డబ్బు సంఘాల వద్ద అందుబాటులో లేకుంటే క్రెడిట్ ఆర్వో (బియ్యం పంపిణీ చేశాకే డబ్బు చెల్లింపు చేయడం)తో బియ్యం సరఫరా చేయనున్నట్లు అధికారులు ఇది వరకే స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 10 వరకు బియ్యం పంపిణీ చేసి స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట గడువును పొడిగించనున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకులు అందకపోయినా, సరఫరాలో ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1967కు లేదా వాట్సాప్ నంబర్ 7330774444కు సమాచారం ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. సంఘాలతో సాధ్యమేనా..? రేషన్ బియ్యాన్ని మహిళా ద్వారా పంపిణీ చేయడంపై డీలర్లు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల వద్ద తూకం మిషన్లు లేవు. వాటిపై వారికి అవగాహన లేదు. పక్క జిల్లాలో ఇది వరకే మహిళా సంఘాలకు తూకం మిషన్ల వాడకంపై, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నా.. మన జిల్లాలో అధికారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ–పాస్ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు డీలర్ల వద్ద ఉన్నాయి. డీలర్లతో మాట్లాడి వారి వద్ద ఉన్న తూకం మిషన్లను మహిళా సంఘాలకు ఇప్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగం తహసీల్దార్లకు అప్పగించింది. అయితే పంపిణీ గడువు దగ్గర పడుతున్నా ఇంత వరకు ఏ ఒక్క తహసీల్దార్ ఆ దిశగా అడుగు వేయలేదు. దీంతో మహిళా సంఘాల ద్వారా బియ్యం పంపిణీ సాధ్యమేనన్నా అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కార్డుదారులకు బియ్యం సరఫరా కావడం ముఖ్యమని పలువురు చర్చించుకోవడం గమనార్హం. -
అంగన్ వాడీపై ఫిర్యాదులకు..
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇకనుంచి మరింత పారదర్శకంగా వ్యహరించాలి. లేదంటే ఏ క్షణం ఎవరు ఫిర్యాదు చేస్తారో తెలియదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 155209 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సరుకులు పక్కదారి పట్టినా, పౌష్టికాహార పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. నవాబుపేట : అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు, విధులకు ఎగనామం పెడుతున్న వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు, కిశోర బాలికలు, తల్లులకు అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 155209 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పౌష్టికాహారం పక్కదారి పట్టినా, సెంటర్లలో అవకతవకలు చోటుచేసుకున్నా వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది పని చేస్తుంది. ఫిర్యాదు చేసిన వెంటనే.... లబ్ధిదారులకు అంగన్వాడీ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే ఈ హెల్ప్‌లైన్ నంబర్ ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు లబ్ధిదారులకు ఎక్కడ, ఎప్పుడు సేవలు అందుతాయనే విషయాలను తెలుసుకోవచ్చు. సేవల్లో ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. విషయం తెలుసుకున్న వెంటనే సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపడుతారు. కార్యక్రమాల అములు, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు, అవసరాలపై అంగన్వాడీ టీచర్లు కూడా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తల్లి పిల్లల పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పెరుగుదల సమస్యలు, తల్లి పాలు పట్టడం, పిల్లల అభివృద్ధి కి తల్లిదండ్రులు చేయాల్సిన అంశాలపై సలహాలు కూడా ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. జిల్లాలో... వికారాబాద్ జిల్లాలో 914 అంగన్వాడీ సెంటర్లు పని చేస్తున్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న 49,126 మంది చిన్నారులు వీటిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలు 13,870 పౌష్టికాహారం తీసుకుంటూ అక్షరాలు దిద్దుతున్నారు. లక్ష్యం... జీవీకే, ఆర్ఎంఆర్ఐ వారి సహకారంతో మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఇటీవల హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఉచిత ఫోన్‌కాల్ ద్వారా పోషణ, ఆరోగ్య సంబంధిత సేవలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పొందవచ్చు. హెల్ప్‌లైన్ కల్పించే సౌకర్యాలు... æ గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందించడం. æ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు ఆరేళ్లలోపు పిల్లల వివరాలు నమోదు చేయడం. æ గర్భిణులు ఐరన్ మాత్రలు, ఇతర సూక్ష్మపోషకకాలు తీసుకునేలా చూడటం. æ గర్భిణులు, బాలింతలు ఆరేళ్లలోపు పిల్లలు, కిశోర బాలికల్లో రక్తహీనత తగ్గించేలా చర్యలు తీసుకోవడం. æ క్రమంతప్పకుండా బాలింతలు, గర్భిణుల ఆరోగ్య తనిఖీ, చిన్న పిల్లలకు వ్యాధి నిరోదక టీకాలు సకాలంలో అందేలా చూడటం. æ తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించడం. æ మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో మెరుగైన ప్రీ స్కూల్ విద్య అందేలా చూడటం. -
ఆబ్కారీ ఆన్లైన్
విధిగా ధరల పట్టికను ప్రదర్శించడం.. మందు పోసే విధానంలో అక్రమాలను అరికట్టడం.. నకిలీ మద్యానికి చెక్‌పెట్టడం.. సిండికేట్, అనుమతి లేని సిట్టింగ్‌లకు స్వస్తి చెప్పడం.. ధరలను అదుపు చేయడం.. మద్యం దుకాణాలపై పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు వ్యాపారులు చేస్తున్న ఇటువంటì అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను తెరమీదకు తెచ్చి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పూనుకుంది. యాప్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పొందుపరచగా.. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మద్యం ప్రియులకు త్వరలోనే అవగాహన కల్పించేందుకు.. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఖమ్మం, వైరా: మద్యం దుకాణాల్లో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి మద్యం షాపులో యజమాని రెండు సీసీ కెమెరాలను రికార్డింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఆ సొమ్మును ఎలాగోలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. కల్తీ మద్యంతోపాటు ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయిస్తున్నారు. సిట్టింగ్‌లు అనుమతి లేకుండా నిర్వహించడంతోపాటు కౌంటర్ వద్దే మద్యం ప్రియులకు పెగ్గుల ద్వారా మద్యం విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఎక్కువ సమయం వరకు వైన్ షాపులు, బార్లు తెరిచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ కళ్లెం వేసేందుకే ప్రభుత్వం ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలో లభించే 880 లిక్కర్ బ్రాండ్ల ధరలు పొందుపరిచారు. విస్కీ, బ్రాందీ, రమ్, బీరు.. ఇలా రకాలవారీగా వివరాలున్నాయి. యాప్‌లోకి వెళ్లి కావాల్సిన మద్యం రకంపై క్లిక్ చేసి.. సైజులు నమోదు చేస్తే మద్యం ధర ఫోన్ తెరపై వెనువెంటనే ప్రత్యక్షమవుతుంది. ఫిర్యాదు చేయడం ఇలా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 162 మద్యం దుకాణాలను ఇటీవలే లక్కీడిప్ ద్వారా సొంతం చేసుకున్నారు. కొందరు పట్టణ ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు నాసికరమైన మద్యాన్ని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నింటినీ నిరోధించడం.