huge croud
-
అంతర్వేదికి పోటెత్తిన భక్తులు
తూర్పు గోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు 3 లక్షల మంది సముద్ర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాల్లో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తజనంతో మహానంది క్షేత్రం కిటకిటలాడింది. పవిత్ర కార్తీకమాసంలో దీపం, దానం, స్నానం ఎంతో ప్రధానమైనవి. ఈ మాసంలో వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వరస్వామివార్ల దర్శనార్థం భక్తులు బారులు తీరారు. స్థానిక కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు వర్షంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగులకు, విద్యార్ధులకు వరుస సెలవులు రావడంతో అందరూ స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్ బోసిపోయినట్లైంది. వారంతా తిరుగు ప్రయాణానికి ఇప్పటికే రైల్వే, బస్ టిక్కెట్లు బుక్ అయిపోవడంతో ఏదో విధంగా హైదరాబాద్ చేరుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను సంప్రదిస్తున్నారు. దీంతో ట్రావెల్స్ యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇకా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లతో పాటు టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. దీని వల్ల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.