పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు వస్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్: పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు వస్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగులకు, విద్యార్ధులకు వరుస సెలవులు రావడంతో అందరూ స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ బోసిపోయినట్లైంది.
వారంతా తిరుగు ప్రయాణానికి ఇప్పటికే రైల్వే, బస్ టిక్కెట్లు బుక్ అయిపోవడంతో ఏదో విధంగా హైదరాబాద్ చేరుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ను సంప్రదిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇకా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లతో పాటు టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. దీని వల్ల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.