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు దుకాణం యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన వాట్సప్ నంబర్ 7989111222కు ఫిర్యాదు చేయొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2533కు ఉచిత ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా హైదరాబాద్‌లోని ప్రధాన కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఫిర్యాదుదారు తన ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ ద్వారా ‘లిక్కర్ ప్రైస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే యాప్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అ«ధికారులు అధికారికంగా విడుదల చేసిన విషయం విదితమే. ధరల పట్టిక తప్పనిసరి.. కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రతి దుకాణంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దుకాణాల ఎదుట ధరల పట్టిక కూడా ఉంచాలి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలు, 5 బీర్ బ్రాండ్ల ధరలు పట్టికపై ముద్రించాలి. 12 నెలల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ బ్రాండ్ల ధరలను పట్టికపై ముద్రిస్తారు. ఇది మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో ఉండేలా.. తెలుగులో ప్రతి బ్రాండ్ ఎమ్మార్పీని పొందుపరచాల్సి ఉంటుంది. మద్యం దుకాణం పేరు, గెజిట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. అవగాహన కల్పిస్తాం.. మద్యం దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు తలెత్తకుండా యాప్ ఉపయోగపడుతుంది. ఇటీవలే యాప్‌ను అధికారంగా విడుదల చేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మూడు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపడతాం. బాధితులకు న్యాయం చేస్తాం. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగకరం. మద్యం ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సోమిరెడ్డి,ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం -
1033 హెల్ప్‌లైన్ త్వరలో..దేనికో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు గురించి నివేదించేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను లాంచ్ చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జియో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం పని పూర్తి చేసినట్టు జాతీయ రహదారుల అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్) తెలిపింది. ప్రమాద బాధితులకు తక్షణం సహాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతేకాదు త్వరలోనే దీనిపై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి, ప్రాణాలను రక్షించే యోచనలో భాగంగా ఈ చర్య తీసుకోవాలని అధారిటీ యోచిస్తోంది. 1033 అనే టోల్ నెంబర్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. 1033 హెల్స్‌లైన్ ద్వారా ఎమర్జన్సీ లేదా నాన్ ఎమర్జన్సీ సేవలతో హైవే వినియోగదారులకు "వన్ స్టాప్ పరిష్కారం" అందించనున్నామని భారత జాతీయ రహదారుల అథారిటీ అధ్యక్షుడు దీపక్ కుమార్ వెల్లడించారు. ప్రమాద బాధితులను నిర్ధారించడానికి, సకాలంలో వైద్య చికిత్స అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి లేదా ఏదైనా ఇతర అత్యవసర పరిస్థితి గురించి ఒక కాల్ వచ్చినప్పుడు టోల్ నంబర్ ఆపరేటర్లు ఆ సమాచారాన్ని సమీపంలోని ఆపరేషన్ సెంటర్‌కు చేరవేస్తారు. తద్వారా అంబులెన్స్ , క్రేన్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30శాతం జాతీయ రహదారులపైనే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 2016 సంవత్సరంలోనే ఈ ప్రమాదాల్లో 52,075 మంది ప్రాణాలు కోల్పోగా, 1.46 లక్షలమంది గాయాలపాలైనట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. -
కీసర టోల్‌ప్లాజా వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ
నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. -
లంచం అడిగారా.. కాల్ 1064
ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పని చేసిపెట్టేందుకు లంచం అడుగుతున్నారా? ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల వివరాలు మీ వద్ద ఉన్నాయా?.. వీటిపై ఫిర్యాదు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ కేంద్రంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ అధికారులు ఫిర్యాదు అందుకున్న వెంటనే కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించి చర్యలు తీసుకుంటారు. నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తిరుపతి క్రైం : ఆధునిక సమాచారం, సాంకేతిక పరి జ్ఞానం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్నా, ఆ సంస్థల్లో చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాల వల్ల ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత లోపిం చడం, జవాబుదారిపాలన కరువై పోవడం, నియామకాల్లో పక్షపాతం.. ఇవన్నీ అవినీతికి మూలాలుగా నిలుస్తున్నా యి. సమాజానికి పట్టిన అవినీతి జాడ్యాన్ని వదిలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవా లి. అవినీతిని అరికట్టేందుకు ఏం చేయాలి..? ⇒ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పథకాల ఎంపికలో దళారులు, రాజకీయ జోక్యం అరికట్టాలి. ⇒ ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిలదీయాలి లేదా ఏసీబీని ఆశ్రయించాలి. ⇒ ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ⇒ ఏసీబీ, విజిలెన్స్ శాఖల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తే నిరంతరం తనిఖీలు చేసే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న విభాగాలివే.. ⇒ పౌరసరఫరాల శాఖలో వినియోగదారుడికి సరుకులు సక్రమంగా అందడం లేదు. తూనికలు, కొలతల్లో మోసం జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ⇒ రెవెన్యూ విభాగంలో ఆర్డీఓ కార్యాలయం మొదలుకుని పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అవినీతి పేరుకుపోయింది. ⇒ ఈ విభాగాల్లో ఎక్కువ మంది ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ⇒ సంక్షేమ వసతిగృహాల్లో పిల్లలకు ఇచ్చే మెనూలో నిబంధనలు పాటించడం లేదు. ⇒ పోలీసు శాఖలో అవినీతి పెచ్చుమీరిపోయింది. హోంగార్డు నుంచి అధికారి వరకు లంచం లేనిదే ఏ పనీ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ⇒ పురపాలక శాఖలో కొళాయి పన్ను నుంచి భవన నిర్మాణానికి అనుమతి పత్రాల మంజూరు వరకు మామూళ్లు ఇవ్వాల్సిందే. గత అయిదేళ్లలో ఏసీబీ కేసులివే.. ⇒ 2012 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఒకటి, దాడుల కేసులు 4, ట్రాపింగ్ కేసులు 9 నమోదయ్యా యి. ⇒ 2013లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ట్రాపింగ్ కేసులు 13, ఇతరత్రా దాడుల్లో 5 కేసులు. ⇒ 2014లో ఆదాయానికి మించిన కేసు ఒకటి, ట్రాపిం గ్ కేసులు 19, ఇతరత్రా దాడుల కేసులు 10 నమోదు. ⇒ 2015లో 18 ట్రాపింగ్ కేసులు, ఇతర కేసులు రెండు, ఆకస్మిక దాడులు 10. ⇒ 2016లో 10 ట్రాపింగ్ కేసులు, 2 ఆదాయానికి మించిన కేసులు, 2 ఆకస్మిక తనిఖీలు. ⇒ 2017లో ఇప్పటి వరకు 3 ట్రాపింగ్ కేసులు, 4 ఆకస్మిక తనిఖీలు, 2 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 4 రెగ్యులర్ ఎంక్వైరీలు. లంచగొండులను వదలం.. లంచం తీసుకునేవారిని, ప్రోత్సహించేవారు ఏసీబీ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయిలో నిఘా ఉంచాం. సొంత శాఖ అయిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, తుడాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు దక్కాల్సిన వాటిల్లో కూడా లంచాలు తీసుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. గృహనిర్మాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో కూడా లంచగొండులు పెరిగిపోతున్నారు. అలాంటివి ఏవైనా ఉంటే మాకు ఫిర్యాదు చేయండి. ఏసీబీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఏసీబీ డీఎస్పీ నంబర్ – 9440446190,సీఐలు –9440446138, 9440808 112. 1064కు కాల్ చేస్తే ప్రతి ఒక్క మాట రికార్డు అవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – శంకర్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి -
ఎస్ఐపై దోపిడీ దొంగల దాడి
మార్టూరు: దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. వీరిని పట్టుకోవడానికి నిఘా పెట్టిన ఎస్ఐపై కత్తితో దాడి చేశారు. సోమవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొంగలు సంచరిస్తున్నారని, రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు, లారీల డ్రైవర్లను బెదిరించి దోపిడీలు చేస్తున్నారని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తన సిబ్బందితో కలసి మఫ్టీలో నిఘా పెట్టారు. టోల్గేట్ సమీపంలో జె.పంగులూరు మండలం రామకూరు వెళ్లే మట్టిరోడ్డు వద్ద సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఎదురయ్యారు. అనుమానం వచ్చిన ఎస్ఐ వారిని నిలువరించారు. పోలీసులు అని గుర్తించిన దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిని వెంబడిస్తున్న ఎస్ఐపై కత్తితో దాడి చేశారు. దీంతో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఎడమ భుజం, చేతిపై గాయాలయ్యాయి. ఆయన షాక్ నుంచి తేరుకునే లోపే దొంగలు పరుగు తీస్తూ పొలాల్లోకి వెళ్లిపోయారు. అనంతరం హోమ్‌గార్డులు రవి, నాగూర్‌లు ఎస్ఐని చికిత్స నిమిత్తం మార్టూరు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయాలకు కుట్లు వేసి ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. -
భరోసానివ్వని హెల్ప్లైన్లు
సందర్భం రైతులు తమ తక్షణ సమస్యలు తెలుపుకోవడానికి.. తమకు ఒక తోడు, నీడ, అండ ఉందని ధైర్యంగా ఉండటానికి ఒక హెల్ప్‌లైన్ తక్షణ అవసరం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ హెల్ప్లైన్ల కోసం ఒక్క ప్రత్యేక ఉద్యోగిని కూడా నియమించలేదు. ‘అన్నా మా సమస్యలు వినేవారు ఉంటే కదా చెప్పుకోవటానికి’.. ఆత్మహత్య చేసుకున్న యువరైతు శ్రీధర్ భార్య మంజుల అన్నమాటలివి. మా భర్త వ్యవసాయంలో నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన బాధలు వినేవారు పరిష్కరించే వారు ఉంటే మా పరి స్థితి ఈ విధంగా ఉండేది కాదని మంజుల పదేపదే చెబుతోంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక వారు రైతు ఆత్మహత్యల అధ్యయనంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోఅప్పుల బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించి హాస్పిట ల్లో చివరి క్షణాలలో బతికి బయటపడ్డ రైతు యాదగిరితో మాట్లాడినప్పుడు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు, మా సమస్యలు వినేవారు లేరు, విన్నా తీర్చేవారు లేరు. అలా మా సమస్యలు పరిష్కరించే వారే ఉంటే కళ్ల ఎదురుగా ఉన్న భార్యా పిల్లలను కాదనుకుని ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడతామనేది యాదగిరి అభిప్రాయం. నిజమే సమస్యలలో ఉన్నవారికి ఆ సమస్యలు చెప్పుకునే అవకాశం అందుకు పరిష్కారం లభిస్తే అంతకంటే ఏమికావాలి! రైతుల ఆత్మహత్యల నివారణ కోసం తెలంగాణా ప్రభుత్వం 2015 లో హెల్ప్లైన్లు ప్రారంభించింది. కానీ ఆ హెల్ప్లైన్లు మూగబోయి చాలా కాలమైంది. హెల్ప్‌లైన్ అంటేనే ఏదో చిన్నపాటి సహాయం అందుతుందేమో అన్న ఆశ కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం హెల్ప్లైన్లు ప్రారంభించిన విషయం రైతులకు అటుంచి అధికారులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. 2015 అక్టోబర్‌లో తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలపై ప్రత్యేక చర్చ సందర్భంగా రైతు సమస్యలను వెంటనే పరిష్కరించి వారు ఆత్మహత్యల వైపు వెళ్లకూడదనే సదుద్దేశంతో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలలో హెల్ప్లైన్లు ప్రారంభం అయ్యాయి. సమస్యలలో ఉన్న రైతులు ఫోన్ చేస్తే మండల కమిటీ, జిల్లా కమిటీలు ఆ రైతుల సమస్యలకు పరిష్కారం చూపించి ఆ రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడటం హెల్ప్‌లైన్ ప్రధాన ఉద్దేశం. కానీ ప్రభుత్వం ఈ హెల్ప్లైన్ల కోసం ఒక్క ప్రత్యేక ఉద్యోగిని కూడా నియమించలేదు. కొన్నిచోట్ల జాయింట్ కలెక్టర్ కార్యదర్శి కూడా హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్లు లిఫ్ట్ చేసి ఆ సమయానికి ఏదో ఒక సమాధానం చెప్పి ముగించేవారు. ఇక కరీంనగర్ జిల్లా లాంటి చోట్ల కేవలం రెండు నెలల కాలంలో 600 మంది రైతులు తమ సమస్యల పరిష్కారంకోసం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారంటే రైతు సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతులు సమస్యలు చెప్పుకుంటూ పోవటమే కానీ స్థానిక అధికారులు ఆ సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. ఇక ఈ తంతు కూడా ముచ్చటగా 3 నెలలే కొనసాగింది. ప్రతిపక్ష శాసన సభ్యులు, రైతు సంఘాల నాయకులు స్వయంగా హెల్ప్లైన్ల పక్కన నిల్చుండి ఫోన్ ఎత్తే నాధుడే లేడని ఎన్నో ఫిర్యాదులు, కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టలేదు. ఫలితం మూడు సంవత్సరాలలో మూడు వేలకు పైగా రైతుల ఆత్మ హత్యలు. పరిశ్రమల కోసం సింగల్ విండో పద్ధతిన అన్ని వసతులు కల్పించగలిగే ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే చిన్న సమస్యలకు పరిష్కారం చూపే సామర్థ్యం లేదా? ఏది ఏమైనా వాస్తవం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన మాత్రం అధికారులను ప్రజలకు దగ్గర చేసింది. మరి ఇంత చిన్న జిల్లాలలోనైనా ఈ హెల్ప్లైన్లు పునరుద్ధరించగలిగితే రైతుల సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభిస్తాయి కదా? ఎలాగూ ప్రతి సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) జరుగుతూనే ఉంది. హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమస్యలపై ఒక గంట పాటు సమీక్ష జరిపితే రైతులు ఏ రుతువులో ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో అర్థమవుతుంది. చిన్న జిల్లాలు కాబట్టి రైతు అవసరాలను బట్టి స్వయంగా అధికారులే రైతుల దగ్గరికి వెళ్లి సమస్యకు పరిష్కారం చూపవచ్చు, లేదా ఆ దిశగా భరోసా ఇవ్వవచ్చు. రైతు ఆత్మహత్యలు లేని సమాజం సాకారం కావాలంటే ప్రతి రైతు సమస్యకు పరిష్కారం దొరకాలి. తన సమస్యకు పరి ష్కారం దొరుకుతుందని రైతు ఆశించినప్పుడే జీవితంపై ఆశలు చిగురించి ఆత్మహత్యవైపు ఆలోచించరు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు, రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి చర్చిస్తున్నప్పుడు ఆ జిల్లాలో ఈ మూడేళ్లలో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన జిల్లా అధికారులు, కేవలం 18 మండలాలలో ఇన్ని రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని, ఇంత మంది అధికారులం ఉండి కూడా రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చూపలేమా, చూపే ప్రయత్నమైనా చేద్దామనే కార్యదీక్షతో రైతు స్వరాజ్య వేదిక వారి సాంకేతిక సహకారంతో అంబేడ్కర్ జయంతి(14–4–2017)నాడు 1800 120 3244 నంబర్‌ను జిల్లాలో సమస్యల్లో ఉన్న రైతులు ఫోన్ చేయటానికి టోల్ ఫ్రీ నంబర్‌గా ప్రారంభించారు. ఈ హెల్ప్ లైన్‌కు వచ్చిన సమస్యలన్నిటిని ప్రతి సోమవారం నాడు ఒక గంటపాటు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరిస్తున్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కరిస్తున్నారు. చాలా సమస్యలు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. సమస్య పరిష్కారమైన రైతులు సంతోషంగా హెల్ప్‌లైన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 2015లో సమస్యల్లో ఉన్న రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్లు: ఆదిలాబాద్ 1800 429 1939; వరంగల్ 1800 425 2747; కరీంనగర్ 1800 425 4371; నిజామాబాద్ 1800 425 6644; ఖమ్మం 08742 238222; మెదక్ 08455 272525; మహబూబ్‌నగర్ 9866 098 111; రంగారెడ్డి 88866 13887; నల్గొండ 1800 425 1442. ఇవి పనిచేస్తున్నాయా? అన్నదే ప్రశ్న. బి. కొండల్ రెడ్డి వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి మొబైల్ : 99488 97734 -
లవర్స్ కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నంబర్
సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకునే వారికి భరోసా ఇస్తూ తమిళనాడులోని మధురైలో ప్రత్యేక విభాగం ఆవిర్భవించింది. మధురై కోర్టు ఆదేశాల మేరకు క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)గా ఈ విభాగం ఏర్పాటు అయింది. మూడు విభాగాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించారు. ఇటీవల తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారికంగా వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అనధికారికంగా ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయని అంచనా. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ తమిళనాడులో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరువు కోసం తమ కుమార్తెలను చంపడమో, లేకపోతే తాము చావడమో చేస్తున్నారు. గత ఏడాది తిరుప్పూర్‌లో నడీ రోడ్డు మీద శంకర్ అనే యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన వీడియో బయటకు రావడంతో మద్రాస్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. అయినా, పరువుహత్యలు ఆగకపోవడంతో కోర్టు కన్నెర్ర చేసింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకు రావడంతో పాటుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గాను ప్రత్యేక నిధిని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత కూడా ఆదివారం సేలం ఆత్తూరులో తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న వేదనతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పులో తొలి అడుగుగా దక్షిణ తమిళనాడుకు కేంద్రంగా ఉన్న మధురైలో సీపీసీ ఆవిర్భవించడం విశేషం. ప్రత్యేక వింగ్‌తో భరోసా : మదురై జిల్లా పోలీసు యంత్రాంగం, నగర పోలీసు కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రేమికులకు భరోసా ఇస్తూ ప్రత్యేక వింగ్, క్రైం ప్రివెన్షన్ సెల్ (సీపీసీ)ను సోమవారం ఏర్పాటు చేశారు. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఈవిభాగం పనిచేస్తుంది. అళగర్ ఆలయ మెయిన్ రోడ్డులోని కమిషనరేట్ ఆవరణలో ఈ విభాగం కోసం ప్రత్యేక వసతులతో విశాలమైన గదిని కేటాయించారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుల మేరకు తక్షణం ఈ విభాగం స్పందిస్తుంది. ప్రేమికులకు భద్రత కల్పించడం, తల్లిదండ్రుల్ని పిలిపించి చర్చలు జరపడంతో పాటుగా కౌన్సిలింగ్ తదితర వ్యవహారాలు, కేసుల నమోదు మీద ఈ విభాగం ప్రాథమికంగా దృష్టి పెట్టనుంది. ఈ విభాగం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రకటించారు. ఆ మేరకు 0452–2346302 నంబరును సంప్రదించాలని సూచించారు. దశల వారీగా ఈ విభాగాల్ని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి. -
పేటీఎం కస్టమర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పేటీఎం వినియోగదారులకు శుభవార్త. మరో సరికొత్త వెసులు బాటుతో పేటీఎం సిద్ధమైంది. టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటేనే ఈ వ్యాలెట్ ద్వారా రీ చార్జీలు, నగదు బదిలీలు, చెల్లింపులకు అవకాశం ఉండగా ఇక నుంచి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కూడా దాని ద్వారా లావాదేవీలు జరుపుకునే వీలును తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. 180018001234 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా అందులో ఇచ్చే సూచనలు పాటిస్తూ ఎలాంటి లావాదేవీలైన జరుపుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కస్టమర్లు, వ్యాపార వేత్తలు తొలుత మొబైల్ ద్వారా పేటీఎంలో రిజిస్టర్ కావాలి. నాలుగు అంకెల పిన్ ఎంటర్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నామో వారి మొబైల్ నెంబర్ కోసం ఆప్షన్, ఎంత నగదు పంపించాలో అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత పంపించేవారి పేటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ పని పూర్తవుతుంది. -
ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్
హైదరాబాద్: ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో నగదు స్వీకరణ, చెల్లింపుల కోసం ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్ 180018001234ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు, వ్యాపారులు ముందుగా తమ మొబైల్ నంబర్‌తో పేటీఎంలో నమోదు చేసుకుని 4 అంకెలతో కూడిన పిన్ నంబర్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నగదు స్వీకరించాల్సిన వ్యక్తి మొబైల్లో... చెల్లించాల్సిన వ్యక్తి నగదు మొత్తం, పిన్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఒక వ్యాలట్ నుంచి మరో వ్యాలట్కు నగదు బదిలీ అయిపోతుంది. ఈ ప్రక్రియకు టోల్ ఫ్రీనంబర్ ఆధారంగా పనిచేస్తుంది. స్మార్ట్ఫోన్లు లేకపోయినా నగదు రహిత చెల్లింపులు, స్వీకరణలకు ఇది వీలు కల్పిస్తుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్మిశ్రా తెలిపారు -
స్వైన్‌ప్లూపై సమరానికి టోల్‌ఫ్రీ నంబర్..
పంజగుట్ట: ప్రస్తుత వాతావరణానికి స్వైన్‌ప్లూ వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్వైన్‌ప్లూ వైద్య నిపుణులు వ్యాకరణం నాగేశ్వరరావు కోరారు. ఎవరికైనా స్వైన్ ప్లూ లక్షణాలు కనిపిస్తే తమ నైటింగేల్ హోంకేర్ స్పెషలిస్టు టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-0095కు ఫోన్ చేస్తే సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా నర్సులను ఇంటికి వచ్చి ప్రాథమిక చికిత్స చేసి ఉచిత సర్వీస్‌తో పాటు ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నైటింగేల్ రీజనల్ హెడ్ సుధాకర్ జాదవ్‌తో కలిసి మాట్లాడుతూ ... ఎవరికై నా దగ్గు, తుమ్ములు, జ్వరం ఉంటే వాటిని స్వైన్‌ప్లూ లక్షణంగా పరిగణించవచ్చునని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే నగరంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌పై 40 శాతం రాయితీ ఇచ్చేందుకు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ప్రతీ ఒక్కరూ బయటకు వెల్లి వచ్చిన తర్వాత కనీసం 15 సెకన్లు సబ్బుతో గానీ డిటర్జింట్తో గానీ చేతులు శుభ్రంగా కడుక్కొవాలని అన్నారు. స్వైన్‌ప్లూ ఉన్న వారికి సుమారు 6 అడుగులు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మాస్క్‌లు తప్పకుండా ధరించాలని, తద్వారా 50 శాతం నివారించవచ్చునన్నారు. తమతో పాటు ఉన్న వారిలో ఎవరికై నా స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే ఎలాంటి హానీ ఉండదని అన్నారు. -
చేతిరాత పాస్‌పోర్టులిక చెల్లవు
మర్రిపాలెం (విశాఖపట్నం) : చేతి రాతతో కూడిన పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నాన్ మెషీన్ రీడబుల్ పాస్‌పోర్ట్(ఎంఆర్పీ) కలిగినవారంతా మళ్లీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నేషల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) నిబంధనల ప్రకారం చేతిరాత పాస్‌పోర్ట్‌లను నిషేధించారు. ఈ నిబంధన 2015 నవంబర్ 24 నుంచి అమలులో ఉంది. మన దేశంలో దాదాపు 2.5 ల క్షల మంది చేతిరాత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టులో చేతిరాత, ఫొటోగ్రాఫ్ మాన్యువల్‌గా అతికించి ఉన్నవారు నాన్ మెషిన్ రీడబుల్ కేటగిరిలోకి వస్తారని విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. చేతిరాత పాస్‌పోర్ట్‌తో రాకపోకలు చేస్తే అడ్డంకులు తప్పవని హెచ్చరించారు. దేశంలోని, ఇతర దేశాలలోని వారంతా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. చేతి రాత పాస్పోర్ట్లున్నవారు వాటిని తమ కార్యాలయంలో సమర్పించి మెషిన్ రీడబుల్ పాస్‌పోర్ట్‌లు పొందాలని సూచించారు. www.passportindia.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని తెలిపారు. 1800-258-1800 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు వాహనాలు బారులు దీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16వేల వాహనాలు ప్రయాణిస్తుండగా, శనివారం మరో 4వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ చెల్లించేందుకు 9గేట్లను, హైదరాబాద్ వైపు 7గేట్లను తెరిచారు. ఆదివారం హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. టోల్ ఫీజు మినహాయింపనే ప్రచారంతో.. పుష్కరాలకు వెళ్లే వాహనాలకు టోల్ ఫీజును మినహాయిస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు టోల్ చెల్లించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని టోల్ చెల్లించాలని టోల్‌ప్లాజా సిబ్బందిచెప్పడంతో పలువురు వాగ్వాదానికి దిగారు. టోల్ ఫీజును వసూలు చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని జీఎంఆర్ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
దళిత, గిరిజనుల కోసం టోల్ ఫ్రీ నంబర్
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తిరుపతి రూరల్ దళిత, గిరిజనులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అంతకు ముందు తిరుపతి అంబేద్కర్ భవన్లో ఆయన్ని దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సైతం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం కొనసాగుతునే ఉందని విమర్శించారు. కేవలం కొన్ని సామాజిక వర్గాల వారినే ఫోకల్ పాయింట్లలో పోస్టింగ్‌లు దక్కుతున్నాయని పేర్కొన్నారు. అందుకే అందరికి అందుబాటులో సత్వర న్యాయం ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపడుతుందని కొనియాడారు. -
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..టోల్ ఫ్రీ
కోటగుమ్మం (రాజమండ్రి) : మనమేదో పని మీద వెళ్తుంటాం. రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. వెంటనే మొబైల్ నుంచి 108కి ఫోన్ చేసి, సమాచారం అందిస్తాం. ఒక్క ఫోన్‌కాల్‌తో రెండు నిండు ప్రాణాలు కాపాడుతాం. పైగా ఫోన్ చేయడం వల్ల ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు అన్ని రంగాలకూ విస్తరించాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. ఈ టోల్‌ఫ్రీ నంబర్ల గురించి తెలుసుకుందాం. 155333 (ఏపీఈపీడీసీఎల్) : విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజి, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సమస్యలను ఈ నంబర్‌కు చెప్పవచ్చు. 1910 (బ్లడ్ బ్యాంక్స్) : అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలు ఈ నంబరులో తెలుసుకోవచ్చు. 1950 (ఎన్నికల సంఘం) : ఓటరు నమోదు, తొలగింపులు, పేరుమార్పిడి, ఓటుమార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 1100 (మీ-సేవ) : ఆయా ప్రాంతాల్లో మీ-సేవ పథకం అమలు తీరు, సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 1800-425-1110 (వ్యవసాయ శాఖ) : ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 1800-200-4599 (ఏపీఎస్ ఆర్టీసీ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలు, సంస్థ బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయాణికులతో సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. 101 (అగ్ని మాపక శాఖ) : అగ్ని ప్రమాదం సంభవిస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే, సిబ్బంది వచ్చి నియంత్రణ, సహాయక చర్యలు చేపడతారు. విపత్తుల నిర్వహణలో సేవలు అందిస్తారు. 108 (ఎమర్జెన్సీ అంబులెన్స్) : ప్రమాదం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అస్వస్థతకు గురైనా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ వచ్చి, వైద్య సిబ్బంది .చికిత్స అందిస్తారు. ఇంటివద్ద ఉన్న రోగులనూ అతస్యవసరంగా ఆస్పత్రికి చేరవేస్తారు. 1997 (హెచ్ఐవీ-కంట్రోల్‌రూమ్) : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధులపై, బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు. 100 (పోలీసు శాఖ) : పోలీసుల తక్షణసాయం పొందవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 131 (రైల్వే శాఖ) : రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ సమాచారం తెలుస్తోంది. 1090 (క్రైం స్పెషల్ బ్రాంచ్) : చోరీలు, ఇతర నేర సంబంధ సమస్యలను తెలియజేయవచ్చు. ఇది జిల్లా కేంద్రంలో క్రైం స్టాఫర్‌కు చేరుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. 155361 (అవినీతి నిరోధక శాఖ) : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వవచ్చు. 155321 (ఉపాధి హామీ పథకం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత సమర్ధంగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ దీనిని వినియోగిస్తోంది. పథకంలో సమస్యలు, లోపాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు. 198 (బీఎస్ఎన్ఎల్) : సంస్థకు చెందిన టెలిఫోన్ సమస్యలపై వినియోగదారులు ఈ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) : ఎలాంటి ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకునేందుకు, బాలలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసినా, బాల కార్మికులు తారసపడినా ఈ నంబరుకు తెలియజేయవచ్చు. -
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
-
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
♦ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి ♦ ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ♦ 1800 425 6656 ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాలు ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తాయని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. పుష్కరాల నేపధ్యంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 173 పుష్కర ఘాట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధలతో కలసి మంత్రి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల నిర్వహణ, పర్యవేక్షణకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం ఆలయాల్లో భక్తులకు ఎదురయ్యే అసౌకర్యాలపై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు 1800 425 6656ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే దేవుడి పూజలు తిరుమలలో ఇటీవల జరిగిన హిందూ సాధు సంతుల సమ్మేళనంలో వ్యక్తమైన సూచనల మేరకు పలురకాల సేవలను భక్తుల ఇంటి వద్దకే తీసుకెళ్లాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్టు మాణిక్యాలరావు తెలిపారు. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో గుడి పూజారి.. భక్తుని ఇంటి వద్దకే వచ్చి దేవుడి ఆశీస్సులు అందజేస్తార న్నారు. కొత్త దంపతులకు, గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, నామకరణం, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం వంటి సమయాల్లో గుడి పూజారి దేవుడి పటంతో భక్తుల ఇంటికే వెళ్లి దీవెనలు, అమ్మవారి కుంకుమ అందజేస్తారని తెలిపారు. అలాగే మరణించిన వ్యక్తి ఇంటికి శివుడికి అభిషేకించిన జలాలతో వెళ్లి ఆ ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఇలాంటి సేవలు అందజేస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
కొత్త రేషన్ కార్డులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
అనంతపురం: కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని, వీటి పంపిణీపై జిల్లాలో ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004256401కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో రేషన్ దుకాణం డీలర్లు ఏమైనా చేతివాటాన్ని ప్రదర్శిస్తే.. వారిపై సస్పెన్షన్ వేటు వేసి.. క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. -
ఏటీఎం కార్డు బ్లాక్ అయితే కంగారుపడొద్దు
ఒకే రోజు ఏటీఎం కార్డు పిన్‌కోడ్‌ను మూడు సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే కార్డును బ్లాక్ చేస్తారు. అది కూడా కేవలం వినియోగదారుని ప్రయోజనాల కోసమే. కార్డు ఎవరికైనా దొరకడమో, లేదా దొంగిలించి ఖాతాలోని సొమ్ములను తస్కరించడానికి చేసే ప్రయత్నాలను నివారించడం కోసమే బ్యాంకులు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అసలైన ఖాతాదారుడు తమ బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా మరుసటి రోజుకి తమ కార్డును మామూలుగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసేటప్పుడు ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతా పుస్తకం, ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. ఈ సేవను పునరుద్ధరించుకోవడానికి సంబంధిత బ్యాంక్ యాజమాన్యానికి సంతృప్తికరైమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. -
అందుబాటులోకి నిమ్స్ టోల్ ఫ్రీ నంబర్
ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రోగులకు బెడ్ల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగి అత్యవసర పరిస్థితిలో.. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా 040-23305463 నెంబర్‌కు ఫోన్ చేసి రోగి ఏ పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో చెబితే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అందించనున్నారు. బెడ్లు అందుబాటులో ఉంటే రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చే లోపు బెడ్‌ను సిద్ధం చేసి రోగికి అందించాల్సిన వైద్య పరికరాలను సైతం సిద్ధం చేసి ఉంచనున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను శుక్రవారం మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎమర్జెన్సీ వార్డులో కేవలం 40 బెడ్లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం 96కు పెంచామని చెప్పారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగిని 24 గంటల్లో వార్డులోకి మార్చి నిత్యం ఎమర్జెన్సీలో బెడ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారి పాల్గొన్నారు. -
టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగులకు, విద్యార్ధులకు వరుస సెలవులు రావడంతో అందరూ స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ బోసిపోయినట్లైంది. వారంతా తిరుగు ప్రయాణానికి ఇప్పటికే రైల్వే, బస్ టిక్కెట్లు బుక్ అయిపోవడంతో ఏదో విధంగా హైదరాబాద్ చేరుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను సంప్రదిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇకా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లతో పాటు టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. దీని వల్ల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనకోసం టోల్ ఫ్రీ..
చెన్నై: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఒక టోల్ ఫ్రీ నెంబరును కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ ఇన్సిస్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రిసెర్చ్ గురువారం లాంచ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి టోల్ ఫ్రీ నంబరును లాంచ్ చేశామని సంస్థ తెలిపింది. 1800 2700 703 అనే నంబరుకు కాల్ చేసి ఇంగ్లీషు, తమిళ భాషల్లో సమాచారాన్ని తెలుసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ డా. పి. గుహన్, తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా పద్ధతులు మొదలైన వివరాలను తెలుసుకోవచ్చన్నారు. మనదేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనను అందించేందుకు వీలుగా ఈ టోల్ ఫ్రీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా గతంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామన్నాని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఇందులో రెండు లక్షలమందికి పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 56 మంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించామని తెలిపారు. వ్యాధిపై పూర్తిగా అవగాహన లేకపోవడ వల్లే మరింత ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స చాలా సులభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అయిదు లక్షల పోస్టర్లను ముద్రిస్తున్నామన్నారు. దీంతో పాటు మహిళల కోసం ఈ నెలాఖరువరకు( అక్టోబర్ 31) ఉచిత మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. -
పుష్కరాలకు 12890 టోల్ ఫ్రీ నంబర్
ప్రత్యేక అధికారి ధనుంజయరెడ్డి రాజమండ్రి సిటీ: పుష్కర ఏర్పాట్లపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 10 నుంచి టోల్ ఫ్రీ నంబర్ 12890 అందుబాటులోకి రానున్నదని పుష్కరాల ప్రత్యేక అధికారి కె.ధనుంజయరెడ్డి తెలిపారు. ఈ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. దీనికి వచ్చే ఫిర్యాదులను ఘాట్ ఇన్చార్జిలకు అందించి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పుష్కర యాత్రికులకు చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాలపై ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ తయారు చేయనున్నామన్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే పుష్కరాల పార్కింగ్ స్థలాలు, బస్ స్టేషన్, బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్లు, పురోహితులు, పర్యాటక ప్రాంతాలు, ఆసుపత్రులు తదితర సమాచారం తెలుసుకోవచ్చన్నారు. నగరంలోని 20 ప్రాంతాల్లో స్మార్ట్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణాకు రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకూ సడలింపు ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రప్పిస్తున్నామని తెలిపారు. నగరంలో 20 మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నట్లు ధనుంజయరెడ్డి తెలిపారు. -
గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు
నెల్లూరు (కావలి): ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు ముందు వెళుతున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంతో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరగడంతో కారుతో పాటు అందులో ఉన్న గంజాయిని కూడా వదిలి నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న కావలి రూరల్ సీఐ మధుబాబు సంఘటన స్థలానికి చేరుకుని కారు, అందులో ఉన్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వారు తాము పడవల ఇంజన్లను మరమ్మతులు చేసేవారిమని పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. -
143... చాలా కాస్ట్లీ!
‘‘ఈ చిత్రంలోని ఏడు పాటలూ చాలా బాగా వచ్చాయి. గబ్బర్‌సింగ్ గ్యాంగ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని దర్శకుడు వి.ఎస్ వాసు చెప్పారు. శ్రీహరి, ఉదయగిరి, హేమంతిని, ఇషికా సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టోల్ ఫ్రీ నెంబర్ 143’. ‘ఇది చాలా కాస్ట్ గురూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా పాటల విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి భాస్కర్ యాదవ్ నిర్మాత. శ్రీ వెంకట్ స్వరాలం దించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘దర్శకుడు చెప్పిన దాని కన్నా చాలా బాగా తీశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
‘ఆసరా’.. సర్కార్ గాబరా!
28 లక్షలకు చేరువైన పింఛన్లతో అధికమవుతున్న ఒత్తిడి ఎంపికలో అక్రమాలపై దృష్టి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరు సర్పంచులకు లేఖలు రాయనున్న మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ కింద అందిస్తున్న పింఛన్లు దాదాపు 28లక్షలకు చేరువకావడం సర్కారును ఒత్తిడికి గురిచేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు మాత్రమే ఇప్పటివరకు వీటిని పరిమితం చేశారు. ఆ పింఛన్ల కోసం నెలకు రూ.314.52 కోట్ల వంతున ఏడాదికి సుమారు రూ. 3,774.24 కోట్లు వ్యయమవుతోంది.. ఇంకా.. స్వయం సహాయక గ్రూపుల్లోని సుమారు 2.5 లక్షలమంది పేద మహిళలకు అభయ హస్తం కింద పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బీడీ కార్మికులకు కూడా మార్చి 1 నుంచి‘ఆసరా’ అందిస్తామని సర్కారు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్మికులు సుమారు మూడు లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తే పింఛనర్ల సంఖ్య 33లక్షలు దాటే అవకాశం లేకపోలేదు. ఎంపిక ప్రక్రియలో అక్రమాలు ‘ఆసరా’ పింఛన్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్రమాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఒకే వ్యక్తికి రెండు, మూడు పింఛన్లు మంజూరు కావడం, చనిపోయిన వారికి కూడా మంజూరు చేయడం, ఉన్నత వర్గాలకు చెందిన కొందరు పింఛన్లు పొందుతుండడం.. తదితర అక్రమాలు దాదాపు అన్ని జిల్లాల్లోనూ జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గతంలో రూ. 200లుగా ఉన్న పింఛనును రూ. 1,000కి పెంచడం, రూ. 500గా ఉన్న పింఛను 1,500లకు పెంచడంతో గ్రామాల్లో అధికార, విపక్ష నేతలు తమ కుటుంబ సభ్యులకు వాటిని ఇప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మరో వైపు తమకు అర్హత ఉన్నా పింఛన్లు అందలేదని ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వాస్తవ లెక్కలు తేలక గందరగోళ పరుస్తోంది. ఫిర్యాదులు, సలహాల కోసం టోల్‌ఫ్రీ! పింఛన్ల అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 18002001001 నంబరును ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈమెయిల్ సదుపాయాన్ని కూడా కల్పించనుంది. aasarapensions@ gmail.com మెయిల్ ఐడీని అందుబాట్లోకి తేనుంది. ఇక అర్హత కలిగిన వారికి పింఛను అందకపోవడంపై కూడా సర్కారు దృష్టి సారించింది. ఈ విషయమై గ్రామ సర్పంచులకు నేరుగా లేఖలు రాయాలని పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.తారకరామారావు భావిస్తున్నారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సరైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా లేఖలో గ్రామ సర్పంచులను కోరనున్నారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
08772240201 ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్
ఉప ఎన్నికకు టోల్‌ఫ్రీ నంబర్ నిరంతరం అందుబాటులో కాల్ సెంటర్ రెండో రోజు నామినేషన్లు నిల్ తిరుపతి తుడా: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వి.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నిక తీరు, అభ్యర్థుల లోటుపాట్లపై ఫిర్యాదు చేసేందుకు 0877-2240201 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఫ్యాక్స్/ఈ-మెయిల్/ ఎస్ఎంఎస్/ స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కాల్ సెంటర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజూ దీని పై తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అన్ని స్థాయి బృందాలు సోమవారం నుంచే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు ర్యాలీ, ఊరేగింపులకు సంబంధించిన అన్ని ఖర్చులను అభ్యర్థి ఖాతాలో చేరుస్తారని పేర్కొన్నారు. రెండో రోజు నామినేషన్లు నిల్ తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.మంగళవారం సెంటిమెంట్ కారణంగా నామినేషన్లు వేయకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తొలి రోజు సోమవారం 12 నామినేషన్ల దరఖాస్తులను అభ్యర్థులు తీసుకెళ్లారు. వీరెవ్వరూ ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు. -
అక్రమార్కులూ జర జాగ్రత్త
04023454071 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు హైదరాబాద్‌లో ప్రకటించిన సీబీ డీజీ జనరల్ ఏకేఖాన్ ప్రగతినగర్ : లంచగొండి అధికారులకు చేదు వార్త ! వారి భరతం పట్టడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయంలో ఏ ర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 040-23454071కు జిల్లా నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పింఛన్, ఇండ్ల మంజూ రు, పట్టాపాస్ పుస్తకాలు తయారు తదితర వాటిపై అధికారులు లంచం ఆశిస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన స్వల్ప వ్వవధిలోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ హైదరాబాద్‌లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా 499 కేసులు నమోదు కాగా నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు చేసినట్లు ఎకే ఖాన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
లంచం అడిగితే.. 23454071కు కాల్ చేయండి
వరంగల్: ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 23454071కు ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. అవినీతి పరుల తోలు తీస్తానని కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్ష్మీపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అద్దంలాంటి సిటీగా మారుస్తానని చెప్పారు. -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండుగా ఏర్పడ్డ ఠాణే, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పట్టు సంపాదించాలనే లక్ష్యంతో పావులు కదుతుపుతోంది. ఈ నేపథ్యంలో నవీ ముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలను ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నవీముంబైపై నారాయణ రాణేకు, ఔరంగాబాద్పై అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించారు. నవీముంబైలో మంచి పట్టున్న ఎన్సీపీ నాయకుడు గణేష్ నాయిక్ పార్టీ మారనున్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అక్కడ ఎన్సీపీ బలం తగ్గుతుందని, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మరాఠ్వాడాలో మంచి పట్టున్న అశోక్ చవాన్‌కు ఔరంగాబాద్ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అప్పచెప్పింది. గత లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువును ఆయనే కాపాడారు. మరాఠ్వాడ నుంచి ఆయనతోపాటు మరో కాంగ్రెస్ ఎంపీ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్‌లో అశోక్ చవాన్ నేతృత్వంలో పార్టీ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఠాణే జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతను బాలాసాహెబ్ థోరాత్, హర్షవర్దన్ పాటిల్‌లకు, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు రాధాకృష్ణ విఖేపాటిల్కు అప్పగించాలని నిర్ణయించినట్టు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. కరువు ప్రాంతాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు.. కరువు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ 040-71012200 అనే టోల్ ఫ్రీ ఫోన్ నెంబరును ప్రారంభించింది. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగివచ్చి జనవరి 9వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ఆ రోజున గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మంత్రాలయలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ‘ప్రేరణ ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. -
మాదక ద్రవ్యాలు కూడా ‘ఉగ్ర’ భూతాలు
యువతకు ప్రధాన మంత్రి మోదీ పిలుపు ఇదొక జాతీయ సమస్య.. ప్రభుత్వం, సమాజం కలసి నిరోధించాలి డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు.. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వాటి కోసం వెచ్చించే సొమ్ము ఉగ్రవాదులకు చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని.. అది దేశ భద్రతకు ప్రమాదకరమని అన్నారు. వాటి వినియోగం జాతీయ సమస్య అని, ఈ బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం, సమాజం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు తోడ్పడేలా టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వినూత్నంగా రేడియో ద్వారా ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని చేపట్టిన మోదీ.. ఆదివారం మూడో సారి ఆ కార్యక్రమంలో ప్రసంగించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు. ‘‘ఈ దురలవాటు చీకటి, విధ్వంసం, వినాశనమనే మూడింటితో కలసి వస్తుంది. ఇది విధ్వంసానికి, వినాశనానికి కారణమయ్యే చీకటి స్నేహాలకు దారితీస్తుంది. ఈ బెడదను అరికట్టి దేశాన్ని రక్షించే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది..’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు, ఈ దురలవాటుకు దూరంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని ప్రధాని తెలిపారు. మాదక ద్రవ్యాల బెడదను అరికట్టడానికి ప్రభుత్వం, సమాజం, చట్టం, కుటుంబం, స్నేహితులు అంతా కలసి పనిచేయాల న్నారు. ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. వాటికి వెచ్చించే సొమ్ము ఉగ్రవాదులకు చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడపడానికి కొంత సమయం కేటాయించాలన్నారు. అలా చేసినప్పుడు పిల్లలు చెడు మార్గం పట్టకుండా ఉంటారని వ్యాఖ్యానించారు. -
ఆన్ లైన్ లో రెండో విడత రుణమాఫీ వివరాలు
హైదరాబాద్:రెండో విడత రుణమాఫీ అంశానికి సంబంధించి రైతుల ఖాతాల వివరాలను శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పెట్టింది. నలభై రెండు లక్షలకు పైగా ఖాతాలను ఆన్ లైన్ లో పెట్టిన ప్రభుత్వం.. వాటిని సవరణల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఒకవేళ ఈ జాబితాలో రుణమాఫీ పొందలేకపోతే.. ఎందుకు పొందలేదో పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. దీంతోరుణమాఫీ ధ్రువపత్రాలను జనవరి 9వ తేదీ లోపు రైతులు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం దక్కనుంది. రైతుల రుణమాఫీపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. 1800 103 2066 అనే నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఈ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు, బ్యాంకర్లకు వేర్వేరుగా ఐడీలు కేటాయించారు. -
రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్
రైతుల రుణమాఫీపై ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసింది. 1800 103 2066 అనే నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు దాఖలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు, బ్యాంకర్లకు వేర్వేరుగా ఐడీలు కేటాయించారు. ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పద్ధతిపైనే రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టోల్ ఫ్రీ నెంబరుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.